ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఐటం సాంగ్స్‌తో వైరల్ అవుతోంది తమన్నా భాటియా. అలా ఆమె స్పెషల్‌గా స్టెప్పులేసిన పాట ఒకటి వన్ బిలియన్ వ్యూస్ వ్యూస్ దాటింది. అదే 'స్త్రీ 2' మూవీలోని 'ఆజ్ కీ రాత్'. ఈ విషయాన్ని మిల్కీబ్యూటీ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. 'ఫస్ట్ వ్యూ నుంచి 1 బిలియన్ (100 కోట్ల) వరకు.. మీ ప్రేమకు థాంక్స్' అని రాసుకొచ్చింది.
సినిమా
తమన్నా 2005లో హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టింది. శ్రీ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. హ్యాపీ డేస్‌తో గుర్తింపు తెచ్చుకుంది. 100% లవ్, బద్రీనాథ్, రచ్చ, ఎందుకంటే ప్రేమంట, ఆగడు, బాహుబలి, ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. చివరగా ఓదెల 2 మూవీలో నటించింది. ప్రస్తుతం హిందీలోనే మూడు సినిమాలు చేస్తోంది.
ఐటం సాంగ్‌తో మరింత క్రేజ్
అల్లుడు శీను మూవీలో 'రావే నా లబ్బర్ బొమ్మ' అనే ఐటం సాంగ్‌లో తొలిసారి స్టెప్పులేసింది. జై లవకుశలో 'స్వింగ్ జర', సరిలేరు నీకెవ్వరులో 'డాంగ్ డాంగ్', జైలర్‌లో 'నువ్వు కావాలయ్యా..', స్త్రీ 2లో 'ఆజ్ కీ రాత్', రైడ్ 2లో 'నషా' వంటి ఐటం సాంగ్స్‌తో తమన్నా ఫుల్ పాపులర్ అయిపోయింది.
చదవండి: మన శంకరవరప్రసాద్‌గారు నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?


