'MSG' చూసి ఓ జంటలో మార్పు.. విడాకులు క్యాన్సిల్‌ | Chiranjeevi: a couple Cancel their Divorce after watching Mana Shankara Vara Prasad Garu Movie | Sakshi
Sakshi News home page

Chiranjeevi: నా సినిమా చూసి విడాకులు క్యాన్సిల్‌ చేసుకున్నారు

Jan 16 2026 2:50 PM | Updated on Jan 16 2026 3:02 PM

Chiranjeevi: a couple Cancel their Divorce after watching Mana Shankara Vara Prasad Garu Movie

అనిల్‌ రావిపూడి సినిమా వస్తోందంటే హిట్టు గ్యారెంటీ.. అందులోనూ సంక్రాంతికి వస్తున్నాడంటే బ్లాక్‌బస్టర్‌ పక్కా! పైగా మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా అంటే బాక్సాఫీస్‌ దద్దరిల్లాల్సిందే.. అనిల్‌ రావిపూడి- చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన మన శంకరవరప్రసాద్‌గారు సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

స్పెషల్‌ ఇంటర్వ్యూ 
నయనతార హీరోయిన్‌గా యాక్ట్‌ చేయగా వెంకటేశ్‌ కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమాను సంక్రాంతి హిట్‌ బొమ్మగా ప్రేక్షకులు ఆల్‌రెడీ డిసైడ్‌ చేశారు. అందుకే సంక్రాంతి కానుకగా చిరు, వెంకీ, అనిల్‌ రావిపూడిల స్పెషల్‌ ఇంటర్వ్యూ రిలీజ్‌ చేశారు. అందులో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఓ జంట విడాకులు తీసుకోవాలని మూడు నెలలుగా అనుకుంటోంది. 

విడాకులు క్యాన్సిల్‌
ఇద్దరూ వేర్వేరుగా మన శంకరవరప్రసాద్‌గారు మూవీ చూశారు. సినిమా చూడగానే ఇద్దరూ ఫోన్‌ మాట్లాడుకుని విడాకులు రద్దు చేసుకుని కలిసిపోయారు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం ఉండకూడదు. వారి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి అని హీరో తల్లి చెప్పే డైలాగులు సినిమాలో ఉంటాయి. అవే వారిలో మార్పు తెచ్చాయి. ఇలాంటి సీన్స్‌ రాసిన అనిల్‌ రావిపూడికి హ్యాట్సాఫ్‌' అని మెచ్చుకున్నాడు.

సినిమా కథ విషయానికి వస్తే..
శంకర వరప్రసాద్‌(చిరంజీవి) నేషనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌. అతడి భార్య పేరు శశిరేఖ (నయనతార). ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడిపోతారు. ఇద్దరు పిల్లల్ని తీసుకుని శశిరేఖ తండ్రి దగ్గరకు వెళ్లిపోతుంది. ఆరేళ్ల తర్వాత పిల్లలు చదివే స్కూల్‌లో పీఈటీ టీచర్‌గా చేరతాడు శంకర్‌. తండ్రిపై ద్వేషం పెంచుకున్న పిల్లలకు ఆయన ఎలా దగ్గరయ్యాడు? అసలు భార్యాభర్తల మధ్య గొడవేంటి? మళ్లీ కలిశారా? లేదా? అన్నదే కథ!

చదవండి: భర్తతో సమంత తొలి సంక్రాంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement