హీరో ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో స్పిరిట్ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిప్తి డిమ్రి హీరోయిన్. వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా స్పిరిట్ రిలీజ్ డేట్ ప్రకటించారు.
వచ్చే ఏడాది రిలీజ్
2027 మార్చి 5న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మధ్యే స్పిరిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అందులో ప్రభాస్ ఒళ్లంతా గాయాలై కట్టు కట్టి ఉంది. ఒంటిపై చొక్కా లేకుండా నిలబడ్డ ప్రభాస్.. చేతిలో మందు బాటిల్‌తో వైల్డ్‌గా కనిపించాడు. త్రిప్తి డిమ్రి అతడికి సిగరెట్ వెలిగిస్తూ కనిపించింది.
సినిమా
స్పిరిట్ నుంచి రిలీజైన వన్ బ్యాడ్ హ్యాబిట్ వాయిస్ ఓవర్ గ్లింప్స్ కూడా జనాలను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే స్పిరిట్ మూవీలో ప్రభాస్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు.


