అమ్మాయితో వివాహేతర సంబంధం.. స్టార్‌ హీరో భార్య సంచలన వ్యాఖ్యలు | Sunita Ahuja Breaks Silence On Rumours About Govinda Affairs | Sakshi
Sakshi News home page

అమ్మాయితో వివాహేతర సంబంధం.. స్టార్‌ హీరో భార్య సంచలన వ్యాఖ్యలు

Jan 17 2026 4:17 PM | Updated on Jan 17 2026 4:43 PM

Sunita Ahuja Breaks Silence On Rumours About Govinda Affairs

బాలీవుడ్ సీనియర్హీరో గోవిందా వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మధ్య గోవిందాపై ఆయన సతీమణి సునీత ఆహుజా(Sunita Ahuja) సంచలన ఆరోపణలు చేసింది. గోవిందాకు మరో అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని ఇంటర్వ్యూలో చెప్పింది. తర్వాత గోవిందా(Govinda) పర్సనల్లైప్పై రకరకాల పుకార్లు వచ్చాయి. ప్రస్తుతం సునీత, గోవిందా వేరు వేరుగా ఉంటున్నారు. విడాకులు కూడా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో వాస్తవం లేదని స్వయంగా సునీతనే చెప్పింది. అయితే తన భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందనేది వందశాతం నిజమని చెబుతోంది

తాజాగా మిస్మాలినికి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ అదే విషయంపై మట్లాడారు. ‘చాలా మంది అమ్మాయిలు మీ దగ్గరు వస్తారు. కానీ మీరు తెలివి తక్కువ వారు కాదు. 63 ఏళ్ల వయసు వచ్చింది. టీనా(కూతురు)కి పెళ్లి చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. యశ్‌(కొడుకు)కి కెరీర్ఉంది. నిన్ను క్షమించే ప్రస్తక్తే లేదు గోవిందాఅని భర్త గోవిందకు సునీత వార్నింగ్ఇచ్చింది. ఇంకా మాట్లాడుతూ.. ‘నేను నేపాల్అమ్మాయిని. ఖుక్రీ(కత్తి) బయటకు తీస్తే.. అందరూ ఇబ్బంది పడతారు. అందుకే జాగ్రత్తగా ఉండమని అతని చెప్పాఅని సునీత అన్నారు.

కాగా.. సునీతా అహుజా, గోవిందల పెళ్లి 1987లో జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు యశ్‌, కూతురు పేరు టీనా. గత ఏడాదిగా వీరిద్దరు వేరు వేరుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. విడాకుల రూమర్స్‌ వినిపిస్తున్నా.సునిత మాత్రం గోవిందా ఎప్పటికీ తనవాడే అని.. వదిలేసే ప్రసక్తే లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement