Bollywood
-
ధురంధర్-3 కాదు.. కొత్త కాన్సెప్ట్‌తో రణ్వీర్–ఆదిత్య ధర్ ?
దురంధర్ నుంచి వచ్చిన రెండు భాగాలూ ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. అయితే దానికి కొనసాగింపుగా దురంధర్-3 వుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ రణ్వీర్ సింగ్, దర్శకుడు ధర్ ఇద్ధరూ మాత్రం కలుస్తున్నారు.అవును.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ వెంటనే మరో చిత్నాన్ని చేయభోతున్నాడని సమాచారం. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇది దురంధర్-3 మాత్రం కాదట. మరో కొత్త సబ్జెక్ట్‌తో వీరిద్దరూ మరోసారి మన ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమైయ్యాయి. వచ్చే ఏడాది మార్చి నెలలో సెట్స్‌పైకి వెల్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం.ఇటీవల ఆదిత్య ధర్, రణ్వీర్ సింగ్ కలిశారు. ఆదిత్య తన దగ్గర ఉన్న కథను రణ్‌వీర్‌కు చెప్పాడు. కథ నచ్చడంతో రణ్వీర్ వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది. దీంతో దర్శకుడు ఈ పాయింట్‌ను ఫుల్ లెంగ్త్ స్క్రిప్ట్‌గా తయారు చేసే పనిలో ఉన్నాడు. ఆదిత్య ధర్ దగ్గర ఇప్పటికే ‘ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ’, ఒక స్పోర్ట్స్ డ్రామా రెడీగా ఉన్నాయి. కానీ వీటిని పక్కన పెట్టి మరో కొత్త కథతో రణ్వీర్తో సినిమా చేయాలని నిర్ణయించారు. -
లక్ష రూపాయల పందెం.. హై హీల్స్‌తో స్టార్ హీరో డ్యాన్స్..!
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. హౌస్‌ఫుల్ 5 చిత్రంలోని 'లాల్ పరి' పాటకు తన డ్యాన్స్‌తో మెప్పించారు. అక్షయ్ కుమార్ హోస్ట్ చేస్తోన్న వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఫినాలే ఎపిసోడ్లో స్టెప్పులతో వేదికపై అలరించారు. అయితే ఈ వేడుకలో హై హీల్స్‌తో అక్షయ్ డ్యాన్స్ చేయడం ఫ్యాన్స్ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ సందర్భంగా అక్షయ్ కుమార్ చిన్న పరీక్ష పెట్టింది నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. హైహీల్స్ వేసుకుని ఒక నిమిషం పాటు డ్యాన్స్ చేయాలని ఛాలెంజ్ విసిరింది. ఒకవేళ అక్షయ్ డ్యాన్స్ మధ్యలో ఆగిపోతే.. ఆమెకు లక్ష రూపాయలు చెల్లించాలని చిన్న పందెం కాసింది. దీంతో అక్షయ్ హై హీల్స్‌తో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో అక్షయ్‌తో పాటు ఫరా ఖాన్, భూమి పెడ్నేకర్ సైతం కాలు కదిపారు. ఒక నిమిషం డ్యాన్స్ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అక్షయ్‌ను ఫరా ఖాన్ అభినందించారు.కాగా.. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు ఫరా ఖాన్, భూమి అతిథులుగా హాజరయ్యారు. హైహీల్స్‌లో అక్షయ్ కుమార్ డ్యాన్స్ చేయడం హైలెట్‌గా నిలిచింది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత అక్షయ్ సరదాగా మహిళలకు సెల్యూట్ చేశారు. హైహీల్స్‌లో నడవడం, డ్యాన్స్ చేయడం ఎంత కష్టమో ఇప్పుడు తనకు అర్థమైందన్నారు.బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఇటీవలే భూత్ బంగ్లా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇప్పటి వరకు రూ. 180 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాకుండా అక్షయ్ కుమార్ 'వెల్కమ్ టు ది జంగిల్' అనే మూవీతో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 26న విడుదల కానుంది. Akshay dancing in heels wasn’t on my 2026 bingo card… probably not in Akshay Kumar’s plan either 😭 https://t.co/AL7S5ck2s9 pic.twitter.com/6rCnNQOVrm— PintuX (@pintya_348) April 28, 2026 -
గుడ్ న్యూస్ చెప్పిన ఆమిర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గుడ్ న్యూస్ చెప్పాడు. సూపర్ హిట్ ఫిల్మ్ ‘3 ఇడియట్స్’కు సీక్వెల్ రాబోతున్నట్లు ప్రకటించాడు. ఆమిర్ ఖాన్ హీరోగా, ఆర్. మాధవన్, శర్మాన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘3 ఇడియట్స్’. రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వంలో విధు వినోద్ చోప్రా నిర్మించిన ఈ సినిమా 2009లో విడుదలైంది. తాజాగా ‘3 ఇడియట్స్’ సినిమా సీక్వెల్ పనులు మొదలయ్యాయని ఆమిర్ ఖాన్ తెలిపారు. ఈ సీక్వెల్ గురించి ఓ ఆంగ్ల మీడియాతో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘3 ఇడియట్స్’కి సీక్వెల్ చేయనున్నాం... కథ విన్నాను. నాకు నచ్చింది. మొదటి భాగంలో ఉన్న ప్రధాన పాత్రధారుల జీవితాల్లో పదేళ్లు గడిచిన తర్వాత ఏం జరుగుతుంది? అనే అంశంతో సీక్వెల్ కథ ఉంటుంది. అలాగే తొలి భాగంలోని కామెడీ కంటిన్యూ అవుతుంది. దర్శకుడు రాజ్ ప్రస్తుతం స్క్రిప్ట్‌కు మెరుగులు దిద్దుతూ, స్క్రీన్‌ప్లేను సెట్ చేసే పనిలో ఉన్నారు’’ అని పేర్కొన్నారు. -
20 వంద కోట్ల హిట్స్.. అక్షయ్ కుమార్ అరుదైన ఘనత
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భారతీయ సినిమా చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నారు. అక్షయ్ తన కెరీర్లో ఏకంగా 20 సినిమాలతో 100 కోట్ల నెట్ వసూళ్లు సాధించాడు. దాంతో ఈ ఘనత సాధించిన తొలి నటుడిగా నిలిచారు. ఖాన్ త్రయం అయిన షారూక్, సల్మాన్, అమీర్లను ఈ విషయంలో మించి అక్షయ్ ముందంజలో నిలిచాడు. ఇక ఈ వరుసలో అక్షయ్ తర్వాత స్ధానంలో సల్మాన్ ఖాన్ 18 సినిమాలతో ఉన్నాడు. ఇలా అజయ్ దేవగన్ 16 సినిమాలతో మూడో స్థానంలో, షారూక్ ఖాన్ 10 సినిమాలతో నాలుగో స్థానంలో, రణ్వీర్ సింగ్ 9 సినిమాలతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. 2012లో హౌస్‌ఫుల్ 2తో తొలిసారిగా 100 కోట్ల క్లబ్లో అక్షయ్ అడుగుపెట్టాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. కరోనా తర్వాత కూడా ఆయన నటించిన ఆరు సినిమాలు వంద కోట్ల మార్కును దాటాయి. తాజాగా విడుదలైన బూత్ బంగ్లాతో ఈ సంఖ్య 20కి చేరింది. రజనీకాంత్, విజయ్, ప్రభాస్ వంటి స్టార్లు కూడా 100 కోట్ల క్లబ్లో ఉన్నారు. కానీ అక్షయ్ స్థాయిలో వరుసగా ఇంత పెద్ద సంఖ్యలో సినిమాలు డెలివర్ చేయలేదు. ఎందుకంటే, హీరోలంతా ఏడాదికి లేదా రెండేళ్లకు ఒక సినిమా మాత్రమే చేస్తున్నారు. అక్షయ్ మాత్రమే ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేస్తూ ఇలా రికార్డులు సృష్టిస్తున్నాడు. -
దీప్‌వీర్ కుమార్తె దువా తొలి లైవ్ మ్యూజికల్ షో వైరల్
బాలీవుడ్ నటుడు, రణవీర్, దీపికా పడుకోన్ దంపతుల కమార్తె దువా ఇంత చిన్న వయసులోనే లైవ్ షో ఇచ్చి అదరగొట్టింది. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో తన పెర్ఫామెన్స్‌తో దీప్‌వీర్ అభిమానులను ఆకట్టుకుంది. ధురందర్ సినిమా భారీ హిట్ కావడంతో సంతోషంలో మునిగితేలుతున్న రణవీర్‌కు దువా తన టాలెంట్‌తో మరింత ఆనందాన్ని ఇచ్చింది అంటున్నారు ఫ్యాన్స్. 'ధురందర్' స్టార్ రణ్వీర్ సింగ్, తన కుమార్తె దువా మొదటి కోకో మిలన్ (చిన్న పిల్లల కార్టూన్ షో) లైవ్ మ్యూజికల్ షో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రణవీర్ సింగ్ , దీపికా పడుకోన్ తమ బిడ్డ దువా మొదటి లైవ్ షోను ఎంజాయ్ చేశారు. షో అనంతరం, రణవీర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. "ఇది మా దువా పాపకి తొలిప్రదర్శన కాబట్టి మాకు చాలా ప్రత్యేకమైనది. జీవితాంతం నిలిచిపోయే జ్ఞాపకాలను మిగుల్చుకునే అవకాశవ కల్పించిన NMACC బృందానికి చాలా కృతజ్ఞుడను’’, అంటూ NMACC బృందానికి ధన్యవాదాలు తెలిపారు.తాను, దీపిక, ఇంకా తాతయ్య, నానమ్మలతో కలిసి ఈ మ్యూజికల్‌కు హాజరైందని రణ్వీర్ వెల్లడించారు. ఎంతో సరదా, సంతోషం, అదొక రంగులమయం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం అని తెగ సంతోష పడిపోయాడు.Ranveer talks about watching Cocomelon Live at the NMACC with Dua and Deepika 🥰🥰♥️♥️ #deepveer #RanveerSingh #DeepikaPadukone Ranveer: It is extra special for us because this is our Dua baby's first show 💖 pic.twitter.com/9REtUmny44— DeepVeer Fanclub (@DeepVeer_FC) April 26, 2026 కాగా దీపికా, రణవీర్‌లు 2018 నవంబర్ 14న పెళ్లి చేసుకోగా, 2024లో వారికి కుమార్తె జన్మించింది. మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నామంటూ ఇటీవల వీరు ప్రకటించారు. -
"సర్కే చునార్" వివాదం : సంజయ్ దత్ క్షమాపణలు, దిద్దుబాటు చర్య
ఢిల్లీ, సాక్షి: "సర్కే చునార్ తేరీ సర్కే"పాటలో అశ్లీలత, మహిళలను అసభ్యంగా చిత్రీకరించారనే ఆరోపణలపై వచ్చిన ఆందోళనలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమవారం నటుడు సంజయ్ దత్ జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు జయ రహత్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిషన్‌కు లిఖితపూర్వక క్షమాపణను సమర్పించారు. ఈ విషంయంపై విచారం వ్యక్తం చేస్తూ, సృజనాత్మక కంటెంట్‌లో మహిళలకు బాధ్యతా యుతమైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన ఆవశ్యకతను అంగీకరిస్తానని హామీ ఇచ్చారని మహిళా కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.50 మంది గిరిజన బాలికల విద్యకు ఆర్థిక సహాయంఒక దిద్దుబాటు చర్యగా, సామాజిక సంక్షేమానికి , మహిళా సాధికారతకు సానుకూలంగా దోహదపడే దిశగా, సంజయ్ దత్ 50 మంది గిరిజన బాలికల విద్యకు ఆర్థిక సహాయం చేయడానికి అంగీకరించారు. ఇకపై, సినిమాలు మరియు సంబంధిత సృజనాత్మక ప్రాజెక్టులలో మహిళలు ,పిల్లలకు గౌరవప్రదమైన మరియు సముచితమైన ప్రాతినిధ్యం ఉండేలా చూసేందుకు, తప్పనిసరి చట్టపరమైన నిబంధనలను చేర్చుతానని సంజయ్ దత్ కమిషన్‌కు హామీ ఇచ్చారు.ఈ విచారణ సందర్భంగా ఎన్సీడబ్ల్యూ అనేక అంశాలపై ప్రశ్నల్ని లేవనెత్తింది. ఈ వివాదానికి సంబంధించి ఏప్రిల్ 6న దర్శకుడు, కిరణ్ కుమార్ అలియాస్ ప్రేమ్, రచయిత రకీబ్ ఆలం , గౌతమ్ కె.ఎం. కెవిఎన్ ప్రొడక్షన్ ప్రతినిధులు కూడా ఎన్సీడబ్ల్యూ ముందు హాజరై క్షమాపణలు తెలిపారు. మరోవైపు నటి నోరా ఫతేహిని కూడా ఈరోజు కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించారు. అయితే, ఆమె ప్రస్తుతం దేశం వెలుపల ఉన్నందున హాజరు కాలేకపోయారు. ఆమె మరో తేదీని కేటాయించమని కమిషన్‌ను కోరారు.కాగా బాలీవుడ్ నటి నోరా ఫతేహి, నటుడు సంజయ్ దత్ నటించిన సినిమాలోని ‘సర్కే చునార్ తేరి సర్కే’ పాట పెద్ద వివాదానికి దారితీసింది.ఈ పాటలోని సాహిత్యం, దృశ్యాలు మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ దుమారం చెలరేగడంతో జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సినిమా యూనిట్‌ను ఆదేశించింది. మరోవైపు ఈ వివాదం నేపథ్యంలో యూట్యూబ్ తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి ఈ సాంగ్‌ను తొలగించారు. అర్జున్ జన్య స్వరకల్పనలో, మంగ్లి పాడిన ఈ పాట తీవ్ర విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. -
దురంధర్-2 ఓటీటీ డేట్.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్-2. మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ మూవీ పుష్ప-2 కలెక్షన్స్‌ను దాటేసింది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో నిలిచింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. గతేడాది డిసెంబర్లో రిలీజైన దురంధర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ మూవీ కోసం ఓటీటీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ డేట్‌పై సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మే 14 వ తేదీ నుంచి ఓటీటీకి రానుందన్న వార్త వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ మూవీ రిలీజై నెల పైగా కావడంతో ఓటీటీ విడుదలపై త్వరలోనే ప్రకటన వచ్చే ఛాన్సుంది. ఈ మూవీని జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రణ్వీర్ సరసన సారా అర్జున్ హీరోయిన్గా మెప్పించింది. ఈ మూవీలో సంజయ్‌దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. #Dhurandhar2TheRevenge — MAY 14th On Jio HOTSTAR 🧨💥 pic.twitter.com/RIe0vDQ190— OTT STREAM UPDATES (@newottupdates) April 26, 2026 -
పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ప్రముఖ క్యాస్టింగ్ డైరెక్టర్
ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పెళ్లి భాజాలు మోగుతున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ క్యాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ పెళ్లి చేసుకుంది. తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ శుభవార్త తెలుసుకున్న బాలీవుడ్ స్టార్స్ నూతన దంపతులకు విషెసె చెబుతున్నారు. రణవీర్ సింగ్, కృతి సనన్, పరిణీతి చోప్రా, ఖుషీ కపూర్, శర్వరి, వాణి కపూర్, వరుణ్ ధావన్, రష్మిక మందన్నతో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. అయితే ఆమె తన భర్త వివరాలను వెల్లడించలేదు.కాగా.. షానూ శర్మ పలువురు బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేసింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కీలక పాత్రల్లో వచ్చిన వార్-2 మూవీకి సైతం వర్క్ చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు నటుల కెరీర్‌ను తీర్చిదిద్దడంలో షానూ ప్రధాన పాత్ర పోషించింది. ఆమె రణ్వీర్ సింగ్ బ్యాండ్ బాజా బారాత్, వాణి కపూర్ మూవీ దమ్ లగా కే హైషాలో, అర్జున్ కపూర్ ఇషాక్జాదే చిత్రాలకు నటీనటులను ఎంపికచేసింది. అనుష్క శర్మ నటించిన రబ్ నే బనా ది జోడి మూవీకి క్యాస్టింగ్ డైరెక్టర్‌గా సేవలందించారు. గతేడాది రిలీజైన సైయారా మూవీకి అహాన్ పాండే, అనీత్ పడ్డాను షానూ శర్మనే ఎంపిక చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా మారింది. View this post on Instagram A post shared by Shanoo Sharma🌻 (@shanoosharmarahihai) -
సుశాంత్ సింగ్ కేసు.. ప్రియురాలికి బిగ్ రిలీఫ్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ప్రియురాలు రియా చక్రవర్తికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ కేసులో ఆమె ఇప్పటికే నిర్దోషిగా బయటకొచ్చారు. ఈ నేపథ్యంలోనే బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించాలని ముంబైలోని ఒక ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె సోదరుడు షోవిక్, తల్లి సంధ్యలకు చెందిన బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని ఆదేశించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మిస్టరీ డెత్ కేసులో వీరి బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు.కాగా.. 2020లో హీరో సుశాంత్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన మృతి తర్వాత ప్రియురాలైన రియా చక్రవర్తితో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో రియా చక్రవర్తితో పాటు ఆమె తమ్ముడు షోయిక్‌లకు చివరికి క్లీన్ చిట్ లభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రియా తిరిగి తన కెరీర్ నటనలో మళ్లీ అడుగుపెట్టింది. ఆమె ఇటీవలే రోడీస్‌లో కనిపించింది. ఆమె తన సొంత పాడ్‌కాస్ట్‌ను కూడా ప్రారంభించింది. ఇందులో అమీర్ ఖాన్, సుష్మితా సేన్, ఫర్హాన్ అక్తర్, హనీ సింగ్ లాంటి ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది. -
జైలులో ఉన్నప్పుడే సీక్వెల్ ఆలోచన వచ్చింది: సంజయ్ దత్
‘ఖల్ నాయక్ రిటర్న్స్’ అంటున్నారు సంజయ్ దత్. సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘ఖల్ నాయక్’. 1993లో విడుదలైన, ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని బలరామ్ ప్రసాద్ అలియాస్ భల్లు పాత్రలో సంజయ్ దత్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తాజాగా ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ పేరుతో ‘ఖల్ నాయక్’ సినిమా సీక్వెల్‌ను ప్రకటించారు సంజయ్ దత్. ప్రతి స్టోరీకి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చేసింది. ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ అంటూ ఈ సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు సంజయ్ దత్(Sanjay Dutt). అలాగే ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్‌ను ముంబైలో నిర్వహించారు. ఈ వేడుకలో సంజయ్ దత్ మాట్లాడుతూ–‘‘నేను జైలులో ఉన్నప్పుడు ‘ఖల్ నాయక్’ సినిమా ఆలోచన వచ్చింది. ఆ సమయంలో జైలులో ఉన్న దాదాపు 4వేల మంది ఖైదీలతో ‘ఖల్ నాయక్’ సినిమా గురించి మాట్లాడాను. ఈ సినిమా వారికి నచ్చిందా? సీక్వెల్ గురించి ఆసక్తిగా ఉన్నారా? అన్న విషయాలను తెలియజేయాలని పేపర్స్ ఇచ్చాను. వారు తిరిగి ఇచ్చిన లెటర్స్‌ను నేను చదివాను.‘ఖల్ నాయక్’ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చాలా మంది పేర్కొన్నారు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత, ‘ఖల్ నాయక్’ సీక్వెల్ గురించి సుభాష్‌గారితో మాట్లాడాను. ఆయన సీక్వెల్‌కి స్కోప్ ఉందని చెప్పారు. ఇలా ఇప్పుడు ‘ఖల్ నాయక్’ సినిమా చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు సంజయ్ దత్. ఈ ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ సినిమాను అస్పెట్ ఎంటర్టైన్మెంట్, జియో స్టూడియోస్ సంస్థల అసోసియేషన్‌తో సంజయ్ దత్ నిర్మించనున్నారు. అయితే దర్శకుడు ఎవరు? అన్నది తెలియాలి. -
ఈద్‌కి ఫిక్స్
సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ‘ఎస్వీసీ 63’ (వర్కింగ్ టైటిల్) సినిమా విడుదల ఖరారైంది. 2027 ఈద్‌కి (రంజాన్ పండగ) ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ముంబైలో ఆరంభమైంది.ఈ చిత్రాన్ని 2027 ఈద్‌కి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు శుక్రవారం చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే హీరో సల్మాన్ ఖాన్ కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానుల కోసం ఓ పోస్ట్ చేశారు. ‘‘ఎస్వీసీ 63’ విడుదలకు చాలా రోజులు ఉందని మీరు నిరాశపడకండి. మీ ఎదురు చూపులకు తగినట్లుగానే ఈ చిత్రం ఉంటుంది’’ అని పేర్కొన్నారు సల్మాన్ ఖాన్. -
'నాకేలాంటి దురుద్దేశం లేదు.. తమన్నా కాళ్లు పట్టుకుంటా'
ప్రముఖ బాలీవుడ్ నటుడు అన్ను కపూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో తమన్నాపై డ్యాన్స్‌పై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా తమన్నా చాలా తెల్లగా ఉంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలను కొందరు తప్పుబట్టారు. ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాగా.. స్త్రీ 2 చిత్రంలోని ఆజ్ కీ రాత్ ఐటమ్ సాంగ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. అదే సమయంలో తమన్నా డ్యాన్స్ గురించి మాట్లాడారు. అదే సమయంలో ఆమె శరీర రంగుపై కామెంట్స్ చేయడంతో వివాదానికి దారితీసింది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అన్ను కపూర్ ఈ వివాదంపై స్పందించారు. తన కామెంట్స్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. అదే మాటను తాను మిల్కీ బాడీ అని చెబితే సమస్య వచ్చేది కాదేమోనని అన్నారు. కేవలం లాంగ్వేజ్ మారినంత మాత్రాన అర్థం మారదన్నారు. తమన్నాను ప్రశంసించడానికే అలా అన్నానని.. అంతే తప్ప తనకు మరో ఉద్దేశం లేదని తెలిపారు. నా కామెంట్స్‌తో తమన్నా బాధపడి ఉంటే ఆమె కాళ్లు పట్టుకోవడానికైనా రెడీగా ఉన్నానని స్పష్టం చేశారు. నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేనప్పుడు.. ఆమె కాళ్లు పట్టుకోవడం పెద్ద విషయం కాదన్నారు. -
నా భార్య దగ్గర దాచడానికి ఏం లేదు
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రెండేళ్ల క్రితం నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. రీసెంట్గా భార్యభర్తలిద్దరూ ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు విషయాలు మాట్లాడారు. అయితే ఓ సందర్భంలో తన వైవాహిక బంధాన్ని జాకీ భగ్నానీ.. 'సిట్యుయేషన్‌షిప్' అనడం కాస్త వింతగా అనిపించింది. శారీరక లేదా తాత్కాలిక సంబంధం గురించి చెప్పేటప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. దీంతో ఈ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో స్వయంగా రకుల్.. తన భర్త చెప్పిన ఉద్దేశం గురించి క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: కిస్ సీన్.. చాలా అసౌకర్యంగా అనిపించింది: హీరోయిన్ కాజోల్)ఇంటర్వ్యూలో జాకీ భగ్నానీ మాట్లాడుతూ.. మేం పెళ్లి చేసుకున్నాం కానీ మా మధ్య ఉన్నది ఓ సిట్యుయేషన్‌షిప్ లాంటిది. మేం ఒకరికొకరం అంకితమయ్యాం. నేను ఆమెతో దేని గురించైనా స్వేచ్ఛగా మాట్లాడగలను. అంతెందుకు రకుల్ పక్కనే ఉన్నప్పుడు నా ఎక్స్(మాజీ ప్రేయసి) నుంచి కాల్ వచ్చినా ఏ మాత్రం ఇబ్బందిపడకుండా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతాను. నా భార్య దగ్గర దాచడానికి ఏం లేదు. అందుకే ఈ బంధంలో నాకు ఎప్పుడూ ఊపిరాడనట్లు అనిపించలేదు. తామిద్దరం చాలా ఫ్రీగా ఉంటాం అని చెప్పుకొచ్చాడు.ఇక సిట్యుయేషన్‌షిప్ అనే పదంపై ట్రోల్స్ ఎక్కువగా వస్తుండేసరికి రకుల్.. తన ఇన్ స్టా వేదికగా స్పందించింది. ఓ గంటపాటు జరిగిన సంభాషణలోని ఒక లైన్ తీసుకుని హెడ్ లైన్‌గా మార్చడం మాకు నవ్వు తెప్పించింది. కానీ అలా చేయడం సరైంది కాదు. సందర్భం ముఖ్యం. మా మాటల్ని క్లిక్ బైట్ చేయడం కరెక్ట్ కాదు అని పేర్కొంది. సిట్యుయేషన్‌షిప్ వ్యాఖ్యని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ వివాదం చెలరేగిందని.. తమ బంధాన్ని స్వేచ్ఛగా, పరస్పర నమ్మకంతో కొనసాగిస్తున్నామని చెప్పడమే రకుల్-జాకీ ఉద్దేశంలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: బ్లాక్‌బస్టర్ సక్సెస్.. 'ధురంధర్' నటుడికి కోటి రూపాయల గిఫ్ట్)Jackky Bhagnani calls marriage with Rakul Preet Singh 'situationship' 😳😱“Rakul and I are married, but we are like in a situationship, which is, of course, we are exclusive to each other because that’s why we are married. But the most important thing is that I can talk to her… pic.twitter.com/4a3xBLl3Tv— FILMYNEWS (@filmynewsnetwrk) April 24, 2026 -
మృణాల్ ఠాకుర్ గ్లామర్ షో.. వీడియో సాంగ్ రిలీజ్
మృణాల్ ఠాకుర్ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు 'సీతారామం', 'హాయ్ నాన్న' సినిమాల్లో ఈమె పోషించిన పాత్రలు, అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్లే గుర్తొస్తాయి. అంతెందుకు ఈ నెల ప్రారంభంలోనే రిలీజైన 'డెకాయిట్'లోనూ సరస్వతి అనే పాత్రలో అద్భుతంగా నటించింది. మూవీ ఓకే ఓకే అనిపించుకుంది గానీ మృణాల్ యాక్టింగ్‌ని అందరూ మెచ్చుకున్నారు.(ఇదీ చదవండి: బ్లాక్‌బస్టర్ సక్సెస్.. 'ధురంధర్' నటుడికి కోటి రూపాయల గిఫ్ట్)అయితే తెలుగులో ఫెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్న మృణాల్.. బాలీవుడ్లో మాత్రం పూర్తిగా గ్లామరస్ రోల్స్ చేస్తోంది. ఇప్పుడు కూడా వరుణ్ ధావన్‌తో 'హే జవానీ తో ఇష్క్ హోనా హై' అనే రొమాంటిక్ కామెడీ మూవీ చేసింది. ఇందులో మృణాల్తో పాటు పూజా హెగ్డే కూడా హీరోయిన్గా చేసింది.వచ్చే నెల 22న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా టీజర్ కొన్నిరోజుల క్రితం రిలీజ్ చేయగా పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ట్రయాంగిల్ లవ్-ఫ్యామిలీ తరహా రొటీన్ స్టోరీనే అని చాలామంది పెదవి విరిచారు. కంటెంట్ పరంగా ఎలా ఉంటుందో పక్కనబెడితే గ్లామర్ విషయంలో మాత్రం తగ్గేదే లే అన్నట్లు ఉంది. తాజాగా 'వావ్' పేరిట మూవీలోని వీడియో సాంగ్ రిలీజ్ చేయగా.. ఇందులో మృణాల్ అదిరిపోయే గ్లామర్ షో చేసింది. పూజా హెగ్డే కూడా ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం.(ఇదీ చదవండి: కిస్ సీన్.. చాలా అసౌకర్యంగా అనిపించింది: హీరోయిన్ కాజోల్) -
చాలా అసౌకర్యంగా అనిపించింది.. నో చెప్పాలనుకున్నా కానీ
'దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే' సినిమాతో పాన్ ఇండియా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న హీరోయిన్ కాజోల్.. తర్వాత హీరో అజయ్ దేవగణ్‌ని పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లయింది. అయినా సరే ఇప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తోంది. మరోవైపు 'ద ట్రయల్' అనే సిరీస్‌తో ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే కెరీర్ ప్రారంభం నుంచి ముద్దు సీన్లలో నటించకూడదనే పాలసీ పెట్టుకున్న ఈమె.. ఓటీటీ సిరీస్ కోసం దాన్ని పక్కనబెట్టేసింది. సహ నటుడితో కిస్ సీన్ చేసింది. ఇన్నాళ్లకు సదరు సన్నివేశం గురించి స్పందించింది. చేస్తున్నప్పుడే చాలా అసౌకర్యంగా ఫీలయ్యానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: నా ఓటు టీవీకే పార్టీకే వేశా.. విజయ్ సీఎం అవుతాడు)రీసెంట్గా ఓ యూట్యాబర్తో పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కాజోల్.. తాను ముద్దు సన్నివేశంలో నటించడానికి గల కారణాల్ని బయటపెట్టింది. 'అది కేవలం కిస్ సీన్ మాత్రమే కాదు. ఆ పాత్ర భావోద్వేగాలకు, ఆలోచనలకు ఎంతో కీలకం. దాన్ని తీసేస్తే పాత్రలోని డెప్త్ తగ్గిపోతుంది. కానీ ఆ సీన్ తీస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. స్టోరీ చెప్పినప్పుడు ఓకే చెప్పాను గానీ సెట్స్‌కి వెళ్లినప్పుడు చాలా అసౌకర్యంగా అనిపించింది. చివరి నిమిషంలో 'ఇది చేయను' అని చెప్పాలనిపించింది. కానీ ఇది పూర్తిగా ప్రొఫెషనల్ నిర్ణయం అని భావించి చేశాను' అని చెప్పుకొచ్చింది.'ద ట్రయల్' సిరీస్‌లో కాజోల్ లాయర్ పాత్ర చేసింది. ఇందులోనే ఓ సీన్లో భర్తగా నటించిన జీషూ సేన్ గుప్తాతో ముద్దు సీన్ చేసింది. అయితే 1992లో ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి కిస్ సీన్ చేయకూడదని కాజోల్ తనకు తానుగా రూల్ పెట్టుకుంది. కానీ ఈ సిరీస్ కోసం చేసేసరికి అంతా ఆశ్యర్యపోయారు. ఈ సిరీస్ రెండో సీజన్ కూడా త్వరలో రిలీజ్ కానుంది.కాజోల్ వ్యక్తిగత జీవితానికొస్తే.. హీరో అజయ్ దేవగణ్‌ని ప్రేమించి 1999లో పెళ్లి చేసుకుంది. వీళ్లకు నైసా, యుగ్ అని ఇద్దరు పిల్లలున్నారు.(ఇదీ చదవండి: బ్లాక్‌బస్టర్ సక్సెస్.. 'ధురంధర్' నటుడికి కోటి రూపాయల గిఫ్ట్) -
బ్లాక్‌బస్టర్ సక్సెస్.. 'ధురంధర్' నటుడికి కోటి రూపాయల గిఫ్ట్
గత నెలలో రిలీజైన 'ధురంధర్ 2' సినిమా ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డులని బద్దలు కొట్టేసింది. ఇంకా థియేటర్లలో ఆడుతూనే ఉంది. ఈ మూవీ గురించి మెల్లగా అందరూ మర్చిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇందులో నటించిన రాకేశ్ బేడీ.. నిర్మాతల నుంచి రూ.కోటి గిఫ్ట్ అందుకోవడమే దీనికి కారణం. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: ‘రాకా’ నుంచి తప్పుకున్న దీపికా పదుకొణె.. టీమ్ క్లారిటీ)'ధురంధర్' మొదటి భాగంలో అక్షయ్ ఖన్నా తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకోగా.. గత నెలలో రిలీజైన రెండో భాగంలో హీరో రణ్వీర్ సింగ్ ఫెర్ఫార్మెన్స్ అదరగొట్టేశాడు. అయితే చివరలో రాకేశ్ బేడీ చేసిన జమీల్ జమాలీ పాత్రతో ఇచ్చిన ట్విస్ట్ అయితే ప్రతి ఒక్కరూ అవాక్కయ్యేలా చేసింది. అప్పటివరకు పాక్ రాజకీయ నాయకుడి పాత్రనే అని అంతా అనుకున్నారు. కానీ ఇతడు కూడా భారతదేశ్ గూఢచారి అనేది సర్ప్రైజింగ్గా అనిపించింది. హీరో, విలన్ తదితరులని ఎంతలా మెచ్చుకున్నారో.. రాకేశ్ బేడీకి కూడా అంతకంటే ఎక్కువ ప్రశంసలు దక్కాయి.రెండు భాగాల్లోనూ అద్భుతంగా నటించి మెప్పించిన రాకేశ్ బేడీకి రూ.50 లక్షల రెమ్యునరేషన్ అని ముందే మాట్లాడుకున్నారు. అది చెల్లించేశారు కూడా. కానీ ఇప్పుడు సినిమా ఘనవిజయం సాధించడంతో దర్శకనిర్మాత ఆదిత్యధర్.. ఈయనకు అదనంగా రూ.కోటి రూపాయల చెక్ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. 'ధురంధర్ 2' కలెక్షన్స్ ప్రస్తుతం రూ.1800 కోట్లకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: నా ఓటు టీవీకే పార్టీకే వేశా.. విజయ్ సీఎం అవుతాడు) -
కొత్త బ్యూటీతో విజయ్ డేటింగ్.. ఎవరీ అలియా?
సినీ తారలకు ప్రేమ, పెళ్లిళ్లు ఎంత కామనో.. బ్రేకప్, విడాకులు కూడా అంతే కామన్. ఎప్పుడు ఎందుకు ప్రేమలో పడతారో..ఎందుకు విడిపోతారో తెలియదు. ఇలా ప్రేమ విషయాన్ని బయటపెట్టి..అలా బ్రేకప్ చెప్పుకుంటారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటామని చెప్పి.. కొన్నాళ్లకే బ్రేకప్ అయిపోయిందటారు. అలా విడిపోయి సడెన్ షాక్ ఇచ్చిన వారిలో విజయ్ వర్మ-తమన్నా జంట ఒకటి. దాదాపు మూడేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట.. కొన్నాళ్ల క్రితం విడిపోయి అందరికి షాకిచ్చింది. తమన్నాతో బ్రేకప్ తర్వాత విజయ్ పలువురు హీరోయిన్లతో సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దంగల్ బ్యూటీ ఫాతిమా సనాతో ప్రేమలో పడ్డాడనే వార్తకు కూడా వినిపించాయి. కానీ ఫాతిమా ఆ వార్తలను ఖండించింది. ఆ తర్వాత విజయ్ మరో యంగ్ బ్యూటీతో రిలేషన్లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. అది నిజమే అన్నట్లుగా వాలెంటైన్స్ డే రోజు ఓ అమ్మాయి చేతిలో చేయి వేస్తున్న ఫోటోని షేర్ చేసి..దానికి లవ్ ఎమోజీనీ జోడించాడు. ఈ పోస్ట్‌ని ఖుషి అహుజా అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌కు ట్యాగ్ చేశాడు. దీంతో విజయ్ వర్మ మరోసారి ప్రేమలో పడ్డాడని అనుకున్నారు.తాజాగా ఆ బ్యూటీ పేరు బయటకు వచ్చింది. విజయ్ వర్మ ప్రస్తుతం నటి అలియా ఖురేషితో రిలేషనల్‌లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. అలియా ఖురేషితో కలిసి విజయ్ వర్మ ఓ హోటల్ నుంచి బయటకు వస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.ఇద్దరూ కలిసి ముంబైలోని ఓ హోటల్ నుంచి బయటకు రావడం, ఒకే కారులో కలిసి వెళ్లడంతో ఇద్దరూ రిలేషన్లో ఉన్నరానే పుకార్లు బయటకు వచ్చాయి.ఎవరీ ఖురేషీ?షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాలోని గర్ల్ గ్యాంగ్‌లో ‘జాన్వి’పాత్రలో మెరిసిన బ్యూటీనే అలియా ఖురేషి. నటి మాత్రమే కాదు, సింగర్ కూడా. ఇన్‌స్టాలో ‘ఝాలివర్స్’ పేరుతో ఉన్న ఆమెకు లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు. ప్రముఖ మ్యూజికల్ సిరీస్ 'బందిష్ బాండిట్స్' రెండవ సీజన్లో అనన్య పాత్రలో కనిపించింది. తాజాగా ఇభ్రహీం అలీఖాన్, ఖుషీ కపూర్ల ‘ నదానియన్’ మూవీలో కీలక పాత్ర పోషించింది. మరి నిజంగానే విజయ్ - అలియాలు ప్రేమలో ఉన్నారా? లేక జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనా అనేది తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. Vijay Varma was spotted with rumoured girlfriend Alia Qureshi at Mizu Restaurant in Bandra, sparking fresh dating buzz.#VijayVarma #AliaQureshi #CelebSpotted #Bollywood #DatingRumours #Mumbai pic.twitter.com/aMnpXoolNq— The Daily Jagran (@TheDailyJagran) April 21, 2026 -
ఆదా శర్మ.. మరో సెన్సేషనల్ సినిమా
ది కేరళ స్టోరీ మూవీతో సెన్సేషనల్ హిట్ కొట్టిన హీరోయిన్ ఆదా శర్మ. ఈ మూవీపై ఎన్ని వివాదాలొచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 2023లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కళ్ల చెదిరే కలెక్షన్స్ రాబ్టటింది. ఇటీవలే ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ది కేరళ స్టోరీ-2 రిలీజై హిట్‌గా నిలిచింది.తాజాగా ఆదా శర్మ మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది ముద్దుగుమ్మ. గవర్నర్ ది సైలెంట్ సేవియర్ పేరుతో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా షేర్ చేసింది ఆదా శర్మ. 'ఈనాడు మనం ఒక ప్రపంచ శక్తిగా నిలిచామంటే.. దానికి కారణం ఒక అజ్ఞాత వీరుడు సాగించిన ఒక అప్రకటిత యుద్ధమే' అంటూ గవర్నర్ పోస్టర్ పంచుకుంది. ఈ చిత్రం జూన్ 12, 2026న థియేటర్లలో విడుదల కానుందని పోస్ట్ చేసింది. ఈ చిత్రానికి చిన్మయి దీపక్ మండ్లేకర్ దర్శకత్వం వహించగా.. విపుల్ అమృత్లాల్ షా నిర్మించారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఆర్బీఐ బ్యాంక్, మనదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బ్యాంకుల్లో జరిగే అవతవకలు, మోసాలే లక్ష్యంగా ఈ మూవీని రూపొందించినట్లు పోస్టర్లో చూస్తే అర్థమవుతోంది. గవర్నర్ టైటిల్‌తోనే ఈ మూవీ థీమ్ ఏంటో ఇట్టే తెలిసిపోతోంది. My next ❤️GOVERNOR releasing in cinemas on 12th June, 2026.We are a world power todaybecause an unsung hero fought an untold war.GOVERNOR releasing in cinemas on 12th June, 2026.@BajpayeeManoj @adah_sharma #NoushadMohamedKunju @madhoo69 #ParitoshSand @KurupKrisha… pic.twitter.com/QdlMFeeM0v— Adah Sharma (@adah_sharma) April 23, 2026 -
‘రాకా’ నుంచి తప్పుకున్న దీపికా పదుకొణె.. టీమ్ క్లారిటీ
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె రెండోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల ఆమే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే ప్రెగ్నెన్సీ ప్రకటన తర్వాత దీపికపై రకరకాల రూమర్స్ వచ్చాయి. సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు ఇప్పటికే ఆమె ఒప్పుకున్న ‘రాకా’ మూవీ నుంచి కూడా తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. ప్రెగ్నెంట్‌తో ఆమె షూటింగ్లో పాల్గొనడం కష్టం అని తెలిసి.. దీపిక స్థానంలో మరో నటిని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై ‘రాకా’ టీమ్ స్పందించింది. దీపికను తొలగించారనే వార్తల్లో నిజం లేదని టీమ్ స్పష్టం చేసింది. అంతేకాదు ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిన తర్వాత ఆమె పాత్ర నిడివిని తగ్గించారనే ప్రచారాన్ని కూడా టీమ్ ఖండించింది. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం అని.. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ కొనసాగుతుందని స్పష్టం చేసింది.అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో దీపిక కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఆమె పాత్రకు యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయట. గర్భం దాల్చినప్పటికీ.. యాక్షన్ సీన్స్ చేసేందుకు దీపిక ఒప్పుకుందట. నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఈ షూటింగ్ పూర్తి చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో దీపికతో పాటు రష్మిక, జాన్వీకపూర్, మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నట్లు సమాచారం.బన్నీ హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఇప్పటికే విలన్ లుక్ రిలీజ్ అయింది. త్వరలోనే హీరో పాత్రకు సంబంధించిన లుక్ కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హీరో పాత్రలో బన్నీ స్టైలీష్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
తారలెందరో...తాగుబోతులు కొందరే..
సినిమా సెలబ్రిటీల్లో మద్యపానం చాలా సార్లు ‘‘సోషల్ ఫన్’’గా మొదలై, ఆ తర్వాత అలవాటుగా మారిపోతుంది. షూటింగ్‌ల మధ్య రిలాక్స్ కావడానికి లేదా ఫ్రెండ్స్‌తో కాసేపు టైమ్ స్పెండ్ చేయడానికి సాకుగా మొదలయే డ్రింకింగ్, తర్వాత తర్వాత పలు సందర్భాల్లో కంట్రోల్ తప్పే పరిస్థితులు తీసుకువస్తుందని పెద్ది హీరోయిన్ జాన్వీకపూర్ అభిప్రాయపడ్డారు. అయితే, ఎప్పుడు ఆపాలో తెలుసుకోవడం అవసరం అంటారామె‘‘లైఫ్‌లో బ్యాలెన్స్ చాలా ముఖ్యం’’ అన్నదే ఆమె మెసేజ్. ‘‘మద్యం అలవాటు గురించి సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు’’ అని చెప్పింది. ఆమె సందేశం స్పష్టంగా ఉంది ‘‘అడిక్షన్ అంటే తప్పు కాదు అది ఒక సమస్య. దానికి పరిష్కారం అవసరం. అంటూ అమహ అనే స్వఛ్చంద సంస్థతో కలిసి ఇటీవలే ఆమె ఆఫ్ ద రాక్స్ పేరుతో మద్యపానంపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ నేపధ్యంలో మద్యం తాగి పడిపోయి మృతి చెందారని తన తల్లి శ్రీదేవి మరణం గురించి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మన దగ్గర కూడా మహానటి సావిత్రి సహా అనేక మంది స్టార్ల జీవితాలను మద్యం మహమ్మారి పొట్టన బెట్టుకున్న కధలూ మనకు తెలుసు. సినీ ప్రముఖుల్లో కొందరు ఆ అలవాటుకే జీవితాన్ని అర్పించుకుంటే మరికొందరు మాత్రం తొలుత మత్తు కోరల్లో చిక్కినప్పటికీ ఆ తర్వాత దాని నుంచి విజయవంతంగా తప్పించుకోగలుగుతారు. అలాంటి వారే యువ తారలకు స్ఫూర్తిగా నిలుస్తారు. సీసా వదిలేశాకే....సీన్ మారింది...‘‘బాటిల్ నుంచి బయటపడిన తర్వాతే నిజమైన నన్ను తిరిగి పొందాను’’అంటూ చెప్పారు నటి, దర్శకురాలు పూజా భట్. ఓ ఇంటర్వ్యూలో ఆమె తన మద్యం అలవాటుపై ఓపెన్ గా మాట్లాడారు యుక్త వయసులో మద్యానికి అలవాటు పడిన తాను 45 ఏళ్ల వయసులో దాని నుంచి బయటపడాలనే కీలక నిర్ణయం తీసుకున్నానని ఆమె చెప్పారు. ‘‘నేను ఇంకో 10 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలంటే ఇప్పుడే మద్యం వదలేయాలి అనిపించింది. లేదంటే అదే నన్ను నాశనం చేసేస్తుందని అర్ధమైంది’’ అని అన్నారామె.తన జీవితంలో మద్యం ఒక ‘బ్యాండ్ఎయిడ్’లా (ఏదైనా దెబ్బ తగిలిన వెంటనే దానికి చేసే ప్రాధమిక చికిత్స) మారిపోయిందని, ప్రతీసారీ తన బాధను మర్చిపోవడానికి దానిని ఉపయోగించేదానినని ఆమె పంచుకుంది.‘‘చెడు సంబంధం, మద్యం ఇవి రెండూ నన్ను బాధ నుంచి తప్పించడానికి నేను వాడుకున్న సాధనాలే,’’ అని ఆమె చెప్పింది. అయితే చివరకు తనను తాను అర్థం చేసుకుని, జీవితంలో ఎదురైన ఖాళీని ఎదుర్కొని ముందుకు సాగానని చెప్పింది. ‘‘నేను బాటిల్‌ను పూర్తిగా వదిలేశాను ఇప్పటికి ఏడు సంవత్సరాలుగా సోబర్‌గా ఉన్నాను,’’ అని ఆమె సగర్వంగా ప్రకటించింది.నమ్మించి నాశనం చేస్తుంది‘‘మద్యం నెమ్మదిగా నా జీవితంలోకి వచ్చింది. ఒక దశలో దానివల్ల నా జీవితం తలకిందులైంది, ఈ అలవాడు మొదట మనకు ఎంతో సహాయం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కొంత కాలం తర్వాతే దాని వల్ల మనం నాశనం అవుతున్నాం అనేది తెలుస్తుంది. అది నిజానికి ఏ సమస్యకు పరిష్కారం కాదు’’ అంటారు ఒకనాటి అందాల తార మనీషా కొయిరాలా.. హౌ కేన్సర్ గేవ్ మి ఎ న్యూ లైఫ్ పేరిట తను రాసిన పుస్తకంలో ఆమె తన జీవితానుభవాల్లో మద్యం వ్యసనం గురించి వివరించారు. ‘‘ సంబంధాలు కావచ్చు, మద్యం లాంటి అలవాట్లు కావచ్చు జీవితంలో ఏదైనా పరే... మనమే నియంత్రించాలి. లేదంటే మనమే బాధితులం అవుతాం,’’ అని స్పష్టంగా చెబుతారు.విస్కీ నుంచి విముక్తి...‘‘ఒకప్పుడు విస్కీకి బాగా అలవాటు పడిపోయాను ఓ రకంగా చెప్పాలంటే విస్కీకి బానిసయ్యాను’’ అంటూ గుర్తు చేసుకుంటారు శృతిహాసన్. క్రమక్రమంగా దాని వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్... ఇంకా ఎన్నో చుట్టుముట్టాయని తాను గుర్తించానని తెలిపారు. మద్యం తన జీవితాన్ని నియంత్రిస్తున్నదని గ్రహించి దాన్ని పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అందుకు అనుగుణంగా ఆమె తన జీవనశైలిని పూర్తిగా మార్చుకున్నారు. ముఖ్యంగా నైట్ పార్టీలు, మద్యం ఉప్పోంగే విందు వినోదాల వాతావరణానికి దూరంగా ఉండడం అలవాటు చేసుకుంది. ‘‘ఇప్పుడు వ్యసనం నుంచి పూర్తిగా స్వేచ్ఛ లభించింది. దీని గురించి నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు నా జీవితం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది,’’ అని సంతోషం వ్యక్తం చేశారు. -
'మా ప్రేమ మొదలైంది ఆ సినిమాతోనే': అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ అడపా దడపా సినిమాలు చేస్తున్నారు. గతేడాది కాళిధర్ లపట్టా, హౌస్‌ఫుల్-5 చిత్రాలతో మెప్పించారు. అమితాబ్ బచ్చన్ వారసుడిగా సినిమాల్లో అడుగుపెట్టిన బచ్చన్.. బాలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో ఉండగానే నటి ఐశ్వర్య రాయ్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈనెల 21న బాలీవుడ్ జంట తమ 19 వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అభిషేక్.. ఐశ్వర్యతో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఐశ్వర్యతో రిలేషన్, ప్రేమ ఎలా మొదలైందన్న సీక్రెట్‌ను అభిషేక్ పంచుకున్నారు. 2000 సంవత్సరంలో ధాయ్ అక్షర్ ప్రేమ్ కే' సెట్స్‌లో ఐశ్వర్యను మొదటిసారి కలిసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే అప్పుడు మా మధ్య రిలేషన్ కేవలం స్నేహపూర్వకంగా మాత్రమే ఉండేదన్నారు. అప్పుడు తనతో లవ్ అనే ఆలోచనే నాకు రాలేదన్నారు. కానీ 2006లో 'ఉమ్రావ్ జాన్' సినిమా చిత్రీకరణ సమయంలో మా మధ్య ప్రేమ చిగురించిందని అభిషేక్ తెలిపారు. మణిరత్నం దర్శకత్వం వహించిన 'గురు' సినిమా టైమ్‌లో మా బంధం మరింత బలపడిందన్నారు. దర్శకుడు మణిరత్నం మా ఇద్దరికీ చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని.. ఆయన ఒక స్నేహితుడిగా మాత్రమే కాదు.. గాడ్‌ఫాదర్ అని ప్రశంసించారు. తమ కూతురు ఆరాధ్యను సరైన విలువలతో పెంచిన పూర్తి ఘనత ఐశ్వర్యకే దక్కుతుందన్నారు. ఐశ్వర్య కేవలం నా కూతురికి తల్లి మాత్రమే కాదు.. నా సోల్‌మేట్ కూడా అని కొనియాడారు. కాగా.. న్యూయార్క్‌లో జరిగిన 'గురు' ప్రీమియర్‌లోనే అభిషేక్, ఐశ్వర్యకు ప్రపోజ్ చేశారు. ఇది వారి లైఫ్‌లో ఓ అపూర్వమైన ఘట్టంగా నిలిచింది. నిశ్చితార్థం తర్వాత ఏప్రిల్ 2007లో వీరిద్దరి వివాహం జరిగింది. -
విషాదం.. గుండెపోటుతో 30 ఏళ్ల నటి మృతి
చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. గుండెపోటుతో హర్యానా నటి దివ్యాంక శిరోహి(30) మృతి చెందారు. మంగళవారం రాత్రి ఆమెకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. బుధవారం ఉదయం ఘజియాబాద్‌లో ఆమె అంత్యక్రియలు జరిగాయి.మాసూమ్ శర్మతో కలిసి కవర్ సాంగ్స్దివ్యాంక స్వస్థలం ఉత్తర ప్రదేశ్. ఆమెకు సోదరుడు హిమాంశు, సోదరీమణులు దీపాంశు. జస్మీత్ ఉన్నారు. 1996 నవంబర్ 19న జన్మించిన దివ్యాంక.. మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయంలో బీసీఏ, సిక్కింలో ఎంబీఏ డిగ్రీని పూర్తి చేసి చిత్ర పరిశ్రమలోకి వచ్చింది. గాయకుడు మాసూమ్ శర్మతో కలిసి కవర్ సాంగ్స్ కూడా చేశారు. 50కి పైగా హర్యానా పాటలలో నటించడమే కాదు, మాసూమ్ శర్మ, అమిత్ సైని రోహ్తకియా, కేడీ వంటి ప్రముఖులతో కలిసి తెరను పంచుకున్నారు.టిక్‌టాక్‌తో ఫేమస్..టిక్‌టాక్‌తో ఫేమస్ అయిన నటి దివ్యాంక. పంజాబీ గాయని సునంద శర్మ పాడిన 'మేరీ మమ్మీ ను పసంద్ నీ తూ' అనే పాటకు దివ్యాంక చేసిన టిక్‌టాక్ బాగా వీడియో వైరల్ అయింది. ఆ వీడియోకు దాదాపు 2 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత టిక్‌టాక్‌లో ఆమె ఫాలోవర్ల సంఖ్య 5 కోట్లకు చేరింది. ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ అయిపోయాక ఆమె ఇన్ స్టాగ్రాం బాట పట్టింది. ఇన్‌స్టాగ్రాంలో కూడా 1.3 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుంది. 30 ఏళ్ల వయసులోనే దివ్యాంక ఇలా గుండెపోటుతో చనిపోవడంతో ఆమె కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. View this post on Instagram A post shared by Divyanka (@divyankaasirohi) -
ఓటీటీకి సోషల్ ఓరియంటెడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మరో ఆసక్తికర మూవీ ఓటీటీకి వచ్చేస్తోంది. తన్మయ శేఖర్ దర్శకత్వం వహించిన సోషల్ ఓరియంటెడ్ మూవీ నుక్కడ్ నాటక్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది. ఈ నెల 24 నుంచే ఓటీటీ ప్రియులను అలరించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.కాగా.. ఈ చిత్రంలో మోల్శ్రీ, శివంగ్ రాజ్‌పాల్, నిర్మల హజ్రా, డానిష్ హుస్సేన్ కీలక పాత్రల్లో మెప్పించారు. ఓ కాలేజీ నుంచి బహిష్కరించిన ఇద్దరు విద్యార్థుల ప్రయాణం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. కాలేజీ క్యాంటీన్లో దొంగతనం చేస్తూ ఇద్దరు స్నేహితులు దొరికిపోతారు. తిరిగి కాలేజీలో చేరేందుకు ఒక బస్తీలోని ఐదుగురు పిల్లలకు విద్యనందించే బాధ్యతను తీసుకుంటారు. ఆ తర్వాత వీరిద్దరు తిరిగి కాలేజీకి వెళ్లారా? లేదా అన్నదే మిగతా స్టోరీ. Hindi LGBTQ Movie #NukkadNaatak (Hindi) streaming from April 24 on Netflix 🍿!!#OTT_Trackers pic.twitter.com/7wt7ZEVEmO— OTT Trackers (@OTT_Trackers) April 20, 2026 -
నెల రోజులైనా తగ్గేదేలే.. దురంధర్-2 మరో రికార్డ్
నెల రోజులు దాటినా కూడా దురంధర్-2 హవా ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే పుష్ప-2 రికార్డ్ బ్రేక్ చేసిన ఈ స్పై థ్రిల్లర్ మూవీ మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా రిలీజైన 34 రోజుల్లోనే అరుదైన రికార్డ్ సాధించింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ మూవీ పఠాన్ రికార్డ్‌ను అధిగమించింది. తాజా వసూళ్లతో యూకేలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా దురంధర్-2 నిలిచింది.రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ మూవీ యూకేలో 34 రోజుల్లోనే రూ. 55.55 కోట్లు వసూలు చేసింది. ఈ క్రమంలోనే గతంలో ఉన్న పఠాన్ మూవీ రికార్డ్‌ను(రూ.55.40 కోట్లు) దాటేసింది. ఆ తర్వాత వరుసగా జవాన్, సైయారా, రాకీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ, దిల్వాలే, పద్మావత్, చెన్నై ఎక్స్‌ప్రెస్ ఈ జాబితాలో ఉన్నాయి. ఓవరాల్‌గా చూస్తే దురంధర్-2 అంతర్జాతీయంగా రూ. 422 కోట్లకు పైగా వసూలు చేసింది. చైనా మినహా పలు దేశాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 1,761.88 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమా కంటే బాహుబలి-2, దంగల్ చిత్రాలు మాత్రమే ముందున్నాయి.కాగా.. ఈ ఏడాది మార్చి 19న విడుదలైన ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాకేశ్ బేడీ, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, డానిష్ పండోర్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్లో రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన దురంధర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. -
వాచ్‌మెన్‌గా పనిచేశా.. బిచ్చగాడిగా కూడా సెట్ కాదన్నారు: నటుడు
సినిమా నటులు అనగానే కోట్ల సంపాదన, లగ్జరీ లైఫ్ అనుకుంటారు. నిజమే అలానే బతుకుతారు. కానీ వాళ్లు ఆ స్థాయికి చేరుకోవడానికి చాలానే కష్టపడతారు. ఇప్పుడు స్టార్స్‌గా రాణిస్తున్నవారిలో చాలా మంది ఒకప్పుడు పేదరికాన్ని అనుభవించి వచ్చినవాళ్లే. అలాంటి వాళ్లలో బాలీవుడ్ నటుడు వినోద్ సూర్యవంశీ ఒకరు. అక్షయ్ కుమార్ ‘ఎల్ఎల్బి 3’, పంచాయత్ లాంటి సిరీస్‌తో బాలీవుడ్లో మంచి గుర్తించు తెచ్చకున్న ఈ నటుడు.. ఒకప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించాడట. రూ. 500 కోసం సినిమాల్లోకి వచ్చి.. ఇప్పుడు బాలీవుడ్లో మంచి నటుడిగా స్థిరపడిపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వినోద్ తన సినిమా జర్నీ ఎలా మొదలైందో వివరించాడు.(చదవండి: ఇప్పటికీ మా కుటుంబాన్ని గుడిలోకి రానివ్వరు)వాచ్ మెన్‌గా పనిచేశా..చిన్నప్పుడు నా జీవితం చాలా ఘోరంగా ఉండేది. తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు. పండగలు వస్తే.. భయపడిపోయేవాళ్లం. అమ్మ-నాన్నల కష్టం చూడలేక.. కొన్నాళ్ల పాటు లిఫ్ట్ మ్యాన్‌గా పని చేశారు. ఆ తర్వాత వాచ్‌మెన్‌గా చేశా. ఆ సమయంలో దాదాపు 12 గంటల పాటు నిలబడి ఉండేవాడిని. వర్షం వస్తే.. షూలోకి నీళ్లుపోయి..తీవ్రమైన నొప్పి వచ్చేవి.రూ. 500 కోసం.. నేను అనుకోకుండా సినిమాల్లోకి వచ్చా. వాచ్‌మెన్‌గా చేస్తున్న సమయంలో నా స్నేహితుడు ఒకడు వచ్చి షూటింగ్లో నిలబడితే రూ. 500 ఇస్తారని చెప్పి నన్ను తీసుకెళ్లాడు. అలా జూనియర్ ఆర్టిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభం అయింది. అప్పట్లో రోజుకు రూ. 500 ఇచ్చేవాళ్లు. టిఫిన్, లంచ్ పెట్టేవాళ్లు. అప్పటికే అది నాకు చాలా గొప్పది. వాన్మెన్గా 12 గంటలు పని చేస్తే నెలకు రూ. 8000 మాత్రమే వచ్చేవి. కానీ జూనియర్ ఆర్టిస్ట్‌గా రూ. 12000 సంపాదించా.తింటుంటే లేపేశారుఅలా అని జూనియర్ ఆర్టిస్ట్ లైఫ్ గొప్పగా ఉంటుందని నేను చెప్పను. వాళ్లకు కనీస గౌరవం కూడా ఇవ్వరు. జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్నప్పుడు ఓ సారి నేను సెట్లో భోజం చేస్తున్నాను. కొంతమంది వచ్చి..నన్ను పక్కకు వెళ్లమన్నారు. దూరంలోని నిలబడి తనమన్నారు. ఎందుకంటే నేను జూనియర్ ఆర్టిస్ట్‌ని అని. అప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నా. నన్ను గౌరవించాలంటే.. నేను కూడా యాక్టర్‌ని కావాలనుకున్నా. చాలా కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చా.బిచ్చగాడి పాత్రకు కూడా సెట్ కాదన్నారుకెరీర్ ప్రారంభంలో నేను చాలా కష్టాలు అనుభవించా. చాలా పాత్రలకు నన్ను రిజెక్ట్ చేశారు. కొన్ని పాత్రలు అయితే షూటింగ్ ప్రారంభించిన తర్వాత ఆగిపోయాయి. సెట్లోకి వెళ్లిన తర్వాత.. నల్లగా ఉన్నావని చెప్పి రిజెక్ట్ చెశారు. చివరకు బిచ్చగాడి పాత్రకి కూడా రిచ్ లుక్ లేదని నన్ను పక్కన పెట్టారు. ఇలా మొదట్లో నాకు చాలా అవమానాలు జరిగాయి’ అని సూర్య చెప్పుకొచ్చాడు. -
ఒంటిపై నీళ్లు పోసుకొని, పెదాలు ఆడించిన సింగర్, ఇదేం లైవ్?
ఈ మధ్య సంగీత కచేరీకి ప్రాధాన్యత పెరిగింది. స్టార్ సింగర్స్ అంతా.. మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహిస్తుండడంతో.. మ్యూజిక్ లవర్స్ ఆ ఈవెంట్ కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం లైవ్ కాన్సర్ట్ అని చెప్పి..రికార్డింగ్ పాటను ప్లే చేయడం ఇప్పుడు సంగీత ప్రియులను ఆగ్రహానికి గురి చేస్తుంది. తాజాగా ధురంధర్ సింగర్ జాస్మిన్ సాండ్లాస్ కూడా బ్యాగ్రౌండ్లో ప్లే అవుతున్న పాటకు లిప్ సింక్ ఇచ్చి.. లైవ్‌లో పాడుతున్నట్లుగా మోసం చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటుంది.లైవ్ కాన్సర్ట్ కానీ.. ధురంధర్ సినిమా రిలీజ్ తర్వాత సింగర్ జాస్మిన్ సాండ్లాస్ మరింత ఫేమస్ అయ్యాడు. ఆ సినిమాలో ఆమె ఆలపించిన షరారత్, మై ఔర్ తూ, ఆరీ ఆరీ పాటలు సూపర్ హిట్ అవ్వడం.. సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడంతో జాస్మిన్ పేరు మారుమోగిపోయింది. ఆ ఫేమ్‌ని సొమ్ము చేసుకునేందుకు జాస్మిన్ రెడీ అయింది. అందులో భాగంగా ఏప్రిల్ 19న గుజరాత్‌లోని ఆహ్మదాబాద్‌లో సంగీత కచేరి నిర్వహించింది. ధురంధర్ సింగర్ మ్యూజిక్ కాన్సర్ట్ అని తెలియడంతో వందలాది మంది సంగీత ప్రియులు వేలాది రూపాయలు ఖర్చు చేసి ఈవెంట్‌కి వెళ్లారు. జాస్మిన్ కూడా వారిని నిరాశపరచకుండా తన పాటలతో మంత్రముగ్ధుల్ని చేసింది.పాడడం కోసమా లేదా యాక్టింగ్ కోసమా?ఈవెంట్‌కి వచ్చినవారిని మరింత ఉత్సాహపరిచేందుకు ధురంధర్ పాటను ఆలపిస్తూ..తలపై నీళ్లు పోసుకుంది. అంతేకాదు పాటతో పాటు డ్యాన్స్ కూడా చేసి అలరించింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అయింది. అయితే ఆ వీడియో క్లిప్ పరిశీలిస్తే.. జాస్మిన్ పాట పాడలేదు. బ్యాగ్రౌండ్లో ప్లే అవుతున్న పాటకి పెదాలను కదిపారు అంతే. ఇది గమనించిన నెటిజన్స్ ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. దీంతో పాటు తలపై నీళ్లు పోసుకోవడాన్ని కూడా తప్పుపడుతున్నారు. ‘లైవ్ కాన్సర్ట్ అని చెబుతారు.. కానీ లైవ్‌లో పాట పాడరు’, ‘ఆమెను పాట పాడడానికి పిలిపించారా లేదా నటించడానికి పిలిపించారా?’, ‘తలపై పోసుకున్న నీళ్లు సరిపోలేదు..ఇంకో బకెట్ నీళ్లు పోసుకోవాల్సింది’అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by @exclusive.celebs -
ఇప్పటికీ మా కుటుంబాన్ని గుడిలోకి రానివ్వరు
హిందీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ, 'పంచాయత్' సిరీస్‌లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న వినోద్ సూర్యవంశీ.. ఇప్పటికీ తన కుటుంబం కర్ణాటకలోని తన సొంతూరిలో కుల వివక్ష ఎదుర్కొంటోందని చెప్పుకొచ్చాడు. ప్రముఖ యూట్యూబర్ సిద్ధార్థ్ కన్నన్‌తో జరిగిన సంభాషణలో భాగంగా ఈ ఆశ్చర్యకర సంగతి చెప్పి షాకిచ్చాడు. పేదరికం కారణంగా తను ఇప్పటివరకు ఎలాంటి వివక్ష ఎదుర్కొన్నాడో చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు.(ఇదీ చదవండి: టాలీవుడ్లో విషాదం.. చనిపోయిన ప్రముఖ దర్శక నిర్మాత)'మా ఊరిలో ఇప్పటికీ అగ్ర కులాలు, బలహీన వర్గాల కోసం వేర్వేరు ప్రాంతాలున్నాయి. దళితులు నివసించే ప్రాంతం గ్రామానికి దూరంగా ఉంటుంది. నాకు 12 ఏళ్ల వయసున్నప్పుడు నాన్నతో కలిసి ఊరి లోపలికి వెళ్లినప్పుడు ఓ హోటల్లో తిన్నాం. కానీ తర్వాత మేమే ప్లేట్లు కడగాల్సి వచ్చింది. అలానే ఇప్పటికీ ఊరిలోని దేవాలయంలోకి మాకు అనుమతి లేదు' అని వినోద్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.ఇక చిన్నప్పటి కష్టాలు గుర్తుచేసుకున్న వినోద్.. పండగలు వచ్చాయంటే సంతోషం కంటే మాకు బాధే ఎక్కువగా ఉండేది. దీపావళి ఎందుకు వస్తుందా అనిపించేంది. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఇస్తే మాత్రమే మేం పండగ జరుపుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కుటుంబం విషయానికొస్తే.. నా తల్లి ఇళ్లలో పనిచేసేది. నాన్న మేస్త్రీ. ఆయనకు రోజూ పని దొరికేది కాదు. పనిలేకపోతే తాగొచ్చి అమ్మని ఇష్టమొచ్చినట్లు కొట్టేవాడు. ఆయనంటే కోపం లేదు కానీ ఎందుకనో నాన్న ప్రవర్తన నచ్చేది కాదని అన్నాడు.సినిమా కెరీర్ గురించి చెబుతూ.. ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్నో పనులు చేశాను. మొదటి లిఫ్ట్ మ్యాన్‌గా నెలకు రూ.1600 జీతానికి పనిచేశా. తర్వాత ఆఫీస్ బాయ్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు చేశాను. గార్డ్‌గా పనిచేసినప్పుడు 12 గంటలు నిలబడి పనిచేయాల్సి వచ్చేది. వర్షం పడితే చెప్పుల్లోకి నీళ్లు చేరి గాయాలయ్యేవి. కొందరు అకారణంగా తిట్టేవారని వినోద్ గుర్తుచేసుకున్నాడు. ఏ పని చిన్నది కాదంటారు గానీ నిజానికి మనిషిని అతడు చేసే పనిబట్టి అంచనా వేస్తారు. పని పెద్దదైతేనే గౌరవం కూడా ఎక్కువగా ఉంటుందని వినోద్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. హిందీలో పంచాయత్ సిరీస్‌తో పాటు జాన్వర్, థామా, సత్యమేవ జయతే, జాలీ ఎల్ఎల్బీ 3 తదితర సినిమాల్లో వినోద్ సూర్యవంశీ నటించాడు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు బోల్డ్ కామెడీ సినిమా) -
ఆలియా ఆగమనం నిజమేనా?
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్. ఆ తర్వాత ఆలియా భట్ హీరోయిన్గా చేయనున్నారంటూ కొన్ని పెద్ద తెలుగు సినిమాల పేర్లు వినిపించినప్పటికీ ఏదీ ఫైనలైజ్ కాలేదు. తాజాగా ఆలియా భట్ పేరు మరోసారి ప్రస్తావనకు వచ్చింది. కానీ హీరోయిన్గా కాదు... కథలో ఓ కీలక పాత్ర కోసం ఆలియా భట్‌ను సంప్రదించారట. ఎవరంటే...‘డ్రాగన్’ సినిమా (ప్రచారంలో ఉన్న టైటిల్) టీమ్. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’.ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాకు కీలకమైన పాత్రలో అనిల్ కపూర్ నటిస్తున్నారని తెలిసింది. కథను మలుపు తిప్పే మరో లీడ్ రోల్లో నటించనున్నారంటూ శ్రుతీహాసన్, రష్మికా మందన్నా, కాజోల్... వంటి వార్ల పేర్లు వినిపించాయి. తాజాగా ఆలియా భట్ పేరు తెరపైకి వచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ (రామ్‌చరణ్ మరో హీరో) సినిమాలో హీరో ఎన్టీఆర్, ఆలియా భట్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.మరి... మరోసారి ‘డ్రాగన్’ సినిమా కోసం ఎన్టీఆర్, ఆలియా భట్ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? టాలీవుడ్‌కు మరోసారి ఆలియా ఆగమనం నిజమేనా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. మైత్రీ మూవీమేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న రిలీజ్ కానుంది. -
ముంబైకి అల్లు అర్జున్… పుకార్ల వెనుక నిజం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబయిలో సెటిల్ అవుతున్నాడనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ విషయంపై గత రెండు రోజులుగా వరుస కథనాలు వచ్చాయి. దీనికి కారణం, బన్నీ నిజంగానే ముంబయికి షిఫ్ట్ అవ్వడమే. కానీ ఇందులో సగం మాత్రమే నిజం అని తాజా సమాచారం. అసలు విషయం ఏమిటంటే.. ప్రస్తుతం బన్నీ తమిళ దర్శకుడు అట్లీతో చేస్తున్న ‘రాకా’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రధాన షూటింగ్ మొత్తం ముంబయిలోని ఓ స్టూడియోలో జరుగుతోంది. కీలకమైన ఈ షెడ్యూల్ కారణంగా హైదరాబాద్, ముంబయి మధ్య ప్రయాణం కష్టంగా ఉండటంతో, తాత్కాలికంగా ముంబయిలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఇదే సమయంలో బన్నీ ముంబయిలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశాడని, అక్కడే శాశ్వతంగా సెటిల్ అవ్వబోతున్నాడని పుకార్లు చెలరేగాయి. కానీ నిజానికి బన్నీ ముంబయిలో ఫ్లాట్ కొనలేదు. కేవలం కొన్ని రోజుల పాటు ఉండటానికి లీజు కింద తీసుకున్నాడని సమాచారం. ఈ విషయాన్ని బన్నీ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ కూడా స్పష్టం చేశారు. ‘రాకా’ షూటింగ్ పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ తిరిగి హైదరాబాద్‌కి వస్తాడు. ఇక బన్నీ, అట్లీతో 'రాకా' సినిమా తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అనిరుధ్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కూడా ఒక సినిమా చేయనున్నాడనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బన్నీ ముంబయిలో ఉన్నది నిజమే కానీ అక్కడే శాశ్వతంగా సెటిల్ మాత్రం అవ్వడం లేదు. -
రాజా శివాజీ ట్రైలర్ రిలీజ్.. జెనీలియా దంపతుల కన్నీళ్లు..!
బొమ్మరిల్లు మూవీతో టాలీవుడ్ ప్రియుల మనసు దోచుకున్న బ్యూటీ జెనీలియా. సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్గా మెప్పించింది. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిన ముద్దుగుమ్మ అక్కడే సెటిలైపోయింది. బాలీవుడ్ రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడింది. ప్రస్తుతం ముంబయిలోనే ఉన్న జెనీలియా.. గతేడాది సితారే జమీన్ పర్, జూనియర్ చిత్రాల్లో మెరిసింది.జెనీలియా సంగతి పక్కన పెడితే ఆమె భర్త రితేశ్ దేశ్‌ముఖ్ చారిత్రక మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రాజా శివాజీ పేరుతో వస్తోన్న చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను ముంబయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా రితేశ్ దేశ్ముఖ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా కోసం తాను పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాకుండా రితేశ్ తన తండ్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌ను గుర్తుచేసుకున్నారు. ఇది చూసి పక్కనే ఉన్న జెనీలియా సైతం కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. వేదికపైనే చిన్న పిల్లలా ఏడ్చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా కన్నీళ్లు..చాలా రోజుల నిరీక్షణ తర్వాత 'రాజా శివాజీ' ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ చుట్టూ తిరుగుతుంది. ఈ సందర్భంగా తన కల సాకారం చేసుకోవడంలో సాయపడిన చిత్ర బృందానికి రితేశ్ ధన్యవాదాలు తెలిపారు. వేదికపై రితేశ్ ఎమోషనల్ కావడంతో.. జెనీలియా దేశ్‌ముఖ్ భావోద్వేగానికి గురైంది. ఈ మాటలు విన్న సంజయ్ దత్ సైతం ఎమోషనల్‌గా కనిపించారు. ఈ కథను తీసుకురావడంలో తనకు మద్దతుగా నిలిచిన జెనీలియాకు సైతం రితేశ్ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమానికి సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్, మహేష్ మంజ్రేకర్, భాగ్యశ్రీ లాంటి స్టార్స్ హాజరయ్యారు. వీరంతా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. 'రాజా శివాజీ' చిత్రంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా నటించారు, ఆయన జీవ మహాల అనే పాత్రను పోషించారు. ఈ మూవీలో సచిన్ ఖేడేకర్, ఫర్దీన్ ఖాన్, జితేంద్ర జోషి, అమోల్ గుప్తే కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా మరాఠీ, హిందీ భాషల్లో ఓకేసారి తెరకెక్కించారు. ఈ హిస్టారికల్ మూవీ మే 1, 2026న థియేటర్లలో విడుదల కానుంది. #RiteishDeshmukh and #GeneliaDeshmukh share a heartfelt moment during a press interaction 🥺❤️#pinkvilla pic.twitter.com/Ixsxjc4p1m— Pinkvilla (@pinkvilla) April 20, 2026 -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న మాజీ సీఎం మనవరాలు
సినిమా, రాజకీయ రంగానికి విడదీయలేని సంబంధముంది. నటీనటులుగా రాణించిన వాళ్లు చాలామంది ప్రస్తుతం పాలిటిక్స్‌లోనూ మెప్పిస్తున్నారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మనవరాలు కూడా నటిగా అరంగేట్రం చేసేందుకు సిద్ధమైంది. ఆ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. ఇంతకీ ఎవరామె? ఏంటా సినిమా?(ఇదీ చదవండి: షాకింగ్.. తల్లి కాబోతున్న 'బిగ్‌బాస్' ట్రాన్స్‌జెండర్ తమన్నా)గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా చేస్తున్న ఆనందీ బెన్ పటేల్ మనవరాలు సంస్కృతి జయానా నటిగా పరచయమవుతోంది. మే 7న తెలుగులోనూ రిలీజ్ కాబోతున్న 'కృష్ణావతారం పార్ట్ 1'లో శ్రీ కృష్ణుని ప్రియురాలు సత్యభామ పాత్ర పోషించింది. ఈ చిత్రంలో కృష్ణుడిగా సిద్ధార్థ్ గుప్తా, రాధగా సుస్మితా భట్, రుక్మిణిగా నివాసిని కృష్ణన్ నటించారు. ఈ మూవీ మొత్తం సత్యభామ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఉండనుంది.ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సంస్కృతి జయానా.. ఇప్పటికే పారిశ్రామికవేత్తగా రాణిస్తోంది. లండన్, అమెరికాలోని ఫ్యాషన్ మేనేజ్మెంట్ చేసిన ఈమె.. 16 ఏళ్ల వయసులోనే సొంత ఫ్యాషన్ బ్రాండ్ ప్రారంభించింది. మరోవైపు తల్లిదండ్రులతో కలిసి పలు సామాజిక కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంది. మరి ఇప్పుడు సత్యభామ పాత్రలో నటిగా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: యుద్ధాన్ని ముందే అంచనా వేసిన ధనుష్ సినిమా) -
రూ.4500 జీతానికి పని చేస్తున్న స్టార్ హీరో కొడుకు
ఆ యువకుడి తండ్రి ఓ స్టార్ హీరో. కోట్ల ఆస్తి ఉంది. సినిమాల్లోకి వస్తానంటే.. దర్శకనిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యూ కడతారు. కానీ ఇవన్నీ వదులుకోని ఓ సాధారణ యువకుడిలా జీవితం గడుపుతున్నాడు. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో కొడుకు అరవ్ భాటియా. 24 ఏళ్ల వయసు ఉన్న ఈ యువకుడు.. అనుకుంటే ఈ పాటికే హీరో అయిపోయేవాడు. కానీ నటన అంటే ఆయనకు ఇష్టం లేదు. ఫ్యాషన్ రంగంలో రాణించాలనేది ఆయన కల. అందుకే ప్రస్తుతం ఆ ఫీల్డ్‌లో రూ. 4500 జీతానికి పని చేస్తున్నాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ వెల్లడించారు.‘అరవ్కి పని చేయడం ఇష్టం. సినిమా రంగంలోకి రావాలనుకోవట్లేదు. ప్రస్తుతానికి అతనికి ఎలాంటి ప్లాన్స్ లేవు కానీ ఫ్యాషన్ రంగంలోకి వెళ్లాలనుకుంటున్నాడు. ఇప్పటికే ఆ ఫీల్డ్‌లో రూ. 4500 జీతానికి పని చేస్తున్నాడు. గ్రామాలు తిరుగుతూ ఫ్యాషన్‌పై అధ్యయనం చేస్తున్నాడు. హీరో కొడుకునని ఎక్కడ చెప్పుకోడు. నేను కూడా వాడిని సినిమాల్లోకి రావాలని ఫోర్స్ చేయను. తనకు నచ్చిన పని చేసుకోమని చెబుతాను. తండ్రిగా వాడికి ఎలాంటి క్లాసులు తీసుకోని కానీ.. ‘ఎవరికీ హానీ చేయొద్దు.. బాధ పెట్టొద్దు’ అని మాత్రం చెబుతాను’ అని అక్షయ్ చెప్పుకొచ్చాడు. -
రూ.10 కోట్లతో అపార్ట్మెంట్ కొన్న టబు.. ప్రత్యేకతలు ఇవే!
సీనీ తారల్లో చాలా మంది తమ సంపాదనను రియల్ ఎస్టేట్ రంగంలో పెడుతున్నారు. స్టార్ హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు విలాసవంతమైన భవనాలు, విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత మంచి ధర వస్తే..వాటిని అమ్మి.. వచ్చిన డబ్బుతో మరో చోట పెట్టుబడి పెడుతున్నారు. తాజాగా సీనియర్ నటి టబు కూడా ముంబైలో ఓ విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసింది. ముంబైలోని వెర్సోవా ఏరియాలో ఉన్న ఆ అపార్ట్మెంట్ విలువ దాదాపు రూ. 10.40 కోట్లుగా ఉంటుందని బాలీవుడ్ మీడియా పేర్కొంది. కేవలం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసమే టబు రూ. 60 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందంట. ఆ అపార్ట్మెంట్ సముద్ర తీరానికి సమీపంలోనే ఉండడమే కాదు.. నగరం మొత్తం అందంగా కనిపించేలా ఉంటుందట. ఆ వెంచర్లో మొత్తం 2 టవర్స్ ఉన్నాయట. ఒక్కో టవర్ 24 అంతస్తులు ఉంటుంది. మొత్తం 126 నివాసాలు ఉండగా..అందులో ఒకటి టబు కొనుగోలు చేసింది. జిమ్, స్వీమ్మింగ్ పూల్తో పాటు రెండు కార్లు పార్కింగ్ చేసుకునేలా పార్కింగ్ స్తలం వచ్చిందట. ముంబైలో టబుకి ఇప్పటికే ఓ ఫ్లాట్ ఉంది. ఇది రెండోది. హైదరాబాద్‌లో కూడా టబుకి సొంతిల్లు ఉంది.టబు సినిమాల విషయానికొస్తే.. ఆమె నటించిన తాజా హిందీ చిత్రం ‘బూత్ బంగ్లా’ ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే విజయ్ సేతు పతి కథానాయకుడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తోన్న `స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్` లో నటిస్తోంది. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. పోస్ట్ వైరల్
ప్రముఖ బాలీవుడ్ నటి శివాలికా ఒబెరాయ్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తన భర్త, డైరెక్టర్ అభిషేక్ పాఠక్‌తో కలిసి ఈ శుభవార్త పంచుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ చేశారు. మా ఇంటికి చిన్నారి లక్ష్మీ దేవి ఈ శుభ దినాన మా జీవితంలోకి అడుగుపెట్టింది.. ఇది స్వచ్ఛమైన రూపంలో లభించిన ఒక వరం' క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న అభిమానులు, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. శివాలికా తాను గర్భవతి అయిన విషయాన్ని గతేడాది డిసెంబర్లో రివీల్ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. నటి శివాలికా, డైరెక్టర్ అభిషేక్ పాఠక్ ఫిబ్రవరి 2023లో గోవాలో వివాహం చేసుకున్నారు. 2020లో 'ఖుదా హాఫిజ్' సినిమా నిర్మాణ సమయంలో వీరిద్దరు మొదటిసారి కలుసుకున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ నిర్మించగా.. శివాలికా హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత ఈ జంట టర్కీలో నిశ్చితార్థం చేసుకున్నారు. హాట్ ఎయిర్ బెలూన్ల మధ్య శివాలికాకు అభిషేక్ ప్రపోజ్ చేశారు.కాగా.. కిక్, హౌస్‌ఫుల్-3 చిత్రాలకు సహాయ దర్శకురాలిగా శివాలికా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత యే సాలీ ఆషికి (2019) చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ఖుదా హఫీజ్ చిత్రంలో తన పాత్రకు గుర్తింపు తెచ్చుకుంది. ఇక అభిషేక్ పాఠక్ హిందీలో దృశ్యం -2, ఉజ్డా చమన్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతే కాకుండా ప్యార్ కా పంచ్‌నామా, ఖుదా హాఫిజ్, సెక్షన్ 375 లాంటి ప్రాజెక్టులను నిర్మాతగా వ్యవహరించారు. View this post on Instagram A post shared by Shivaleeka Oberoi Pathak (@shivaleekaoberoi) -
గుడ్ న్యూస్ చెప్పిన దీపికా పదుకొణె.. రెండోసారి ప్రెగ్నెన్సీ
దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ జంట అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాము రెండో బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రకటించారు. రెండోసారి దీపికా ప్రెగ్నెన్సీతో ఉందన్న శుభవార్తను పంచుకున్నారు. ఓ క్యూట్ పిక్ షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. తమ ముద్దుల కూతురు దువా పాజిటివ్ ఫలితాన్ని చూపిస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు.కాగా.. వీరిద్దరికి 2024 సెప్టెంబర్ 8న కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. ఆ పాపకు దువా అని నామకరణం చేశారు. కొన్నేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న దీపికా, రణవీర్ 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుకలో ఇటలీలో గ్రాండ్‌గా జరిగింది. ఇక సినిమాల విషయానికొస్తే రణ్వీర్ ప్రస్తుతం 'ధురందర్ 2' మూవీతో మరో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నెల రోజుల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. ఇకపోతే దీపిక సైతం చాలా బిజీ షెడ్యూల్ ఉంది. ఆమె ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ సరసన 'కింగ్' చిత్రంలో నటించనుంది. అంతేకాకుండా అల్లు అర్జున్‌తో రాకా మూవీలోనూ హీరోయిన్గా కనిపించనుంది. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
బాక్సాఫీస్ వద్ద దురంధర్-2 హవా.. పుష్ప-2 రికార్డ్ బ్రేక్
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మార్చి 19న రిలీజైన ఈ సినిమా నెల రోజుల్లోనే మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 వసూళ్లను అధిగమించింది. విడుదలైన 31 రోజుల్లోనే ఈ ఘనత సొంతం చేసుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 1,749.01 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.'ధురంధర్ 2: ది రివెంజ్' ఇండియా వ్యాప్తంగా రూ.1329.31 కోట్లు రాబట్టగా.. ఓవర్సీస్లో రూ.419.70 కోట్ల వసూలు చేసింది. ఈ వసూళ్లతో రూ.1,742 కోట్లు సాధించిన 'పుష్ప 2' చిత్రాన్ని అధిగమించింది. ఓవరాల్‌గా దురంధర్-2 ఇండియాలో అత్యధిక వసూళ్ల జాబితాలో మూడోస్థానం సొంతం చేసుకుంది. తొలి స్థానంలో అమిర్ ఖాన్ దంగల్ ఉండగా.. రెండో ప్లేస్‌లో రాజమౌళి బాహుబలి-2 కొనసాగుతోంది. దురంధర్-2 వసూళ్లు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో బాహుబలి-2 రికార్డ్ సైతం బ్రేకయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. గతేడాది డిసెంబర్లో రిలీజైన దురంధర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పాకిస్తాన్ స్పై నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, రాకేష్ బేడి, గౌరవ్ గెరా, డానిష్ పాండోర్, మానవ్ గోహిల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్గా కనిపించింది. -
హీరోయిన్ రాశీ ఖన్నాకు చేదు అనుభవం..!
హీరోయిన్ రాశి ఖన్నాకు చేదు అనుభవం ఎదురైంది. తాను నటిస్తోన్న ఓ మూవీ షూటింగ్లో ఆమె నగదు చోరీకి గురైంది. రాశీ హ్యాండ్ బ్యాగ్ నుంచి రూ.50 వేలను తస్కరించినట్లు తెలుస్తోంది. మూవీ సెట్స్‌లోని వానిటీ వ్యాన్‌లో పనిచేసే ఓ ఉద్యోగి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. అతన్ని వెంటనే గుర్తించిన భద్రతా సిబ్బంది అతడిని చితకబాది.. బయటికి గెంటేశారు.ఈ చోరీతో మూవీ సెట్స్‌లోని సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. మూవీ షూటింగ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన చూసి చాలా దిగ్భ్రాంతికి గురైనట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇలాంటి సంఘటనలు జరగడం పరిశ్రమకు సిగ్గుచేటన్నారు. కానీ ఎలాంటి చోరీ జరగలేదని రాశీ ఖన్నా టీమ్ చెప్పడం విశేషం. ఈ విషయంపై మాట్లాడటానికి రాశీ ఖన్నా మేనేజర్ నిరాకరించారు. కాగా.. రాశీ ఖన్నా ప్రస్తుతం అనీస్ బాజ్మీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, విద్యా బాలన్లతో కనిపించనుంది. -
పుష్ప-2 రికార్డ్ బ్రేక్.. ఇంకా ఎన్ని కోట్లంటే?
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 రిలీజై నెల రోజులవుతున్నా ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. మార్చి 19న విడుదలైన దురంధర్-2 వసూళ్ల పరంగా ఇంకా రాణిస్తోంది. ఇప్పటికే రెండు పార్టులు కలిపి రూ.3 వేల కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రాలు ఇండియన్ సినిమా గతినే మార్చేశాయి. తాజాగా దురంధర్-2 మూవీ అరుదైన రికార్డ్‌పై కన్నేసింది.అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప-2 అల్ టైమ్ వసూళ్ల రికార్డ్‌కు అతి చేరువగా వచ్చేసింది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప ది రూల్ బాక్సాఫీస్ వద్ద రూ. 1,742.10 కోట్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రణ్వీర్ సింగ్ దురంధర్ రూ. 1,737.74 కోట్ల కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద రన్ అవుతోంది. అంటే కేవలం రూ.5 కోట్లు మాత్రమే వెనకంజలో ఉంది. ఈ మూవీ 5 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తే పుష్ప-2 రికార్డ్‌ను బ్రేక్ చేయనుంది. ఈ జాబితాలో అమిర్ ఖాన్ దంగల్, రాజమౌళి బాహుబలి-2, పుష్ప-2 వరుసగా తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. వసూళ్లు ఇలాగే కొనసాగితే దురంధర్-2 త్వరలోనే పుష్ప-2ను వెనక్కి నెట్టనుంది.కాగా..ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్గా కనిపించింది. ఈ మూవీలో ఆర్ మాధవన్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన దురంధర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల గ్యాప్‌లోనే సీక్వెల్ రిలీజ్ చేసిన సరికొత్త రికార్డ్ సృష్టించారు. -
బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కి 'రహ్మాన్ డకాయత్' అడుగులు
‘ధురంధర్-1’లో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా పోషించిన రహ్మాన్ డకాయత్ పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పాత్రతో అక్షయ్‌కు ఊహించని స్థాయిలో క్రేజ్ వచ్చింది. దీంతో ఈ సీనియర్ నటుడు తన రెండో ఇన్నింగ్స్‌ను మరింత జోరుగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు.తాజా సమాచారం ప్రకారం.. టాలీవుడ్ నుంచి అక్షయ్ ఖన్నాకు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. అది దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి వచ్చిన ఆఫర్ అని సినీ వర్గాల్లో ఓ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. విక్టరీ వెంకటేశ్‌తో తీస్తున్న సినిమా సెట్స్‌పై ఉంది. అలాగే జూ.ఎన్టీఆర్ హీరోగా ఓ మైథలాజికల్ కథను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రెండిటిలో ఏదో ఒక సినిమా కోసం అక్షయ్ ఖన్నా పేరు పరిశీలనలో ఉందని సమాచారం.అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటిస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ.. టాలీవుడ్ ఎంట్రీ మాత్రం ఖచ్చితమని తెలుస్తోంది. ఎందుకంటే బాలీవుడ్ నటులు ఇప్పుడు టాలీవుడ్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సంజయ్ దత్, ఇమ్రాన్ హష్మి వంటి పలువురు నటులు ఇప్పటికే తెలుగు ప్రాజెక్టుల్లో నటించారు. మరికొందరు బాలీవుడ్ నటులు కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి అక్షయ్ ఖన్నా లాంటి ప్రతిభావంతుడైన నటుడిని టాలీవుడ్ వదులుకోదు. ఆయనకు మంచి పాత్రలు దక్కడం ఖాయం. -
'ముంబయిలో ఆడిషన్.. సౌత్ డైరెక్టర్ చాలా అసభ్యంగా..'
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం కొత్త కాదు. ఇండస్ట్రీలోకి వచ్చినవారిలో చాలామందికి దాదాపు ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ఈ విషయాన్ని కొందరు హీరోయిన్స్ బయటికి చెబుతుంటారు. మరికొందరు తమ బాధను చెప్పేందుకు భయపడుతూ ఉంటారు. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వ సాధారణమైపోయింది.తాజాగా మరో హీరోయిన్ తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. బాలీవుడ్ బ్యూటీ డైసీ షా తాను ఎదుర్కొన్న సంఘటనను వివరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ.. దక్షిణాది డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. కాస్టింగ్ సెషన్ జరుగుతున్నప్పుడు.. అనుచితంగా తన శరీరాన్ని తాకాడని వెల్లడించింది. ఆ సమయంలో తాను చాలా ఇబ్బందికి గురయ్యానని పేర్కొంది. ముంబయిలో జరిగిన క్యాస్టింగ్ మీట్లో ఈ సంఘటన జరిగిందని పంచుకుంది.డైసీ షా మాట్లాడుతూ..'దక్షిణాదికి చెందిన ఒక డైరెక్టర్ నన్ను చాలా అసభ్యంగా తాకారు. ఆయన కాస్టింగ్ కోసం ఓసారి ముంబైకి వచ్చారు. అతన్ని కలవడానికి ఆరు నుంచి ఏడుగురు అమ్మాయిలం వెళ్లాం. అక్కడ ఆయన మమ్మల్ని ఒక్కొక్కరిని విడివిడిగా కలుస్తున్నారు. అది నాకు నచ్చలేదు. ఆ సమయంలో నా శరీరాన్ని తాకారు.. నా చేయి కూడా పట్టుకున్నారు. నన్ను ఎవరైనా తాకితే చాలా భయంగా ఉంటుంది. అందుకే నేను మసాజ్ కూడా చేయించుకోను. ఒక మహిళ కూడా నన్ను తాకడం ఇష్టం లేదు. అదే ఒక పురుషుడు నన్ను తాకితే ఎలా ఉంటుంది. అందుకే నాకు అది నచ్చలేదు. ఆ తర్వాత అతనికి తిరిగి ఫోన్ చేస్తానని చెప్పా. కానీ చేయలేదు' అని వెల్లడించింది. అయితే ఆ డైరెక్టర్ ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.కాగా.. డైసీ షా.. సల్మాన్ ఖాన్ సరసన 'జై హో' (2014) చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'హేట్ స్టోరీ 3' (2015)లో కనిపించింది. మొదట కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య వద్ద సహాయకురాలిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. 'భద్ర', 'బాడీగార్డ్' వంటి చిత్రాలతో కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటనతో పాటు, డ్యాన్స్ రియాలిటీ షోలలో పాల్గొంది. పలు టెలివిజన్ కార్యక్రమాలలో కనిపించింది. ఇటీవలే 'రెడ్ రూమ్' అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం పలాష్ ముచ్చల్ దర్శకత్వంలో వస్తోన్న థ్రిల్లర్ మూవీలో డైసీ హీరోయిన్గా నటిస్తోంది. -
'దురంధర్-2 ఫెయిల్ కావడమే వాళ్లందరి కోరిక': కోహ్లీ సంచలన కామెంట్స్
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మార్చి 19న రిలీజైన ఈ సీక్వెల్ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతేడాది విడుదలైన దురంధర్‌కు కొనసాగింపుగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజైన 26 రోజుల్లోనే అరుదైన ఘనత సాధించింది. రెండు పార్ట్లు కలిపి రూ.3 వేల కోట్లు సాధించిన మొదటి చిత్రంగా అరుదైన రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1712 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.తాజాగా ఈ మూవీ గురించి బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లీ మాట్లాడారు. ధురందర్: ది రివెంజ్ ఫెయిల్ అవ్వాలని ఇండస్ట్రీలో చాలామంది కోరుకున్నారని వెల్లడించారు. అలా కోరుకున్న వారిలో స్టార్ డైరెక్టర్స్ సైతం ఉన్నారని కునాల్ కోహ్లా సంచలన కామెంట్స్ చేశారు. దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద తొలి వారాంతమే ఫెయిల్ అవుతుందని ఊహల్లో తేలియాడారని అన్నారు. కానీ వారి అంచనాలకు విరుద్ధంగా ఈ మూవీ రాణించిందని పంచుకున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి రోజు నుంచే వసూళ్ల వేటతో అదరగొట్టేసింది. మొదటి వారంలోనే బాక్సాఫీస్ వెయ్యి కోట్లు వసూళ్లు చేసి సత్తా చాటింది.కునాల్ కోహ్లీ మాట్లాడుతూ..'బాలీవుడ్ పరిశ్రమ మొత్తం సినిమాకు మద్దతు ఇవ్వకపోయినా ఆడుతోంది. ధురందర్‌కు బాలీవుడ్లో ఎవరూ కూడా మద్దతు ఇవ్వలేదు. అగ్రశ్రేణి దర్శకులు సైతం ఫెయిల్ అవ్వాలని కోరుకున్నారు. మొదటి సోమవారం నుంచే దురంధర్-2 ప్రదర్శన ఆగిపోతుందని అంచనా వేశారు. కానీ వారి అంచనాలకు భిన్నంగా సోమవారం నుంచే వసూళ్లపరంగా మరింత దూసుకెళ్లింది. సన్నీ డియోల్ నటించిన 'బోర్డర్ 2' విషయంలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ మూవీ ఫ్లాప్ అవుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ.. రూ. 300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. బోర్డర్- 2కు సైతం ఎవరూ మద్దతు ఇవ్వలేదు. కానీ అది బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇండస్ట్రీ మీకు మద్దతు ఇస్తుందా లేదా అనేది ఇక్కడ ముఖ్యం కాదు" అన్నారు.అలాగే ఎవరీ మద్దతు లేకపోయినా తన 'హమ్ తుమ్' (2004) మూవీ కమర్షియల్‌గా సక్సెస్ అయిందన్నారు. ఈ చిత్రంతో తనకు ఎదురైన అనుభవాన్ని కోహ్లీ గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలోని వారు నా చిత్రాన్ని మెచ్చుకునే అవకాశం లేదని.. ప్రీమియర్ షో హాజరుకావద్దని ఆదిత్య చోప్రా తనకు సలహా ఇచ్చారని ఆయన పంచుకున్నారు. కానీ సినిమాకు నేను వెళ్లానని.. అక్కడ వచ్చిన స్పందన తనను తీవ్రంగా నిరాశపరిచిందన్నారు.. చాలా నిరాశతో ఆదిత్య చోప్రాకు ఫోన్ చేశా.. ఇది వాళ్లకు నచ్చే రకం సినిమా కాదని నాకు తెలుసు.. అందుకే నిన్ను వెళ్లవద్దని చెప్పానని అన్నాడు. అంటే పరిశ్రమలోని 99 శాతం మంది మీరు విజయం సాధించాలని కోరుకోరని కునాల్ కోహ్లీ స్పష్టం చేశారు. తన తొలి చిత్రం 'ముఝ్సే దోస్తీ కరోగే!' (2002) సరిగ్గా ఆడకపోయినప్పటికీ.. స్వయంగా ఫోన్ చేసి అభినందించిన రాకేష్ రోషన్‌ను కోహ్లీ ప్రశంసించారు. -
టాక్సిక్ గ్యాంగ్‌స్టర్ సినిమా కాదు.. యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. టీజర్ చూసిన తర్వాత అందరూ ఇది కూడా కేజీయఫ్‌లో ఓ గ్యాంగ్‌స్టర్ కథ అని ఫిక్స్ అయ్యారు. కానీ ఇది అలాంటి కథ కానే కాదు అంటున్నాడు హీరో యశ్. ఇంతవరకు ఇలాంటి కథాంశంతో ఒక్క చిత్రం కూడా రాలేదని..ఇదొక డిఫరెంట్ జోనర్ మూవీ అంటున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో టాక్సిక్ సినిమా గురించి మాట్లాడారు. ‘టీజర్ రిలీజ్ తర్వాత అందరూ ఇది గ్యాంగ్‌స్టర్ కథ అంటున్నారు. కానీ పదేపదే చెబుతున్నా.. ఇది గ్యాంగ్‌స్టర్ సినిమా కాదు. యాక్షన్ మాత్రమే కాదు బలమైన ఎమోషన్స్ ఉంటాయి. కొత్త కాన్సెప్ట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. సినిమాకు వచ్చిన ప్రేక్షకుడు కొత్త ప్రపంచంలోకి వెళతాడు. విజువల్స్ ఆకట్టుకుంటాయి. అలాగే నా నుంచి అభిమానులు కోరుకుంటున్న అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. ప్రతి చిన్న విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కచ్చితంగా ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు. అలాగే యశ్ రావణుడిగా, రణ్‌బీర్ రాముడిగా కలిసి నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘తొలిభాగంలో రణ్‌బీర్‌తో నాకు ఎలాంటి సన్నివేశాలు లేవు. కానీ ఇద్దరం పలుమార్లు కలుసుకున్నాం. రణ్‌బీర్ ఓ అద్భుతమైన నటుడు. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. అది ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది’అన్నారు. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ ఏడాది దీపావళికి తొలి భాగం విడుదల కానుంది. -
అదేం పెద్ద సమస్య కాదు.. 'రామాయణ'పై యష్ కామెంట్స్
భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు రామాయణాన్ని ఆధారంగా చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే అవన్నీ కూడా పరిమిత బడ్జెట్‌తో తీశారు. కానీ రూ.4000 కోట్ల బడ్జెట్‌తో తాము రామాయణాన్ని తీస్తున్నామని నిర్మాత నమిత్ మల్హోత్రా చెప్పేసరికి అంతా షాకయ్యారు. కానీ కొన్నిరోజుల క్రితం రాముడి పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేయగా.. చెప్పిన బడ్జెట్‌కి చూపించిన విజువల్‌కి అస్సలు సంబంధం లేదే అనే కామెంట్స్ వినిపించాయి. ఆ విషయాలన్నీ పక్కనబెడితే ఇందులోనే రావణుడిగా చేస్తున్న యష్.. ఇప్పుడు మరిన్ని ఆసక్తికర సంగతులు బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'రామాయణ'లో రావణుడిగా నటిస్తున్న యష్.. ఈ చిత్రం నిర్మాణంలోనూ భాగమయ్యాడు. తాజాగా అమెరికాలో జరుగుతున్న కామికాన్ ఈవెంట్‌కి నిర్మాత నమిత్ మల్హోత్రాతో కలిసి హాజరయ్యాడు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ మూవీ గురించి చెప్పుకొచ్చాడు. రణ్‌బీర్ కపూర్, తనకు మధ్య తొలి భాగంలో సీన్స్ ఏం లేవని క్లారిటీ ఇచ్చాడు. అంటే రాముడు-రావణుడి మొదటి భాగంలో అస్సలు కలిసే అవకాశం లేదు.కలిసి సీన్స్ లేనప్పటికీ రణ్‌బీర్ కపూర్‌ని తాను పలుమార్లు కలిశానని చెప్పిన యష్.. అతడు ఓ అద్భుతమైన నటుడు అని ప్రశంసించాడు. తమ ఆలోచనలు కలిశాయని, కాబట్టి తామిద్దరి కెమిస్ట్రీ అనేది పెద్ద సమస్య కాదని యష్ అన్నాడు. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీతగా సాయిపల్లవి చేస్తోంది. ఈ ఏడాది దీపావళికి తొలి భాగాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. కానీ చెప్పిన టైంకి వస్తారా లేదంటే అన్ని పాన్ ఇండియా సినిమాల్లానే వాయిదా వేస్తారా అనేది చూడాలి?యష్ చెప్పిన దానిబట్టి చూస్తుంటే 'రామాయణ' తొలి భాగంలో రాముడి, అతడి రాజ్యానికి సంబంధించిన సీన్స్.. మరోవైపు రావణుడు, అతడి రాజ్యానికి సంబంధించిన సన్నివేశాలు చూపించనున్నారు. బహుశా రాముడు, సీత వనవాసానికి వచ్చే ఎపిసోడ్‌తో తొలి భాగాన్ని ముగిస్తారేమో అనిపిస్తుంది. రాముడు-రావణుడి మధ్య వైరం, యుద్ధం తదితర అంశాలన్ని సీక్వెల్లో చూపించనున్నట్లు తెలుస్తోంది. సీక్వెల్‌ని వచ్చే ఏడాది దీపావళికి థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్లాన్.(ఇదీ చదవండి: పేరు వాడుకోవాలంటే రూ.112 కోట్లు ఇవ్వమన్నారు)#Yash confirms he and #RanbirKapoor won’t share screen space in #Ramayana Part 1.He praised Ranbir as a brilliant actor and said their vision matches, so chemistry won’t be an issue. 🔥 pic.twitter.com/g4PSkHzBjw— Filmyscoops (@Filmyscoopss) April 15, 2026 -
జూ. ఎన్టీఆర్ 'డ్రాగన్' రూమర్స్‌కు చెక్ పెడతారా?
జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం 'డ్రాగన్'పై ఊహాగానాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సినిమా టైటిల్ నుంచి మొదలుకొని దాని కథ, షూటింగ్ షెడ్యూల్, నటీనటులు, ఇలా ఏ అంశంపై కూడా స్పష్టత లేకపోవడంతో అభిమానులు, సినీ వర్గాలు చర్చల్లో మునిగిపోయాయి. అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు వాయిదా పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఒక దశలో కథనే పూర్తిగా మార్చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ అనిశ్చితి మధ్య ఎన్టీఆర్ బాడీ బిల్డింగ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే దానిపై కూడా విమర్శలు చెలరేగాయి.ఇటీవలే మళయాళ నటుడు టొవినో థామస్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సంగతి అధికారికంగా బయటపడింది. అతడు ఎన్టీఆర్ సోదరుడి పాత్ర చేయాల్సిందని సమాచారం. అయితే తాజాగా ఆ పాత్ర కోసం బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌ను సంప్రదిస్తున్నారనే కథనాలు వస్తున్నాయి. సినిమాలో మరో కీలక పాత్ర కోసం ఆలియా భట్‌ను కూడా సంప్రదించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్-ఆలియా మధ్య ఓ పాట కూడా ఉంటుందనే ప్రచారం ఉంది. ఈ సినిమాను 'గోల్డెన్ ట్రయాంగిల్' నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. థాయ్‌లాండ్, మయన్మార్, లావోస్ కలిసే ప్రాంతాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఒకప్పుడు ఇది మాదకద్రవ్యాల ఉత్పత్తికి అతిపెద్ద కేంద్రం. ఈ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని 'డ్రాగన్' వస్తోందని అంటున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినిమా అప్డేట్స్ వస్తాయని ప్రచారం జరుగుతోంది. టీజర్ వస్తుందనే మాటలు వినిపిస్తున్నా, అభిమానులు మాత్రం టీజర్ సంగతి పక్కనపెడితే, కనీసం టైటిల్, రిలీజ్ డేట్ చెప్పండి చాలు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. డ్రాగన్ చుట్టూ నడుస్తున్న ఊహాగానాలు, ప్రచారాల్లో కొన్నింటికి వచ్చే నెలలో తెరపడే అవకాశం ఉంది. ఎన్టీఆర్ బర్త్‌డే కానుకగా సినిమా టైటిల్, రిలీజ్ డేట్ లేదా టీజర్ రూపంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
దురంధర్ ఫ్రాంచైజీ.. ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కాని రికార్డ్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మార్చి 19న రిలీజైన ఈ సీక్వెల్ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతేడాది విడుదలైన దురంధర్‌కు కొనసాగింపుగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజైన 26 రోజుల్లోనే అరుదైన ఘనత సాధించింది. రెండు పార్ట్లు కలిపి రూ.3 వేల కోట్లు సాధించిన మొదటి చిత్రంగా అరుదైన రికార్డ్ సృష్టించింది.ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1712 కోట్లకు పైగా వసూళ్లతో ఇంకా రాణిస్తోంది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన దురంధర్ చిత్రాలు కలెక్షన్స్ రికార్డ్ సృష్టించాయి. ఈ రెండు సినిమాలు కలిపి బాహుబలి-2, పుష్ప-2 ఆల్‌టైమ్ కలెక్షన్స్‌ను దాటేశాయి. దురంధర్, దురంధర్-2 కలిపి బాక్సాఫీస్ వద్ద రూ.3 వేల కోట్ల మార్క్ సాధించాయి.గతేడాది డిసెంబర్ 5న విడుదలైన దురంధర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1,307.35 కోట్లు రాబట్టింది. ఈ ఏడాది మార్చి 19న రిలీజైన దురంధర్ ది రివెంజ్ కేవలం 26 రోజుల్లోనే రూ. 1,712 కోట్లు వసూలు చేసింది. ఈ రెండు చిత్రాల వసూళ్లను కలిపితే రూ. 3,019.35 కోట్లతో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాయి.గతంలో వచ్చిన టాలీవుడ్ బాహుబలి, పుష్ప సిరీస్ చిత్రాల మొత్తం వసూళ్లను దురంధర్ ఫ్రాంచైజీ ఎప్పుడో దాటేసింది. బాహుబలి పార్ట్-1కు రూ.650 కోట్లు రాగా.. బాహుబలి 2: రూ. 1,788 కోట్లు రాగా.. ఈ రెండు సినిమాల కలెక్షన్స్ రూ. 2,438 కోట్లుగా ఉంది. ఇక అల్లు అర్జున్ పుష్ప చిత్రాల విషయానికొస్తే పార్ట్-1 రూ. 350.10 కోట్లు రాబట్టగా.. పుష్ప 2: ది రూల్ మూవీ రూ. 1,742.10 కోట్ల సాధించింది. ఈ రెండు సినిమాల మొత్తం రూ. 2,092.20 కోట్లు వచ్చాయి.ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా రూ. 3,000 కోట్ల మార్క్ దాటలేదు. ఈ విషయంలో దురంధర్ ఫ్రాంచైజీ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా 'ధురంధర్' సిరీస్‌లోని రెండు చిత్రాలు కూడా రూ. 1,000 కోట్ల క్లబ్లో చేరిన మొట్ట మొదటి ఇండియన్ ఫ్రాంచైజీగా నిలిచింది. మూడు నెలల గ్యాప్‌లోనే రిలీజైన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించాయి. మూడు వేల కోట్ల మార్క్‌తో సరికొత్త ఒరవడికి నాంది పలికాయి. మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన ధురంధర్: ది రివెంజ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి రాణిస్తోంది. చైనా, గల్ఫ్ దేశాల్లాంటి అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల కాకుండానే ఈ గణాంకాలను సాధించడం దురంధర్కే సాధ్యమైంది. ఈ లెక్కన భారతీయ సినిమా ముఖ చిత్రాన్ని దురంధర్ మార్చేసింని చెప్పొచ్చు. సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన దురంధర్ పేరు బాక్సాఫీస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. -
ఆ హీరోయిన్ ఇంటికొస్తే.. నా కొడుకు భయపడేవాడు: అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇప్పుడు తన కొత్త సినిమా ‘భూత్ బంగ్లా’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన కొడుకు ఆరవ్ కుమార్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. భూల్ భులయ్య సినిమా చూసి..ఆరేళ్ల పాటు విద్యాబాలన్‌కి దూరంగా ఉన్నాడని..ఆమె ఇంటికి వస్తే భయపడిపోయేవాడని చెప్పాడు.మంజులిక అనుకొని.. 2007లో విడుదలైన భూల్ భులయ్య సినిమా నా కొడుకుపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ సినిమా చూసిన తర్వాత ఆరేళ్ల పాటు అందులో నటించిన విద్యాబాలన్‌ని చూసి భయపడిపోయాడు. ఆమె మా ఇంటికి వచ్చినప్పుడల్లా..భయంతో వణికిపోయేవాడు. ఆమె కళ్లల్లోకి చూసేవాడు కాదు. అతను ఆమెలో మంజులిక(భూల్ భులయ్యలో విద్యాబాలన్ పోషించిన పాత్ర పేరు) చూసేవాడు. అందుకే ఆమె వస్తుందంటే భయంతో పారిపోయేవాడు. నేనే అతన్ని ఓదార్చి.. ఆమె మంజులిక కాదని, విద్యాబాలన్ అని..మంచి అమ్మాయి అని చెప్పాల్సి వచ్చింది. అయినా కూడా ఆరేళ్ల పాటు నమ్మలేకపోయాడు’ అని అక్షయ్ అన్నారు.అదే తేడాభూత్ బంగ్లా, భూల్ భులయ్యా చిత్రాల మధ్య తేడాలను వివరిస్తూ.. 'భూత్ బంగ్లా' ఒక హారర్ ఫాంటసీ; ఇది ఒక డిస్నీ సినిమా లాంటిది. 'భూల్ భులయ్యా' ఒక సైకలాజికల్ థ్రిల్లర్. అది మొదలైనప్పుడు, ఆమె దెయ్యం పట్టినట్లు కనిపిస్తుంది, కానీ తర్వాత అది ఒక మానసిక సమస్య అని తెలుస్తుంది. 'భూత్ బంగ్లా'లో , వధుసూర్(రాక్షసుడు) ఎలా వచ్చాడో, అతను ఎందుకు అలా చేస్తున్నాడో మేము వివరించాం. ఈ సినిమా చూసి పిల్లలను కూడా ఎంజాయ్ చేస్తారు’ అని అక్షయ్ చెప్పుకొచ్చాడు. -
మృణాల్ కొత్త సినిమా.. 'ఏఐ'తో ఫస్ట్ లుక్ టీజర్
రీసెంట్ టైంలో భారీ బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాల నుంచి ప్రమోషనల్ కంటెంట్ ఏమైనా రిలీజ్ అయిందంటే చాలు.. తమ చిత్రంలో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ)ని ఉపయోగించలేదని హీరోలు చెప్పుకోవాల్సిన పరిస్థితి. అయితే అవసరాన్ని బట్టి ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తన కొత్త మూవీ కోసం ఏఐని అధికారికంగా వాడేశాడు. తాజాగా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయగా అందులో ఈ టెక్నాలజీతో చేసిన ఔట్పుట్ దర్శనమిచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ ఠాకుర్ జంటగా నటించిన లేటెస్ట్ హిందీ సినిమా 'హే జవానీ తో ఇష్క్ హోనా హై'. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లని ప్రేమించే వ్యక్తిగా హీరో కనిపిస్తాడు. సదరు హీరోయిన్లకు పుట్టిన పిల్లలిద్దరూ మాట్లాడుకునే సీన్స్ అన్ని ఏఐలో సృష్టించారు. వాటినే తాజాగా వదిలిన ఫస్ట్ లుక్ టీజర్ వీడియోలో చూపించారు. ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మరిన్ని హిందీ, తెలుగు, పాన్ ఇండియా చిత్రాల్లో ఈ టెక్నాలజీని అధికారికంగానే ఉపయోగించేయనున్నారు.(ఇదీ చదవండి: కుమారస్వామి కథతో ఎన్టీఆర్ సినిమా.. టైటిల్ ఫిక్సయిందా?) -
'భర్త పోయాక మొదటి మ్యారేజ్ డే'.. ప్రముఖ నటి ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియా కపూర్ తన తొమ్మిదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన భర్త, వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను గుర్తు చేసుకుంది. ఆయన మరణించిన తర్వాత వచ్చిన మొదటి వివాహా వార్షికోత్సవం కావడంతో భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా తన పెళ్లి ఫోటోలతో పాటు ఓ లేఖను ఆమె పంచుకున్నారు. తమ బంధం ఇప్పటికీ కూడా కొనసాగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పంజాబీ సాంప్రదాయంలో జరిగిన తమ వివాహానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఆ సంతోషకరమైన రోజులను గుర్తు చేసుకున్నారు.ప్రియా కపూర్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'హ్యాపీ యానివర్సరీ జే . గతేడాది మన 8వ వార్షికోత్సవాన్ని నీ స్నేహితులతో కలిసి జరుపుకున్నాం. ఆ వేడుక చాలా సందడిగా, ఆత్మీయంగా, నవ్వులతో నిండిపోయింది. నువ్వు నా వైపు చూసి, మనం రాబోయే 7 జన్మల పాటు కలిసి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పావు. ఆ మాటకు నేను కట్టుబడి ఉంటా. మన ఏడ వార్షికోత్సవం రోజు నువ్వు నా కోసం అందమైన లేఖ రాశావు. అత్యంత అమూల్యమైన బహుమతి. అందులోని ప్రతి పదాన్ని నేను నా హృదయంలో పదిలపరుచుకున్నా. నువ్వు కేవలం నా భర్తవి మాత్రమే కాదు. నువ్వు నా ఆత్మబంధువువి. నా హృదయ స్పందనవి. నిన్ను ప్రేమించడం అనేది నాకు తెలిసినంతలో అత్యంత సులభమైన విషయం. నువ్వు సాధారణమైనదాన్ని కూడా అద్భుతంగా మార్చావు.' అంటూ రాసుకొచ్చింది.నటి ప్రియా సచ్దేవ్ కపూర్ తన లేఖను అత్యంత భావోద్వేగంగా రాసుకొచ్చారు. సంజయ్ కపూర్ కేవలం తన గతం మాత్రమే కాదని.. తన భవిష్యత్తులో కూడా ఒక భాగమని ఆమె తెలిపారు. మా కథ ఇంకా ముగియలేదని.. మాబంధం శాశ్వతమైనదని కూడా ఆమె పేర్కొన్నారు. మనం అనేక జన్మల పాటు కలిసి ఉంటామని అతను ఇచ్చిన వాగ్దానాన్ని ప్రియా గుర్తుచేసుకున్నారు. ఆ క్షణాలన్నీ తిరిగి తీసుకువస్తే.. మళ్లీ నీతోనే జీవిస్తానని ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.కాగా.. జూన్ 12, 2025న, ఇంగ్లాండ్‌లో ఒక పోలో మ్యాచ్ ఆడుతుండగా సంజయ్ కపూర్ మరణించారు. ఆయన 2017లో ప్రియ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి అజారియస్ అనే కుమారుడు ఉన్నాడు. అంతకుముందు సంజయ్‌కు కరిష్మా కపూర్‌తో గతంలో జరిగిన వివాహం జరిగింది. వీరిద్దరికి సమైరా, కియాన్ అనే పిల్లలు ఉన్నారు. View this post on Instagram A post shared by Priya S Kapur (@priyasunjaykapur) -
అతియా శెట్టి చిన్న మిస్టేక్.. నెటిజన్ల దారుణ ట్రోల్స్..!
బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టికి చేదు అనుభవం ఎదురైంది. ప్రముఖ సింగర్ ఆశా భోస్లే మృతికి ఆమె సంతాపం ప్రకటించారు. అయితే అతియా చేసిన చిన్న పొరపాటుతో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు. ఆశా భోస్లే మృతికి సంతాపం తెలుపిన అతియా.. పొరపాటున లతా మంగేష్కర్ ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు. అది పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే అతియా శెట్టిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి.ఆ తర్వాత తన పొరపాటును గుర్తించిన అతియాశెట్టి.. వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. గాయని ఆశా భోస్లే ఫోటోను మరోసారి సంతాపం ప్రకటిస్తూ షేర్ చేశారు. ఆ పోస్ట్ తొలగించినప్పటికీ అప్పటికే స్క్రీన్షాట్లు సోషల్ మీడియా విపరీతంగా వ్యాపించాయి. దీంతో అతియాపై పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అతియా శెట్టికి అందం ఉంది.. కానీ తెలివి లేదు అంటూ ఓ నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు.నెపో కిడ్స్ కష్టపడకుండానే ఎలాగోలా ఫేమస్ అవ్వాలని చూస్తారు.. అందుకే వారి సినిమాలు ఫ్లాప్ అవుతాయి.. అందుకే వారు ఇలాంటి ఘోరాలు చేస్తారని కామెంట్ చేశాడు. అతియా శెట్టికి పిచ్చి పట్టింది.. అందుకే ఆశా భోస్లే ఫోటోకు బదులుగా లతా మంగేష్కర్ ఫోటోను అప్లోడ్ చేసిందని మరో నెటిజన్ ట్రోల్ చేశాడు. అయితే తనపై వచ్చిన ట్రోల్స్‌పై అతియా శెట్టి మాత్రం స్పందించలేదు. చిన్న పొరపాటుపై ఇలా ట్రోల్స్ చేయడమేంటని మరికొందరు అతియాకు మద్దతుగా నిలుస్తున్నారు.కాగా.. ఆదివారం ఏప్రిల్ 12న లెజెండరి సింగర్ ఆశా భోస్లే(92) తుదిశ్వాస విడిచారు. శనివారం ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆమె కన్నుమూశారు. చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. ఆమె మరణం పట్ల బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. Athiya Shetty gone mad She uploaded a picture of Lata Mangeshkar instead of Asha Bhosle. 😭 pic.twitter.com/bKCZPBAjjG— Mohit (@Warlockmohit) April 12, 2026 Athiya Shetty Is Beauty Without Brains She posted a story with photo of Late Lata Mangeshkar instead of Late Asha Bhosle.Nepo kids just want to be relevant somehow, without hardwork or struggle and that's why their movies flop and they make such blunders. https://t.co/hy3KvJwUUo pic.twitter.com/4TXjZ0SJJ3— Vidhi (@vidhisharmx) April 12, 2026 -
రిషబ్శెట్టికి జోడీగా తెరంగేట్రం : ఆశా వారసురాలి గురించి తెలుసా?
ప్రముఖ గాయని ఆశా భోంస్లే (Asha Bhosle) అనారోగ్య కారణాలతో 92 ఏళ్ల వయసులో (ఏప్రిల్ 12, 2026న) కన్నుమూశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆమె అభిమానులు, సంగీతాభిమానులు శోక సంద్రంలో ముగినిపోయారు. ఆమె పార్థివ దేహాన్ని దర్శించి , తుది నివాళులర్పించేందుకు వేలాదిగా అభిమానులు ముంబైలోని లోయర్ పరేల్‌లో ఉన్న ఆమె నివాసం 'కాసా గ్రాండే'కు తరలి వచ్చారు. వీరితోపాటు, ప్రధాని మోదీ సహా, పలువురు రాజకీయ, సినీ రంగాలప్రతినిధులు, ఇతర సెలబ్రిటీలు ఆశామరణంపై తీవ్ర సంతాపం ప్రకటించారు. ఈ సందర్బంగా ఆమె వారసురాలు, గాయని జానై భోంస్లే (Zanai Bhosle) వార్తల్లోనిలిచారు. భారతీయ సినీ సంగీత దిగ్గజం ఆశా భోంస్లే మనవరాలు జానై భోంస్లే. తన నాన్నమ్మలా ఈమె గాయని మాత్రమే కాదు, శిక్షణ పొందిన కథక్ నర్తకి , రచయిత్రి, నటి కూడా. ఈమె ఆశా భోంస్లే కుమారుడు ఆనంద్ భోంస్లే కుమార్తె. ఆమె లెజెండరీ గాయని లతా మంగేష్కర్ మేనకోడలు కూడా. ముంబైలోని ప్రముఖ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించారు. సంగీతం , కళల పట్ల ఆమెకు చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉంది. ఇదీ చదవండి: రిక్షా డ్రైవర్ కొడుకు, అమెరికాలో టెకీ, అంతలోనే విషాదంనాయనమ్మ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జానై శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. గాయనిగా రాణించారు. వివిధ స్టేజ్ షోలలో తన నాయనమ్మ ఆశా భోంస్లేతో కలిసి ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ మ్యూజిక్ బ్యాండ్ "6-ప్యాక్ బ్యాండ్" (6-Pack Band) లో పాటలు పాడారు. 2022 సెప్టెంబర్ 8న, ఆశా 89వ పుట్టినరోజు సందర్భంగా జానై భోస్లే, మంచి కవితను పోస్ట్ చేశారు.సినిమా రంగ ప్రవేశంజానై భోంస్లే త్వరలోనే వెండితెరపై మెరవనున్నారు. రిషబ్ శెట్టి సరసన బాలీవుడ్లో అరంగేట్రం చేయనుంది. "ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్" (The Pride of Bharat: Chhatrapati Shivaji Maharaj) అనే భారీ పీరియడ్ డ్రామాతో సినిమా రంగ ప్రవేశం చేస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ఛత్రపతి శివాజీ మహారాజ్ భార్య రాణి సాయి భోంస్లే పాత్రను పోషిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సందీప్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.వ్యాపారవేత్తగాసోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే జునై గాయనిగా, నటి మాత్రమే కాదు. వ్యాపారవేత్త కూడా. ముంబైలో ఆమెకు సొంతంగా యాపిల్ ఐఫోన్ (Apple iPhone) రిటైల్ స్టోర్ ఉంది, ఆశా భోంస్లే స్వయంగా తన మనవరాలి గురించి చాలా సార్లు ప్రస్తావించేవారు. జునై చాలా ప్రతిభావంతురాలని, కష్టపడే తత్వం ఉన్న అమ్మాయి అని పలు సందర్భాల్లో ప్రశంసించారు.సిరాజ్‌తో షికార్లు అంటూ పుకార్లు2025 ప్రారంభంలో జానై భోస్లే, క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌ల మధ్య ఉన్న సంబంధం గురించిన పుకార్లు షికార్లు చేశాయి. అయితే, రక్షాబంధన్ రోజున సిరాజ్‌కు రాఖీ కట్టిన వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ ఈ పుకార్లకు ఇద్దరూ చెక్ పెట్టారు. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal)దివంగత ఆశాకు కడసారి నివాళి అర్పించేందుకు క్రికెటర్ సిరాజ్ ముంబైలోని ఆమె నివాసానికి వచ్చారు. సిరాజ్‌ను చూడగానే జానై భోస్లే భోరున విలపించింది. సిరాజ్ ఆమెను ఓదారుస్తూ అక్కున చేర్చుకోవడం విశేషం. -
ఆశా భోస్లే మరణం.. ఆమె ఆస్తులు ఎన్ని కోట్లంటే?
లెజెండరి సింగర్ ఆశా భోస్లే(92) తుదిశ్వాస విడిచారు. శనివారం ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరిన ఆమె ఇవాళ కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు జానై భోస్లే తెలిపారు. ఆమె మరణం పట్ల బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఆమె మరణం వేళ ఆశా సింగర్‌గా ఎంత సంపాందించారన్న విషయంపై బాలీవుడ్లో చర్చ నడుస్తోంది. 92 ఏళ్ల వయసులో కన్నుమూసిన దిగ్గజ గాయని ఆశా భోస్లే ఆస్తులు దాదాపు రూ.200 నుంచి రూ.250 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పలు అంతర్జాతీయ వేదికలపై తన గాత్రాన్ని వినిపించిన ఆమె బాగానే సంపాదించారు. అంతే కాకుండా ఆమె సొంత రెస్టారెంట్‌ను ఆశాస్ పేరుతో ప్రారంభించారు. ఇది దుబాయ్, కువైట్, బహ్రెయిన్ దేశాలతో పాటు యూకేలోని బర్మింగ్‌హామ్, మాంచెస్టర్ వంటి నగరాల్లో విస్తరించింది. ఆశా భోస్లే తన డబ్బును రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడులు పెట్టారు. తాజా నివేదికల ప్రకారం కేవలం ముంబై, పూణేలలోని విలాసవంతమైన గృహాలతో పాటు ఆమె ఆస్తుల విలువ రూ.80 -రూ.100 కోట్ల మధ్య ఉన్నట్లు సమాచారం. -
చరణ్ సినిమా.. ఆదిత్య ధర్–భన్సాలీ పేర్ల హడావిడి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లైనప్‌పై బాలీవుడ్ నుంచి వరుసగా లీకులు వస్తున్నాయి. ఇప్పటివరకు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉందనే క్లారిటీ ఉండగా, తాజాగా ఆదిత్య ధర్ – సంజయ్ లీలా భన్సాలీ పేర్లు వినిపించడం ఆసక్తికరంగా మారింది. ధురంధర్-2 వంటి సూపర్ హిట్ తర్వాత ఆదిత్య ధర్ ఒక మల్టీస్టారర్ కథను సిద్ధం చేస్తున్నాడని, అందులో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కథ చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. అయితే ఇప్పుడు చరణ్ పేరు మరోసారి తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ – చరణ్ కాంబోపై కూడా వార్తలు వస్తున్నాయి. అటవీ నేపథ్యంలో హిస్టారికల్ అడ్వెంచర్ కథను భన్సాలీ తెరకెక్కించే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. గతంలో ‘మహారాజా సుహేల్ దేవ్’ అనే ప్రాజెక్ట్‌పై వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అయితే అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోపై చర్చ మొదలవడంతో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే దర్శకుడు సుకుమార్, చరణ్‌తో చేయాల్సిన సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం వల్లే ఈ గాసిప్పులు ఎక్కువయ్యాయి. చరణ్ బర్త్‌డే సందర్భంగా ఏదైనా ప్రకటన వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దాంతో బాలీవుడ్ వైపు నుంచి వరుసగా ఇలాంటి లీకులు వస్తున్నాయి. -
ధురంధర్ నటుడికి రూ.1 కోటి? అసలు నిజమిదే!
గత ఐదు నెలలుగా 'ధురంధర్' సినిమా పేరు మారుమోగిపోతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ బ్లాక్‌బస్టర్ కాగా రెండో భాగం అంతకు మించిన ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద పారిస్తోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులందరికీ మంచి గుర్తింపు లభించింది.రూ.1 కోటి రెమ్యునరేషన్ఈ క్రమంలో 'ధురంధర్'లో హైజాకర్ జహూర్ మిస్త్రీగా యాక్ట్ చేసిన నటుడు వివేక్ సిన్హ గురించి ఓ వార్త వైరలవుతోంది. అతడు ఈ చిత్రానికిగానూ ఏకంగా రూ.1 కోటి పారితోషికం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్‌పై తాజాగా వివేక్ సిన్హ స్పందించాడు. 'తమ్ముళ్లూ.. నాకు రూ.60 లక్షలు, రూ.80 లక్షలు, ఏకంగా రూ.1 కోటి ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. ఒట్టేసి చెప్తున్నా, నాకంత డబ్బు ఇవ్వలేదు. అనవసరంగా ఏదేదో ప్రచారం చేయకండి.ఎప్పుడో ఖర్చయిందిఅలా అని నాకు మొత్తానికే డబ్బు ఇవ్వలేదని కాదు. నేను అనుకున్నంత పారితోషికం ఇచ్చారు. కానీ మీరనుకునేంత కాదు. నాకు ఇచ్చినదంతా ఎప్పుడో ఖర్చు పెట్టేశాను కూడా! నేను ముంబైలో ఉంటాను కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువే.. కాబట్టి ఎవరికీ సాయం చేసే పరిస్థితిలో నేను లేను. నాకు ఇలాగే మంచి అవకాశాలు రావాలని కోరుకోండి. అప్పుడు నేను బాగా సంపాదించగలను.. మీకు తిరిగి సాయం చేయగలను' అని వివేక్ సిన్హ తెలిపాడు. View this post on Instagram A post shared by vivek sinha (ज़हूर मिस्त्री) (@viveksinhaactor)చదవండి: సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బూతు కంటెంట్? క్లారిటీ ఇచ్చిన నటి -
భర్తతో విడాకులు.. అందుకే భరణం వదులుకున్నా: బుల్లితెర నటి
ప్రముఖ బాలీవుడ్ నటి డెల్నాజ్ ఇరానీ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. హిందీలో పలు సీరియల్స్‌తో పాటు మూవీస్‌లో మెప్పించిన నటి వైవాహిక బంధం, విడాకులపై నోరు విప్పారు. తన భర్త రాజీవ్ పాల్‌తో విడాకుల సమయంలో తాను భరణం కంటే మనశ్శాంతికే ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. అందుకే తనకు డివోర్స్ తర్వాత ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని ఆమె వెల్లడించారు. తాజాగా 'ది మేల్ ఫెమినిస్ట్' కార్యక్రమానికి హాజరైన ఈ విషయాన్ని పంచుకున్నారు.తన విడాకుల వ్యవహారం చాలా కష్టంగా సాగిందని డెల్నాజ్ ఇరానీ తెలిపారు. పార్సీ కుటుంబం నుంచి వచ్చిన తాను మొదట్లో విడిపోవాలని అస్సలు అనుకోలేదని చెప్పింది. ఆ తర్వాత ఒకరినొకరు తేలికగా తీసుకోవడంతోనే మా బంధం విచ్ఛిన్నమైందని పంచుకుంది. వ్యక్తిగత సవాళ్ల వల్ల నా పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందన్నారు. అదే సమయంలో నా తండ్రి గుండెపోటుకు గురై మరుసటి ఏడాదే మరణించారని తెలిపింది.మాలో ఒకరు విడాకుల కోసం ఒత్తిడి చేయగా.. మరొకరు పూర్తిగా సిద్ధంగా లేరని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ నేను ఎలాంటి భరణం కోరకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నానని వెల్లడించింది. వివాదాల కంటే శాంతినే కోరుకున్నా.. స్వతంత్రంగా తన జీవితాన్ని మళ్లీ జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నానని ఆమె స్పష్టం చేశారు.కాగా.. డెల్నాజ్, రాజీవ్ 1993లో 'పరివర్తన్' సీరియల్ సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు 1998లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దశాబ్దానికి పైగా సాగిన తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతూ 2010లో వారు విడిపోతున్నట్లు ప్రకటించారు. 2012లో ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే విడాకులు తీసుకున్న కొద్దికాలానికే ఇద్దరు కలిసి బిగ్ బాస్ షోలో కనిపించారు. ప్రస్తుతం నటి డెల్నాజ్.. డీజే పెర్సీ కర్కారియా అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నారు. ఇటీవలే వీరిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. -
దురంధర్-2 వసూళ్లు.. 22 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 హవా ఇంకా కొనసాగుతోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా మూడు వారాలైనా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ. 1500 కోట్లు మార్క్ దాటేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దురంధర్ సీక్వెల్‌గా తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల గ్యాప్‌లోనే సీక్వెల్ రిలీజ్ చేశారు.ఈ మూవీ విడుదలైన 22 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1680 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం ఇండియాలోనే రూ.1276 కోట్లు రాబట్టగా.. ఓవర్సీస్లో దాదాపు రూ.404 కోట్లు కలెక్ట్ చేసింది. నెట్ వసూళ్ల పరంగా చూస్తే రూ.1081 కోట్లు వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా చూస్తే ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అమిర్ ఖాన్ మూవీ దంగల్ రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత బాహుబలి-2, పుష్ప-2 చిత్రాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరి దురంధర్-2 ఈ చిత్రాల రికార్డులు బద్దలు కొడుతుందో.. లేదో వేచి చూడాల్సిందే. Duniya mein ek ka hi raj - DHU…RAN…DHAR 🔥⁰Day-wise break-up | IndiaWeek 1: ₹690 Cr* Week 2: ₹271 Cr* DAY 16: ₹23 Cr* DAY 17: ₹27 Cr* DAY 18: ₹30 Cr* DAY 19: ₹11 Cr* DAY 20: ₹11 Cr* DAY 21: ₹10 Cr* DAY 22: ₹8 Cr* India: ₹1081 Cr* Worldwide GBOC (3… pic.twitter.com/pw6lPwb4nV— Jio Studios (@jiostudios) April 10, 2026 -
తనను తాను గాయపర్చుకున్న హీరో.. కదల్లేని స్థితిలో ఆస్పత్రికి..
'ధురంధర్' సినిమాతో హీరో రణ్వీర్ సింగ్ పేరు మారుమోగిపోతోంది. అతడికి సినిమా పట్ల ఉన్న అంకితభావం, నటన గురించి బోలెడన్ని ప్రశంసలు వస్తున్నాయి. అయితే అతడు మొదటినుంచి అంతే డెడికేషన్‌తో పని చేసేవాడంటున్నాడు దర్శకనటుడు అనురాగ్ కశ్యప్. రణ్వీర్ సింగ్ హీరోగా, అనురాగ్ నిర్మాతగా వ్యవహరించిన చిత్రం లూటేరా. ఇది రణ్వీర్ నటించిన మూడో చిత్రం. అనురాగ్ సినిమా నిర్మించడంతో పాటు డైలాగ్స్ అందించాడు.రణ్వీర్ ఎప్పుడూ ఇంతే..ఆ మూవీ విశేషాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు అనురాగ్ కశ్యప్. ఆయన మాట్లాడుతూ.. 'ధురంధర్ మూవీకోసం రణ్వీర్ సింగ్, అర్జున్ రాంపాల్ ఎంత కష్టపడ్డారు? ఎన్ని గాయాలు తగిలించుకున్నారు? అని మనమంతా మాట్లాడుకుంటున్నాం. తమ పాత్రలకు న్యాయం చేయడం కోసం వాళ్లు ఎంతదూరమైనా వెళ్తారు. వారి కష్టానికి ప్రతిఫలంగా సినిమా కూడా అద్భుతంగా ఆడుతోంది, మంచి కలెక్షన్స్ రాబడుతోంది. కానీ రణ్వీర్ సింగ్ ఇప్పుడే కాదు, మొదటినుంచి కూడా ఇలాగే ఉండేవాడు. తన కెరీర్ మొదట్లో చేసిన లూటేరా సినిమా గురించి చెప్తాను. గాయం చేసుకునిఈ మూవీ క్లైమాక్స్‌లో రణ్‌వీర్‌పై కాల్పులు జరుగుతాయి. ఆ నొప్పి అనుభవించడం కోసం అతడు తన పొట్టపై గాయం చేసుకున్నాడు. కనీసం మాకెవరికీ ఒక మాటైనా చెప్పలేదు. సహజత్వం కోసం అంతగా తపించాడు. నొప్పితో బాధపడుతున్నా సరే మాతో పంచుకోలేదు. చివరకు అతడు కదల్లేని స్థితిలో ఉండటంతో ఏమైందని చూడగా పొట్టపై గాయం ఉంది. దాంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాం. అదీ అతడికి సినిమా పట్ల ఉన్న అంకితభావం! కానీ ఆ మూవీ ధురంధర్‌లా కలెక్షన్ల వర్షం కురిపించలేకపోయింది' అని చెప్పుకొచ్చాడు. సినిమాధురంధర్ విషయానికి వస్తే.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, సారా అర్జున్ హీరోహీరోయిన్లుగా నటించారు. మొదటి భాగం 2025 డిసెంబర్లో విడుదలవగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రెండో భాగం ఈ ఏడాది మార్చి 19న రిలీజవగా ఇప్పటివరకు రూ.1600 కోట్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రంలో ఆర్.మాధవన్, రాకేశ్ బేడీ, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.చదవండి: లావుగా ఉందని నా భార్యపై ట్రోలింగ్.. ఆ వ్యాధి వల్లే: విశ్వ -
మొదటి భార్యతో విడాకులు.. ఎంత దిగజారిపోయానంటే..: ఆమిర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ముచ్చటగా మూడోసారి పెళ్లికి సిద్ధమవుతున్నాడు. కొంతకాలం క్రితమే గౌరీ స్ప్రాట్‌ను తన ప్రియురాలిగా అందరికీ పరిచయం చేశాడు. తనతో కలిసి పలు ఈవెంట్లకు హాజరవుతున్నాడు. అయితే తాజా ఇంటర్వ్యూలో తన మొదటి భార్యతో విడాకుల గురించి ఓపెనయ్యాడు. ఆమిర్ మాట్లాడుతూ.. 'సాధారణంగా నేను మద్యానికి దూరంగా ఉంటాను. కానీ ఎప్పుడైతే నా మొదటి భార్య రీనాతో విడాకులయ్యాయో నేను పూర్తిగా మారిపోయాను. నియంత్రించుకోలేకపోయా..తను పిల్లల్ని తీసుకుని ఇల్లు వదిలేసిన రోజు తీవ్రమైన ఒంటరితనానికి లోనయ్యాను. నా భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. మందు ముట్టని నేను తాగుబోతుగా మారిపోయాను. అతిథుల కోసం ఇంట్లో మద్యం బాటిళ్లు ఉంటే వాటిని ఖాళీ చేయడం మొదలుపెట్టాను. ఏడాదిన్నరపాటు ప్రతిరోజు రాత్రి ఒక బాటిల్ తాగేశాను. మందుకు దూరంగా ఉండే నేను బాటిల్ ఖాళీ చేసే స్థాయికి దిగజారిపోయాను' అని గుర్తు చేసుకున్నాడు.పర్సనల్ లైఫ్కాగా ఆమిర్ ఖాన్.. రీనా దత్తా 1986లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు జునైద్, కూతురు ఇరా ఖాన్ సంతానం. 2002లో దంపతులు విడాకులు తీసుకున్నారు. 2005లో ఆమిర్.. దర్శకురాలు కిరణ్‌రావును పెళ్లి చేసుకున్నాడు. వీరికి సరోగసి ద్వారా కుమారుడు ఆజాద్ జన్మించాడు. ఆమిర్-కిరణ్ దాంపత్యం కూడా ఎంతోకాలం సాగలేదు. 2021లో వీరు విడిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి గౌరీ స్ప్రాట్‌తో ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని 2025లో తన బర్త్‌డే సందర్భంగా అధికారికంగా వెల్లడించాడు. గౌరీతో ప్రేమలో ఉన్నట్లు తెలిపాడు.చదవండి: డెకాయిట్ మూవీ రివ్యూ -
నన్ను డ్రమ్ములో పెడతారట.. బండబూతులు తిడుతున్నారు!
చిరయ్యా.. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో నటుడు సిద్దార్థ్ షా ప్రధాన పాత్రలో నటించాడు. భార్య వ్యక్తిగత స్వేచ్ఛకు, అభిప్రాయానికి విలువ ఇవ్వని భర్తగా కనిపించాడు. అయితే ఈ సిరీస్ రిలీజయ్యాక తనను ప్రజలు ఎంతగానో ద్వేషిస్తున్నారంటున్నాడు నటుడు సిద్దార్థ్ షా. అతడు మాట్లాడుతూ.. 'జనం నన్ను బ్లూ డ్రమ్‌లో పెట్టి చంపుదామన్నంత కసితో ఉన్నారు. బండబూతులుముఖ్యంగా మహిళలే ఈరకంగా వయొలెంట్‌గా ఆలోచిస్తున్నారు. పురుషులేమో బండబూతులు తిడుతున్నారు. చాలాచోట్ల ఇదే జరుగుతోందని, ఇప్పుడు ఈ సిరీస్ చూసి పురుష సమాజం తేలు కుట్టిన దొంగలా మౌనంగా ఉండిపోయిందని పలువురూ రీల్స్, వీడియోలు చేస్తున్నారు. ఈ ద్వేషాన్ని చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఆ కోపంలోనూ ప్రేమే కనిపిస్తోంది. బెడ్రూమ్ సీన్స్నాపై పీకలదాకా కోపం ఉందంటే నాకిచ్చిన పాత్రకు పూర్తి స్థాయి న్యాయం చేశానన్నమాట! అయితే ఇంటిమేట్ (బెడ్రూమ్) సన్నివేశాలు షూట్ చేసేటప్పుడు మాత్రం నేను తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనయ్యాను. మొదటిరోజే బెడ్రూమ్ సీన్స్ షూట్ చేశారు. ఫస్ట్ సీన్ తీయడానికి ముందే ఐదునిమిషాల పాటు గట్టిగా ఏడ్చేశాను. దీంతో కాసేపు చిత్రీకరణ నిలిపివేశారు. అందరూ నన్ను ఓదార్చేందుకు ప్రయత్నించారు. అయినా సరే ఆ సీన్స్ షూట్ చేసేటప్పుడు టెన్షన్‌తో బిగుసుకుపోయాను. తీవ్ర సంఘర్షణనా శరీరం ముందుకు కదల్లేదు. ఇలా చాలాసార్లు జరిగింది. ఆరు నెలలపాటు ఈ సిరీస్ నుంచి నేను బయటకు రాలేకపోయాను. ఎందుకంటే అవి ప్రేమ సన్నివేశాలు కావు, భార్యపై జరిగే అత్యాచార సీన్స్. హనీమూన్ సీన్ తర్వాత అయితే తీవ్ర సంఘర్షణకు లోనయ్యాను. ఇకపోతే ఆ సన్నివేశాలను నా కుటుంబం ధైర్యంగా తెరపై చూడలేకపోయింది' అని సిద్దార్థ్ చెప్పుకొచ్చాడు.చదవండి: అత్తామామకు సర్ప్రైజ్ ఇచ్చిన నయనిక రెడ్డి -
సాయిపల్లవి సినిమా.. క్లైమాక్స్ మార్చేసిన ఆమిర్ ఖాన్
సౌత్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి ఏక్ దిన్ (ఒక రోజు) సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. సునీల్ పాండే దర్శకత్వం వహించిన ఈ మూవీని ఆమిర్ ఖాన్, మన్సూర్ ఖాన్, అపర్ణ పురోహిత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.పట్టు కోల్పోలేదుతాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు ఆమిర్ బంధువు, దర్శకనిర్మాత మన్సూర్ ఖాన్. ఆయన మాట్లాడుతూ.. 'ఈరోజుల్లో నేను పెద్దగా సినిమాలు చూడటం లేదు. కానీ నాలో కళాత్మక దృక్పథం మాత్రం చెక్కు చెదరలేదు. కొన్ని సన్నివేశాలను మరీ ఓవర్‌గా చూపించడం కంటే కాస్త సున్నితంగా డీల్ చేయడమే మంచిదని భావిస్తాను. అలా కథపై నాకింకా మంచి పట్టుంది. అందుకే ఏదైనా అవసరమైతే సాయం చేస్తానని చిత్రయూనిట్‌కు మాటిచ్చాను. కథలో ఏదైనా మార్పు చేయాలి అనిపిస్తే ఓపెన్‌గా చెప్తానన్నాను.మేము ఒప్పుకోలేదుఉదాహరణకు.. ఏక్ దిన్ మూవీ చివర్లోని ఓ పాటను జపాన్‌లో చిత్రీకరించాం. ఆ పాట షూటింగ్ క్లిప్స్ చూసిన ఆమిర్.. అమ్మాయి ఈపాటికే ఓ పాటలో ఏడ్చేసింది. ఇప్పుడు మళ్లీ ఈ సాంగ్‌లో ఏడవడం దేనికన్నాడు. అబ్బాయితో ప్రేమలో పడటం గురించి ఒక పాట పాడితే బాగుంటుందన్నాడు. అయితే దర్శకుడు ఏం ఆలోచిస్తున్నాడో నాకు బాగా తెలుసు, కాబట్టి డైరెక్టర్‌కే సపోర్ట్ చేశాను. అప్పుడు ఆమిర్ సరదాగా.. ఏదైనా తేడా జరిగిందంటే మిమ్మల్ని జపాన్‌కు పంపించేస్తాను అన్నాడు.క్లైమాక్స్ మార్చేసిన ఆమిర్తర్వాత పూర్తి సాంగ్ చూసినప్పుడు మాత్రం మేము చేసింది సరైనదేనని మాతో ఏకీభవించాడు. అలాగే క్లైమాక్స్ సీన్‌పైనా కొన్ని అభ్యంతరాలు చెప్పాడు. దాన్ని కాస్త మార్చి రాశాడు. అది చూశాక ఆమిర్ చెప్పేది కరెక్టే అనిపించి మేము అదే ఫాలో అయిపోయాం. ఇలా సినిమా కోసం అందరి కలిసి పని చేశాం' అని తెలిపాడు. ఏక్ దిన్ మూవీ మే 1న విడుదల కానుంది. ఇకపోతే మన్సూర్ ఖాన్ గతంలో ఆమిర్‌ఖాన్ హీరోగా 'ఖయామత్ సే ఖయామత్ టక్', 'జో జీతా వొహి సికందర్' సినిమాలు తెరకెక్కించాడు. మన్సూర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచాయి.చదవండి: నీకోసం పిలిచా, అరిచా, ఏడ్చా.. అయినా నువ్వు రాలేదు: నటుడి భావోద్వేగం -
అసలు మీరేం మాట్లాడుతున్నారు?.. గంగూలీకి నటి స్ట్రాంగ్ కౌంటర్..!
మాజీ టీమిండియా సారథి సౌరవ్ గంగూలీ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. ఇటీవల భోలేబాబా పార్ కరేగా' అనే బెంగాలీ సీరియల్ షూటింగ్లో నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ మరణించడంపై మాజీ క్రికెటర్ గంగూలీ మాట్లాడారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమని అన్నారు. ఇదంతా షూటింగ్ కోసమే అయినా.. అతను నీటిలోకి ఎందుకు దిగారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బెంగాలీ నటి స్వాస్తిక ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా సౌరవ్ గంగూలీ చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియాలోనూ తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది.బాధలో ఉన్న ఆ కుటుంబంపై ఇలాంటి కామెంట్స్ చేయడమేంటని సౌరవ్ గంగూలీని స్వాస్తిక బెనర్జీ తప్పుపట్టింది. తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడిన ఆమె.. గంగూలీ లాంటి గొప్ప వ్యక్తి మాట్లాడేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని హితవు పలికింది. ఆయన మాటలు తమ వృత్తిని కించపరిచేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి వైఖరి తమ పని విలువను తగ్గిస్తాయని స్వాస్తిక ముఖర్జీ అన్నారు.అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ప్రతి రంగాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని స్వాస్తిక పేర్కొన్నారు. గంగూలీ లాగా.. రాహుల్ లాంటి వాళ్లకు మద్దతు లభించదన్నారు. ఒకవేళ రాహుల్ నీటిలోకి దిగకపోయి ఉంటే.. అతని స్థానంలో మరో నటుడు వచ్చేవారని ఆమె తెలిపారు. ప్రస్తుత ఘటన చూస్తుంటే పరిశ్రమ ఎదుర్కొంటున్న విస్తృత సవాళ్లను వేలేత్తి చూపుతోందన్నారు. కాగా.. బెంగాలీ నటుడు రాహుల్ అరుణోదయ బెనర్జీ మృతితో ఏప్రిల్ 7 నుంచి సినీ పరిశ్రమ అంతా నిరవధిక సమ్మెకు దిగింది. -
'దురంధర్-2 స్క్రిప్ట్ కాపీ కొట్టారు'.. డైరెక్టర్‌కు బిగ్ రిలీఫ్
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన దురంధర్ ది రివెంజ్ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. రిలీజైన వారం రోజుల్లోనే రూ.1000 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. రూ.1600 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ రెండు సినిమాలకు బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు.స్క్రిప్ట్ కాపీ కొట్టారు..దురంధర్ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ప్రముఖ డైరెక్టర్ సంతోశ్ కుమార్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దురంధర్ స్క్రిప్ట్ తనదేనని.. ఆదిత్య ధర్ నా స్క్రిప్ట్‌ను దొంగిలించారంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై డైరెక్టర్ ఆదిత్య ధర్ బాంబే హైకోర్టు ఆశ్రయించారు. సంతోశ్ కమార్ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. పరువు నష్టంతో పాటు, తన ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఆదిత్య ధర్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు సంతోశ్ కుమార్‌ను హెచ్చరించింది. ఇకపై ఆదిత్య ధర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని చిత్రనిర్మాత సంతోష్ కుమార్‌కు సూచించింది. ఇలాంటివీ పునరావృతం కాకుండా చూసుకోవాలని బాంబే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 16న జరగనుంది. దీంతో ఈ కేసులో దర్శకుడు ఆదిత్య ధర్‌కు ఉపశమనం లభించింది.కాగా.. 'ధురందర్ 2' రిలీజ్ తర్వాత తన రిజిస్టర్డ్ స్క్రిప్ట్ 'డి సాహెబ్' నుండి కాపీ కొట్టారని ఫిల్మ్ మేకర్ సంతోశ్ కుమార్ ఆరోపణలు చేశారు. తన స్క్రిప్ట్ స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SWA)లో రిజిస్టర్ చేశానని సంతోశ్ తెలిపారు. ఆదిత్య ధర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దీంతో దర్శకుడు సంతోశ్ కుమార్ వ్యాఖ్యలను ఆదిత్య ధర్ తప్పుబట్టారు. ఇకపై ఇలాంటి ఆరోపణలు చేయవద్దని కోరుతూ కుమార్‌కు లీగల్ నోటీసులు జారీ చేశారు. వాటికి ఆయన స్పందించకపోవడంతో దురంధర్ డైరెక్టర్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. పదేపదే తనపై చేస్తున్న ఆరోపణలు.. ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆదిత్య ధర్ తరఫు న్యాయవాది బీరేంద్ర సరఫ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ప్రియుడితో హీరోయిన్ బ్రేకప్.. ఏడాదికే ఎండ్ కార్డ్..!
అమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘దంగల్’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సన్యా మల్హోత్రా. ఈ చిత్రంలో బబితా కుమారి పాత్రలో ఆడియన్స్‌ను మెప్పించింది. ఆ తర్వాత పలు సినిమాలు, షోలలో కనిపించింది. గతేడాది సన్నీ సంస్కారీ కి తులసి కుమారి, బేబీ జాన్, ది గ్రేట్ ఇండియన్ కిచెన్ లాంటి చిత్రాల్లో కనిపించింది. హిందీలో సినిమాలు చేస్తూ బిజీ ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ టోస్టర్, సుందర్ పూనమ్ అనే సినిమాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలు డైరెక్ట్‌గా ఓటీటీల్లోనే రిలీజ్ కానున్నాయి.అయితే తాజాగా సన్యా మల్హోత్రాకు సంబంధించి బాలీవుడ్లో ఓ టాక్ వినిపిస్తోంది. ఏడాదిగా డేటింగ్లో ఉన్న సన్యా తన ప్రియుడు రిషబ్ రిఖిరామ్ శర్మ బ్రేకప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరిద్దరు ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసుకోవడంతో బాలీవుడ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. సన్యా మల్హోత్రా గతేడాది నుంచి ప్రముఖ సితార్ ప్లేయర్ రిషబ్ రిఖిరామ్ శర్మతో డేటింగ్లో ఉన్నారు. ఎక్కడికెళ్లినా జంటగా కనిపించి సందడి చేసేవారు. అయితే వీరిద్దరి రిలేషన్‌పై ఎక్కడా కూడా అఫీషియల్‌గా ప్రకటించలేదు. తాజాగా వీరిద్దరు ఏడాదిలోనే తన రిలేషన్‌కు గుడ్ బై చెప్పేశారు. రిషబ్ వేరొకరితో డేటింగ్లో ఉన్నట్లు సమాచారం. అందుకే సన్యా బ్రేకప్ చెప్పేసినట్లు బీటౌన్‌లో లేటేస్ట్ టాక్. గతంలోనూ ఓసారి తనకు బ్రేకప్ అయినట్లు సన్యా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. నాలుగేళ్ల లాంగ్ రిలేషన్ తర్వాత బ్రేకప్ అయినట్లు తెలిపింది.రిషబ్ రిఖిరామ్ శర్మ ఎవరంటే?రిషబ్ రిఖిరామ్ శర్మ.. రిఖీ రామ్ కుటుంబానికి చెందిన సితార్ ప్లేయర్, సంగీత స్వరకర్త. పురాణ సితార్ వాద్యకారుల కోసం వాయిద్యాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందారు. అతను దిగ్గజ పండిట్ రవిశంకర్ చివరి శిష్యుడు. సితార్ ఫర్ మెంటల్ హెల్త్, ఉచిత మ్యూజిక్ థెరపీ ద్వారా మానసిక ఆరోగ్యం కోసం సెషన్స్ నిర్వహిస్తుంటారు. రిషబ్ తన ప్రదర్శనల ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 2022లో అమెరికాలోని వైట్ హౌస్‌లో నిర్వహించిన మొట్టమొదటి దీపావళి వేడుకలో సోలో ప్రదర్శన ఇచ్చాడు. ఆ తర్వాత పారిస్‌లో జరిగిన 2024 వేసవి ఒలింపిక్స్ ముగింపు వేడుకలో తన ప్రదర్శనతో భారతీయ అథ్లెట్లను అలరించాడు. -
గుండె పగిలింది : హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం
బాలీవుడ్ హీరోయిన్, జరీన్ ఖాన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి పర్వీన్ ఖాన్ బుధవారం (ఏప్రిల్ 8) తుదిశ్వాస విడిచారు. దీంతో జరీన్ శోకసంద్రంలో మునిగిపోయింది. సోషల్ మీడియా ద్వారా పలువురు సెలబ్రిటీలు,సహనటులు ఆమెకు సానుభూతి ప్రకటించారు.తన దుంఖాన్ని నటి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఇటీవలే పెంపుడు పిల్లి రాంబోను కోల్పోయిన జరీనా తల్లిని కోల్పోవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తరచు తన తల్లి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది జరీనా. ముఖ్యంగా 2016లో పర్వీన్ ఖాన్‌కు గుండె శస్త్రచికిత్స జరిగినప్పటి నుంచి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. పరిస్థితి విషమించడంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పర్వీన్ ఖాన్ కన్నుమూశారు."మా ప్రియ పర్వీన్ ఖాన్ (జరీన్ ఖాన్, సనా ఖాన్ల తల్లి) ఏప్రిల్ 8న శాంతియుతంగా స్వర్గస్తులయ్యారని తెలియజేయడానికి చింతిస్తున్నాం" అని జరీన్ టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ముంబైలోని వెర్సోవాలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం పర్వీన్ ఖాన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో ఈ విషాద సమయంలో ఆమెకు సానుభూతిని, అండను తెలియజేస్తూ సందేశాలు పంపుతున్నారు.హిందీ మూవీ 'వీర్' ద్వారా సల్మాన్ ఖాన్ సరసన వెండితెరకు పరిచయమైన జరీన్ ఖాన్ తల్లి పర్వీన్ ఖాన్ మరణం చిత్ర పరిశ్రమలో దిగ్భ్రాంతికి గురిచేసింది. టాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ హీరో గోపీచంద్ సరసన చాణక్య మూవీలో కనిపించింది జరీన్ ఖాన్. అలాగే రామ్‌గోపాల్ దర్శకత్వంలో 'వీరప్పన్' చిత్రంలోనూ జరీన్ నటించింది. పంజాబీ, తమిళ భాషల్లోనూ తన ముద్ర వేసిన జరీన్ చివరి సినిమా 2020లో వచ్చిన 'హమ్ భీ అకేలే తుమ్ భీ అకేలే'.ఇదీ చదవండి: BMWలో అమ్మడికి జాక్‌పాట్... ఎలాగో తెలిస్తే షాకవుతారు! -
ఆ హీరో వల్లే ఇండస్ట్రీలో ఉన్నా.. నా సక్సెస్‌కు అతడే కారణం: మృణాల్
తెరపై అవకాశాలు సంపాదించడం అంత ఈజీ కాదు. ఒక్క ఛాన్స్ రావడానికి కొందరికి ఏళ్లకు యేళ్లు పడుతుంది. మరికొందరికి వెంటనే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లడం కష్టంగా మారుతుంది. అందులోనూ బుల్లితెర నుంచి వెండితెరకు షిఫ్ట్ అయ్యే క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఆ ఛాలెంజెస్ను దాటుకుని బుల్లితెర నటి అన్న ట్యాగ్ నుంచి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది మృణాల్ ఠాకూర్. సీరియల్ నుంచి సినిమాల్లోకి..2012లో ముజ్సే కుచ్ కేటి.. యే ఖామోషియాన్ సీరియల్లో నటించింది. తర్వాత అర్జున్, కుంకుమ భాగ్య సీరియల్లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత మరాఠిలో ఒకే ఏడాది (2014) మూడు సినిమాలు చేసింది. అయినా మృణాల్ ఠాకూర్‌కు బ్రేక్ రాలేదు. మళ్లీ సినిమా చేయడానికి నాలుగేళ్లు పట్టింది. అయితే ఓ హీరోతో చేసిన యాడ్ వల్ల తన కెరీర్ మలుపు తిరిగిందంటోంది మరాఠి బ్యూటీ.ఆ హీరో వల్లే..మృణాల్ ఠాకూర్ తెలుగులో సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం డెకాయిట్. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ.. హీరో రణ్వీర్ సింగ్ నా లక్కీ చార్మ్. నేను చిత్రపరిశ్రమలో ఉండటానికి ఆయనే కారణం. కెరీర్ తొలినాళ్లలో మోడల్‌గా ఆయనతో కలిసి ఓ హెయిర్బ్రాండ్ యాడ్‌లో నటించాను. ఆ వాణిజ్య ప్రకటన రిలీజైన తర్వాతే చాలామంది దర్శకనిర్మాతలు నన్ను గుర్తించడం మొదలుపెట్టారు. అందుకే ఈ సక్సెస్ క్రెడిట్ అంతా ఆయనే ఇస్తాను. ఆయన నాకెంతో సాయం చేశారు. తనెప్పుడూ సానుకూల దృక్పథంలో ఉంటాడు. సినిమాధురంధర్ మూవీలో అయితే నాకు రణ్వీర్ కనిపించలేదు, హంజా మాత్రమే కనిపించాడు. అంత అద్భుతంగా నటించాడు. ఆయన ఇలాంటి బ్లాక్‌బస్టర్స్ మరెన్నో అందుకోవాలి అని చెప్పుకొచ్చింది. కాగా రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ మూవీ గతేడాది డిసెంబర్లో విడుదలైంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవగా.. ఈ ఏడాది మార్చి 19న దానికి సీక్వెల్ వచ్చింది. అదే ధురంధర్: ద రివేంజ్. రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.చదవండి: అల్లు అర్జున్- అట్లీ సినిమా టైటిల్ ఇదే.. గుండుతో కనిపించిన బన్నీ -
దురంధర్ కలెక్షన్స్.. బాహుబలి-2 రికార్డ్‌పై గురి..!
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్-2 ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. దురంధర్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. మార్చి 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 1,622.72 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే హిందీలో పలు రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం తెలుగు సినిమా రికార్డ్‌పై కన్నేసింది. తాజా వసూళ్లు చూస్తుంటే రాజమౌళి చిత్రం బాహుబలి-2 వసూళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది.దురంధర్-2 రిలీజైన 18 రోజుల్లోనే కన్నడలో రూ. 120 కోట్లకు పైగా వసూలు చేసింది. గతంలో రిలీజైన టాలీవుడ్ మూవీ బాహుబలి-2 కన్నడలో రూ. 129 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దురంధర్-2 ఈ రికార్డ్‌కు కేవలం రూ.9 కోట్ల దూరంలోనే నిలిచింది. ఇదే జోరు కొనసాగితే కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన బాహుబలి-2ను దాటేయనుంది. ఇదే జరిగితే కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడేతర చిత్రంగా దురంధర్-2 నిలవనుంది.ఇక కర్ణాటక బాక్సాఫీస్‌ను పరిశీలిస్తే కన్నడ చిత్రాల ఆధిపత్యమే కొనసాగుతోంది. అయినప్పటికీ తెలుగు చిత్రాలు కూడా కన్నడలో సత్తా చాటుతున్నాయి. శాండల్‌వుడ్ హీరో రిషబ్ శెట్టి మూవీ 'కాంతార చాప్టర్ 1' రూ. 247.50 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో యశ్ నటించిన 'కేజీఎఫ్ 2' కొనసాగుతోంది. కన్నడలో టాప్-5 చిత్రాలలో 'బాహుబలి 2' మాత్రమే కన్నడేతర చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ రికార్డ్‌ను దురంధర్-2 అధిగమించే ఛాన్స్ ఉంది. కాగా.. 'ధురందర్ 2' ఇప్పటికే కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా అవతరించింది. కర్ణాటకలో 'బాహుబలి 2' తర్వాత రూ. 100 కోట్ల మార్కును దాటిన రెండో కన్నడేతర చిత్రంగా 'ధురందర్ 2' నిలిచింది.కాగా.. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించారు. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రంలో సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, డానిష్ పండోర్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించారు. -
ఓటీటీకి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్
తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మట్కా కింగ్. ఈ వెబ్ సిరీస్‌కు సైరత్' లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తీసిన నాగరాజ్ ముంజలే దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో కృతిక కమ్రా, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. ముంబయికి చెందిన రతన్ ఖత్రీ జీవితం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. తాజాగా మట్కా కింగ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే మట్కా నేపథ్యంలో సాగే క్రైమ్ కథగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 1960ల్లో ఓ సాధారణ పత్తి వ్యాపారి (విజయ్ వర్మ), తన తెలివితేటలతో మట్కా అనే జూద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడనే స్టోరీగా ఈ సిరీస్ తీసినట్లు అర్థమవుతోంది. ఈ క్రైమ్ సిరీస్ ఏప్రిల్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది. -
అక్షయ్ కుమార్ 'భూత్ బంగ్లా' ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గతంలో అద్భుతమైన హిట్స్ అందుకున్నప్పటికీ.. గత కొన్నాళ్లుగా చాలా వెనకబడిపోయాడు. వరస సినిమాలైతే చేస్తున్నాడు గానీ సక్సెస్ అనేది పెద్దగా దక్కట్లేదు. దీంతో తనకు గతంలో 'హేరా ఫేరీ' లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌తో కలిసి తీసిన మూవీ 'భూత్ బంగ్లా'. వచ్చే శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.ట్రైలర్ బట్టి చూస్తే ఓ బంగ్లా, అందులో వధాసుర్ అనే రాక్షసుడు, సిట్చూయేషనల్ కామెడీ ఇలా బాగానే ఉందనిపించింది. కాకపోతే ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్ 2' హవా నడుస్తోంది. లెక్క ప్రకారం ఈ శుక్రవారమే 'భూత్ బంగ్లా' థియేటర్లలోకి రావాలి. కానీ ధురంధర్ వల్లే వారం ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు. కానీ అప్పుడైనా హిట్ అవుతుందా అనేది ఇక్కడ సందేహంగా మారింది. హారర్ మూవీ జనాలని ఏ మేరకు మెప్పిస్తుందనేది చూడాలి? -
ధురంధర్: ది రివెంజ్ @ 1622 కోట్లు
‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రంగా ‘ధురంధర్: ది రివెంజ్’ నిలిచింది. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘ధురంధర్’. ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ పతాకాలపై ఆదిత్యధర్, జ్యోతిదేశ్ పాండే, లోకేష్ థర్ నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా (ధురంధర్, ధురంధర్: ది రివెంజ్) విడుదలైంది.గత ఏడాది డిసెంబరు 5న విడుదలైన ‘ధురంధర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఈ ఏడాది మార్చి 19న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా 18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1622 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టిందని యూనిట్ పేర్కొంది. ఇండియాలో రూ.1228 కోట్లు, ఓవర్సీలో రూ.394 కోట్లు తమ సినిమాకు వచ్చాయని ‘ఎక్స్’ వేదికగా జియో స్టూడియోస్ సంస్థ తెలిపింది.ఇండియాలో రూ.1041 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయని, ఇక్కడ వెయ్యికోట్ల రూపాయల నెట్ వసూళ్లు సాధించిన రికార్డును ‘ధురంధర్: ది రివెంజ్’ క్రియేట్ చేసిందని మేకర్స్ చెబుతున్నారు. ఇటీవలే నార్త్ అమెరికాలో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ వసూళ్ల రికార్డును అధిగమించిన ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా తాజాగా నార్త్ అమెరికాలో పాతిక మిలియన్ డాలర్లు(దాదాపు 232 కోట్లు) సాధించి, అక్కడ అత్యధిక కలెక్షన్స్‌ను సాధించిన తొలి ఇండియన్ సినిమాగా నిలిచిందని మేకర్స్ పేర్కొన్నారు. అలాగే జర్మనీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వన్ మిలియన్ యూరోలు సాధించి సత్తా చాటింది. -
'అశ్వత్థామ'గా రామ్‌చరణ్.. ఆదిత్య ధర్‌తో చర్చలు?
బాలీవుడ్లో రాబోయే భారీ ప్రాజెక్టులపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ‘యూరి: ది సర్జికల్ స్ట్రైక్’తో బిగ్ హిట్ అందుకున్నాడు దర్శకుడు ఆదిత్య ధర్. కొంతకాలం క్రితం ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే కథను తెరపైకి తీసుకురావాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో జియో స్టూడియోస్‌తో ఒప్పందం కుదుర్చుకుని, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. అయితే ఆ సమయంలో కొన్ని అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఆ ప్రాజెక్టుకు రామ్‌చరణ్ పేరు బలంగా వినిపించింది. అప్పుడే ‘ఆర్ఆర్ఆర్’ విజయంతో ఆయనపై బాలీవుడ్ దృష్టి పడింది. అశ్వత్థామ పాత్రకు చరణ్ సరైన ఎంపిక అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ కథపై చర్చలు మొదలయ్యాయి. దానికి కారణం.. ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్’ ఫ్రాంచైజీ. ధురంధర్ చిత్రం రెండు భాగాలతో భారీ విజయాన్ని సాధించిన ఆదిత్య ధర్‌పై నిర్మాణ సంస్థలు నమ్మకం పెంచుకున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ‘ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మెగా ఫ్యాన్స్ మాత్రం అప్పటి పుకారు ఇప్పుడు నిజమవ్వాలని కోరుకుంటున్నారు. రామ్‌చరణ్ ఈ ప్రాజెక్టులో భాగమైతే, బాలీవుడ్లో మరో భారీ అడుగు వేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. -
ఓటీటీకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీ చిత్రాలకు ఫుల్ డిమాంట్ ఉంటోంది. ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టుగానే ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. గతంలో 2023లో మామి ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ మూవీని ప్రదర్శించారు.తాజాగా ఎవరీబడీ లవ్స్ సోహ్రబ్ హండా అనే మర్డర్ మిస్టరీ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటింంచింది. ఈనెల 10 నుంచి జీ5 వేదికగా అందుబాటులోకి రానుంది. '15 మంది స్నేహితులు.. ఒక పార్టీ.. ఒకరి మిస్టరీ హత్య' అంటూ పోస్టర్‌ను పంచుకున్నారు.ఈ చిత్రంలో వినయ్ పాఠక్, నీల్ భూపాలం ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రజత్ కపూర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సమీర్ నాయర్, దీపక్ సెగల్ నిర్మించారు. ఈ సినిమాలో రణవీర్ షోరే, సౌరభ్ శుక్లా, కోయెల్ పూరీ, ఎంకే రైనా, పలోమి ఘోష్, చంద్రచూర్ రాయ్, సాదియా సిద్దిఖీ కీలక పాత్రల్లో నటించారు.ఈ చిత్రానికి సాగర్ దేశాయ్ సంగీతం సమకూర్చారు. కాగా.. రజత్‌కపూర్ అంతకుముందు క్రౌడ్‌ఫండింగ్ ద్వారా ఆర్కే అనే మూవీని తెరకెక్కించారు. 15 Friends. 1 Party. 1 Mysterious Murder.But the real question is - who wanted him dead?Watch #EverybodyLovesSohrabHanda premieres 10th April, on #ZEE5#EverybodyLovesSohrabHandaonZEE5@ApplauseSocial @nairsameer @deepaksegal #MithyaTalkies #RajatKapoor @pathakvinay… pic.twitter.com/CUha1btJlU— ZEE5Official (@ZEE5India) April 6, 2026 -
'అశ్లీల సైట్లో నా ఫోటోలు.. బాయ్స్ చూసేవారు'
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్గా అభిమానులను మెప్పించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేయగా.. రామ్ చరణ్ రెజ్లర్ లుక్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన టీనేజ్‌లో జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది. తనకు 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ అశ్లీల సైట్లో తన మార్ఫింగ్ చిత్రాన్ని చూశానని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తాను పాఠశాలలో ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగిందని జాన్వీ కపూర్ గుర్తుచేసుకున్నారు. మా క్లాస్‌లో కొందరు అబ్బాయిలు సరదా కోసం అలాంటి సైట్స్ చూసేవారని.. ఆ సమయంలో నా ఫోటోలు చూశానని తెలిపింది. నేను చదివే పాఠశాలలోనే ఇలా జరగడంతో చాలా వింత అనుభవాన్ని ఎదురైందని జాన్వీ కపూర్ వివరించింది.ఆ సమయంలో తాను ఆ పరిస్థితిని సర్దుకుపోవడానికి ప్రయత్నించానని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. అలా నా ఫోటోలు చూశాక సోషల్ మీడియాకు సంబంధించి ఇలాంటి చాలా విషయాలలో నైతికత లేదని అనిపించిందని జాన్వీ తెలిపింది. అయితే ఇప్పుడు వాటిపై తన దృక్పథం మారిందని.. ఏఐ (AI) రూపొందించిన ఈ చిత్రాలు ఈ రోజుకు తనను ప్రభావితం చేస్తున్నాయని జాన్వీ కపూర్ తన బాధను పంచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు సంతోషం అనేది లేదని జాన్వీ వెల్లడించింది. ఏఐ రూపొందించిన తన ఫోటోలు ఆన్లైన్లో ప్రచారంలో ఉన్నాయని.. కొన్నిసార్లు అధికారిక వార్తా పేజీలు కూడా వాటిని షేర్ చేస్తున్నాయని వివరించింది. ఇలాంటి మార్ఫింగ్, ఏఐ ఫోటోల్లో తాను ఎప్పుడూ ధరించని దుస్తులు, పోజులు ఉన్నాయని జాన్వీ కపూర్ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఇలా సినీతారల ఫోటోలను మార్ఫింగ్ చేసేవారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని సినీ ప్రియులు కోరుతున్నారు. -
లైట్స్... కెమెరా... క్రికెట్
బ్యాట్ పట్టుకుని క్రికెట్ గ్రౌండ్లోకి దిగారు బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు. గంగూలీలా మారిపోయారు. ప్రముఖ క్రికెటర్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ జీవితం ఆధారంగా హిందీలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘దాదా: ది సౌరభ్ గంగూలీ స్టోరీ’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ అధికారికంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో సౌరభ్ గంగూలీపాత్రలో రాజ్‌కుమార్ రావు నటిస్తున్నారు.విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వంలో లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మిస్తున్నారు. ‘‘లైట్స్... కెమెరా... క్రికెట్... ‘దాదా’ చిత్రీకరణ మొదలైపోయింది’’ అంటూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా యూనిట్ తెలియజేసింది. షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ఈ ఏడాది డిసెంబరులోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది.గంగూలీ క్రికెట్ లైఫ్‌నే కాకుండా, ఆయన వ్యక్తిగత జీవితంలోని అంశాలను కూడా ఈ సినిమాలో ప్రస్తావించనున్నారట. ఇక దాదాపు రెండు దశాబ్దాలపాటు క్రికెట్లో ఓ వెలుగు వెలిగిన గంగూలీ, 2008లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, బిసీసీఐ ప్రెసిడెంట్‌గా సౌరభ్ గంగూలీ బాధ్యతలను నిర్వర్తించిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
సోషల్ మీడియాలో ధురంధర్-3.. కథ-స్క్రీన్ ప్లే రెడీ
గత నెల రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్-2 దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండో భాగం (ధురంధర్-2) ఎలా ముగిసిందో సినిమా చూసిన వాళ్లందరికీ తెలిసే ఉంటుంది. భార్య, కొడుకును వదిలి ఇండియా వచ్చేస్తాడు హీరో. ఆ తర్వాత ‘RAW’ కనుసన్నల నుంచి తప్పించుకొని నేరుగా తన ఇంటికి వెళ్తాడు. అయితే దూరం నుంచే తన తల్లిని, చెల్లిని చూసి తిరిగి వెనుదిరుగుతాడు. ఇలా సాగిన ధురంధర్-2 క్లయిమాక్స్ నుంచి ధురంధర్-3 కథను అల్లేస్తున్నారు సోషల్ మీడియాలోని కొంతమంది జనం. అయితే హీరో మరోసారి రా ఏజెంట్‌గా పాకిస్థాన్‌లో అడుగుపెడతాడని, కొత్త గెటప్‌లో పాకిస్టాన్‌లో మరోసారి అడుగుపెట్టి తన భార్య, కొడుకును కలుస్తాడంటూ ఎవరికివారు కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా అల్లేస్తున్నారు. ఇలా ధురంధర్ ఫ్రాంచైజీపై ఓ కొత్త చర్చ జరుగుతోంది. అయితే నిజానికి ధురంధర్-3పై దర్శకుడు ఆదిత్య ధర్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఇటీవల ఇదే ప్రశ్న ఆదిత్య ధర్కి ఎదురైంది. దానికి 'ఏమో చెప్పలేం' అన్నట్టు మాత్రమే ఆయన స్పందించాడు. అంతేకానీ ధురంధర్-3 తప్పకుండా తీస్తానని ఆదిత్య ధర్ అనలేదు.కానీ సోషల్ మీడియాలో వస్తున్న కథలని నిజానికి ఓసారి పరిశీలిస్తే ఈ దర్శకుడికి కచ్చితంగా పార్ట్-3కి ఓ లైన్ దొరికే అవకాశం ఉందనే అంటున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. -
రాముడిగా రణ్‌బీర్ సెట్ కాలేదు.. బాలీవుడ్ నటుడు కీలక వ్యాఖ్యలు!
దర్శకుడు నితీశ్ కుమార్ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ సినిమాపై నటుడు సునీల్ లహ్రీ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాముడిగా పాత్రకి రణ్‌బీర్ కపూర్ అంతగా సెట్ అవ్వలేదన్నాడు. రాముడి పాత్రకు ఉండాల్సిన మృదు స్వభావం రణ్‌బీర్‌లో కనిపించలేదన్నాడు.తాజాగా ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘రామాయణ’టీజర్ చూశాను. అందులో నేను ఆశించిన స్థాయిలో భావోద్వేగాలు కనిపంచలేదు. రాముడిగా రణ్‌బీర్ చూడడానికి బాగానే ఉన్నాడు. కానీ అతనిలో సున్నితం, అమాయకత్వం కనిపించడం లేదు. ఆయన కాస్త కఠినంగా కనిపిస్తున్నారు. తన నటనతో అయినా ఈ పాత్రకు న్యాయం చేస్తాడని నమ్ముతున్నాను’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ..‘రణ్‌బీర్ రాముడి పాత్ర కాకుండా లక్ష్మణుడు లేదా భరతుడి పాత్రలు పోషిస్తే బాగా సెట్ అయ్యేదని అభిప్రాయపడ్డారు. కోట్లాది మంది మనసులను గెలుచుకున్న ‘రామాయణం’ సీరియల్లో లక్ష్మణుడు పాత్రని సునీల్ లహ్రీ పోషించాడు. ‘రామాయణ’ సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రంలో సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ సంస్థ, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై రూ. 4000 భారీ బడ్జెట్‌తో నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ దీపావళికి విడుదల కానుంది. -
టిఫిన్ చేసే అలవాటు లేదు, రోజుకు 10 గంటలు నిద్ర!
రోజులో ఏది మర్చిపోయినా అల్పాహారం తినడం మాత్రం మిస్ అవొద్దని అంటుంటారు. కానీ, తాను అదే స్కిప్ చేస్తానంటున్నాడు బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా. ఛావా, ధురంధర్ సినిమాలతో ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయాడు అక్షయ్. అతడి యాక్టింగ్‌కు ప్రేక్షక జనం ఫిదా అయింది. చిన్నవయసులోనే బట్టతలతో బాధపడినప్పటికీ, దాన్నుంచి బయటపడి ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకున్నాడు. లుక్స్‌తో కాకుండా టాలెంట్‌తో సమాధానం చెప్పాలనుకున్నాడు. ఆచితూచి పాత్రలు ఎంచుకుంటూ పోతూ తన సత్తా చూపించాడు. కెరీర్లో ఫుల్ బిజీగా మారిన ఈ నటుడి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఓసారి చూసేద్దాం.. నో స్నాక్స్అక్షయ్ ఖన్నా కేవలం రెండుపూటలే భోజనం చేస్తాడు. ఉదయం అల్పాహారం జోలికి వెళ్లడు. మధ్యాహ్నం, రాత్రిపూట మాత్రం తనకు నచ్చింది తినేస్తాడు. అలా అని మధ్యలో ఖాళీ దొరికితే బిస్కెట్లు, సాండ్విచ్లు తినే టైపు కాదు, కేవలం ఛాయ్ తాగుతాడంతే! ఎక్కువగా ఇంటి భోజనాన్నే ఇష్టపడతాడు. అన్నం, పప్పు, కూరగాయలు, చికెన్, చేపలు, ఏదైనా నాన్‌వెజ్.. ఇవే ఆయన మెనూలో తరచూ కనిపిస్తుంటాయి. రాత్రిపూట అన్నానికి బదులుగా చపాతీ ఆరగిస్తాడు.మంచి నిద్ర ముఖ్యంతేలికగా జీర్ణమయ్యే ఆహారానికే మొదటి ప్రాధాన్యతనిస్తాడు. ఇంట్లో ఉన్నా, సెట్లో ఉన్నా ఇవే ఆహారపద్ధతులను కొనసాగిస్తుంటాడు. బెండకాయ, లిచీ పండ్లు, కేక్స్ తనకు చాలా ఇష్టమని గతంలో ఓ ఇంటర్వ్యూలో అతడే స్వయంగా చెప్పాడు. అన్నింటికన్నా మంచి నిద్ర అవసరం అంటుంటాడు. రోజుకు 10 గంటలు నిద్రపోతాడు. అలసిన శరీరం, మనసుకు ఊరటనిచ్చేది నిద్రేనంటాడు. మరీ నోరు కట్టేసుకోకుండా సింపుల్ డైట్‌తోనే ఐదు పదుల వయసులోనూ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటున్నాడు అక్షయ్.చదవండి: మతిస్థిమితం కోల్పోయిన భానుప్రియ? స్పందించిన చెల్లెలు -
ధురంధర్లో విలన్‌గా.. ముగ్గురు రిజెక్ట్ చేశారు: కాస్టింగ్ డైరెక్టర్
కొన్ని సినిమాల్లో హీరోతో పాటు ఇతర పాత్రలు కూడా బాగా ఎలివేట్ అవుతుంటాయి. అలా ధురంధర్ మూవీలో కథానాయకుడు రణ్వీర్ సింగ్‌తో పాటు మిగతా అన్ని పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా విలన్‌గా అక్షయ్ ఖన్నా పోషించిన రెహ్మాన్ డకైత్ పాత్ర అయితే విపరీతంగా హైలైట్ అయింది. అక్షయ్ హావభావాలు, మేనరిజం, డ్యాన్స్.. ఇలా అన్నీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. అయితే ఈ విలన్ పాత్ర కోసం అక్షయ్ కంటే ముందు పలువురు నటీనటులను సంప్రదించగా నిరభ్యంతరంగా తిరస్కరించారట! ముగ్గురు రిజెక్ట్ఈ విషయాన్ని కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ చాబ్రా వెల్లడించాడు. బాలీవుడ్ హంగామాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. డకైత్ పాత్రను ముగ్గురు యాక్టర్స్ రిజెక్ట్ చేశారు. అందులో ఒకరు దక్షిణాదికి చెందిన ప్రముఖ నటుడు కాగా మరో ఇద్దరు బాలీవుడ్ యాక్టర్స్. వాళ్లు చెప్పిన కారణమేంటంటే.. ఇందులో చాలా ఎక్కువమంది యాక్టర్స్ పని చేస్తున్నారు. పైగా ఇది పూర్తిగా రణ్వీర్ సినిమా అని ఆఫర్‌ను తిరస్కరించారు. ఆయన తప్ప అందరూ..వారి పేర్లు ఇప్పుడు బయటకు చెప్పలేను కానీ ఆ పాత్రను తిరస్కరించినందుకు వాళ్లు కచ్చితంగా బాధపడే ఉంటారు. ధురంధర్లో నటించేందుకు మొదట అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కూడా కాస్త తటపటాయించారు. ఆర్.మాధవన్ ఒక్కరే వెంటనే ఓకే చెప్పారు, మిగతా అందరూ కాస్త సమయం తీసుకున్నారు. దర్శకుడు ఆదిత్య, నేను.. ఇలా ఎంతోమంది స్టార్స్‌ను ఈ సినిమాలో భాగం చేయాలని ముందుగానే అనుకోలేదు. కానీ, అలా జరిగిపోయింది అని చెప్పుకొచ్చాడు.సినిమాఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురంధర్ చిత్రం గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన ధురంధర్: ద రివేంజ్ ఇప్పటివరకు రూ.1500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది.చదవండి: ఐశ్వర్య ఇంట్లో ఉండాలి.. అంత ఇగో లేదు: అభిషేక్ బచ్చన్ -
ఐశ్వర్య ఇంటికే పరిమితం..నేనలాంటి వ్యక్తిని కాదు: అభిషేక్
హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తనకు భార్య అవడానికి ముందు మంచి స్నేహితురాలు అంటున్నాడు హీరో అభిషేక్ బచ్చన్. పెళ్లయ్యాక తను పని చేయకూడదని ఎన్నడూ కోరుకోలేదని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. అమ్మానాన్న పెళ్లి చేసుకునే సమయానికి నాన్న కంటే అమ్మనే పెద్ద స్టార్. అయినా వాళ్లు చక్కగా కలిసున్నారు. అందులో అసహజంగా ఏదీ కనిపించలేదు. వారి దాంపత్యాన్ని కళ్లారా చూశాను. కెరీర్ ప్రారంభంలోనే..ఆడవారి కన్నా మగవారే ఎక్కువ డామినెంట్‌గా ఉండాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను కెరీర్ మొదలుపెట్టిన తొలినాళ్లలోనే ఐశ్వర్యతో పరిచయం ఏర్పడింది. నా రెండో సినిమా తనతో కలిసే చేశాను. నాతో కలిసి ఎక్కువసార్లు నటించిన హీరోయిన్ కూడా తనే! ఆ సమయంలో మేము ప్రేమలో లేము. మంచి ఫ్రెండ్స్‌లా కలిసున్నాం. ఆ తర్వాత ప్రేమలో పడ్డాం, పెళ్లి చేసుకున్నాం. అలాంటి వ్యక్తిని కానునా భార్య తన పనిని వదులుకుంటేనే నేను సురక్షితంగా ఫీల్ అయ్యే వ్యక్తిని కాదు. అలాంటి అభద్రతాభావం మామధ్య లేదు. 'నేను సంపాదిస్తాను, నువ్వు ఇంటిని చూసుకో'వంటి చర్చ మా మధ్య ఎప్పుడూ రాలేదు. అలాగే నా ఎదుగుదల కోసం ఎవరినీ వాడుకోను. ఇండస్ట్రీలో నటుడిగా నన్ను మా నాన్న లాంచ్ చేయలేదు, నాకోసం ఒక్క సినిమా కూడా తీయలేదు. పైగా నేనే నిర్మాతగా మారి ఆయన సినిమా చేశాను, అందుకు నేను చాలా సంతోషిస్తాను. పెళ్లిఈరోజు నేను సాధించిన విజయాలన్నీ నా కష్టం, ప్రయత్నం ద్వారా అందుకున్నవే! అని చెప్పుకొచ్చాడు. కాగా అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ 2007లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2011లో కూతురు ఆరాధ్య జన్మించింది. అయితే అభిషేక్- ఐశ్వర్య చాలా అరుదుగా జంటగా కనిపిస్తారు. దీంతో చాలాసార్లు వీళ్లు విడిపోయారంటూ ప్రచారం జరగడం, దాన్ని దంపతులు కొట్టిపారేయడం పరిపాటిగా మారింది.చదవండి: నాలో సీమ ఫీలింగ్ ఉంది: విజయ్ దేవరకొండ -
రూ.4,000 కోట్ల బడ్జెట్.. ఇదెలా మర్చిపోయారు? వీడియో వైరల్
కొన్ని కథలు తెరపై ఎన్నిసార్లు చూపించినా చూడాలనిపిస్తుంది. తెలిసిన కథే అయినా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. అలాంటి ఇతిహాస కథే రామాయణం. రాముడి కథను మరోసారి సినీప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు సినిమా వస్తోంది.. అదే రామాయణ. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ కోసం దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్ కేటాయించారు.టీజర్లో ఇది గమనించారా?హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం (ఏప్రిల్ 2న) టీజర్ కూడా వదిలారు. ఇందులో రాముడు శివధనస్సు విరిచినప్పటినుంచి అరణ్యవాసం వరకు అనేక విషయాలకు సంబంధించిన గ్లింప్స్‌ను జత చేశారు. అయితే శ్రీరాముడు నగర వీధుల్లో నడుస్తుంటే జనం పూలతో స్వాగతం పలికే చిన్న క్లిప్‌లో ఓ పొరపాటు దొర్లింది. ఓ వ్యక్తి తలపాగా ఉన్నట్లుండి రంగు మారింది. మొదట నీలిరంగులో, తర్వాత వంకాయ కలర్లో.. ఆ తర్వాత మళ్లీ నీలిరంగులోకి మారింది. అలా వదిలేశారేంటి?34 సెకన్ల నుంచి 38 సెకన్ల నిడివి మధ్యలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్ మూవీలో ఈ చిన్న తప్పిదాన్ని అలాగే వదిలేశారేంటి? అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఇది వీఎఫ్ఎక్స్ సమస్య కాదని కలర్ గ్రేడింగ్ వల్ల అలా జరిగిందని, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదంటున్నారు.సినిమారామాయణ విషయానికి వస్తే.. నితీశ్ తివారి దర్శకత్వం వహించిన ఈ మూవీని నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. 8సార్లు ఆస్కార్ పొందిన డీఎన్ఈజీ సంస్థ ఈ మూవీకి వీఎఫ్ఎక్స్ చేసే బాధ్యతలను చేపట్టింది. హన్మ్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. Notice the blue turban guy next to the kid his turban colour changes to purple in between shots 😳😳₹4000 Cr Movie has new technology altogether it seems 🤩🤩#Ramayana pic.twitter.com/Bu48kWPhlq— Pan India Review (@PanIndiaReview) April 3, 2026 చదవండి: యుగానికి ఒక్కడు సీక్వెల్.. నేనైతే అస్సలు చేయను: ఆండ్రియా -
అతడి నుంచి తప్పించుకునేందుకు రెండో ఫ్లోర్ నుంచి దూకేశా..: నటి
లైంగిక వేధింపుల నుంచి తనను తాను కాపాడుకునేందుకు రెండో అంతస్తు నుంచి దూకానంటోంది బుల్లితెర నటి, హిందీ బిగ్‌బాస్ 13వ కంటెస్టెంట్ ఆర్తి సింగ్. అప్పుడు తన వయసు కేవలం 13 ఏళ్లేనని చెప్తోంది. చిన్న వయసులో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఆర్తి సింగ్ మాట్లాడుతూ.. అప్పుడు నాకు 13 ఏళ్లు. మా ఇంట్లో పనిచేసే వ్యక్తి నాపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడు. చేతులు జోడించి బతిమాలినా..నేను మంచి నిద్రలో ఉండగా నా గదిలోకి నడుచుకుంటూ వచ్చాడు. నా గదిలోకి ఎందుకు వచ్చావని గొడవపడ్డాను. నాపైకి వస్తుంటే నువ్వు నా అన్నయ్యవి కదా, ప్లీజ్ వెళ్లిపో అని రెండు చేతులు జోడించి వేడుకున్నాను. అతడు నా మాట వినలేదు. నేను బయట వరండా వైపు చూస్తే తలుపులు తాళం వేసి ఉన్నాయి. అమ్మ పొలానికి వెళ్లింది, ఇంట్లో ఒంటరిగా ఉన్నాను.రెండో ఫ్లోర్ నుంచి దూకేశా..అక్కడ వాతావరణం భయానకంగా మారింది. బయటకు వెళ్లే పరిస్థితి కనిపించలేదు. నేను వెంటనే అతడి నుంచి తప్పించుకుని రెండో అంతస్తుకు పరిగెత్తి అక్కడి నుంచి కిందకు దూకేశాను. నేను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను కాబట్టే ఆ రోజు నాపై ఏ అఘాయిత్యం జరగకుండా నన్ను నేను కాపాడుకోగలిగాను అంది. ఆర్తి సింగ్.. గృహస్తి, పరిచయ్, ఉత్తరన్, దేవోన్ కే దేవ్.. మహాదేవ్, వారిస్, విక్రమ్ బేతాళ్కీ రహస్య గాథ వంటి పలు హిందీ సీరియల్స్‌లో నటించింది. హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్లో నాలుగో రన్నరప్‌గా నిలిచింది.చదవండి: పెళ్లయిన నెలకే ముగ్గురమయ్యాం అంటూ రష్మిక పోస్ట్ -
అప్పుడేమో విరక్తి.. ఇప్పుడేమో ప్రశంసలు కురిపించిన 'సీత'
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న చిత్రం రామాయణ. నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నమిత్ మల్హోత్రా వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. నిన్న (ఏప్రిల్ 2న) హనుమాన్ జయంతి సందర్భంగా రామాయణ టీజర్ వదిలారు. టీజర్లో రాముడిని హైలైట్ చేసి చూపించారు. సీత, హనుమంతుడు, రావణాసురులను చూపించలేదు.టీజర్‌పై సీత ప్రశంసలుఈ టీజర్‌పై రామాయణ్ టీవీ సీరియల్లో సీతగా నటించిన దీపిక చికిల ప్రశంసలు కురిపించింది. టీజర్ చూశాను, చాలా బాగుంది. ఎంతో రిచ్‌గా, అద్భుతంగా తీశారు. ఒక అందమైన కావ్యంలా కనిపిస్తోంది, అందులో డౌటే లేదు. ఈ మూవీ కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను అని చెప్పుకొచ్చింది. అయితే దీపిక గతంలో రామాయణ కథపై సినిమాలు తీయడాన్ని విమర్శించింది. అప్పుడేమో విరక్తి'రామాయణాన్ని పదేపదే తెరకెక్కించాలని చూస్తున్నవారిని చూస్తుంటే విరక్తిగా అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్లు తెరకెక్కించిన ప్రతిసారి ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తారు. కొత్త యాంగిల్, కొత్త లుక్.. ఇలా ఏదో ఒకటి డిఫరెంట్‌గా ఉండాలని ట్రై చేస్తారు. అలా వారు యదార్థ కథను నాశనం చేస్తున్నారు. కాబట్టి రామాయణంపై సినిమాలు తీయకపోవడమే మంచిది' అని దీపిక అభిప్రాయపడింది. ఇప్పుడు ఆమె తన మనసు మార్చుకుని రామాయణపై ప్రశంసలు కురిపించడం విశేషం!సీరియల్- సినిమాఇకపోతే దీపిక.. 1980లో దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణ సీరియల్లో సీతాదేవిగా నటించింది. ఇందులో అరుణ్ గోవిల్ రాముడిగా అరవింద్ త్రివేది రావణుడిగా, సునీల్ లహ్రి లక్ష్మణుడిగా, దారా సింగ్ హనుమంతుడిగా యాక్ట్ చేశారు. ఇక నితీశ్ తివారి రామాయణ విషయానికి వస్తే.. 8సార్లు ఆస్కార్ పొందిన డీఎన్ఈజీ అనే సంస్థ ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ అందిస్తోంది. యశ్ రావణుడిగా, సాయిపల్లవి సీతగా కనిపించనున్నారు. ఈ మూవీ మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది.చదవండి: వెండితెరపై వీరుల పోరాటం -
దురంధర్-2 కోసం స్టార్ హీరో త్యాగం..!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజా చిత్రాన్ని మేకర్స్ వాయిదా వేశారు. ఈనెల 10న రిలీజ్ కావాల్సిన హారర్-కామెడీ చిత్రం భూత్ బంగ్లాను పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు.ప్రస్తుతం దురంధర్ ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అందుకే భూత్ బంగ్లాను ఓ వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుంచి వచ్చిన అభ్యర్థనల వల్లే వారం రోజులు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత ఏక్తా కపూర్ అధికారిక ప్రకటనలో తెలిపారు. ప్రేక్షకులకు మెరుగైన సినిమా అనుభవాన్ని అందించడం.. థియేటర్లలో సినిమా విజయవంతంగా రన్ అయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె అన్నారు. 'ధురందర్: ది రివెంజ్' చిత్రానికి మరింత సమయాన్ని ఇవ్వడం వల్ల పరిశ్రమకు ప్రయోజనం చేకూరుతుందని ఎగ్జిబిటర్లు భావించారు.కాగా.. భూత్ బంగ్లా చిత్రాన్ని బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించగా.. అక్షయ్ కుమార్, శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్ నిర్మించారు. ఈ చిత్రంలో వామికా గబ్బి, పరేష్ రావల్, టబు, రాజ్‌పాల్ యాదవ్, జిషు సేన్‌గుప్తా, మిథిలా పాల్కర్ కీలక పాత్రల్లో నటించారు. -
'రామాయణ' టీజర్ రిలీజ్.. అయోధ్య నుంచి అరణ్యం వరకు!
చలనచిత్రపరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ 'రామాయణ'. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవిగా సీతగా నటిస్తున్న ఈ చిత్రానికి నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్నాడు. నేడు (ఏప్రిల్ 2) హనుమాన్ జయంతి సందర్భంగా రామాయణ టీజర్ వదిలారు. అధర్మం వల్ల లోకం అస్తవ్యస్తమైనప్పుడు.. దాన్ని సరిచేసేందుకు ఎల్లప్పుడూ ఆయనే వస్తాడు. 5 వేల ఏళ్లుగా మన హృదయాల్లో కొలువై, మనల్ని రక్షిస్తున్న నాయకుడు, పురాణ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు రాముడు అంటూ టీజర్లో పేర్కొన్నారు. టీజర్ రిలీజ్ఈ వీడియోలో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. రాముడు శివధనస్సు విల్లు ఎత్తినట్లుగా, వనవాసం చేసినట్లు, యుద్ధం చేసినట్లుగా.. పలు ఘట్టాలను క్లుప్తంగా చూపించారు. అంటే అయోధ్య నుంచి అరణ్యం వైపు సాగిన ప్రయాణాన్ని, రాక్షసులతో జరిగిన యుద్ధాన్ని కూడా చూపించారు. ఇందులో కేవలం రాముడి పాత్రను మాత్రమే రివీల్ చేశారు. రావణుడు, సీతల పాత్రలను చూపించలేదు. కేవలం 2 నిమిషాల 28 సెకన్ల నిడివితో ఉన్న ఈ వీడియోలో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమాచివర్లో రావణుడి ఫేస్ రివీల్ కాకుండా ఆయన ఆహార్యాన్ని వెనక నుంచి చూపించారు. అది ఈ గ్లింప్స్‌కి హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి వీడియో అదిరిందని, తమ ఎదురుచూపులకు తగ్గ ఫలితం లభించిందని సినీప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. కాగా యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్న రామాయణ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం ఈ ఏడాది దీపావళిలో విడుదలవుతుండగా రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి రానుంది. నమిత్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. -
ఒకేసారి 20 సినిమాలు.. ఆయన అన్న ఒక్కమాట వల్ల..!
ఐదు పదుల వయసుకి దగ్గర్లో ఉన్న బాలీవుడ్ నటి దివ్య దత్తా పెళ్లికి మాత్రం దూరంగా ఉంది. కరెక్ట్ పర్సన్ దొరికితేనే పెళ్లి.. లేదంటే సింగిల్‌గానే బతికేస్తానంటోంది. కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన ఆమె ఆచితూచి సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె తన సినీప్రయాణాన్ని గుర్తు చేసుకుంది. 16 ఏళ్ల వయసులోనే నటిగా కెరీర్ మొదలుపెట్టాను. నా కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం వీర్ జారా. ఆ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో నాకు బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. నాలో ఆలోచన2007లో అనుకుంటా.. ఒకేసారి దాదాపు 20 సినిమాలకు సంతకం చేశాను. ఒకరోజు దర్శకనిర్మాత ఆదిత్య చోప్రాను కలవడానికి వెళ్లాను. చాయ్ తాగుతూ మాట్లాడుకున్నాం. నేను 20 సినిమాలకు సంతకం చేశానని సంతోషంగా చెప్పాను. అతడి వైపు నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు. ఇంతమంచి వార్త చెప్తే నీలో చలనం లేదేంటి? అని అడిగాను. నీకు డబ్బు అవసరం అంతుందా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నావా? అని అడిగాడు. లేదన్నాను. అలాంటప్పుడు ఒకేసారి అన్ని సినిమాలు ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించాడు. నువ్వు మంచి నటివి, ఆచితూచి అడుగులు వేయమని సలహా ఇచ్చాడు. అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది.సినిమాఆయన మాట వినాలా? వద్దా? అనేది నా ఛాయిస్. నేను ఇంటికెళ్లి ఆలోచించాను. నేను సంతకం చేసిన సినిమాలనుంచి తప్పుకున్నాను. ఇచ్చిన అడ్వాన్సులు వెనక్కిచ్చేశాను. అప్పటినుంచి నాకు నిజంగా నచ్చిన పాత్రలను మాత్రమే చేసుకుంటూ వస్తున్నాను అని చెప్పుకొచ్చింది. కాగా దివ్య దత్త 2017లో వచ్చిన ఇరాడా మూవీకి గానూ ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. ఈమె భాగ్ మిల్కా భాగ్, బద్లాపూర్, ఛావా వంటి పలు చిత్రాల్లో నటించింది. చివరగా చిరైయా అనే వెబ్ సిరీస్‌లో మెరిసింది.చదవండి: ఫిబ్రవరి, మార్చి పాయే.. ఏప్రిల్ ఏమవుతుందో? -
థియేటర్లలోకి ఏడున్నర గంటల 'ధురంధర్'
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'ధురంధర్' హవా నడుస్తోంది. దక్షిణాదిలోని తెలుగు, తమిళంలోనూ ఈ చిత్రానికి మంచి వసూళ్లు దక్కుతున్నాయి. ఇదలా ఉండగానే మూవీ టీమ్ మరో సరికొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమైంది. రెండు భాగాలని కలిపి ఒక్కటిగా చేసి ఆ సినిమాని థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ఈ మేరకు ఆ విషయం వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: దురంధర్-2 కలెక్షన్స్.. తెలుగులోనే ఎందుకిలా?)దాదాపు మూడున్నర గంటల నిడివితో 'ధురంధర్' తొలి భాగం గతేడాది డిసెంబరులో రిలీజైంది. రూ.1300 కోట్ల మేర కలెక్షన్ సొంతం చేసుకుంది. అప్పుడే సీక్వెల్ ఎప్పుడొస్తుందో వెల్లడించారు. చెప్పినట్లుగానే రెండు వారాల క్రితం ధురంధర్ 2ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఇది 3 గంటల 50 నిమిషాల నిడివితో రిలీజ్ చేశారు. దీనికి బీభత్సమైన హైప్ ఉన్నప్పటికీ వాటిని అందుకుని, సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. చూస్తుంటే బాహుబలి 2, పుష్ప 2 నెలకొల్పిన ఘనతలు గల్లంతు అయిపోయేలానే ఉన్నాయి.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)ఇదలా ఉండగానే ఇప్పుడు డైరెక్టర్స్ కట్ పేరిట 'ధురంధర్' చిత్రాన్ని ఏడున్నర గంటల నిడివితో థియేటర్లలోకి తీసుకురాబోతున్నారనే న్యూస్ బయటకొచ్చింది. మంగళవారం(మార్చి 31)న ఈ మేరకు సదరు భారీ నిడివి మూవీకి సెన్సార్ జరిగినట్లు ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 5 నుంచి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే ఈ సినిమా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఐమాక్స్, DC, HDR, EPIQ వంటి ప్రీమియం స్క్రీన్లలో మాత్రమే ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది.సుధీర్ఘ నిడివితో రాబోతున్న ఈ సినిమాలో దర్శకుడు తీసిన ప్రతి సీన్ ఉండనుందని, సెన్సార్‌లో తొలగించిన కొన్ని అదనపు సన్నివేశాలు కూడా ఉండనున్నట్లు సమాచారం. నేడో రేపో నిర్మాణ సంస్థ నుంచి ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాశముందని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఏడున్నర గంటల నిడివితో రిలీజైనా కనీసం మూడు ఇంటర్వెల్స్ అయినా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రేక్షకులు కూడా అంత ఓపికతో చూస్తారా అనేది అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. ఒకవేళ ఇది నిజమై, థియేటర్లలోకి వస్తే మాత్రం అత్యంత సుధీర్ఘ నిడివితో వచ్చే చిత్రంగా రికార్డ్ సృష్టించడం గ్యారంటీ.(ఇదీ చదవండి: 9 ఏళ్ల ‘బాహుబలి’ రికార్డు బ్రేక్ చేసిన ‘ధురంధర్’) -
కీర్తి ‘శాశ్వత్’ o చేసిన ధురంధర్!
నటీనటులైనా, దర్శకుడైనా, సాంకేతిక నిపుణులైనా... చిత్ర పరిశ్రమలో ఏ కళాకారుడికైనా ఒక పెద్ద విజయం కుదుపుని ఇస్తుంది కెరీర్‌కు మలుపును అందిస్తుంది. రాత్రికి రాత్రే తలరాతలను మార్చేయగల శక్తి ఒక్క సినిమా విజయానికి ఉంది. అదీ బాలీవుడ్ రికార్డులను బద్దలుకొట్టిన స్వదేశీ స్పై థ్రిల్లర్ ’ధురందర్’ లాంటి సినిమా అయితే ఇక చెప్పేదేముంది? సంచలన విజయం సాధించిన ఈ సినిమా దానితో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరి కెరీర్‌ను అనూహ్యమైన కుదుపుని అందించింది.వీరందరిలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రెండు భాగాలలకూ మ్యూజిక్‌ని ఇచ్చిన సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్దేవ్ ముందున్నారు. దర్శకుడి తర్వాత ఆయన పేరే ఇప్పుడు భారతీయ సినిమా రంగంలో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. ధురందర్ ఇటీవల విడుదలైన దాని సీక్వెల్ విజయాలకు ఎన్నో ముఖ్య కారణాలు ఉన్నప్పటికీ, ఈ వర్ధమాన సంగీతకారుడు అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం రెండు భాగాలకూ ప్రధాన ఆకర్షణగా నిలిచి, వాటిని బ్లాక్బస్టర్లుగా మార్చడంలో కీలక పాత్ర పోషించింది.గతంలో ఆదిత్య ధర్‌తో కలిసి ’ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ చిత్రానికి కూడా శాశ్వత్ పనిచేశారు తన అద్భుతమైన స్వరకల్పనకు ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఆయన జాతీయ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు రెండింటినీ గెలుచుకుని బాలీవుడ్‌కు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు. ధురందర్ చిత్రంతో, తాను రాబోయే సంవత్సరాల్లో మరిన్ని సంచలనాలు సృష్టిస్తానని ఆయన మరోసారి చాటి చెప్పారు. «అత్యంత ఉత్కంఠ భరిత సన్నివేశాల్లో అనూహ్యంగా పాత బాలీవుడ్ పాటల్ని జోడిస్తూ దురందర్ చిత్రాల్లో.. శాశ్వత్ చేసిన కొత్త ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. సినిమా కథనంతో సజావుగా కలిసిపోయిన ఒకనాటి మ్యూజికల్ హిట్స్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. ఆయన వ్యూహం అద్భుతంగా ఫలించింది.కేవలం నేపథ్య సంగీతంలోనే కాకుండా, ప్రేక్షకులకు పాత జ్ఞాపకాలను గుర్తుచేసే ఐదు రెట్రో పాటలతో కథనాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చినప్పుడు, క్లాసిక్ పాటలపై ఆయనకున్న అభిరుచి మరోసారి స్పష్టమైంది. దివంగత నుస్రత్ ఫతే అలీ ఖాన్ పాట దిల్ పే జఖ్మ్ ఖతే హై (1977), దిల్ (1990) నుంచి హమ్ ప్యార్ కర్నే వాలే (1990), తానేదార్ నుంచి తమ్మా తమ్మా (1990), త్రిదేవ్ నుంచి తిర్చీ టోపీవాలే (1989), అంగారే నుంచి ముజే జిందగీ నే మారా (1986) అలాగే బాజీగర్ (1993) నుంచి...పాటల్ని అద్భుతంగా కలగలిపారు.రణ్వీర్ సింగ్ తన అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మె న్స్ కి మెజారిటీ అవార్డులతో దూరంగా ఉండగా, ఆదిత్య ధర్ ఇప్పుడు కేవలం మూడు నెలల్లో రెండు అద్భుతమైన సినిమాలను అందించినందుకు పాన్–ఇండియా సంచలనంగా మారాడు. అదే విధంగా ప్రస్తుతం శాశ్వత్ అందించిన అద్భుతమైన సంగీతంతో చార్ట్స్‌లో టాప్‌లో నిలిచాడు. ఉత్సాహపరిచే డ్యాన్స్ నంబర్లు, స్టైలిష్ ఇంట్రో పాటలపై ఆధారపడే ఆధునిక సంగీత దర్శకుల్లా కాకుండా ఆయన సంగీతంలో తనదైన ప్రత్యేక శైలితో భిన్నంగా వెళ్లడం, తన సొంత నియమాల ప్రకారం పనిచేయడం ఆయన్ను బాలీవుడ్లో తదుపరి పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మార్చింది. ఈ నేపధ్యంలో త్వరలోనే దక్షిణాది చిత్రసీమలో అడుగుపెట్టే అవకాశం కూడా ఆయనకు రానున్నట్టు సమాచారం. -
ధురంధర్ 2 కథ నాది.. కాపీ కొట్టారు: కన్నడ దర్శకుడు
పాన్ ఇండియా స్థాయిలో మార్మోగిపోతున్న పేరు ధురంధర్ 2. ఆదిత్య ధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ధురంధర్ లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను రెండో భాగం ఈపాటికే దాటేసింది. ఒకటీరెండు రోజుల్లో రూ.1500 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ధురంధర్ 2 కథ తనదంటూ మీడియా ముందుకు వచ్చాడు కన్నడ దర్శకుడు సంతోష్ కుమార్ ఆర్ఎస్.కష్టపడి కథ రాసుకున్నా..ఆయన మాట్లాడుతూ.. ధురంధర్ 2 మీరంతా చూసే ఉంటారు. ఈ సినిమాకు అంతటా మంచి స్పందన లభిస్తోంది. అయితే ఆ కథ నాది. సినిమా చూసిన తర్వాత నా కథ కాపీ కొట్టారన్న విషయం అర్థమైంది. 2023లోనే ఎంతో కష్టపడి ఈ కథ రాసుకున్నాను. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను. పెద్ద నటీనటులు ఈ మూవీలో భాగం కావాలంటే బడా సంస్థ అండగా ఉండాలన్నారు. 2023లోనే రిజిస్టర్ చేయించా..అందుకే జీ స్టూడియోస్, టీ సిరీస్, ధర్మ ప్రొడక్షన్స్, సోనీ పిక్చర్స్.. ఇలా అనేక పెద్ద నిర్మాణ సంస్థలను సంప్రదించాను. చాలామందికి నా కథ పంపాను. ఆదిత్య రాయ్ కపూర్‌ని హీరోగా పెట్టి మూవీ తీయాలనుకున్నాను. 2023 నవంబర్లోనే ఈ కథ రిజిస్టర్ కూడా చేయించాను. అందుకు సంబంధించిన సాక్ష్యాలు నా దగ్గరున్నాయి. వీటి ఆధారంగా ధురంధర్ 2 మూవీ యూనిట్‌పై కేసు వేయాలనుకుంటున్నాను.అదే బాధగా ఉందివాళ్లు నా కథను చెడగొట్టారు. నేను వినోదం కోసం కథ రాస్తే దాన్ని రాజకీయ దుర్వినియోగం చేశారు. అదే నాకు మరింత బాధ కలిగిస్తోంది. నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదు అని ఆవేదన వ్యక్తం చేశాడు. సంతోష్ కుమార్.. క్యాంపస్ క్రాంతి అనే కన్నడ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం యువన్ రాబిన్‌హుడ్ మూవీ చేస్తున్నాడు.చదవండి: నీ ముఖానికి గోల్డ్ చైన్ వేసుకునేంత సీన్ ఉందా? నటి ఆవేదన -
రామాయణలో శ్రీరాముడి పాత్ర చేయనన్నా..: రణ్‌బీర్ కపూర్
దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ కోసం దాదాపు రూ.4 వేల కోట్లు కేటాయించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సౌత్ సెన్సేషన్ హీరోయిన్ సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. రాఖీభాయ్ యష్ రావణుడిగా కనిపించనున్నాడు.రిజెక్ట్ చేశా..అయితే ఈ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు ఎగిరి గంతేయడానికి బదులుగా రిజెక్ట్ చేసేందుకే మొగ్గు చూపానంటున్నాడు రణ్‌బీర్ కపూర్. న్యూయార్క్‌లో రామాయణ దర్శకుడు నితీశ్ తివారి, నిర్మాత నమిత్ మల్హోత్రాతో కలిసి ఓ ఈవెంట్‌కు హాజరయ్యాడు రణ్‌బీర్. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితమే నితేశ్ తివారి నాకు రామాయణ సినిమా గురించి చెప్పాడు. ప్రధాన పాత్రలో నటించమని కోరగా నేను క్షణం ఆలోచించకుండా నో చెప్పాను.కీలకమైన మలుపునేను ఆ పాత్రకు సెట్ అవనేమో, బాగోనేమో అని నాపై నాకే అనుమానం వేసింది. రాముడి పాత్రకు నేను పూర్తి న్యాయం చేయలేనని తిరస్కరించాను. కానీ, ఆ భయం చాలా త్వరగానే కనుమరుగవగా అంత మంచి ఛాన్స్ వచ్చినందుకు సంతోషించాను. ఎందుకంటే ఇటువంటి అవకాశాలు నా జీవితానికి చాలా అవసరమయ్యాయి. ఆ సమయంలో నేను తండ్రినయ్యాను. నా పద్ధతుల్ని, జీవితాన్ని మార్చుకోవాల్సిన దశలో ఉన్నాను. శ్రీరాముడి పాత్ర పోషించడం, తొలిసారి తండ్రి కావడం యాదృచ్ఛికమే అయినప్పటికీ నా జీవితాన్ని కీలక మలుపు తిప్పిన అందమైన అనుభూతి అని చెప్పుకొచ్చాడు.సినిమాకాగా రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కొంతకాలం పాటు ప్రేమలో మునిగి తేలారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. వీరికి అదే ఏడాది నవంబర్‌లో కూతురు రాహా జన్మించింది. రామాయణ విషయానికి వస్తే.. ఏర్ రెహ్మాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది అక్టోబర్‌లో దీపావళికి విడుదలవుతుండగా రెండో భాగం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న రామాయణ సినిమా గ్లింప్స్ విడుదల కానుంది.చదవండి: గుడిలో గిన్నెలు కడిగిన ప్రియాంక చోప్రా -
పూనమ్ పాండే ప్రెగ్నెంట్? నిజమా.. లేక?
పబ్లిసిటీ స్టంట్స్ చేయడంలో నటి పూనమ్ పాండేను మించినవారు లేరు. 2019లో టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే మైదానంలో దుస్తుల్లేకుండా తిరుగుతానని ప్రకటించింది. తీరా భారత్ కప్పు గెలవగా.. ఆమె అన్నంత పని చేయకుండా బీసీసీఐ పూనమ్‌ను అడ్డుకుంది. రెండేళ్ల క్రితం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో మరణించినట్లు తనపై తనే రూమర్ సృష్టించింది. అది నిజమేనని నమ్మిన జనం తీవ్ర విచారం వ్యక్తం చేయడంతో క్షమించండి, కేవలం అవగాహన కోసమే ఇలా చనిపోయినట్లు నాటకమాడానంది. మరో డ్రామా?ఇప్పుడు మరో స్టంట్ చేసినట్లు కనిపిస్తోంది. అదేంటంటే.. తను గర్భవతిని అని ప్రకటించింది. బేబీ బంప్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు.. అదేంటి, భర్తతో విడిపోయిన పూనమ్ ప్రెగ్నెంట్ ఎలా అయింది? అని డౌట్ పడుతున్నారు. అంతలోనే అది ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో సృష్టించిన ఫోటోలని తేల్చేశారు. ఎక్స్‌లో షేర్ చేసిన పోస్ట్ కింద ఇది ఏఐతో చేసిన ఫోటో అని స్పష్టంగా రాసుంది. అంటే అందర్నీ ఏప్రిల్ ఫూల్ చేసేందుకు ఇలా తాను ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడినట్లు తెలుస్తోంది.సినిమాకాగా పూనమ్ పాండే బాలీవుడ్లో నషా, జీఎస్టీ, ద జర్నీ ఆఫ్ కర్మ, టచ్ ద ఫైర్ వంటి సినిమాలు చేసింది. తెలుగులో మాలిని అండ్ కో చిత్రంలో కథానాయికగా నటించింది. వ్యక్తిగత విషయానికి వస్తే.. 2020 సెప్టెంబర్ 1న ప్రియుడు సామ్ అహ్మద్ బాంబేని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన పదిరోజులకే అతడు తనపై అత్యాచారం చేశాడని, వేధింపులకు పాల్పడుతున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది. అలా కొంతకాలానికే దంపతులిద్దరూ విడిపోయారు.🤰🍼👶👼 pic.twitter.com/6UUAAc9rKj— Poonam Pandey (@iPoonampandey) March 31, 2026 చదవండి: గుడిలో గిన్నెలు కడిగిన స్టార్ హీరోయిన్ -
గుడిలో గిన్నెలు శుభ్రం చేసిన 'వారణాసి' హీరోయిన్.. వీడియో వైరల్
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్‌కు వెళ్లిపోయినా తన మూలాలను మాత్రం అస్సలు మర్చిపోలేదు. అందుకు నెట్టింట వైరల్‌గా మారిన వీడియోనే ప్రత్యక్ష ఉదాహరణ. మంగళవారం నాడు ఆమె అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించింది. సాంప్రదాయ దుస్తుల్లో గుడికి వెళ్లిన ఆమె అక్కడున్నవారిని నవ్వుతూ పలకరించింది. ఆలయ సిబ్బంది సెల్ఫీ అడిగితే కాదనుకుండా ఓపికగా ఫోటోలు దిగింది. అనంతరం ఆలయసేవలో పాల్గొంది.వీడియో వైరల్గుడిలో వాడిన పాత్రలను కొందరు మహిళలు శుభ్రం చేస్తుంటే తను కూడా వారికి సాయం చేసింది. తలపై దుపట్టా కప్పుకుని గిన్నెలు కడిగింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు ప్రియాంక అమెరికాలో సెటిలైనప్పటికీ తనలో భారతీయత ఉట్టిపడుతోందని కామెంట్లు చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ అయినప్పటికినీ.. ఇలా సేవ చేయడాన్ని తను ఏమాత్రం చిన్నతనంగా భావించడం లేదు, నిజంగా గ్రేట్ అని పొగుడుతున్నారు.సినిమాఇకపోతే ప్రియాంక చోప్రా చివరగా 'ద బ్లఫ్' అనే హాలీవుడ్ మూవీ చేసింది. ప్రస్తుతం తెలుగు చిత్రం 'వారణాసి'లో యాక్ట్ చేస్తోంది. మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ మూవీకి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Uptodate ਪੰਜਾਬੀ (@uptodatepunjabi) View this post on Instagram A post shared by Amritsar Paparazzi 📸 (@amritsar.paparazzi)చదవండి: అప్పుడే చనిపోవాలనుకున్నా: కోన వెంకట్ -
సినిమాల కంటే పుస్తకాలకే ప్రాధాన్యం: ఆమిర్ ఖాన్
సాధారణంగా నటీనటులు, దర్శక–నిర్మాతలు, సాంకేతిక నిపుణులు... ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవారు ఎవరైనా సినిమాలకే మా తొలి ప్రాధాన్యం అంటుంటారు. అయితే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మాత్రం ‘నేను సినిమాల కంటే పుస్తకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను’ అంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన గురించి ఎవరికీ పెద్దగా తెలియని ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించి, అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. ‘‘నేను చాలా సంప్రదాయ కుటుంబంలో పెరిగాను. మా అమ్మానాన్న ఎంతో క్రమశిక్షణతో పెంచారు.సినిమాలు చూసే విషయంలో కఠినంగా ఉండేవారు. కేవలం దూరదర్శన్ లో వచ్చే పాత బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు మాత్రమే చూశాను. ఎప్పుడైనా వారాంతంలో సినిమా చూడాలనుకుంటే మా అమ్మను అనుమతి అడిగేవాడిని. తను సరే అంటే ఓకే... లేదంటే లేదు. అయితే రొమాంటిక్ లేదా కమర్షియల్ సినిమాలు చూడటానికి అనుమతించేవారు కాదు. దీంతో పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేవాడిని. ఈ కారణంగా చిన్నతనం నుంచే పుస్తకాలతో విడదీయలేని అనుబంధం ఏర్పడింది. అయితే 18 ఏళ్లకే నేను అసిస్టెంట్‌గా ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించాను. ఆ తర్వాత హీరోగా మారాను. కానీ నేను ఇప్పటికీ పెద్దగా సినిమాలు చూడను. కొందరికి ఫుట్‌బాల్ ఆడటం ఇష్టం.. మరికొందరికి చూడటం ఇష్టం. నేను ఆడే రకం. సినిమాలు చేస్తాను కానీ చూడను’’ అని చెప్పా రు ఆమిర్ ఖాన్. ఇదిలా ఉంటే ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్న ‘ఏక్ దిన్’ మే 1న, ‘లాహోర్ 1947’ ఆగస్టు 13న విడుదల కానున్నాయి. -
నయనతార.. ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్
పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్‌కి నిజమైన అర్హత సాధించిన నటి నయనతార. ఒక్కో భాషలో ఒక్కో సినిమా చేస్తూ, ఐదు భాషల్లో ఒకేసారి సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నయనతార తెలుగులో ఒక సినిమా షూటింగ్ దశలో ఉంది. మలయాళంలో రెండు సినిమాలు సెట్స్‌పై కొనసాగుతున్నాయి. తమిళంలో రెండు సినిమాలు రెడీ అయ్యాయి. మరో సినిమా షూటింగ్లో ఉంది. కన్నడలో ఆమె నటించిన టాక్సిక్ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక హిందీ బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సరసన నటించేందుకు సైన్ చేసింది. ఇంతకుముందు షారూక్ ఖాన్‌తో కలిసి జవాన్ చిత్రంలో నయనతార నటించింది. ఇప్పుడు సల్మాన్‌తో కలిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్లో కీలక పాత్ర పోషించనుంది. ఇందులో కూడా ఆమె పాత్రకు యాక్షన్ టచ్ ఉండనుందని సమాచారం. ఇలా ఒకేసారి ఐదు భాషల్లో సినిమాలు చేస్తూ నిజమైన పాన్ ఇండియా హీరోయిన్గా నిలుస్తోంది నయనతార. నయనతార ఈ స్థాయికి రావడానికి గల కారణాల్లో ఆమె సినిమాల ఎంపికలో చూపే వైవిధ్యం ఒకటి. తన నటనతో ఇప్పటికే దక్షిణాది భాషల్లో బలమైన స్థానం సంపాదించుకున్న ఈ నటి ఇప్పుడు బాలీవుడ్లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకునే ప్రయత్నంలో ఉంది. -
దురంధర్-2ను వదలని పైరసీ.. యూట్యూబ్‌లో ప్రింట్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈనెల 19న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పటికే దురంధర్ వసూళ్లను క్రాస్ చేసింది. కేవలం 11 రోజుల్లోనే రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ సీక్వెల్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లో రిలీజ్ కావడంతో రెండు వేల కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాకిస్తాన్‌కు వెళ్లిన ఇండియన్ స్పై జీవితం ఆధారంగా తెరకెక్కించారు.బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోన్న ఈ చిత్రానికి పైరసీ గండం తప్పింది. అయితే పైరసీ కేటుగాళ్లు ఈ మూవీని యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. ఇది గమనించిన దురంధర్ అభిమానులు వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై వెంటనే అప్రమత్తమై దురంధర్ టీమ్ పైరసీ కంటెంట్‌ను తొలగించాలని యూట్యూబ్‌ను కోరింది. దీంతో వెంటనే స్పందించిన యూట్యూబ్ ఆ వీడియోను తొలగించింది. త్వరగా రెస్పాండ్ కావడంతో పైరసీ గండం నుంచి తప్పించుకున్నారు మేకర్స్. లేకపోతే దురంధర్ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడేదని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పైరసీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సోషల్ మీడియాలో ఆదిత్య ధర్‌ను ట్యాగ్ చేశారు.కాగా.. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్గా కనిపించింది. ఈ మూవీలో అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు. -
మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి: సోనమ్‌కపూర్
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఇంట సంతోషాలు రెట్టింపు అయ్యాయి. ఈ నెల 29న సోనమ్ కపూర్ పండంటి మగ శిశువుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించి, తన ఆనందాన్ని వ్యక్తం చేశారు సోనమ్. ‘‘ప్రేమతో నిండిన మా హృదయాలతో మా బాబు రాకను మేం ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాం. మరో బిడ్డ రాకతో మా ఇంట ఆనందం వెల్లివిరిసింది. మా హృదయాలు మరింత సంతోషంతో నిండిపోయాయి.వాయు(పెద్ద కుమారుడు) తన తమ్ముడిని స్వాగతించడానికి ఆసక్తిగా ఉన్నాడు. నలుగురు ఉన్న కుటుంబంగా మా జీవితాల్లో మేం ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాం. అందరికీ కృతజ్ఞతలు.. ప్రేమతో సోనమ్, ఆనంద్, వాయు’’ అన్న నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు సోనమ్ కపూర్. సోనమ్‌కపూర్ (నటుడు– నిర్మాత అనిల్ కపూర్ కుమార్తె) వివాహం వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజ తో 2018లో జరిగింది. ఈ దంపతులకు 2022లో కుమారుడు ‘వాయు’ జన్మించిన సంగతి తెలిసిందే. -
ప్రభాస్, మహేశ్, తారక్ సినిమాలు చూస్తా.. అవన్నీ కూడా!
స్టార్ హీరోయిన్ రవీనా టండన్ కూతురు రాషా తడానీ అప్పుడే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. చేసింది ఒక్క సినిమా (ఆజాద్)నే అయినా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఆజాద్ మూవీలో ఉయి అమ్మా పాటలో డ్యాన్స్‌తో ఇరగదీసి సెన్సేషన్ అయింది. ఈ బ్యూటీ శ్రీనివాస మంగాపురం మూవీతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. సూపర్‌స్టార్ కృష్ణ నటవారసత్వాన్ని కొనసాగిస్తూ ఘట్టమనేని జయకృష్ణ (రమేశ్‌బాబు తనయుడు) వెండితెరకు హీరోగా పరిచయం కాబోతున్నాడు.సౌత్ సినిమాలంటే ఇష్టంఈ మూవీలో రాషా తడానీ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. నాకు దక్షిణాది సినిమాలు చూడటమంటే చాలా ఇష్టం. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్‌బాబు.. ఇలా అందరి సినిమాలు చూస్తుంటాను. వాళ్ల సినిమాలన్నీ కొత్త అనుభూతినిస్తాయి. ఇప్పుడదే ఇండస్ట్రీలో భాగం కావడం సంతోషంగా ఉంది. దీన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను.హీరోయిన్స్ కూడా..హీరోలే కాదు, అక్కడ హీరోయిన్స్ రష్మిక మందన్నా, శ్రీలీల.. ఇలా అందరూ స్ఫూర్తిదాయకంగా ఉంటారు. అలాంటి సినీ ప్రపంచంలో భాగమయ్యే అవకాశం లభించినందుకు గర్వంగా ఉంది. నా జర్నీ చక్కగా ముందుకు సాగుతుందనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. శ్రీనివాస మంగాపురం విషయానికి వస్తే.. ఆర్ఎక్స్ 100, మంగళవారం ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది. మరోవైపు రాషా.. లైకే లైకా అని ఓ హిందీ మూవీ కూడా చేస్తోంది.చదవండి: బాలీవుడ్ అంటే భయపడుతున్న నాగచైతన్య? నిజమిదే! -
ఫస్ట్‌ది అట్టర్ ఫ్లాప్.. అందుకే హిందీలో సినిమా చేయట్లేదా? చై ఆన్సరిదే!
