థియేటర్లలో హౌస్‌ఫుల్‌.. రికార్డులు సృష్టిస్తోన్న చిరంజీవి మూవీ | Chiranjeevi Mana Shankara vara prasad Garu Movie 4 Days Collections | Sakshi
Sakshi News home page

4 రోజుల్లోనే 'మన శంకరవరప్రసాద్‌గారు' రికార్డు

Jan 16 2026 5:41 PM | Updated on Jan 16 2026 5:59 PM

Chiranjeevi Mana Shankara vara prasad Garu Movie 4 Days Collections

'మన శంకరవరప్రసాద్‌గారు' డబుల్‌ సెంచరీ కొట్టారు. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ మన శంకరవరప్రసాద్‌గారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా విక్టరీ వెంకటేశ్‌ కీలక పాత్రలో యాక్ట్‌ చేశాడు. సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజే బ్లాక్‌బస్టర్‌ టాక్‌ సంపాదించుకుంది.

డబుల్‌ సెంచరీ
రెండురోజుల్లోనే సెంచరీ (రూ.100 కోట్లు) కొట్టిన ఈ మూవీ ఇప్పుడు నాలుగురోజుల్లోనే డబుల్‌ సెంచరీ (రూ.200 కోట్లు) మార్క్‌ను చేరుకోవడం విశేషం. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ షైన్‌ స్క్రీన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. 'థియేటర్లలో విజిళ్లు.. బయటేమో హౌస్‌ఫుల్‌ బోర్డులు.. రెండువందల కోట్ల కలెక్షన్స్‌ ఇచ్చిన ప్రేక్షకులకు శతకోటి వందనాలు' అంటూ చిరు- అనిల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ఈ వీకెండ్‌ పూర్తయ్యేసరికి సినిమా మరిన్ని రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

 

 

చదవండి: నా సినిమా చూసి విడాకులు క్యాన్సిల్‌ చేసుకున్నారు: చిరంజీవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement