breaking news
Amaravati
-
టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,అమరావతి: గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 రోజులు ఇవ్వాల్సిన రేషన్ రెండు రోజులే ఇస్తున్నారు. వృద్ధులకు ఇంటికెళ్లి ఇవ్వాలి కానీ ఆ పరిస్థితి లేదు. రేషన్ తరలిపోతుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై మంత్రి దృష్టి పెట్టాలి’అని డిమాండ్ చేశారు. -
శ్రీచరణిపై బాబు సర్కార్ చిన్నచూపు
సాక్షి, అమరావతి: క్రీడాకారులలో ఉన్న ప్రతిభను చంద్రబాబు ప్రభుత్వం గుర్తించలేదు. భారతదేశ సత్తాను చాటిచెప్పిన మహిళా క్రీడాకరిణిపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. వివిధ రాష్ట్రాలు.. క్రీడాకారులకు ప్రోత్సాహకాలతో గౌరవిస్తున్నాయి. ప్రపంచ కప్‌లో 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసిన ఏపీకి చెందిన క్రీడాకారిణి శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం తరుపున ప్రోత్సాహం కరువైంది.క్రీడాకారిణి రేణుక సింగ్ ఠాకూర్‌కి కోటి రూపాయలు ప్రోత్సాహకం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మధ్యప్రదేశ్‌కి చెందిన క్రాంతిగౌడ్కి కోటి రూపాయలు ప్రోత్సాహకాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ తరపున శ్రీచరణి ప్రతిభను గుర్తించకపోవడం పట్ల క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత మహిళా కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్, ఆల్ రౌండర్ అమన్‌జోత్ కౌర్‌లకు రూ.11 లక్షలు రూపాయలు చొప్పున పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రోత్సాహకం ప్రకటించింది.శ్రీచరణిని ఎందుకు అభినందించడం లేదు?: సతీష్రెడ్డిశ్రీచరణిని ఎందుకు అభినందించడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీశ్ కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘ముంబైలో మహిళల క్రికెట్ వరల్డ్ కప్ చూడ్డానికి నారా లోకేశ్ వెళ్లివచ్చాడు. వారితో గతంలో నారా లోకేశ్ మాట్లాడిన ఫొటోలు, వీడియోలు ముందుపెట్టి ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే వరల్డ్ కప్ గెలిచారని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. ఇదే నిజమైతే కడప బిడ్డ నల్లపురెడ్డి శ్రీచరణి రెడ్డికి ఎందుకు ప్రోత్సాహకాలు ప్రకటించలేదు?’’ అని సతీష్‌రెడ్డి నిలదీశారు.‘‘గతంలో క్రీడల్లో ప్రతిభ కనబరిచిన పీవీ సింధు, హారిక, పుల్లెల గోపీచంద్ వంటి వారికి ఇళ్ల స్థలాలు, నగదు ప్రోత్సాహాలతో సత్కరించిన చంద్రబాబు, ఇప్పుడు శ్రీచరణిని ఎందుకు అభినందించలేకపోతున్నారో చెప్పాలి. వారందరికీ ఒక న్యాయం, శ్రీచరణికి ఒక న్యాయమా? దేశంలోని ఇతర రాష్ట్రాలు తమ క్రీడాకారులను సత్కరిస్తుంటే శ్రీచరణిని కనీసం అభినందించడానికి చంద్రబాబుకి మాత్రం మనసు కలగడం లేదు’’ అని సతీష్‌రెడ్డి మండిపడ్డారు. -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు.. అప్పుడలా.. ఇప్పుడిలా
సాక్షి,అమరావతి: కూటమి ప్రభుత్వంలో నవంబర్ 5వ తేదీ వచ్చినా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. దీంతో ప్రభుత్వం జీతం ఎప్పుడిస్తుందా? అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటినే జీతాలు చెల్లిస్తామంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. అయినా కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు సకాలంలో ఉద్యోగులకు జీతాలు అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గతంలో జీతాలు పెంచాలని ధర్నాలు చేసే ఉద్యోగులు.. చంద్రబాబు ప్రభుత్వంలో జీతాలు ఇవ్వాలని ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. జీతం కోసం ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అయితే, జీతాలివ్వండి మహా ప్రభో.. అంటూ ఉద్యోగులు నిరసన తెలుపుతారేమోనన్న ఉద్దేశ్యంతో నిన్న రాత్రి పోలీస్, మెడికల్,టీచర్,సచివాలయ ఉద్యోగులకు మాత్రమే జీతాలు చెల్లించింది.ఆ జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం అప్పు చేసింది. మిగిలిన శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు ఎప్పుడొస్తాయో కూడా తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఆదుకోవాల్సింది పోయి.. వీళ్లా ప్రభుత్వాన్ని నడిపేదీ?: సతీష్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి మండిపడ్డారు. లోకేష్ 4 గంటల్లో 4వేల దరఖాస్తులు తీసుకున్నారని ఎల్లోమీడియా రాసింది. పబ్లిసిటీ కోసం తప్ప ప్రజలు నమ్ముతారో లేదో తెలుసుకోరా? అని దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెన్షన్ల విషయంలోనూ దారుణంగా మోసం చేశారు. 5 లక్షల మంది పెన్షన్ దారులను తగ్గించారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇప్పటికీ ఇవ్వలేదు’’ అంటూ నిలదీశారు.‘‘రైతులపై తుపాను దెబ్బ కొడితే వారిని ఆదుకోవాల్సిందిపోయి గాలికి వదిలేశారు. చంద్రబాబు లండన్, లోకేష్ క్రికెట్ చూడటానికి వెళ్లారు. వీళ్లా ప్రభుత్వాన్ని నడిపేదీ?. గూగుల్ సెంటర్ వల్ల లక్షా 80 ఉద్యోగాలు వస్తాయని పబ్లిసిటీ ఇస్తున్నారు. నిజానికి పదివేల ఉద్యోగాలైనా తెప్పించగలరా?. ఆరోగ్యశ్రీ లేక జనం అల్లాడిపోతుంటే పట్టించుకోరా?. ఏ ఆస్పత్రిలోనూ ఆరోగ్యశ్రీ అమలు కావటం లేదు. రాష్ట్రంలో రైతులు బతకటమే కష్టం అన్నట్టుగా మారింది. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు టమోట, మామిడి, ఉల్లి పంటలను రోడ్డు మీద కాలువల్లో పడేసే దుస్థితి నెలకొంది...అన్ని వర్గాల ప్రజలు అసహనంతో ఉన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. సమస్యలతో జనం ఉంటే చంద్రబాబు లండన్‌లో విహరిస్తారా?. లులూ మాల్ పేరుతో వందల కోట్ల విలువైన భూమిని ధారాదత్తం చేస్తారా?. అందులో పెద్ద స్కాం ఉందన్న సంగతి సాధారణ ప్రజలకు కూడా తెలుసు. వైఎస్ జగన్ 18 సార్లు ప్రెస్‌మీట్ పెట్టి ప్రశ్నిస్తే ఒక్క దానికీ సమాధానం చెప్పలేదు. ఆదినారాయణరెడ్డికి దమ్ముంటే పోలీసులు లేకుండా ఒక్క జడ్పీటీసీ అయినా గెలవగలరా?. జగన్ సీటు ఇస్తే గెలిచి తర్వాత పార్టీ మారిన వ్యక్తి జగన్. అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా?..పోలీసులను అడ్డం పెట్టుకుని జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచి వీరుడిలాగ మాట్లాడతావా?. పోలీసులు లేకుండా ఒక్క సీటైనా గెలవగలరా?. అధికారం ఉందని నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. మహిళా క్రికెటర్ శ్రీచరణికి ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేదు?. మిగతా అన్ని రాష్ట్రాల క్రికెటర్లకు ఆయా ప్రభుత్వాలు కోటి చొప్పున పారితోషికం ఇచ్చాయి. ముంబాయి వెళ్లి క్రికెట్ చూసిన లోకేష్ ఎందుకు శ్రీచరణికి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు?. నకిలీ మద్యాన్ని బయట పెట్టారనే జోగి రమేష్ ని అరెస్టు చేశారు. బెల్టు షాపులోని మద్యనే బస్సు ప్రమాదానికి కారణమన్నందుకు మా పార్టీ నేత శ్యామలాకు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఏ గ్రామానికి వచ్చినా బెల్టుషాపును చూపిస్తా’’ అంటూ సతీష్‌రెడ్డి సవాల్ విసిరారు. -
లోకేష్ టైం ఇవ్వలేదు.. నిరాశగా వెనుదిరిగిన కొలికపూడి
సాక్షి,అమరావతి: టీడీపీలో కొలికపూడి వర్సెస్ చిన్ని రచ్చ కొనసాగుతోంది. క్రమశిక్షణ కమిటీ ముందు కొలికపూడి,చిన్ని హాజరయ్యారు. నివేదికను క్రమశిక్షణ కమిటీకి కొలికపూడి అందించారు. పార్టీ పదవుల అమ్మకాలపై కొలికపూడి ఫిర్యాదు చేశారు.తిరువూరు సీటు కోసం చిన్నికి ఇచ్చిన రూ.5 కోట్ల వివరాలను అందించారు. చిన్ని పీఏ అక్రమాలపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. అదే సమయంలో మంత్రి నారా లోకేష్‌ను కలిసేందుకు కొలికపూడి ప్రయత్నించారు. అందుకు లోకేష్ టైం ఇవ్వకపోవడంతో కొలికపూడి అక్కడి నుంచి వెళ్లిపోయారు.గత నెల అక్టోబర్‌లో టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఆ పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారని సోషల్ మీడియా వేదికగా గురువారం పోస్టు పెట్టారు. 2024 ఎన్నికల్లో చిన్ని తనను రూ.5 కోట్లు అడిగారని, తన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా ఈ సొమ్మును ఆయనకు ఇచ్చానని ప్రకటించారు.2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు, మరుసటి రోజు మరో రూ.20 లక్షలు, ఫిబ్రవరి 14న రూ.20 లక్షలు తదుపరి చిన్ని పీఏ మోహన్‌కు రూ.50 లక్షలు, గొల్లపూడిలో తన మిత్రుల ద్వారా రూ.3.50 కోట్లు ఇచ్చానని వివరించారు. ‘ఈ వివరాలన్నీ రేపు మాట్లాడుకుందాం.. నిజం గెలవాలి. నిజమే గెలవాలి’ అంటూ కొలికపూడి పెట్టిన పోస్టు నియోజకవర్గంలో తీవ్ర సంచలనం రేపింది. ఎంపీ, ఎమ్మెల్యేల నడుమ విభేదాల నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గ టీడీపీ కేడర్ రెండుగా చీలిపోయింది. టీడీపీలో కోవర్టులున్నారు: టీడీపీలో కోవర్టులు ఉన్నారని..ఆ కోవర్టులు ఎవరో, ఎక్కడున్నారో అందరికీ తెలుసని ఎంపీ చిన్ని వ్యాఖ్యానించారు. ప్రత్యర్థుల జన్మదినాల స్టేటస్లు పెట్టుకుంటూ.. పార్టీకి విధేయుడినంటే కార్యకర్తలు ఒప్పుకుంటారా అంటూ ఎంపీ రెచ్చి పోయారు. నాయకుల కోసం పార్టీ శ్రేణులు దెబ్బలు తినాలి గానీ నేతలు మాత్రం ఇతర పార్టీలతో అంటకాగితే ఎవరైనా ఊరుకుంటారా అంటూ ఎమ్మెల్యే వైఖరిని తప్పుపట్టారు.‘తిరువూరు నియోజకవర్గంలో విలేకరులకే వార్నింగ్‌లు ఇచ్చారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కనీస విషయాలు తెలియకుండా అన్ని వివాదాలకూ కారణమవుతున్నారు’ అంటూ కొలికపూడిపై ధ్వజమెత్తారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలి ఇప్పటికే పార్టీ దృష్టికి వెళ్లిందని ఎంపీ వ్యాఖ్యానించారు.ఇలా ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ కామెంట్స్‌తో టీడీపీలో పాలిటిక్స్ రచ్చ పీక్ స్టేజీకి చేరింది. ఈ క్రమంలో కొలికపూడి,కేశినేని చిన్న ఇద్దరూ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని చంద్రబాబు ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలతో కొలికపూడి నారాలోకేష్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో తదుపురి భవిష్యత్ కార్యచరణపై కొలికపూడి దృష్టిసారించినట్లు తిరువూరు పొలిటికల్ సర్కిళ్ల చర్చ కొనసాగుతోంది. -
'దయలేని బాబు' దగా పాలన
తుపాన్‌తో నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి.. ఎలా పరిహారం ఎగ్గొడదామా అని ఆలోచనలు చేస్తుండటం దుర్మార్గం. ఎన్యుమరేషన్ అక్టోబర్ 31వ తేదీ నాటికి పూర్తి కావాలని చెబుతూ ఒక్క రోజు ముందు 30న ప్రొసీడింగ్స్ ఇవ్వడాన్ని ఏమంటారు? ఒక్క రోజులో ఎన్యుమరేషన్ అనేది ఎలా సాధ్యం? పంట నష్ట పరిహారం జాబితాలో పేరుంటే ధాన్యం కొనుగోలు చేయం అని చెప్పడం దారుణం. ఇలా రైతులను బ్లాక్ మెయిల్ చేస్తూ.. బెదిరిస్తూ.. పైకి మాత్రం రైతులను ఉద్దరిస్తున్నట్లు బిల్డప్లా?తుపాను కారణంగా వరి కంకుల సుంకు (పుప్పొడి) రాలిపోయిందా? లేదా? అన్నది పరిశీలించడం ఎన్యుమరేషన్ ప్రక్రియలో కీలకం. ఎన్యుమరేషన్ చేసే అధికారులు పంట పొలాల వద్దకు వచ్చి స్వయంగా చూసే పరిస్థితే లేదు. సుంకు రాలిపోతే పాలు పోసుకునే పరిస్థితి ఉండదు. జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. తద్వారా తాలు గింజలు ఏర్పడతాయి. ఈ వాస్తవాలు పరిశీలించేందుకు పొలాల వద్దకు వెళ్లకుండానే ఎన్యుమరేషన్ అయిపోయిందంటున్నారు. ఇది ఎంత వరకు న్యాయం? ఇదేనా రైతులకు మేలు చేసే మీ విధానం? – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కృష్ణా జిల్లా ఆకుమర్రు లాకు నుంచి సాక్షి ప్రతినిధి: ‘రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తుపాను దెబ్బకు పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు దృష్టిలో వ్యవసాయం అనేదే దండగ.. రైతు అనే వాడు వేస్ట్.. అందుకే ఆయన హయాంలో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వ్యవసాయం, రైతుల విషయంలో చంద్రబాబు మైండ్‌సెట్ మార్చుకోవాలి.. రైతులు రాష్ట్రానికి వెన్నెముక అని గుర్తించాలి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వ తీరు మారకపోతే బాధితుల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’ అని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టిగా హెచ్చరించారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. మంగళవారం ఆయన కృష్ణా జిల్లాలో మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దెబ్బతిన్న పంట పొలాలను స్వయంగా పరిశీలించారు. పంట పొలాల్లో దిగి.. బాధిత రైతులతో మమేమకవుతూ జరిగిన పంట నష్టం గురించి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన తానున్నానంటూ రైతులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా గూడూరు మండలం ఆకుమర్రు లాకు వద్ద బాధిత రైతులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వానికైనా అరిష్టం అని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. ‘మోంథా తుపాను వల్ల నష్టపోయిన రైతులకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పోతాడు.. ఆయన కొడుకు ఆ్రస్టేలియా నుంచి వచ్చి క్రికెట్ మ్యాచ్ చూడటానికి ముంబై పోతాడు.. రైతుల విషయంలో ఈ ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు’ అని ఎత్తిచూపారు. పంటలు దెబ్బ తిన్న ప్రతీ రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, పంటల బీమా పరిహారం కూడా ఇవ్వాలని, ప్రస్తుత రబీ సీజన్ నుంచైనా ఉచిత పంటల బీమాను వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. గత 18 నెలల్లో సంభవించిన విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.600 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు. లేదంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. కృష్ణాజిల్లా నిడుమోలు వద్ద భారీగా తరలివచ్చిన రైతులు, ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ 18 నెలల్లో ఒక్క రైతుకైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? ⇒ రైతు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒకసారి మారుమూల ప్రాంతాలకు వెళ్లాలి. క్షేత్ర స్థాయిలో తిరిగితేనే వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం రైతుల విషయంలో ఎంత నిర్దాక్షిణ్యంగా, ఎంత నిర్దయగా వ్యవహరిస్తుందో చెప్పడానికి శతకోటి ఉదాహరణలు ఉన్నాయి. మోంథా తుపాను దాదాపు 25 జిల్లాలపై ప్రభావం చూపింది. ⇒ అటు గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం వరకు, ఇటు కృష్ణా నుంచి కర్నూలు వరకు దాని ప్రభావం కన్పించింది. దాదాపుగా 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. నిజంగా ఎప్పుడూ ఊహించని విధంగా పంటలు నష్టపోయిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వరి పంటకే ఎక్కువగా 11 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి పంటలు మరో నాలుగు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ⇒ వరి పంట గింజలు పాలు పోసుకున్న దశలో తుపాను విరుచుకుపడింది. తీవ్రమైన గాలులు, వర్షాల వల్ల పంట పూర్తిగా దెబ్బతింది. చంద్రబాబు 18 నెలల పాలనలో దాదాపు 16 సార్లు తుపానులు, వరదలు, అకాల వర్షాలు, కరువు వంటి వైపరీత్యాల వల్ల రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ 18 నెలల్లో ఏ రైతుకైనా ఒక్క సారైనా ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? ఏ రైతుకైనా ఒక్కసారైనా పంటల బీమా పరిహారం (ఇన్సూ్యరెన్స్) ఇచ్చారా? అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తా అని హామీ ఇచ్చి.. రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.ఐదు వేలతో సరిపెట్టారు. ⇒ ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాలేదు. ఇన్సూరెన్స్ రాలేదు. చివరికి ఎరువులు బ్లాకులో కొనుక్కోవాల్సిన పరిస్థితుల్లోకి రైతులు వెళ్లిపోయారు. రూ.266కు దొరకాల్సిన యూరియా కట్టను ఏకంగా రూ.500, రూ.600 చొప్పున బ్లాకులో కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అవసరాన్ని బట్టి బ్లాకులో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇలా కష్టాల సాగు చేసిన రైతులు తాము పండించిన పంటను అమ్ముదామంటే ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. కనీసం మద్దతు ధరకు కూడా కొనే పరిస్థితి లేకుండా పోయింది. గతేడాది ధాన్యం 75 కేజీల బస్తాకు మద్దతు ధర ప్రకారం రూ.1,750 రావాల్సి ఉండగా, రైతుల చేతికొచ్చింది మాత్రం కేవలం రూ.1,350 మాత్రమే. చంద్రబాబు హయాంలో ప్రతి అడుగులోనూ రైతు నష్టపోతూనే ఉన్నాడు. నాడు ప్రతి రైతుకు భరోసా ⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో వారిపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని ఐదేళ్ల పాటు అమలు చేసి అండగా నిలిచింది. మూడున్నర ఎకరాలున్న రైతులు సైతం దాదాపు రూ.70 వేలు, రూ.66 వేలు చొప్పున గతంలో బీమా పరిహారం డబ్బులు అందుకున్న పరిస్థితులను ఇక్కడి రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరోజు ఏ రైతు ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. విపత్తుల వేళ పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని ఏ రోజు ఏ రైతు ఆ ఐదేళ్లలో అధైర్య పడలేదు. కారణం.. పంట నష్టం జరిగితే జగనన్న ఉన్నాడు.. పైసా భారం పడకుండా తమ పంటకు బీమా చేయించాడని, తమకు డబ్బులొస్తాయని ధైర్యంగా ఉండేవారు. ప్రతి రైతుకు భరోసా ఉండేది. ⇒ ఏదైనా విపత్తు వేళ పంటలకు నష్టం వాటిల్లితే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఇస్తాడనే ధైర్యం ఉండేది. ఆ డబ్బులతో మరుసటి సీజన్లో పెట్టుబడి పెట్టుకోవచ్చనే ధైర్యం ఉండేది. సీజన్ మొదలయ్యే సరికే ప్రతి రైతుకు ఓ భరోసా ఉండేది. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున ఇస్తారన్న నమ్మకం ఉండేది. ⇒ ఆర్బీకే వ్యవస్థ అనేది రైతులను చేయి పట్టి నడిపించే వ్యవస్థగా ఉండేది. ప్రతీ రైతు వేసిన పంటకు ఈ–క్రాప్ జరిగేది. ఆర్బీకే పరిధిలోనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్.. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ రైతులకు అందుబాటులో ఉండే వారు. సచివాలయాలతో అనుసంధానం చేసి వలంటీర్లతో కలిసి రైతులను చేయిపట్టి నడిపించేవారు. ప్రతి రైతును.. అతను సాగు చేసిన పొలంలో నిలబెట్టి జియో ట్యాగ్ చేసి ఈ–క్రాప్ బుకింగ్ చేసే వారు. తద్వారా పంటకు ఎప్పుడు, ఏ ఇబ్బంది వచ్చినా రైతుకు ప్రభుత్వం తోడుగా నిలబడేది. ధరలు పతనమైన ప్రతిసారి ప్రభుత్వ జోక్యం ⇒ ఆర్బీకే పరిధిలో ఏ రైతుకైనా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉండేది కాదు. ఆర్బీకే పరిధిలో ఏ పంటను ఏ రేటుకు కొనుగోలు చేసేది రైతులకు తెలియజేసేవాళ్లం. ఆ రేట్ల కంటే తక్కువగా పడిపోతే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. మద్దతు ధరల వివరాలు ఆర్బీకేలో ప్రదర్శించేవాళ్లం.⇒ ఎక్కడ ఏ పంట రేటు తగ్గినా వెంటనే ఆర్బీకే అసిస్టెంట్ నుంచి ఎలెర్ట్ వచ్చేది. మార్క్‌ఫెడ్‌కు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉన్న జేసీలు వెంటనే మార్కెట్లో జోక్యం చేసుకునే వారు. ధరలు పడిపోయిన పంటలను కొనుగోలు చేసి, మార్కెట్లో పోటీని తీసుకొచ్చి «రైతుకు తోడుగా నిలబడేవారు. ఇందుకోసం కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ (సీఎం యాప్) అనే యాప్ ఆర్బీకే అసిస్టెంట్ చేతిలో ఉండేది. ⇒ ఈ యాప్ ద్వారా గ్రామ స్థాయిలో ధరలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రతి రైతుకు బాసటగా నిలిచే వారు. ఇలా ఐదేళ్లలో ధర లేని సమయంలో రూ.7,800 కోట్లు ఖర్చు చేసి కనీస మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచాం. ఇందుకోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. ⇒ అప్పట్లో రైతులు సాగు చేసిన ప్రతి పంటను ఈ–క్రాప్‌లో నమోదు చేసేవాళ్లం. తద్వారా రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా అమలు చేశాం. దాదాపు 85 లక్షల మంది రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఉచితంగా పంటల బీమా అమలు చేశాం. 54.55 లక్షల మంది రైతులకు ఇన్సూరెన్స్ కింద రూ.7,800 కోట్లు జమ చేశాం. ⇒ ప్రస్తుతం చంద్రబాబు హయాంలో కేవలం 19 లక్షల మంది మాత్రమే ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. అది కూడా బ్యాంక్ రుణాలు తీసుకున్న వారు. మరి ప్రీమియం చెల్లించని మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి? ఈ విపత్కర పరిస్థితుల్లో వారికి పంటల బీమా పరిహారం అందకుండా చేయడం దుర్మార్గం కాదా?ఇదేం విడ్డూరం.. ఒక్క రోజు ముందు ప్రొసీడింగ్సా!?⇒ తుపాన్‌తో నష్టపోయిన రైతులు ఆశ్చర్యం కలిగించే విషయాలు చెబుతున్నారు. మీ పొలంలో ఎన్యుమరేషన్ చేయడానికి ఎవరైనా వచ్చారా? అని అడిగితే.. ఈ పొలంలోకే కాదు రాష్ట్రంలో దెబ్బతిన్న ఏ పొలంలోకి, ఏ రైతు దగ్గరకు ఎన్యుమరేషన్ చేసేందుకు ఎవరూ రాలేదన్న మాట విని్పస్తోంది. కృష్ణా జిల్లా కలెక్టర్ అక్టోబర్ 30వ తేదీన ప్రొసీడింగ్స్ (ఉత్తర్వులు చూపిస్తూ) ఇచ్చారు.⇒ ఎన్యుమరేషన్ ఆఫ్ క్రాప్ డామేజ్, సోషల్ ఆడిట్ 31వ తేదీ కల్లా పూర్తి చేయాలని అందులో పేర్కొన్నారు. ఒక్క రోజులో ఎన్యుమరేషన్ (పంట నష్టం మదింపు), సోషల్ ఆడిట్ అయిపోవాలట! ఎలా సాధ్యమో మీరే చెప్పండి. పైగా ఈ గడువులోగా చేయకపోతే యాక్షన్ తీసుకుంటామని ఇదే ప్రొసీడింగ్స్‌లో స్పష్టం చేశారు. క్రాప్ డామేజ్, ఎన్యుమరేషన్, సోషల్ ఆడిట్, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అంతా పూర్తి చేసి తుది జాబితాలను 1వ తేదీకల్లా వ్యవసాయ శాఖ డైరెక్టరేట్‌కు పంపాలని పేర్కొన్నారు.⇒ ఈ ఆదేశాలు చూస్తుంటే ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారో తెలుస్తోంది. ఎన్యుమరేషన్ అనేది ఎవరూ పంట పొలాల వద్దకు వచ్చి చేసే పరిస్థితి లేదు. గాలులు, తుపాను వల్ల ధాన్యం సుంకు విరిగిపోయింది. ఎన్యుమరేషన్ చేసేటప్పుడు ఏ అధికారి అయినా సరే పొలంలో అడుగుపెట్టాలి. వరి కంకులను చూడాలి. సుంకు (పుప్పొడి) రాలిపోయిందా? లేదా? అన్నది పరిశీలించాలి. ఎన్యుమరేషన్ ప్రక్రియలో ఈ విషయాన్ని స్పష్టంగా రాయాలి. సుంకు రాలిపోతే పాలు పోసుకునే పరిస్థితి ఉండదు. జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. తద్వారా తాలు గింజలు ఏర్పడతాయి. ఈ వాస్తవాలు పరిశీలించేందుకు పొలాల వద్దకు వెళ్లకుండానే ఎన్యుమరేషన్ అయిపోయిందంటున్నారు. ఇది ఎంత వరకు న్యాయం? ఇదేనా రైతులకు మేలు చేసే విధానం?ధాన్యం కొనబోమని బ్లాక్ మెయిల్ చేస్తారా?⇒ ఎన్యుమరేషన్ కోసం ఎందుకు పొలం వద్దకు రాలేదని ఏ రైతు అయినా అడిగితేæ వారిని వెటకారం చేసి మాట్లాడుతున్నారు. పైగా ప్రతి రైతుకు వ్యవసాయ శాఖాధికారి నుంచి తాము చెప్పిన పత్రాలు (ఆధార్, 1బి జిరాక్స్, కౌలు గుర్తింపు కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం) సమరి్పంచిన వారి పొలాల్లో మాత్రమే పంట నష్టం పరిశీలించి జాబితాలో పెడతామని మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఆర్బీకేల ద్వారా కూడా చెప్పిస్తున్నారు. అదీ అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోగా తీసుకొస్తేనే స్వీకరిస్తామని, లేదంటే ఆ పత్రాలు స్వీకరించం అని తెగేసి చెబుతున్నారు. ⇒ మరొక వైపు ‘దయచేసి రైతులు గమనించగలరు. ఇప్పుడు పంట నష్టం చేయించుకున్న రైతుల నుంచి రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయబడదు’ అని నిర్దయగా మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎవరైనా అడిగితే వాళ్ల ధాన్యం కొనుగోలు చేయరట! అంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?⇒ ఎక్కడైనా తుపాను వచ్చినపుడు ప్రభుత్వం మానవత్వం ప్రదర్శించాలి. నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకునేందుకు ముందుకు రావాలి. పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ), పంటల బీమా పరిహారం (ఇన్సూ్యరెన్స్) వచ్చేలా చేయాలి. అంతే కాకుండా వారి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసే కార్యక్రమం చేపట్టాలి. అది ఇస్తే ఇది ఇవ్వం.. ఇది ఇస్తే ఆది ఇవ్వం.. అని చెబుతూ రైతులను బెదిరించడం దారుణం. దీన్నిబట్టి ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోంది.మా హయాంలో కచ్చితమైన చర్యలు⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి తుపానులు వచ్చే ముందు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించే వాళ్లం. వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో జిల్లా యంత్రాంగం కలిసి పనిచేసేది. కొత్త జిల్లాల ఏర్పాటుతో కలెక్టర్ల పరిధి తగ్గించాం. తక్కువ నియోజకవర్గాలకు ఎక్కువ మంది కలెక్టర్లు, జేసీలు వచ్చారు. ఇలాంటి విపత్తుల వేళ ప్రాణ నష్టం జరగకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే వాళ్లం. కలెక్టర్ల చేతుల్లో కావాల్సినంత డబ్బులు పెట్టేవాళ్లం. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా దగ్గరుండి చూసుకోమని చెప్పేవాళ్లం.⇒ వారం.. పది రోజుల టైం ఇస్తున్నాం.. ఎన్యుమరేషన్ పక్కాగా, పారదర్శకంగా చేయాలని చెప్పేవాళ్లం. తర్వాత ముఖ్యమంత్రి హోదాలో నేను ఏదో ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు కలెక్టర్ పనితీరు ఏలా ఉంది.. పంట నష్టం కోసం ఎన్యుమరేషన్ ఎలా జరిగింది.. అన్ని సదుపాయాలు మీకు కల్పించారా.. లేదా.. వంటి వివరాలు ప్రజలను అడిగి తెలుసుకునేవాణ్ని. ఏ ఒక్కరైనా అధికారులు బాగా చేయలేదని చెబితే ఉద్యోగం పీకేస్తామని గట్టిగా చెప్పే వాళ్లం. అందువల్ల అధికారుల్లో ఒక భయం ఉండేది. ఆకుమర్రు లాకు వద్ద పొలంలోకి వెళ్లి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్న వైఎస్ జగన్ ఈ–క్రాప్‌ను గాలికొదిలేశారు..⇒ ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఈ క్రాప్ అనేది రైతులకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది. అలాంటిది ఈ ప్రభుత్వ హయాంలో ఈ–క్రాప్ తెరమరుగైపోయింది. పంట పొలంలో రైతులను నిలబెట్టి, జియో ట్యాగ్ చేసి, వారి ఫొటోతీసిసి అప్లోడ్ చేసే పరిస్థితి ఉండేది. ఈ రోజు ఈ–క్రాప్ నిర్వచనం మార్చేశారు. ఈ–క్రాప్ చేశామంటే చేశామన్నట్టుగా ఉంది. టీడీపీ వాళ్లయితే ఉన్న భూమి కంటే ఎక్కువగా సాగు చేసినట్టు చూపిస్తున్నారు.⇒ ఇందుకు బాపట్ల జిల్లాయే ఉదాహరణ. ఈ జిల్లాలోని పర్చురులో 112 శాతం, జే.పంగలూరులో 114 శాతం.. బల్లికురవలో 115 శాతం.. వేటపాలంలో 117 శాతం.. చీరాలలో 122 శాతం.. చినగంజాంలో 128 శాతం చొప్పున ఈ–క్రాప్ నమోదైనట్టుగా చూపించారు. అంటే ఉన్న భూమి కన్నా సాగైన భూమి ఎక్కువగా ఉందా? ఉన్నభూమి 100 శాతమైతే 128 శాతం విస్తీర్ణంలో సాగైనట్టు చూపిస్తున్నారు. అదెలా సాధ్యం! ఈ–క్రాప్‌ను ఏ విధంగా నీరుగారుస్తున్నారో ఇంతకంటే ఉదాహరణలు కావాలా?⇒ ఇలాంటి విపత్తుల వేళ కలెక్టర్లతో పాటు ఎమ్మెల్యేలు ప్రభావిత ప్రాంతాల్లో తిరిగే వారు. వారం, పది రోజుల తర్వాత నేను వెళ్లే వాడిని. పరిస్థితిని అంచనా వేసే వాళ్లం. ముఖ్యమంత్రి వస్తాడేమో అనే భయంతో ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా కలెక్టర్లు పనిచేసే వారు. ఈ రోజు ప్రభుత్వ పనితీరు చూస్తుంటే.. ప్రభుత్వం ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. ⇒ రైతుకు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా పట్టించుకునే పరిస్థితి కన్పించడం లేదు. ఇంతటి విపత్కర పరిస్థితులు జరిగినప్పుడు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే.. ఒకరోజు చాపర్‌లో అలా అలా తిరుగుతాడు. మరుసటి రోజు లండన్ పోతాడు. ఆయన కొడుకు ఆ్రస్టేలియా నుంచి వస్తాడు.. మరుసటి రోజు ముంబైలో క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి పోతాడు. ఇక్కడ రైతుల పరిస్థితి ఏడవ లేక.. కడుపులో బాధ తట్టుకోలేక కొట్టుమిట్టాడుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. ఏ ఒక్క కౌలు రైతుకు కౌలు కార్డులు ఇవ్వడం లేదు. ఇస్తే వాళ్లకు పరిహారం ఇవ్వాల్సి వస్తుందనే దురాలోచనతో ఉన్నారు.ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తున్నారు?⇒ ఎన్యుమరేషన్ లెక్కలు ఎందుకు తక్కువ చేసి చూపిస్తున్నారు? తుపాను వల్ల దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఇంత పంట నష్టం ఎప్పుడు జరగలేదని మీ ఎల్లో మీడియాలో, మీ గెజిట్ పేపర్ ఈనాడులోనే తొలుత రాశారు. ఇప్పుడు ఎందుకు తగ్గించి రాస్తున్నారు? ఎన్యుమరేషన్ చేసేందుకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? ఎందుకు రైతులకు తోడుగా నిలబడలేకపోతున్నారు? పైగా ఎన్యుమరేషన్ చేస్తే మీ పంటను కొనుగోలు చేయం అని ఎందుకు భయపెట్టిస్తున్నారు? రైతుకు మంచి చేయాల్సిన ప్రభుత్వం ఎందుకు నష్టం చేసే కార్యక్రమాలు చేస్తోంది?⇒ మీ తప్పిదం వల్ల రైతులకు పంటల బీమా పరిహారం (ఇన్సూరెన్స్) డబ్బులు రావడం లేదు. ఇన్సూరెన్స్ డబ్బులు కట్టి ఉండి ఉంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగా నష్టపోయిన ప్రతి రైతుకు కనీసం రూ.25 వేలకు పైగా పరిహారం వచ్చేది. మీ తప్పిదం వల్ల వారికి ఈ పరిహారం అందకుండా పోయింది. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేయడం వల్ల నష్టం జరిగింది. కాబట్టి ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వచ్చేలా చేయాల్సిన బాధ్యత మీదే. అలా చేయాలని రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. 18 నెలల్లో 16 సార్లు రైతులు నష్టపోయారు. మీరు తగ్గించి, కోతలేసి వేసిన లెక్కల ప్రకారమే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూ.600 కోట్లు ఇవ్వాలి. ఆ బకాయిలు కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. రబీ సీజన్ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని వర్తింపచేయాలని కోరుతున్నా. -
పంచాయతీ కార్యదర్శుల పేరు, కేడర్‌లో మార్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇకపై గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టును గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ (జీపీడీవో)గా ప్రభుత్వం మార్పు చేసింది. గ్రామ పంచాయతీ కార్యదర్శులు తీసుకునే వేతనాల్లో ఎలాంటి మార్పులు లేకుండా, ప్రస్తుతం ఉన్న ఐదు కేడర్లను నాలుగు కేడర్లకు కుదించింది. జనాభా, వార్షికాదాయం ప్రాతిపదికన రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను కొత్తగా వర్గీకరిస్తూ గత నెల 10వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన అంశాలతో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ మంగళవారం జీవో జారీ చేశారు. తద్వారా ఇప్పటిదాక అమలులో ఉన్న 7,244 క్లస్టర్ గ్రామ పంచాయతీల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలు పని చేస్తాయి.359 అర్బన్ పంచాయతీలు, 3,082 గ్రేడ్–1 పంచాయతీలు, 3,163 గ్రేడ్–2 పంచాయతీలు, 6,747 గ్రేడ్–3 పంచాయతీలుగా వర్గీకరణ చేశారు. ఇందుకు సంబంధించి సమగ్ర వివరాలతో ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14,989 మంది పంచాయతీ కార్యదర్శుల్లో 1,487 మంది గ్రేడ్–1.. 993 మంది గ్రేడ్–2.. 2,235 మంది గ్రేడ్–3.. 4,108 మంది గ్రేడ్–4.. 6,166 మంది గ్రేడ్–5లో పని చేస్తున్నారు.తాజా వర్గీకరణలో వీరిలో 359 మంది అర్బన్ పంచాయతీ కార్యదర్శులుగా, 3,082 మందిని గ్రేడ్–1.. 3,163 మందిని గ్రేడ్–2.. 6,747 మందిని గ్రేడ్–3.. 1,638 మందిని అడిషనల్ గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులుగా కేడర్‌లో మార్పులు చేశారు. 359 అర్బన్ పంచాయతీల్లో ఉండే జీపీడీవో డిప్యూటీ ఎంపీడీవో స్థాయిలో కొనసాగడానికి సంబంధించి వేరుగా ఆదేశాలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,097 మంది జూనియర్ అసిస్టెంట్ కమ్ బిల్ కలెక్టర్లుగా పని చేస్తుండగా.. అందులో 359 జూనియర్ అసిస్టెంట్ కమ్ బిల్ కలెక్టర్ పోస్టులను సీనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ⇒ గ్రామ సచివాలయాల్లో పని చేసే మిగులు డిజిటల్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందితో పంచాయతీ రికార్డులు, పరిపాలనా ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి, వర్క్ ఫ్లో ఆటోమేషన్, రియల్ టైమ్ పర్యవేక్షణ కోసం శాఖలో డెడికేటెడ్ ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు.⇒ గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్స్ ద్వారా ఖర్చు భరించే స్థాయి ఉండే పంచాయతీల్లో ప్రత్యేక శానిటేషన్ విభాగం, నీటి సరఫరా విభాగం, కంట్రీ ప్లానింగ్ విభాగం, స్ట్రీట్ లైటింగ్–ఇంజనీరింగ్ విభాగంలో రెవెన్యూ విభాగం తరహా సిబ్బందిని అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ సిబ్బందిని నియమించుకోవడానికి అవకాశం కల్పించారు. ⇒ ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులుగా పనిచేసే వారు కొత్తగా డీపీవో కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ తదితర క్యాడర్లో పని చేసేందుకు వీలుగా నిబంధనలు మార్పులు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ఆయా మార్పులు చేర్పులకు సంబంధించి వేర్వేరుగా అదనపు వివరాలతో ప్రభుత్వం మరికొన్ని జీవోలు జారీ చేయనుంది. -
సభాహక్కుల పేరుతో ఎలాపడితే అలా చేయడానికి వీల్లేదు
సాక్షి, అమరావతి: శాసనసభ హక్కులు రాజ్యాంగంలో నిర్దేశించిన సూత్రాలకు లోబడే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. సామాన్యులకు ఏ చట్టాలైతే వర్తిస్తాయో, అవే చట్టాలకు అనుగుణంగా సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాలు, సభ నిర్ణయాలు కూడా ఉంటాయని తేల్చిచెప్పింది. సభా హక్కుల పేరుతో ఎలాపడితే అలా వ్యవహరించడానికి వీల్లేదని పేర్కొంది. పార్లమెంట్ లేదా శాసనసభలు, వాటికి సంబంధించిన కమిటీలు కూడా సాధారణ చట్టాలకు లోబడే ఉంటాయంది. అవేమీ చట్టాలకు అతీతం కాదని స్పష్టం చేసింది. చట్టం చేసేవారు కూడా అదే చట్టానికి లోబడి ఉండాలని, అంతే తప్ప ప్రజల కోసం రూపొందించే చట్టాల అమలు నుంచి వారు మినహాయింపు పొందలేరని తెలిపింది.‘‘ఎంతటి భారీ మెజార్టీ ఉన్నప్పటికీ ప్రతి శాసనసభకు చట్టాలు సమానంగా వర్తిస్తాయి. కాబట్టి సభా హక్కుల తీర్మానంపై తీసుకునే తుది నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడే ఉంటుంది. కోర్టు న్యాయ సమీక్ష చేసే సమయంలో సభా హక్కుల ఉల్లంఘన జరిగిందని నిరూపించాల్సిన బాధ్యత హక్కులకు భంగం కలిగిందన్న సభ, వ్యక్తిదే. ఈ విషయాన్ని సీతాసోరెన్ కేసులో సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. శాసనసభ, సభా హక్కుల కమిటీ రాజ్యాంగ సూత్రాలను, చట్టపరమైన పరిమితులను గుర్తెరిగి సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది’’ అని పేర్కొంది.సభా హక్కుల కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్ బి.ఫణికుమార్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఇచ్చింది కేవలం షోకాజ్ నోటీసు మాత్రమేనని, అనంతరం చాలా దశలు ఉంటాయని, అందువల్ల ఈ వ్యాజ్యాలు అపరిపక్వమైనవి వ్యాఖ్యానించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ మంగళవారం తీర్పు వెలువరించారు. ‘సాక్షి’పై కక్షసాధింపు చర్యలు... షోకాజ్ నోటీసు జారీ ఎమ్మెల్యేలకు రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించాలని శాసనసభ వర్గాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయించాయి. ఎమ్మెల్యేలు, అతిథులకు హోటళ్లు, భోజనాలు, బహుమతులు తదితరాల కోసం భారీగా ఖర్చు చేశారు. అయితే, లోక్‌సభ స్పీకర్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో ఆ ఖర్చంతా వృథా అయింది. దీనిపై ‘సాక్షి’ ఫిబ్రవరి 22న ‘రూ.కోట్లు ఖర్చు... శిక్షణ తుస్సు’ శీర్షికన కథనం ప్రచురించింది. కంగుతిన్న అధికార పార్టీ నేతలు ‘సాక్షి’పై కక్షసాధింపు చర్యలు చేపట్టారు. పత్రిక కథనం సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, దానిని తాను సభలో ప్రస్తావించేందుకు అనుమతించాలని టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య ఫిబ్రవరి 25న అసెంబ్లీ స్పీకర్‌ను కోరుతూ నోటీసు ఇచ్చారు. స్పీకర్ ఈ వ్యవహారాన్ని సభా హక్కుల కమిటీకి నివేదించారు. దాని ఆదేశాల మేరకు ‘సాక్షి’కి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ షోకాజ్ నోటీసులు జారీచేశారు. పాలనాపరమైన అంశాలపైనే కథనం ఎమ్మెల్యే ఇచ్చిన నోటీసుతో పాటు, సెక్రటరీ జనరల్ ఇచ్చిన షోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్ ఫణికుమార్ జూన్‌లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్, వి.మహేశ్వర్‌రెడ్డి, అనూప్ కౌషిక్ వాదిస్తూ... సభలో జరిగిన విషయాలపై ‘సాక్షి’ కథనం రాయలేదని, పాలనాపరమైన అంశంపైనే ప్రచురించిందని, దాని కారణంగా ఎవరి హక్కులకూ భంగం వాటిల్లలేదని, ఆ కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు రాదని వివరించారు.శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పిటిషనర్లకు ఇచ్చింది కేవలం షోకాజ్ నోటీసు మాత్రమేనన్నారు. వారి వివరణ తీసుకున్న తరువాత పలు దశలు ఉంటాయని, వివరణతో సభా హక్కుల కమిటీ సంతృప్తి చెందితే తదుపరి చర్యల ఉపసంహరణకు సిఫారసు చేయవచ్చన్నారు. ‘సాక్షి’ కథనం «ధిక్కారం కిందకే వస్తుందని కమిటీ భావించినా అంతిమంగా నిర్ణయం శాసన సభనే తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. షోకాజ్ నోటీసుల దశలో కోర్టుల జోక్యం తగదని, ఈ వ్యాజ్యాలను తోసిపుచ్చాలని కోరారు. పౌరులను కాపాడే రక్షణ కవచమే రాజ్యాంగం ‘‘పౌరుల హక్కులను ప్రభావితం చేసేలా రాజ్యాంగ వ్యవస్థలు ఏకపక్ష, అన్యాయ నిర్ణయాలు తీసుకుంటే, వాటి నుంచి కాపాడే రక్షణ కవచమే రాజ్యాంగం. అధికరణ 194 కింద... రాష్ట్ర అసెంబ్లీలు తీసుకునే నిర్ణయాలు పౌరుల హక్కులను ప్రభావితం చేస్తుంటే, అవి కచ్చితంగా న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయి. సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించి జారీచేసే షోకాజ్ నోటీసులు పలు దశల్లో చట్టపరమైన పరిశీలనకు లోబడి ఉంటాయి.సభా హక్కుల కమిటీ మొదట పిటిషనర్ల వివరణను పరిగణనలోకి తీసుకుని, తదుపరి చర్యలను ఉపసంహరించాలని శాసనసభకు సిఫారసు చేయవచ్చు. అలాకాకుండా పిటిషనర్ల వంటి పౌరులకు వ్యతిరేకంగా కమిటీ సిఫారసు చేసినప్పటికీ, శాసనసభ పిటిషనర్లు సమర్పించిన వివరణను, ఆధారాలను పరిగణనలోకి తీసుకుని స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
అడుగుకో ఆంక్ష... రోడ్డుకో బారికేడ్!
గుడివాడ రూరల్: నాయకులకు నోటీసులు... కార్యకర్తలపై ఆంక్షలు... ప్రజలకు అడ్డంకులు... మొత్తంగా పర్యటనను విఫలం చేయడానికి కుయుక్తులు..! కానీ, అశేష జనం ముందు... వారి అభిమానం ముందు ఇవేమీ నిలవలేదు...! పోలీసులను అడ్డు పెట్టుకుని ప్రభుత్వం పన్నిన పన్నాగాలు విఫలమయ్యాయి. కృష్ణా జిల్లాలో మోంథా తుపాను బాధిత రైతులను పరామర్శించి, వారి పంట పొలాల పరిశీలనకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యకమ్రం దిగ్విజయమైంది. జగన్ పర్యటనను విఫలం చేయడమే లక్ష్యంగా ముందుగానే వైఎస్సార్సీపీ నియోజకవర్గాల ఇంచార్జిలు, ముఖ్య నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ నాయకులను బెదిరించింది. తద్వారా జన సమీకరణ జరగకుండా అడ్డుకోవాలని ఎత్తు వేశారు. అయితే, ఇవేవీ ఫలించలేదు. పైగా ప్రజలు భారీగా, స్వచ్ఛందంగా తరలి వస్తుండడంతో ఇక ఓవర్ యాక్షన్‌కు దిగారు. దీనికి గోపువానిపాలెం ఘటన సరైన ఉదాహరణ. జగన్ వస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు గోపువానిపాలెం అడ్డ రోడ్డుకు చేరుకోగా పోలీసులు బారికేడ్లు, రోప్‌లతో అడ్డగించారు. రోడ్డు మార్జిన్లో నిల్చుని ఉన్నా చెదరగొట్టారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ సంగతి తెలిసిన పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ అక్కడకు వచ్చి ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. అయితే, సమాధానం ఇవ్వకుండా వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. దీంతో కైలే అనిల్, ౖవైఎస్సార్‌సీపీ శ్రేణులు పమిడిముక్కల సీఐ తీరుపై మండిపడ్డారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు. దారులు మూసి.. చెక్‌పోస్టులు పెట్టి... వైఎస్ జగన్‌ను చూసేందుకు అభిమానులు కార్లు, బైక్‌లు, ట్రాక్టర్లతో పాటు కాలినడకన తండోపతండాలుగా తరలిరావడంతో కూటమి ప్రభుత్వం పోలీసులను ఉసిగొలిపింది. వందలమందిని మోహరించి బారికేడ్లు, తాళ్లతో చెక్‌పోస్టులు పెట్టి అడ్డంకులు సృష్టించింది. వైఎస్ జగన్ పర్యటించే గ్రామాలకు ఉన్న అన్ని దారులను మూసివేయించింది. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ వైఎస్ జగన్‌కు సైతం షరతులు విధించింది. 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుమతి అంటూ అధికార దర్పం చూపించింది. ప్రధాన కూడళ్లు జనసంద్రం... పోలీసుల అవాక్కు రైతులు వైఎస్ జగన్‌ను కలవకుండా భారీగా బలగాలను మోహరించినా, రోప్ పార్టీలతో అడ్డుకునే ప్రయత్నం చేసినా, ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ నిలిపివేసినా ప్రధాన కూడళ్లు జనసంద్రంగా మారడం చూసి పోలీసులు అవాక్కయ్యారు. మరోవైపు కూటమి పాలనలో తమకు జరుగుతున్న అన్యాయాలు, ఎదురవుతున్న నిర్లక్ష్యంపై రైతులు, ప్రజలు జగన్‌కు వినతిపత్రాలు ఇచ్చారు. కాగా, రైతులు, ప్రజలు, అభిమానులు పోటెత్తడంతో వైఎస్ జగన్ పర్యటన ఉదయం 9.45 కు మొదలై సాయంత్రం 5 గంటల వరకు సాగింది. మచిలీపట్నం, గూడూరుల్లోనూ... మచిలీపట్నంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్ రాక కోసం వేచి ఉండగా బందరు డీఎస్పీ చప్పిడి రాజా ఇంతమంది ఇక్కడ ఉండొద్దంటూ చెదరగొట్టారు. బైక్‌లపై ర్యాలీగా కార్యకర్తలు, అభిమానులు వచ్చే క్రమంలో తాళాలు లాక్కునేందుకు ప్రయతి్నంచారు. మధ్యాహ్నం బ్రిడ్జి నీడ కింద ఉండగా ఇక్కడ ఉండొద్దని ఇనగుదురు సీఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. వాహనాల పెగ్గులు తీసేయమని సిబ్బందికి హుకుం జారీ చేశారు. దీంతో పోలీసుల అత్యుత్సాహంపై మచిలీపట్నం వైఎస్సార్సీపీ నేత పేర్ని కిట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, అభిమానులు మచిలీపట్నం వైపు వెళ్లకుండా చెక్‌పోస్టు ఏర్పాటు చేసి దారి మళ్లించారు. డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీస్తూ పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారు. అంతకుముందు తాడిగడపలోనూ రైతులు, కార్యకర్తలను అడ్డుకున్నారు. ద్విచక్ర వాహనాలపై వస్తున్న యువతను ఆపి తాళాలు లాక్కున్నారు. మచిలీపట్నం, సుల్తాన్‌నగర్, ఎస్ఎన్ గొల్లపాలెంలో బారికేడ్లు పెట్టి ప్రజలను వెళ్లనివ్వలేదు. దీంతో రైతులు పొలాల నుంచి నడుచుకుంటూ జగన్ వద్దకు చేరుకున్నారు. గండిగుంట, నెప్పల్లి సెంటర్లో పోలీసులు ఆటంకాలు కల్పించారు. జగన్ కాన్వాయ్‌తో పాటు వస్తున్న వాహనాలను నిలిపివేశారు. పామర్రు, బల్లిపర్రుకు భారీగా చేరుకున్న రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు ఆపేశారు. మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారి నుంచి రామరాజుపాలెం వైపు ఎవరినీ రానివ్వకుండా అడ్డరోడ్డ వద్ద బారికేడ్లను పెట్టారు. పెడన నియోజకవర్గం గూడూరు మండలం రామరాజుపాలెం అడ్డరోడ్డు నుంచి గ్రామంలోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు పెట్టారు. బందరు వైపు నుంచి సీతారామపురం గ్రామానికి వెళ్లే రోడ్డుపై బారికేడ్లతో ఓవర్‌యాక్షన్ చేశారు. కనీసం బైక్‌లనూ అనుమతించలేదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. తుపాను కారణంగా నీట మునిగిన పంట పొలాలకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. వేమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి వరికోటి అశోక్‌బాబును అదుపులోకి తీసుకుని, ఆయనవెంట వచ్చిన వాహనాలతో పాటు స్టేషన్‌కు తరలించారు. సీతారామపురంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట టీడీపీ జెండాలతో ఆ పార్టీ కార్యకర్తలు కవ్వించారు. అయినా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రతిఒక్కరూ అత్యంత సంయమనం పాటించారు. -
మంగళవారం.. మరో రూ.3000 కోట్ల రుణం
సాక్షి, అమరావతి: ప్రతి మంగళవారం... అప్పు వారం అన్నట్లుగా సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మళ్లీ అప్పు చేసింది. తాజాగా రూ.3 వేల కోట్ల రుణం తీసుకుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ రుణాన్ని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. తద్వారా 17 నెలల్లో ఏకంగా రూ.2.27 లక్షల కోట్ల అప్పు చేసినట్లయింది. బడ్టెట్ లోపల, బడ్జెట్ బయట కలిపి ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రజలపై భారీ భారం మోపింది. ఎడాపెడా అప్పులు, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్‌పరం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగుతోంది. సంపద సృష్టి అంటూ చెప్పిన మాటలు గాలికి కొట్టుకుపోగా... అప్పులు చేయడంలో మాత్రం భారీ వృద్ధి కనబరుస్తున్నారు. ⇒ కూటమి ప్రభుత్వం వచ్చాక బడ్జెట్ లోపల రూ.1,40,602 కోట్లు, బడ్జెట్ బయట రూ.86,383 కోట్లు అప్పు చేశారు. ఇంత స్వల్పకాలంలో ఇంత పెద్దఎత్తున అప్పులు గతంలో ఏ ప్రభుత్వం చేయకపోవడం గమనార్హం. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో మరో రూ.55,383 కోట్లు అప్పు చేసింది. రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కో నుంచి ఏకంగా రూ.31 వేల కోట్లు రుణం తీసుకుంటోంది. సూపర్ సిక్సులు లేవు.. అప్పులే.. చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఇష్టానుసారం అప్పులు చేస్తున్నప్పటికీ సూపర్ సిక్స్‌లో కీలకమైన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకాలు అమలు చేయకుండా ఎగనామం పెట్టింది. దీనికితోడు వైఎస్ జగన్ సీఎంగా ఉండగా... ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలతో ఆస్తులు కల్పించారు. వాటిని చంద్రబాబు సర్కారు పీపీపీ పేరుతో ప్రైవేట్‌పరం చేస్తోంది. ⇒ తీసుకున్న అప్పులను ఆస్తుల కల్పనపై వెచ్చించాలి. ఇదే విషయాన్ని ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు పదేపదే చెప్పారు. కానీ, ఇప్పుడు చేసిన అప్పులను ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మిగిలిన నిర్మాణాలకు వ్యయం చేయడం లేదు. అటు సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైనవి కూడా ఇవ్వడం లేదు. సంపద సృష్టిస్తానంటూ పెద్దపెద్ద మాటలు చెప్పిన చంద్రబాబు రాష్ట్ర ఆదాయాన్ని పెంచలేకపోయారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వచి్చన ఆదాయం కూడా రానివిధంగా పాలన సాగిస్తున్నారు. కళ్లు లేని ఎల్లోమీడియా చంద్రబాబు సర్కారు కేవలం 17 నెలల్లోనే రూ.2.27 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినా ఎల్లో మీడియాకు కనిపించడం లేదు. వైఎస్సార్సీపీ పాలనలో లేని అప్పులను కూడా ఉన్నట్లు అదే పనిగా తప్పుడు కథనాలతో ఊదరగొట్టింది. ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేశారంటూ దుష్ప్రచారం సాగించింది. వాస్తవానికి వైఎస్సార్సీపీ సర్కారు ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగానే అప్పులు చేసినా రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా గగ్గోలుపెట్టింది. ఇప్పుడు చంద్రబాబు రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియాకు కనిపించడం లేదు. -
కృష్ణా తీరం.. జన తరంగం
గుండెలపై కకావికలమైన పంటను చూసి పుట్టెడు శోకంతో ఉన్న పుడమితల్లి పరవశించింది. కన్నీళ్లతో కుంగికృశించిన హృదయాలు నేనున్నానంటూ చాచిన ఆపన్నహస్తాన్ని మురిపెంగా ముద్దాడాయి. సర్కారు ఆంక్షలు సంకెళ్లు తెంచి.. సదా తమ క్షేమాన్నే కాంక్షించే అభిమాన నేతను హత్తుకునేందుకు ఉవ్విళ్లూరాయి. కష్టాల్లో కానరాని ఏలికలపై ధ్వజమెత్తిన ప్రజాపతికి జయజయధ్వానాలు పలికాయి. నీ వెంటే మేమంటూ మండుటెండనూ లెక్కచేయక గళమెత్తి నినదించాయి. కృష్ణా తీరం జనతరంగమై ఉప్పొంగింది. జన హృదయ విజేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అడుగడుగునా నీరాజనం పలికింది.సాక్షి, అమరావతి: మోంథా తుపాను ధాటికి విలవిల్లాడిన రైతులను పరామర్శించేందుకు మంగళవారం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన కృష్ణా జిల్లా పర్యటన దిగ్విజయంగా సాగింది. తమ కన్నీళ్లు తుడిచేందుకు వచ్చిన జననేతకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా ఆయనకు ఘన స్వాగతం పలికారు. పల్లెల్లో మహిళలు రోడ్లకిరువైపులా నిలబడి పూలవర్షం కురిపించారు. అడుగడుగునా ఆంక్షలు పెట్టినా, రోడ్లు, కూడళ్లు, సరిహద్దుల్లో బారికేడ్లు పెట్టి.. తాళ్లతో దారులు మూసేసినా ప్రజలు వెనుకడుగు వేయలేదు. మండుటెండను సైతం లెక్కచేయక మొక్కవోని పట్టుదలతో ముందుకురికారు. అభిమాన నేతకు గోడు వెళ్లబోసుకునేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు. మోంథా తుపానుతో నష్టపోయిన పంట పొలాలను వైఎస్ జగన్‌కు చూపించి ఆదుకోవాల్సిన సర్కారు పెద్దలు ఇప్పటివరకూ పట్టించుకోలేదని కన్నీరుమున్నీరయ్యారు. సమస్యలు చెప్పుకుని ఓదార్పు పొందారు. పంటలు నష్టపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే పరిహారం తీసుకుంటే దెబ్బతిన్న పంటను కొనడం కుదరదని సర్కారు బెదిరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల బాధలను ఆసాంతం సావధానంగా విన్న జననేత అధైర్యం వద్దని తానున్నానని భరోసా ఇవ్వడంతో కొండంత అండగా ఉందని సాంత్వన పొందారు. తాడేపల్లి నుంచి ఉదయం కారులో బయలుదేరిన వైఎస్ జగన్‌కు విజయవాడలోనే ప్రజలు దారికి ఇరువైపులా బారులుతీరి జయజయధ్వానాలు పలికారు. పటమటలో మహిళలు గుమ్మడి కాయలతో జననేతకు దిష్టి తీశారు. భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు పూల వర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. కానూరులో రైతులు, మహిళలు వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ఈడుపుగల్లు, గోశాల వద్ద జగన్‌ను కలిసిన మహిళా రైతులు, తుపానుతో నష్టపోయిన అరటి, వరి పంటలను చూపించారు. ఈ సందర్భంగా పూర్తిగా పనికి రాకుండా పోయిన వరి కంకులను వైఎస్ జగన్ పరిశీలించారు. ఆకునూరు సెంటర్లో వైఎస్ జగన్‌ను కలిసిన కల్లుగీత కార్మికులు తమ కష్టాలు వెళ్లబోసుకున్నారు. గండిగుంటలో వైఎస్ జగన్‌పై మహిళలు పూలుజల్లి ఘనస్వాగతం పలికారు. గోపువానిపాలెంలో మహిళలు, వృదులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చి గజమాలలతో జగన్‌కు స్వాగతం పలికారు. నిడమోలు, తరకటూరులో దారికి ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. వారికి అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. ఆయనకు పామర్రులోనూ రైతులు పాడైపోయిన పంటలను చూపించారు. పెడన నియోజకవర్గం, గూడూరు వద్ద మహిళలు జయహో జగనన్న అంటూ నినదించారు. రామరాజుపాలెంలోనూ వైఎస్ జగన్‌కు పంట పొలాలను చూపి రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆకుమర్రు లాకు వద్ద స్వయంగా వరి చేలో దిగిన జగనన్నతో రైతులు ముఖాముఖి మాట్లాడి మురిసిపోయారు. తమ బాధలు వినే నాయకుడు వచ్చాడని పరవశించిపోయారు. సీతారామపురం గ్రామానికి చేరుకున్న జగన్‌కు మహిళలు హారతులు పట్టారు. అక్కడి నుంచి బీవీ తోటకు బయలుదేరిన జగన్ వెంట నడిచిన నాయకులు, కార్యకర్తలు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. 70 కి.మీ. ప్రయాణానికి 7 గంటలకు పైగా అడుగడుగునా ప్రజలు నీరాజనం పలకడంతో వైఎస్ జగన్ పర్యటన నెమ్మదిగా ముందుకు సాగింది. 70 కిలోమీటర్ల దూరానికి 7 గంటలకు పైగా సమయం పట్టిందంటే జగన్‌పై ప్రజాభిమానం ఏస్థాయిలో ఉప్పొంగిందో ఊహించుకోవచ్చు. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పామర్రు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ కృష్ణాజిల్లా పర్యటనలో ఆయన కాన్వాయ్‌తో పాటు వస్తున్న పార్టీ నేతల కార్లను పోలీసులు అడ్డుకున్నారు. తాము అధినేత వెంట వెళ్తే తప్పేంటని ప్రశి్నంచిన నాయకులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారు. ఈ ఘటన మొవ్వ మండలం కూచిపూడి స్టేషన్లో మంగళవారం చోటు చేసుకుంది. జగన్ కాన్వాయ్‌తో పాటుగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్‌బాబు తన అనుచరులతో కలిసి మూడు కారుల్లో కాన్వాయ్‌తో పాటు వస్తున్నారు. వారిని నిడుమోలు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అశోక్‌బాబు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. తమ విధులకు ఆటంకం కల్పించారంటూ అశోక్‌బాబు, ఆయన అనుచరులపై మొవ్వ ఎస్సై కె.ఎన్.విశ్వనాథ్ కేసులు పెట్టారు. డ్రోన్‌తో నిఘా పెనమలూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణా జిల్లా పర్యటనలో పోలీసులు ఆంక్షలు విధించటమే కాకుండా అడుగడుగునా నిఘా పెట్టారు. పెనమలూరు మండల పరిధిలోని పలు గ్రామాల కూడళ్ల మీదుగా జగన్ పర్యటన జరిగిన సమయంలో పోలీసులు డ్రోన్లు పెట్టి చిత్రీకరించారు. ప్రతి సెంటర్లో డ్రోన్లు ఏర్పాటు చేశారు. -
ఆర్థిక పరిస్థితి బాగోలేదని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపలేరు
టెర్మినల్ బెనిఫిట్స్ కోసం పిటిషన్లు దాఖలు చేసిన వారు 70, 80, 90 ఏళ్ల సీనియర్ సిటిజన్లు. ఈ వయస్సులో అనేక ఆరోగ్య సమస్యలతో పాటు ఇతర సమస్యలు ఎదుర్కొంటుంటారు. వీరి నుంచి జీవితాంతం సేవలు తీసుకున్నారు. పదవీ విరమణ తర్వాత 16 ఏళ్లకు కూడా వారికి పదవీ విరమణ ప్రయోజనాలను ఇవ్వకపోవడం అమానవీయం. రాజ్యాంగ విరుద్ధం. – ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సాక్షి, అమరావతి: పదవీ విరమణ అనంతరం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగాంతర ప్రయోజనాలైన (టెర్మినల్ బెనిఫిట్స్) గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్ మెంట్ తదితరాలను చెల్లించడంలో ప్రభుత్వం, దాని పర్యవేక్షణలోని సంస్థలు చేస్తున్న అసాధారణ జాప్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఏళ్ల తరబడి సేవలు చేయించుకుని వారికి టెర్మినల్ బెనిఫిట్స్‌ను చెల్లించకపోవడం చట్ట విరుద్ధమే కాక రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది.టెర్మినల్ బెనిఫిట్స్ ప్రభుత్వాల దాతృత్వం కాదని, అవి ఉద్యోగుల హక్కు అని స్పష్టం చేసింది. ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న సాకుతో ఉద్యోగులకు రాజ్యాంగం కలి్పస్తున్న సామాజిక భద్రత హక్కును ప్రభుత్వం, దాని సంస్థలు కాలరాయలేవని పేర్కొంది. పదవీ విరమణ చేసిన 16 ఏళ్లకు కూడా ఉద్యోగులకు టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లించకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఆ ఉద్యోగులు వడ్డీతో సహా బకాయిలను పొందేందుకు అర్హులని హైకోర్టు తేల్చి చెప్పింది.నాటి నుంచి టెర్మినల్ బెనిఫిట్స్ పొందని పిటిషనర్లు..చిట్టిబోయిన భారతరావు, పి. చంద్రమౌళీశ్వరరావు, బండ శివరామకృష్ణ ప్రసాద్, ఏ.సాయిబాబు పెయిడ్ సెక్రటరీలుగా కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో పనిచేశారు. తరువాత వారి పోస్టులు డీ–కేడరైజ్డ్ చేసి సెక్రటరీలుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలోకి (పీఏసీఎస్) బదిలీ చేశారు. నాబార్డ్ మార్గదర్శకాల ప్రకారం వారిని 2009 మార్చి 2న తిరిగి పెయిడ్ సెక్రటరీలుగా డీసీసీబీలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి పదవీ విరమణ వరకు వారు ఎలాంటి మచ్చ లేకుండా పని చేశారు.రిటైర్ అయినప్పటికీ, వారికి గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి టెర్మినల్ బెనిఫిట్స్‌ను చెల్లించలేదు. వీటి కోసం ప్రభుత్వం, డీసీసీబీలతో పోరాడి అలసిపోయిన ఆ వృద్ధులు 2016లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై డీసీసీబీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లు కొంత కాలం పీఏసీఎస్‌లలో పనిచేసినందున, అవి వారి వాటా బెనిఫిట్స్‌ను చెల్లించాలని, ఆ మొత్తం రాగానే దానితో కలిపి టెర్మినల్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ఇటీవల కీలక తీర్పు వెలువరించారు.16 ఏళ్ల తరువాత కూడా ప్రయోజనాలు చెల్లించరా...? ‘రిటైర్ అయిన 16 ఏళ్లకు కూడా వారికి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం అమానవీయం. రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వం, డీసీసీబీ, పీఏసీఎస్‌లు పిటిషనర్ల నుంచి వారి జీవిత కాల సేవలు పొందాయి. ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేకపోయినా బెనిఫిట్స్‌ను చెల్లించలేదు. అది పిటిషనర్ల చట్టబద్ధమైన, రాజ్యాంగ హక్కులను హరించినట్లే. గ్రాట్యుటీ చెల్లింపు చట్టం సెక్షన్ 7 ప్రకారం ఉద్యోగి పదవీ విరమణ చేసి దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి 30 రోజుల్లోపు చెల్లించాలి. లేదంటే ఆ రోజు నుంచి వడ్డీ కూడా చెల్లించాలి. దీని ప్రకారం ఈ కేసులో పిటిషనర్లు చట్ట ప్రకారం వడ్డీ పొందేందుకు అర్హులు.ఇది యజమాని విచక్షణపై ఆధారపడి ఉండదు. గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్ మెంట్, ఇతర ప్రయోజనాలను పిటిషనర్లు లేదా వారి కుటుంబ సభ్యులకు 10 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలి. ఫ్యామిలీ మెంబర్ సరి్టఫికెట్లు పరిశీలించి, ఆ తరువాత 8 వారాల్లో చెల్లించాలి. కోర్టు ఖర్చుల కింద పిటిషనర్లు ఒక్కొక్కరికి రూ.10 వేలు ప్రభుత్వం, డీసీసీబీ, పీఏసీఎస్ చెల్లించాలి. టెర్మినల్ బెనిఫిట్స్‌లో పీఏసీఎస్ నుంచి రావాల్సిన వాటాను వసూలు చేసుకునే హక్కు డీసీసీబీకి ఉంది. పీఏసీఎస్ వాటా చెల్లించలేదు కాబట్టి పిటిషనర్లకు టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లించలేకపోయామన్న డీసీసీబీ వాదన చట్టబద్ధం కాదు’ అని జస్టిస్ మహేశ్వరరావు తన తీర్పులో పేర్కొన్నారు. -
ష్.. బయటకు మాట్లాడొద్దు
సాక్షి, అమరావతి: పార్టీకి సంబంధించి ఏ విషయం బహిరంగంగా మాట్లాడవద్దని, మీడియా, సోషల్ మీడియాలోనూ వాటి ప్రస్తావన తేవద్దని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని), తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌కి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం సూచించినట్టు తెలిసింది. ఏవైనా అభ్యంతరాలు, ఇబ్బందులు ఉంటే తమకు చెప్పాలని స్పష్టం చేసినట్టు సమాచారం. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలు ఇటీవల తీవ్రస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు పలు ఆరోపణలు చేసుకున్నారు. తన వద్ద ఎమ్మెల్యే సీటు కోసం ఎంపీ కేశినేని చిన్ని రూ.5 కోట్టు తీసుకున్నట్టు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వెల్లడించడంతో టీడీపీ అధిష్ఠానం ఉలిక్కిపడింది. పార్టీకి సంబంధించిన మరిన్ని అక్రమాలు బయటకు వస్తాయనే ఆందోళనతో చంద్రబాబు కొలికపూడితో మాట్లాడారు. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య సర్దుబాటు చేయాలని క్రమశిక్షణ సంఘానికి సూచించారు. దీంతో సంఘం సభ్యులైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, నేతలు వర్ల రామయ్య, పంచుమర్తి అనూరాధ, కొనకళ్ల నారాయణ మంగళవారం ఉదయం కొలికపూడిని పిలిచి మాట్లాడారు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానాల గురించి కొలికపూడి వారి వద్ద ఏకరువు పెట్టినట్టు తెలిసింది. ఎమ్మెల్యేనైనా తనకు నియోజకవర్గంలో ఎటువంటి అధికారాలు లేకుండా చేశారని, నియామకాలు, కార్యక్రమాలు, పనులన్నింటిలో ఎంపీ జోక్యం చేసుకుంటున్నారని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఎంపీ చిన్ని తిరువూరు నియోజకవర్గంలో చేసిన అవినీతి వ్యవహారాలు, తనకు తెలియకుండా చేపట్టిన పనులు, నియామకాలు వంటి అన్నింటి గురించి లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చారు. ఆ లేఖ తీసుకున్న క్రమశిక్షణ సంఘం సభ్యులు ఇకపై ఏ విషయం బయట మాట్లాడకూడదని, అలా చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు తెలిసింది. ఎంపీ తన నియోజకవర్గంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ఆయన ప్రశ్నించగా.. దానికి సమాధానం దాటవేసిన సభ్యులు.. పార్టీ చెప్పినట్టు వినాలని చెప్పారు. దీంతో కొలికపూడి ఆగ్రహంతో బయటకు వచ్చారు. తన అనుచరులతో కూడా మాట్లాడకుండా ఒంటరిగానే కారులో వెళ్లిపోయారు. ఆ తర్వాత కేశినేని చిన్ని కమిటీ సభ్యులను కలిసి తన వాదన వినిపించారు. తన పరిధిలోని ఎమ్మెల్యేలు కొందరు పార్టీకి నష్టం చేస్తున్నారని చెప్పారని, కొలికపూడికి స్థానిక పార్టీతో విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని చెప్పినట్టు తెలిసింది. ఇకపై ఇద్దరూ బహిరంగంగా మాట్లాడకూడదని చెప్పిన సంఘం నేతలు నివేదికను చంద్రబాబుకు ఇస్తామని, ఆ తర్వాత తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు. లోకేశ్ ఎంట్రీ మరోవైపు తన నివాసంలో ప్రజాదర్బార్ పేరుతో ప్రజల నుంచి వినతులు తీసుకునే సీఎం కుమారుడు, మంత్రి లోకేశ్ మంగళవారం మాత్రం పార్టీ కార్యాలయానికి వచ్చి వినతులు తీసుకున్నారు. తన అనుయాయుడైన విజయవాడ ఎంపీ చిన్ని క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరై వివరణ ఇచ్చే సమయంలో ఎన్నడూ లేనివిధంగా లోకేశ్ పార్టీ కార్యాలయానికి రావడం చర్చనీయాంశమైంది. చిన్నికి మద్దతుగానే ఆయన మంగళవారం తన కార్యక్రమాన్ని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది. -
వైఎస్ జగన్ పర్యటన సూపర్ సక్సెస్
విజయవాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు(మంగళవారం, నవంబర్ 4వ తేదీ) చేపట్టిన కృష్ణా జిల్లా పర్యటన సూపర్ సక్పెస్ అయ్యింది. జగన్ పర్యటించే గ్రామాల్లో బ్యారికేడ్లు అడ్డంపెట్టినా, గ్రామస్తులను కూడా కదలనీయకుండా చేసి వేధింపులకు గురి చేసినా, ఇలా ఎన్నో రకాలుగా ఆటంకాలు సృష్టించాలని చూసినా వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటన అత్యంత విజయవంతమైంది. కృష్ణా జిల్లాలో మోంథా తుపాను ప్రభావితమైన ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటించారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, బీవీ తోట ఎస్.ఎన్. గొల్లపాలెంలో జగన్ పర్యటన సాగింది. దాంతో గ్రామస్తులను, రైతులను అడ్డుకోవాలని పోలీసులు చూశారు. కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తన్న ఏపీ పోలీస్ యంత్రాంగం.. జగన్ పర్యటనను విజయవంతం కాకుండా చూడాలని ఎప్పటిలానే ప్రయత్నాలు చేసింది. కానీ వారు చేసిన ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యాయి. వీటిని గ్రామస్తులు, రైతన్నలు, యువత, మహిళలు ఎవరూ లెక్కచేయలేదు. తమ జననేత జగనన్న వస్తున్నాడని తెలిసి ఊరూ-వాడా ఏకమై కదిలారు. జగనన్నకు సంఘీభావం తెలుపుతూ జై జగన్ నినాదాలతో హెరెత్తించారు. రైతన్నలకు భరోసా.. వైఎస్ జగన్ పడిపోయిన పంట పొలాల్లో దిగి పరిశీలించారు. అదే సమయంలో రైతన్నతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ధీమా కల్పించారు. మోంథా తుపానుతో నష్టపోయిన రైతన్నలను ఆదుకోకపోతే వైఎస్సార్సీపీ మరో పోరాటం చేయడానికి కూడా వెనుకాడదని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.జనసంద్రం.. ఐదు గంటల ఆలస్యంవైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఆ రహదారులన్నీ జనసంద్రమయ్యాయి. విజయవాడ నుండి గొల్లపాలెం వరకు అడుగడుగునా భారీ జనసందోహమే కనిపించింది. దాంతో ఆ భారీ జనసందోహనికి అభివాదం చేస్తూ జగన్ పర్యటన ముందుకు సాగింది. దీనిలో భాగంగా వైఎస్ జగన్ పర్యటన ఆలస్యమైంది. సుమారు ఐదు గంటలు ఆలస్యంగా వైఎస్ జగన్ పర్యటన ముగిసింది. మిట్ట మధ్యాహ్నం ఎండలోనూ జగన్ కోసం రైతులు, మహిళలు, కార్యకర్తలు వేచి చూడగా, పొలాల్లో నుండి సైతం వచ్చి జగన్‌ను కలిశారు రైతన్నలు. తుపానుతో తాము నష్టపోయిన విషయాలను జగన్‌కు వివరించారు. ఇదీ చదవండి:‘మా హయాంలో జగనన్న ఉన్నాడనే భరోసా ఉండేది’ -
పంట ‘కోత’లు!
అర ఎకరా పొలంలో వరి సాగు చేశా. ఈసారి పంట బాగా పండడంతో సంతోషపడ్డాం. ఇంతలో తుపాను వచ్చి పంట మొత్తాన్ని తుడిచిపెట్టేసింది. పొలాన్ని చూస్తే ఏడుపొస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పంట నష్టపోతే రూ.18 వేల వరకు పరిహారం అందింది. చంద్రబాబు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదంట. పరిహారం వస్తుందో, లేదో తెలియట్లేదు. వైఎస్ జగన్ సకాలంలో విత్తనాలు, ఎరువులు, రైతు భరోసా ఇచ్చి ఆదుకుంటే.. ఈ ప్రభుత్వం రైతుల్ని అసలు పట్టించుకోవడం లేదు. – డి.గురుమూర్తి, గిరిజన రైతు, కొత్తవలస, అల్లూరి సీతారామరాజు జిల్లాపరిహారం ఇస్తారో.. లేదో!పక్కాగా ఈ–క్రాప్ నమోదు చేస్తే వైపరీత్యాల వేళ పంట నష్టపరిహారం, బీమా సాయం రైతులు ఎక్కడ అడుగుతారోననే భయంతోనే..! ఉద్దేశపూర్వకంగానే ఈ–క్రాప్‌ను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వంఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు బసిరెడ్డి జగన్మోహన్రెడ్డి. ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంభాలపాడు స్వగ్రామం. దాదాపు రూ.10 లక్షలు అప్పు తెచ్చి సొంత పొలం 30 ఎకరాలు, కౌలుకు మరో 30 ఎకరాలు సాగు చేశాడు. పొగాకు 15 ఎకరాలు, కంది 30 ఎకరాలు, బొబ్బర్లు 12 ఎకరాలు, వరి 3 ఎకరాల్లో సాగు చేశాడు. వారం రోజులుగా కురిసిన వర్షాలకు పొలంలో నీరు నిలిచి ఆశలు నీటి పాలయ్యాయి. పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ సీపీ హయాంలో పంట నష్ట పరిహారం కింద ఆ కుటుంబానికి దాదాపు రూ.7 లక్షలు అందాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులే ప్రీమియం చెల్లించాలని చెప్పడంతో సమయానికి డబ్బులు లేక పంటల బీమా చేయలేదు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రైతు పూర్తిగా నష్టపోయారు. సాక్షి, అమరావతి: ఈ–క్రాప్ నమోదులో టీడీపీ కూటమి సర్కారు నిర్లక్ష్యం అన్నదాతల పాలిట పెను శాపంగా మారింది. ఈ–క్రాప్ పక్కాగా, పారదర్శకంగా నమోదు చేస్తే వైపరీత్యాల వేళ పంట నష్టపరిహారం, పంటల బీమా సాయం ఇవ్వాలని రైతులు ఎక్కడ నిలదీస్తారోననే భయంతో ఏకంగా ఈ ప్రక్రియనే నిర్వీర్యం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు అత్యంత పారదర్శకంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను చంద్రబాబు సర్కారు మొక్కుబడి తంతుగా, తూతూ మంత్రంగా మార్చింది. అధికారంలోకి వచ్చింది మొదలు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఈ–క్రాప్‌ను నీరుగార్చడమే లక్ష్యంగా సాగుతున్న కూటమి ప్రభుత్వం అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఈ పంట నమోదు పారదర్శకంగా చేపట్టకపోవడం వల్ల పంట నష్టపరిహారం, బీమా సాయం అందే పరిస్థితి లేకుండా పోయిందని, పంట ఉత్పత్తులను అమ్ముకునే దారి కానరావడం లేదని మోంథా తుపానుతో పంటలు దెబ్బతిన్న రైతులు ఆక్రోశిస్తున్నారు. మరోవైపు పంట నష్టం అంచనాల కోసం చేపట్టిన ఎన్యుమరేషన్ ప్రక్రియ కూడా అస్తవ్యస్తంగా తయారైంది. టీడీపీ నేతల సిఫార్సులతో.. వారి ఇళ్ల వద్దే జాబితాలు తయారు చేస్తూ నష్టపోయిన రైతుల నోట్లో సర్కారు మట్టి కొడుతోంది! ఈ–క్రాప్ నిర్వీర్యం.. వైఎస్సార్సీపీ హయాంలో ఏపీలో పారదర్శకంగా అమలు చేసిన ఈ–క్రాప్ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. పొరుగు రాష్ట్రాలు ఈ సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తుండగా ఏపీలో మాత్రం మొక్కుబడి తంతుగా తయారైంది. సరిగ్గా ఖరీఫ్–25 సీజన్ ప్రారంభమయ్యే సమయంలోనే సచివాలయాల పునర్ వ్యవïÜ్థకరణతోపాటు రేషనలైజేషన్ పేరిట రైతు సేవా కేంద్రాల సిబ్బందిని అడ్డగోలుగా బదిలీలు చేయడం ఈ–క్రాప్ నమోదుపై తీవ్రంగా ప్రభావం చూపింది. బదిలీలపై వచ్చిన సిబ్బంది ఆయా ప్రాంతాలకు కొత్తవారు కావడంతో సర్వే నంబర్లను గుర్తించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్తగా వచ్చిన అధికారులకు సైతం అవగాహన లేక కింది స్థాయి సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించి ఇబ్బందులకు గురి చేయడం మినహా రైతులకు మేలు జరిగేలా పారదర్శకంగా ఈ–పంట నమోదు చేయాలన్న ఆలోచన లేకుండా పోయింది. డిజిటల్ క్రాప్ సర్వే నిబంధనల ప్రకారం ప్రతి ల్యాండ్ పార్సిల్లో వివరాలను విధిగా నమోదు చేయాలి. సీజన్ ముగిసి నెల రోజులైంది. కానీ ఇప్పటి వరకు 60శాతానికి మించి ల్యాండ్ పార్సిల్స్‌లో వివరాలు నమోదు చేయలేని దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో 2.94 కోట్ల ల్యాండ్ పార్శిల్స్ ఉండగా.. 2 కోట్ల ల్యాండ్ పార్సిల్స్‌ను నమోదు చేసినట్టు అధికారులు కాకి లెక్కలు చెబుతున్నారు. మరోవైపు రైతుల వేలిముద్రలతోపాటు ఈ–పంట నమోదును ధ్రువీకరిస్తూ ఆర్ఎస్కే, రెవెన్యూ అధికారులు వేలిముద్రలు వేసే ప్రక్రియను పూర్తిగా అటకెక్కించేశారు. ర్యాండమ్‌గా ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పరిశీలనను మొక్కుబడి తంతుగా మార్చేశారు. ఇక కౌలు రైతులు సాగు చేస్తున్న పంట వివరాలు ఈ–క్రాప్‌లో నమోదు కావడం లేదు. సీసీఆర్సీ కార్డుల జారీ మొక్కుబడిగా సాగుతోంది. రెవెన్యూ అధికారులు ధ్రువీకరిస్తే చాలు రైతులు పండించిన పంట వివరాలు నమోదు చేస్తామని నమ్మబలికారు. కానీ ఎక్కడా ఆ దాఖలాలు కానరావడం లేదు. దీనికి ఏకైక కారణం.. ఈ–క్రాప్ పక్కాగా నమోదు చేస్తే విపత్తు వేళ రైతులకు పంట నష్ట పరిహారం, బీమా సాయం ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందోననే భయమేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.595 కోట్ల ఇన్పుట్ సబ్సిడీకి ఎగనామం..! ఈ–క్రాప్ నమోదులో నిబంధనలకు పాతరేశారు. ఈ–క్రాప్ నమోదు సక్రమంగా జరగని కారణంగానే గతేడాది ధాన్యంతో పాటు వివిధ పంటలను రైతులు కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకోలేకపోయారు. ఈ–క్రాప్ నమోదు అస్తవ్యస్తంగా ఉండడం వల్లే మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోయిన మామిడి, పొగాకు, మిర్చి రైతులతోపాటు టమాటా, ఉల్లి రైతులను గుర్తించడంలో అధికారులు నానా పాట్లు పడ్డారు. గడిచిన ఏడాదిన్నరలో అకాల వర్షాలు, తుపానులు, కరువు ప్రభావానికి గురైన 5.50 లక్షల మంది రైతులకు రూ.595 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీని టీడీపీ కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఇలా పరిహారం ఎగ్గొట్టేందుకే ఉద్దేశపూర్వకంగానే ఈ–క్రాప్‌ను నిర్వీర్యం చేస్తోందని రైతులు, రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ధాన్యం కొనబోమంటూ.. గ్రామాల్లో టాంటాంచరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్యుమరేషన్ జాబితాలో పేర్లు ఉన్న వారి నుంచి ధాన్యం సహా ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేయబోమని గ్రామాల్లో టాంటాం వేస్తుండడం బాధిత రైతులను కలవరపాటుకు గురి చేస్తోంది. పచ్చనేతల కనుసన్నల్లోనే గ్రామ స్థాయిలో జాబితాలు సిద్ధమవుతున్నాయి. అర్హులైన వారికి పరిహారం దక్కకుండా చేయడం, నష్ట తీవ్రత తగ్గించి ఆర్థిక భారం తగ్గించుకోవడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ కుట్రలకు తెర తీసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు వైఎస్సార్ కడప జిల్లా సి.కె.దిన్నె మండలం కోలుములపల్లి తదితర గ్రామాల్లో తుపాను, దానికంటే ముందు కురిసిన అధిక వర్షాలతో దెబ్బతిన్న చామంతి పూల తోటలను ఏ అధికారీ పరిశీలించలేదు. ఇదే జిల్లాలో పోరుమామిళ్ల, బద్వేలు రూరల్, కాజీపేట, మైదుకూరు, బి.మఠం మండలాల్లో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించిన పాపాన పోలేదు. కనీసం ప్రాథమిక అంచనాలు గానీ, తుది జాబితాలను గానీ ఆర్ఎస్కేల్లో ప్రదర్శించడం, అభ్యంతరాలు స్వీకరిస్తున్న దాఖలాలు లేవు. వాస్తవాలు ఇలా ఉంటే గతంలో ఎన్నడూ లేని విధంగా పంట నష్టం నమోదు, సామాజిక తనిఖీలు, విజ్ఞప్తుల స్వీకరణ, పరిష్కారం, ఉన్నతాధికారుల సూపర్ చెకింగ్, పునఃపరిశీలన అంతా సమాంతరంగా జరిగిపోతోందంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం విస్మయం కలిగిస్తోంది. దేశానికే ఆదర్శంగా ‘ఈ–క్రాప్’.. ఎల్రక్టానిక్ క్రాపింగ్ (ఈ–క్రాప్).. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఓ వినూత్న ప్రయోగం. వాస్తవ సాగుదారులకు రక్షణ కవచం. వ్యవసాయ రంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక మార్పు అది. ఏ గ్రామంలో.. ఏ సర్వే నంబర్ పరిధిలో.. ఎంత విస్తీర్ణంలో.. ఏ పంటను ఎవరు సాగు చేస్తున్నారో ఒక్క క్లిక్‌తో తెలుసు కోవడమే కాదు.. ఈ–క్రాప్ ప్రామాణికంగా అర్హులైన వాస్తవ సాగుదారులకు పంట రుణాలు, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ (పంట నష్టపరిహారం), సున్నా వడ్డీ రాయితీ లాంటి సంక్షేమ ఫలాలు అందించేవారు. రబీ 2019 సీజన్లో శ్రీకారం చుట్టిన ఈ–క్రాప్ నమోదు సాంకేతికత అనతి కాలంలోనే జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలందుకుంది. 2023లో ప్రతిష్టాత్మక స్కోచ్ సిల్వర్ అవార్డు కూడా వరించింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్ ద్వారా వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ (పంట సాగు హక్కు పత్రం) డేటా ఆధారంగా జాయింట్ అజమాయిషీ కింద వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ సహాయకులు పంట వివరాలు నమోదు చేసేవారు. సీజన్ వారీగా ఏ సర్వే నంబర్లో ఏయే రకాల పంటలు ఏయే వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారో ఆర్బీకేల ద్వారా వాస్తవ సాగుదారుల వివరాలు నమోదు చేసేవారు. 15–30 రోజుల్లోపు క్షేత్ర స్థాయి పరిశీలనలో జియో కో ఆర్డినేట్స్, జియో ఫెన్సింగ్‌తో సహా పంటల ఫొటోలు అప్లోడ్ చేసి, రైతుల వేలిముద్రలు(ఈకేవైసీ–మీ పంట తెలుసుకోండి) తీసుకుని మొబైల్ నంబర్‌కు డిజిటల్ రసీదు పంపేవారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారుల పరిశీలన తర్వాత రైతులకు భౌతిక రసీదు కూడా అందించేవారు. ఈ భౌతిక రసీదులోనే ఉచిత పంటల బీమా పధకం వర్తించే నోటిఫై చేసిన పంటలకు (స్టార్) గుర్తుతో ప్రత్యేకంగా తెలియచేయడమే కాదు.. మీ పంటకు బీమా కవరేజ్ ఉందని, మీ తరఫున ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలియజేశారు. ఇలా ఏటా 1.65 కోట్ల ఎకరాల చొప్పున ఐదేళ్లలో 8.24 కోట్ల ఎకరాల్లో సాగైన పంటల వివరాలను నమోదు చేశారు. ఈ–క్రాప్ ప్రామాణికంగా 2019–24 మధ్య 75.82 లక్షల మందికి రూ.1,373కోట్ల సబ్సిడీతో 45.16 లక్షల టన్నుల విత్తనాలు అందించారు. 15 లక్షల మందికి రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగుల మందులు సరఫరా చేశారు. 176.36 లక్షల టన్నుల ఎరువులు పంపిణీ చేయగా, 5.13 కోట్ల మందికి రూ.8.37 లక్షల కోట్ల పంట రుణాలను అందించారు. మరోవైపు వైఎస్సార్ రైతు భరోసా కింద 53.58 లక్షల రైతు కుటుంబాలకు రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం అందించి సాగుకు భరోసా కల్పించారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 54.58 లక్షల మందికి రూ.7,802.05 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీ రూపంలో 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్లు, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 84.67 లక్షల మందికి రూ.2,051 కోట్ల రాయితీని గత ప్రభుత్వం అందచేసింది.సేద తీరుతున్న ప్రభుత్వ పెద్దలుపుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు షికార్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ పర్యటనకు వెళ్తే.. మంత్రి లోకేశ్ క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ చిల్ అవుతున్నారు. మరోవైపు ఫొటోలకు ఫోజులిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతులను పట్టించుకోకుండా హైదరాబాద్ వెళ్లిపోవడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి.ఇప్పుడు పరిహారం ఎవరిస్తారు గత ప్రభుత్వంలో అధికారులే దగ్గరుండి బీమా చేయించేవారు. ఈ ప్రభుత్వం సొంతంగా బీమా చేయించుకోవాలని చెప్పడంతో రెండుసార్లు రైతు సేవా కేంద్రాలకు వెళ్లా. సర్వర్ పని చేయడం లేదని చెప్పారు. తరువాత సమయం అయిపోయిందన్నారు. ఐదు ఎకరాల్లో స్వర్ణరకం సాగు చేశా. పంట మొత్తం పోయింది. పరిహారం ఎవరిస్తారు? కౌలుదారులకు ఆత్మహత్యలే శరణ్యం! – గున్నం రామకృష్ణ, కొత్తూరు, రామచంద్రపురం రూరల్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కౌలు రైతుకు పరిహారం ఇవ్వాలి కౌలుకు ఏడు ఎకరాలు తీసుకున్నా. తొలుత నీరందక దెబ్బతిన్నా. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే తుపాను పంటను దెబ్బతీసింది. ఎకరానికి రూ.25 వేలకు పైగా వెచ్చించా. నాలాంటి కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కౌలు రైతులను కూడా గుర్తించి నష్టపరిహారం అందించాలి. – నాగరాజు, కౌలు రైతు, పెడన, కృష్ణా జిల్లాదిక్కుతోచడం లేదు రూ.ఐదు లక్షల వరకూ వెచ్చించి 15 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాం. పంట తొలగించే రోజు మొదలైన వాన తుపానుగా మారి పదిరోజుల పాటు కొనసాగింది. టార్పాలిన్ కప్పి భద్రపరిచినప్పటికీ మొక్కజొన్నలు మొత్తం మొలకలు వచ్చాయి. కష్టపడి పండించిన పంట కళ్లముందే పాడైపోవడంతో దిక్కుతోచడం లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. – మధు, కదిరిపల్లి, గుంతకల్లు మండలం, అనంతపురం జిల్లాప్రభుత్వ నిర్ణయం చాలా అన్యాయం ఇన్పుట్ సబ్సిడీకి నమోదు చేసుకున్న రైతుల నుంచి పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయకూడదన్న నిర్ణయం చాలా అన్యాయం. పంటలు నష్టపోయారు కాబట్టే ఇన్పుట్ సబ్సిడీ పొందుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని రైతుల నుంచి ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి.. – పోతిరెడ్డి భాస్కర్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కడప జిల్లా జగన్ హయాంలో రైతులకు మేలు మొక్క జొన్న కోత కోసి ఆరబోశాం. క్వింటా రూ.2,200 పలకాల్సింది రూ.1,600కు అడుగుతున్నారు. ఇన్పుట్ సబ్సిడీ గురించి అవగాహన కల్పించేవారు ఎవరూ లేరు. గత ప్రభుత్వం స్వయంగా ఇన్సూరెన్స్ చెల్లించడంతో ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు మేలు చేకూరేది. – గుత్తి ఏసన్న, రైతు, కల్వటాల, కొలిమిగుండ్ల మండలం, నంద్యాల జిల్లాఈ ప్రభుత్వంలో బీమా గురించి చేప్పేవారే లేరు నాకు ఎకరా పొలం ఉంది. వరి, మిరప పండిస్తా. గత ప్రభుత్వంలో ఈ–క్రాప్ నమోదు చేసి ప్రీమియం కూడా చెల్లించడంతో రూ.26 వేలు బీమా నగదు వచ్చింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి చెప్పేవారే కరువయ్యారు. ప్రభుత్వం ఎటువంటి భరోసా కల్పించకపోవడంతో ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. – వేణు, రైతు, బంగారుపాళెం, చిత్తూరు జిల్లాఅస్తవ్యస్తంగా ఎన్యుమరేషన్...మోంథా తుపాను వల్ల నష్టపోయిన పంటలను, రైతులను గుర్తించేందుకు చేపట్టిన ఎన్యుమరేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైంది. గత నెల 31వ తేదీ సాయంత్రంలోగా తుది జాబితాలు తయారు చేయాలని ఆదేశిస్తూ 30వ తేదీన సర్క్యులర్ ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. అంటే 24 గంటలు కూడా గడువు ఇవ్వకుండా తుది జాబితాలు రూపొందించాలని ఆదేశించటాన్ని బట్టి ఎన్యుమరేషన్లో పారదర్శకత ఏ మేరకు ఉందో వెల్లడవుతోంది. వాస్తవంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తినగా.. ప్రభుత్వం నష్ట తీవ్రతను తగ్గించేందుకు తొలుత 4.40 లక్షల ఎకరాల్లో పంటలు ముంపునకు గురైనట్లు ప్రకటించింది. ఆ తర్వాత దాన్ని 3.45 లక్షల ఎకరాలేనని బుకాయించింది. చివరకు తుది అంచనాల రూపకల్పనలో 3.70 లక్షల ఎకరాలుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. అది కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపకుండా, టీడీపీ నేతలు సిఫార్సు చేసిన పేర్లతోనే జాబితాలను తయారు చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న మౌఖిక ఆదేశాలతో జాబితాలను కుదించేందుకు యంత్రాంగం రేయింబవళ్లు శ్రమిస్తోంది. ఎన్యుమరేషన్ పెంచొద్దంటూ క్షేత్రస్థాయి సిబ్బందిపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. కర్నూలు, వైఎస్సార్ కడప, నంద్యాల జిల్లాల్లో తుపాను ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల ఉల్లి పంటకు అపార నష్టం వాటిల్లింది. కానీ దెబ్బతిన్న ఉల్లి పంట వివరాలు నమోదు చేయడానికి వీల్లేదని మౌఖిక ఆదేశాలు జారీ చేయడం నివ్వెరపరుస్తోంది. అలా నమోదు చేసిన ఆర్ఎస్కే సిబ్బందిపై చర్యలకు సైతం సిద్ధపడుతుండడం సర్కారు తీరుకు అద్దం పడుతోంది. -
వైఎస్ జగన్ హయాంలో ఉపాధి కల్పన జోరు
సాక్షి అమరావతి: ప్రజలకు ఉపాధి కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ 2023–24 ఆరి్థక సంవత్సరంలో గణనీయమైన మెరుగుదల నమోదు చేసిందని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లో సేవల రంగంలో ఉపాధి ధోరణులను విశ్లేషాతూ నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది. ఏపీలో వ్యవసాయ రంగం తరువాత 2023–24లో సేవల రంగంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించినట్లు నివేదిక పేర్కొంది. ఆ ఏడాది సేవల రంగంలో జాతీయ సగటును మించి ఏపీలో ఉపాధి కల్పన ఉందని నివేదిక తెలిపింది.2023–24లో సేవల రంగంలో జాతీయ సగటు ఉపాధి కల్పన 29.7 శాతం ఉండగా.. ఏపీలో 31.8 శాతం మంది ఆ రంగంలో ఉపాధి పొందినట్టు నివేదిక పేర్కొంది. 2011–12లో సేవల రంగంలో 27.7 శాతం ఉపాధి కల్పిస్తే.. 2023–24లో ఏపీలోని సేవల రంగంలో 78 లక్షల మంది ఉపాధి పొందడంతో ఆ వాటా 31.8 శాతానికి పెరిగినట్టు నివేదిక స్పష్టం చేసింది. 2011–12లో మహారాష్ట్ర సేవల రంగంలో ఉపాధి కల్పనలో టాప్‌లో ఉండగా 2023–24లో మూడో స్థానానికి పడిపోయిందని, కర్ణాటక రెండో స్థానం నుంచి నాల్గో స్థానానికి దిగజారగా.. ఆంధ్రప్రదేశ్ 9వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకి గణనీయమైన మెరుగుదల నమోదు చేసినట్టు నివేదిక తెలిపింది. -
నాడు ఉచిత బీమా రక్ష.. నేడు అనుచిత శిక్ష
ఈయన పేరు శీలం శ్రీను. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామం. ఎకరం పొలం కౌలుకు తీసుకుని ఖరీఫ్‌లో వరి పంట సాగు చేశారు. ఇప్పటికే రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. మోంథా తుపాను బారిన పడి పంట పూర్తిగా ముంపునకు గురై కుళ్లిపోతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.27 వేలు బీమా పరిహారంగా వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం ఉచిత పంటల బీమాను ఎత్తివేయడంతో ప్రీమియం భారం భరించలేక చెల్లించలేదు. గత 17 నెలల్లో దాదాపు మూడుసార్లు వరి పంట నీట మునిగి పూర్తిగా పాడైనప్పటికీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పరిహారం రాలేదు. ఈసారైనా నష్టపరిహారం అందించి ఆదుకోవాలని శీలం శ్రీను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. సాక్షి, అమరావతి: ‘పంటల బీమా ప్రీమియం చెల్లించి ఉంటే.. బీమా పరిహారం ఇప్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనపై తుపాను ప్రభావిత ప్రాంతాల రైతులు మండిపడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు పైసా భారం పడకుండా రైతులకు అండగా నిలిచిన ఉచిత పంటల బీమాను అటకెక్కించడం వల్లే తమకీగతి పట్టిందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రీమియం చెల్లించిన వారికి బీమా పరిహారం ఇప్పిస్తానంటున్నావ్.. మరి ప్రీమియం భారం కావడంతో బీమా చేయించుకోలేని తమబోటి నిరుపేద రైతుల పరిస్థితి ఏమిటి చంద్రబాబూ.. అంటూ నిలదీస్తున్నారు.కూటమి సర్కారు నిర్వాకంతో బీమాకు దూరమైన లక్షలాది మంది తుపాను బాధిత రైతులు తీవ్రంగా నష్టపోయి దిక్కులు చూస్తున్నారు. తుపాను బారినపడి దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, ఇందులో అత్యధికంగా వరి పంట 6 లక్షల నుంచి 8 లక్షల ఎకరాల్లో తుడిచిపెట్టుకుపోయినట్టు చెబుతున్నారు. పంటలు కోల్పోయిన రైతుల్లో నూటికి 90 శాతం మంది రైతులు ప్రీమియం భారం కావడంతో పంటల బీమా చేయించుకోలేకపోయారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రీమియం చెల్లించని రైతులకూ చంద్రబాబు ప్రభుత్వమే సొంతంగా బీమా పరిహారానికి సమానంగా ఆరి్థక లబ్ధి చేకూర్చి అండగా నిలవాలని కర్షకులు డిమాండ్ చేస్తున్నారు. ఖరీఫ్‌లో వరి సాగైంది 38.97 లక్షల ఎకరాలు.. బీమా చేయించుకుంది4.94 లక్షల ఎకరాలకే.. ఉచిత పంటల బీమా పుణ్యమా అని గడిచిన ఖరీఫ్–2024 సీజన్లో 71.17 లక్షల ఎకరాల్లో పంటలకు బీమా కవరేజ్ లభించగా, 85.83 లక్షల మంది రైతులకు బీమా రక్షణ లభించింది. ఉచిత పంటల బీమా ఎత్తివేతతో రబీ–2024 సీజన్లో కేవలం 7.65 లక్షల మంది రైతులు 9.93 లక్షల ఎకరాలకు బీమా కవరేజ్ పొందగలిగారు. ప్రస్తుత ఖరీఫ్–2025లో కేవలం 19.55 లక్షల మంది రైతులు 19.69 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా చేయించుకోగలిగారు. గత ఖరీఫ్‌తో పోలిస్తే 51.48 లక్షల ఎకరాల్లో పంటలకు బీమా కవరేజ్, 66.28 లక్షల మంది రైతులకు బీమా రక్షణ దక్కలేదు.నోటిఫై చేసిన పంటల సాగు విస్తీర్ణంలో 27 శాతం పంటలకు మించి బీమా కవరేజ్, 85 శాతం మంది రైతులకు బీమా రక్షణ లభించలేదు. దీంతో వారి పరిస్థితి ప్రçస్తుతం అగమ్యగోచరంగా తయారైంది. ముఖ్యంగా మోంథా తుపాను ప్రభావం వల్ల వరి, పత్తి, మొక్కజొన్న, అరటి రైతులు ఎక్కువగా నష్టపోయారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 38.97 లక్షల ఎకరాల్లో వరి సాగవగా, రైతులు బీమా చేయించుకున్నది కేవలం 4.94 లక్షలు ఎకరాలకు మాత్రమే. అంటే దాదాపు 34 లక్షల ఎకరాల్లో సాగైన వరి పంటకు బీమా రక్షణ కరువైంది.మొక్కజొన్న పంట 4.67 లక్షల ఎకరాల్లో సాగవగా. కేవలం 15,638 ఎకరాలకు మాత్రమే బీమా కవరేజ్ లభించింది. ఇక పత్తి విషయానికి వస్తే 11.4 లక్షల ఎకరాల్లో సాగవగా, కేవలం 1.03 లక్షల ఎకరాలకు మాత్రమే కవరేజ్ లభించింది. అరటి 2.74 లక్షల ఎకరాల్లో సాగవగా, 16 వేల ఎకరాలకే బీమా కవరేజ్ పరిమితమైంది. దాదాపు 1.50 లక్షల ఎకరాల్లో టమాటా సాగవగా, కేవలం 2284 ఎకరాలకు మాత్రమే బీమా కవరేజ్ లభించింది. ఈ గణాంకాలు చాలు రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు పాలనలో స్వచ్ఛంద బీమా నమోదు అమలు తీరు ఏ విధంగా ఉందో చెప్పడానికి.ఐదేళ్లూ పైసా భారం పడకుండా రైతుకు భరోసావైఎస్ జగన్ ప్రభుత్వం.. 2019–24 మధ్య ఐదేళ్లూ రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయడమే కాదు.. ఏ సీజన్‌కు చెందిన బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసేలోగా జమచేసి అండగా నిలిచింది. దేశంలో మరెక్కడాలేని విధంగా ఈ–క్రాప్ నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన పంటలకు యూనివర్శల్ కవరేజ్ కల్పించింది. ఏటా సగటున 1.08 కోట్ల ఎకరాల చొప్పున ఐదేళ్లలో 5.42 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పించగా, ఏటా సగటున 40.50 లక్షల మంది చొప్పున ఐదేళ్లలో 2.10కోట్ల మంది రైతులకు బీమా రక్షణ కల్పించారు.ప్రభుత్వ వాటాతోపాటు రైతుల తరఫున రూ.3,022.26 కోట్లను ప్రీమియం రూపంలో కంపెనీలకు చెల్లించింది. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల మేర బీమా పరిహారం అందిస్తే 2019–24 మధ్యలో వైఎస్ జగన్ హయాంలో 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802.08 కోట్ల మేర పరిహారాన్ని అందజేయగా, వైపరీత్యాల వేళ పంటలు నష్టపోయిన 24.80 లక్షల మంది రైతులకు రూ.2,558.07 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని అందజేసి అండగా నిలిచారు.17 నెలల్లో ఒక్క రూపాయి ఇవ్వలేదు ఖరీఫ్‌లో ఎకరన్నరలో వరి వేశా. రూ.45 వేలు పెట్టుబడి పెట్టాను. పంట చేతికి అందే వేళ మోంథా తుపాను ముంచేసింది. తీవ్రంగా నష్టపోయాను. పట్టుమని పది బస్తాలు కూడా చేతికొస్తుందో లేదో తెలియడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలా పంటలు దెబ్బతిన్నప్పుడు పైసా చెల్లించకుండానే పంట బీమా పరిహారం ఇచ్చేవారు. నాకు కూడా పరిహారం వచి్చంది. కానీ ఇప్పుడు బీమా భారమైపోయింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అకాల వర్షాలు, వరదల వల్ల పంటలు దెబ్బతిన్నా ఒక్క రూపాయి కూడా నష్ట పరిహారం ఇవ్వలేదు. ఇప్పుడైనా పారదర్శకంగా నష్టపోయిన పంటలను పరిశీలించి పరిహారం ఇప్పించాలి. –బచ్చల తమ్మారావు, గుమ్మరేగుల, కాకినాడ జిల్లాజగన్ హయాంలో ఎకరాకు రూ.36 వేల పరిహారం అందుకున్నాం.. వైఎస్ జగన్ హయాంలో ఇదే రీతిలో తుపాను వల్ల పంట నష్ట పోయిన సందర్భంలో ఎకరానికి రూ.36 వేలు పరిహారం అందుకున్నాను. ఉచిత పంటల బీమా పథకం ద్వారా పైసా భారం పడకుండా క్రమం తప్పకుండా పరిహారం జమ చేసేవారు. నాడు ప్రభుత్వం రైతులకు ఎంతో తోడ్పాటు అందించింది. ఇప్పుడు కూటమి సర్కారులో అటువంటిది కనిపించడం లేదు. ఇప్పుడు పంట కోల్పోయి బీమా ప్రీమియం చెల్లించని మా లాంటి రైతులం అన్యాయం అయిపోయేలా ఉన్నాము. కూటమి సర్కారు ఆదుకుంటుందో లేదోనని ఆందోళనగా ఉంది. – పిల్లా శ్రీనివాస్, కొత్తపల్లి అగ్రహారం, తూర్పు గోదావరి జిల్లా -
బాబు పాలనలో ఆత్మహత్యలే శరణ్యమా
బాపట్ల/తిరుపతి అర్బన్/ మచిలీపట్నం అర్బన్: సమస్యలు పరిష్కారం కాకపోవడం, కూటమి నేతల వేధింపులు తాళలేక సోమవారం రాష్ట్రంలోని కలెక్టర్ కార్యాలయాల వద్ద పలువురు ఆత్మహత్యాయత్నం చేశారు. భూ వివాదానికి సంబంధించిన సమస్యపై ఎన్ని అర్జీలు ఇచ్చినా పరిష్కారం కావడం లేదని బాపట్ల జిల్లాకు చెందిన వ్యక్తి, ఇంటి స్థలానికి సంబంధించి కూటమి నేతల వేధింపులు భరించలేక తిరుపతి జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు, అధికారుల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా వితంతు పింఛను రావడంలేదని కృష్ణా జిల్లాకు చెందిన మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు.టీడీపీ నేతల వేధింపులతో..కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతల వేధింపులు పరాకాష్ఠకు చేరుతున్నాయి. ఇంటి స్థలాల విషయంలో కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ టీడీపీ నాయకులు తరచూ తమ ఇంటికి పోలీసులను పంపి వేధిస్తున్నారని తిరుపతి కలెక్టరేట్ వద్ద సోమవారం ఇద్దరు మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు వెంకటసుబ్బమ్మ, లక్ష్మీదేవి మీడియాకు తమ సమస్యను తెలిపారు. తిరుపతి నగరం సంజయగాంధీ కాలనీలో తమ ఇద్దరికి ఇంటి స్థలాలు ఉన్నాయని చెప్పారు. రేకులను ఏర్పాటు చేసుకుని 20ఏళ్లకు పైగా జీవనం సాగిస్తున్నామన్నారు.తహసీల్దార్ తమకు ల్యాండ్ ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఇచ్చారని పేర్కొన్నారు. 20ఏళ్లకు పైగా మున్సిపాలిటీకి ఇంటి పన్ను చెల్లిస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తిరుపతి నగరంలో 18 రోడ్లను విస్తరించారని, అందులో తమ ఇళ్ల సమీపంలోనూ కొత్త రోడ్లు ఏర్పాటు చేశారన్నారు. దీంతో అక్కడ ఇంటి స్థలాల ధరలు అత్యధికంగా పెరిగినట్లు వెల్లడించారు. అనంతరం తాము రేకుల ఇళ్లను తొలగించి చిన్నపాటి భవనాన్ని నిర్మించుకుంటున్నామని, ఈ క్రమంలో టీడీపీకి చెందిన రజనీకాంత్ అనే నాయకుడు తమ అనుచరులను పంపించి ఇంటి నిర్మాణాలను అడ్డుకుంటున్నారని ఆవేదన చెందారు.కోర్టును ఆశ్రయిస్తే తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, అయినప్పటికీ టీడీపీ నేత అధికారాన్ని అడ్డుపెట్టుకుని పదేపదే తమ ఇంటికి పోలీసులను పంపుతున్నారని వాపోయారు. న్యాయం కోసం అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా టీడీపీ నేతకే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక సోమవారం కలెక్టరేట్ వద్ద కుటుంబమంతా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు అడ్డుకుని కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారని, విచారణ చేసి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు.వితంతు పింఛను రావట్లేదంటూ..కృష్ణాజిల్లా కలెక్టరేట్లో సోమవారం ‘మీకోసం’లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యనమలకుదురు డొంక రోడ్డు ప్రాంతానికి చెందిన తోట కృష్ణవేణి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. సమయానికి పోలీసులు అప్రమత్తమై అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. కృష్ణవేణి తన కుమార్తె లక్ష్మీప్రసన్నతో కలిసి సమావేశానికి హాజరై సీఐ శీను వద్ద తమ సమస్యను వివరిసూ్తనే ఒక్కసారిగా పెట్రోల్ సీసా తీసి ఒంటిపై పోసుకుంది. వెంటనే అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ డీకే బాలాజీ ఆమెను తన వద్దకు పిలిపించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కృష్ణవేణి కుమార్తె లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ.. తన తల్లికి వితంతు పింఛను రాకపోవడం, రేషన్ కార్డు లేకపోవడం, విద్యుత్ బిల్లు పేరు మార్పు సాధ్యం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చింది.పురుగు మందు తాగి..భూ వివాదానికి సంబంధించి ఎన్ని అర్జీలు ఇచ్చినా సమస్య పరిష్కారం కావడం లేదని బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి పురుగుమందు తాగి సోమవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారులు అప్రమత్తమై అతడిని బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చిన్నగంజాం మండలం మున్నంవారిపాలేనికి చెందిన బాధితుడు మార్పు బెన్ను కథనం మేరకు..‘1981లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన 22 కుటుంబాలు, సర్వే నంబర్ 1158 లో ప్రభుత్వం మంజూరు చేసిన 56 ఎకరాలను సాగు చేసుకుంటున్నాయి.ఏడేళ్ల క్రితం మా భూమిని మన్నె సునీల్ చౌదరికి లీజుకు ఇచ్చాం. అతడు లీజు సక్రమంగా చెల్లించకపోగా ఆ భూమిలో చేపల చెరువులు వేసి అతడి భార్య రాధిక పేరుతో సర్వే నంబర్ 1159తో తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి చేపల చెరువులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయించుకొని సర్వే నంబర్ 1158 భూమికి సంబంధించిన చెరువులను సాగు చేసుకుంటున్నాడు. మా భూమిని మాకు అప్పగించాలని గతనెల 13న గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశాం. ఆ ఫిర్యాదు విద్యుత్ శాఖ ఏడీ వద్దకు చేరింది. అక్కడి నుంచి చిన్న గంజాం విద్యుత్ ఏఈకి వచ్చింది.ఈ సమస్య నా పరిధిలోనిది కాదని ఏఈ సమాధానమిచ్చారు. ఒకసారి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ బిగించాక దాన్ని రద్దు చేయలేమని ఏఈ చెబుతున్నారు. మొదట్లో టీడీపీ నేత శ్రీను మా పొలాలను లీజుకు తీసుకున్నాడు. అతని నుంచి సునీల్ తీసుకొని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి మా పొలాలకు లీజులు చెల్లించడం లేదు. మా పొలాలను స్వాధీనం చేయకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాను. న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తాను’ అని స్పష్టం చేశాడు. -
హడ్కో నుంచి మరో రూ.5,000 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో రికార్డులు సృష్టిస్తున్నారు. ఎడాపెడా అప్పులు తీసుకుంటూ ప్రజలపై భారం మోపుతున్నారు. తాజాగా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీపీఎఫ్సీఎల్) సంస్థలకు అవసరమైన బొగ్గు, విద్యుత్ కొనుగోలు కోసమంటూ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హడ్కో) నుంచి ప్రభుత్వం రూ.5,000 కోట్ల అప్పు తీసుకుంటోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ ఇస్తూ సీఎస్ సోమవారం ఉత్తర్వులిచ్చారు.హడ్కో విజయవాడ ప్రాంతీయ కార్యాలయం నుంచి రూ.5,000 కోట్ల ప్రత్యేక టర్మ్ లోన్ తీసుకునేందుకు అనుమతి, రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంతకుముందు ఏపీపీఎఫ్సీఎల్ తీసుకున్న రూ.710 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చింది. దీంతో ఏపీపీఎఫ్సీఎల్ మొత్తం అప్పు రూ.5,710 కోట్లకు చేరింది. బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో బడ్జెట్ బయటచేసిన అప్పులు రూ.55,383 కోట్లకు చేరాయి. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులపై చంద్రబాబు, ఎల్లో మీడియా నానా యాగీ చేసి.. దు్రష్పచారం చేశాయి. ఇప్పుడు ఏడాదిన్నరలోనే బడ్జెట్ బయట ప్రభుత్వ గ్యారెంటీతో భారీగా అప్పులు చేస్తున్నారు. -
నేడు కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పెనమలూరు సెంటర్, ఉయ్యూరు బైపాస్, పామర్రు బైపాస్ మీదుగా పెడన నియోజకవర్గం గూడూరుకు చేరుకుంటారు.మోంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను వైఎస్ జగన్ పరిశీలించి.. రైతులతో మాట్లాడతారు. అనంతరం తాడేపల్లికి చేరుకుంటారని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం తెలిపింది. -
రహదారులు రక్తసిక్తం
కర్లపాలెం/యలమంచిలి రూరల్/నాదెండ్ల/నగరి/పెళ్లకూరు: రాష్ట్రంలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పదిమంది దుర్మరణం చెందారు. మరో 23మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని సత్యవతిపేట వద్ద జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే నరేంద్రవర్మ కుమారుడి వివాహం సందర్భంగా పాండురంగాపురంలోని ఓ రిసార్ట్‌లో ఆదివారం రాత్రి సంగీత్ వేడుకలు ఏర్పాటు చేశారు.కర్లపాలెం గ్రామానికి చెందిన బేతాళం బలరామరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలకు హాజరయ్యారు. వారందరూ ఆనందంగా గడిపి రాత్రి 12 గంటల సమయంలో తిరిగి కారులో కర్లపాలెం బయలుదేరారు. కర్లపాలెం పంచాయతీ సత్యవతిపేట వద్ద కారు, నరసాపురం నుంచి వస్తున్న కంటైనర్ లారీ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. కారులో ఉన్న బేతాళం బలరామరాజు(65), ఆయన భార్య బేతాళం లక్ష్మి(60), వారి వియ్యపురాలు గాదిరాజు పుష్పావతి(60), కారు నడుపుతున్న బలరామరాజుకు బావమరిది వరసైన ముదునూరి శ్రీనివాసరాజుకు తీవ్ర గాయాలయ్యాయి.స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కారులో చిక్కుకుపోయిన క్షతగాత్రులను బయటకు తీసి బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే నలుగురు మృతిచెందినట్లు తెలిపారు. అదే కారులో ఉన్న గాదిరాజు పుష్పావతి మనవరాలు గాదిరాజు వైష్ణవి, మనవడు జయంత్వర్మకు తీవ్ర గాయాలయ్యాయి. వైష్ణవిని చీరాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, జయంత్వర్మను గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టిన వ్యాన్.. ఇద్దరి మృతి అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని కొక్కిరాపల్లి కూడలి ప్రేమ సమాజం వద్ద సోమవారం ప్రయాణికులు దిగడానికి రోడ్డు వెంబడి ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఆటోలో ఉన్న 10 మంది, మినీ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో నర్సీపట్నానికి చెందిన బాదంపూడి లక్ష్మి(65), కశింకోట మండలం తీడ గ్రామానికి చెందిన గొంది పెంటయ్య(56) మృతిచెందారు. మొత్తం 16 మంది గాయపడ్డారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనం బోల్తా పడి..అక్రమంగా సేకరించిన రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనం బోల్తాపడి ఒడిశాకు చెందిన ఓ కూలీ మృతిచెందాడు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో రేషన్ మాఫియా అక్రమంగా కొనుగోలు చేసిన 35 బస్తాల బియ్యాన్ని ఆదివారం అర్ధరాత్రి మినీ వ్యాన్‌లో పల్నాడు జిల్లా నాదెండ్ల మీదుగా చిలకలూరిపేటకు తరలిస్తున్నారు. నాదెండ్ల–తిమ్మాపురం రోడ్డులో జాలాది సుబ్బయ్యకుంట వద్ద వాహనం వెనుక టైరు పంక్చర్ కావడంతో రోడ్డుపై బోల్తాపడింది. వ్యాన్‌లో బియ్యం బస్తాలపై కూర్చున్న ఒడిశాకు చెందిన బఫూన్మాలిక్ (25) అనే కూలీ అక్కడికక్కడే మృతిచెందాడు. వ్యాన్‌లో ఉన్న ప్రభాస్ మాలిక్, భీమాసేన్ దాస్, డైతిరిమాలిక్ తీవ్రంగా, సర్వేశ్వర్ మాలిక్, బాజ్‌పాయ్ మాలిక్ స్వల్పంగా గాయపడ్డారు.ట్యాంకర్ ఢీకొని తండ్రీకొడుకుల కన్నుమూత తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చెంబడిపాలెం వద్ద సోమవారం ట్యాంకర్ ఢీకొని బైక్‌పై వెళుతున్న తండ్రీకొడుకులు మరణించారు. శ్రీకాళహస్తి వీఎం పల్లికి చెందిన సుబ్రహ్మణ్యం(31) తన కుమారుడు రూపేష్(9)తో కలిసి బైక్‌పై నాయుడుపేట నుంచి శ్రీకాళహస్తికి రహదారిపై వ్యతిరేక మార్గంలో వెళుతున్నాడు. వారిని చెంబడిపాలెం వద్ద ఎదురుగా వస్తున్న ట్యాంకర్ లారీ ఢీకొంది. సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతిచెందగా, అపస్మారక స్థితిలో ఉన్న రూపేష్‌ను చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు.స్నేహితుడి పెళ్లికి వెళ్లి వస్తూ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృత్యువాత చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలోని నెత్తం కండ్రిగ వద్ద సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖాజా మొహిద్దీన్ (26) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతిచెందాడు. తిరుపతి బైరాగిపట్టెడకు చెందిన ఖాజా మొహిద్దీన్ బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతను మిత్రులతో కలిసి బైక్‌పై ఆదివారం చెన్నైలో స్నేహితుడి వివాహ వేడుకలకు హాజరయ్యాడు. తిరిగి వస్తూ సోమవారం తెల్లవారుజామున నెత్తంకండ్రిగ వద్ద బైక్ అదుపు తప్పి బారికేడ్‌ను ఢీకొని కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఖాజా మొహిద్దీన్ను స్నేహితులు నగరి ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
ఏలూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
ఏలూరు: లింగపాలెం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జూబ్లీనగర్ దగ్గర భారతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో పదిమంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో 20మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏలూరు నుంచి చింతలపూడి మీదిగా హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జెసిబి సహాయంతో బోల్తా పడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బయటికి తీసిన అధికారులు. బస్సు బోల్తా పడిన సమయంలో బస్సుకింద పడి చనిపోయిన ప్రవీణ్ బాబు అనే యువకుడు. లింగాపాలెం మండలం అయ్యపురాజుగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు. ప్రవీణ్ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఎంప్లాయిగా పనిచేస్తున్నట్టు సమాచారం. -
‘రాష్ట్రంలోని దుర్మార్గాలకు ఆద్యుడు నారా లోకేష్’
సాక్షి,తాడేపల్లి: రాజ్యాంగ ప్రకారం ప్రజల హక్కులను కాపాడుతూ.. రాష్ట్రాన్ని, ప్రజలను రక్షించాల్సిన వ్యవస్థలు కరిమింగిన వెలగపండులా తయారయ్యాయని.. వైయస్సార్సీపీ స్టేటే కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు ద్వారా చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ వికృతరూపం బట్టబయలైందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే రాజకీయ వ్యవస్థ శూన్యమైందని.. కూటమి ప్రభుత్వం నేర స్వభావాన్నే రూల్ ఆఫ్ లా గా నడుపుతుందని మండిపడ్డారు. రెండేళ్లలోనే ఇంతటి దారుణమైన పాలన ఉంటే... రానున్న మూడేళ్లలో మరింత వికృతంగా, విచ్చలవిడిగా తయారయ్యే ప్రమాదముందని.. సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు, మీడియా వీటిని అధ్యయనం చేసి.. జరుగుతున్న దారుణాలను ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...రాష్ట్రంలో ప్రభుత్వం శూన్యం..2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి ప్రభుత్వం అన్నమాటకు నిర్వచనమే మారిపోయింది. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం మెజారిటీ ప్రజల కోరికలు, ఆకాంక్షలన్నింటికీ ఫలానా పార్టీ పరిష్కరిస్తుందని ఎన్నుకుంటారు. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది ఒక భాగం అయితే రెండోది.. పరిపాలన. పాలనా పరమైన విధులన్నీ అధికారులు చేస్తున్నప్పుడు .. ప్రభుత్వం అవసరం ఎందుకంటే అది ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది. మేనిఫెస్టోను అమలు చేస్తుంది. అదే ప్రజాస్వామ్యం. అది ఏ మేరకు నెరవేరుతుందన్నది వేరే విషయం. అలా అడ్మినిస్ట్రేషన్ విభాగం ఒక పద్దతి ప్రకారం నడవడానికి అవసరమైన మార్గదర్శకం ఇచ్చి నడిపే ఒక రాజకీయ వ్యవస్థ ఉంటుంది అనుకుంటే.. అది 2024 జూన్ తర్వాత ఈ రాష్ట్రంలో శూన్యం అయింది. పాలన గాలికొదిలేయడమో, లేక చేతకాని తనంతో చేయలేకపోవడమన్నది ఒక రకం. కానీ ప్రభుత్వమే నేరస్వభావంతో దాన్నే రూల్ ఆఫ్ లా గా కార్యనిర్వహణలోకి తీసుకొస్తే... అది 2024 జూన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లా ఉంటుంది. ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్లే దాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆ నేరస్వభావాన్నే ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తూ.. బ్యూరోక్రాట్స్ లో అలాంటి వాళ్లను దగ్గరకు తీసుకుంటున్నారు. కానివాళ్లను మెడలు వంచడమే, దూరం పెట్టడమే చేస్తుండడంతో వాళ్లు కూడా గత్యంతం లేక అదే దారిలో పయనిస్తున్నారు. ఇలా ఈ ఏడాది కాలంలో వ్యవస్థలను తమ నేర స్వభావాలకు అనుకూలంగా... తాము చేసే తప్పులకు ప్రొటెక్ట్ చేసేదిలా మార్చివేస్తున్నారు.టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ...మాజీ మంత్రి, వెనుకబడిన వర్గాలకు చెందిన బలమైన నాయకుడిగా ఎదిగిన జోగి రమేష్ ను ఏ తప్పు చేయకుండా అక్రమంగా అరెస్టు చేశారు. ఈ కేసు చూస్తే... నేరం జరుగుతున్న మొలకల చెరువు, ఇబ్రహీం పట్నం, అనకాపల్లి, ఏలూరులో నకిలీ మద్యం తయారీ చేస్తున్న చోట పోలీసులు పట్టుకున్నారు. నిన్నా, మొన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చుంటే.. ఈ నకిలీ మద్యం వ్యవహారంలో మా పాత్ర లేదు అని చెప్పడానికి అవకాశం ఉండేది. కానీ సాక్షాత్తూ చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ 2024 అభ్యర్ధి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న నకిలీ లిక్కర్ తయారీ ఫ్యాక్టరీ బయటపడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రెండేళ్లు అవుతుంది. ఒకవైపు వైయస్సార్సీపీ నాయకుల తప్పు లేకపోయినా... వారిని అరెస్టులు చేస్తుంటే... రెండేళ్లుగా నకిలీ లిక్కర్ తయారీ మొత్తాన్ని వైయస్సార్సీపీ నేత జోగి రమేష్ ఉన్నాడంటూ అరెస్టు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు మీద తప్పుడు కేసులు పెట్టడంతో మొదలై... వైయస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూడా పెద్ద సంఖ్యలో అరెస్టు చేస్తూ.. తప్పుడు స్టేట్ మెంట్లతో వేరేవాళ్లను అరెస్టు చేసి నెలల తరబడి జైల్లో ఉంచారు.ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్సీపీ నేతలపై కేసులు..పల్నాడు వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కూడా తప్పుడు కేసులు నమోదు చేసారు. స్ధానిక టీడీపీ నాయకులు వాళ్ల మధ్య అంతర్గత కలహాలతో గొడవపడి జంట హత్యలు జరిగితే... దాని మీద ఎస్పీ కూడా ఇది టీడీపీ అంతర్గత విభేదాల వల్లే అని ప్రకటన ఇచ్చినా, ఘటనా స్ధలంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వాహనంతో సహా పలు ఆధారాలున్నా.. వైయస్సార్సీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను జైల్లో పెట్టారు.ఇటీవల సోషల్ మీడియా యాక్టవిస్టు సవీంద్ర రెడ్డిను ఏదో పోస్టు పెట్టారని అరెస్టు చేసి.. కన్ఫషన్ కింద వేరకొటి నమోదు చేసి.. అదీ సరిపోదనుకుని ఏకంగా గంజాయి ప్యాకెట్ పెట్టి కేసు నమోదు చేశారు. అయితే అదృష్టవశాత్తూ అరెస్టు చేసిన టైమింగ్ ఆధారాలు, పోలీసులు చెప్పిన విషయాలు సరిపోలకపోవడంతో హైకోర్టు సీబీఐకి రిఫర్ చేయడంతో ఆయన బైటపడ్డాడు. అదే కేసులు మరికొంత యువకులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు.టీడీపీ నేతల తప్పులనూ వైఎస్సార్సీపీకి అంటగట్టే దుర్మార్గం..ఇక తునిలో మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యంలో ఈ ఘాటుకానికి పాల్పడింది కూడా టీడీపీ నేతే. టీడీపీ నేతను పట్టుకుంటే... రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘాతుకంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత, ఆందోళన రావడంతో ఉలిక్కపడ్డ ప్రభుత్వం, పోలీసులు కస్టడీలో ఉన్న వ్యక్తి చెరువులో దూకి చనిపోయాడని పోలీసులు చెప్పారు. మరుసటి రోజు లైంగిక అకృత్యానికి పాల్పడ్డ వ్యక్తి కుమారుడు తన తండ్రి మరణంపై అనుమానం ఉందని కేసు పెట్టాడు. మరోవైపు మైనర్ బాలికపై లైంగిక అఘాయిత్యానికి పాల్డడ్డ వ్యక్తిని వీడియో తీసి... బాలిక చదువుతున్న స్కూల్ కి పంపిస్తే... దానికి అతనిపై చనిపోయిన వ్యక్తి కుమారుడు చేత ఫిర్యాదు తీసుకుని ఫోక్సో కేసు నమోదు చేశారు. అందులో అదర్స్ అని రాయడం ద్వారా వైయస్సార్సీపీ నేతలను అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేరం చేసిన వాళ్లకు సంబంధించి అనుమానాస్పదంగా చనిపోయాడని చెబుతూ... నిందితుల తరపున ఎందుకు వకాల్తా తీసుకున్నారు. వీరికి ప్రభుత్వ అండదండలు పూర్తిగా ఉన్నాయి. జోగి రమేష్ అరెస్టులో కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. నకిలీ లిక్కర్ వ్యవహారంలో టీడీపీ నేతలే ఉన్నారు.. ఆధారాలు సైతం అక్కడే ఉంటే... ఇక్కడ విజయవాడలో జోగి రమేష్ ను అరెస్టు చేస్తున్నారు. తప్పుడు కేసు పెట్టడానికి కూడా జనం నమ్ముతారా ? కోర్టులో నిలబడుతుందా? అన్నది ఆలోచించడం లేదు. ఇవాల్టికి అరెస్టు చేసి.. రెండు మూడు నెలలు జైల్లో వేస్తే.. మిగిలిన విషయాలు తర్వాత చూసుకోవచ్చు అని భావిస్తున్నారు. నకిలీ లిక్కర్ కేసులో అసలు సూత్రధారి జయచంద్రా రెడ్డి, అతనే ఫ్యాక్టరీ పెట్టాడు, అతనికి సంబంధించిన బార్లలో నకిలీ లిక్కర్ అమ్మకాలు చేస్తున్నాడని పోలీసులే చెప్పారు. అతను సాక్షాత్తూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి, కానీ వారి అరెస్టులు మాత్రం ఉండవు.నకిలీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న జయచంద్రా రెడ్డికి చంద్రబాబు బీఫామ్ ఇస్తున్న దృశ్యం చూస్తే.. జనరల్ గా బీపామ్ తీసుకున్నప్పుడు పక్కనే కుటుంబ సభ్యులు ఉంటారు. కానీ జయచంద్రారెడ్డి పక్కనే ఆయన ఆత్మలా జనార్ధనరావు పక్కనే ఉన్నాడు. ఇది పక్కన పెట్టి.. ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం జోగి రమేష్ తో ఏదో పెళ్లిలో జనావర్ధన రావు ఫోటో దిగితే దాన్ని ఆధారంగా చూపిస్తున్నారు. ఇక్కడ చంద్రబాబుతో బీపామ్ తీసుకుంటున్న జయచంద్రా రెడ్డి, పక్కనే జనార్ధన రావు ఉంటే దాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు. వీళ్లద్దరూ ఆఫ్రికాలో వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. వాస్తవానికి నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ వ్యవహారం బయటపడ్డంతోనే రాష్ట్రంలో ఒక దుమారం చెలరేగింది. మద్యం సేవించే వారిలోనూ ఒక భయం మొదలైంది. దీన్ని డైవర్షన్ చేయడానికి.. సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవడం అలవాటైన చంద్రబాబు... తక్షణమే నకిలీ మద్యం వ్యవహారాన్ని జోగి రమేష్ వైపు తిప్పాడు. జోగి రమేష్ , వైయస్సార్సీపీకి దెబ్బ కొట్టడంతో పాటు, తన పార్టీ నేతలైన జయచంద్రారెడ్డి ఇతరులను కాపాడే ప్రయత్నం చేశాడు. ఇక ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఆఫ్రికాలో ఉన్న జనార్ధన రావుతో ముందే మాట్లాడుకుని అతడ్ని ఇండియాకు తీసుకొచ్చారు. ఎయిర్ పోర్టులో జనార్ధరావు చొక్కా, పోలీసుల కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఆయన పేరు మీద విడుదల చేసిన వీడియోలో చొక్కా రెండూ ఒకటే. ఇదెలా సాధ్యం. మరో కీలకమైన విషయం జనార్ధన రావు ఫోన్ దొరికితే అందులో జయచంద్రా రెడ్డితో పాటు టీడీపీ నేతల వివరాలు, వారి లావాదేవీలు బయటపడతాయి కాబట్టి ముంబాయిలో పోన్ పోయిందని చెప్పారు. ఆ తర్వాత జనార్ధన రావు ఒక వీడియో విడుదల చేశాడు. ఇది ఎలా అతుకుతుంది.ఆగని నకిలీ లిక్కర్ తయారీ...లిక్కర్ బాటిల్లు చూసి కొనండి.. క్యూ ఆర్ కోడ్ అమలు చేస్తున్నాం అని ప్రభుత్వం ప్రకటించింది. అంటే నకిలీ లిక్కర్ తయారిని ప్రభుత్వం అంగీకరించింది. వైన్ షాపులలో క్యూ ఆర్ కోడ్ పెడతారు సరే.. బెల్టు షాపులలో ఏం క్యూఆర్ కోడ్ ఉంటుంది. అక్కడెలా నకిలీ లిక్కర్ ని నియంత్రిస్తారు. రాష్ట్రంలో లక్షకు పైగా బెల్టు షాపులున్నాయి. వీటి ద్వారా ఈ నకిలీ మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారు. ఇవి కాక వైన్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూములకు అనుమతి ఇచ్చారు. అక్కడ లూజ్ సేల్ ఉంటుంది. అంటే అక్కడ కూడా నకిలీ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సోడా మిషన్లు మాదిరిగా కూటమి పాలనలో నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. దానికి సాక్ష్యం బెల్టు షాపుల్లో జరుగుతున్న అమ్మకాలే. ప్రభుత్వానికి అంతంత మాత్రం ఆదాయం పెరిగింది. లిక్కర్ అమ్మకాలు మాత్రం విపరీతంగా పెరిగాయి. ఇదే నిదర్శనం. జోగి రమేష్ అరెస్టు అత్యంత దుర్మార్గం, అన్యాయం. నియంతల పాలనలో కూడా లేనంతగా వ్యవస్దలను కూటమి ప్రభుత్వం కంట్రోల్ చేసి... హిట్లర్ కంటే దారుణంగా పాలన సాగిస్తున్నాడు. రెడ్ బుక్ పేరుతో లోకేష్ ఈ దారుణాలన్నీ కొనసాగిస్తున్నాడు.తప్పులు నిలదీస్తే కేసులు - నారా వారి రూల్ ఆఫ్ లా...కేవలం తమ స్వప్రయోజనాల కోసం రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా, పూర్తి స్పృహతోనే, క్రూరమైన, అణిచివేత ధోరణితో కూడిన పాలన సాగిస్తున్నారు. ప్రత్యర్థుల వాయిస్, ప్రజల ఆకాంక్షలు బయటకు వినిపించకుండా గొంతు నొక్కడంతో పాటు వీరి చేస్తున్న దుర్మార్గాలను ఎదుట వాళ్ల మీద నెట్టడంలో వీళ్లు సిద్ధహిద్దులు. లోకేష్ వీటన్నింటికీ ఆద్యుడు. ముందు అరెస్టు చేసి.. సెల్ఫ్ కన్ఫెషన్ పేరుతో వారే స్టేట్ మెంట్లు తయారు చేస్తున్నారు. కోర్టుల్లో నిలబడినా, లేకున్నా ముందుగా జైల్లో పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వంలో ఏ కేసు తీసుకున్నా మూడు అంశాల మీదే నడుస్తుంది. తామనుకున్న వారిని అరెస్టు చేయడం, వారి పేరు మీద స్టేట్మెంట్ రాసుకోవడం, ఎవరి మీద వాళ్లకు కోపం ఉంటే.. వాళ్ల స్ధాయిలను బట్టి వారి పేర్లు కూడా కేసులో చేర్చడం పనిగా మారింది. ఇలా నెలల తరబడి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇది నారా వారి కొత్త రూల్ ఆఫ్ లా. కన్ఫెషన్ పేరుతో అరెస్టు చేయడం, తమకు నచ్చిన సెక్షన్లతో కేసు నమోదు చేయడం అలవాటుగా మారింది. అరెస్టు చేసిన తర్వాత వాళ్ల ఇంట్లో సోదాలు చేసి... అక్కడ పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్ లు చూపిస్తున్నారు. అవి అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. తమకు కావాల్సిన అధారాలను వీళ్లే అక్కడ పెట్టి.. వాటినే కోర్టులో ఎవిడెన్స్ గా పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి.నిష్పాక్షపాతంగా దర్యాపు చేయడానికి ఇన్వెస్టిగేషన్ అధికారికి చట్టానికి లోబడి ఇచ్చిన వెసులుబాటును పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. కోర్టులు కూడా ఆమాత్రం వెసులు బాటు ఇవ్వకపోతే దర్యాప్తు ఎలా ముగుస్తుందని అనుకుంటున్న పరిస్థితి. దానివల్ల నేరం చేయకుండా కూడా అధికారంలోకి ఉన్నవాడికి నచ్చకపోతే శిక్షకు గురవుతావన్నది రుజువు అవుతుంది. శిక్ష కరారు కాకముందే.. నిందితుడు 50 రోజులో, 60 రోజులో... ఏ నేరం చేయకున్నా, ఆధారాలు లేకున్నా అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు. ఈ కేసులో నిజానికి ఇంకా రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న నకిలీ లిక్కర్ తయారీ జరుగుతున్న మాట వాస్తవం. ప్రభుత్వం కూడా దాన్ని అంగీకరిస్తుంది కాబట్టే... లిక్కర్ షాపులలో మద్యం బ్యాటిళ్లకు క్యూ ఆర్ కోడ్ పెట్టింది. దీన్ని అందరూ గమనించాలి.ప్రజా రక్షణ పట్టని ప్రభుత్వమిదికాశీబుగ్గ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ప్రమాదం అంటేనే అకస్మాత్తుగా జరుగుతుంది. ఎవరూ ప్రమాదాలు జరుగుతాయని ముందే ఊహించరు. కానీ ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు అక్కడ ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత పోలీసులదే. కాశీబుగ్గ ఘటన జరిగిన వెంటనే అధికార తెలుగుదేశం పార్టీ మంత్రులు మాకు సంబంధం లేదు.. అది ప్రైవేటు దేవాలయం అని ప్రకటించారు. ఘోరం జరిగిన వెంటనే అది మాది కాదు అన్నారంటే.... తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టే. సిగ్గున్న ప్రభుత్వం ఇలా చేస్తుందా? ఏ మాత్రం బాధ్యత తీసుకోవాలనుకునే ప్రభుత్వం ఇలా చేస్తుందా? ప్రభుత్వాన్ని ఎందుకు తప్పుపడుతున్నారంటే.. తిరుపతిలో తొక్కిసలాట జరిగింది, సింహాచలంలో ప్రమాదం జరిగింది ఆ తర్వాత కూడా ఈ ప్రభుత్వం అప్రమత్తం కాలేదు. కారణం మీ ప్రాధాన్యాతలు వేరు. బాథ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ప్రభుత్వం భావించడం లేదు. వ్యవస్ధలో పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా... దాన్నుంచి తప్పించుకోవడంతో పాటు పక్కవారిమీదకు నెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఆలయ ధర్మకర్త తాను ముందురోజే పోలీసులకు సమాచారం ఇచ్చానని చెప్పారు. ఒకవేళ చెప్పకపోయినా.. రెండేళ్ల నుంచి నిర్వహణలో ఉన్న ఆలయంలో పవిత్ర దినం రోజున భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారన్న విషయం తెలియదా? పలాస లాంటి పట్టణంలో ఒకే దగ్గర అంత పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటే నాకు తెలియదని ఎలా తప్పించుకుంటారు ? చంద్రబాబు తనకు అనుకూలంగా ఉన్న ప్రచార సాధనాల బలం తలకెక్కడంతో దేన్నీ పట్టించుకోవడం లేదు. ఏం జరిగినా ఎదుట వాళ్లదే తప్పు అని చెప్పడం పరిపాటిగా మారింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయడమో.. సంబంధిత అధికారులను బాధ్యులను చేయకుండా... విచారణ చేయకుండానే, అసలేం జరగలేదని ముందే చెబితే ఇది ఏ రకమైన పాలన? ఎక్కడైనా సమస్య వచ్చినా పోలీసులో, అధికారులో చూసుకుంటారు, వారికి ఆ మేరకు అవగాహన ఉంటుందని ప్రజలు భావిస్తారు. ధైర్యంగా ఉంటారు. అలా ఉండే వారిని కూడా ప్రభుత్వం నీరుగార్చుతుంటే... ఇలాంటి పాలనే ఉంటుంది.రెండేళ్లలోనే రాష్ట్రంలో ఇంతటి దారుణంగా ఉంటే రానున్న మూడేళ్లలో మరింత వికృతంగా, విచ్చలవిడిగా తయారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో జరుగుతున్న దారుణాలను మీడియా, సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు స్టడీ చేసి ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉందని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వమే తప్పు చేసి ఎదుట వారి మీద కేసులు పెట్టి.. ఆ తప్పును కొనసాగించడం మరింత దారుణమని మండిపడ్డారు -
అకస్మాత్తుగా జోగి రమేష్ జైలు మార్పు..
జోగి రమేష్ అరెస్ట్.. అప్డేట్స్విజయవాడ:కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నిన్న( ఆదివారం, నవంబర్ 2 వతేదీ) నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్టు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో ఆయన్ను అరెస్టు చేశారు. ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తున్నారుజోగి రమేష్ అరెస్టును ఖండించిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ నేతలుమాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గరికిపాటి శ్రీదేవి, జిల్లా అధికార ప్రతినిధి గుంజ శ్రీనివాస్, మైలవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేతలుఎటువంటి ఆధారాలు లేకుండా జోగి రమేష్ పై అక్రమ కేసులు పెట్టారుఇది ప్రభుత్వ పైశాచిక ఆనందంజోగి రమేష్ ను అరెస్ట్ చేసి ప్రశ్నించే గొంతు నొక్కాలని చూస్తున్నారు.మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై కూడా కేసులు పెడుతున్నారు.. ఇది దుర్మార్గ పాలన కాదా?ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి వేల మంది వైఎస్సార్సీపీ సైనికుల గొంతుకలు సిద్ధంగా ఉన్నాయి.నెల్లూరు జైలుకు జోగి రమేష్జైలు మార్పుతో జోగి రమేష్ కుటుంబ సభ్యుల్లో ఆందోళనవిజయవాడ నుంచి ఆకస్మాత్తుగా నెల్లూరు తరలింపునెల్లూరు జైలుకు జోగి రమేష్.. ఆయన సోదరుడు జోగి రాముజోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు.జోగి రమేష్ భార్య, కుమారులపై కేసు నమోదు చేసింది. జోగి రమేష్ అరెస్ట్ సమయంలో వైద్య పరీక్షలకు వచ్చినపుడు జీజీహెచ్‌లో దౌర్జన్యం చేసి అద్దాలు పగులకొట్టినట్టు ఫిర్యాదు మాచవరం పోలీసులకు డ్యూటీ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఫిర్యాదుగుణదల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా శ్రీనివాసరావు విధులు శ్రీనివాసరావు ఫిర్యాదుతో మాచవరం పోలీసులు కేసు నమోదు ఏ1 గా జోగి రమేష్ భార్య శకుంతల దేవి , ఏ2 గా జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజీవ్ , ఏ3గా జోగి రమేష్ చిన్న కుమారుడు రోహిత్‌లపై కేసు నమోదు నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఆదివారం(నవంబర్ 2వ తేదీ) ఉదయం అక్రమంగా అరెస్టు చేసింది. కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా అద్దేపల్లె జనార్దనరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్‌ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ , ఆయన సోదరుడు జోగి రాము నివాసాల వద్దకు ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు సిట్, ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు చేరుకున్నారు.జోగి రమేష్ ఇంట్లో ఉండటంతో తలుపులు తోసుకొని లోపలికి ప్రవేశించే యత్నం చేశారు. మూడున్నర గంటలపాటు హడావుడి చేశారు. ఉదయం 8గంటలకు జోగి రమేష్ బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. -
బాబు సర్కార్ ప్లాన్ అదేనా?
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం కేసులో సిట్ రిమాండ్ రిపోర్ట్‌లో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్ట్ చేసినట్లు తేటతెల్లమైంది. ఈ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారు ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) అధికారులు. నకిలీ మద్యం కేసులో దర్యాప్తు కంటే.. అక్రమ అరెస్టులపైనే సిట్ శ్రద్ధ పెట్టినట్లు జోగి రమేష్ వ్యవహారంతో స్పష్టమవుతోంది. నాటకీయ పరిణామాల నడుమ ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టారు అధికారులు. ఆ సమయంలోనూ ఈ కేసు ప్రధాన నిందితుడు(ఏ1) అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పిన కట్టుకథనే సిట్ వల్లేవేయడం గమనార్హం. అలాగే రిమాండ్ రిపోర్టులో జనార్దన్‌తో నమోదు చేయించిన వాంగ్మూలాన్నే వినిపించిన అధికారులు.. రమేష్‌కు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. జనార్దన్‌రావు-జోగి రమేష్‌కు మధ్య జరిగిన లావాదేవీలను సైతం నిరూపించలేక చతికిపలడ్డారు. జనార్దన్ పోయిందని చెబుతున్న ఫోన్ తాలుకా స్క్రీన్ షాట్లనే మళ్లీ ప్రస్తావనకు తెచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన టీడీపీ నేత జయచంద్రారెడ్డిపై ఇంతదాకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అలాగే నకిలీ మద్యం అమ్మకాలు జరిపిన శ్రీనివాస వైన్స్ ఓనర్ మహంకాళి పూర్ణ చంద్ర రావుపై ఇప్పటిదాకా కేసు నమోదు చేయలేదు కూడా. అంతేకాదు ఫేక్ లిక్కర్ డైరీలో పలువురు బడా నేతలు పేర్లున్నాయని దర్యాప్తు తొలినాళ్లలో ప్రకటించిన సిట్.. ఇప్పుడు గమ్మున ఉండిపోవడమూ పలు అనుమానాలను తావిస్తోంది. దీంతో.. సీఎం చంద్రబాబు డైరెక్షన్‌తోనే టీడీపీ నాయకులని తప్పించేందుకు అధికారులు నకిలీ మద్యం కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోందని వైఎస్సార్సీపీ అంటోంది. పదిరోజుల రిమాండ్నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పేరును ఏ-18 గా, ఆయన సోదరుడు జోగి రామును ఏ-19 గా ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. ఆరవ ఏజెఎంఎఫ్‌సీ న్యాయస్థానం ఈ ఇద్దరికీ 10రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది . దీంతో ఇరువురిని విజయవాడ సబ్‌జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ జోగి రమేష్ వేసిన పిటిషన్ మంగళవారం(రేపు, నవంబర్ 12) విచారణ జరగాల్సి ఉంది. ఈలోపే ఆయన్ని అరెస్ట్ చేయడం గమనార్హం. ఇదీ చదవండి: దుర్గమ్మ చెంత సత్యప్రమాణం.. బాబు, లోకేష్‌కు ఆ దమ్ముందా? -
ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: సీఎంఎస్3 ఉపగ్రహంతో కూడిన ఎల్వీఎం3–ఎం5 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శాస్త్రవేత్తలకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దేశ అంతరిక్ష విజయాల్లో ఇదొక మైలురాయి అని కొనియాడారు.ఈ ప్రయోగం భారతదేశ అంతరిక్ష సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. అలాగే రాబోయే దశాబ్దాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీకి భరోసా కల్పిస్తుందని వైఎస్ జగన్ ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
పచ్చ మాఫియా దందా.. అందుకే ‘సిట్’ అండ!
సాక్షి, అమరావతి: టీడీపీ పెద్దలే సూత్రధారులు, పాత్రధారులుగా సాగుతున్న నకిలీ మద్యం మాఫియాకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఐదేళ్లలో రూ.45 వేల కోట్లు కొల్లగొట్టే పన్నాగానికి పాల్పడిన ఈ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు కుతంత్రం పన్నింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్‌ను బేఖాతరు చేస్తూ టీడీపీ వీర విధేయ అధికారులతో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్)ను రంగంలోకి దించింది. డైవర్షన్ డ్రామాలో భాగంగానే వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్, ఆయన సోదరుడు రాములను ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా అరెస్టు చేసింది. ప్రజల్ని, న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు కూటమి ప్రభుత్వం బరితెగించి కుట్రకు పాల్పడింది.రాష్ట్రంలో బట్టబయలైన నకిలీ మద్యం మాఫియా వెనుక అసలు సూత్రధారులు టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలే అన్నది ఆధారాలతో సహా బట్టబయలైంది. కుటీర పరిశ్రమ తరహాలో ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం తయారీ యూనిట్లు నెలకొల్పడం, దర్జాగా సరఫరా, విక్రయాల వెనుక ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయి. ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల దోపిడీకి 2024 ఎన్నికలకు ముందే పక్కా పన్నాగం పన్నారు. అందుకే మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, శంకర్ యాదవ్‌లను కాదని 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లె టీడీపీ టికెట్‌ను జయచంద్రారెడ్డికి ఇచ్చారు. నకిలీ మద్యం మాఫియాలో ఆయనే కీలక పాత్రధారి కావడం గమనార్హం. ఇక జంట హత్యల కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న టీడీపీ నేత సురేంద్ర నాయుడుకు గతంలో 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్షమాభిక్ష ప్రసాదించింది. ఆయన ద్వారానే జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ లభించిందన్నది బహిరంగ రహస్యం. ఆ ముగ్గురూ టీడీపీ ముఖ్యులకు సన్నిహితులునకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దనరావు ఈ మాఫియాలో క్రియాశీల పాత్రధారి. జయచంద్రారెడ్డి టీడీపీలో చేరినప్పుడు, పార్టీ బీ.ఫారం ఇచ్చినప్పుడు ఆయన కూడా ఉన్నారు. బీ.ఫారం స్వీకరించేటప్పుడు సాధారణంగా అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. కాగా జయచంద్రారెడ్డికి టీడీపీ బీఫాం ఇస్తున్నప్పుడు జనార్దనరావు పక్కనే ఉండటం చూస్తుంటే ఆయన వారికి ఎంతటి సన్నిహితుడన్నది స్పష్టమవుతోంది. నకిలీ మద్యం మాఫియాలో ప్రధాన పాత్రధారులైన జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు, జనార్దన రావులు టీడీపీ అధిష్టానానికి అత్యంత సన్నిహితులన్నది ఫొటో, వీడియో ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది.అన్నమయ్య జిల్లా ములకలచెరువులో బయట పడిన నకిలీ మద్యం మాఫియా వేర్లు రాష్ట్రం అంతటా విస్తరించాయి. టీడీపీ సీనియర్ నేతలు ప్రాంతాల వారీగా నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ మద్యం సిండికేట్ ద్వారానే నకిలీ మద్యాన్ని దర్జాగా మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్‌లు, బెల్ట్ దుకాణాలు, బార్లలో విక్రయిస్తున్నారని వెల్లడవ్వడంతో ప్రభుత్వ పెద్దల బండారం బట్టబయలైంది. దాంతో బెంబేలెత్తిన ముఖ్య నేత తనకు అలవాటైన రీతిలో ఈ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ కుట్రకు పాల్పడ్డారు. ఏ1 జనార్దన్‌రావుతో డైవర్షన్ వీడియో ముఖ్యనేత పొలిటికల్ ఫాంటసీ కథతో డైవర్షన్ డ్రామాకు తెరతీశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న అద్దేపల్లి జనార్దనరావుతో కుట్ర కథ నడిపించారు. ముఖ్యనేత అభయం ఇవ్వడంతోనే విదేశాల్లో ఉన్న ఆయన దర్జాగా గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్æ చెబితేనే తాను నకిలీ మద్యం దందాకు పాల్పడినట్టు అవాస్తవాలు, అభూత కల్పనలు మేళవించి కట్టు కథ వినిపించారు. ఆ వీడియో ఎల్లో మీడియాలో మొదట ప్రసారం కావడం గమనార్హం. జోగి రమేష్æ పేరు చెప్పాలని కెమెరా వెనుక నుంచి ఓ అధికారి ఆయనకు ఆదేశిస్తున్న మాటలు కూడా ఆ వీడియో రికార్డింగ్‌లో వినిపించడంతో ప్రభుత్వ కుట్ర బయట పడింది.అసలు అప్పటికే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ ఖైదీగా జైలుకు తరలించిన నిందితుడు మీడియాతో ఎలా మాట్లాడారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఆ వీడియోలో జనార్దనరావు నకిలీ మద్యం దందాలో ప్రధాన పాత్రధారిగా ఉన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డి గురించి గానీ, అప్పటికే అరెస్టు అయిన సురేంద్రనాయుడు గురించి గానీ చెప్పనే లేదు. తద్వారా ప్రభుత్వ పెద్దల కుట్రకు పోలీసులు సహకరించినట్టు స్పష్టమవుతోంది. సీబీఐ వద్దు.. పచ్చ సిట్టే ముద్దునకిలీ మద్యం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైఎస్సార్సీపీ నేతలు, నిపుణుల డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని జోగి రమేష్æ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతోపాటు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కానీ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు కోసం టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్‌ను నియమించడం గమనార్హం. సీబీఐ దర్యాప్తు చేస్తే నకిలీ మద్యం దందా సూత్రధారులుగా ఉన్న తమ బండారం బయటపడుతుందన్నదే ప్రభుత్వ పెద్దల ఆందోళన అన్నది సుస్పష్టం. టీడీపీ పెద్దల దందాకు సిట్ రక్షా కవచం⇒ కీలక పాత్రధారి జయచంద్రారెడ్డి ఎక్కడ?⇒డిస్టిలరీల ప్రతినిధులను ఎందుకు ప్రశ్నించరు?ముఖ్య నేత ఆదేశాలతోనే సిట్ ఈ కేసు దర్యాప్తును పక్కదారి పట్టిస్తోంది. నకిలీ మద్యం మాఫియాకు సూత్రధారులు, పాత్రధారులుగా ఉన్న టీడీపీ నేతలను కనీసం ప్రశ్నించేందుకు కూడా సిట్ అధికారులు యత్నించక పోవడమే అందుకు నిదర్శనం. ములకలచెరువులో బయట పడిన నకిలీ మద్యం దందా వెనుక ప్రధాన పాత్రధారి టీడీపీ నేత జయచంద్రారెడ్డి విదేశాల్లో ఉన్నారు. ఆయన్ను దేశానికి రప్పించేందుకు సిట్ ప్రయత్నించడమే లేదు. ఆయనకు వ్యతిరేకంగా రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేయలేదు. ఇక నకిలీ మద్యం దందాకు నిధులు ఎవరు సమకూర్చారన్నది ఆరా తీయడమే లేదు. ప్రధానంగా నకిలీ మద్యం తయారీ కోసం స్పిరిట్‌ను అక్రమంగా ఎలా కొనుగోలు చేస్తున్నారనే విషయంపై దృష్టి పెట్టనే లేదు.ఎందుకంటే టీడీపీ కీలక నేతల కుటుంబాలు నిర్వహిస్తున్న మద్యం డిస్టిలరీల ముసుగులోనే స్పిరిట్‌ను కొనుగోలు చేస్తున్నందునేనని స్పష్టమవుతోంది. అందుకే ఆ మద్యం డిస్టిలరీల ప్రతినిధులను విచారించేందుకు సిట్ ససేమిరా అంటోంది. మద్యం డిస్టిలరీలలో సోదాలు నిర్వహించనే లేదు. ప్రాంతాల వారీగా నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు నిర్వహిస్తున్న టీడీపీ కీలక నేతల కుటుంబ సభ్యులను కూడా సిట్ ప్రశ్నించనే లేదు. అంటే నకిలీ మద్యం మాఫియా నిర్వహిస్తున్న టీడీపీ పెద్దలకు ‘సిట్’ రక్షా కవచంగా నిలుస్తోందన్నది సుస్పష్టం. ఇందులో భాగంగానే నకిలీ మద్యం కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్టు చేసింది.నకిలీ మద్యం తయారీకి అక్రమంగా స్పిరిట్ సరఫరా చేస్తున్న టీడీపీ నేతల డిస్టిలరీలలో సోదాలు చేయని సిట్ అధికారులు.. జోగి రమేష్æ నివాసంలో మాత్రం సోదాలు చేయడం గమనార్హం. నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు నిర్వహిస్తున్న టీడీపీ నేతల కుటుంబ సభ్యులను నిందితులుగా చేర్చని సిట్ అధికారులు.. జోగి రమేష్æ సోదరుడు జోగి రామును కూడా అక్రమంగా అరెస్టు చేయడం ప్రభుత్వ కుట్రకు తార్కాణం. -
ఒక్క ఆధారం ఉంటే ఒట్టు!
సాక్షి, అమరావతి: జోగి రమేష్‌కు వ్యతిరేకంగా సిట్ అధికారులు ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా రిమాండ్ నివేదికలో చూపించలేక పోయారు. వారు బెదిరించి జనార్దనరావుతో నమోదు చేయించిన అబద్దపు వాంగ్మూలం ఆధారంగానే న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. జోగి రమేష్, జనార్దనరావు మధ్య.. జోగి రమేష్, జయచంద్రారెడ్డిలమధ్య వ్యాపార లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఒక్క ఆధారం కూడా చూపలేదు. అదే సమయంలో జయచంద్రారెడ్డి, జనార్దనరావు మధ్య వ్యాపార సంబంధాలు ఉన్న విషయాన్ని ప్రస్తావించారు.జయచంద్రారెడ్డికి టీడీపీ అధిష్టానానికి మధ్య రాజకీయ బంధం, అనుబంధం ఉందని సిట్ అధికారులు పేర్కొన్నారు. మరి నకిలీ మద్యం మాఫియాలో పాత్రధారి అయిన జయచంద్రారెడ్డి వెనక సూత్రదారులుగా ఉన్న టీడీపీ పెద్దలపై విచారణ ఎందుకు చేపట్టలేదో సిట్ అధికారులకే తెలియాలి. ఈ రిమాండ్ నివేదికలో జోగి రమేష్ వాంగ్మూలం ఇచ్చినట్టు, ఆయన సంతకం చేసినట్టు సిట్ ప్రస్తావించక పోవడం గమనార్హం. అంటే సిట్ అధికారుల నిరాధార ప్రశ్నలతో కూడిన కుట్రను విచారణ సందర్భంగా ఆయన తిప్పికొట్టినట్టు స్పష్టమవుతుంది. అంతా కట్టుకథ అని తెలుస్తోంది.కాగా, జోగి రమేష్æ ఏ–18, జోగి రాము ఏ–19గా చూపించారు. ఈ కేసులో మరో నలుగురిని ఏ–20గా మనోజ్ కొఠారి, ఏ–21గా సుదర్శన్, ఏ–22గా సింథిల్, ఏ–23గా ప్రసాద్‌ను తాజాగా చేర్చారు. ఇప్పటి వరకు మొత్తం 23 మందిపై కేసు నమోదైంది. టీడీపీ పెద్దలే కర్త, కర్మ, క్రియగా సాగిన నకిలీ మద్యం మాఫియా కేసును పక్కదారి పట్టిస్తూ సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టును రూపొందించడం విస్మయ పరుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో జోగి రమేష్‌ను హాజరు పరిచిన నేపథ్యంలో సమర్పించిన రిమాండ్ నివేదిక ప్రభుత్వ కుట్రను స్పష్టం చేసింది. కేసులో వాదనలు అర్ధరాత్రి 1.30 గంటల వరకు కొనసాగుతూనే ఉన్నాయి.⇒ జయచంద్రారెడ్డి 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది టీడీపీయే. ఆయనకు మద్యం దుకాణాలు మంజూరైంది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం తయారుచేసి విక్రయించిందీ ఆ మద్యం దుకాణాల ద్వారానే. అంటే ఆయన రాజకీయ జీవితం, వ్యాపార వ్యవహారాలన్నీ టీడీపీతోనే ముడిపడ్డాయి. ఈ విషయాలన్నింటినీ సిట్ రిమాండ్ నివేదిలో పేర్కొంది. కానీ టీడీపీ నేత జయచంద్రారెడ్డి, ఆయన సన్నిహితుడు అద్దేపల్లి జనార్దనరావు ఈ నకిలీ మద్యం దందా అంతా వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ చెబితే చేశారట! వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా న్యాయస్థానాన్ని బురిడీ కొట్టించేందుకు ప్రభుత్వం ఇలా బరితెగించి సిట్‌తో కుతంత్రాలు చేయించింది. ⇒ ఈ కేసులో ఏ1గా అద్దేపల్లి జనార్దనరావును కేంద్రబిందువుగా చేసుకుని సిట్.. జోగి రమేష్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నిందని స్పష్టమవుతోంది. టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జి జయచంద్రారెడ్డి, జనార్దనరావు వ్యాపార భాగస్వాములు, సన్నిహితులని సిట్ చెబుతోంది. కానీ జనార్దనరావు.. జోగి రమేష్‌కు సన్నిహితుడని నమ్మించేందుకు సిట్ కట్టుకథలు అల్లింది. ⇒ జోగి రమేష్ చెబితేనే జనార్దనరావు నకిలీ మద్యం తయారీకి సిద్ధపడ్డారని సిట్ చెప్పడం విడ్డూరంగా ఉంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ చెబితే ఆయన ఎందుకు చేస్తారనే కనీస అవగాహన ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. వారిద్దరూ (జనార్దనరావు, జయచంద్రారెడ్డి) ఎన్నో ఏళ్లుగా ఆఫ్రికాలో ఇదే తరహా నకిలీ మద్యం వ్యాపారం నిర్వహించారని అదే నివేదికలో సిట్ పేర్కొంది. అటువంటి చరిత్ర ఉన్న జయచంద్రారెడ్డికి టీడీపీ ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందన్న విషయాన్ని సిట్ అధికారులు ఉద్దేశ పూర్వకంగానే పట్టించుకోలేదు. ఎందుకంటే రాష్ట్రంలో నకిలీ మద్యం దందాకు పాల్పడాలనే కుట్రతోనే ఆయనకు టీడీపీ టికెట్ ఇచ్చింది. అందుకే ఆ అంశాన్ని సిట్ రిమాండ్ రిపోర్ట్‌లో పొందుపర్చలేదు.నేను ఏ తప్పూ చేయలేదున్యాయమూర్తి ఎదుట జోగి రమేష్తాను ఏ తప్పు చేయలేదని, నకిలీ మద్యం వ్యవహారంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని జోగి రమేష్ న్యాయమూర్తి ఎదుట స్పష్టం చేశారు. పాత విషయాలను దృష్టిలో పెట్టుకుని తనపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని వాపోయారు. సీఎం చంద్రబాబు తనను ఈ కేసులో అక్రమంగా ఇరికించారని ఆవేదన వ్యక్తంచేశారు. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు చనిపోవడం, తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వం వైఫల్యం చెందడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు తనను అరెస్టు చేశారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రజలు గమనిస్తున్నారని, పైన దేవుడు కూడా చూస్తున్నాడన్నారు. -
జోగి రమేష్ అరెస్టు ముమ్మాటికీ అక్రమమే
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్టును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి.. దాని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ తమ పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారంటూ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్ అరెస్టు ముమ్మాటికీ అక్రమమేనని స్పష్టం చేశారు. బాబు డైవర్షన్ పాలిటిక్స్ హ్యాష్ ట్యాగ్‌తో ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ⇒ ‘చంద్రబాబు గారూ.. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగి రమేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ⇒ గత 18 నెలలుగా ప్రభుత్వం మీది.. పాలన మీది. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది. పట్టుబడ్డ వారిలో మీ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు.. మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే. ⇒ మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అమ్మేది మీరు తీసుకు వచ్చిన మీ ప్రైవేటు లిక్కర్ షాపుల్లో.. మీ కార్యకర్తలు, నాయకులు నడిపే బెల్టు షాపులు, పరి్మట్ రూముల్లోనే. మరి తయారీ మీది, చేసిన వారు మీ వారు, అమ్మేదీ మీ వారే.. కానీ బురదజల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మావాళ్లని. ⇒ నిన్న కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, మోంథా తుపాను కారణంగా కుదేలైన రైతుల గోడును పక్కదోవ పట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి, దుర్మార్గానికి ఒడిగట్టారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటి రోజే అరెస్టుకు దిగారంటే మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతోంది చంద్రబాబు గారూ.. నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబు గారూ? ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెబితే అది చేస్తుంది. మీరు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా? ఇలాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏమి ఆశించగలం!?. -
కర్షకుడిపై బాబు సర్కారు కర్కశం
ఏ పల్లెకెళ్లినా ఒకటే దృశ్యాలు.. ఏ రైతును కదిలించినా ఒకటే వేదన. వరి మొదలుకొని పత్తి వరకు..అరటి మొదలు బొప్పాయి వరకు ఏ పంట చూసినా మొలలోతు ముంపులో నానుతున్నాయి. వరికంకులు నేలనంటి కుళ్లిపోతున్నాయి. వరిచేలు జీవం లేని పచ్చిక బయళ్లు మాదిరిగా తయారయ్యాయి. పత్తి, మొక్కజొన్న, లంక గ్రామాల్లో సాగుచేసిన అరటి, బొప్పాయి, పసుపు తోటలు నేలకూలి రైతుల ఆశలను చిదిమేశాయి. రైతులు ఇంత కష్టంలో ఉంటే ఆదుకోవాల్సిన కూటమి సర్కారు వారిపై కనికరం, కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది. కర్కశంగా వారిని గాలికొదిలేసింది. పంట నష్టనమోదు మొక్కుబడిగా చేస్తోంది. ఇన్పుట్ సబ్సిడీ మంజూరును అటకెక్కించింది. ధాన్యం కొనుగోలుపై డ్రామాలు ఆడుతోంది. ఇప్పటికే ఉచిత పంటల బీమాకు ఎగనామం పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని ప్రతి రైతుకూ రూ.40వేలు చొప్పున ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.ఐదువేలు ఇచ్చి చేతులు దులుపుకుంది. తుపాను మిగిల్చిన తీరని నష్టంతో రైతులు తీవ్ర వేదనతో ఉంటే సీఎం చంద్రబాబు సతీమణితో కలిసి లండన్ టూర్‌కు వెళ్లడం, ఆయన తనయుడు నారా లోకేశ్ సతీమణితో కలిసి క్రికెట్ మ్యాచ్కంటూ ముంబై వెళ్లడంపై రాష్ట్ర రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. కనీస కనికరం, బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న కూటమి దుష్టపాలనపై ధ్వజమెత్తుతోంది.ఈయన పేరు వళ్లుం మురళీకృష్ణ. ఊరు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కాగుపూడి. ఈయనకు సొంతంగా రెండెకరాలుండగా, కౌలుకు మరో 8 ఎకరాలు తీసుకొని ఖరీఫ్‌లో స్వర్ణ రకం వరి సాగు చేశారు. ఎకరాకు రూ.40వేల వరకు పెట్టుబడి పెట్టారు. కౌలుతో కలుపుకుంటే ఎకరాకు రూ.60వేలకుపైగా ఖర్చయింది. ఆరుగాలం కంటిపాపలా సాకిన పంట ఏపుగా పెరిగింది. ఎకరాకు 40 బస్తాలు వస్తాయని ఆశపడ్డారు. కానీ మోంథా తుపాను అతని ఆశలను అంతమొందించింది. పంటను పూర్తిగా దెబ్బతీసింది. ఇప్పుడు రెల్లుపురుగు పంటను తినేస్తుంది. ఎకరాకు 25 బస్తాలకు మించి వచ్చే పరిస్థితి లేదు. దీనిని కోయడానికి ఎకరాకు రూ.15వేలు పెట్టుబడి పెట్టాలి. వచ్చినదంతా కౌలుకే పోతోంది. పెట్టుబడి కూడా రాకపోగా ఇంకా ఎకరాకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు నష్టం మిగులుతుందని మురళీ కృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుందో రాదో అనే అయోమయం నెలకొందని, బీమా కూడా చేయించుకోలేదని, పది ఎకరాలకు కలిపి తీవ్ర నష్టం వాటిల్లుతుందని కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఈయన పేరు యార్లపాటి సత్తిపండు.. ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన ఈ రైతు ఆరెకరాల 75 సెంట్లు కౌలుకు తీసుకొని పీఎల్ రకం వరి సాగు చేశారు. ఎకరాకు రూ.30వేలు పెట్టుబడి పెట్టారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, ధాన్యం షావుకారుల నుంచి నూటికి రూ.2, రూ.3 వడ్డీకి అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు. సర్కారు కౌలు కార్డు ఇవ్వలేదు.. పెట్టుబడి సాయం రాలేదు. తుపాను వల్ల కురిసిన వర్షంతో ధాన్యం గింజలు పొల్లు కింద రాలి పోతున్నాయి. ఊకైపోతున్నాయి. 25 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎకరాకు 16 బస్తాలు కౌలుకు ఇవ్వాలి. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటట్టు లేదు. దీంతో సత్తిపాండు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. (పంపాన వరప్రసాదరావు) ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి సాక్షి ప్రతినిధి : ఇప్పటికే ఏడాదిన్నరగా వరుస విపత్తులతో అల్లాడుతున్న రైతులపై ఇప్పుడు మోంథా తుపాను విరుచుకుపడి పంటలను పూర్తిగా తుడిచిపెట్టేసింది. వరి రైతుకు తీరని నష్టం మిగిల్చింది. ఎకరాకు 25 బస్తాలూ రాని దుస్థితి నెలకొంది. ఇప్పటికే భారీగా పెట్టిన పెట్టుబడులూ రాకపోగా, ఇప్పుడు తడిచిన పంట కోతకు మరింత చేతి చమురు వదిలించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దాదాపు అన్ని పంటలదీ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఫలసాయంపై రైతులు ఆశలు వదిలేసుకున్నారు. ప్రభుత్వ సాయమైనా వస్తుందేమోనని ఎదురు చూస్తున్నా.. ఆ దాఖలాలు కానరావడం లేదు. సర్కారు వారిపై కనీస కనికరం చూపడం లేదు. బాధ్యత లేకుండా కర్కశంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా ప్రకృతి ప్రకోపానికి బలైన రైతులు తమ ఇబ్బందులను ఏకరువు పెడుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు. కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు, ఉభయ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ ఏ జిల్లాకు వెళ్లినా క్షేత్రస్థాయిలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కర్షకుల కన్నీటి గాధలు గుండెలను పిండేస్తున్నాయి. అన్నదాతల దీనస్థితిని కళ్లకు కట్టే ప్రయత్నమే ఈ సాక్షి గ్రౌండ్ రిపోర్ట్.. కౌలురైతులకు కోలుకోలేని దెబ్బ గోదావరి, కృష్ణా డెల్టాలో వ్యవసాయం చేసే రైతుల్లో కౌలురైతులే అధికం. వరితో సహా ప్రధాన పంటలు సాగు చేసే రైతుల్లో నూటికి 70–80 శాతం మంది వారే. మోంథా తుపాను ప్రభావానికి వారికి అపార నష్టం వాటిల్లింది. కళ్లెదుటే పంట కుళ్లిపోతుంటే వారంతా కన్నీరు మున్నీరవుతున్నారు. గడిచిన ఏడాదిగా కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన కౌలు రైతులు తాజాగా తుపాను ప్రభావంతో కోలుకోలేని విధంగా నష్టపోయారు. వరి కౌలు రైతులు ఎకరాకు 16–20 బస్తాలు భూ యజమానికి ఇచ్చు కోవాల్సిందే. ఇతర వాణిజ్య పంటలకైతే ఎకరాకు ఏడాదికి రూ.40వేలు కిస్తీ కట్టాల్సిందే. ఏడాదిన్నరగా కౌలు కార్డుల్లేక.. పెట్టుబడి సాయం అందక, బ్యాంకుల నుంచి పంట రుణాలకు నోచుకోక అప్పుల సాగు చేస్తున్న వీరంతా వరుస విపత్తులతో కకావికలమవుతున్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, ధాన్యం షావుకారుల వద్ద రూ.2, రూ.3 వడ్డీలకు అప్పులు చేసి కష్టాల ఊబిలో కూరుకుపోయారు. ప్రతి కౌలు రైతుకూ రూ.3లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు అప్పులు ఉన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఎకరాకు 40 బస్తాలకు పైగా దిగుబడి వస్తుందని ఆశపడ్డారు. ఇప్పటికే ఎకరాకు సగటున రూ.35 వేల నుంచి 40వేల వరకు పెట్టుబడి పెట్టేశారు. ఇప్పుడు అదంతా బూడిదలో పోసిన పన్నీరైందని కుమిలిపోతున్నారు. కిస్తీకి కూడా సరిపోయే పరిస్థితి లేదు.. వరిని యంత్రాలతో కోస్తే కానీ ఉన్న కొద్దిపాటి పంట చేతికొచ్చే పరిస్థితిలేదు. అయితే యంత్రాలతో ఎకరా కోతకు నాలుగైదు గంటలు పడుతుందని, గంటకు రూ.3 వేల నుంచి రూ.4వేలు యంత్రాల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. దీనికి ఎంత చూసుకున్నా.. ఎకరాకు రూ.15వేలు అదనంగా ఖర్చయ్యేలా ఉందని ఆవేదన చెందుతున్నారు. ఇంతా కష్టపడి తీరా కోసి ఆరబెట్టినా 20–25 బస్తాలకు మించి వచ్చే పరిస్థితి లేదు. దాంట్లో 17 బస్తాలు కౌలుగా భూ యజమానికే ఇవ్వాలి. ఇక మాకు మిగిలేది ఏమిటంటూ కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటంతా తడిసి ముద్దవడంతో అధిక తేమశాతంతోపాటు రంగుమారే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల వరి గింజలకు మొలకలొచ్చేశాయి. మరొక వైపు రెల్ల పురుగు నేలనంటిన దుబ్బులును కొరికేస్తోంది. వడ్లు నేలరాలిపోయి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. ఇన్ని కష్టాలు పడి ఒబ్బిడి చేసినా మద్దతు ధర మాట దేవుడెరుగు కొనేవారుండరన్న ఆందోళన రైతుల్లో సర్వత్రా నెలకొంది. అరటి, బొప్పాయి, మొక్కజొన్న, పసుపు రైతులైతే తమకు పెట్టుబడి కాదు కదా.. కనీసం భూ యజమానికి కీస్తీకిచ్చేందుకు కూడా మిగలదని లబోదిబోమంటున్నారు.అన్నదాతల్లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహంతుపాను వేళ ప్రభుత్వం ఇంతలా నిర్లక్ష్యం ప్రదర్శించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందెన్నడూ ఇలాంటి దుస్థితి చూడలేదని, కనీసం పంట నష్టం అంచనాల కోసం తమ పొలాల వైపునకు అధికారులు రావడం లేదని, రైతు సేవా కేంద్రాలకు వెళ్తే రాస్తాంలే అంటూ సమాధానాలు చెబుతున్నారని దువ్వకు చెందిన అప్పారావు అనే కౌలు రైతు సాక్షి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను దెబ్బకు తాము పెట్టుబడిని సైతం కోల్పోతున్నామని వరి రైతులు, తాము లక్ష నుంచి లక్షన్నర వరకు నష్టపోతున్నామని అరటి తదితర వాణిజ్య పంటల రైతులు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఆదుకోక పోతే తమకు అ«ధోగతే అని, వ్యవసాయం మానుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదని స్పష్టం చేస్తున్నారు.వైఎస్ జగన్ హయాంలో నాడు అడుగడుగునా అండగా..గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రకృతి విపత్తు సంభవిస్తే ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలిచింది. 2023 డిసెంబర్లో సంభవించిన మిచాంగ్ తుపాను సమయంలో ఇదేరీతిలో పంటలు ముంపునకు గురైన వేళ రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే) సిబ్బంది రైతులతో కలిసి పంట చేలల్లోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టడంతోపాటు నష్ట పరిహార నమోదు ప్రక్రియ వేగంగా చేపట్టారు. ముంపునకు గురైన పంటలను ఎలా రక్షించుకోవాలో సూచనలు, సలహాలు అందించారు. అప్పటి వైఎస్ జగన్ సర్కారు పంట నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ వేగంగా చెల్లించడంతోపాటు ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసింది. ఆఖరికి తడిచిన, రంగు మారిన ధాన్యాన్నీ గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేసింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మచ్చుకైనా కనిపించడం లేదు. అధికారులెవరూ పొలాలవైపు కన్నెత్తి చూడడం లేదు. కిందిస్థాయి సిబ్బంది తూతూమంత్రంగా పంటనష్ట అంచనాలను ప్రాథమికంగా నమోదు చేస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీకి మంగళం పాడేందుకు సర్కారు కుటిలయత్నం చేస్తోంది. ధాన్యం కొనుగోలుకూ డ్రామాలు ఆడుతోంది.ఇంకా నీటి ముంపులోనే లక్షలాది ఎకరాలు తుపాను తీరం దాటి నాలుగు రోజులు గడిచినా లక్షలాది ఎకరాలు ఇంకా ముంపునీటిలోనే ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు, గుమ్మడిదుర్రు, అనిగండ్ల పాడు, మాగొల్లు, విజయవాడ రూరల్, ఎన్టీఆర్ జిల్లా ఏటూరు, తోటరావుల పాడు, చింతలపాడు, ఏలూరు జిల్లా ఉంగుటూరు, పశ్చిమగోదావరి జిల్లా దువ్వ, జగన్నాధపురం, మిలట్రీ మాధవరం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పెనికేరు,, ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి, అంబాజీపేట మండలం గంగలకుర్రు, కాకినాడ జిల్లా కరప, వేళంగి తదితర గ్రామాల్లో పంట చేలు నేటికీ ముంపునీటిలోనే ఉన్నాయి. రావులపాలెం మండలం ఈతకోట, పి. గన్నవరం, మామిడి కుదురు మండలాల్లో పలు గ్రామాల్లో నేలకొరిగిన అరటితోటలు సైతం ముంపునీటిలో ఉన్నాయి. రైతాంగ కష్టాలు వదిలి షికార్లు దుర్మార్గం మోంథా తుపాను వల్ల వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉచిత పంటల బీమా ఎత్తేయడంతో కర్షకులు తీవ్రంగా దెబ్బతిన్నారు. ఇన్పుట్ సబ్సిడీ సర్కారు ఇవ్వాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. రైతులు ఇంత కష్టంలో ఉంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు ఇతర ప్రాంతాలకు షికార్లకు వెళ్లడం దుర్మార్గం. – వి.కృష్ణయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం ఇదేనా పాలకుల చిత్తశుద్ధి? మోంథా తుపాను దెబ్బకు లక్షలాది ఎకరాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అన్నదాతలకు అండగా నిలవాల్సింది పోయి కూటమి నేతలు రాష్ట్రాన్ని వదిలి షికార్లు చేస్తుండడం ఎంతవరకు సమంజసం. ఇదేనా పాలకుల చిత్తశుద్ధి? – ఎం.హరిబాబు, ప్రధాన కార్యదర్శి ఏపీ కౌలురైతుల సంఘం రైతులు పుట్టెడు కష్టాల్లో ఉంటే పాలకుల టూర్లు తుపాను బారిన పడి తీవ్రంగా నష్టపోయి రైతులు పుట్టెడు కష్టాల్లో ఉంటే వారిని ఆదుకోవాల్సింది పోయి సీఎం టూర్లు చేయడం ఏమిటి? తుపాను నష్టాన్ని తక్కువగా చూపేందుకు సర్కారు యత్నిస్తోంది. వైఎస్సార్ కడప జిల్లా సి. కె. దిన్నె మండలం కోలుములపల్లి తదితర గ్రామాలలో తుపాను, దానికంటే ముందు కురిసిన అధిక వర్షాలతో దెబ్బతిన్న చామంతి పూల తోటలను ఏ అధికారీ పరిశీలించలేదు. ఇదే జిల్లాలో పోరుమామిళ్ల, బద్వేలు రూరల్, కాజీపేట, మైదుకూరు, బి. మఠం మండలాలలో జరిగిన పంట నష్టం గురించి అధికారులు చూసిన పాపాన పోలేదు. ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. – జీఎస్ ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్శి ఏపీ రైతు సంఘం ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలి రైతులను కూటమి ప్రభుత్వ పెద్దలు గాలికొదిలారు. రాష్ట్రంలో ఈ–పంట నమోదు పూర్తిస్థాయిలో జరగలేదు. పంటనష్ట నమోదు మొక్కుబడిగా సాగుతోంది. ఇన్పుట్ సబ్సిడీ అందని ద్రాక్షగా ఉంది. దెబ్బతిన్న పంటలను గిట్టుబాటు ధరకు సర్కారే కొనాలి. గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలి. – పి.జమలయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ, కౌలురైతుల సంఘం 25 బస్తాలు కూడా వచ్చేటట్టు లేదు మాకు కాగుపాడు ఆయకట్టులో రెండున్నర ఎకరాల పొలం ఉంది. సొంతంగానే సాగు చేస్తున్నాం., మరో 15 రోజుల్లో కోతకోసే వాళ్లం. ఇంతలోనే మోంథా తుపాను ముంచేసింది. వంద బస్తాలు అవ్వాల్సింది. ఎకరాకు 25 బస్తాలకు మించి పంట దిగుబడి వచ్చేటట్టు లేదు. – గండికోట నాగయ్య, కాగుపాడు, ఏలూరు జిల్లా పెట్టుబడి కూడా రాని దుస్థితి పెట్టుబడి వస్తాదో రాదో అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎకరంన్నరలో స్వర్ణ సాగు చేశా. మంచి దిగుబడి వస్తుందని ఆశగా ఎదురు చూశాం. మోంథా తుపాను మా ఆశలను నాశనం చేసింది. ఎకరాకు 20 బస్తాల దిగుబడి కూడా వచ్చేటట్టు లేదు. కనీసం పెట్టుబడి కూడా మిగలదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – దొడ్డి మోహనరావు, కౌలురైతు, యర్రమళ్ల, ఏలూరు జిల్లా -
ఏమార్చే తంత్రం.. పక్కా కుతంత్రం
సాక్షి, అమరావతి: పంచ పాండవులు ఎంత మంది అని అడిగితే... మంచం కోళ్లలా ముగ్గురు ఉంటారని రెండు వేళ్లు చూపించాడట వెనకటికి ఒకరు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వ తీరు కూడా అంత అధ్వానంగా, అస్తవ్యస్థంగా తయారైంది. ఎన్నికల మేనిఫెస్టో ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు నిలదీస్తుంటే.. ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం దాటవేసేందుకు ఎప్పటికప్పుడు డైవర్షన్ కుతంత్రాలు పన్నుతోంది. ఇందులో భాగంగానే తాజాగా వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్ అని స్పష్టమవుతోంది. ఏమాత్రం సంబంధం లేని విషయాలను సృష్టించి, ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందనేందుకు నకిలీ మద్యం రాకెట్లో జోగి రమేశ్‌ను ఇరికించడమే నిదర్శనం. 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ కూటమి ప్రభుత్వం శకుని తరహాలో కుయుక్తి పాచికలను మళ్లీ మళ్లీ విసురుతోంది. తాను ఏం చెప్పినా భుజానికెత్తుకునే ఎల్లో మీడియా ఉండటంతో చంద్రబాబు తన కుట్రలకు మరింత పదును పెడుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు దుర్మరణం చెందడంతో ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. మోంథా తుపానుతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళనకు ఉద్యుక్తులవుతున్నారు. తమ చేతగానితనం మరోసారి బట్టబయలు కాగానే చంద్రబాబులోని డైవర్షన్ చంద్రముఖి వెంటనే నిద్ర లేచింది. ఫలితంగా కరకట్ట ప్యాలస్ డైరెక్షన్లో టీడీపీ వీర విధేయ పోలీసులతో కూడిన సిట్ తక్షణం రంగంలోకి దిగింది. జోగి రమేశ్ అరెస్ట్.. ఎల్లో మీడియాలో భారీగా కవరేజీ.. ప్రజల దృష్టి అటువైపు మళ్లించే పన్నాగం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యంతోనే భక్తుల దుర్మరణం టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలే సూత్రధారులు, టీడీపీ నేతలే పాత్రధారులుగా సాగుతున్న నకిలీ మద్యం దందా కేసును ఉద్దేశ పూర్వకంగా పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం బరితెగించింది. అందుకు ఎంచుకున్న సమయం కూడా ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యంతోనే కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొమ్మిది మంది భక్తుల దుర్మరణం రాష్ట్రాన్నే కాదు యావత్ దేశాన్ని తీవ్రంగా కలచి వేసింది. ఎంతో ప్రాశస్య్తమైన కార్తీక ఏకాదశి అదీ శనివారం రోజున వచ్చిందనే కనీస స్పృహ కూడా ప్రభుత్వానికి లేకపోవడం విడ్డూరంగా ఉంది. ఉత్తరాంధ్రలో చిన్న తిరుపతిగా గుర్తింపు పొందిన కాశీబుగ్గు వేంకటేశ్వర స్వామి ఆలయానికి వేలాదిగా భక్తులు తరలి వస్తారన్నది అందరికీ తెలిసినా సరే ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్టు వ్యవహరించింది. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయక పోవడం వల్లే ఆలయంలో శనివారం తీవ్ర తొక్కిసలాట సంభవించి భక్తులు మృత్యువాత పడ్డారు. హృదయ విదారకంగా ఉన్న ఆ దృశ్యాలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ వైఫల్యం బట్టబయలైంది. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తుల దుర్మరణం.. సింహాచలంలో చందనోత్సవం రోజున గోడ కూలి ఏడుగురు బలి.. తాజాగా కాశీబుగ్గ దుర్ఘటనలు ప్రభుత్వ చేతగానితనాన్ని ఎత్తిచూపాయి. హిందూ పండుగలకు కనీస స్థాయిలో ఏర్పాట్లు చేయలేకపోతున్న చంద్రబాబు ప్రభుత్వ అసమర్థ, నిర్లక్ష్య వైఖరిపై యావత్ భక్తకోటి మండిపడుతోంది. భక్తుల ప్రశ్నలకు ప్రభుత్వం శనివారం రాత్రి వరకు సరైన సమాధానం చెప్పలేకపోయింది. ఫలితంగానే డైవర్షన్ పాలిటిక్స్. తుపాను బాధిత రైతులను పట్టించుకోని ప్రభుత్వం మోంథా తుపాను దెబ్బకు రాష్ట్రంలో రైతులు కుదేలయ్యా రు. 15 లక్షల ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నా, ప్రభుత్వ పెద్దలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం పంటల నష్టాన్ని అంచనా వేయకుండా తుపాన్‌ను జయించామని బాకాలు ఊదుతుండటం విస్మయానికి గురి చేస్తోంది. క్షేత్ర స్థాయిలో రైతులను పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు. దెబ్బతిన్న పంటలను కొనేందుకు ప్రభుత్వమే ఆంక్షలు విధిస్తుండటం విడ్డూరంగా ఉంది. ఇన్పుట్ సబ్సిడీ కావాలా.. ధాన్యం కొనాలా.. ఏదో ఒకటే తేల్చుకోవాలని షరతు విధిస్తుండటం ప్రభుత్వ దుర్మార్గానికి తార్కాణం. కనీసం సంచులు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై తుపాను బాధిత ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ఆందోళనకు సిద్ధపడుతున్నారు. చంద్రబాబు లండన్ షికారు.. చినబాబు క్రికెట్ జోరు ఓ వైపు భక్తుల దుర్మరణం.. మరోవైపు తుపానుతో తీవ్రంగా నష్టపోయిన రైతుల ఆవేదన యావత్ రాష్ట్రాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. కానీ ధృతరాష్ట్ర పాలన సాగిస్తున్న చంద్రబాబు, లోకేశ్ మాత్రం ఇవేవీ పట్టించుకుండా ఉడాయించారు. చంద్రబాబు లండన్ పర్యటనకు వెళ్లిపోయారు. ఆయన లండన్ పర్యటన ఎందుకు? అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. వ్యక్తిగత పర్యటనా.. లేక అధికారిక పర్యటనా అన్నది స్పష్టం చేయలేదు. చంద్రబాబు వ్యక్తిగతంగానే లండన్ పర్యటనను ఆస్వాదిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. ఇక చినబాబు లోకేశ్ తీరు మరింత విస్మయానికి గురి చేసింది. ఆయన ముంబయిలో క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు వెళ్లిపోయారు. దుర్మరణం చెందిన భక్తుల కుటుంబాల ఆవేదననుగానీ, తీవ్రంగా నష్టపోయిన రైతుల బాధను గానీ తండ్రీ కొడుకులు ఏమాత్రం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారన్నది పత్తా లేదు. అదీ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రస్తుత పరిస్థితి. అందుకే డైవర్షన్ డ్రామా.. జోగి రమేశ్ అక్రమ అరెస్టు కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో చంద్రబాబు బేంబేలెత్తారు. వెంటనే తనదైన శైలిలో డైవర్షన్ డ్రామాకు తెరతీశారు. శనివారం రాత్రి కూటమి ప్రభుత్వ పెద్దలు తమ పన్నాగానికి పదును పెట్టారు. నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్‌ను అక్రమ అరెస్టు చేయాలని సిట్ అధికారులను ఆదేశించారు. దాంతో మీడియా, ప్రజల దృష్టి అంతా ఆ వ్యవహారం వైపు మళ్లించాలన్నది ఎత్తుగడ. ప్రభుత్వ పెద్దల కుట్రకు టీడీపీ వీర విధేయ పోలీసులు వత్తాసు పలికారు. ఆదివారం తెల్లవారుజామునే విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఆయన్ని బలవంతంగా అరెస్టు చేశారు. నకిలీ మద్యం వ్యవహారంతో తనకేం సంబంధమని ఆయన అడిగిన ప్రశ్నలకు పోలీసులు కనీస సమాధానం కూడా చెప్పలేకపోవడం గమనార్హం. కేవలం కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనలో ప్రభుత్వ వైఫల్యం నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ హైడ్రామా నడిపించారన్నది సుస్పష్టం. మళ్లీ మళ్లీ అదే డైవర్షన్ కుతంత్రం 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం ఇదే తరహాలో డైవర్షన్ డ్రామాలతోనే ప్రజల్ని మభ్యపెడుతోంది. ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలని ఎవరు డిమాండ్ చేసినా.. పరిపాలనలో ప్రభుత్వ వైఫల్యం ఎప్పుడు బయటపడినా.. రెడ్‌బుక్ అరాచకాలపై ప్రజాగ్రహం వెల్లువెత్తిన ప్రతిసారి.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయ, పునరావాస చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ చేతగానితనం బటయపడగానే.. ఇలా కూటమి ప్రభుత్వ ప్రతి వైఫల్యంలోనూ వెంటనే ప్రజల దృష్టి మళ్లించేందుకు కూటమి ప్రభుత్వం కొత్త కుట్రలకు తెరతీస్తునే ఉంది. -
అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ క్యాండిల్ ర్యాలీ
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామ ఆలయంలో శనివారం ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్సార్సీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొని మృతి చెందిన భక్తులకు సంతాపం ప్రకటిస్తూ క్యాండిల్ ర్యాలీ చేపట్టారు.అనకాపల్లిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా:కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని పుట్టపర్తిలో వైఎస్సార్సీపీ నేతల కొవ్వొత్తుల ర్యాలీ. బాబు పాలనలో భక్తుల భద్రత కరువైందని ఆగ్రహం.తూర్పుగోదావరి జిల్లా.కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి రోజు మృతి చెందిన భక్తులకు సంతాపం ప్రకటిస్తూ వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీరాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ వద్ద నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ , మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు, రౌతు సూర్యప్రకాశరావు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్కర్నూలు జిల్లా: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరణించిన తొమ్మిది మంది ఆత్మలకు శాంతి చేకూరాలంటూ 33వ వార్డులో కొవ్వొత్తులతో నిరసన తెలిపిన నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి , వైఎస్సార్సీపీ నాయకులు , కార్యకర్తలు , మహిళలు కాశీబుగ్గ లో జరిగిన ప్రమాద ఘటన అయ్యప్పస్వామి భక్తులతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే విరుపాక్షి అదోని భిమాస్ సర్కిల్ లో బాబు పాలనలో భక్తులకు భద్రత కరువు అని వైఎస్ఆర్సిపి నాయకులు క్యాండిల్ లతో నిరసన..కాశిబుగ్గ లో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని క్యాండిల్ వెలిగించి మౌనం పాటించిన వైఎస్ఆర్సిపి నాయకులు..అనంతపురం: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుతూ అనంతపురం టవర్ క్లాక్ వద్ద క్యాండిల్ ప్రదర్శన చేపట్టిన వైఎస్సార్సీపీ నేతలు. పాల్గొన్న మేయర్ మహమ్మద్ వాసీంకాకినాడ జిల్లాకాశిబుగ్గ తొక్కిసలాటలో మృతి చెందిన భక్తుల ఆత్మకు శాంతి చేకురాలని జగ్గంపేటలో వైఎస్సార్సీపీ క్యాండిల్ ర్యాలీ.కాశిబుగ్గ తొక్కిసలాటలో మృతి చెందిన భక్తుల ఆత్మకు శాంతి చేకురాలని తుని లో వైఎస్సార్సీపీ క్యాండిల్ ర్యాలీ.పశ్చిమగోదావరి జిల్లా:భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చినిమిల్లి వెంకట రాయుడు ఆధ్వర్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మృతి చెందిన భక్తులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన శ్రీకాకుళం :కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆంకాక్షిస్తూ క్యాండిల్స్‌తో నిరసనహాజరైన మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్, వైఎస్సార్సీపీ నేతలువిశాఖ: కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్ఆర్సిపి నేతలు క్యాండిల్ ర్యాలీ.జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టిసి కాంప్లెక్స్ వరకు ర్యాలీ.భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించిన వైఎస్ఆర్ సీపీ నేతలు. -
ఈనెల 4న కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
విజయవాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 4వ తేదీన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారు మోంథా తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. మోంథా తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటనకు సంబంధించిన పర్యటన వివరాలను వైఎస్సార్సీపీ నేతలు తలశిల రఘురాం, పేర్ని నానిలు వెల్లడించారు. ఉచిత పంటల బీమాతో రైతులకు శ్రీరామ రక్ష: వైఎస్ జగన్ -
LVM3-M5 రాకెట్ ప్రయోగం విజయవంతం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలక ఘట్టాన్ని సాధించింది. ఆదివారం సాయంత్రం 5:26 గంటలకు ఇస్రో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి LVM3–M5 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా CMS–03 సమాచార ఉపగ్రహాన్ని 16.09 నిమిషాల్లో జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (GTO) లోకి ప్రవేశపెట్టారు.ప్రయోగం ఉద్దేశ్యంఈ మిషన్ ప్రధానంగా భారతదేశానికి భద్రమైన, అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థను అందించేందుకు రూపొందించబడింది. దేశ రక్షణ వ్యవస్థకు మద్దతు,సముద్ర పర్యవేక్షణ, వ్యూహాత్మక సమాచార మార్పిడికి కీలకంగా వ్యవహరించనుంది. ప్రయోగం ఇలా..43.5 మీటర్లు పొడవు కలిగిన ఎల్వీఎం–3 రాకెట్ ప్రయోగం ప్రారంభ సమయంలో 642 టన్నుల బరువుతో నింగికి పయనమైంది. ఎల్ఎం3–ఎం5 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ సమయం ముగిసే సరికి రాకెట్‌కు రెండువైపులా వున్న ఎస్–200 స్ట్రాపాన్ బూస్టర్లు మండి 642 టన్నుల బరువు కలిగిన రాకెట్‌ను భూమి నుంచి నింగివైపునకు తీసుకెళ్లే ప్రయత్నం కొనసాగింది. అంటే 400 టన్నుల ఘన ఇంధనాన్ని మండించి 105 సెకన్లలో మొదటి దశను పూర్తి చేశారు. 198.86 సెకన్లకు రాకెట్ శిఖరభాగాన అమర్చిన శాటిలైట్‌కు రెండు వైపులా వున్న షీట్ల్డ్లు విడిపోయాయి. ఆ తరువాత ఎల్–110 దశతో అంటే 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని 106.94 సెకన్లకు మండించి 304.70 సెకన్లకు రెండోదశను పూర్తి చేశారు. అనంతరం 25 టన్నుల క్రయోజనిక్ దశను 307.10 సెకన్లకు మండించి 950.54 సెకన్లకు మూడోదశను పూర్తి చేశారు. ఈ దశలోనే 965.94 సెకన్లకు (16.09 నిమిషాల్లో) సీఎంఎస్–03 ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి అడుగుపెట్టింది -
‘చంద్రబాబు సర్కార్ మరో డైవర్షన్ డ్రామా’
సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మేరుగు నాగార్జున, పేర్ని వెంకట్రామయ్య (నాని), అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మార్గాని భరత్, టీజేఆర్ సుధాకర్‌బాబు సంయుక్త ప్రకటన విడుదల చేశారు‘‘మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా అక్రమం. ఇది కేవలం కక్ష సాధింపు చర్య. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్‌ను దురుద్దేశంతోనే ఇరికించారు. కస్టడీలో ఉన్న కేసులో ఏ–1 నిందితుడు జనార్థన్‌రావు ద్వారా జోగి రమేష్ పేరు చెప్పించారు. దానిపై జోగి రమేష్ చేసిన సవాల్, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ సాక్షిగా ఆయన చేసిప ప్రమాణంపై ఇప్పటి వరకు టీడీపీ నేతలు స్పందించలేదు. జోగి రమేష్ కుటుంబాన్ని ఇంకా వెఎస్సార్‌సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకే రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్‌లు’’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘లేని లిక్కర్ స్కామ్‌లు సృష్టించారు. కల్తీ మద్యం తయారుచేస్తూ టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోవడంతో, ఆ బురదను వైఎస్సార్సీపీకి అంటించే కుట్ర చేస్తున్నారు. కల్తీ మద్యం కేసులో సీబీఐ దర్యాప్తు జోగి రమేష్ కోరారు. దానిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. అది విచారణకు రాకముందే జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. కాశిబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొక్కిసలాట.. పలువురి దుర్మరణం. మోంథా తుపాన్ సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యం. రెండింటి నుంచి డైవర్షన్ కోసమే జోగి రమేష్ అరెస్ట్. కల్తీ మద్యం కేసులో పక్కా ఆధారాలున్నా, కొందరు టీడీపీ నాయకులు అరెస్ట్ లేదు. కేవలం కక్ష సాధింపు కోసమే జోగి రమేష్‌ను ఇరికించి అరెస్టు చేశారు. ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం’’ అని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. -
9 శాతం పడిపోయిన జీఎస్టీ వసూళ్లు
సాక్షి, అమరావతి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు అక్టోబరు నెలలో తొమ్మిది శాతం క్షీణించాయి. శ్లాబ్ రేట్ల సవరణ తర్వాత దేశవ్యాప్తంగా రెండు శాతం వృద్ధి నమోదవగా ఏపీలో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో కర్ణాటక, తెలంగాణలో 10 శాతం చొప్పున, తమిళనాడులో 4 శాతం పెరుగుదల ఉండడం గమనార్హం.రాష్ట్రంలో అక్టోబరు జీఎస్టీ వసూళ్లు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే రూ.3,815 కోట్ల నుంచి రూ.3,490 కోట్లకు పడిపోయాయి. నికర వసూళ్లు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2023తో పోలిస్తే తగ్గాయి. 2023 అక్టోబరులో రూ.3,098 కోట్లుండగా... ఈ ఏడాది అక్టోబరులో రూ.3,021 కోట్లకే పరిమితమయ్యాయి. ⇒ శ్లాబుల సవరణ తర్వాత పొరుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరగ్గా ఒక్క ఏపీలోనే తగ్గాయి. అక్టోబరులో తెలంగాణ గ్రాస్ జీఎస్టీ వసూళ్లలో 10 శాతం వృద్ధి (రూ.5,211 కోట్ల నుంచి రూ.5,726 కోట్లకు) కనిపించింది. కర్ణాటకలో రూ.13,030 కోట్ల నుంచి రూ.14,395 కోట్లకు పెరిగాయి. ఇక దేశవ్యాప్తంగా గ్రాస్ జీఎస్టీ వసూళ్లు రూ.1.42 లక్షల కోట్ల నుంచి రూ.1.45 లక్షల కోట్లకు పెరిగాయి. ⇒ ఏప్రిల్–అక్టోబరు మధ్య ఏపీలో జీఎస్టీ వసూళ్లు గత ఏడాది కంటే కేవలం 2.7 శాతం పెరిగి రూ.27,059 కోట్లకు పరిమితమయ్యాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 7.8 శాతం వృద్ధి నమోదైంది. -
అలసత్వాన్ని కప్పిపుచ్చి ‘ప్రైవేట్ దేవాలయమా’!
సాక్షి, అమరావతి: కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వర దేవాలయంలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణిస్తే అది ఓ ప్రైవేట్ గుడి అంటూ టీడీపీ కూటమి సర్కారు తన వైఫల్యాన్ని, అసమర్థతను కప్పిపుచ్చుకునే యత్నం చేయడంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వినాయక ఉత్సవాల సమయంలో వీధిలో చిన్న విగ్రహం ఏర్పాటు చేసుకున్నా పోలీసులు పర్యవేక్షించి అనుమతి ఇస్తారని, అలాంటిది కాశీబుగ్గలో వేల మంది భక్తులు పాల్గొంటున్న కార్యక్రమంతో ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రులు చెప్పడం ఏమిటి? ప్రైవేట్ ఆలయమని బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం ఏమిటని మండిపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ వ్యత్యాసం ఉండదు..దేవదాయశాఖ చట్టం ప్రకారం ప్రభుత్వ గుడి, ప్రైవేట్ గుడి అనే వ్యత్యాసం ఉండదని, ఆయా ఆలయాల పర్యవేక్షణ శాఖ పరిధిలోనే ఉంటుందని పేర్కొంటున్నారు. దేవదాయ శాఖ పరిధిలో 26,968 ఆలయాలు ఉండగా దాదాపు 20 వేల ఆలయాలకు ఈవోలే లేరని చెబుతున్నారు. దేవదాయ శాఖ పరిధిలో పనిచేసే ఏ ఉద్యోగికీ ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించదు. ఆలయాల్లో పనిచేసే ఉద్యోగులకు అక్కడి ఆదాయం నుంచే చెల్లింపులు చేస్తారు. భక్తులు ఇచ్చే కానుకల నుంచే జీతాలు చెల్లిస్తున్నప్పుడు ప్రైవేట్, ప్రభుత్వం అనే ప్రస్తావన ఉండదని స్పష్టం చేస్తున్నారు. భద్రత బాధ్యత ప్రభుత్వానిదేదేవదాయ శాఖ పరిధిలో నమోదు కాని ఆలయాలలో ఉత్సవాలు జరిగినప్పుడు కూడా ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలి్సన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొంటున్నారు. అందుకే ఎంత పెద్ద ఉత్సవం జరిగినా పోలీసులు, రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులతో ఉమ్మడిగా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని నిబంధన ఉందని ప్రస్తావిస్తున్నారు. గత ప్రభుత్వం అన్ని ఆలయాలతో పాటు దేవదాయ శాఖ పరిధిలో నమోదు కాని ఆలయాలలో సైతం సీసీ కెమేరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టిందని గుర్తు చేస్తున్నారు. -
నష్టపరిహారం కావాలంటే.. మీ ధాన్యం కొనం
సాక్షి, అమరావతి: విపత్తు సంభవించి పంట నష్టం వాటిల్లినప్పుడు మిగిలిన పంటను ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. మొలకలొచ్చినా.. రంగుమారినా.. నూకలైనా సరే మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ.. కూటమి ప్రభుత్వం మోంథా తుపాను వేళ పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులను నట్టేట ముంచేలా వ్యవహరిస్తోంది. కక్షగట్టినట్టుగా వారిపై కుట్రలకు పాల్పడుతోంది. ఉదారంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఓ వైపు ఇన్‌పుట్‌సబ్సిడీ ఏదోవిధంగా ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే.. ఇన్పుట్ సబ్సిడీ వంకతో పంటను కొనేందుకు మొహం చాటేస్తోంది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి దుస్థితి చూడలేదని రైతులు లబోదిబోమంటున్నారు. మోంథా తుపాను వల్ల కష్టాల్లో ఉండగా తమను గాలికి వదిలేసి సీఎం చంద్రబాబు లండన్ పర్యటనకు వెళ్లడం ఏమిటని అన్నదాతలు నిలదీస్తున్నారు.నిండా మునిగినా.. పంట నష్టపరిహారం ఇచ్చేందుకు సవాలక్ష నిబంధనలు విధిస్తున్న ప్రభుత్వం కనీసం ఒబ్బిడి చేసుకున్న పంటనైనా కనీస మద్దతు ధరకు కొనే పరిస్థితి లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని రైతులు వాపోతున్నారు. మీ పేరు తుది జాబితాలో చేర్చాలంటే.. మీ పంటను కొనే అవకాశం ఉండదని తెగేసి చెబుతుండటం రైతులను విస్మయానికి గురిచేస్తోంది. తుపాను మింగేయగా మిగిలిన పంటను మిల్లర్ల ఇచ్చే రేటు మీకు నచ్చితే అమ్ముకోవచ్చని, కొనుగోలు కేంద్రాల్లో కొనే అవకాశాలు లేవని అధికారులు తెగేసి చెబుతున్నారు. ముంపునకు గురైన పంటలో తేమ శాతం అధికంగా ఉంటుందని, రంగు మారి, మొలకలొచ్చే అవకాశం ఉండటంతో తాము మద్దతు ధర ఇచ్చే ప్రసక్తే లేదని మిల్లర్లు,దళారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారు. పుట్టెడు కష్టాల్లో ఉన్న తమను ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి దేశంలో ఎక్కడా లేని నిబంధనలు విధించడంపై వారంతా మండిపడుతున్నారు. అన్ని పంటలకూ ఇదే పరిస్థితి 18 నెలల్లో వివిధ వైపరీత్యాలు, కరువు కాటకాలకు సంబంధించి 5.50 లక్షల మంది రైతులకు రూ.595 కోట్ల మేర పంట నష్టపరిహారం చెల్లించలేదు. ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పైసా కూడా జమ చేయలేదు. ఈమాత్రం దానికి హడావుడి చేయడం తప్ప తమను ఆదుకున్న దాఖలాలు లేవని రైతులు వాపోతున్నారు. మోంథా కారణంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయినట్టు రైతులు చెబుతుండగా.. ప్రాథమిక అంచనా ప్రకారమే 3.75 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అంచనా వేసిన ప్రభుత్వం దాన్ని కూడా ఏ విధంగా కోత వేయాలా అని ఆలోచిస్తోంది. శుక్రవారం రాత్రికే పంట నష్టం అంచనాల సర్వే పూర్తి చేయాల్సి ఉండగా.. శనివారం సాయంత్రానికి 47 శాతమే సర్వే పూర్తయింది. ఉద్యాన పంటలకు తొలుత 62,595 ఎకరాలుగా పేర్కొనగా.. చివరికి 14,700 ఎకరాలకు పరిమితం చేశారు. తొలుత 24,570 మంది రైతులకు నష్టం వాటిల్లిందని పేర్కొన్న ప్రభుత్వం రైతుల సంఖ్యను 14,165 మందికి కుదించింది. వ్యవసాయ పంటలకు తొలుత 3.75 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించగా.. శనివారం సాయంత్రానికి 2.39 లక్షల ఎకరాల్లో పరిశీలన పూర్తి చేసి 1.02 లక్షల ఎకరాల్లోనే పంటలు 33 శాతానికిపైగా దెబ్బతిన్నట్టు అంచనా వేసినట్టుగా చెబుతున్నారు.24 గంటల్లో తుది జాబితాలు సాధ్యమేనా? ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలంటే ఎంత వేగంగా చేసినా కనీసం వారం లేదా 10 రోజులు సమయం పడుతుంది. మోంథా తుపాను గతనెల 28న తీరం దాటింది. కనీసం బృందాలు కూడా వేయకుండా ఆగమేఘాల మీద 29న ప్రభుత్వం మార్గదర్శకాలతో కూడిన సర్క్యులర్ జారీ చేసింది. 30వ తేదీ నుంచి తుది అంచనాల రూపకల్పన చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. కనీసం వారం రోజులకు పైగా సమయం పట్టే ఈ జాబితాల రూపకల్పనకు కేవలం 24 గంటలు మాత్రమే ప్రభుత్వం గడువునిచ్చింది. 31వ తేదీలోగా పూర్తిచేసి నవంబర్ 1న తుది జాబితాలు పంపాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో అభ్యంతరాల స్వీకరణకు కనీసం ఒక్కరోజు కూడా గడువు ఇవ్వలేదు. దీంతో పంట నష్టం అంచనాల రూపకల్పన ప్రహసనంగా తయారైంది.పంట నష్టం అంచనాల్లో నిబంధనలకు పాతర ఐదేళ్లూ అండగా నిలిచినవైఎస్ జగన్ ప్రభుత్వం వరదలు, తుపానులు, అధిక వర్షాలు వంటి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు అడుగడుగునా అండగా నిలిచేది. విపత్తు వేళ నేనున్ననంటూ రైతులకు భరోసా కల్పించడమే కాకుండా.. నష్టపోయిన ప్రతి ఎకరాకు దెబ్బతిన్న ప్రతి రైతుకు అదే సీజన్ చివరిలో పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అణాపైసలతో సహా లెక్కగట్టి మరీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేవారు. పైగా ఎవరైనా మిగిలి పోయారేమోనని బూతద్దం పెట్టి మరీ వెతికి సాయం అందించేవారు. అంతకుముందు ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలతో సహా వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న 24.80 లక్షల మంది రైతులకు రూ.2,558.07 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని అందజేసింది. మరోవైపు పైసా భారం పడకుండా గత ప్రభుత్వం వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల బీమా పరిహారం అందించి సంపూర్ణంగా ఆదుకుంది. ఇలా ప్రతి సందర్భంలోనూ వైఎస్ జగన్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలిచింది. ఇలాంటి నిబంధనలు ఎప్పుడూ చూడలేదు పంట మొత్తం తుపాను దెబ్బకు నేలపాలైంది. రైతులు, కౌలు రైతుల పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ప్రభుత్వం జీవో నంబర్–1 ద్వారా నష్టపరిహారం అరకొరగా పెంచి ప్రతి రైతును ఆదుకుంటామని ప్రకటనలు చేస్తోంది. కానీ, క్షేత్రస్థాయిలో 33 శాతం పైన పంట నష్టపోయిన రైతుల పేర్లు రాస్తున్నారు. ఇది దారుణం. పైగా ఆ సర్వే నంబర్లలో ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేది లేదని చెప్పడం సిగ్గుచేటు. 33 శాతం నష్టపరిహారం రాస్తే మిగిలిన పంటను ఎక్కడ అమ్ముకోవాలి? అలవికాని నిబంధనలు పెట్టి రైతును నష్టాల ఊబిలోకి నెట్టేయడం దుర్మార్గం. ప్రభుత్వం ఉదారంగా రైతులను ఆదుకోవాలి – ఎం.హరిబాబు, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలురైతుల సంఘం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బీమా డబ్బులు అందాయి..వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతుల తరఫున పంటల బీమా చెల్లించడంతో మిచాంగ్ తుపాను వల్ల దెబ్బతిన్న నిమ్మ చెట్లకు రూ.4,500, ఎకరం పొలంలో వరినాట్లు నష్టపోయినందుకు రూ.4 వేలు మా ఖాతాల్లో జమ చేశారు. రైతుల పక్షాన పంటల బీమా నగదు చెల్లించి ఉంటే బాగుండేది. – వెన్నపూస రంగమ్మ, మహిళా రైతు, కల్యాణపురం, పొదలకూరు మండలం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాఈ కౌలు రైతు పేరు నంద్యాల రాంబాబు. ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన ఈయన 4 ఎకరాల్లో వరి వేశారు. ‘బ్యాంకులో బంగారం తాకట్టుపెట్టి రూ.1.62 లక్షలు అప్పు తెచ్చి పంట మీద పెట్టాను. తీరా పంట చేతికొచ్చే సమయంలో తుపాను దెబ్బ తీసింది. పంట పూర్తిగా నేలనంటేసింది. పెట్టుబడి చేతికి వచ్చేలా కనిపించడం లేదు. ఇప్పటివరకు అధికారులెరూ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. అంతా బాగుంటే 30ృ40 బస్తాల దిగుబడి వచ్చేది. పడిపోయిన పంటను మెషిన్‌తో కోస్తే 15 బస్తాలు కూడా రావు. పైగా నేలవాలిన పంటను కోయడానికి అధిక కిరాయి అడుగుతారు. ఎకరాకు 18 బస్తాలు కౌలు చెల్లించాలి’ అని రైతు రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కోసిన పంటను కొనుగోలు చేస్తారా అంటే అదీ కనిపించడం లేదని, రైతు సేవా కేంద్రానికి వెళ్లి అడిగితే నష్ట పరిహారం కోసం రాస్తే సంచులు ఇచ్చేది లేదని చెబుతున్నారని వాపోయారు. ఎన్యుమరేషన్లో పేరు రాస్తే.. మిగిలిన పంటను ఒబ్బిడి చేసుకున్నా ప్రభుత్వం కొనదట. బయట అమ్ముకోవాలని సలహా ఇస్తున్నారు. దళారులకు అమ్మితే ఆ వచ్చే నాలుగు డబ్బులు కూడా రావు. చేసిన అప్పులు ఎలా తీర్చాలి? భూ యజమానికి ఏ విధంగా కిస్తీ కట్టాలో తెలియడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. -
ఉచిత పంటల బీమాతో రైతులకు శ్రీరామ రక్ష
సాక్షి, అమరావతి: మోంథా తుపాన్ మేనేజ్మెంట్లో సీఎం చంద్రబాబు మాటలు పిట్టల దొరని మైమరపిస్తున్నాయని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. రైతులకు శ్రీరామరక్షలా నిలిచే ఉచిత పంటల బీమాను రద్దు చేయడం.. ఆర్బీకేల నిర్వీర్యం.. ఈ –క్రాప్ వ్యవస్థ, ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధానాన్ని నీరుగార్చి రైతు వెన్ను విరగ్గొట్టడం బెటర్ మేనేజ్మెంట్ అవుతుందా? అని సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. తుపానులైనా.. వరదలైనా.. కరువైనా.. వైపరీత్యాల నుంచి రైతులను ఆదుకోవడంలో ప్లానింగ్ అంటే ఇదీ అని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసి భరోసాగా నిలిచిందని గుర్తుచేస్తూ శనివారం తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. » చంద్రబాబు గారూ.. తుపాను పరిస్థితులను గొప్పగా మేనేజ్మెంట్ చేశానంటూ మీకు మీరే గొప్పలు చెప్పుకోవడం పిట్టలదొర మాటల్లా ఉన్నాయి. తుపానైనా, వరదలైనా, కరువైనా.. అలాంటి వైపరీత్యాల వల్ల నష్టపోకుండా, రైతు కుటుంబాలకు శ్రీరామ రక్షగా, భద్రతగా నిలిచే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేయడం బెటర్ మేనేజ్మెంట్ అవుతుందా? మీరు అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని ఉద్దేశపూర్వకంగా రద్దు చేసి రైతుల గొంతు కోయడం వాస్తవం కాదా? ఇది మీ తప్పిదం కాదా? మోంథా తుపాను కారణంగా సుమారు 15 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. పంటల బీమాలేని ఇంత మంది రైతులకు ఇప్పుడు దిక్కెవరు? మరి మీది ఏరకంగా మంచి మేనేజ్మెంట్ అవుతుంది? » మా ప్రభుత్వ హయాంలో 84.8 లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా పరిధిలో ఉన్నారు. ఇందులో 54.55 లక్షల మంది రైతులు రూ.7,802 కోట్ల మేర పంట నష్ట పరిహారం అందుకున్నారన్నది వాస్తవం కాదా? ఇలాంటి విపత్తుల వేళ ‘ఉచిత పంటల బీమా’ రైతులకు శ్రీరామరక్ష కాలేదా? » ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తమకు తాముగా ప్రీమియం కట్టుకోవడంతో కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే పంటల బీమా పరిధిలో ఉన్నారు. ఇక మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి? అయినా సరే మీరు అద్భుతంగా పని చేశానని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా? వీరందరికీ గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఈ–క్రాప్, ఉచిత పంటల బీమా జరిగి ఉంటే ఈ విపత్తు సమయంలో ఎంతో భరోసాగా ఉండేది కదా? » మీ 18 నెలల కాలంలో సుమారు 16 సార్లు ప్రతికూల వాతావరణం, వైపరీతాల్యలతో రైతులు నష్టపోయారు. రైతులకు ఇవ్వాల్సిన రూ.600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని బకాయి పెట్టారు! ఒక్క పైసా కూడా పంట నష్ట పరిహారం కింద ఇవ్వలేదు. మరి మీరు చేసింది మంచి మేనేజ్మెంట్ ఎలా అవుతుంది? » ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఈ – క్రాప్ వ్యవస్థను, ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధానాన్ని నీరుగార్చారు. ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో పంటల పెట్టుబడికి తోడుగా నిలిచిన ‘రైతు భరోసా’ స్కీమ్‌ను మీరు రద్దు చేశారు. అన్నదాతా సుఖీభవ కింద ఏటా రూ.20,000 చొప్పున ఈ రెండేళ్లకు రూ.40,000 ఇవ్వాల్సి ఉండగా చివరకు కేవలం రూ.5,000 మాత్రమే ఇచ్చి రైతుల వెన్ను విరగ్గొట్టారు. ఇది మంచి ప్లానింగ్ అంటారా? మీకు ప్లానింగ్ ఉంటే ఇలా చేస్తారా? » తుపాను పరిస్థితులను మీరు గొప్పగా మేనేజ్ చేసి ఉంటే 8 మంది ఎందుకు చనిపోయారు? ఇంత దారుణమైన ప్లానింగ్ వల్ల చనిపోయినా, రైతులు మరణించినా మీలో ఏ కోశానా మంచి చేయాలన్న ఉద్దేశం కనబడదు. అన్నీ అబద్ధాలే. అన్నీ లేనిపోని గొప్పలు చెప్పుకోవడమే. ప్లానింగ్ అంటే ఇదీ..! » దశాబ్దాలుగా వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారంగా మా ప్రభుత్వంలో విప్లవాత్మక నిర్ణయాలు! » దేశంలోనే తొలిసారిగా ఆర్బీకేల ఏర్పాటు. విత్తనం నుంచి పంట విక్రయం దాకా రైతులకు అండగా, వారి చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థ. » ప్రతి గ్రామంలో అగ్రికల్చర్ అసిస్టెంట్, గ్రామ–వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో ఆర్బీకేలను మిళితం చేయడం. » దేశంలోనే తొలిసారిగా ఉచిత పంటల బీమాతో రైతుకు భరోసా. మళ్లీ సీజన్ వచ్చే నాటికి రైతుల చేతికి పంట నష్టపరిహారం. » ఏ సీజన్లో పంట నష్టం జరిగితే, ఆ సీజన్ ముగిసేలోగా రైతుకు ఇన్పుట్ సబ్సిడీ. » దేశంలోనే తొలిసారిగా రైతు సాగుచేసే ప్రతి పంటనూ ఈ–క్రాప్ చేయడం. పంట నష్టం జరిగితే శరవేగంగా ఎన్యుమరేషన్ పూర్తి చేసి ఈ–క్రాప్ డేటా ఆధారంగా రైతులను ఆదుకోవడం. » రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ద్వారా సీఎం యాప్ (కాంప్రహెన్షివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్, ప్రైస్, అండ్ ప్రొక్యూర్మెంట్)తో గిట్టుబాటు ధరలు రాని రైతులను ఆదుకోవడం. వెంటనే ఆర్బీకేల పరిధిలో పంటల కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలవడం. » ప్లానింగ్ అంటే ఇదీ చంద్రబాబూ! వీటన్నింటినీ మీరు పథకం ప్రకారం నాశనం చేశారు. మరి మీది మంచి మేనేజ్మెంట్ ఎలా అవుతుంది? మీది ముమ్మాటికీ ఇన్ సెన్సిట్ అండ్ ఇన్ కాంపిటెంట్ గవర్నెన్స్. మీది మంచి ప్లానింగ్, మంచి మేనేజ్మెంట్ అని చెప్పుకుంటున్నారంటే దాని అర్థం.. లేని దానికి గొప్పలు చెప్పుకోవడం, ఫోటో షూట్లు, పబ్లిసిటీ మాత్రమే!! -
దేవుడా.. మరో ఘోరం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి నెట్వర్క్: మొన్న తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు.. నిన్న సింహాచలంలో గోడ కూలి ఏడుగురు.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కార్తీక ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏమాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఘటనకు ప్రధాన కారణం అని స్పష్టమవుతోంది. ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా పేరుగాంచిన ఈ ఆలయానికి కార్తీక ఏకాదశి రోజున వేలాదిగా భక్తులు వస్తారని తెలిసి కూడా బందోబస్తు ఇవ్వలేదు. ఆలయంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మెట్లెక్కి పై అంతస్తుకు వెళ్తే అక్కడ వేంకటేశ్వరస్వామి దర్శనమిస్తారు. ఈ క్రమంలో దర్శనానికి వెళ్లే వారు.. దర్శనం చేసుకుని బయటకు వచ్చే వాళ్లతో ప్రవేశ మార్గం (రాకపోకలకు ఒకే మెట్ల మార్గం) కిక్కిరిసింది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు లేకపోవడంతో ఉదయం 11.45 గంటల సమయంలో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. దీంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు. తీవ్ర గందరగోళం ఏర్పడింది. కేకలు.. ఆర్తనాదాలు.. ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి.. ప్రాణ భయంతో మిగితా వారు కింద పడిన వారిని తొక్కుకుంటూ బయటకు వెళ్లడానికి దూసుకొచ్చారు. ఈ క్రమంలో భక్తుల ఒత్తిడి కారణంగా కుడి వైపు రెయిలింగ్ ఒరిగిపోయింది. దీంతో క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. దీంతో కింద పడిపోయిన వారిలో ఊపిరి ఆడక తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ 20 మందిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మరికొంత మంది మెట్లపై నుంచి కిందకు దూకి గాయపడ్డారు. కింద పడిపోయిన తర్వాత వృద్ధులు, పిల్లలు లేచేందుకు ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదని.. ‘అమ్మా.. అయ్యా.. ఊపిరి అందడం లేదు.. మీకు దండం పెడతా.. చచ్చిపోతున్నా.. ఎవరైనా కాపాడాలంటూ..’ ప్రాధేయపడి అడుగుతున్నా ఎవరూ వినిపించుకునే పరిస్థితే లేకపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన ప్రదేశం క్షమార్హం కాని ప్రభుత్వ నిర్లక్ష్యంఈ ఆలయానికి కొంత కాలంగా ప్రతి శనివారం వేలాది మంది భక్తులు వస్తారనే విషయం అందరికీ తెలుసు. పైగా శనివారం కార్తీక ఏకాదశి. ఈ దృష్ట్యా భక్తులు మరింతగా తరలి వస్తారని ఎవరూ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా పర్వదినాల్లో, కార్తీక మాసంలో ఆలయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకునేలా దిశా నిర్దేశం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈ విషయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పడానికి ఈ ఘోర ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. కాశీబుగ్గ ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చినా పోలీసుల పర్యవేక్షణ కొరవడింది. పైన ఉన్న ఆలయంలో మామూలుగా 2000 మంది భక్తులు ఉండటానికి అవకాశం ఉంటుంది. అయితే ఘటన జరిగే సమయానికి అంతకు రెండు మూడు రెట్లలో భక్తులు ఉన్నారు. వారంతా ఒక్కసారిగా కిందకు రావడానికి ప్రయత్నించడంతో మెట్లపై తోపులాట చోటు చేసుకుంది. వారు కిందకు రాకుండా నియంత్రించి ఉంటే ఇంతగా ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదని, ఇలా జరగడానికి కారణం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని భక్తులు మండిపడుతున్నారు. మార్చురీ వద్ద పోలీసులతో వాగ్వాదం చేస్తున్న మృతుల బంధువులు తొలుత స్పందించిన వైఎస్సార్సీపీ నేతలువిషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, వైఎస్సార్సీపీ కార్యకర్తలంతా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి సీదిరి పలువురికి సీపీఆర్ చేశారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించడానికి చర్యలు తీసుకున్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష సంఘటనా స్థలానికి చేరుకోగా, కొంత సమయం తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు వచ్చారు. అనంతరం మృతదేహాలను తరలించే చర్యలు చేపట్టారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తదితరులు సంఘటనా స్థలానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ కేవీ మహేశ్వర్‌రెడ్డి పోలీస్ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసులు ఆలయం, ఆస్పత్రితో పాటు పరిసర ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నారు. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు, క్షతగాత్రుల కేకలతో ఆస్పత్రి దద్దరిల్లింది. డీఐజీ గోపినాథ్ జెట్టి ఆస్పత్రి వద్దకు చేరుకుని పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ నర్తు రామారావు, వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ తదితరులు ఆస్పత్రిలో మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. శనివారం రాత్రి మంత్రి లోకేశ్ వచ్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు మృతులు, క్షతగాత్రుల బంధువులు మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శిరీషను నిలదీశారు. ఆలయ సమాచారమే ప్రభుత్వం వద్ద లేదట!ఏకాదశి కావడంతో 20 వేల నుంచి 25 వేల మంది ఒక్కసారిగా వచ్చారని అంచనా. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. రహదారిపై 10–20 మంది నిరసన తెలపడానికి వస్తే.. వెంటనే ఆంక్షల పేరిట పెద్ద సంఖ్యలో పోలీసులు వాలి పోవడం చూస్తుంటాం. అలాంటిది ఏకాదశి రోజున వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వేలాది మంది భక్తులు తరలి వచ్చారని తెలిసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోక పోవడం దారుణం అని భక్తులు మండిపడుతున్నారు. ఘటన జరిగిన తర్వాత వందల సంఖ్యలో పోలీసులను పెట్టి లాభమేమిటని ప్రజలు నిలదీస్తున్నారు. 20 మెట్లు ఎక్కే క్రమంలో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. క్షతగాత్రులను తరలించేందుకైనా.. మృతదేహాలను పక్కకు తీసేందుకైనా ప్రభుత్వ యంత్రాంగమెవరూ చాలా సేపటి వరకు అక్కడ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఘటన తర్వాత భక్తుల సంఖ్యపై వేర్వేరు ప్రకటనలు చేశారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దాదాపు 20 వేల మందికిపైగా భక్తులు వచ్చారని చెబుతున్నారు. అసలు ఆలయ సమాచారమే ప్రభుత్వం వద్ద లేదని చెప్పుకొచ్చారు. ఇలా గందరగోళ ప్రకటనలు చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కాగా, మృతుల బంధువులు, క్షతగాత్రులకు ఏదైనా సాయం కావాలంటే 08942–240557 నంబర్‌కు సంప్రదించాలని అధికారులు తెలిపారు. పోలీసు దిగ్బంధంలో సీహెచ్‌సీ ఈ దుర్ఘటనలో మరణించినవారి మృతదేహాలను ఉంచిన కాశీబుగ్గ కమ్యూనిటీ హాస్పిటల్(సీహెచ్‌సీ) వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మృతుల బంధువులు అక్కడ ఆందోళన చేయకుండా చేశారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆందోళన చేస్తుండగా పోలీసులు బలవంతంగా తరలించారు.మృతుల వివరాలు1. ఏదూరి చిన్నమ్మి (50), రామేశ్వరం, టెక్కలి మండలం2. రాపాక విజయ (48), పిట్టలసరియా, టెక్కలి మండలం3. మురుపింటి నీలమ్మ (60), దుక్కవానిపేట, వజ్రపుకొత్తూరు మండలం4. దువ్వు రాజేశ్వరి (60), బెల్లుపటియా, మందస మండలం5. లొట్ల నిఖిల్ (13), బెంకిలి, సోంపేట మండలం6. డొక్కర అమ్ములమ్మ (54) పలాస–కాశీబుగ్గ7. చిన్ని యశోదమ్మ (56), శివరాంపురం, నందిగాం మండలం8. బోర బృంద (62), మందస9. రూప (52) గుడ్డిభద్ర, మందస మండలంతల్లికి కడుపుశోకంసోంపేట: కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనలో బెంకిలి గ్రామానికి చెందిన లొట్ల నిఖిల్(12) మృతిచెందడంతో అతని తల్లి అనుకు తీరని కడుపుశోకం మిగిలింది. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. నిఖిల్‌కు చిన్నతనం నుంచే వేంకటేశ్వరస్వామి అంటే అమితమైన భక్తి. జింకిబద్ర ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. దీపావళి నుంచి బెంకిలి, జింకిభద్ర గ్రామాల్లో గోవిందుని నగర సంకీర్తనల్లో పాల్గొంటున్నాడు. ఆరేళ్లుగా కార్తీక సంకీర్తనల్లో పాలుపంచుకుంటున్నాడు. శనివారం వేకువజామున గ్రామంలోని శివాలయానికి వెళ్లి స్వామి దర్శనం అనంతరం భక్తులతో కలిసి సంకీర్తన చేశాడు. ఉదయం 9 గంటలకు అమ్మ అనుతోపాటు, అక్క, మరికొందరితో కలిసి కాశీబుగ్గ వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లాడు. 11 గంటల ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో అక్కడికక్కడే చనిపోయాడు. కొడుకు కళ్లెదుటే మరణించడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. పలాస ప్రభుత్వాస్పత్రి వద్ద అపస్మారకస్థితికి వెళ్లింది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. నిఖిల్ తండ్రి పాపారావు సోంపేట లోకనాథేశ్వర కలాసీ సంఘంలో కలాసీగా పనిచేస్తున్నారు.మృతులంతా సామాన్యులే⇒ సోంపేట మండలం బెంకిలి గ్రామానికి చెందిన బాలుడు నిఖిల్ తండ్రి పాపారావు కలాసీగా పని చేస్తున్నాడు. ⇒ టెక్కలి మండలం పిట్టలసరియా గ్రామానికి చెందిన రాపాక విజయ వ్యవసాయ కూలీ. ఈమె భర్త చిన్నారావు వ్యవసాయ కూలీగా పని చేస్తున్నారు.⇒ టెక్కలి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన యేదూరి చిన్నమ్మి భర్త గణపతిరావు మృతి చెందడంతో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.⇒ వజ్రపుకొత్తూరు మండలం దుక్కవానిపేట గ్రామానికి చెందిన మురిపింటి నీలమ్మ గృహిణి. భర్త కన్నయ్య మృతి చెందడంతో కుటుంబానికి పెద్దగా వ్యవహరిస్తోంది. ⇒ మందస మండలం బెల్లుపటియా గ్రామానికి చెందిన దువ్వు రాజేశ్వరి వ్యవసాయ కూలీ. ⇒ నందిగాం మండలం శివరాంపురం గ్రామానికి చెందిన చిన్ని యశోదమ్మ వృద్ధురాలు. కుటుంబం వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగిస్తోంది. ఈమె ఇంటి పెద్దగా వ్యవహరిస్తోంది. ⇒ మందస మండలం గుడ్డిభద్ర గ్రామానికి చెందిన రూపది నిరుపేద కుటుంబ. ⇒ మందస గ్రామానికి చెందిన బోర బృందావతి భవన నిర్మాణ కార్మికురాలు.⇒ పలాస గ్రామానికి చెందిన డొక్కరి అమ్ములమ్మ సామాన్య గృహిణి. ఇప్పుడు ఏం చే ద్దామని వచ్చారు?మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్యే శిరీషపై బాధితుల మండిపాటు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఇప్పుడు మీరు ఎందుకొచ్చారు? ఏం చేద్దామని వచ్చారు? చీమ చిటుక్కుమంటే తెలుసుకునే మీరు ఇక్కడికి ఇంత మంది భక్తులు వచ్చారని ముందుగా ఎందుకు తెలుసుకోలేకపోయారు? ప్రభుత్వంలో ఉన్నది మీరే కదా.. ఇక్కడ కనీసం ఒక్క పోలీసు అయినా లేరు. పట్టించుకునే వారే లేరు. వేలాది మంది భక్తులు వస్తే ఇలా చేస్తారా? ప్రమాదం జరిగిన తర్వాత కూడా చాలా సేపటి వరకు ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదు.. కనీసం వైద్యులు, అంబులెన్స్ అయినా పంపలేదు. అచ్చెన్నాయుడు, శిరీషలను ప్రశ్నిస్తున్న మృతుల కుటుంబ సభ్యులు మీ తీరు ఏం బాగోలేదు’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబీకులు, గాయపడ్డ వారు, ఇతర భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అనంతరం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే శిరీష ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడే మృతదేహాల వద్ద రోదిస్తున్న వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లగా మంత్రిని చూసి బాధితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం జరిగిందని గట్టిగా నిలదీశారు. బాధితులు వేసే ప్రశ్నలకు మంత్రి, ఎమ్మెల్యే సమాధానం చెప్పలేని పరిస్థితిలో మౌనంగా ఉండిపోయారు.ఆపద్బాంధవుడు సీదిరి అప్పలరాజుపలువురి ప్రాణాలు కాపాడిన మాజీ మంత్రివజ్రపుకొత్తూరు రూరల్: ఆలయంలో జరిగిన తోపులాట ఘటనలో గాయపడిన వారికి వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అత్యవసర సేవలు అందించారు. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన స్వతహాగా వైద్యుడు కావడంతో తొక్కిసలాటలో ఊపిరి తీసుకోలేకపోతున్న వారిని, స్పృహ తప్పిన వారిని గుర్తించి సీపీఆర్ చేశారు. వృత్తి ధర్మం పాటిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. తోపులాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహిళలకు సీపీఆర్ చేసి ప్రాణాలను నిలపడంతో పాటు, అంబులెన్స్‌ను రప్పించి.. ఆస్పత్రికి తరలించారు. అప్పలరాజు స్ఫూర్తితో పక్కనున్న వారు సైతం గాయపడ్డ వారికి సేవలందించారు. -
భరణం కోసం రుణం
సాక్షి, అమరావతి: ఎన్నో ఆశలతో మూడుముళ్ల బంధంతో ఒకటైనవారు మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ఎక్కువకాలం కలిసి జీవించలేక విడిపోతున్నారు. విడాకులకు సంబంధించిన న్యాయప్రక్రియ కోసం సగటున వీరు రూ.5 లక్షలు వరకు ఖర్చు చేస్తున్నారు. విడాకుల తర్వాత పురుషుల ఆర్థికస్థితి ఒక్కసారిగా కుప్ప కూలిపోతున్నట్లు వన్ ఫైనాన్స్ మ్యాగజైన్ తాజా సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా విడాకులు తీసుకున్న 1,258 జంటల ఆర్థిక స్థితిగతులను చూస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్వహించిన సర్వేలో వెల్లడైన కొన్ని ముఖ్యాంశాలు..» 38 శాతం మంది పురుషులు వారి వార్షిక ఆదాయమంతా భరణం కోసం వెచ్చిస్తున్నారు. » 42 శాతం మంది భరణం చెల్లించడం కోసం అప్పులు చేస్తున్నారు. » 29 శాతం మంది పురుషుల ఆస్తి మొత్తం భరణం చెల్లింపుల తర్వాత మైనస్‌లోకి జారిపోతోంది. » 26 శాతం మంది మహిళలు భరణంగా వారి భర్త నుంచి ఆస్తి తీసుకుంటున్నారు. » ఆస్తులు లేకపోయినా మెయింటెనెన్స్ చెల్లించాల్సిన పరిస్థితిని వీరు ఎదుర్కొంటున్నారు. » 56 శాతం మంది మహిళలు విడాకులు తీసుకోవడంలో అత్తమామలను ప్రధాన కారణంగా చూపుతున్నారు. » 43 శాతం మహిళలకు సంబంధించిన ఆర్థిక అంశాలు, గొడవలు ప్రారంభమై విడాకులు తీసుకోడానికి కారణమవుతున్నాయి. పురుషుల విషయంలో ఇది 42 శాతంగా ఉంది. » 23 శాతం మహిళలు విడాకుల తర్వాత అప్పటికి వారు ఉంటున్న ప్రదేశాన్ని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. » 30 శాతం మంది మహిళలు విడాకుల తర్వాత ఉద్యోగాలను వదిలేస్తున్నారు. ఆరోగ్య బీమా తరహాలో ఆర్థిక ప్రణాళికలు!విడాకుల తర్వాత తాము నిర్మించుకున్న ఆర్థిక ప్రపంచం ఒక్కసారిగా కుప్ప కూలిపోయిందని, చివరకు అప్పులు చేసి జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పలువురు పురుషులు పేర్కొనడం గమనార్హం. ఆరోగ్య బీమా తరహాలో ‘అనుకోని పరిస్థితుల్లో విడాకుల వరకూ వెళ్లాల్సి వస్తే’ అని ఆలోచిస్తూ దానికి అనుగుణంగా ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
తొక్కిసలాట ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే: వైఎస్ జగన్
తాడేపల్లి: కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటకు పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే కారణమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలనలో తనను మించిన వారు లేరంటూ చంద్రబాబు ప్రతీరోజూ గొప్పలు చెప్పుకోవడం ఒకవైపు కనిపిస్తూ ఉంటే, ఆయన పరిపాలనలో ఘోర వైఫల్యాలు మరోవైపు కనిపిస్తాయని ధ్వజమెత్తారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్’ఎక్స్’లో చంద్రబాబు పాలనపై మండిపడ్డారు వైఎస్ జగన్.శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటకు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే కారణం. రాష్ట్రంలో ఉన్న పోలీసు, ఇంటెలిజెన్స్ విభాగాలను పూర్తిగా రాజకీయ కక్షసాధింపులకు వాడుకుంటున్న చంద్రబాబుగారు ప్రజల భద్రతనే కాదు, ఈ రకంగా ఆలయాలకు వస్తున్న భక్తుల భద్రతను కూడా గాలికి వదిలేశారు. లేని కల్తీ లడ్డూ వ్యవహారాన్ని సృష్టించి, అందులో రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికించడంపై చంద్రబాబుకి ఉన్న శ్రద్ధ, ఆలయాలకు వచ్చే భక్తులకు భద్రత కల్పించడంలో లేదు.ఏకాదశి సందర్భంగా భక్తులు వస్తున్నారని తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇప్పుడు ప్రైవేటు ఆలయం అంటూ, ఎలాంటి సమాచారం లేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అన్నది ఉందా? లేదా? రాష్ట్రంలో దేవాదాయశాఖ ఆలయమైనా, ప్రైవేటు ఆలయమైనా భక్తులు ఎక్కువగా వస్తున్నారని తెలిసినప్పుడు బందోబస్తు కల్పించడం అన్నది ప్రభుత్వానికి ఉన్న కనీస బాధ్యత. ప్రొద్దుటూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానం, అనకాపల్లి సమీపంలోని శ్రీ సూర్యనారాయణస్వామి వారి దేవస్థానం, ద్వారంపూడిలోని అయ్యప్పస్వామి ఆలయం, సీతానగరం విజయకీలాద్రిపై చినజీయర్‌స్వామి కట్టిన వివిధ దేవాలయాలు సహా రాష్ట్రంలోని వివిధ ప్రైవేటు ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.పర్వదినాలు, వేడుకల సమయాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. మరి వీరికి భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానిది కాదా? కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగిన ఆలయం ప్రైవేటుదని, తమకు సంబంధం లేదని ప్రభుత్వం చెప్తోందని అంటే…,దీని అర్థం తప్పు జరిగినట్టే కదా? చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయాల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చరిత్రలో తొలిసారి తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, సింహాచలంలో జరిగిన దుర్ఘటనలో 7గురు బలయ్యారు. కాని, ఈ ఘటనల నుంచి పాఠాలు నేర్చుకోకుండా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది.ఇప్పుడు మళ్లీ కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో 9 మంది మరణించారు. మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలి. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. తొక్కిసలాట జరిగిన వెంటనే వైద్యుడైన, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించి, సత్వర చికిత్స అందించి, ఇద్దరు భక్తుల ప్రాణాలను కాపాడటమే కాదు, గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. మా డాక్టర్ అప్పలరాజును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
ఇదేం ‘టెట్’రా బాబు!
సాక్షి, అమరావతి: పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు పెట్టి, వారి ప్రతిభా పాటవాలు అంచనా వేసే ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం పెద్ద పరీక్ష పెట్టింది. ఇటీవల డీఎస్సీ పరీక్షలను ఎంత గందరగోళంగా మార్చిందో.. అంతకంటే గందరగోళంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు అర్హత పరీక్ష ఏపీ టెట్–2025(అక్టోబర్)ను సైతం మార్చినట్టు కనిపిస్తోంది. పరీక్ష తీరుతెన్నులు, మార్కుల విధానం, నిబంధనలు అన్నీ సర్వీసులో ఉన్న టీచర్లను నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి. డీఎస్సీ–2025 సక్రమంగా జరగలేదని అభ్యర్థులు ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో వారిని చల్లబరిచేందుకే అన్నట్టుగా మళ్లీ డీఎస్సీ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు అక్టోబర్ 24న జీవో 36తో మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇప్పటికే టెట్ షెడ్యూల్ ప్రకటించారు. ఇందులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ని తప్పనిసరి చేసింది. ఇతర రాష్ట్రాలు సుప్రీంతీర్పుపై అప్పీల్‌కు వెళుతుంటే.. మన రాష్ట్రంలో మాత్రం పరీక్షలకు వెళ్లడం ఒక ఎత్తయితే, టెట్ పరీక్ష విధానం, మార్కుల విభజన ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. టెట్ పాసైనా మళ్లీ పరీక్ష రాయాల్సిందేఎన్సీటీఈ నిబంధనలకు అనుగుణంగా 16 ఏప్రిల్ 2011న నాటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.51 విడుదల చేసింది. దీని ప్రకారం ఎన్సీటీఈ నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ (23.08.2010) నాటికి డీఎస్సీ లేదా అప్పటి నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి ‘టెట్’ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. కానీ.. తాజా ఉత్తర్వుల్లో ఈ అంశాన్ని తొలగించారు. అలాగే, 2012లో టెట్ పాసై డీఎస్సీలో ఉపాధ్యాయులుగా చేరిన వారు సైతం తాజా నోటిఫికేషన్ ప్రకారం తిరిగి టెట్ రాసి ఉత్తీర్ణులు కావాల్సిందేనని పేర్కొనడం విమర్శలకు దారితీస్తోంది. 2017కు ముందు టెట్‌లో లాంగ్వేజెస్, సాంఘికశాస్త్ర అభ్యర్థులకు ఒకే పేపర్ ఉండేది. ఇందులో ఉత్తీర్ణులై ఉద్యోగంలో కొనసాగుతున్నారు. 2017 తర్వాత ఈ రెండు విభాగాలకు వేర్వేరుగా టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, గతంలో కామన్ పేపర్లో ఉత్తీర్ణులైన వారు సైతం ఇప్పుడు టెట్ ఉత్తీర్ణత సాధించాలని పేర్కొనడంతో ఉపాధ్యాయులు కంగుతింటున్నారు. అర్థంకాని రీతిలో సిలబస్, పరీక్ష విధానం ఇన్ సర్వీస్ స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించిన టెట్ సిలబస్ చూస్తే ఎన్నిసార్లు పరీక్ష రాసినా ఉత్తీర్ణత సాధించలేని విధంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. ఎవరికీ అర్థంకాని విధంగా సిలబస్ నిర్ణయించడంతో ఆంతర్యం ఏమిటో తెలియడం లేదు. పరీక్ష పేపర్ 150 మార్కులకు అయితే.. సబ్జెక్టుకు మాత్రం అతి తక్కువ మార్కులు కేటాయించడం గమనార్హం. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ పేపర్–2ఏ రాయాల్సి ఉంటుంది. ఇందులో సైకాలజీ అండ్ పెడగాజీ (బోధన, అభ్యాసన శాస్త్రం), తెలుగు వ్యాకరణ అంశాలు, ఇంగ్లిష్ వ్యాకరణం అందరికీ కామన్. కంటెంట్‌ను పరిశీలిస్తే.. తెలుగు ఉపాధ్యాయులకు టెట్‌లో తెలుగు కంటెంట్, మెథడాలజీ కలిపి 60 మార్కులు కేటాయించారు. సోషల్ స్టడీస్ వారికి సోషల్ స్టడీస్ కంటెంట్, మెథడాలజీ 60 మార్కులకు ఉంటుంది. ఇక స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్/ఫిజికల్ సైన్స్/బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు ఆయా సబ్జెక్టుల కంటెంట్, మెథడాలజీ కేవలం 20 మార్కులకు మాత్రమే ఇవ్వడం విస్తుగొల్పుతోంది. పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందనే ఆందోళనగతంలో సోషల్ స్టడీస్, తెలుగు అభ్యర్థులు కామన్ టెట్ రాసి సర్వీసులోకి వచ్చారు. ఇప్పుడు వారు విడిగా సోషల్ స్టడీస్/తెలుగు మెథడాలజీతో టెట్ పాసవ్వాలని ప్రకటించారు. ఇదే క్రమంలో భవిష్యత్‌లో మ్యాథ్స్ లేదా ఫిజికల్ సైన్స్ లేదా బయోలాజికల్ సైన్స్ అభ్యర్థుల కోసం కూడా విడివిడిగా టెట్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే మళ్లీ పరిస్థితి మొదటికొస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో సైన్స్, మ్యాథ్స్ ఉపాధ్యాయులకు ఇప్పుడే సిలబస్‌లో మార్పులు చేయాలంటున్నారు. -
బాబు సర్కారు మళ్లీ రూ.3,000 కోట్లు అప్పు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మంగళవారం మళ్లీ మరో రూ.3వేల కోట్లు అప్పు చేయనుంది. ఏపీ ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా రూ.3వేల కోట్లు అప్పు చేయనున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) శుక్రవారం నోటిఫై చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా రూ.3వేల కోట్లను ఆర్బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. -
‘ఉపాధి’లో భారీ కోత.. పేదలకు వాత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఉపాధి హామీ పథకంలో పనుల కల్పన తగ్గడం ద్వారా పేదలు వందల కోట్ల రూపాయలు నష్టపోయారని లిబిటెక్ స్వచ్ఛంద సంస్థ తేల్చింది. కొన్నేళ్లుగా దేశంలో ఈ పథకం అమలు తీరుపై ఈ సంస్థ ఏటా రెండు విడతల్లో నివేదికలు విడుదల చేస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి అర్ధ భాగం ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య దేశ స్థాయిలో, రాష్ట్రంలో ఈ పథకం అమలు తీరుపై శుక్రవారం నివేదికను విడుదల చేసింది. కూలీలకు అందజేసే రోజువారీ వేతనాన్ని కేంద్రం పెంచినప్పటికీ.. రాష్ట్రంలో గత ఏడాదితో పోల్చితే తక్కువ పనుల కల్పన కారణంగా రూ.435.14 కోట్ల మేర పేదలు నష్టపోయారని తేల్చింది. » 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలకు ఒక్కొక్కరికీ రోజు వారీ చెల్లించే మొత్తం రూ.300 చొప్పున ఉండగా.. 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా పేదలు రూ.4,581 కోట్లు మేర లబ్ధి పొందారు. ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తాన్ని రూ.307కు పెంచింది. అయినా పనుల కల్పన తగ్గడంతో పేదలు రూ.4,146.60 కోట్ల మేర మాత్రమే లబ్ధి పొందగలిగారు. » 2023–24 ఆర్థిక సంవత్సరం (జగన్ సీఎంగా ఉన్నప్పడు)లో రోజు వారీ కూలీ గరిష్టంగా రూ.272 మాత్రమే ఉన్నప్పటికీ ఆ ఏడాది రాష్ట్రంలో పేదలు రూ.6,277 కోట్ల మేర లబ్ధి పొందారు. ఆ తర్వాత 2024–25 ఆర్థిక సంవత్సంలో రోజు వారీ కూలీ రేటు రూ.300 అయినా ఏడాది మొత్తంలో పేదలు రూ.6,183 కోట్ల మేర మాత్రమే లబ్ధి పొందారు. 4.8 శాతం మేర కుటుంబాలకు తగ్గిన పనుల కల్పన » 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద 42.79 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి. ప్రస్తుత 2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య 40.74 లక్షల కుటుంబాలు మాత్రమే పనులు పొందాయి. ఈ లెక్కన గత ఆర్థిక ఏడాది కన్నా ఈ ఏడాదిలోని ఆరు నెలల కాలంలో 4.8 శాతం మేర కుటుంబాలకు పనుల కల్పన తగ్గిపోయింది. » గ్రామాల్లో వ్యవసాయ పనులు దొరకని ఏప్రిల్, మే నెలల్లో గత ఏడాది కన్నా ఈ ఏడాది పనుల కల్పన తగ్గిపోవడం గమనార్హం. మొత్తం ఆరు నెలల్లో ఒక్క జూన్ నెలలో మాత్రమే ఈ ఏడాది ఎక్కువగా పనుల కల్పన జరిగింది. » గత ఆర్థిక సంవత్సరంలో ఈ ఆరు నెలల కాలంలో ఉపాధి హామీ పథకం ద్వారా పేదలకు 17.95 కోట్ల పని దినాలు లభించగా, ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో అదే ఆరు నెలల కాలానికి 15.51 కోట్ల పని దినాలు మాత్రమే లభించాయి. » దేశ వ్యాప్తంగా ఈ ఆరు నెలల కాలంలో సగటున ఈ ఏడాది 10.4 శాతం పనుల కల్పన తగ్గిపోగా, మన రాష్ట్రంలో మాత్రం 13.6 శాతం పనుల కల్పన తగ్గిపోయింది. ఎక్కువగా నష్టపోయింది ఎస్సీ, ఎస్టీలే »ఎస్సీ, ఎస్టీలు సహా అన్ని వర్గాల ప్రజలు ఈ ఏడాది పనుల కల్పన తక్కువైనందున ఆ మేరకు నష్టపోయారు. ఎస్సీలు గత ఆర్థిక సంవత్సరం ఈ ఆరు నెలల కాలానికి నాలుగు కోట్ల పని దినాలు ఉపాధిని పొందగా, ఈ ఏడాది 3.23 కోట్ల పని దినాలు మాత్రమే పొందారు. ఈ లెక్కన వారు 18.7 శాతం మేర ఉపాధి కోల్పోయారు. ఎస్టీలు 17.6 శాతం, ఇతరులు 11.3 శాతం మేర ఉపాధిని కోల్పోవాల్సి వచ్చింది. »నెల్లూరు, విశాఖ జిల్లాలు మినహా మిగిలిన 24 జిల్లాల్లోనూ పేదలకు ఉపాధి హామీ పథకంలో పనుల కల్పన తగ్గిపోవడం గమనార్హం. -
మా రాయితీలు ఇవ్వకుంటే తిరుగుబాటే!
