బెంగాలీ నటుడు, ఖరగ్‌పూర్ ఎమ్మెల్యే హిరాన్ చటర్జీ రెండో పెళ్లి చేసుకున్నారు. వారణాసిలో మోడల్ రితికా గిరిని వేదమంత్రాల సాక్షిగా వివాహమాడారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పరిణామాలపై నటుడి మొదటి భార్య ఆనందిత చటర్జీ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. మీలాగే నేనూ ఆన్‌లైన్‌లో ఫోటోలు చూశాను. దీనిగురించి నా వద్ద ఎటువంటి ముందస్తు సమాచారం లేదు. ఇది ఇల్లీగల్ మ్యారేజ్.. వారి పెళ్లి చెల్లదు అని పేర్కొంది.
ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదికే..
ఇంకా మాట్లాడుతూ.. నేను, హిరాన్ 2000వ సంవత్సరం డిసెంబర్ 11న పెళ్లి చేసుకున్నాం. మొదట్లో బాగానే ఉన్నాం. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో హిరాన్.. ఖరగ్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదికే ఓ మహిళతో రిలేషన్‌లో ఉన్నాడని రూమర్స్ వినిపించాయి. మొదట్లో నమ్మలేదు, లైట్ తీసుకున్నా.. కానీ, తర్వాత విషయం చిన్నది కాదని అర్థమైంది.

హిరాన్ చటర్జీ-రితికా గిరి పెళ్లి ఫోటో
జీర్ణించుకోలేకపోయా..
మా కూతురి వయసు కంటే రెండేళ్లు పెద్ద అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నాడు. అది జీర్ణించుకోలేకపోయాను. 2022లో అతడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి విడిగా జీవిస్తున్నాను. నా కూతుర్ని చూసేందుకు అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేవాడు. ఆ సమయంలో ఏవేవో కథలు చెప్పేవాడు. రితికా గిరి అనే అమ్మాయి చచ్చిపోతానని బెదిరిస్తోందని, వేధింపులకు గురి చేస్తోందని బాధపడేవాడు. అప్పుడు మాతో కలిసి ఉండమని చెప్పాను.
ఈ గొడవలకు దూరం
అలా 2024లో నా కూతురి 18వ బర్త్‌డే సమయంలో మాతోపాటే ఉన్నాడు. మేమంతా కలిసి బ్యాంకాక్ వెళ్లి అక్కడ తన బర్త్‌డే సెలబ్రేట్ చేశాం. సరిగ్గా అదే సమయంలో ఆ ఆమ్మాయి నాకు ఫోన్ చేసి బెదిరించింది. తను చెప్పినట్లుగానే మళ్లీ నా భర్తతో కలిసిపోయింది. ఈ వ్యవహారంతో నేను చాలాకాలంగా టార్చర్ అనుభవిస్తున్నా.. అతడు రెండో పెళ్లి చేసుకోవడం చాలా పెద్ద తప్పు అని చెప్పుకొచ్చింది.
రెండో భార్య ఏమందంటే?
ఈ క్రమంలో హిరాన్ చటర్జీ రెండో భార్య రితికా గిరి సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. తనది చిన్న వయసు కాదని పేర్కొంది. హిరాన్ అతడి మొదటి భార్యకు ఎప్పుడో విడాకుల నోటీసు పంపాడని తెలిపింది. కాబట్టి తమ పెళ్లి చెల్లుతుందని క్లారిటీ ఇచ్చింది. అయితే పెళ్లి ఫోటోల్ని మొదట షేర్ చేసిన రితికా.. తర్వాత కాసేపటికి వాటిని డిలీట్ చేసింది.