టాలీవుడ్ హీరో నాగచైతన్య చివరగా తండేల్ సినిమాతో భారీ హిట్ కొట్టాడు. ప్రస్తుతం వృషకర్మ మూవీతో బిజీగా ఉన్నాడు. అయితే టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన లాల్ సింగ్ చద్దా (2022) మూవీతో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఆమిర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత మళ్లీ హిందీ సినిమా ట్రై చేయలేదు చై.కారణమంటూ ఏం లేదుబాక్సాఫీస్ వైఫల్యం వల్లే అతడు మళ్లీ హిందీ సినిమా చేయడానికి భయపడుతున్నాడని ప్రచారం జరిగింది. దానిపై నాగచైతన్య తాజాగా స్పందించాడు. అతడు మాట్లాడుతూ.. నేను హిందీలో మళ్లీ మూవీ చేయకపోవడానికి ప్రత్యేక కారణమంటూ ఏదీ లేదు. తెలుగులో బిజీ అయిపోయానంతే! మళ్లీ మంచి అవకాశం వస్తే తప్పకుండా బాలీవుడ్లో యాక్ట్ చేస్తాను. లాల్ సింగ్ చద్దా వైఫల్యం వల్ల మాత్రం నేను వెనకడుగు వేయలేదు. చాలా ఎంజాయ్ చేశాఆ మూవీ షూటింగ్ నేను చాలా ఎంజాయ్ చేశాను. అక్కడి జనం దగ్గరినుంచి ఎంతో నేర్చుకున్నాను, వాళ్లు నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఆ అనుభవం మాటల్లో చెప్పలేను. ఇక సినిమా రిజల్ట్ అంటారా? బాక్సాఫీస్ వద్ద ఒడిదుడుకులు సహజం అని అర్థం చేసుకునేంత పరిణతి మాకుందని భావిస్తున్నాను. ఈ ఫలితాలు మా లక్ష్యసాధనను ఏమాత్రం అడ్డుకోలేవు. సక్సెస్, ఫెయిల్యూర్ నా మైండ్‌సెట్‌ను మార్చలేవు అని నాగచైతన్య పేర్కొన్నాడు.చదవండి: అది నిజం కాదు, ఎవరూ నమ్మకండి: ఖుష్బూ -
విజయ్ దేవరకొండ మూవీలో సారా అర్జున్ తండ్రి.. ఏ సినిమానో తెలుసా?
'నాన్న', 'పొన్నియన్ సెల్వన్' సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన సారా అర్జున్. 'ధురంధర్' సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. తన తొలి సినిమాకే ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇందులో 40 ఏళ్ల హీరో రణ్వీర్ సింగ్‌కు జంటగా నటించింది. కేవలం 20 ఏళ్ల సారా అర్జున్ తన గ్లామర్‌తో అభిమానులను మెప్పించింది. ఆ తర్వాత తెలుగులోనూ యూఫోరియా మూవీతో అలరించింది.ప్రస్తుతం సారా నటించిన దురంధర్-2 థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో సారా అర్జున్ గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సారా అర్జున్‌కు సంబంధించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె తండ్రి రాజ్ అర్జున్ సైతం తెలుగు సినిమాల్లో నటించడం విశేషం.విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన డియర్ కామ్రేడ్ మూవీలో క్రికెట్ సెలక్టర్ రమేశ్ రావు పాత్రలో మెప్పించారు. అంతేకాకుండా గతేడాది రిలీజైన రజాకార్ చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆయన కుమార్తె సారా అర్జున్ సైతం తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. 2002లో కంపెనీ అనే మూవీతో అరంగేట్రం రాజ్ అర్జున్ దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించారు. సీక్రెట్ సూపర్‌స్టార్ అనే చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే ఫేవరేట్ హీరో..గతంలో యూఫోరియా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సారా అర్జున్ తెలుగులో నటించడం చాలా గర్వంగా ఉందని చెప్పింది. టాలీవుడ్లో మీ ఫేవరేట్ హీరో ఎవరని యాంకర్ ప్రశ్నించింది. దీనికి బదులిస్తూ తెలుగులో చాలామంది హీరోలు ఉన్నారని.. కానీ నాకు మాత్రం విజయ్ దేవరకొండ ఫేవరేట్ అని బాలీవుడ్ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఆమె తండ్రి రాజ్ అర్జున్ డియర్ కామ్రేడ్లో నటించడం వల్లే సారా అర్జున్ తన ఫేవరేట్ హీరో అని చెప్పుకొచ్చింది. -
సినిమాలు చూసే అలవాటు లేదు.. ఇంట్లో ఒప్పుకోరు!: ఆమిర్ ఖాన్
తాను పెద్దగా సినిమాలు చూడనంటున్నాడు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్. చిన్నప్పుడు చేతికి పుస్తకాలిచ్చేవారే తప్ప సినిమాలు చూసేందుకు అనుమతిచ్చేవారు కాదని, దాంతో అదే అలవాటైపోయిందని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. నేను చాలా సాంప్రదాయ కుటుంబంలో పెరిగాను. మా అమ్మానాన్న చాలా స్ట్రిక్ట్.. సినిమాలు చూసేందుకు అంతగా అనుమతిచ్చేవారు కాదు. అమ్మ అనుమతితోనే..దాంతో పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేవాడిని. కేవలం దూరదర్శన్‌లో వచ్చిన బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, మరీ పాత సినిమాలు మాత్రమే చూశాను. ఎప్పుడైనా సినిమా చూడాలనుకుంటే మా అమ్మను అనుమతి అడిగేవాడిని. తను ఓకే చెప్తేనే చూసేదాన్ని, లేదంటే లేదు. అయితే రొమాంటిక్ సినిమాలు చూడటం మాత్రం నిషిద్ధం. కేవలం వారాంతాల్లో మూవీస్ చూసేవాడిని.సినిమాలు చూడనుఅయితే విచిత్రంగా 18 ఏళ్లకే నేను సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించి తర్వాత హీరోగా మారాను. అయితే ఇప్పటికీ నేను పెద్దగా సినిమాలు చూడను. ఫన్నీగా చెప్పాలంటే.. కొందరికి ఫుట్‌బాల్ ఆడటం ఇష్టం, మరికొందరికి చూడటం ఇష్టం. అలా నేను సినిమాలు చేస్తాను, కానీ చూడను. ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన సినిమాలేవీ చూడలేదు. నా ప్రపంచంలో నేను బతికేస్తుంటాను అని చెప్పుకొచ్చాడు.సినిమాఇకపోతే ఆమిర్ చివరగా సితారే జమీన్ పర్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం నిర్మాతగా ఏక్ దిన్, లాహోర్ 1947 అని రెండు సినిమాలు చేస్తున్నాడు. ఏక్ దిన్లో.. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటించగా సాయిపల్లవి కథానాయికగా కనిపించనుంది. ఇది వన్ డే అనే థాయ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది. ఏక్ దిన్ మే 1న విడుదల కానుంది.చదవండి: ధురంధర్ రికార్డు బ్రేక్ చేసిన ధురంధర్ 2 -
విషాదం.. సముద్రంలో పడిపోయి హీరో కన్నుమూత
బెంగాలీ చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. హీరో రాహుల్ అరుణోదయ్ బెనర్జీ (42) ప్రమాదవశాత్తూ మరణించారు. సీరియల్ షూటింగ్ కోసం ఆదివారం (మార్చి 29) నాడు పశ్చిమ బెంగాల్‌లోని డిఘ ప్రాంతానికి వెళ్లిన ఆయన చిత్రీకరణ ముగిశాక కాలక్షేపం కోసం ఒంటరిగా సముద్రంలో విహారానికి వెళ్లారు. అయితే పడవలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయారు. బీచ్‌లో విషాదంఅది గమనించిన రక్షణా సిబ్బంది వెంటనే ఆయన్ను బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఒడిశా- పశ్చిమ బెంగాల్ సరిహద్దుకు సమీపంలోని తల్సారి బీచ్‌లో ఈ విషాద ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా రాహుల్ బెనర్జీకి భార్య ప్రియాంక సర్కార్, ఒక కుమారుడు ఉన్నారు.ఇండస్ట్రీకి తీరని లోటుహీరో మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాకు ఇష్టమైన నటుల్లో రాహుల్ ఒకరు.. ఆయన ఇక లేరనే వార్త నన్ను షాక్‌కు గురి చేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. తన మరణం బెంగాలీ చిత్రపరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు.సినిమారాహుల్ అరుణోదయ్ బెనర్జీ (Rahul Arunoday Banerjee) 1983 అక్టోబర్ 16న జన్మించారు. చిరోదిని తుమీ జే అమర్ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. లవ్ సర్కస్, షోనో మోన్ బోలీ తోమయ్, నా హణ్యతే, కగోజెర్ బో వంటి పలు సినిమాలు చేశారు. సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకూ దగ్గరయ్యారు.చదవండి: ఓపక్క షూటింగ్.. మరోపక్క భార్య కోసం ఆరాటం -
దురంధర్-2 మరో రికార్డ్.. కేవలం 11 రోజుల్లోనే బ్రేక్..!
బాలీవుడ్ మూవీ దురంధర్-2 బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల రికార్డులు బద్దలు కొట్టిన ఈ మూవీ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం 11 రోజుల్లోనే మరో రికార్డ్ క్రియేట్ చేసింది. గతేడాది రిలీజైన దురంధర్ ఆల్ టైమ్ వసూళ్లను అధిగమించింది.ఇప్పటి వరకు దురంధర్-2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1,363.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇండియావ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.1013.15 కోట్లు రాగా.. ఓవర్సీస్లో రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా నెట్ వసూళ్ల పరంగా చూస్తే రూ. 847.87 కోట్లు వసూలు చేసింది. గతేడాది డిసెంబర్ 5, 2025న విడుదలైన 'ధురందర్' ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 1,307.35 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మనదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో భారతీయ చిత్రంగా 'ధురందర్: ది రివెంజ్' నిలిచింది. దీనికంటే ముందు ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ (2016) రూ. 2,070 కోట్లతో జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత ప్రభాస్ బాహుబలి- 2 (2017) రూ. 1,788 కోట్లతో ఉంది. అల్లు అర్జున్ పుష్ప- 2 (2024) రూ. 1,742 కోట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.కాగా.. రణవీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్స్ దురంధర్ చిత్రాలకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీస్‌లో సారా అర్జున్ హీరోయిన్గా మెప్పించారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, రాకేష్ బేడీ, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. -
నాలుగు పదుల వయస్సులో తల్లైన హీరోయిన్
బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ రెండోసారి తల్లిగా ప్రమోషన్ కొట్టేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ రోజు మార్చి 29, 2026న మాకు బాబు పుట్టాడని తెలిపింది. ఈ విషయాన్ని ప్రకటించేందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామని రాసుకొచ్చింది. ఇప్పటికే ఆమెకు వాయు అనే కుమారుడు ఉన్నారు. తాజాగా రెండోసారి కూడా సోనమ్ కపూర్‌కు మగబిడ్డ జన్మించారు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోనమ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..' అపారమైన కృతజ్ఞతతో.. ప్రేమ నిండిన హృదయాలతో మార్చి 29న మా బాబు రాకను ప్రకటించడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఇప్పుడు మా కుటుంబం మరింత పెద్దదైంది. బాబు రాకతో మా హృదయాలు మరింత సంతోషంతో నిండిపోయాయి. వాయు తన తమ్ముడిని స్వాగతించడానికి ఆసక్తిగా ఉన్నాడు. మరో బిడ్డ రాకతో మా ఇంట ఆనందం వెల్లి విరిసింది. ఇప్పుడు నలుగురితో ఈ అందమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినందుకు మేము కృతజ్ఞతతో ఉన్నాం. ఇట్లు ప్రేమతో సోనమ్, ఆనంద్ అండ్ వాయు' అంటూ పోస్ట్ చేసింది.వ్యాపారవేత్తతో పెళ్లి..ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహూజా 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2022లో వాయు అనే కుమారుడు జన్మించాడు. సినిమాల విషయానికి వస్తే.. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో 'సావరియా' మూవీతో సోనమ్ వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాంబే టాకీస్, బ్లైండ్, ప్రేమ రతన్ ధన్‌పాయో, నీర్జా, సంజు, థాంక్యూ, రాంఝన, ఖుబ్సూరత్ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) -
ఓపక్క షూటింగ్స్.. మరోపక్క భార్య కోసం హీరో ఆరాటం!
ఒక సినిమా హిట్టయిందంటే.. దానికి సీక్వెల్‌గా వచ్చేదానిపై భారీ అంచనాలుంటాయి. ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. అయితే ఈ పరీక్షను ఈజీగా నెగ్గేసింది ధురంధర్ టీమ్. రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఈ మూవీ వచ్చిన మూడు నెలల్లోపే సీక్వెల్ కూడా రెడీ చేసి వదిలాడు దర్శకుడు ఆదిత్య ధర్.గర్భిణి అయిన భార్య కోసం..రెండో భాగం కూడా ప్రేక్షకుల మనసు గెల్చుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రికార్డు తిరగరాస్తోంది. రణ్వీర్ సింగ్ యాక్టింగ్, డెడికేషన్‌కు సినీప్రియులు ఫిదా అవుతున్నారు. ధురంధర్ మొదటి భాగం చిత్రీకరణ సమయంలో అతడి భార్య, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గర్భిణీ అన్న విషయం తెలిసిందే! ఓపక్క బిజీ షెడ్యూల్లో పని చేస్తూనే మరోపక్క భార్య కోసం సమయం కేటాయించాడట! ఈ విషయాన్ని ధురంధర్ మూవీ నటుడు అభయ్ అరోరా వెల్లడించాడు.నిజంగా అద్భుతంరణ్వీర్ షూటింగ్ మధ్యలో మూడు, నాలుగు రోజులు గ్యాప్ దొరికినా సరే.. వెంటనే విమానం ఎక్కి ఇంట్లో వాలిపోయేవాడు. భార్యను, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునేవాడు. కాస్తంత సమయం దొరికినా కుటుంబం కోసం సమయం కేటాయించేవాడు. అతడు ఫ్యామిలీని చూసుకునే విధానం నిజంగా అద్భుతం అని పేర్కొన్నాడు. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె.. రామ్‌లీలా సినిమా (2013) సెట్లో ప్రేమలో పడ్డారు. 2015లో ఎంగేజ్మెంట్ చేసుకోగా 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2024 సెప్టెంబర్ 8న కూతురు దువా జన్మించింది.చదవండి: ఈవారం ఓటీటీల్లో బోలెడన్ని సినిమాలు.. ఏమేం ఉన్నాయంటే? -
జోడీ కుదిరింది
సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రానుందని, ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్నారనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సల్మాన్ ఖాన్ సరసన నయనతార నటించడం దాదాపు ఖరారైయిందని, కథ నచ్చి ఆమె ఒప్పుకున్నారని సమాచారం.ఈ జోడీ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. ఇక ఈ సినిమా చిత్రీకరణను ఏప్రిల్ చివర్లో ప్రారంభించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని భోగట్టా. మరోవైపు ప్రస్తుతం సల్మాన్ ‘మాతృభూమి’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. -
సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న బెస్ట్ ఫ్రెండ్స్
ఇప్పటి హీరోలు క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడ్డానికైనా సిద్దంగా ఉంటారు. తమ మేకోవర్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. రీసెంట్గా వచ్చిన ఇద్దరు హీరోల లుక్స్ చూస్తే ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తుంది. ఆ ఇద్దరు హీరోల్లో ఒకరు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, మరొకరు అతడి బెస్ట్ ఫ్రెండ్ శర్వానంద్.వీరిద్దరూ తమ మేకోవర్స్‌తో టోటల్ ఇండస్ట్రీని ఆకర్షిస్తున్నారు. ముందుగా రామ్ చరణ్ విషయానికొస్తే, తాజాగా తన పుట్టినరోజు నాడు రిలీజైన 'పెద్ది' సినిమా రెండో గ్లింప్స్ లో అందర్నీ ఆకట్టుకున్న అంశం చరణ్ బాడీ. ఆ పహిల్వాన్ లుక్ కోసం చరణ్ ఎంత కష్టపడ్డాడో ఆ లుక్ చూస్తుంటే ఇట్టే అర్థమైపోతుంది.చరణ్ ఈ లుక్ కోసం కొన్ని నెలల పాటు మాంసాహారం మానేశాడని సమాచారం. ఓవైపు అయ్యప్ప దీక్షలో ఉంటూనే, మరోవైపు పహిల్వాన్ లుక్ కోసం కసరత్తులు చేశాడు. పహిల్వాన్ లుక్ కోసం నిజమైన పహిల్వాన్లు చేసే కసరత్తులనే చరణ్ చేశాడు. అలా దాదాపు 8 నెలల పాటు ఎంతో కష్టపడి మరీ ఈ కండలు తిరిగే దేహాన్ని చరణ్ సొంతం చేసుకున్నాడు.అయితే శర్వానంద్ బైకర్ రోల్ కోసం మరింత స్ఫూర్తిదాయకమైన ప్రయాణం చేశాడు. ఆ రోల్ కోసం ఇతడు పడిన కష్టం అంతా ఇంతా కాదనే చెప్పాలి. బైకర్ చిత్ర దర్శకుడు శర్వాను 6-8 కిలోలు తగ్గితే చాలన్నాడట. కానీ శర్వానంద్ మాత్రం అంతకుమించి కష్టపడ్డాడు. అక్షరాలా రోజుకు 32 కిలోమీటర్లు పరుగెత్తేవాడని సమాచారం.42 సంవత్సరాల శర్వానంద్ 18 ఏళ్ల బైక్ రేసర్‌గా కనిపించేందుకు తన శరీరంలోని ప్రతి అణువునూ కరిగించేలా కసరత్తు చేశాడట. ప్రస్తుతం తన ఒంట్లో ఏమాత్రం కొవ్వు లేనంత బక్కపల్చగా తయారయ్యాడు. ఇలా టీనేజర్ గా కనిపించడం కోసం శర్వానంద్ ఏకంగా రెండేళ్లు కష్టపడ్డాడు. ఇక బైకర్ ట్రయిలర్ ఎంత క్లిక్ అయిందో, అందులో శర్వా లుక్ అంతకంటే ఎక్కువగా అందరి ప్రశంసలు పొందింది. -
ప్రియురాలిని పెళ్లాడిన బిగ్‌బాస్ కంటెస్టెంట్
ఇప్పుడంతా ఎక్కడ చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్లో విరోష్ జంటతో అల్లు శిరీష్ కూడా ఓ ఇంటివాడయ్యారు. మరో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ రజత్ దలాల్ ఓ ఇంటివాడయ్యారు. తన ప్రియురాలిని ఆయన పెళ్లాడారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌గా పేరు తెచ్చుకున్న రజత్ దలాల్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. అత్యంత సన్నిహితులు, మిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభం అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. మీ అందరి ఆశీస్సులు కావాలంటూ కోరారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు అభిమానులు నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు.రజత్ దలాల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే కాదు..పలు రియాలిటీ షోల్లో పాల్గొన్నారు. బిగ్‌బాస్-18 సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ది 50 అనే రియాలిటీ షోతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. -
దురంధర్-2పై విమర్శలు.. దెబ్బకు సోషల్ మీడియా ఖాతా డిలీట్...!
మార్చి నెల అంతా దురంధర్ పేరే వినిపిస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు దాటేసింది. వసూళ్ల పరంగా ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. పార్ట్-1 రిలీజైన మూడు నెలల్లోనే సీక్వెల్ కూడా రావడంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. మొదటి నుంచే భారీ అంచనాలు ఉండడంతో ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఇప్పటికే సౌత్ స్టార్స్ సైతం ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురందర్: ది రివెంజ్' మార్చి 19న థియేటర్లలో రిలీజైంది.అయితే ఈ మూవీ ఒకవైపు ప్రశంసలు వస్తుంటే.. విమర్శలు సైతం అదేస్థాయిలో చేస్తున్నారు. ప్రాపగండ అనే ముద్ర వేస్తున్నారు. బాలీవుడ్ నటి అని అనీల్ పడ్డా సోదరి రీత్ పడ్డా దురంధర్ సీక్వెల్‌పై విమర్శలు చేసింది. ఈ సినిమా 'ది కేరళ స్టోరీ', 'ది కాశ్మీర్ ఫైల్స్' లాంటి చిత్రాల్లాగే ప్రాపగండగా చిత్రీకరించారని కామెంట్స్ చేశారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఈ వివాదంతో ఊహించని విధంగా ఆమె ఇన్‌స్టా ఖాతా డిలీట్ చేసేసింది. మొదట ప్రైవేట్‌గా ఉంచిన రీత్ పడ్డా.. ఆ తర్వాత ఏకంగా ఖాతానే తొలగించింది. ప్రస్తుతం ఇన్‌స్టాలో ఆమె ప్రొఫైల్ అందుబాటులో లేదు. ఈ వివాదం తర్వాత ఆమె లింక్డ్ఇన్ ఖాతాను కూడా తొలగించినట్లు తెలుస్తోంది. ధురందర్తో సహా ది కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ చిత్రాలను రీత్ విమర్శించడంతో ఈ వివాదం మొదలైంది. దీనిపై నెట్టింట పెద్దఎత్తున ట్రోల్స్ రావడంతో ఏకంగా సోషల్ మీడియా ఖాతానే మూసేయాల్సి వచ్చింది.అంతేకాకుండా రీత్ వ్యక్తిగత జీవితంపై కూడా ఆన్లైన్లో ట్రోల్స్ వచ్చాయి. ఫాజిల్ అహ్మద్ అనే వ్యక్తితో ఆమెకు రిలేషన్ ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అయితే తమపై వస్తున్న ట్రోల్స్‌పై రీత్ గానీ, అనీత్ పడ్డా గానీ వాటిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు నటి అనీత్ పడ్డా మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న 'శక్తి శాలిని' చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. -
సినిమాలు మానేయాలని కండీషన్.. అందుకే ఆ హీరోతో పెళ్లి క్యాన్సిల్
ఒకప్పుడు సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణించింది ముంతాజ్. ఖిలోనా, దో రాస్తే, తేరే మేరే సాప్నే, రోటి వంటి పలు చిత్రాలతో మెప్పించింది. కానీ పెళ్లయిన వెంటనే సినిమాలకు దూరమైంది. అందుకు గల కారణాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ముంతాజ్ మాట్లాడుతూ.. నేను సాంప్రయదాయక ఇరానీ కుటుంబం నుంచి వచ్చాను. ఫలానా వయసు రాగానే పెళ్లి చేసేయాలని మా నాన్న ఆలోచన. అలాగే 40, 50 ఏళ్లుచ్చేవరకు మహిళలు పని చేయకూడదని అనుకుంటాడు. పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదని..మా ఇంట్లో అందరూ నాకు త్వరగా పెళ్లి చేయాలనే అనుకున్నారు. నాకు ఏడెనిమిదేళ్ల వయసున్నప్పుడే నా భర్త కుటుంబం గురించి తెలుసు. వాళ్లు మా పొరిగింట్లోనే ఉండేవారు. అలా వాళ్ల గురించి పూర్తిగా తెలుసు గనకే నన్ను ఆ ఇంటికి పంపించారు. పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదని అమ్మ మరీమరీ చెప్పింది. అత్తింట్లో బాగా చూసుకుంటారని ధైర్యం ఇచ్చింది. నేనెప్పుడూ ఇంట్లో వాళ్ల మాట కాదనలేదు. నాకు ఇంకొంతకాలం సినిమాలు చేయాలన్న ఆశయితే ఉండేది. నా భర్త ఓపికగా ఎదురుచూశాడుకానీ, ఇంట్లో వాళ్లను నొప్పించలేక మయూర్‌ను పెళ్లి చేసుకున్నాను. అతడు భారత్‌లో ఉండేవాడు కాదు, ఇంగ్లాండ్‌లో చదువుకునేవాడు. అతడి కుటుంబం ఉగాండాలో బిజినెస్ చేస్తుండేది. వారిది మంచి ఉన్నత కుటుంబం. అయితే పెళ్లయ్యాక వెంటనే సినిమాలు మానేయలేదు. అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టుల షూటింగ్స్‌లో పాల్గొన్నాను. దాదాపు రెండేళ్లలో షూటింగ్స్ అన్నీ పూర్తి చేసుకున్నాను. అప్పటివరకు నా భర్త ఎంతో ఓపికగా ఎదురుచూశాడు అంది.చాలా చిన్నదాన్నినటుడు షమ్మీ కపూర్‌తో పెళ్లి ఎందుకు ఆగిపోయిందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని. నా మనసులో పెళ్లి ఆలోచనే లేదు. పైగా షమ్మీ తండ్రి పృథ్వీరాజ్ కపూర్.. తనకు కాబోయే కోడలు పని చేయకూడదని కండీషన్ పెట్టాడు. నాకంటూ అప్పుడు చాలా కలలు, కోరికలున్నాయి. అందుకే పెళ్లి కన్నా పని ముఖ్యమనుకున్నాను. పర్సనల్ లైఫ్ఆయన పెట్టిన కండీషన్ వల్లే షమ్మీ భార్య గీతా బాలాజీ కూడా పెళ్లవగానే సినిమాలు మానేసింది అని చెప్పుకొచ్చింది. కాగా ముంతాజ్.. షమ్మీ కపూర్‌ను పెళ్లాడేందుకు రెడీ అయింది. వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. అనంతరం ఉంగాడాలో బిజినెస్ చేసే మయూర్ మాధ్వానిని 1974లో పెళ్లాడింది. వీరికి ఇద్దరు కూతుర్లు సంతానం.చదవండి: నా బిడ్డను ముద్దు పెట్టుకోకూడదు: మెరీనా వార్నింగ్ -
రెండు వారాలుగా బెడ్‌పైనే స్టార్ హీరో ప్రియురాలు.. అదే కారణం?
క్రిష్, వార్ 2 తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. గత నాలుగేళ్లుగా షబా ఆజాద్ అనే నటి, సింగర్‌తో రిలేషన్లో ఉన్నాడు. గతంలో సుస్సానే ఖాన్ని పెళ్లి చేసుకున్నప్పటికీ.. ఆమెకు విడాకులు ఇచ్చేసి షబాతో కలిసి ఉంటున్నాడు. ఇప్పుడు ఈమెకు భయంకరమైన అనారోగ్య సమస్య వచ్చింది. స్వయంగా దాని గురించి ఈమె ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: చిరంజీవి చనిపోయారని పోస్ట్.. వ్యక్తిపై కేసు)'సైక్లోస్పోరా కయోటానెన్సిస్' అనే పారాసైట్(పరాన్నజీవి) వల్ల కలిగే వ్యాధిని 'సైక్లోస్పోరియాసిస్' అంటారు. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే.. జీర్ణవ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అవుతుంది. షబా అజాద్ ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. గడిచిన 14 రోజులు తన జీవితంలో అత్యంత దారుణంగా గడిచాయని చెప్పుకొచ్చింది. రోజుకు రెండుసార్లు జిమ్‌లో వర్కౌట్లు చేసే తాను.. ఇప్పుడు కనీసం టూత్ పిక్ ఎత్తలేకపోతున్నానని రాసుకొచ్చింది. కేవలం రెండు వారాల్లోనే 4 కిలోల బరువు తగ్గిపోయానని, దీన్నిబట్టి ఇన్ఫెక్షన్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొంది.ఈ ఇన్ఫెక్షన్ సోకడం వెనకున్న కారణం తెలిసి షబా షాకయ్యింది. ఎప్పుడూ ఇంటిలో వండిందే తింటానని, బయటకెళ్లినా నీళ్ల బాటిల్ వెంట తీసుకెళ్తానని, ఇంత శుభ్రత పాటించినా ఈ పరాన్నజీవి తన శరీరంలోకి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదని చెప్పింది. మనం తినే ఆకుకూరలు, సలాడ్స్, కూరగాయలు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కూరగాయలు కేవలం నీటితో కడిగితే సరిపోదని, బేకింగ్ సోడాతో శుభ్రం చేయాలని చెప్పుకొచ్చింది. పచ్చిగా తినే ఆహార పదార్థాల ద్వారానే ఇలాంటి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదముందని హెచ్చరించింది. ఈ కష్టకాలంలో హృతిక్ రోషన్(ప్రియుడు) తనకు కొండంత అండగా ఉన్నాడని చెప్పుకొచ్చింది. నా మూడ్ ఎంత బాగోలేకపోయినా పక్కనే ఉండి నవ్విస్తున్నాడని, ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటోని షబా షేర్ చేసింది.(ఇదీ చదవండి: 'ధురంధర్' విలన్ తెలుగు సినిమా.. క్రేజీ అప్డేట్) View this post on Instagram A post shared by Saba Azad (@sabazad) -
హనుమాన్ జయంతికి రామ గ్లింప్స్
భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా రూపొందుతున్న హిందీ చిత్రం ‘రామాయణ’. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ సంస్థ, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై భారీ బడ్జెట్‌తో నమిత్ మల్హోత్రా ఈ సినిమాను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.తొలి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి, రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. కాగా శుక్రవారం (మార్చి 27) శ్రీరామ నవమి పండగ సందర్భంగా ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం నుంచి ‘రామ’ గ్లింప్స్‌ను హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లుగా నమిత్ మల్హోత్రా తెలిపారు. ‘‘రామాయణం మన అందరికీ చెందిన కథ.‘రామాయణ’ చిత్రాన్ని నిజమైన స్ఫూర్తితో, అత్యంత చిత్తశుద్ధితో తెరపైకి తీసుకురావడానికి మేము వేసే ప్రతి అడుగుకూ అపారమైన బాధ్యత, భక్తి శ్రద్ధలే మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. కొన్నేళ్లుగా మేం చేసిన కృషిని ఫ్యాన్స్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా ప్రదర్శించనున్నాం. ఆ క్షణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుందాం’’ అని నమిత్ మల్హోత్రా ‘ఎక్స్’లో షేర్ చేశారు. అయితే ‘రామ’ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ అమెరికాలో జరగనుందని బాలీవుడ్ టాక్. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్. -
మోనాలిసా సంచలన ఆరోపణలు.. షాకిచ్చిన దర్శకుడు..!
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాతో పాపులర్ అయిన మోనాలిసా భోంస్లే ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. తనకు మొదటిసారిగా సినిమా ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించిన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేసింది. షూటింగ్ సెట్లో సనోజ్ మిశ్రా తన పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించారని మోనాలిసా వాపోయింది. షూటింగ్ పేరుతో తన శరీరాన్ని పలుమార్లు తాకుతూ చాలా ఇబ్బందిపెట్టేవాడిని చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పినా పట్టించుకోలేదని పేర్కొంది. దీంతో ఈ టాపిక్ బాలీవుడ్ చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలోనే తనపై వస్తున్న ఆరోపణలపై డైరెక్టర్ సనోజ్ మిశ్రా స్పందించారు. దర్శకుడు మోనాలిసా చేసిన ఆరోపణలను ఖండించారు. నేను ఎవరికైతే అండగా నిలబడ్డానో.. ఆమె నన్ను ఇబ్బందుల్లో పడేసిందని అన్నారు. కేవలం నేను ఆమె ఫర్మాన్ ఖాన్‌తో వెళ్లిపోవడాన్ని వ్యతిరేకించినందుకే మోనాలిసా నాపై ఆరోపణలు చేసిందని అన్నారు. తనకు నటించడం కూడా నేనే నేర్పించా.. తన కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఉజ్జయినిలోని నా ఇంట్లోనే నివసిస్తున్నారని సనోజ్ మిశ్రా తెలిపారు. ఆమె పెళ్లిని తాను వద్దన్నందుకే ఇలా చేసిందని వెల్లడించారు. ఆమె తల్లిదండ్రులు కూడా పెళ్లిని వ్యతిరేకించారని.. ఈ వివాహం చెల్లదని ప్రకటించారని పేర్కొన్నారు. పరువు నష్టం దావా వేస్తా..మోనాలిసాపై త్వరలోనే పరువు నష్టం దావా వేస్తానని సనోజ్ మిశ్రా వెల్లడించారు. ఒకటి రెండు రోజుల్లో పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. ఒకవేళ తాను చెప్పేది నిజమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని తెలిపారు. అలాగే ఈ సినిమా నిర్మాణం ఇక జరగదు.. ఎందుకంటే ఆమె దాని గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఇక సినిమా అనేది పూర్తిగా వేరే అంశమని సనోజ్ మిశ్రా అన్నారు. మోనాలిసా లైంగిక ఆరోపణలు చేసిన తర్వాత సనోజ్ మిశ్రా స్పందించారు. ప్రస్తుతం సనోజ్ మిశ్రా దర్శకత్వంలో 'ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మోనాలిసా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.(ఇది చదవండి: నన్ను తాకేవాడు.. ఇంట్లో వాళ్లకు చెబితే సర్దుకుపొమ్మన్నారు: మోనాలిసా) -
నాపై డేటింగ్ రూమర్స్.. చివరికీ వాడు కూడా నవ్వుతున్నాడు..!
బాలీవుడ్లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చకుంది. షారుఖ్ ఖాన్ సరసన ఛల్ ఛయ్య ఛయ్య ఛయ్య అనే పాటతో దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపిసిన ముద్దుగుమ్మ.. తెలుగులో 2007లో మహేశ్ బాబు హీరోగా నటించిన అతిథి మూవీలో ప్రత్యేక గీతంతో టాలీవుడ్‌ను పలకరించింది. అలాగే గబ్బర్ సింగ్‌లో కెవ్వు కేక పాటకు స్టెప్పులేని కుర్రకారుని ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా రాణిస్తోంది.అయితే మలైకా పర్సనల్ లైప్ ఎప్పుడు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. 1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ని పెళ్లి చేసుకొని.. 20 ఏళ్ల పాటు కలిసి కాపురం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తనకంటే 12 ఏళ్ల చిన్నవాడైన యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమాయణం కొనసాగించింది. కొన్నాళ్ల పాటు కలిసి సహజీవనం చేసిన ఈ జంట.. కొన్నేళ్ల క్రితమే విడిపోయింది. గత కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంటున్న మలైకా..ఇటీవల మరో వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్లో వార్తలొచ్చాయి.తాజాగా తనపై వస్తున్న రూమర్స్‌పై మలైకా అరోరా స్పందించింది. తనపై వస్తున్న డేటింగ్ రూమర్స్‌పై తనకు ఎలాంటి ఆందోళన లేదని తెలిపింది. వాటిని చూసి నా కుమారుడు అర్హాన్ ఖాన్, నేను జోకులు వేసుకుంటున్నామని పేర్కొంది. ఓ ఇంటర్వ్యూకు హాజరైన మలైకా.. తన పర్సనల్ లైఫ్‌పై వస్తున్న వాటిని చూసి నా ఫ్యామిలీ కూడా నవ్వుతూ సరదాగా తీసుకుంటుందని వెల్లడించింది. ప్రస్తుతం తాను ప్రేమ విషయంలో తొందరపడటం లేదని.. నా జీవితాన్ని నాకు నచ్చినట్లుగా జీవించాలని కోరుకుంటున్నట్లు మలైకా చెప్పింది.స్వయంకృషితో ఎదిగా..మలైకా మాట్లాడుతూ.. ' సింగిల్‌గా ఉండడమే నాకు ప్రేరణ. మొదటి నుంచి అదే నన్ను ముందుకు నడిపిస్తోంది. సహవాసం, భాగస్వామి, అవన్నీ అందమైనవే. కానీ నాకు ఒక భాగస్వామి కావాలి అన్నట్టుగా నేను వాటి కోసం వెతకడం లేదు. నేను స్వయంకృషితో ఎదిగినందుకు ఎంతో గర్వంగా ఉంది. నా వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం చేయడానికి నాకు ఏ పురుషుడి అవసరమూ లేదు. ఒకవేళ నేను ఎవరితోనైనా కలిసి ఉండాల్సి వస్తే.. అది నా సొంత రూల్స్ ప్రకారమే ఉంటుంది." తెలిపింది. -
దురంధర్-2 కలెక్షన్స్.. తొలి వారం ఎన్ని కోట్లంటే?
రణ్వీర్ సింగ్- ఆదిత్యధర్ కాంబోలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధురంధర్ ది రివెంజ్. గతేడాది రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన దురంధర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల గ్యాప్‌లోనే సీక్వెల్‌ను రిలీజ్ చేయడం విశేషం. తొలి రోజు నుంచే కాసుల వర్షం కురిపిస్తోన్న ఈ చిత్రం వారం రోజుల్లోనే రికార్డ్ సృష్టించింది.తాజాగా ఈ మూవీ మొదటి వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1006 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. తొలి వారంలోనే వెయ్యి కోట్లు సాధించిన తొలి హిందీ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ స్వయంగా వెల్లడించింది. ఓవరాల్‌గా చూస్తే ఎనిమిది రోజుల్లో రూ.1088 కోట్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దేశవ్యాప్తంగా రూ.814 కోట్ల గ్రాస్ రాబట్టగా.. ఓవర్సీస్లో రూ.274 కోట్లు వచ్చినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా నెట్ పరంగా చూస్తే రూ.690 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీలో సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ బ్యూటీ సారా అర్జున్ హీరోయిన్గా మెప్పించింది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ మూవీపై దక్షిణాది స్టార్స్ ప్రశంసలు కురిపించారు. Yeh dahaad hai naye Hindustan ki.🔥Day-wise break-up | India NBOCWeekend 1: 466 Cr* DAY 5: ₹64 Cr* DAY 6: ₹58 Cr* DAY 7: ₹49 Cr* DAY 8: ₹53 Cr* India: ₹690 Cr* Week 1 | Worldwide GBOC (8 Days)India: ₹814 Cr* Overseas: ₹274 Cr*Book Your Tickets Now.🔗-… pic.twitter.com/x2iLMxfX6K— B62 Studios (@B62Studios) March 27, 2026 -
ఆపరేషన్ సిందూర్ ఘటన ఆధారంగా సినిమా
కశ్మీర్‌లోని పహల్గాంలో గత ఏడాది మేలో జరిగిన ఉగ్రదాడికి ప్రతి స్పందనగా భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. హిందీలో ‘ది తాష్కెంట్ ఫైల్స్, ది కశ్మీరీ ఫైల్స్, ది వ్యాక్సిన్ వార్’ వంటి సినిమాలను తెరకెక్కించిన వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మించనున్నారు. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ టైనీ థిల్లాన్ రాసిన ‘ఆపరేషన్ సిందూర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్సైడ్ పాకిస్తాన్’ పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా గురించి వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ– ‘‘వాస్తవానికి దగ్గరగా ఉండే కథలను ప్రేక్షకులకు అందించడం పట్ల నాకు ఎక్కువ ఆసక్తి.ప్రేక్షకులను ఆకట్టుకునే థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమా సాగుతుంది. సినిమాటిక్ మ్యాజిక్ కూడా ఉంటుంది. ఈ చిత్రం కోసం ఆర్మ్డ్ ఫోర్సెస్‌తో కలిసి విస్తృత స్థాయిలో పరిశోధన చేశాను’’ అని పేర్కొన్నారు. ‘‘ఇది కేవలం సినిమా మాత్రమే కాదు. నిజాన్ని ఆవిష్కరించడం వంటిది’’ అని అన్నారు భూషణ్ కుమార్. -
గాయంతో తిరిగి సెట్స్‌పైకి రామ్ చరణ్
టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. ఆయన ఎడమ కంటికి తగిలిన దెబ్బ కారణంగా చిన్నపాటి సర్జరీ చేయాల్సి వచ్చింది. యూనిట్ ఈ గాయం పెద్దది కాదని ప్రకటించినప్పటికీ, తన అభిమానులు మాత్రం కొంత ఆందోళన చెందారు. అయితే గాయమైన గంటల వ్యవధిలోనే చరణ్ తిరిగి సెట్స్‌పైకి వచ్చాడు. గురువారం 'పెద్ది' చిత్ర షూటింగ్లో పాల్గొన్నాడు. దాంతో వందల సంఖ్యలో మెగా అభిమానులు సెట్స్‌కు చేరుకుని ఆయనను కలుసుకున్నారు. చరణ్ వారందరితో మాట్లాడి, సెల్ఫీ వీడియో కూడా దిగాడు. ఆ వీడియోను యూనిట్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో చరణ్ స్వయంగా తన గాయంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు. చరణ్‌కు సుధాకర్ ప్రసాద్ అనే వైద్యుడు మైనర్ సర్జరీ చేసినట్లు చిరంజీవి స్వయంగా వెల్లడించారు. డాక్టర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇక మార్చి 27 (శుక్రవారం) రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 9.45 గంటలకు పెద్ది నుంచి సర్ప్రైజ్ రాబోతోందని యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఏప్రిల్ 30న సినిమా రిలీజ్ అవుతుందని మరోసారి ధృవీకరించారు. -
చరణ్‌కు గాయం.. 'పెద్ది' నుంచి ప్రత్యేక గ్లింప్స్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఇటీవల ప్రమాదవశాత్తూ గాయపడ్డారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా నుంచి రాబోయే అప్డేట్ ఆలస్యమవుతుందేమోనని అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే యూనిట్ తాజాగా ఇచ్చిన స్పష్టతతో ఆ అనుమానాలన్నీ తొలగిపోయాయి. చరణ్ ఎడమ కంటికి చిన్నపాటి గాయం మాత్రమే జరిగింది. దానికి వెంటనే ట్రీట్మెంట్ జరిగిందని 'పెద్ది' టీమ్ తెలిపింది. రేపట్నుంచే ఆయన తిరిగి సెట్స్‌లో పాల్గొనబోతున్నారని కూడా ప్రకటించింది. ఇక అభిమానులకు గుడ్ న్యూస్ ఏమిటంటే.. చరణ్ పుట్టినరోజు కానుకగా 'పెద్ది' నుంచి ప్రత్యేక గ్లింప్స్ రాబోతోంది. మార్చి 27 ఉదయం 11:07 గంటలకు దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే రెడీ చేసిన టీజర్ విడుదల కానుంది. ఇప్పటికే చరణ్ చేసిన బ్యాట్ విన్యాసం సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయింది. అదే తరహాలో ఈ బర్త్‌డే టీజర్ కూడా భారీ విజయాన్ని సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అంటే రామ్ చరణ్ గాయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. పెద్ది సినిమాకు సంబంధించిన అప్డేట్స్, సంబరాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ పెద్ది టీమ్ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. -
దురంధర్-2లో చిన్న రోల్.. కానీ మూవీ చూడలేకపోతున్నా..!
రణ్వీర్ సింగ్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. గతేడాది రిలీజైన మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం రూ.919 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీని పాకిస్తాన్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఇండియన్ స్పై రవీంద్ర కౌశిక్ జీవితం ఆధారంగా రూపొందించారు.అయితే తాజాగా ఈ మూవీలో నటించిన ఓ ఆటో డ్రైవర్ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో చివర్లో రణ్వీర్ సింగ్ ఆటోలో వస్తారు. ఆ ఆటోను నడిపిన బద్రుల్ ఇస్లాం వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆర్థిక సమస్యలతో తాను ఇంకా దురంధర్-2 చూడలేదని అన్నారు. టికెట్స్ రేట్లు తగ్గాక వెళ్లి చూస్తానని చెబుతున్నారు. సినిమా టికెట్ ధర ఎక్కువగా ఉన్నందువల్ల చూడలేకపోతున్నాని తెలిపారు. కుటుంబంతో కలిసి దురంధర్-2 చూసేందుకు తనకు మరింత సమయం పడుతుందన్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో ఆటో రిక్షా డ్రైవర్ అయిన బద్రుల్ కోసం సినిమాను ఉచితంగా ప్రదర్శించేలా ఏర్పాట్లు చేయాలని అభిమానులు దర్శకుడు ఆదిత్య ధర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.కాగా.. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. హిందీతో పాటు సౌత్ భాషల్లోనూ ఈ మూవీని రిలీజ్ చేశారు. ఈ మూవీ సారా అర్జున్ హీరోయిన్గా కనిపించగా.. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Mintu dhotian (@amar.gill.12139862) -
భార్యకు యూజ్డ్ కార్ స్పెషల్ గిప్ట్ ఇచ్చిన దర్శకుడు, ధర?
