రాయచూరు రూరల్: బాలింతలు, శిశు మరణాల నివారణకు నవోదయ వైద్య కళాశాల, రాయచూరు తల్లీబిడ్డల ఆస్పత్రితో ఒప్పందం కుదుర్చుకొని సంస్థ నుంచి వైద్యులను, సిబ్బందిని పంపుతున్నట్లు నవోదయ వైద్య కళాశాల ట్రస్టీ ఎస్.రాజేంద్ర రెడ్డి వెల్లడించారు. బుధవారం నవోదయ కళాశాలలో విలేకరులతో ఆయన మాట్లాడారు. 34 ఏళ్లుగా జిల్లా ప్రజలకు వైద్య పరంగా సేవలందిస్తున్నట్లు గుర్తు చేశారు. జిల్లాలో మారు మూల ప్రాంతాల్లోని గర్భిణులు ప్రసవం కోసం వచ్చే వారికి 24 గంటలు వైద్య సేవలు అందించడానికి చర్యలు చేపట్టామన్నారు. నవోదయ ఆస్పత్రిలో తాయి మడిలు కిట్‌లను అందించామన్నారు. నవోదయ విద్యార్థులు క్రీడలు, విద్యాభ్యాసంలో ఉన్నత ర్యాంకులు సాధించారన్నారు.
నేటి నుంచి రీగల్ సంభ్రమాలు
ఈనెల 5 నుంచి మూడు రోజులపాటు నవోదయ వైద్య కళాశాలలో జరుగనున్న రీగల్ ఉత్సవాలు–2026కు వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ హన్మంతప్ప శ్రీకారం చుడతారన్నారు. 6న స్నాతకోత్సవాలను రాజీవ్‌గాంధీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ బీ.సీ.భగవాన్, గ్రాడ్యుయేషన్, 7న ధార్వాడ ఐఐటీ డైరెక్టర్ వెంకప్పయ్య దేశాయి నర్సింగ్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారన్నారు. సాయంత్రం ఇఫోరియా ఉత్సవాలు, నవోదయ నగోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య, ఆరోగ్య అంశాలపై ప్రచారం కోసం నవోదయ రేడియో స్టేషన్‌ను ప్రారంభించామన్నారు. ఈ ఏడాదిలో 4,386 మందికి తల్లులకు మడిలు కిట్‌లతో పాటు రూ.3 వేల పారితోషికం ఆందించామన్నారు. 136 చోట్ల ఉచిత ఆరోగ్య శిబిరాల్లో 28,591 మందికి వైద్య సేవలందించామన్నారు. శ్రీనివాస్, దేవానందలున్నారు.


