గ్రేటర్‌ బెంగళూరులో సగం వార్డులు మహిళలకే | - | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ బెంగళూరులో సగం వార్డులు మహిళలకే

Mar 9 2026 7:37 AM | Updated on Mar 9 2026 7:37 AM

మొత్తం 369 వార్డుల సమాచారం

శివాజీనగర: గ్రేటర్‌ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) పరిధిలో 5 నగర పాలికెల ఎన్నికలకు సంబంధించి వార్డుల ఫైనల్‌ రిజర్వేషన్‌ జాబితాను ప్రకటించారు. మొత్తం 369 వార్డుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించగా, 185 స్థానాలు వారికే దక్కాయి. గతంలో ప్రకటించిన రిజర్వేషన్‌ జాబితాపై వివిధ సంఘాలు, పార్టీలు, ప్రజల నుంచి వందలాది అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ అభ్యంతరాలను పరిశీలించిన అధికారులు లోపాలను సరిచేసి తుది రిజర్వేషన్‌ జాబితాను సిద్ధం చేశారు. రికార్డుస్థాయిలో మహిళలకు 50 శాతం సీట్లు ఇవ్వడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో గత రిజర్వేషన్‌లలో మార్పులు చేశారు. కాంగ్రెస్‌ నాయకుల డిమాండ్ల మేరకు కొన్ని వార్డుల్లో పార్టీకి అనుకూలంగా సవరణలు చేశారని తెలిసింది.

బెంగళూరులో

5 పాలికెలు

రిజర్వేషన్ల జాబితా విడుదల

369 వార్డుల్లో అతివలకు

185 కేటాయింపు

రిజర్వేషన్‌ జాబితాలో మహిళలకు 185 వార్డులు రిజర్వుడు.

43 వార్డులు ఎస్సీలకు, 7 ఎస్టీలకు, బీసీఏ వర్గానికి 97, బీసీ బీకి 24, జనరల్‌ వర్గానికి 192 వార్డులు రిజర్వుడు.

1. బెంగళూరు దక్షిణ నగర పాలికెలో

మొత్తం వార్డులు –72

ఎస్సీ –7, ఎస్టీ–1, బీసీఏ–19, బీసీబీ–5, జనరల్‌ – 40 వార్డులు

2. బెంగళూరు ఉత్తర నగర పాలికె

మొత్తం వార్డులు–72,

ఎస్సీ–9, ఎస్టీ–2, బీసీఏ–19, బీసీబీ–5, జనరల్‌–37 వార్డులు

3.బెంగళూరు పశ్చిమ నగర పాలికె

మొత్తం వార్డులు–112

ఎస్సీ –9, ఎస్టీ–2, బీసీఏ–30, బీసీబీ–7, జనరల్‌– 64 వార్డులు

4. బెంగళూరు తూర్పు నగర పాలికె

మొత్తం వార్డులు –50

ఎస్సీ–7, ఎస్టీ–1 వార్డు, బీసీఏ–14, బీసీబీ–3, జనరల్‌ –25 వార్డులు.

5. బెంగళూరు కేంద్ర నగర పాలిక

మొత్తం వార్డులు–63

ఎస్సీ–11, ఎస్టీ–1, బీసీ ఏ–15, బీసీ బీ–4, జనరల్‌ –32 వార్డులు.

Advertisement
 
Advertisement
Advertisement