ప్రముఖ సినీ దర్శకుడు, ఏక్ థా టైగర్ ఫేమ్ కబీర్ ఖాన్ తన భార్య ప్రముఖ యాంకర్ మినీ మాథుర్‌కు ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇచ్చారు. పర్యావరణానికి మేలు చేసేలా (EV), స్టైలిష్‌గా , స్పోర్టీగా ఉండే ఈ కారు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ కారు ఫోటోలను మినీ ఇన్‌స్టాలో పంచుకున్నారు. దీని ప్రకారం ఆ కారు విశేషాలు, ప్రత్యేకతలు తెలుసుకుందాం.బహుమతిగా యూజ్డ్ లగ్జరీ ఎలక్ట్రిక్ కారుకబీర్ ఖాన్ తన భార్యకు మినీ కూపర్ SE (MINI Cooper SE) ఆల్-ఎలక్ట్రిక్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ కారు డెలివరీ తీసుకుంటున్న ఫోటోలను మినీ మాథుర్ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఒక సెకండ్ హ్యాండ్ (యూజ్డ్) కారు అయినప్పటికీ, కేవలం 2,200 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన 2023 మోడల్ కావడం విశేషం.ఫీచర్లుఇందులో 32.6 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 275 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.కేవలం 7.3 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 150 కి.మీ. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే 50kW ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 36 నిమిషాల్లో 80శాతం ఛార్జ్ అవుతుంది. నాలుగు రకాల డ్రైవింగ్ మోడ్స్‌తో ఇది లభ్యం. 8.8 అంగుళాల టచ్ స్క్రీన్, ఆపిల్ కార్ప్లే (Apple CarPlay) , స్టీరింగ్ వెనుక 5.5 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లేలాంటి ఫీచర్లతో ఈ కారు ఇంటీరియర్ చాలా లగ్జరీగా ఉంటుంది. ప్రీమియం హర్మాన్ కార్డాన్ (Harman Kardon) సౌండ్ సిస్టమ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ (సన్‌రూఫ్), నాప్పా లెదర్ స్టీరింగ్ వీల్ దీనికి మరింత అందాన్ని ఇస్తాయి. మొత్తానికి పర్యావరణాన్ని కాపాడుతూనే,గో-కార్ట్ హ్యాండ్లింగ్‌తో ఎలక్ట్రిక్ వెర్షన్లో మినీ కూపర్ కార్ మజాతో స్పోర్ట్స్ కార్ అనుభూతిని ఇచ్చే కారు ఇది.ధర ఎంత?భారతదేశంలో ఈ కారు కొత్తది కొనాలంటే ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 47.20 లక్షలు. అయితే, కబీర్ ఖాన్ కొనుగోలు చేసిన ఈ యూజ్డ్ కార్ ధర సుమారు రూ. 32 లక్షలు ఉంటుందని అంచనా. కాగా కబీర్ ఖాన్ , మినీ మాథుర్ 1998, ఫిబ్రవరి 28న వివాహం చేసుకున్నారు. డైరెక్టర్‌గా కబీర్ 'ఏక్ థా టైగర్' 'బజరంగీ భాయ్‌జాన్' పాపులర్ అవ్వగా, మినీ ఒక ప్రముఖ టెలివిజన్ హోస్ట్‌గా నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. వీరికి వివాన్ ఖాన్ అనే కుమారుడు , సైరా అనే కుమార్తె ఉన్నారు. -
సంజయ్ దత్ క్రేజీ రికార్డ్.. ఆ విషయంలో తొలి నటుడిగా ఘనత..!
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ రికార్డుల వేట కొనసాగుతోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా వెయ్యి కోట్ల మార్క్ చేరుకునేందుకు రెడీగా ఉంది. తొలి రోజు నుంచే వసూళ్లు సునామీ సృష్టిస్తోంది. గతేడాది రిలీజైన దురంధర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల్లోనే పార్ట్-2 రిలీజ్ చేశారు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను తిరగరాసింది.ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గురించి చర్చ మొదలైంది. విలన్ పాత్రలతో అందరినీ దృష్టిస్తోన్న ఏకైక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా మెప్పించిన మూడు సినిమాలు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మూడు సినిమాలు రూ. 1,000 కోట్ల వసూళ్లు సాధించిన ఏకైక బాలీవుడ్ స్టార్‌గా సంజయ్ దత్ ఘనతను సొంతం చేసుకున్నారు.కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్-2 చిత్రంలో విలన్ అధీర పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దాదాపు 66 ఏళ్ల వయసులోనూ యువకుడిలా వరుస సినిమాలు చేస్తున్నారు. కేజీఎఎఫ్ తర్వాత షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించిన 'జవాన్' చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించారు. ఈ యాక్షన్ డ్రామాగా చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,160 కోట్ల మార్కును అధిగమించింది.తాజాగా గతేడాది రిలీజైన దురంధర్ మూవీలోనూ సంజయ్ దత్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా సైతం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ స్పై థ్రిల్లర్ చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో సంజయ్ దత్ నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు వసూళ్లు రాబట్టాయి. ఇటీవల రిలీజైన దురంధర్-2 సైతం రూ.1000 కోట్ల మార్క్ దగ్గరలో ఉంది. ఈ చిత్రం కూడా వెయ్యి కోట్లు దాటితే సంజయ్ దత్‌కు రికార్డ్ మరింత పెరగనుంది. కాగా.. సంజయ్ దత్ 'ధురందర్: ది రివెంజ్'లో ఎస్పీ చౌదరి అస్లాం పాత్ర పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు రూ. 919 కోట్లు వసూలు చేసింది. ఈ రికార్డ్స్ పరిశీలిస్తే.. ఇకపై సంజయ్ దత్ ఉంటే చాలు వెయ్యి కోట్లు పక్కా అనాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, డానిష్ పండోర్, సారా అర్జున్, గౌరవ్ గెరా కీలక పాత్రలు పోషించారు. -
'ఆ అమ్మాయి నా కూతురితో సమానం'.. దురంధర్ నటుడు
దురంధర్‌లో రణ్వీర్ సింగ్ రోల్ తర్వాత అందరికీ గుర్తుండిపోయే పాత్ర ఆయనదే. అతని వల్లే ఈ సీక్వెల్ రూ.500 కోట్లు ఎక్కువగా సాధిస్తుందని హీరో సైతం అన్నారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అతను ఎవరో కాదు.. జమీల్ జమాలీ పాత్రలో అలరిస్తోన్న నటుడు రాకేశ్ బేడీ. తన పాత్రలో రాకేశ్ అద్భుతంగా నటించారు. కరాచీకి చెందిన రాజకీయ నాయకుడు జమాలి పాత్రలో రాకేశ్ బేడీ అదరగొట్టేశారు.అయితే తాజాగా దురంధర్ హీరోయిన్ సారా అర్జున్ను ముద్దు పెట్టుకోవడంతో వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. గతంలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా జరిగింది. ఆ వీడియో నెట్టింట వైరల్ కావడంతో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. తనకంటే వయసులో చాలా చిన్నదైన సారా అర్జున్ను రాకేశ్ బేడీ ముద్దుపెట్టుకోవడంతో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. అయితే కొందరు మాత్రం తనను సమర్థించారని కూడా ఆయన పేర్కొన్నారు.తాజాగా ఈ వివాదంపై రాకేష్ బేడీ మరోసారి స్పందించారు. సారాపై తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదన్నారు. తాను కేవలం ఆమెపై ఆప్యాయతతోనే అలా చేశానని తెలిపారుు. కానీ మరో కోణంలో చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురి పాత్ర పోషించిన సారాతో తండ్రిలాగే ప్రవర్తిస్తానని..సినిమా షూటింగ్ సమయంలో కూడా ఆమెతో అలాగే ప్రవర్తించేవాడినని బేడీ వివరణ ఇచ్చారు. మాది తండ్రీ, కూతుళ్ల బంధమని తెలిపారు. నా ఆప్యాయతను ప్రజలు గుర్తించలేకపోయారని అన్నారు.ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.." తన కూతురి పాత్ర పోషించిన సారాతో తన బంధం ఎప్పుడూ ఆప్యాయంగా.. ఒక తండ్రిలాగే ఉంటుంది. ఈ మూవీ షూటింగ్ సమయంలో కూడా ఆమెతో అలాగే ప్రవర్తించా. ధురందర్ షూటింగ్ సమయంలో ఆమె వచ్చినప్పుడల్లా ఒక కూతురిలా ఆమెను కౌగిలించుకుని నుదుటిపై ముద్దు పెట్టేవాడిని. ఏం పర్వాలేదు.. చింతించకు.. మనిద్దరం కలిసి ఒక గొప్ప సీన్ చేస్తామని తనతో చెప్పేవాడిని. అదృష్టవశాత్తూ, కొందరు నన్ను సమర్థించారు కూడా. కానీ ఈ సినిమాతో దక్కిన విజయం చాలా మందికి రాదు' అని అన్నారు. -
సీక్రెట్‌గా సింగర్‌ని పెళ్లి చేసుకున్న నటి.. ఫోటోలు వైరల్
బాలీవుడ్ స్టార్ ర్యాపర్ బాద్షా, నటి ఇషా రిఖీ పెళ్లి చేసుకున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇషా తల్లి పూనమ్ రిఖీ సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫోటోలను పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై అటు బాద్షా కానీ, ఇటు ఇషా కానీ ఎవరూ అధికారికంగా స్పందించలేదు.ఆరేళ్ల క్రితమే విడాకులు.. ర్యాపర్ బాద్షా అసలు పేరు ఆదిత్య ప్రతీక్ సింగ్ సిసోడియా. హిందీ, పంజాబీ పాటలను రీమిక్స్ చేస్తూ యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అలాగే బాలీవుడ్లో పలు బ్లాక్‌బస్టర్ సినిమాల్లో పాటలు పాడి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. జాస్మిన్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. ఈ జంటకి ఓ కూతురు ఉంది. ఇద్దరి మధ్య విభేధాలు రావడంతో ఆరేళ్ల క్రితం విడాకులు తీసుకొన్నారు. ఈషాతో డేటింగ్.. విడాకుల తర్వాత పంజాబీ నటి ఇషా రిఖీతో బాద్షా ప్రేమలో పడ్డాడు. ఇషాను ఓ పార్టీలో కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకొన్నారు. అక్కడ జరిగిన వారి పరిచయం ఇద్దరిని మరింత దగ్గరకు చేర్చించింది. గతకొంత కాలంగా ఇద్దరు డేటింగ్లో ఉన్నట్లు వార్తలు కూడా బయటకు వచ్చాయి. అయితే వీరిద్దరు మాత్రం తమ ప్రేమ విషయాన్ని ఇప్పటివరకు బహిరంగంగా ప్రకటించలేదు.పెళ్లి ఫోటోలు వైరల్.. తాజాగా ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరిగినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇషా రిఖీ తల్లి పూనమ్ రిఖీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పెళ్లికి సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ ‘గాడ్ బ్లెస్ యూ’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నెటిజన్స్ పెద్ద ఎత్తున ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by POONAM RIKHI (@poonamrikhi6) View this post on Instagram A post shared by POONAM RIKHI (@poonamrikhi6) -
పదేళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ.. గ్రాండ్‌గా బుల్లితెర నటి సీమంతం..!
ప్రముఖ బుల్లితెర జంట దివ్యాంక త్రిపాఠి ఇటీవలే ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. వివేక్ దహియాను పెళ్లాడిన ముద్దుగుమ్మ దాదాపు పదేళ్లకు శుభవార్త పంచుకుంది. తాము త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందనున్నట్లు వెల్లడించింది. ఉగాది పండుగ రోజే ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ దివ్యాంక తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.తాజాగా ఈ బ్యూటీ సీమంతం వేడుక గ్రాండ్‌గా జరిగింది. సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుకను బేబీ షవర్‌ను సెలబ్రేట్ చేసుకుంది దివ్యాంక త్రిపాఠి. తాజాగా తన సీమంతం వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. భర్తతో పాటు కుటుంబ సభ్యుల్లాంటి స్నేహితులతో చేసుకున్న ఈ గోధ్ బరాయి(సీమంతం) వేడుకను ఎప్పటికీ మర్చిపోలేనని ఆనందం వ్యక్తం చేసింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.2016లో ప్రేమ పెళ్లి..కాగా.. దివ్యాంక, వివేక్.. యే హై మొహబ్బతే సీరియల్ సెట్లో కలుసుకున్నారు. ఈ ధారావాహిక చిత్రీకరణ సమయంలోనే ప్రేమలో పడ్డారు. 2016లో భోపాల్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట నాచ్ బలియే 8వ సీజన్లో పాల్గొని విజేతగా నిలిచింది. ప్రస్తుతం 41 ఏళ్ల వయసులో దివ్యాంక తల్లి కాబోతోంది.సీరియల్ నటిగా రికార్డ్..దివ్యాంక త్రిపాఠి నటి మాత్రమే కాదు మోడల్, యాంకర్ కూడా! 2005లో మిస్ భోపాల్ కిరీటం అందుకుంది. బనూ మే తేరి దుల్హాన్ సీరియల్‌తో గుర్తింపు పొందింది. అలా వరుస ఛాన్సులు అందుకుంది. మధ్యలో తకనుమరుగైపోయినా యే హై మొహబ్బతే సీరియల్‌తో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. 2017లో ఫోర్బ్స్ సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకున్న సీరియల్ నటిగా రికార్డు సృష్టించింది. View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) -
దురంధర్-2 క్రేజ్.. పుష్పరాజ్ రికార్డ్ బ్రేక్
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ రికార్డుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మార్చి 19న ప్రారంభమైన వసూళ్ల వేట ఐదు రోజులైనా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇదే జోరు కొనసాగితే కేవలం వారం రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు ఆదిత్య దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.ఈ సారి ఏకంగా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప-2 వసూళ్లను దాటేసింది. పుష్ప-2 సాధించిన హిందీ వసూళ్లు రికార్డ్‌ను దురంధర్-2 బద్దలు కొట్టింది. పుష్ప-2 మూవీకి నాలుగు రోజుల్లో హిందీ వర్షన్‌కు రూ. 425.10 కోట్లు రాగా.. దురంధర్-2 ఏకంగా రూ.430 కోట్లు వసూలు చేసింది. ఈ రికార్డుతో పుష్పరాజ్‌ను వెనక్కి నెట్టేసింది. దురంధర్-2, పుష్ప-2 తర్వాత పఠాన్, జవాన్, స్త్రీ-2 చిత్రాలు ఉన్నాయి. ఓవరాల్‌గా అన్ని భాషల్లో ఇండియా వ్యాప్తంగా కలెక్షన్స్ పరిశీలిస్తే 'పుష్ప 2: ది రూల్' ఇంకా అగ్రస్థానంలోనే ఉంది. హిందీ వెర్షన్లో 'ధురందర్: ది రివెంజ్' అధిగమించింది.ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లోనే రూ.829 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఐదు రోజుల్లోనే దేశ వ్యాప్తంగా ఈ సినిమా రూ.619.76 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా చూస్తే రూ. 519.12 కోట్ల నికర వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఒక హిందీ చిత్రానికి ఇవే అత్యధిక వసూళ్లు కావడం విశేషం. కాగా.. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, డానిష్ పండోర్, సారా అర్జున్, గౌరవ్ గెరా కీలక పాత్రలు పోషించారు. హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 సినిమాలివే.. దురంధర్ ది రివెంట్: రూ. 430 కోట్లు (నాలుగు రోజులు)పుష్ప-2 ది రూల్: రూ. 425.10 కోట్లుపఠాన్: రూ. 351 కోట్లుజవాన్: రూ. 346.98 కోట్లుస్త్రీ-2: రూ. 291.65 కోట్లు -
జస్ట్ నిమిషాల్లో, దోసకాయ పచ్చడి : నటి వీడియో వైరల్
ప్రముఖ బాలీవుడ్ నటిఅశ్విని కల్సేకర్ దోసకాయపచ్చడి తయారు చేసి చూపించారు. అదీ జస్ట్ నిమిషాల్లోనే అంటూ ఆమె చేసిన పోస్ట్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. అశ్విని కల్సేకర్ మరెవ్వరో కాదు ప్రముఖ నటుడు మురళి శర్మ భార్య. పదండి మరి కమ్మని దోసకాయ పచ్చడి మేకింగ్ కథ ఏంటో తెలుసుకుందాం.గోల్మాల్ అంధాధున్, జోధా అక్బర్ లాంటి పాపులర్ మూవీలు, టీవీ షోలతో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్ నటి అశ్విని కల్సేకర్. తరచుగా సోషల్ మీడియాలో పలు వంటల గురించి ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా నిమిషాల్లో దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించిన వీడియో వైరల్‌గా మారింది.దోసకాయ పచ్చడి రెసిపీ ఈ సాంప్రదాయ ఆంధ్ర-శైలి చట్నీ పుల్ల పుల్లగా, పంటి కింద పచ్చదోసకాయ ముక్కలు తగులుతూ ఉండే రుచిని అందరూ ఇష్టపడతారు. దీనిని సాంప్రదాయకంగా పసుపు దోసకాయ (దోసకాయ), కొత్తిమరీ, చింతపండు , వేయించిన దినుసులతో తయారు చేస్తారు.ఇదీ చదవండి: 45 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి : గేమ్ ఛేంజర్అశ్విని షేర్ చేసినరెసిపీ : ముందుగా దోసకాయ తొక్క తీసి, గింజలు తొలగించి (కొంతమంది గింజలు వేసుకుంటారు), చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. తరువాత, ఒక బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి, 2 టేబుల్ స్పూన్ల మినప పప్పు వేసి, ఎర్రగా వేగాక, కొద్దిగా మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, ఎండు, పచ్చి మిరపకాయల మిశ్రమాన్ని ఇంగువ వేసి వేయించాలి. ఆ తరువాత స్టఫ్ ఆఫ్ చేసి, ఈ పోపులోనే కొద్దిగా చింతపండు గుజ్జు , ఒక చిన్న బెల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలుపుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. View this post on Instagram A post shared by Ashwini kalsekar (@ashwinikalsekar)తరువాత కొత్తి మీర, దోసకాయ ముక్కల్ని పూర్తిగా మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా ఉండేలా మిక్సీ పట్టాలి. అంతే ఈ మిశ్రమాన్ని పోపులో వేసి కలుపుకోవడమే. ఈ చట్నీని అన్నం, రోటీతో గానీ ఆస్వాదించవచ్చు అంతకు ముందు కూడా అశ్విని అన్నం లేదా పూరీతో కలిపి తినే,, కొంకణి శైలి బంగాళదుంప కూర అంబట్ బటాటా రెసిపీని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.థఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరు -
ధురంధర్ 2పై తలైవా రివ్యూ.. సంతోషంలో డైరెక్టర్
గత ఆరునెలలుగా బాక్సాఫీస్ వద్ద ధురంధర్ పేరు మారుమోగిపోతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ 1 ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.. మూడు నెలలు కూడా తిరగకముందే దర్శకుడు ఆదిత్య ధర్ దానికి సీక్వెల్ తీసుకొచ్చాడు. మార్చి 19న ధురంధర్: ది రివేంజ్ విడుదలైంది. ఈ సినిమాపై నార్త్ నుంచి సౌత్ వరకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తలైవా రివ్యూతాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ ధురంధర్ 2 చూసి రివ్యూ ఇచ్చాడు. ఆదిత్య ధర్‌ను బాక్సాఫీస్ కా బాప్ అని అభివర్ణించాడు. రణ్వీర్ సహా చిత్రయూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలిపాడు. ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన చిత్రమని ఎక్స్ (ట్విటర్)లో కితాబిచ్చాడు. తలైవా పోస్ట్‌పై దర్శకుడు ఆదిత్య ధర్ సంతోషం వ్యక్తం చేశాడు. గర్వంగా ఉందిసర్, వినోదం అనే పదానికి మిమ్మల్నే బెంచ్‌మార్క్‌గా చూస్తూ పెరిగాం. ఎన్నో దశాబ్దాలుగా మీరు మమ్మల్ని ఏడిపించారు, నవ్వించారు, విజిల్స్ కొట్టేలా చేశారు. ఇప్పటికీ అదే గ్రేస్, స్వాగ్తో మ్యాజిక్ చేస్తూనే ఉన్నారు. అలాంటి మీరు ధురంధర్ 2 తప్పక చూడాల్సిన మూవీ అని చెప్పడం నా జీవితంలో అతిపెద్ద సూపర్‌స్టార్ మూమెంట్‌గా అనిపిస్తోంది. పెద్ద కలలను కనమని ప్రోత్సహించిన వ్యక్తి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంది. ఎంతో గర్వంగా ఉంది సర్. మీ మాటలు నా మనసును తాకాయి అని ఆదిత్య ధర్ రాసుకొచ్చాడు. Sir, we’ve all grown up measuring “entertainment” with just one benchmark, YOU. ❤️⁰Making us whistle, laugh, cry and feel larger than life for decades and still doing it with the same swag and grace, that’s pure magic.So for you to call Dhurandhar 2 a “must watch” feels like…— Aditya Dhar (@AdityaDharFilms) March 23, 2026 చదవండి: బ్యాండ్‌మేళం కోసం ఆస్తులమ్ముకున్న కోన వెంకట్.. నేనైతే ఆ పనిచేయను: బండ్ల గణేశ్ -
నాకు నత్తి.. ఇప్పటికీ బాధపడుతుంటా: సమీరా రెడ్డి
హీరోయిన్ సమీరారెడ్డి ఏదైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. తన కష్టాలు, ప్రెగ్నెన్సీలో బరువు పెరగడం, డెలివరీ తర్వాత ఎదుర్కొన్న సమస్యలు.. వీటన్నింటి గురించి ఓపెన్‌గా మాట్లడుతూ ఉంటుంది. అయితే చిన్నతనంలో నత్తి వల్ల తనను ఎందరో వెక్కిరించేవారంటోంది.వెక్కిరింతలుతాజాగా ఓ ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి మాట్లాడుతూ.. చిన్నప్పుడు నాకు నత్తి ఉండేది. దానివల్ల నన్ను వెక్కిరిస్తూ వేధించేవారు. నాలో ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి సంవత్సరాల తరబడి థెరపీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ నేను నత్తిగా మాట్లాడినప్పుడు ఎవరైనా దానిపై సెటైర్లు వేస్తే బాధగా ఉంటుంది. చిన్ననాడు మనల్ని ఏమేం అంటారో అవన్నీ మనసులో లోతుగా పాతుకుపోయుంటాయి.అదే నిజమనుకుని..ఉదాహరణకు.. ఆమె చాలా స్లో, వీక్ అంటుంటారు. ఇలాంటి పదాలు పదేపదే విన్నప్పుడు మనపై మనకే అనుమానం వేస్తుంటుంది. ఫలితంగా పిల్లలు ఏదైనా సాహసం చేసేందుకు వెనుకాడతారు. పిల్లల్ని పదేపదే బుద్ధిహీనుడు, బలహీనుడు, ముసలివాడు.. అని పిలిస్తే వాళ్లు అదే నిజమనుకుంటారు. వాళ్లను వాళ్లు చూసుకునే విధానమే మారిపోతుంది. ఎవరినీ కించపర్చొద్దుఅదే నిజమని నమ్మి, అందరిలా దూకుడుగా ఉండలేరు. ఏవీ ప్రయత్నించకుండా సైలెంట్ అయిపోయే ప్రమాదం ఉంది. నా పిల్లలు.. వారికి ఏ సమస్య ఎదురైనా నాతో చెప్పమంటాను. ఎవరినీ కించపరచొద్దని చెప్తుంటాను. పిల్లలకు సరైన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం చేస్తే మంచి ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారు. పర్సనల్ లైఫ్తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోటివారంతా సపోర్ట్‌గా నిలబడితే పిల్లలు వారికెదురయ్యే సవాళ్లను ఒక అడ్డంకిగా కాకుండా.. దాన్నుంచి ఎలా బయటపడాలన్నది నేర్చుకుంటారు అని చెప్పుకొచ్చింది. సమీరా.. 2014లో ఎంటర్ప్రెన్యూర్ అక్షయ్ వార్డేను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు 2015లో కుమారుడు హన్స్, 2019లో కూతురు నైరా జన్మించారు. బాలీవుడ్ హీరోయిన్ సమీరా రెడ్డి.. తెలుగులో నరసింహుడు, జై చిరంజీవ, అశోక్ సినిమాల్లో నటించింది.చదవండి: హీరోయిన్ భానుప్రియ ఇంట తీవ్ర విషాదం -
హారర్‌కి గ్రీన్ సిగ్నల్?
బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు. ఆయన నటించిన ‘రేంజర్, ధమాల్ 4’ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన ‘దృశ్యం 3 (హిందీ వెర్షన్), గోల్మాల్ 5’ సినిమాల చిత్రీకరణలతో బిజీగా ఉంటున్నప్పటికీ ఇటీవల మరో కొత్త సినిమాకు అంగీకారం తెలిపారని బాలీవుడ్ సమాచారం.హిందీలో ‘జేమ్స్’, పంజాబీలో ‘సర్దాజ్ జీ, సర్దార్ జీ 2’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రోహిత్ జుగ్రాస్ ఇటీవల ఓ హారర్ కథను అజయ్ దేవగన్ కు వినిపించారట. కథ, హారర్ కాన్సెప్ట్ నచ్చడంతో ఈ సినిమాకు అజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ టాక్. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదే సెట్స్‌పైకి తీసుకెళ్లాలని రోహిత్ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తున్నారట. 2027లో ఈ సినిమా రిలీజ్ కానుంది. -
9 నెలల తర్వాత ఓటీటీకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
గతేడాది బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ నటించిన చిత్రం సితారే జమీన్ పర్. ఈ సినిమా 2025 జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో జెనీలియా దేశ్‌ముఖ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు.అయితే ఈ సినిమా దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీకి వచ్చేస్తోంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 03 నుంచి సోనీ లివ్ వేదికగా అందుబాటులోకి రానుంది. కాగా..అమిర్ ఖాన్ గతంలో ఓటీటీలో రిలీజ్ చేయనని ప్రకటించారు. ఆ తర్వాత నేరుగా యూట్యూబ్‌లోనే విడుదల చేశారు. రెంట్ పద్ధతిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. Kisi ke liye alag… kisi ke liye normal.Sabka apna normal hota hai. ❤️A heartwarming story of Hope, heart and healing💫 Watch #SitaareZameenPar #SabkaApnaApnaNormal, streaming from 3rd April on Sony LIV#SitaareZameenParOnSonyLIV pic.twitter.com/YvBbFlOTNS— Sony LIV (@SonyLIV) March 23, 2026 రూ.120 కోట్ల డీల్‌కు నో..అప్పట్లో ఓటీటీ రైట్స్ కోసం రూ.120 కోట్లు చెల్లించేందుకు అమెజాన్ ప్రైమ్ ముందుకొచ్చింది. కానీ ఈ బిగ్ డీల్‌ను అమిర్ ఖాన్ తిరస్కరించారు. ఈ సినిమా కేవలం థియేటర్లలోనే ఆడుతుందని.. ఓటీటీలో విడుదల ఉండదని అమిర్ ఖాన్ స్పష్టం చేశారు. కానీ అమిర్ ఖాన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్‌జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు. -
అందరి నోటా దురంధర్.. ఆ రియల్ హీరో స్టోరీ తెలుసా?
దురంధర్.. దురంధర్.. దురంధర్.. ఇప్పుడు ఎవరినీ నోటా విన్నా ఆ ఒక్క పేరే వినిపిస్తోంది. గతేడాది రిలీజైన ఈ మూవీ సీక్వెల్ ప్రస్తుతం థియేటర్లను షేక్ చేస్తోంది. బాక్సాపీస్ వద్ద ఊహకందని రికార్డులు సృష్టిస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ ది రివెంజ్ మార్చి 19న రిలీజై ఊచకోత కోస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ దాటేసిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.ఈ నేపథ్యంలో అసలు దురంధర్ ఎవరు? అనే అంశంపై చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ రియల్ దురంధర్ ఎవరినీ తెగ నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. ఆడియన్స్‌కు ఇంతలా కనెక్ట్ అయిన ఆ పాత్ర ఎవరిది? అసలు ఆ వ్యక్తి ఎవరు? అసలు అతను బతికే ఉన్నాడా? అనే వివరాల కోసం తెగ వెతికేస్తున్నారు. మరి ఆ వివరాలేంటో మీరు కూడా తెలుసుకోవాలనుకంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.రియల్ ధురంధర్ ఆయనే..రవీంద్ర కౌశిక్.. ఈ పేరు చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆర్మీలో మేజర్ స్థాయికి ఎదిగిన రవీంద్ర.. తన ధైర్య సాహసాలతో రాలో(RAW) బ్లాక్ టైగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీనే బ్లాక్ టైగర్ అనే బిరుదు ఇవ్వడం విశేషం. అయితే స్పై ఏజెంట్‌గా పాకిస్తాన్ వెళ్లిన రవీంద్ర కౌశిక్.. పాక్ ఆర్మీలో చేరి మేజర్ స్థాయికి ఎదిగారు. భారతదేశపు అత్యంత ధైర్యవంతులైన రా ఏజెంట్లలో ఒకరిగా నిలిచారు.భారత్‌కు చెందిన రవీంద్ర కౌశిక్ పాకిస్థాన్‌లో రహస్యంగా ప్రవేశించి.. పాక్ జాతీయుడిగా మారిపోయి పాకిస్థాన్ సైన్యంలో చేరారు. అక్కడి సైనిక కదలికలు, పాకిస్థాన్ అణు కార్యక్రమం గురించి కీలకమైన సమాచారాన్ని ఇండియాకు అందించారు. అయితే ఊహించని విధంగా 1983లో పాకిస్థాన్ గూఢచార సంస్థ ISIకి దొరికిపోయాడు. ఆ తర్వాత తన మిగిలిన జీవితాన్ని జైలులోనే గడిపారు.23 ఏళ్ల వయసులోనే..రవీంద్ర కౌశిక్ 1975లో అంటే కేవలం 23 ఏళ్ల వయసులోనే నబీ అహ్మద్ షకీర్ అనే పేరుతో పాకిస్తాన్లోకి ప్రవేశించారు. అక్కడే కరాచీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో డిగ్రీ సంపాదించి.. పాకిస్తాన్ సైన్యంలో చేరారు. తన టాలెంట్‌తో ఏకంగా మేజర్ హోదాను పొందారు. 1979 నుండి 1983 మధ్య దాదాపు 4 ఏళ్ల పాటు కౌశిక్ రహస్యంగా భారతదేశానికి కీలకమైన సమాచారాన్ని పంపాడు. అక్కడి పంజాబ్‌లోని సైనిక కదలికలు.. కహుటాలోని పాకిస్తాన్ అణు కర్మాగారం గురించి సున్నితమైన వివరాలను అందించాడు. అంతేకాకుండా అమానత్ అనే పాకిస్తానీ మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి ఓ బిడ్డ కూడా పుట్టారు.అయితే 1983లో రా (RAW) సంస్థ ఇనాయత్ మసీహ్ అనే జూనియర్ స్పైని.. రవీంద్రను కలవడానికి పంపింది. కానీ మసీహ్ వెంటనే అక్కడి ఐఎస్ఐకి దొరికిపోయాడు. మసీహ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కౌశిక్‌ను కలవాల్సిన ముల్తాన్‌లోని పార్కును ఐఎస్ఐ గుర్తించింది. దీంతో 1983 సెప్టెంబర్‌లో రవీంద్ర కౌశిక్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత కౌశిక్‌ను సియాల్కోట్లో విచారించి.. కోట్ లఖ్‌పత్, మియాన్వాలి లాంటి అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల జైళ్లకు తరలించారు. 1985లో పాకిస్తానీ సైనిక న్యాయస్థానం అతనికి మరణశిక్ష విధించింది. కానీ ఆ తరువాత దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. అయితే రవీంద్ర కౌశిక్ 2001 నవంబర్ 21న.. మియాన్వాలి సెంట్రల్ జైలులో క్షయవ్యాధి, గుండె జబ్బుతో మరణించాడు.రవీంద్ర కౌశిక్ స్వస్థలం ఎక్కడంటే? రవీంద్ర కౌశిక్ స్వస్థలం రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ పట్టణం. 1952 ఏప్రిల్ 11న భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న శ్రీ గంగానగర్‌లో జన్మించారు. అక్కడే ఆయన పంజాబీతో పాటు స్థానిక భాషలు నేర్చుకున్నారు. గంగానగర్‌లోని ఎస్.డి. బిహానీ కళాశాలలో కామర్స్ చదువుతున్నప్పుడే నాటకరంగంలో పాల్గొని తన నటన నైపుణ్యాలను ప్రదర్శించారు.అదే సమయంలో 1973లో లక్నోలో జరిగిన ఒక జాతీయ నాటక పోటీలో రవీంద్ర ప్రదర్శన ఇచ్చారు. ఒక భారతీయ సైనికుడి పాత్రలో ఏకపాత్రాభినయం చేశారు. అతని ప్రదర్శన రా అధికారుల దృష్టిని ఆకర్షించింది. ఆ వెంటనే ఢిల్లీలో రహస్య మిషన్ కోసం అతనికి తీవ్రమైన శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ సమయంలో ఇస్లాం గురించి.. పాకిస్తానీ ఉర్దూ భాష, ఆ దేశ భౌగోళిక స్వరూపం గురించి పూర్తిగా తెలుసుకున్నారు. రెండేళ్ల కఠిన శిక్షణ తర్వాత రా స్పైగా పాకిస్తాన్లో అడుగుపెట్టాడు. -
దురంధర్-2 రిలీజ్.. పాకిస్తాన్ వీడియోలు వైరల్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ దురంధర్-2 థియేటర్లలో సందడి చేస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం మూడు రోజుల్లేనే రూ.500 కోట్ల మార్క్ దాటిన ఈ చిత్రం పలు రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటికే నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజైంది. పాకిస్తాన్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ వేళ సోషల్ మీడియాలో పాకిస్తాన్‌కు సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి. ఇప్పుడు కరాచీలోని లియారి ప్రాంతంలో పోలీసులు స్పై లాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమోననని సోదాలు చేస్తున్నారు. అక్కడి ప్రాంతంలోని లోకల్ ప్రజలంతా కలిసి ఇండియన్ స్పైల కోసం వెతుకుతున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే ఈ వీడియో ఇప్పటిదా.. లేదాంటే పాతదా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ధురంధర్ 2 తర్వాత పాకిస్తాన్ అంతటా పానిక్ మొదలైంది!ఇప్పుడు కరాచీలోని లియారి ప్రాంతంలో పోలీసులు, లోకల్ ప్రజలు కలిసి ప్రతి వీధిలో ఇండియన్ స్పైలను వెతుకుతున్నారు.వాళ్ల ఆశ ఏమిటంటే—హమ్జా అలీ మజారిని పట్టుకుంటామని!#Dhurandhar2 #DhurandharTheRevenge #Dhurandhar #Pakistan… pic.twitter.com/7Emn1qkEPc— Tupaki (@tupaki_official) March 23, 2026 -
జూన్‌లో ధురంధర్ 3? నిజమెంత?
ఏదైనా సినిమా బాగుందంటే చాలు దాని కొనసాగింపు కోసం జనం ఎదురుచూస్తుంటారు. బాహుబలి, పుష్ప, కేజీఎఫ్, కాంతార వంటి చిత్రాలు కూడా అలాంటి బజ్ క్రియేట్ చేసుకుని సీక్వెల్లో కూడా కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు ధురంధర్ సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది.ధురంధర్ బ్లాక్బస్టర్రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ మూవీ 2025 డిసెంబర్లో విడుదలైంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చూసేందుకు జనం థియేటర్ల ఎదుట క్యూ కట్టారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. దీంతో దీని సీక్వెల్ కోసం జనం వెయిట్ చేశారు.ధురంధర్ 3 రాబోతోందా?అయితే వారిని మరీ ఎక్కువ ఎదురుచూడనివ్వకుండా మూడు నెలల్లో ధురంధర్ 2ని తీసుకొచ్చారు మేకర్స్. మార్చి 19న ధురంధర్: ది రివేంజ్ విడుదలైంది. నాలుగు రోజుల్లోనే రూ.761 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలో ధురంధర్ 3 రాబోతోందని ప్రచారం మొదలైంది.ఫేక్ ఫోటోఅది కూడా మరో మూడు నెలల్లోనే విడుదల కాబోతుందని రూమర్ సృష్టించారు. జూన్ 14న ధురంధర్: ద ఫైనల్ చాప్టర్ రాబోతుందంటూ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో సృష్టించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో వదిలారు. ఇంకేముంది, అది నెట్టింట వైరల్‌గా మారగా అది నిజమని చాలామంది భ్రమపడుతున్నారు.సినిమాసినిమా చివర్లో పేర్లు పడి ఆగిపోయేంతవరకు మీరు సీటులో నుంచి లేవొద్దు అని ఆదిత్య ధర్ ప్రేక్షకులకు సూచించాడు. ఆ లెక్కన నిజంగానే చివరాఖరులో మూడో భాగం కోసం ప్రకటించారేమోనని పలువురూ భావించారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదు. ఇప్పటివరకు చిత్రయూనిట్ మూడో భాగం గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. కాబట్టి అదంతా ఫేక్ న్యూస్ అని అర్థమవుతోంది. Is This For Real ? 3 Parts #Dhurandhar The Final Chapter on 14 June 2026 pic.twitter.com/EqAINSzpxN— INDIAN (@hindus47) March 18, 2026 చదవండి: కరుప్పు ఫస్ట్ ఛాయిస్ సూర్య కాదా? -
రికార్డులు బ్రేక్ చేసినా 'పుష్ప2'ని దాటలేకపోయింది
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్ 2' సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. బీభత్సమైన అంచనాలతో బరిలోకి దిగిన ఈ మూవీ ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోని బీ,సీ సెంటర్లలోనూ హవా చూపిస్తుండటం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరుస్తోంది. మొదటి రోజు నుంచి వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి ఊహించని రికార్డులు సొంతం చేసుకుంది. ఇంతకీ నాలుగు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?(ఇదీ చదవండి: ధురంధర్ 2 సక్సెస్: 28 ఏళ్ల నాటి లేఖ వైరల్)తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి 'ధురంధర్ 2' చిత్రానికి రూ.750 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం ఒక్కరోజే కేవలం మన దేశంలోనే రూ.115 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదో రికార్డ్. ఇప్పటివరకు వీకెండ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'పుష్ప 2' రూ.762 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. దీని తర్వాతి స్థానంలోకి 'ధురంధర్ 2' వెళ్లింది. ఈ క్రమంలోనే బాహుబలి 2 (రూ.591 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ.470 కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ.500 కోట్లు) తదితర రికార్డులు బ్రేక్ చేసింది.మరోవైపు బాలీవుడ్‌లోనూ ఇప్పటివరకు షారుఖ్ ఖాన్ 'పఠాన్' పేరిట రూ.287 కోట్ల కలెక్షన్స్ రికార్డ్ ఉంది. దీన్ని 'ధురంధర్ 2' అధిగమించడంతో పాటు సరికొత్త ఘనత సాధించింది. చూస్తుంటే ఇప్పుడప్పుడే ఈ చిత్ర రచ్చ ఆగేలా లేదు. తొలి వారం పూర్తయ్యేసరికి రూ.1000 కోట్లు సాధించడం పక్కా అనిపిస్తుంది. అలానే రూ.2000 కోట్ల మార్క్‌ని కూడా త్వరలోనే అందుకునే అవకాశముందని విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు) -
ధురంధర్ 2 సక్సెస్: 28 ఏళ్ల నాటి లేఖ వైరల్
బ్లాక్‌బస్టర్ ధురంధర్‌కు కొనసాగింపుగా వచ్చిన చిత్రం ధురంధర్: ద రివేంజ్. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తోంది. అటు సోషల్ మీడియాలో నార్త్ నుంచి సౌత్ వరకు ఎందరో సెలబ్రిటీలు దర్శకుడు ఆదిత్య ధర్‌ను, అతడి సినిమాను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఈ మూవీలో నటించిన అందరికీ మంచి పేరు, గుర్తింపు వచ్చింది. 28 ఏళ్ల నాటి లేఖఈ క్రమంలో ధురంధర్ 2లో మొహమ్మద్ ఆలంగా నటించిన గౌరవ్ గేరా తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెట్టాడు. 1998లో ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన రోజుల్లో పేరెంట్స్‌కు రాసిన లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది నేను 1998 డిసెంబర్ 3న మా అమ్మానాన్నలకు రాసిన లేఖ. ముంబైకి వచ్చి అప్పటికింకా నెల రోజులు కూడా కాలేదు. అప్పట్లో ఈమెయిల్స్ గట్రా ఏవీ లేవు.. ఇదిగో ఇలా ఉత్తరాలు రాసుకునేవాళ్లం. అమ్మానాన్న థాంక్యూఆ తర్వాత టీవీ, సినిమా, యాడ్స్, రేడియో, టిక్‌టాక్ రీల్స్.. ఇలా ఎన్నో ఒడిదుడుకులతో నా ప్రయాణం సాగింది. భగవంతుడు నాపై ఎంతో దయచూపించాడు. ఇదిగో ఇలా ధురంధర్లో నటించే అవకాశం.. రానున్న రోజుల్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. ఈ జర్నీలో నాకు అండగా నిలిచిన అమ్మానాన్నకు ధన్యవాదాలు అంటూ లేఖను పంచుకున్నాడు.లేఖలో ఏముందంటే?అమ్మానాన్న, ఎలా ఉన్నారు? నేనిక్కడ క్షేమంగానే ఉన్నాను. ప్రస్తుతానికి డబ్బుపరంగా ఏమీ కలిసిరావడం లేదు. కానీ, త్వరలోనే అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నాను. ఢిల్లీతో పోలిస్తే ఇక్కడ అవకాశాలు ఎక్కువే.. ఖర్చు తగ్గించుకునేందుకు నేను స్నేహితుడితో కలిసి ఓ చిన్న గదిలో ఉంటున్నాను. ఫోన్, కరెంట్, గ్యాస్, వాటర్ బిల్లుతో పాటు భోజన ఖర్చులు కూడా ఇద్దరం పంచుకుంటున్నాం. భవిష్యత్తుపై కొండంత ఆశ ఉంది. కానీ నేను నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది అని రాసుకొచ్చాడు. ఇది చూసిన నటీనటులు, అభిమానులు మీరు చాలా దూరం వచ్చారు, మీ కథ వింటుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Gaurav Gera (@gauravgera) చదవండి: ద 50 షో.. విన్నర్‌గా శివ్ ఠాక్రే.. ప్రైజ్‌మనీ మాత్రం ఎవరికంటే? -
The 50: అరకోటి ప్రైజ్‌మనీ.. విన్నర్‌కు కాదు, అతడి అభిమానికి!
ద 50 రియాలిటీ షోకి శుభం కార్డు పడింది. 50 మంది సెలబ్రిటీలు పాల్గొన్న ఈ షో మార్చి 22న విజయవంతంగా ముగిసింది. ఫైజల్ షైక్, కృష్ణ ష్రాఫ్, రజత్ దలాల్‌లను వెనక్కు నెడుతూ శివ్ ఠాక్రే విజేతగా నిల్చాడు. అతడికి ద 50 ట్రోఫీ అయితే దక్కింది. కానీ ప్రైజ్‌మనీ మాత్రం కాదు! అదే ఈ షో స్పెషాలిటీ.. కంటెస్టెంట్‌కు బదులుగా అతడి అభిమాని అరకోటి గెల్చుకునే అవకాశం ఉంటుంది. అలా శివ్ ఠాక్రే టైటిల్ గెలిస్తే అతడి అభిమాని సీతారామ్ ప్రహ్లాద్ అఘవ్ రూ.50 లక్షల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు.ఫినాలేలో ఏం జరిగిందంటే.. 50 మంది కంటెస్టెంట్లతో ద 50 షో మొదలైంది. ఫైనల్స్‌కు వచ్చేసరికి ఐదుగురు మాత్రమే మిగిలారు. వారే రజత్ దలాల్, శివ్ ఠాక్రే, కృష్ణ ష్రాఫ్, కాక (రవీందర్ సింగ్), ఫైజల్ షైక్. మీలో ఒకర్ని మీరే ఎలిమినేట్ చేయాలని ద లయన్(షోలో బాస్) చెప్పగా.. శివ్, కృష్ణ, కాక.. రజత్‌ను ఎలిమినేట్ చేశారు. మిగిలిన నలుగురికి నాలుగు రకాల టాస్కులు అప్పగించారు. వీటన్నింటిని దాటుకుని శివ్ ఠాక్రే గెలిచి సత్తా చూపించాడు. ఫైజల్ షైక్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచాడు. అభిమానికి రూ.50 లక్షలునిజానికి ప్రిన్స్ నరూలా త్యాగం చేసిన టికెట్ టు ఫినాలేతోనే శివ్ ఠాక్రే ఫైనల్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ఆ ఒక్క అవకాశాన్ని వాడుకుని ఇప్పుడేకంగా ట్రోఫీ గెలవడం విశేషం. రూ.50 లక్షలు గెలిచిన శివ్ ఠాక్రే అభిమాని సీతారాం మాట్లాడుతూ.. నేను, నా కుటుంబం పొలం పని చేసుకుంటాం. ఈ ప్రైజ్‌మనీ గెలవడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇదంతా ఒక మోసమేమో అనుకునేవాడిని. జరుగుతుందంతా చూస్తుంటే ఒక కలలా ఉంది. నా తల్లిదండ్రులకు మంచి ఇల్లు, కారు కొనివ్వాలనుకున్నాను, ఈ డబ్బుతో అదే చేస్తాను అని పేర్కొన్నాడు. కాగా శివ్ ఠాక్రే.. గతంలో మరాఠి బిగ్‌బాస్ రెండో సీజన్ విజేతగా నిలవగా హిందీ బిగ్‌బాస్ 16వ సీజన్లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచాడు. View this post on Instagram A post shared by JioHotstar Reality (@jiohotstarreality) చదవండి: మంచు లక్ష్మి ఇంట్లో వేడుక.. మోహన్‌బాబు ఆశీర్వాదం -
'ధురంధర్ 2'.. ఇంత పొరపాటు ఎలా చేశారు?
ప్రస్తుతం భారతీయ బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్ 2' హవా కనిపిస్తోంది. పేరుకే హిందీ సినిమా అయినప్పటికీ డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరిస్తోంది. దీని ప్రభావమో ఏమో గానీ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కలెక్షన్స్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయాయి. అయితే 'ధురంధర్ 2' చూసి చాలామంది ఎంజాయ్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రొపగాండా మూవీ అని విమర్శిస్తున్నారు. వీటి సంగతి కాసేపు పక్కనబెడితే మూవీలో ఓ పొరపాటు మాత్రం అలానే వదిలేశారు. దీన్ని ఇప్పుడు నెటిజన్లు కనిపెట్టారు.(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?)గతేడాది డిసెంబరులో 'ధురంధర్' తొలి భాగం రిలీజ్ కాగా.. ఈ శుక్రవారం(మార్చి 19) సీక్వెల్ విడుదలైంది. ప్రమోషన్స్ ఏం లేకపోయేసరికి వాయిదా పడుతుందేమో అని చాలామంది అనుకున్నారు. కానీ చెప్పిన తేదీకే థియేటర్లలోకి వచ్చారు. కాకపోతే తెలుగు వెర్షన్ మాత్రం రెండు రోజులు ఆలస్యంగా అంటే నిన్నటి(మార్చి 21) నుంచి అందుబాటులోకి తెచ్చారు.అసలు విషయానికొస్తే ఈ మూవీ ఇంటర్వెల్ సీన్లో హీరో, పిండా అనే పాత్రధారి మధ్య బాత్రూమ్లో చిన్నపాటి ఫైట్ సీన్ జరుగుతుంది. మూవీలో ఈ సన్నివేశం చాలామందికి ఆకట్టుకున్నప్పటికీ.. అద్దంలో కెమెరామ్యాన్ కూడా కనిపిస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విటర్లో వైరల్ అవుతోంది. ఈ పొరపాటు అసలు మేకర్స్ చూసుకోలేదా అని మాట్లాడుకుంటున్నారు. అయితే చెప్పిన తేదీన రిలీజ్ చేయాలనే హడావుడిలో దీన్ని మర్చిపోయింటారేమో అని మాట్లాడుకుంటున్నారు.'ధురంధర్ 2' కలెక్షన్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం రూ.500 కోట్ల మార్క్ దాటేసినట్లు తెలుస్తోంది. అలానే ఓవర్సీస్లోనూ 16 మిలియన్ డాలర్లు సాధించినట్లు టాక్. తొలి భాగంలానే ఇది కూడా లాంగ్ రన్లో మరిన్ని వందల కోట్లు సొంతం చేసుకునేలా కనిపిస్తుంది. మరి 'ధురంధర్ 2' రచ్చ.. ఎన్ని వందల కోట్ల దగ్గర ఆగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: క్రికెట్ రాజకీయాలకు బలైన 'ధురంధర్' దర్శకుడు)A Cameraman showing in this scene.Peak Detailing by Aditya Dhar Damm 🤣#Dhurandhar2 #DhurandherTheRevenge pic.twitter.com/LDjDG8nReP— Sunil Goriya (@Sunil_Goriya) March 21, 2026 -
హాలీవుడ్ సినిమా కోసం హృతిక్.. ఏలియన్‌కు డ్యాన్స్ నేర్పిస్తూ..
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, హాలీవుడ్ సైన్స్-ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' ప్రమోషన్స్ కోసం హాలీవుడ్ దర్శకనిర్మాతలతో చేతులు కలిపారు. భారతీయ ప్రేక్షకులకు ఈ సినిమాను చేరువ చేయడానికి హృతిక్ ఒక స్పెషల్ వీడియోతో ముందుకు వచ్చారు.ఏలియన్‌కి డ్యాన్స్"జాదూ వర్సెస్ రాకీ" అని టైటిల్ ఇచ్చిన ఈ వీడియోలో హృతిక్ రోషన్ తన సూపర్ హిట్ సాంగ్ 'ఏక్ పల్ కా జీనా' ఐకానిక్ స్టెప్‌ను ఈ హాలీవుడ్ చిత్రంలోని ఏలియన్ క్యారెక్టర్ 'రాకీ'కి నేర్పిస్తున్నట్లు చూపించారు. హృతిక్, రాకీల మధ్య ఉన్న స్నేహాన్ని చూసి, 'కోయీ.. మిల్ గయా'లోని హృతిక్ పాత ఏలియన్ స్నేహితుడు 'జాదూ' క్యూట్‌గా రియాక్ట్ అవ్వడం ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణ.హాలీవుడ్ స్టార్ హీరో ర్యాన్ గోస్లింగ్ నటించిన ఈ చిత్రం, 'ది మార్షియన్' ఫేమ్ ఆండీ వీర్ రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా తెరకెక్కింది. 2025 డిసెంబర్లో ఈ నవలపై తనకున్న ఇష్టాన్ని హృతిక్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇప్పుడు అదే సినిమాను ఇండియాలో ప్రమోట్ చేస్తుండటం విశేషం. హృతిక్ లాంటి స్టార్ తమ సినిమాను ప్రమోట్ చేయడం పట్ల సోనీ పిక్చర్స్ ఇండియా ప్రతినిధి షోనీ పంజీకరణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ర్యాన్ గోస్లింగ్, సాండ్రా హుల్లర్, కెన్ లెయుంగ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ భారత్‌లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఐమాక్స్ ఫార్మాట్లో మార్చి 26న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Sony Pictures IN (@sonypicturesin) -
50 ఏళ్ల వయసులో తండ్రయిన నిర్మాత
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మధు మంతెన తండ్రిగా ప్రమోషన్ పొందాడు. 50 ఏళ్ల వయసులో తండ్రయ్యాడు. మధు మంతెన - ఐరా త్రివేది దంపతులకు ఆదివారం (మార్చి 22) తెల్లవారుజామున పండంటి మగ బిడ్డ జన్మించింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. కాగా మధు మంతెన- ఐరా త్రివేది దంపతులు ప్రెగ్నెన్సీ విషయాన్ని ఈ ఏడాది జనవరి 15న వెల్లడించారు. బిడ్డ కోసం ఎదురుచూపులుభార్య బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మార్చిలో డెలివరీ డేట్ ఇచ్చినప్పటినుంచి బిడ్డ రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు బాబు ఈ ప్రపంచంలో అడుగుపెట్టగానే వారి కుటుంబంలో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.రెండో పెళ్లిహైదరాబాద్కు చెందిన మధు మంతెన.. 2015లో ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాని పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరి వైవాహిక జీవితం ఎంతోకాలం సజావుగా సాగలేదు. దీంతో 2019లో విడాకులు తీసుకున్నారు. తర్వాత యోగా ట్రైనర్ ఐరా త్రివేదిని రెండో పెళ్లి చేసుకున్నాడు. సినిమాల విషయానికి వస్తే.. ఈయన గతంలో తెలుగులో కార్తీక్ మూవీని నిర్మించాడు. ఆ తర్వాత బాలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యాడు. ఆమిర్ ఖాన్ గజిని, క్వీన్, సూపర్ 30, రక్త చరిత్ర వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు.చదవండి: ధురంధర్ 2 నుంచి నన్ను తీసేశారనుకున్నా: బాలీవుడ్ నటుడు -
సల్మాన్ ఖాన్ పేరు.. నన్ను ధురంధర్ 2లో తీసేశారనుకున్నా!
రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీలో డానిష్ ఇక్బాల్.. బడే సాహెబ్ అలియాస్ దావూద్ ఇబ్రహీంగా నటించాడు. అయితే సినిమాలో తనను ఎక్కడ తీసేస్తారో అని తెగ భయపడిపోయానంటున్నాడు డానిష్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ధురంధర్ 1 రిలీజయ్యాక సీక్వెల్లో బడే సాహెబ్‌గా ఎవరు కనిపించనున్నారని జనాల్లో ఆసక్తి మొదలైంది. నన్ను తీసేశారనుకున్నా..ఈ క్రమంలో ఎంతోమంది పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో సల్మాన్ ఖాన్, ఇమ్రాన హష్మీ పేర్లు కూడా ఉన్నాయి. అది చూసి ఒకరకంగా నేను చాలా భయపడ్డాను. బడే సాహెబ్ కోసం అప్పటికే నేను సెలక్ట్ అయ్యాను. కానీ నన్ను పక్కనపెట్టేశారేమో.. నా స్థానంలో పెద్ద స్టార్స్‌ను తీసుకుంటున్నారేమో అని కంగారుపడ్డాను. డైరెక్టర్ ఆదిత్య ధర్‌కు ఫోన్ చేసి కనుక్కుందామా? అని ఆందోళన చెందాను.ఆ రెండు పాత్రలు ఒక్కటే అని తెలీదుకానీ, తర్వాత అలాంటిదేం లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నాను. నిజానికి బడే సాహెబ్, దావూద్ ఇబ్రహీం ఒక్కరేనని నాకూ ముందు తెలీదు. నాది మంచానికే పరిమితమైన దావూద్ ఇబ్రహీం పాత్ర అని మాత్రమే తెలుసు. తర్వాత హీరో బడే సాహెబ్ కోసం వెతుకుతున్నప్పుడు ఆయనెవరని అందరూ ఆలోచించడం మొదలుపెట్టాం. పర్వీజ్ ముషారఫా? ఒసామా బిన్ లాడెనా? అనుకున్నాం. అదే సమయంలో దావూదే బడే సాహెబా? అన్న అనుమానమూ వచ్చింది. చివరకు అదే జరిగింది.మేకప్ కోసం 12 గంటలుముసలి వయసులో ఉన్న దావూద్‌గా కనిపించడం కోసం దాదాపు ఏడెనిమిది గంటలు శ్రమించాల్సి వచ్చింది. ఆ ప్రోస్తటిక్ మేకప్‌ను తీసేందుకు కనీసం రెండుమూడు గంటలైనా పెట్టేది. అలా మేకప్‌కే 12 గంటల సమయం అయిపోయేది అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే మార్చి 19న రిలీజైన ధురంధర్ 2 కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. -
మహేశ్‌బాబుతో యాక్టింగ్.. సెట్లో ఎలా ఉంటారంటే?
కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కితే ఆ కిక్కే వేరంటోంది బాలీవుడ్ నటి నీరూ సెహగల్. ఈమె కీలక పాత్రలో నటించిన కొహ్రా వెబ్స సిరీస్ రెండో సీజన్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది నీరూ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నటులుగా సినిమా, సిరీస్‌ల కోసం మేం ఎంతో కష్టపడతాం. ఎప్పటికీ మర్చిపోనుఅవి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని తెలిసినప్పుడు అంతకంటే సంతోషం ఇంకేముంటుంది? నేను అమెరికాలో పెరిగినప్పటికీ పంజాబీ సాంప్రదాయాలకు ఎప్పుడూ కట్టుబడే ఉన్నాను. నా మూలాల్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఆడిషన్ ద్వారానే కొహ్రా సీజన్‌కు ఎంపికయ్యాను. నా పాత్ర ఎంతో బలంగా ఉంటుంది. ఇలాంటి బలమైన రోల్స్ మరిన్ని చేయాలనుంది. కథ బాగుండి, మంచి పాత్ర ఆఫర్ చేస్తే దక్షిణాదిలోనూ నటించడానికి రెడీ.. మహేశ్‌బాబుతో యాక్టింగ్రెండేళ్ల క్రితం ఓ యాడ్‌లో మహేశ్‌బాబుతో కలిసి పని చేశాను. ఆయన పెద్ద సూపర్‌స్టార్ అయినప్పటికీ సెట్లో చాలా వినయంగా ఉంటాడు. డెడికేషన్‌తో పని చేస్తాడు. దానివల్ల షూట్ అంతా చాలా సౌకర్యంగా జరిగింది. ఆయన ఏకాగ్రత, క్రమశిక్షణ.. ఇలా తనను చూసి చాలా నేర్చుకోవచ్చు అని నీరూ సెహగల్ చెప్పుకొచ్చింది.చదవండి: ధురంధర్ 2 విజయం వెనక తెలుగు సినిమా: ఆదిత్య ధర్ -
దురంధర్-2లో టీమిండియా క్రికెటర్స్.. ఈ వీడియో చూశారా?
ఇప్పుడు ఎక్కడ చూసినా దురంధర్ ఫీవర్ కనిపిస్తోంది. మార్చి 19న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ప్రీమియర్స్‌తోనే వసూళ్లు సునామీ మొదలెట్టిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ దాటేసింది. ఆదిత్య ధర డైరెక్షన్లో వచ్చిన ఈ సీక్వెల్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదలైంది. ఈ మూవీపై టాలీవుడ్ స్టార్స్‌తో పాటు పలువురు సినీ నటులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి సైతం దురంధర్-2 మూవీని పొగిడారు.దురంధర్-2 రిలీజ్ వేళ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో హల్చల్ చేస్తోంది. దురంధర్-2 మూవీపై రీల్స్, వీడియోలు పెద్దఎత్తున వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో టీమిండియా క్రికెటర్స్ నటిస్తే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఓ వీడియోను రూపొందించారు. రణ్‌వీర్‌సింగ్ పాత్రలో విరాట్ కోహ్లీ కనిపించగా.. జమీల్ జమాలీ పాత్రలో వీరేంద్ర సెహ్వాగ్ ఉండేలా క్రియేట్ చేశారు. ఈ వీడియో చేసిన ఫన్నీ కోసమే అయినా.. క్రికెటర్స్ ఈ మూవీలో ఎలా కనిపిస్తారో చూస్తే మాత్రం అద్భుతంగా అనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు కూడా చూసేయండి. pic.twitter.com/GalcyV6WIe ఇండియన్ క్రికెటర్లు దురంధర్‌లో నటిస్తే? 💀🔥— Tupaki (@tupaki_official) March 21, 2026 -
దూసుకెళ్తోన్న దురంధర్-2.. కేవలం మూడు రోజుల్లోనే అన్ని కోట్లా?
రణ్‌వీర్‌సింగ్ హీరోగా వచ్చిన దురంధర్-2 హవా కొనసాగుతోంది. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ప్రీమియర్స్‌తోనే రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే రూ.300 కోట్ల మార్క్ దాటేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. కేవలం మూడు రోజుల్లోనే రూ. 500 కోట్ల క్లబ్లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా రూ.501 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ కలెక్షన్స్‌తో ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది.నెట్ వసూళ్ల పరంగా చూస్తే మూడు రోజుల్లోనే రూ.రూ. 339.27 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు అత్యధికంగా రూ.113 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. కేవలం మూడో రోజు వసూళ్లతోనే హిందీ సినిమా చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కేవలం ఇండియాలో మాత్రమే కాదు.. ఓవర్సీస్లోనూ దురంధర్-2 దూసుకెళ్తోంది.ఉత్తర అమెరికాలో 'ధురంధర్ 2' ఏకంగా 4,405 షోలు ప్రదర్శిస్తున్నారు. ఒక ఇండియన్ సినిమా ఇంత భారీ స్థాయిలో విడుదల కావడం ఇదే మొదటిసారి. మూడో రోజు కూడా రెండు లక్షలకు టికెట్లకు పైగా విక్రయించారు. కేవలం అడ్వాన్స్ బుకింగ్‌ల ద్వారానే సుమారు రూ.23.70 కోట్ల భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ వసూళ్లను చూస్తే ఉత్తర అమెరికా మార్కెట్లో ఒక ఇండియన్ మూవీ ఒక్క రోజులో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'ధురంధర్ 2' నిలవనుంది. యూకేలోనూ దురంధర్-2 షోలు హౌస్‌పుల్‌గా రన్ అవుతున్నాయి. బెల్ఫాస్ట్ నగరంలో ఏడు షోలు హౌస్‌పుల్‌గా ప్రదర్శించారు. ఇదే జోరు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా రూ. 2 వేల కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. -
క్రికెట్ రాజకీయాలకు బలైన 'ధురంధర్' దర్శకుడు
'డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను'.. ఇండస్ట్రీలో ఎక్కువగా ఈ మాట వినిపిస్తూ ఉంటుంది. నటుడు లేదా దర్శకుడు అవ్వాలని ఆలోచనతో ఇండస్ట్రీలో అడుగుపెట్టేవాళ్లు కొందరైతే.. అనుకోని విధంగా ఇక్కడొచ్చి అద్భుతమైన గుర్తింపు తెచ్చుకునేవాళ్లు మరికొందరు. అలాంటి వాళ్లలో 'ధురంధర్' డైరెక్టర్ ఆదిత్య ధర్ ఒకడు. క్రికెటర్ కావాల్సిన ఇతడు పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నాడు. అసలు ఆదిత్య బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?)ఢిల్లీలో పుట్టిన ఆదిత్య ధర్, కశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందిన కుర్రాడు. టీమిండియాకి ఎలాగైనా ఆడాలని అనుకునేవాడు. అందుకు తగ్గట్లే ఢిల్లీ అండర్-19 టీమ్ తరఫున కూడా ఆడేవాడు. అయితే 2002లోని భారత అండర్-19 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు. క్రికెట్లోని రాజకీయాలే దీనికి కారణమని భావించి తను ఎంతగానే నమ్మిన క్రికెట్‌ని పక్కనబెట్టేశాడు. రైటర్‌గా ఇండస్ట్రీలోకి వచ్చాడు. తొలుత 2006లో వచ్చిన కాబుల్ ఎక్స్‌ప్రెస్ పాటల రచయితగా పనిచేశాడు. తర్వాత హల్ ఏ దిల్, ఆక్రోష్, తేజ్ తదితర చిత్రాలకు కూడా రచయితగా చేశాడు. స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ దగ్గర సహాయకుడిగానూ వర్క్ చేశాడు. అయితే 2019లో వచ్చిన 'ఉరి' ఇతడిని ఓవర్ నైట్ సెన్సేషన్ చేసిపడేసింది. ఇదే దర్శకుడిగా తొలి చిత్రం. ఇది బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు దేశవ్యాప్తంగా ఆదిత్య పేరు మార్మోగిపోయేలా చేసింది. ఈ మూవీలో 'హౌ ఈజ్ ద జోష్' డైలాగ్ అయితే తెగ వైరల్ అయిపోయింది. ఇదే చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డ్ కూడా తొలి సినిమాకే సొంతం చేసుకున్నాడు.ఇక అదే ఏడాది తన సోదరుడితో కలిసి బీ62 స్టూడియోస్ స్థాపించిన ఆదిత్య ధర్.. తన భార్య, నటి యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన 'ఆర్టికల్ 370'ని నిర్మించి, రచయితగానూ పనిచేసి హిట్ కొట్టాడు. తొలి మూవీ వచ్చిన దాదాపు ఆరేళ్లకు అంటే గతేడాది డిసెంబరులో 'ధురంధర్'తో వచ్చాడు. సర్ప్రైజింగ్ హిట్ కొట్టాడు. 50 రోజులకు పైనే ఇది థియేటర్లలో ప్రదర్శితమైంది. రెండు రోజుల క్రితం రిలీజైన ధురంధర్ 2 అయితే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. వందల కోట్ల వసూళ్లు సాధిస్తోంది. క్రికెటర్ కావాల్సిన వాడు ఇప్పుడు బాక్సాఫీస్ మొనగాడు అయిపోయాడు.ఆదిత్య తల్లి సునీత ధర్.. ఢిల్లీ యూనివర్సిటీలో డీన్‌గా పనిచేయగా, తండ్రి గురించిన సమాచారం అయితే దొరకలేదు. 'ఉరి' తీస్తున్న టైంలోనే అందులో నటించిన యామీ గౌతమ్‌తో ప్రేమలో పడ్డ ఆదిత్య.. 2021లో ఆమెని పెళ్లి చేసుకున్నాడు. 2024లో వీళ్లకు కొడుకు పుట్టాడు. ప్రస్తుతం 'ధురంధర్ 2' విజయాన్ని ఈ భార్యభర్తలిద్దరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఏదేమైనా మూడంటే మూడే సినిమాలు తీసి దేశవ్యాప్తంగా అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేయడం విశేషం.(ఇదీ చదవండి: డూప్, VFX కాదు.. నిజంగా ధురంధర్ హీరోనే!) -
డూప్, VFX కాదు.. నిజంగా ధురంధర్ హీరోనే!
సినిమాలో కాస్త కఠినమైన సీన్లు, యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయంటే చాలు చాలామంది హీరోలు వారి డూప్‌లతోనే చేయిస్తారు. దర్శకనిర్మాతలు సైతం ముందుజాగ్రత్త కొద్దీ డూప్‌లను పెట్టే సీన్లు పూర్తి చేస్తారు. కొన్ని చోట్లేమో హీరోనే పెట్టి సీన్లు చేసినా.. భారీగా వీఎఫ్ఎక్స్ వాడతారు. అతడే సాహసాలు చేసినట్లుగా తెరపై మాయ చేస్తారు.డూప్ కాదుకానీ ధురంధర్ హీరో రణ్వీర్ సింగ్ మాత్రం నిజంగానే సాహసం చేశాడు. డూప్, వీఎఫ్ఎక్స్ జోలికి పోకుండా రియల్ స్టంట్ చేశాడు. సినిమాలో సీక్రెట్ ఏజెంట్‌గా మారేందుకు హమ్జా (రణ్వీర్ సింగ్) కఠోరమైన శిక్షణ తీసుకుంటాడు. అందులో భాగంగానే నీటిలో ఊపిరి బిగపట్టుకుని ఉండేలా సాధన చేస్తాడు. కదలకుండా కూర్చున్న హీరోఅందుకోసం నీటి అడుగు భాగంలో కదలకుండా కూర్చుంటాడు. ఈ సీన్‌ను చాలా సహజంగా చిత్రీకరించారు. అందుకు సంబంధించిన మేకింగ్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటిదాకా అతడి నటనను మెచ్చుకున్న జనం.. ఈ వీడియో చూశాక అతడి అంకితభావాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. నీ కష్టం వృథాకాలేదు, నువ్వు చాలా గ్రేట్ యాక్టర్ అని కితాబిస్తున్నారు.సినిమాసినిమా విషయానికి వస్తే.. 2025 డిసెంబర్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ధురంధర్ మూవీకి సీక్వెల్‌గా ధురంధర్ 2 తెరకెక్కింది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లు రాబట్టింది. #RanveerSingh performs intense underwater scene with no VFX 🔥Pure dedication & madness by Ranveer 💥#Dhurandhar2 #DhurandharTheRevenge pic.twitter.com/go6iHgSoYb— Milagro Movies (@MilagroMovies) March 21, 2026 చదవండి: త్వరలో పెళ్లి? తేజ సజ్జా రియాక్షన్ ఇదే -
ఐశ్వర్యరాయ్‌కు సారీ చెప్పిన హీరోయిన్, ఎందుకంటే?
పిల్లి కళ్ల హీరోయిన్ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చే పేరు ఐశ్వర్యరాయ్.. ఆ తర్వాత కాస్త అటూఇటుగా ఐష్లాగే కనిపించే స్నేహా ఉల్లాల్ గుర్తొస్తుంది. తను కూడా హీరోయిన్ అయినప్పటికీ తనను ఐశ్వర్యతో పోల్చినందుకు తెగ సంబరపడిపోయింది. అదే సమయంలో ఒకసారి ఆమెను నేరుగా కలిసి క్షమాపణలు కూడా చెప్పింది.. అదెందుకో ఓసారి చూసేద్దాం..సినిమా'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది స్నేహా ఉల్లాల్. అప్పటికే 'లక్కీ: నో టైం ఫర్ లవ్' (2005) చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అలా ఓపక్క హిందీ సినిమాలు చేస్తూ మరోపక్క తెలుగు చిత్రాల్లో నటించింది. మధ్యలో కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇవ్వగా ఆ తర్వాత అడపడాదడపా సినిమాల్లో కనిపిస్తోంది.సల్మాన్ ఎలాంటివాడంటే?తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్నేహ తన కెరీర్ తొలినాళ్ల గురించి ఓపెన్ అయింది. ఆమె మాట్లాడుతూ.. లక్కీ మూవీతో నా సినీరంగ ప్రవేశం జరిగింది. చిత్రీకరణ సమయంలో హీరో సల్మాన్ ఖాన్ నాకెంతో సపోర్ట్ చేశాడు. ఎప్పుడూ ఓపిక, సహనంతో మెదిలేవాడు. తానో పెద్ద హీరో అని ఎన్నడూ యాటిట్యూడ్ చూపించలేదు.అలా ఫేమస్నిజానికి నేను సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ కిరీటం అందుకుంది. చూడటానికి నేను ఐశ్వర్యరాయ్లాగే ఉంటానని చాలామంది అంటుంటారు. అలా ఆమె మిస్ వరల్డ్ కిరీటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకుంటే నా చుట్టూ ఉన్న చిన్నప్రపంచంలో నేను సెలబ్రిటీ అయిపోయాను.ఐశ్వర్యకు సారీనేను ఒకే ఒక్కసారి ఐశ్వర్యను కలిశాను. నన్ను చూడగానే ఆమె 'వెల్కమ్ టు ద ఫ్యామిలీ.. బాలీవుడ్‌కు స్వాగతం' అని సాదరంగా ఆహ్వానించింది. అప్పుడు వెంటనే నేను ఆమెకు సారీ చెప్పాను. మీడియాలో పదేపదే నన్ను ఐష్‌తో పోలుస్తూనే ఉన్నారు. దాని గురించే చెప్తూ నన్ను క్షమించండి, దయచేసి నన్ను ద్వేషించకండి అన్నాను. మరి ఆమె దాన్ని ఎలా తీసుకుందో నాకు తెలీదు అని స్నేహా ఉల్లాల్ పేర్కొంది.చదవండి: ప్రియుడిని పెళ్లి చేసుకున్న పునర్నవి -
'ధురంధర్ 2'.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చాన్నాళ్ల తర్వాత పాన్ ఇండియా బాక్సాఫీస్ కళకళలాడుతోంది. రీసెంట్‌గానే థియేటర్లలోకి వచ్చిన 'ధురంధర్ 2'.. నిలకడగా వసూళ్ల సాధిస్తోంది. రిలీజ్‌కి భారీ హైప్ సొంతం చేసుకోగా.. సాంకేతిక కారణాల వల్ల హిందీ వెర్షన్ మాత్రమే తొలిరోజు విడుదలైంది. శనివారం నుంచి తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ రెండు రోజుల పాటు ఈ చిత్రానికి కలెక్షన్స్ ఎంతొచ్చాయి?(ఇదీ చదవండి: దురంధర్-2 చెత్త సినిమా.. థియేటర్‌కు అస్సలు వెళ్లకండి)రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురంధర్ 2'.. రెండు రోజుల్లో రూ.333 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. తొలిరోజు మన దేశంలో రూ.145 కోట్ల నెట్ వసూళ్లు రాగా, శుక్రవారం ఈ నంబర్స్ కాస్త తగ్గి రూ.81 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా రూ.226 కోట్ల నెట్ కాగా రూ.269 కోట్ల గ్రాస్ అని తెలుస్తోంది. మరోవైపు ఓవర్సీస్లోనూ రెండు రోజులకు కలిపి 7 మిలియన్ డాలర్లు వచ్చినట్లు టాక్.అలా ప్రపంచవ్యాప్తంగా 'ధురంధర్ 2' చిత్రానికి రెండు రోజులకు కలిపి రూ.333 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి వీకెండ్ అయ్యేసరికి రూ.500 కోట్ల మార్క్ దాటేయడం గ్యారంటీ అనిపిస్తుంది. గతేడాది డిసెంబరులో ఫస్ట్ పార్ట్ రిలీజైనప్పుడు ఒక్కసారి వసూళ్లు రాలేదు. రోజురోజుకీ పెరుగుతూ వెళ్లాయి. దీనికి కూడా అలానే పునరావృతమయ్యేలా కనిపిస్తుంది. మొదటి భాగానికి రూ.1300 కోట్ల మేర కలెక్షన్స్ రాగా.. ఇప్పుడొచ్చిన సీక్వెల్, ల్యాంగ్ రన్లో ఎన్ని వేలకోట్ల కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఉస్తాద్ భగత్‌సింగ్ కలెక్షన్స్.. చెప్పుకోలేని పరిస్థితిలో మేకర్స్) -
కరెక్ట్ పర్సన్ దొరికితేనే పెళ్లి.. లేదంటే జీవితాంతం సింగిల్‌గానే!
కొందరు పెళ్లంటేనే ముఖం చాటేస్తారు. అలాంటివారిలో బాలీవుడ్ నటి దివ్య దత్తా ఒకరు. 48 ఏళ్ల వయసొచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయింది. తాజాగా ఆమె ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని చెప్పింది. దివ్య దత్తా మాట్లాడుతూ.. గతంలో నేను రిలేషన్షిప్స్లో ఉన్నాను.. కానీ, అవేవీ నాకు సరిపోవని అర్థమైంది. మా ఆలోచనలు భిన్నంగా ఉండేవి. సింగిల్‌గా ఉన్నానని..దాంతో ప్రేమికులుగా కంటే స్నేహితులుగానే బాగుంటామనిపించింది. అయితే ఇప్పటికీ నేను సింగిల్‌గా ఉండటం చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. జీవితంలో ఓ తోడు లేకుండా ఏం చేస్తున్నావు?, అసలు పెళ్లెందుకు చేసుకోలేదు? అని ప్రశ్నిస్తుంటారు. నా జీవితంలో ఏది ముఖ్యం? ఏది అవసరం అనేది నాకు బాగా తెలుసు.ప్రశాంతంగా ఉంటా..నాకు కరెక్ట్ అనిపించే వ్యక్తి తారసపడ్డప్పుడు కచ్చితంగా ప్రేమలో పడతాను.. కానీ అలాంటి వ్యక్తి దొరక్కపోతే ఇలా ఎప్పటికీ ఒక్కదాన్నే ప్రశాంతంగా ఉంటాను. అంతేతప్ప ఓ తోడుండాలి కదా అని ఎవరో ఒకర్ని పెళ్లి చేసుకోలేను. నాకు ఈ సమాజ ఆమోదం కన్నా మానసిక ప్రశాంతత, సంతోషమే ముఖ్యం.సినిమాపైగా రిలేషన్షిప్లో ఇద్దరూ జీవితాంతం కలిసుంటారన్న గ్యారెంటీ కూడా లేదు. ఎప్పుడు? ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు అని తెలిపింది. దివ్య దత్తా.. వీర్ జార, ఢిల్లీ 6, భాగ్ మిల్కా భాగ్ , హీరోయిన్, బ్లాక్మెయిల్ వంటి పలు సినిమాలతో గుర్తింపు పొందింది. చివరగా ఛావా మూవీలో యాక్ట్ చేసింది.చదవండి: ధురంధర్ 2 ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. తెలుగులో కూడా.. -
‘ధురంధర్ 2’ అభిమానులకు గుడ్ న్యూస్.. తెలుగులో కూడా!
‘ధురంధర్ 2’ అభిమానులకు గుడ్ న్యూస్. నేటి నుంచి(మార్చి 21) ఈ మూవీ తెలుగులోనూ విడుదల కానుంది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఆన్లైన్లో తెలుగు వెర్షన్‌కి కూడా బుకింగ్స్ ఓపెన్ చేశారు. వాస్తవానికి ఈ సినిమా ప్రీమియర్స్ రోజే అంటే మార్చి 18న తెలుగులోనూ విడుదల కావాల్సింది. కానీ సాంకేతిక కారణాలు, చివరి నిమిషంలో సెన్సార్ బోర్డ సూచించిన మార్పుల వల్ల తెలుగు పాటు తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్ల విడుదల వాయిదా పడింది. ప్రీమియర్స్ కోసం ముందే బుక్ చేసుకున్నవారికి థియేటర్ యాజమాన్యాలు రీఫండ్ చేశాయి. దీంతో కొంతమంది భాష తెలియకపోయినా హిందీలోనే ఈ సినిమాను వీక్షించించారు. అయితే శుక్రవారం ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్లకు శుక్రవారం సెన్సార్ పూర్తయ్యింది. కన్నడలో ఇంకా సెన్సార్ పూర్తి కాలేదు. దీంతో కన్నడ వెర్షన్ మినహా..మిగతా భాషలన్నింటిలోనూ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.ధురంధర్ 2 విషయానికొస్తే..బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఆదిద్యధర్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో సారా అర్జున్ హీరోయిన్గా నటించింది. తొలిరోజే ఈ చిత్రం రూ. 172 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది రికార్డు సృష్టించింది. నేటి నుంచి తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్ కూడా అందుబాటులో ఉండడంతో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
దురంధర్-2పై సౌత్ స్టార్స్ ప్రశంసలు.. ప్రకాశ్ రాజ్ రియాక్షన్ ఇదే..!
రణ్వీర్ సింగ్ దురంధర్-2పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, రాం గోపాల్ వర్మ సైతం సీక్వెల్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్స్ చేశారు. బాలీవుడ్ మేకర్స్ సైలెంట్‌గా ఉన్నా.. టాలీవుడ్ స్టార్స్ మాత్రం దురంధర్ మూవీని కొనియాడుతున్నారు. ఆదిత్య ధర్ మరో అద్బుతమైన కంటెంట్ అందించారని.. రణ్వీర్ సింగ్ అదరగొట్టేశాడని ఆకాశానికేత్తేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ రియాక్షన్ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి నుంచి దురంధర్‌కు వ్యతిరేకంగా ఉన్న ఆయన.. తాజాగా సౌత్ స్టార్స్ ఈ మూవీ ప్రశంసించడంపై ఎట్టకేలకు స్పందించారు. ఓ నెటిజన్ చేసిన పోస్ట్‌కు ప్రకాశ్ రాజ్ రిప్లై ఇచ్చారు. దురంధర్-2 మూవీని దక్షిణాది హీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ప్రశంసించారు.. బాలీవుడ్ నుంచి ఎవరైనా స్పందించారా? అని నెటిజన్ రాసుకొచ్చాడు. దీనికి ప్రకాశ్ రాజ్ బదులిస్తూ.. 'బాధ్యతల సంకేతాలు దక్షిణాదికి కూడా వ్యాపిస్తున్నాయి' అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అంతకుముందు ప్రకాశ్ రాజ్ ఓ పాత సినిమాకు సంబంధించిన పాటలు వింటున్న వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. నేను దురంధర్‌కు చాలా దూరంగా ఉన్నా.. మీరు కూడానా? అంటూ పాట వింటున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో హమ్ దోనో(1961) చిత్రంలోని 'అభీ నా జావో ఛోడ్ కర్' ఐకానిక్ పాటను ప్లే చేశారు. మొదటి నుంచి దురంధర్‌ను వ్యతిరేకిస్తున్న ప్రకాశ్ రాజ్.. ఈ ట్వీట్స్ చూస్తుంటే మరోసారి తనలోని అక్కసును వెళ్లగక్కినట్లు తెలుస్తోంది.కాగా.. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన'ధురందర్: ది రివెంజ్' హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడీ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. Signs of Obligations are spreading South too .. #justasking https://t.co/iB01E1sp7K— Prakash Raj (@prakashraaj) March 19, 2026 -
దురంధర్-2 వసూళ్ల ఊచకోత.. ఆ ఒక్కడి వల్లే రూ.500 కోట్లు..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది డిసెంబర్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ఊచకోత చూపించింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. కేవలం హిందీలో మాత్రమే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన చిత్రం దురంధర్ ది రివెంజ్. పార్ట్-2గా వచ్చిన ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సారి హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజైంది. కేవలం ప్రీమియర్స్‌తోనే వసూళ్లు సునామీ ప్రారంభించిన బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో దురంధర్ నటుడు రాకేశ్ బేడీ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రణ్వీర్ సింగ్ తనతో ఇలా చెప్పారని గుర్తు చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాకేశ్ బేడీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా రోల్ షూటింగ్ పూర్తైన రోజు రణ్వీర్ తనకు ఓ మాట చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఒకవేళ ఈ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూలుచేస్తే.. అందులో రూ.500 కోట్లు రాకేశ్ వల్లే వస్తాయని అన్నారని తెలిపారు. ఓ నటుడిగా ఇంతకుమించి ఏం కావాలని హర్షం వ్యక్తం చేశారు. నా చివరి రోజు షూటింగ్లో రణ్ వీర్‌సింగ్ ఏడ్చారని దర్శకుడు ఆదిత్య ధర్ అన్నారు. సెట్లో అంతలా ఎమోషనల్ వాతావరణాన్ని సృష్టించిన మూవీ అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో రాకేశ్ బేడీ రోల్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. కరాచీకి చెందిన రాజకీయ నాయకుడు జమాలి పాత్రలో రాకేశ్ బేడీ అదరగొట్టేశారు. రణ్వీర్ సింగ్ ప్రశంసలు..జమాలిగా బేడీ నటన ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకుంది. ఓ రాజకీయ నాయకుడి నయవంచక పాత్రలో పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రణ్వీర్ సింగ్ ప్రశంసలు కురిపించడం చూస్తుంటే బేడీ పాత్ర ప్రభావం, అలాగే సెట్లో వారి మధ్య ఏర్పడిన స్నేహబంధం అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, సారా అర్జున్, డానిష్ పాండోర్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు. కాగా.. ధురంధర్ 2 ఫస్ట్ డే, ప్రీమియర్స్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా రూ. 172.63 కోట్ల గ్రాస్ రాబట్టింది. -
'ధురంధర్ 2'.. బాలీవుడ్ కంటే టాలీవుడే ముందు
ఓ హిందీ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసి చాలా కాలమైపోయింది. పదిపదిహేనేళ్ల క్రితం షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తదితరుల చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉండేది. అందుకు తగ్గట్లే కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు 'ధురంధర్ 2' విషయంలో ఆ జోష్ కనిపిస్తోంది. తెలుగు షోలు పూర్తిస్థాయిలో స్క్రీనింగ్ కానప్పటికీ హిందీ వెర్షన్ అయినా సరే చూసేయాల్సిందే అని ఆలోచనతో ఉన్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో టికెట్ బుకింగ్స్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ధురంధర్-2 ఫస్ట్ డే కలెక్షన్స్..)ఈ సినిమాలో ఒక్క తెలుగు నటుడు కూడా లేడు. అయినా సరే తొలి పార్ట్ హిట్ అయ్యేసరికి బీభత్సమైన హైప్ ఏర్పడింది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితమే అంటే బుధవారం సాయంత్రం నుంచి ప్రీమియర్స్ పడ్డాయి. ఈ క్రమంలోనే తెలుగు స్టార్ హీరోలు అయిన అల్లు అర్జున్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ తదితరులు ఏకంగా ట్వీట్స్ చేసి మరీ మూవీని ఆకాశానికెత్తేశారు. అదే టైంలో బాలీవుడ్ మాత్రం పూర్తిగా సైలెన్స్ పాటిస్తోంది.'ధురంధర్ 2' ట్రైలర్ రిలీజైనప్పుడు హిందీ ఇండస్ట్రీకి చెందిన హృతిక్ రోషన్, ఆలియా భట్, విక్కీ కౌశల్ లాంటి స్టార్స్ పోస్టులు పెట్టారు గానీ మూవీ వచ్చి రెండు రోజులు కావొస్తున్నా బాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా పోస్టుల్లాంటివి పెట్టకపోవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. దీని గురించి సోషల్ మీడియాలోనూ చర్చ నడుస్తోంది. హిందీ సినిమాని సపోర్ట్ చేసే విషయంలోనూ బాలీవుడ్ కంటే టాలీవుడ్ ముందుందిగా అని మాట్లాడుకుంటున్నారు.దీనికి పోటీగా తెలుగు రాష్ట్రాల వరకు పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజైంది. కానీ తొలి షో నుంచే నెగిటివ్ టాక్ వస్తోంది. రొటీన్ ఫక్తు కమర్షియల్ మూవీ అని చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. పవన్ అభిమానులకు తప్పితే ఇది మరెవరికి నచ్చట్లేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి! 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్ విడుదలైతే.. 'ఉస్తాద్'కి మరింత కష్టాలు తప్పవు.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
నడిరోడ్డుపై వేధింపులు.. తాగొచ్చి కారు ఆపి..: నటి
బాలీవుడ్ నటి నిమిషా నాయర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ముంబై బాంద్రాలో క్యాబ్‌లో వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తనను ఇబ్బందిపెట్టారంటోంది. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఉదయం 4.50 గంటల సమయంలో నేను క్యాబ్‌లో వెళ్తున్నాను. ఆ సమయంలో డ్రైవర్ ఓ బైక్‌ను ఓవర్టేక్ చేశాడు. ఆ బైక్‌పై ఉన్నవారు బాగా తాగినట్లున్నారు. వాళ్లను దాటేసినందుకు కోపంతో ఊగిపోయారు. కొట్టడానికి రెడీ..క్యాబ్ డ్రైవర్‌కు గుణపాఠం చెప్పాలనుకున్నారు. హైవే మధ్యలో మా కారును అడ్డుకున్నారు. కారు ఎదుటే బైక్ నిలిపి ముందుకు వెళ్లనీయకుండా చేశారు. ఆవేశంతో ఎగబడ్డారు, దుర్భాషలాడారు. డోర్స్ తెరిచేందుకు ప్రయత్నించారు. నన్ను విండోస్ కిందకు దించమన్నారు. వాళ్లెంత రెచ్చగొట్టినా సరే మేము ఆ పని చేయలేదు. ఎందుకంటే అతడు డ్రైవర్‌ను కొట్టడానికే మా కారు ఆపాడని నాకు బాగా తెలుసు.. మా రక్షణ కోసం మేము సైలెంట్‌గా ఉండిపోయాం. వీడియో తీస్తున్నానని..మమ్మల్ని చాలాసేపు వేధించారు. నేను వీడియో తీస్తున్నానని గ్రహించి కారు ఫోటోలు తీసుకుని వెళ్లిపోయారు అని పేర్కొంది. వీరిపై చర్యలు తీసుకోమని పోలీసులను కోరింది. ఇది చూసిన నెటిజన్లు.. మీరు క్షేమంగా ఉన్నందుకు సంతోషం, ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం దురదృష్టకరం.. అని కామెంట్లు చేస్తున్నారు. కాగా నిమిషా నాయర్.. అమర్ కాలనీ, 8 ఏఎమ్ మెట్రో సినిమాల్లో నటించింది. 'ట్రయల్ బై ఫైర్' వెబ్ సిరీస్‌లోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Nimisha Nair 🌸 (@nimnair) చదవండి: యాక్టింగ్ రాదని ట్రోలింగ్ చేశారు: రష్మిక ఎమోషనల్ -
ఫ్రీగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్.. రిజెక్ట్ చేశా: అనుపమ్ ఖేర్
టాలెంట్ ఉంటే చాలు ఎలాగైనా రాణించవచ్చనుకున్నాడు నటుడు అనుపమ్ ఖేర్. కానీ, ఆయన బట్టతలను చూసి ఈయనెలా నటుడవతాడని చాలామంది సంశయించారు. వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ దిల్వాలే దుల్హానియా లేజాయెంగే, హమ్ ఆప్కే హై కోన్, ద కాశ్మీర్ ఫైల్స్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించాడు. రెండుసార్లు జాతీయ అవార్డు అందుకున్నాడు.అంకుల్ అని పిలవద్దుతాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. యువతరం నన్ను సర్, అంకుల్ అని పిలిస్తే నచ్చదు. ఏకే లేదా అనుపమ్ గారు అంటే సరిపోతుంది. అంతేకానీ అంకుల్ అని నన్ను వేరు చేయడం ఇష్టం లేదు. సినిమా దగ్గరినుంచి ఏఐ, సైన్స్.. ఇలా అన్నిరకాల అంశాల గురించి చర్చించడం నాకెంతో ఇష్టం. ఇకపోతే ఎంతోమంది డాక్టర్లు నాకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తామని ముందుకు వచ్చారు. పేపర్లో యాడ్కానీ, వాళ్లందరినీ సున్నితంగా తిరస్కరించాను. నా తలపై వెంట్రుకలు వచ్చేందుకు డబ్బు ఖర్చుపెట్టేందుకు రెడీ అయినవాళ్లూ ఉన్నారు. కానీ, నేను వారికి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. అలా డబ్బు తీసుకోవడం నాకిష్టం లేదు. ఒకసారి ఏమైందంటే నేను న్యూస్‌పేపర్ చదువుతున్నాను. అందులో హెయిర్ ఆయిల్ కోసం ఓ వాణిజ్య ప్రకటన వేశారు. అది నేను చూడలేదు. సినిమాకానీ, నా కొడుకు సికందర్ నేను యాడ్నే చూస్తున్నా అనుకుని.. దాని గురించి ఆలోచించకు నాన్న అన్నాడు. ఎన్నో ఏళ్ల కిందట ఈ సంఘటన జరిగింది అని చెప్పుకొచ్చాడు. అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఘోస్లా 2. ఇది 2006లో వచ్చిన కల్ట్ క్లాసిక్ ఖోస్లా కా ఘోస్లా సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. ప్రశాంత్ భాగియా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 28న విడుదల కానుంది.చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలో కొత్త సినిమా