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు దగాపై ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు కదంతొక్కారు. అధికారంలోకి రాగానే తమ బకాయిలు చెల్లించడమే కాక ఏ సంవత్సరం డబ్బులు ఆ సంవత్సరమే చెల్లిస్తామంటూ ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించడంపై మండిపడ్డారు. తమను విస్మరించి ప్రభుత్వంలోని కావాల్సినవారికి రాయితీలు విడుదల చేస్తుడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా మంగళగిరి ఏపీఐఐసీ భవనం దగ్గర ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం దిగిరాకపోవడంతో శుక్రవారం అమరావతిలోని సచివాలయాన్ని ముట్టడించారు. తక్షణం బకాయిలు చెల్లించకుంటే ఈ నెలలో విశాఖపట్నంలో జరిగే పారిశ్రామిక సదస్సును బహిష్కరిస్తామని అల్టిమేటం జారీచేశారు. ప్రభుత్వ మోసాన్ని అంతర్జాతీయంగా తెలియజేస్తామని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. మాకు ఇవ్వకుండా టీడీపీ నేతలు చెప్పినవారికా? ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ విధానాన్ని పక్కకుపెట్టి ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లోని టీడీపీ నేతలు సూచించినవారికి మాత్రమే రాయితీలు మంజూరు చేస్తుండడాన్ని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు తీవ్రంగా తప్పుబట్టారు. తమ బకాయిలు ఇవ్వకుండా అగ్రవర్ణాలకు చెందినవారికి 2025 సంవత్సర రాయితీలు ఏవిధంగా విడుదల చేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై ప్రశ్నిస్తే సీఎంవో నుంచి వచ్చిన జాబితా ప్రకారమే ఇవ్వాలనే స్పష్టమైన ఆదేశాలున్నాయని అధికారులు చెబుతున్నారని వాపోయారు. పారిశ్రామికవేత్తలకు రాజకీయ రంగు పులమడమే కాక, కొందరికే ప్రోత్సాహకాలు ఇస్తుండడాన్ని ప్రస్తావించారు. 3 నెలలుగా నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సీఎం చంద్రబాబు కావాలనే తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం కరోనా సమయంలో పార్టీ, కులం చూడకుండా అన్ని చిన్న, మధ్య, సూక్ష్మ తరహా పరిశ్రమలకు రాయితీలను ఇచ్చిందని గుర్తుచేశారు. చరిత్రలో తొలిసారిగా పర్సంటేజీ ప్రకారం విడుదల చేయడం తీవ్ర అన్యాయమని విమర్శించారు. సీనియార్టీని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. » సచివాలయ ముట్టడి అనంతరం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల జేఏసీ నేతలు మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయం వద్ద ధర్నా చేసి పరిశ్రమల శాఖ డైరెక్టర్ శుభమ్ బన్సాల్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఈడ్పుగంటి అనార్ బాబు, ఈరా రాజశేఖర్, పినమాల నాగకుమార్, కనపర్తి విజయరాజు, అన్నవరపు అవినాష్, తానేటి సత్యానందం, స్వరూపారాణి, ప్రియాంక పాల్గొన్నారు. వీరికి మద్దతుగా కేవీపీఎస్ కార్యదర్శి, పలు కుల సంఘాల నాయకులు హాజరయ్యారు.పార్టీతో సంబంధం అంటగట్టి... ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు గత ఎన్నికల్లో ఏ పార్టీ తరపున ప్రచారం చేశారో విచారణ జరిపి మరీ కూటమి సర్కారు రాయితీలను విడుదల చేస్తోంది. సీఎంవో నుంచి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడికి ఫోన్ చేసి ఫలానా వ్యక్తి ఏ పార్టీ వాడు అని ఆరా తీశారు. వారు మా గ్రామ టీడీపీ అధ్యక్షుడిని అడిగితే... అతడు నన్ను సంప్రదించకుండానే వైసీపీ సానుభూతిపరుడు అని చెప్పాడు. దీంతో నా రాయితీలను ఆపేశారు. దీనిపై నిలదీస్తే నువ్వు ఆ పార్టీ వాళ్లతో తిరుగుతున్నావ్... అందుకే రాలేదు అని పరిహాసం ఆడుతున్నారు. – ఓ దళిత పారిశ్రామికవేత్త ఆక్రందన -
ఇక.. ఆలయ భూముల వంతు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విలువైన భూముల్ని ఏదో ఒకరకంగా అస్మదీయులకు అప్పగిస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం దృష్టి ఇప్పుడు ఆలయ భూములపై పడింది. ఆ భూములను కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు శుక్రవారం మరో జీవో జారీచేసింది. దేవదాయ శాఖకు సంబం«ధించి పట్టణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను దీర్ఘకాలిక లీజుకు ఇవ్వాలన్న అంశంపై సమీక్షించడంతో పాటు అందుకు మార్గదర్శకాల రూపకల్పనకు నలుగురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. దేవదాయశాఖ కార్యదర్శి, కమిషనర్, చీఫ్ ఇంజినీరు, ఆయా భూములకు సంబంధించిన ఆలయ ఈవో లేదా దేవదాయశాఖ ప్రాంతీయ జాయింట్ కమిషనర్ ఈ కమిటీలో ఉంటారని జీవోలో పేర్కొంది. రాష్ట్రంలో దేవదాయశాఖ పరి«ధిలో ఆలయాలు, సత్రాలు, మఠాల పేరిట 4,67,283 ఎకరాల భూములున్నాయి. వీటిలో 4,244 ఎకరాలకుపైగా అత్యంత విలువైన భూములు పట్టణాల్లో ఉన్నాయి. ఇవి 1.55 కోట్ల చదరపు గజాల ఖాళీ భూములుగాను, 50 వేల చదరపు గజాల కట్టడాలుగాను ఉన్నాయి. అంటే మొత్తం 2.05 కోట్ల చదరపు గజాలు. ఈ ఏడాది మే నెలలో ఇలాంటిదే ఒక జీవో దేవదాయశాఖ నిబంధనల ప్రకారం ఆలయ భూములను లీజుకివ్వాలంటే.. వేలం పాట నిర్వహించి, హెచ్చుపాటదారుకి నిర్ణీత మొత్తానికి ఇవ్వాలి. లీజు గడువు ముగియగానే మళ్లీ వేలం నిర్వహించాలి. దీనికి తూట్లు పొడుస్తూ 20 సంవత్సరాల పాటు లాభాపేక్ష లేకుండా సేవాకార్యక్రమాలు నిర్వహించే సంస్థలకు వ్యవసాయేతర ఆలయ భూములను బహిరంగ వేలంతో సంబంధం లేకుండానే లీజు రూపంలో ఇవ్వడం లేదా పొడిగించడానికి వీలుగా దేవదాయశాఖ నిబంధనల్లో మార్పులు చేస్తూ కూటమి ప్రభుత్వం ఈ ఏడాది మే 2వ తేదీన ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నోటిఫికేషన్‌పై 30 రోజుల పాటు ప్రజల అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు పేర్కొంది. ఆ నోటిఫికేషన్‌పై రాష్ట్ర మాజీ ప్రభుత్వ కార్యదర్శి సహా భక్తుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ‘దీన్ని గట్టిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. వేలం విధానం లేకుండా తమకు కావాల్సినవాళ్లకు ఆలయ భూములు కట్టబెట్టడానికి ఈ ఉత్తర్వులు పనికొస్తాయి. న్యాయపరంగా కూడా నిలువరించాల్సిన అవసరం ఉంది..’ అని అప్పట్లో ఆయా భక్తసంఘాలు సోషల్ మీడియా వేదికలపై పేర్కొన్నాయి. ఈ అంశంపై అప్పట్లో సాక్షి ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఈ ప్రాథమిక నోటిఫికేషన్.. ప్రజల నుంచి అభ్యంతరాలు, పూర్తిస్థాయి నోటిఫికేషన్‌పై పరిశీలన ప్రక్రియలోనే ఆగిపోయింది. తాజాగా పట్టణ ప్రాంతాల్లో ఆలయభూములను కూడా లీజుకిచ్చే దిశగా కూటమి ప్రభుత్వం జీవో జారీచేయడాన్ని భక్త సమాజం తప్పుపడుతోంది. ఇలాంటి జీవోలు ప్రభుత్వం అనుకున్న వారికి నామమాత్రం ధరకు కావాల్సినంత కాలం లీజుకు ఇవ్వడానికి ఉపయోగపడతాయని, తద్వారా ఆలయాల మనుగడ ప్ర«శ్నార్ధకంగా మారే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మోంథా నష్టం రూ.5,244 కోట్లు
సాక్షి, అమరావతి: మోంథా తుపాను నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. 17 శాఖలు, రంగాలలో రూ.5,244 కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొంది. పూర్తిస్థాయిలో వివరాలు వస్తే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ శుక్రవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఈ నివేదిక పంపారు. తక్షణ ఆర్థిక సాయం చేయాలని కోరారు. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉందని, 1.38 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని 2.96 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు దెబ్బతిన్నాయని, 1.74 లక్షల మంది రైతులు రూ.829 కోట్ల వరకు నష్టపోయినట్లు వివరించారు. 249 మండలాల్లోని 1,434 గ్రామాలు, 48 పట్టణాలపై ప్రభావం ఉందని, 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర బృందాలను పంపాలని కోరారు. 12,215 హెక్టార్లలో రూ.40 కోట్ల విలువైన ఉద్యాన పంటలు దెబ్బతినగా 23,979 మంది రైతులకు నష్టం వాటిల్లిందని, ఆక్వారంగంలో 32 వేల ఎకరాల్లోని రూ.514 కోట్ల విలువైన పంటను రైతులు కోల్పోయారని తెలిపారు. 2,261 పశువులు మృతిచెందాయన్నారు. 2,817 విద్యుత్ స్తంభాలు నేలకొరగ్గా, 429 కి.మీ. మేర తీగలు తెగిపడ్డాయి. ఈ శాఖకు రూ.19 కోట్ల నష్టం జరిగింది. నీటి పారుదల శాఖకు రూ.234 కోట్ల మేర నష్టం కలిగింది. 23 జిల్లాలలోని 3,045 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అంగన్వాడీలు, పాఠశాలలు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, చేనేత మగ్గాలు అన్నీ కలిపి రూ.122 కోట్ల నష్టం వాటిల్లింది. బాగా దెబ్బతిన్న రోడ్లు.. మృతులు ముగ్గురు రోడ్లు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో నష్టం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. తుపానుతో ముగ్గురు చనిపోయారని వెల్లడించారు. 4,794 కి.మీ. మేర ఆర్అండ్బీ రోడ్లు, 311 కల్వర్టులు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయని, రూ.2,774 కోట్ల నష్టం వాటిల్లిందని వివరించారు. 18 జిల్లాల్లోని 862 కి.మీ. మేర పంచాయతీరాజ్ రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు పాడవడంతో రూ.454 కోట్ల నష్టం జరిగిందని, 48 పట్టణాల్లోని రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు ధ్వంసమయ్యాయని, వీటి పునరుద్ధరణకు రూ.109 కోట్లు కావాలని నివేదికలో వివరించారు. -
చేలో నీళ్లు.. రైతుకు కన్నీళ్లు
సాక్షి నెట్వర్క్: మోంథా తుపాను రాష్ట్రంలో రైతులను నిలువునా ముంచేసింది. వరి, మొక్కజొన్న, అరటి, పత్తి, తదితర పంటలకు, ఉద్యాన తోటలకు తీరని నష్టం వాటిల్లింది. ఎక్కడ చూసినా పడిపోయిన అరటి తోటలు, నేలకొరిగిన వరి పనలే దర్శనమిస్తున్నాయి. కూరగాయల పంటలు పూర్తి స్థాయిలో తుడిచి పెట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వర్ణనాతీతంగా మారింది. చేలను ముంచెత్తిన నీళ్లు ఇంకా బయటకు వెళ్లలేదు. ఫలితంగా పంట ఇంకా నీటిలోనే మురిగిపోతోంది. నీట మునిగిన, నేలకొరిగిన పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అధికారులు మెజారిటీ శాతం మునిగిన పంటను పూర్తిగా పరిశీలించిన పాపానపోలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ‘సాక్షి’ బృందం క్షేత్ర స్థాయిలో పంటల పరిస్థితిని పరిశీలించింది. తమకు జరిగిన నష్టంపై ప్రతి చోటా రైతులు ఏకరువు పెట్టారు. నేలకొరిగిన పంటను కాపాడుకోవడంలో భాగంగా పొలంలో ఉండిపోయిన నీటిని బయటకు పంపేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూ రైతులు పలు చోట్ల కనిపించారు. పడిపోయిన వరి పంటను కట్టలు కట్టుకుంటున్నారు. అధికారులు వస్తే జరిగిన నష్టాన్ని చూపాలని ఆత్రంగా ఎదురు చూస్తూ కనిపించారు. కాగా, తుపాను ప్రభావం కంటే సర్కారు నిర్లక్ష్యంతోనే ఎక్కువ నష్టపోతున్నామని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర రైతాంగంలో ఆందోళన » శ్రీకాకుళం జిల్లాలో మోంథా తుపాను 23 మండలాలపై ప్రభావం చూపింది. 82 గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం నియోజకవర్గాల్లో ఎక్కువగా నష్టం జరగ్గా, మిగతా నియోజకవర్గాల్లో ఓ మాదిరి నష్టం సంభవించింది. ఇచ్ఛాపురం మండలంలోని రత్తకన్న, తులిగాం, ఇన్నేషుపేట, కోట»ొమ్మాళి మండలంలోని గుంజిలోవ తదితర గ్రామాల్లో రైతులు తమ పొలాల్లో చేరిన నీటిని బయటికి పంపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. » విశాఖ జిల్లాలో భీమిలి నియోజకవర్గంలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాలతోపాటు పెందుర్తి మండలంలోనూ తుపాను బీభత్సం సృష్టించింది. వరి మొదళ్లు కుళ్లిపోయాయి. మళ్లీ.. పంటని నిలబెట్టుకోవాలంటే.. నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాతే సాధ్యమవుతుందని రైతులు చెబుతున్నారు. అయితే.. వరద నీరు మొత్తం పోయేందుకు మరో 15 రోజుల సమయం పడుతుందని ఈలోగా.. పంట మొత్తం కుళ్లిపోతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. » పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, సాలూరు రూరల్, పాచిపెంట, మక్కువ, బలిజిపేట, సీతానగరం, పాలకొండ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, భామిని తదితర మండలాల్లో వరి, పత్తి, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పాచిపెంట, కురుపాం, సాలూరు, కొమరాడ తదితర మండలాల్లో పత్తి పంట తడిసి ముద్దయ్యింది. » అనకాపల్లి జిల్లావ్యాప్తంగా 15,800 ఎకరాల్లో పంటలు నష్టపోతే... అధికారులు మాత్రం 2వేల ఎకరాలే చూపిస్తున్నారు. 13,800 ఎకరాల్లో వరి, 2వేల ఎకరాల్లో చెరకు, వెయ్యి ఎకరాల్లో బొప్పాయి, అపరాలు, కూరగాయలు, కొబ్బరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 60వేల ఎకరాల భవిష్యత్తు ప్రశ్నార్థకం! కాకినాడ జిల్లాలో ఏలేరు పొంగి ప్రవహిస్తూండటంతో సుమారు 60 వేల ఎకరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానంగా వరి, మిర్చి, పత్తి, దొండ తదితర పంటలు దెబ్బతిన్నాయి. పిఠాపురం, గొల్లప్రోలు, గోకవరం, పెద్దాపురం, సామర్లకోట, కరప, తాళ్లరేవు తదితర మండలాల పరిధిలోని పెనుగుదురు, నడకుదురు, వేములవాడ, వేలంగి, కొవ్వూరు, చెందుర్తి, చేబ్రోలు, పవర, పనసపాడు, సర్పవరంలో వరి పంట వెన్నుల వరకు నీట మునిగింది. పొలాల్లోని ముంపునీరు బయటకు వెళ్లే దారి లేక పంటను కాపాడుకునేందుకు కొన్నిచోట్ల రైతులు వరి దుబ్బులను కట్టలుగా కట్టి రోడ్డుపైకి తెచ్చి మాసూలు చేసుకుంటున్నారు. కేంద్రాలకు వచ్చిన వారికే పరిహారమట! డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం 76,709 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. ఉద్యాన పంటలు 3,935 ఎకరాల్లో దెబ్బ తిన్నాయి. కేవలం సహాయ పునరావాస కేంద్రాలకు వచ్చిన వారికి మాత్రమే నగదు పరిహారం అందిస్తామని చెప్పడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. గోదారి జిల్లాల్లో గుండెకోత తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా పడిపోయిన అరటి తోటలు, నేలకొరిగిన వరి పనలే దర్శనమిస్తున్నాయి. కూరగాయల పంటలు పూర్తి స్థాయిలో తుడిచిపెట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వర్ణనాతీతంగా మారింది. జిల్లాలో తుపాను ప్రభావం 209 గ్రామాల్లో కినిపించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూరల్, వీరవాసరం, నరసాపురం రూరల్ పరిధిలోని తాడేరు, బేతపూడి, తుందుర్రు, కంశాల బేతపూడి, మత్స్యపురిలో వరి పంట వెన్నుల వరకు నీట మునిగిపోయి ఉంది. ముంపునీరు లాగక పొట్టలు కుళ్లిపోయి ధాన్యం తాలుగా మారిపోతూ, వెన్నులు ఎండిపోతున్న పరిస్థితులు కనిపించాయి. ఈ ప్రాంతంలోని తొక్కోడి డ్రెయిన్‌లోని పూడిక ముంపు నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉండటంతో పొలాల్లోకి నీరు ఎగదన్నుతోంది. కొన్నిచోట్ల రైతులు ఇంజన్లు పెట్టి నీటిని తోడుకుంటున్నారు. కోతకు పనికిరాదన్న భావనతో తాడేరులో పశువుల కోసం పంటను కోసేస్తున్న పరిస్థితి కనిపించింది. » ఏలూరు జిల్లాలో మోంథా తుపాను అన్నదాతకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. వాస్తవానికి తుపాను నేపథ్యంలో జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ బలమైన ఈదురుగాలుల ప్రభావంతో వరి కంకులు నేలకొరిగాయి. మరోవైపు రోజుల తరబడి పంట చేల్లో నీళ్లు నిలిచిపోవడంతో కొన్నిచోట్ల పంట కుళ్లిన పరిస్థితి. ‘సరిగ్గా ఇంకో 15 రోజులు ఆగితే కోతలు పూర్తయ్యేవి. కనీసం పెట్టుబడులైనా దక్కేవి. కోతలకు ముందు తుపాను విరుచుకుపడటంతో వరి కంకులు నేలకొరిగాయి. పర్యవసానంగా మళ్లీ ఎకరానికి రూ.20 వేలు పెట్టుబడి అనివార్యంగా మారిన పరిస్థితి’ అని రైతులు వాపోతున్నారు. కృష్ణ కృష్ణా.. ఆదుకునే వారేరీ? ఉమ్మడి కృష్ణా జిల్లాలో పంటలు నీటి పాలవ్వడంతో అరకొర పంటనైనా రక్షించుకుందామనే తాపత్రయంలో అన్నదాతలు ఉన్నారు. కంకిపాడు, పునాదిపాడు, ఉప్పలూరు, మంతెన గ్రామాల్లో రైతులు నేలవాలిన వరిపైరును దుబ్బులుగా కడుతూ మిగిలిన పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేల వాలిన వరి పైరును నిలగట్టేందుకు కూలీల కోసం చేతిలో చిల్లిగవ్వ లేక పలువురు రైతులు పంట చేను వైపు దీనంగా చూస్తున్న పరిస్థితులు కనిపించాయి. పొలాల్లో నిలిచిన నీరు పంట బోదెల్లోకి సైతం మళ్లక పోవటంతో పొలాల్లో ఉన్న వరి దుబ్బులను నిలగట్టి పంట నష్టాన్ని నివారించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకు కూలీల ఖర్చు అదనపు భారంగా మారింది. ఒక్కొక్కరికి రూ 330 చొప్పున కూలీ చెల్లిస్తూ వరి దుబ్బులను నిలగడుతున్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందన్న∙నమ్మకం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కదిలిస్తే కన్నీరై పారుతోంది » గుంటూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వరి, పత్తి, మిర్చి, అరటి, పసుపు, కూరగాయలు, పూలు, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. క్షేత్ర స్థాయిలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. బురదమయమైన పొలాలు, ఇంకా నీట నానుతున్న పంటలు, పంటను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న పాట్లు, ఇప్పటికే తెచ్చిన అప్పులకు తోడు పంటను కాపాడుకునేందుకు కొత్త అప్పుల కోసం పడే తిప్పలు, ఎరువుల కోసం అరువు కోసం దీనంగా వెతికే చూపులు.. ఇలాంటి దృశ్యాలు ఊరూరా కనిపిస్తున్నాయి. » భారీ వర్షాలకు బాపట్ల జిల్లా అతలాకుతలమైంది. వరి, పత్తి, మినుము, సోయాబీన్, మొక్కజొన్న, అరటి, బొప్పాయి, కూరగాయలు, ఆకుకూరల పంటలు నీటి పాలయ్యాయి. పర్చూరు వాగు, రొంపేరులు పొంగి పొర్లడంతో పర్చూరు, కారంచేడు, చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లో శుక్రవారం నాటికి 50 వేల ఎకరాల్లో వరి పంట నీటిలోనే ఉండిపోయింది. నల్లమడ డ్రైన్, ఈపూరుపాలెం స్రైట్ కట్, పేరలి డ్రైన్లు పొంగి పొర్లడంతో బాపట్ల పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాలు నీట మునిగాయి. ప్రజలు ఇప్పటికీ నీటిలో ఉన్న పొలాలను చూపించారు. » ప్రకాశం జిల్లాలో ఏ రైతును పలకరించినా కన్నీరు పెట్టుకుని, గద్గద స్వరంతో దీనగాధను వినిపిస్తున్నారు. ప్రధానంగా నష్టపోయిన పంటల్లో సింహ భాగం పత్తిదే. కొన్ని ప్రాంతాల్లో ఒక తీత పత్తిని తీయగా జిల్లా వ్యాప్తంగా 90 శాతం మంది రైతులు ఒక తీత కూడా తీయలేదు. తీద్దామని సన్నద్ధమయ్యే లోపు వరుసబెట్టి కురిసిన వర్షాలు, ఆపై మోంథా తుపాను అన్నదాత నెత్తిన పిడుగులా పడింది. వరి, పొగాకు, సజ్జ, మొక్కజొన్న, మినుము పంటలకు కూడా నష్టం వాటిల్లింది. నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన గోపతోటి శామ్యూల్ 50 ఎకరాల్లో వరి పంట సాగు చేశాడు. అంతా నీటిలో మునిగి పోయిందని, నాలుగు రోజులైనా పంట ఇంకా నీటిలోనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కురిచేడు మండలం గంగ దొనకొండ గ్రామానికి చెందిన కసిబిసి వెంకటేశ్వర్లదీ ఇదే పరిస్థితి. అయితే ఇతను 20 ఎకరాల్లో నల్ల బర్లీ పొగాకు సాగు చేయగా, పంట నీట మునిగింది. » శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వరి, మినుము, జొన్న, వేరుశనగ, తమలపాకు, అరటి, బొప్పాయి, పసుపు తదితర పంటలకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. ఆయా శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో ఇంత వరకు ఎన్యుమరేషన్ చేపట్టలేదని రైతులు చెబుతున్నారు. వరి పంట కోత దశ సమయంలో పూర్తిగా నీట మునిగి మొలకలెత్తాయి. గింజ ధాన్యం కూడా తీసుకునే పరిస్థితి లేకుండా పోయిందని కర్షకులు కంటతడ పెడుతున్నారు. » నంద్యాల జిల్లాను తుపాను అతలాకుతలం చేసింది. వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సగానికి సగం పంట తుడిచి పెట్టుకుపోయింది. ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో వరి, వేరుశనగ, ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. పరిహారం పరిహాసం! మోంథా తుపాను వల్ల కలిగిన నష్టంకన్నా, ప్రభుత్వం రైతులకు పెడుతున్న కష్టమే వారిని ఎక్కువగా బాధ పెడుతోంది. కళ్ల ముందు పంట నష్టపోయి పొలం గట్టున నీళ్లు నిండిన కళ్లతో నిలబడి తమను ప్రభుత్వం ఆదుకోకపోతుందా అనే ఆశతో రైతులు చూస్తుంటే.. అధికారులు అలా వచ్చి పైపైన చూసి.. అబ్బే ఇది పరిహారం చెల్లించాల్సిన నష్టం కాదు.. దీనికి ఏమాత్రం పరిహారం రాదన్నట్లు చులకనగా చూసి వెళ్లిపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెయ్యెత్తులో ఉన్న చెరుకు పంట నిలువునా నీట మునిగినా, అబ్బే ఇదొక నష్టమే కాదన్నట్లుగా అధికారులు చూస్తున్నారని వాపోతున్నారు. తుపాను పంట నష్టాన్ని లెక్కించే క్రమంలో అధికారులు ఒక ప్రామాణికతను నిర్ధారించారు. రైతు వేసిన మొత్తం పంటలో 30 శాతం నష్టం జరిగితేనే దానికి పరిహారం ఇవ్వదగిందిగా లెక్కలోకి వేస్తున్నారు. అంతకన్నా తక్కువ నష్టం జరిగితే పైసా కూడా పరిహారం రాదు. ఈ మేరకు ప్రభుత్వం దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి పంటల బీమా ప్రీమియం చెల్లించే బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకోవడంతో బీమా సంస్థల నుంచి ఏమాత్రం పరిహారం వచ్చే అవకాశం లేదు. దీంతో ప్రభుత్వం దయతలచి ఇచ్చే సాయం తప్ప, దర్జాగా రైతులకు దక్కే బీమా పరిహారం ఇప్పుడు దక్కకుండా పోయింది. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతుల తరఫున పంటల బీమా ప్రీమియం చెల్లించేది. దీంతో ఏదైనా విపత్తుల్లో పంటలకు నష్టం వస్తే సదరు బీమా సంస్థలు ఇన్సూరెన్స్ కింద పరిహారం చెల్లించేవి. ఈ క్రమంలో గత ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలోని మొత్తం 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802 కోట్లు బీమా రూపంలో వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం బీమా చెల్లించకపోవడంతో కేవలం పంట రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే సదరు బ్యాంకులు బీమా ప్రీమియం చెల్లించడంతో కేవలం 19 లక్షల మందికి మాత్రమే అరకొరగా పరిహారం దక్కే అవకాశం ఉంది. ఈ లెక్కన మిగతా వారు పూర్తిగా నష్టపోయినట్లే అని అధికారులే స్పష్టంచేస్తున్నారు. పరిహారం వస్తుందో రాదో... మొక్కజొన్న పొత్తులు కోసి నూర్పిడికి సిద్ధంగా ఉంచాం. ఈలోగా వర్షం వచ్చి మొత్తం పొత్తులను తడిపేసింది. రంగుమారిపోయి నాణ్యత తగ్గిపోయాయి. వీటిని కొనుగోలు చేస్తారో లేదో తెలియడం లేదు. ఇప్పటివరకు జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. పంట నష్టానికి పరిహారం వస్తుందో రాదో తెలియదు. అంతా దైవా«దీనం. వేసిన పంటలు చేతికి వచ్చేవరకు నమ్మకంలేకపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం అంటేనే భయంగా ఉంది. – చందక నారాయణమ్మ, పెరిపి గ్రామం, చీపురుపల్లి మండలం, విజయనగరం జిల్లా పశువుల మేతగా అయినా పనికొస్తుందని.. ఏడు ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. ప్రస్తుతం పంట పొట్ట దశకు చేరింది. విత్తనం నుంచి దమ్ము, నాట్లు, ఎరువులు, పురుగు మందుల కోసం ఇప్పటికే ఎకరానికి రూ.20 వేలు వరకు ఖర్చయ్యింది. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో మాయదారి తుపాను వచ్చింది. వర్షాల వలన రోజుల తరబడి పొట్టల పైవరకు నీరు నిలిచిపోయింది. వరి వెన్నులు కుళ్లిపోతుండటంతో నీరు లాగగానే పైరు పడిపోతుంది. కంకులు తాలుగా మారిపోతాయి. పశువులకు మేతగా అయినా పనికొస్తుందని ఇప్పుడే కోసేస్తున్నాం – పెంటపాటి త్రిమూర్తులు, తాడేరు, భీమవరం రూరల్, ప.గోదావరి జిల్లా వ్యవసాయం అంటేనే వణుకు పుడుతోంది ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు ప్రకృతి రైతులను ఇబ్బంది పెడుతూ ఉంటే వ్యవసాయం చేయాలంటేనే వణుకు పుడుతోంది. పంట పండించే వరకు ఎరువుల కోసం పాట్లు పడవలసి వచ్చింది. చేలో వేద్దామంటే యూరియా కూడా దొరకలేదు. అదేదో గట్టెక్కామనుకుంటుంటే పంట వచ్చిన సమయంలో పొలాన్ని ముంపు నీరు ముంచేసింది. సొంత పొలం రెండు ఎకరాలు, తొమ్మిది ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాను. గింజ గట్టిపడుతున్న సమయంలో ముంపునకు గురై, నీటిలో నిండిపోయింది. రూ.10 వేలు అయినా చేతికొస్తుందో లేదో. – ఇంటి వెంకట్రావు, రైతు, వీకే రాయపురం, సామర్లకోట మండలం కౌలు రైతుకు ఏమీ లేవు దేవుడు మాన్యం రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నా. స్వర్ణ రకం సాగు చేశాను. ఇంకో 20 రోజుల్లో పంట చేతికివచ్చే తరుణంలో తుపాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు అంతా తారుమారైంది. కౌలురైతు కావడంతో ఎలాంటి సాయం దక్కదని ఆందోళనగా ఉంది. ఏ అధికారీ ఇప్పటి వరకు పొలం వైపు రాలేదు. – సీమల జానరాజు, చిన్న రైతు, పెదపాడు, ఏలూరు జిల్లా రైతు పరిస్థితి దయనీయం నాకు సెంటు పొలం లేదు. స్టూవర్టుపురం రెవెన్యూ పరిధిలోని 10 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాను. ఎకరాకు రూ.10 వేల చొప్పున ముందే రూ.లక్ష చెల్లించాను. ఇప్పటికీ పైర్లు నాట్లువేసి 70 రోజులు అయ్యింది. ఒక్కో ఎకరాకు రూ.30 వేల చొప్పున ఖర్చుచేశాను. 10 ఎకరాలకు రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టాను. నా పొలం మొత్తం నీటిలో మునిగింది. మాలాంటి రైతుల పరిస్థితి దయనీయం. – కుంచాల లక్ష్మారెడ్డి, బేతపూడి, బాపట్ల జిల్లా పెట్టుబడీ రాదు ఈ చిత్రంలో ఉన్న రైతు పేరు మద్దిపాటి హరే రామకృష్ణ. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు గ్రామంలో 7 ఎకరాల్లో వరి సాగు చేశారు. తుపాను ప్రభావంతో వీచిన భారీ ఈదురుగాలులు, వర్షాలకు వరి పంట తుడిచిపెట్టుకుపోయింది. 7 ఎకరాల్లో పంట నేల కొరిగింది. ఇప్పటికే పంట సాగుకు ఎకరానికి రూ.30 వేలు చొప్పున రూ.2.50 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు. వరి గింజ గట్టిపడే దశకు వచ్చింది. మరికొన్ని రోజుల్లో కోతలకు సిద్ధమవుతుండగా ప్రకృతి కన్నెర్ర చేసింది. తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంట మొత్తం నేలకొరిగింది. ప్రస్తుతం ఆ వరి పనలు కట్టేందుకు ఎకరానికి మరో రూ.10 వేలు వెచ్చించాల్సి వస్తోంది. మరో రూ.70 వేలు అదనపు భారం పడుతోంది. దీంతోపాటు ఎకరానికి 40 బస్తాల ధాన్యం దిగుబడి అందుతుందని భావిస్తే.. ప్రస్తుతం 20 నుంచి 25 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రతి రోజూ 20 మంది కూలీలకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున కూలి ఇచ్చి పనలు కట్టిస్తున్నారు. మొక్క బతుకుతుందో లేదో.. ఈ రైతు పేరు చాగంరెడ్డి రామకోటి రెడ్డి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు గ్రామానికి చెందిన ఈ రైతు ఈ ఏడాది తొమ్మిది ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశాడు. మొక్క ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఈ దశలో తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పైరు నీట మునిగింది. ఒక రోజంతా కష్టపడి ఇంజిన్లతో పొలంలో నిలిచిన నీటిని బయటకు పంపాడు.రెండవ రోజు నేలవాలిన మొక్కలను పైకి లేపుతున్నారు. మూడవ రోజు బలం మందులు పిచికారీ చేశాడు. ఇప్పటి వరకు ఈ రైతుకు ఎకరాకు సుమారు రూ. 60వేల నుంచి రూ. 70 వేల వరకు ఖర్చు అయ్యింది. కౌలు అదనం. ఇప్పుడు ఆయిల్ ఇంజిన్లు, ఎరువుల ఖర్చు అదనం. ఇంతా చేసినా మొక్క బతుకుతుందో లేదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. పడిపోయిన చేను కోసేస్తున్నాడు ఈ రైతు పేరు చప్పగడ్డి నాగేశ్వరరావు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం ఖండేపల్లి గ్రామం. 1.20 ఎకరాల్లో వరి పంట వేశాడు. ఆర్ఆర్ వరి రకం వేయడంతో త్వరగా పండేసింది. మరో పది రోజుల్లో కోత కోయాలనుకునేలోపే తుపాను దెబ్బతో పంట మొత్తం మునిగిపోయి నేలకొరిగింది. నిన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ వచ్చి చూసి ఫొటో తీసుకుని వెళ్ళిపోయింది. పరిహారం ఇస్తారో లేదో ఎవరూ చెప్పడం లేదు. నేలకొరిగిన పొలాన్ని కోసేస్తున్నాడు. కోసి ఎండ పెడితే ఏదో కొద్దిగానైనా ధాన్యం చేతికొస్తుందనే ఆశతో ఇలా చేస్తున్నాడు. పెట్టుబడి కూడా చేతికి రాదని, పొలాన్ని చూస్తే ఏడుపు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆశలన్నీ వరదపాలుఈ రైతు పేరు మేర్నిడి గంగరాజు. కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామం. 8వ ఏట నుంచే వ్యవసాయం పనుల్లో ఉన్నాడు. రెండు ఎకరాలు సొంత పొలంతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నాడు. వాతావరణం అనుకూలించడంతో వరిచేలు ఈనిక పూర్తయి గింజ తోడుకునే దశకు చేరుకుంది. ఈ సమయంలో మోంథా తుపాను నట్టేట ముంచేసింది. మొత్తం ఐదు ఎకరాల్లో పంట నేలనంటేసింది. గింజ పాలు తోడుకునే దశలో ఉండడంతో పువ్వారం రాలిపోయింది. ఎకరాకు 45 నుంచి 50 బస్తాల వరకు దిగుబడి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ఆశలన్నీ వరదలో కొట్టుకుపోయాయని చెబుతున్నాడు. అంచనాలో సగం దిగుబడి కూడా రాదని వాపోతున్నాడు. -
కొలికపుడి,కేశినేని చిన్నిమధ్య విభేదాలపై చంద్రబాబు అసహనం
సాక్షి,అమరావతి: చంద్రబాబు దగ్గరకు తిరువూరు పంచాయితీ చేరింది. తిరువూరు ఎమ్మెల్యే, ఎంపీ మధ్య విభేదాలపై చంద్రబాబు అసహనానికి గురయ్యారు. వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణా కమిటీకి అప్పగించారు. కొలికపూడి,కేశినేని చిన్నిని పిలిచి మాట్లాడాలని ఆదేశించారు.‘మోంథా’తుపాన్‌పై పబ్లిసిటీ చేయాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. బాగా పబ్లిసిటీ చేయడం లేదని ఎమ్మెల్యేపై ఫైరయ్యారు. వైఎస్సార్సీపీ ప్రచారం బాగా ఎక్కువగా ఉందని చంద్రబాబు గగ్గోలు పెట్టారు. -
భర్తే కాదు.. బావతోనూ సంసారం చేయాలని చిన్న కోడలిపై దారుణం
సాక్షి,ఏలూరు: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తతో పాటు బావతోనూ సంసారం చేయాలంటూ అత్తా,మామలు చిన్న కోడలిని చిత్ర హింసలకు గురి చేయడం కలకలం రేపింది. అందుకు తన తల్లిదండ్రులకు బాధితురాలి భర్త రంజింత్ కుమార్ వంతపాడటం గమనార్హం. జంగారెడ్డిగూడెంలో దారుణం జరిగింది. భర్తతో పాటు బావతోనూ సంసారం చేయాలంటూ చిన్న కోడలిపై అత్తమామలు ఒత్తిడి తెచ్చారు. బావకి పిల్లలు లేనందున అతనితో సంసారం చేసి పిల్లలు కనాలని కోరికను వ్యక్తం చేశారు. అందుకు బాధితురాలు నిరాకరించడంతో ఆమెను గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేశారు. తల్లిదండ్రులు డిమాండ్‌కు భర్త మౌనంగా ఉండిపోవడంతో బాధితురాలికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఏడాది క్రితం బాధితురాలు బాబుకు జన్మనిచ్చినప్పటికీ, తాము చెప్పినట్లు చేయలేదన్న కారణంతో గత పది రోజులుగా ఆమెను, ఆమె కుమారుణ్ని గదిలో బంధించారు. గదికి కరెంటు, మంచినీళ్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేకుండా చేశారు. ఈ అమానుష చర్యలు ఆమె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి.ఈ విషయంపై మానవ హక్కుల సంఘం నేతలకు సమాచారం అందడంతో, వారు పోలీసుల సహాయంతో శుక్రవారం బాధితురాలు నివసిస్తున్న ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. బాధితురాలిని బంధించిన గదికి తాళాలు పగలగొట్టి ఆమెను బయటకు తీసుకువచ్చారు. అనంతరం అత్యవసర చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
‘చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు మానుకో’
సాక్షి,అమరావతి: చంద్రబాబు,నారా లోకేష్‌ను ప్రశ్నిస్తే తనపై దుష్ప్రచారం చేశారని మాజీ మంత్రి జోగి రమేష్ ధ్వజమెత్తారు. కూటమి సర్కార్ తనని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. శుక్రవారం (అక్టోబర్31) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీని బాహ్య ప్రపంచానికి చూపించాను.చంద్రబాబు,నారా లోకేష్‌ను ప్రశ్నిస్తే తనపై దుష్ప్రచారం చేశారు. కల్తీ మద్యం కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాను. నార్కో ఆనాలసిస్ టెస్ట్‌కు సిద్ధమే. నేను ఏ తప్పు చేయలేదని దుర్గమ్మ సాక్షిగా కుటుంబసభ్యులతో కలిసి ప్రమాణం చేశా. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి చట్టాన్ని, వ్యవస్థల్ని చేతుల్లోకి తీసుకుంటారా? గన్నవరం ఎయిర్‌పోర్టులో జనార్ధన్ రావుకు రెడ్‌కార్పెట్ వేసి స్వాగతం పలికారు. రిమాండ్‌లో ఉన్న జనార్ధన్‌రావు వీడియోని ఎవరు విడుదల చేశారని ప్రశ్నించారు. -
ఎంఎస్‌రాజు వ్యాఖ్యలపై పవన్ ఎందుకు స్పందించడం లేదు?: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: భగవద్గీతను కించపరిచిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఆయన్ను వెంటనే టీటీడీ పాలకమండలి సభ్యునిగా తొలగించాలన్నారు. హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే ఇలాంటి వారికి టీటీడీలో సభ్యునిగా కొనసాగిస్తారా?. టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చటం సిగ్గుచేటు. ప్రపంచానికే మార్గదర్శకంగా ఉన్న భగవద్గీతను టీడీపీ ఎమ్మెల్యే రాజు కించపరచటం దారుణం’’ అంటూ మల్లాది విష్ణు మండిపడ్డారు.అలాంటి వ్యక్తిని టీటీడీ సభ్యునిగా నియమించటాన్ని ఏం అనాలి?. టీటీడీ చరిత్రలో ఇలాంటి సభ్యుడిని ఎప్పుడూ చూడలేదు. ఇంత జరుగుతున్నా సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు?. టీటీడీ గోశాలను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలని నిర్ణయించటం దారుణం. ఇదేనా టీటీడీ గోసంరక్షణ?. చంద్రబాబుది హిందూ వ్యతిరేక ప్రభుత్వం. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలు ఎమ్మెల్యే రాజుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో వరుసగా అపచారాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ బీజేపీ కూడా ఎందుకు మాట్లాడటం లేదు?’’ అంటూ మల్లాది విష్ణు ప్రశ్నించారు. -
ఆధునిక భారతదేశ శిల్పి.. వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ఆధునిక భారతదేశ శిల్పి అంటూ ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. ‘‘సంస్థానాలను భారతదేశంలో కలపటంలో పటేల్ కృషి చేశారు. ఆయన చూపిన నిబద్ధత, దృఢమైన నిర్ణయాలు దేశానికి పునాదిగా మారాయి’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Heartfelt tributes to the sculptor of modern India, Sardar Vallabhbhai Patel ji, on his birth anniversary.His unwavering commitment to the integration of princely states into India laid the foundation for a strong and resilient India.#NationalUnityDay#IronManOfIndia pic.twitter.com/EkgTdSSisA— YS Jagan Mohan Reddy (@ysjagan) October 31, 2025 -
ఆరో సబ్జెక్టుకు అరకొర స్పందనే!
సాక్షి, అమరావతి: ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మిడియెట్ విద్యా విధానంలో చేపట్టిన సంస్కరణలపై విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. కొన్నేళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయ కోర్సులకు అదనంగా 2025–26 విద్యా సంవత్సరం నుంచి సబ్జెక్టుల ఎంపికలో ‘ఎలక్టివ్’ విధానం అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే, రెండో భాష స్థానంలో నచ్చిన సబ్జెక్టును తీసుకునే అవకాశాన్నీ అమలు చేశారు. అయితే, కొత్త విధానంపై అవగాహన కల్పించడంలో వెనుకబడడం, విద్యా సంవత్సరం ముందు నుంచే మార్పులు, చేర్పులు చేయకపోవడంతో ఎలక్టివ్ విధానం విద్యార్థులను ఆకర్షించలేకపోయింది.దీంతో అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే అదనపు సబ్జెక్టును ఎంచుకున్నట్టు తెలుస్తోంది. 42 మంది సైన్స్ విద్యార్థులు ఆర్ట్స్ సబ్జెక్టులు ఎంచుకోవడం గమనార్హం. ముఖ్యంగా జేఈఈ, నీట్ పరీక్షలు రాసేందుకు వీలుగా ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంపీసీ విద్యార్థులు బయాలజీ, బైపీసీ విద్యార్థులు మ్యాథమెటిక్స్ అదనపు సబ్జెక్టుగా ఎంచుకునే అవకాశం కల్పించగా ఈ రెండు గ్రూపుల్లోనూ కేవలం 2,592 మంది మాత్రమే ఆరో సబ్జెక్టును తీసుకున్నారు. ఇక రెండో భాష (సెకండ్ లాంగ్వేజ్) స్థానంలో ఏదైనా గ్రూప్ సబ్జెక్టు ఎంచుకునే అవకాశం ఇవ్వగా అతి కొద్ది మందే సబ్జెక్టును ఎంచుకున్నారు. రెండో భాష స్థానంలో సబ్జెక్టు ఎంచుకున్న 253 మందిగత ప్రభుత్వం అన్ని పాఠశాలల్లోనూ అంచెల వారీగా సీబీఎస్ఈ సిలబస్‌ను అమల్లోకి తెచ్చింది. దీంతో 2024–25 విద్యా సంవత్సరంలో తొలిసారి పదో తరగతి విద్యార్థులు సీబీఎస్ఈ సిలబస్ చదువుకుని పరీక్షలు రాశారు. వీరికి అనుకూలంగా 2025–26 విద్యా సంవత్సరంలోనూ ఇంటర్మిడియెట్‌లో సీబీఎస్ఈ విధానం అందుబాటులోకి తెచ్చారు. ఈ క్రమంలో సబ్జెక్టుల ఎంపిక, లాంగ్వేజెస్ స్థానంలో కొత్త సబ్జెక్టు ఎంచుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్మిడియెట్ మొదటి సంవత్సరంలో 5,28,805 మంది విద్యార్థులు ఉండగా, వారిలో 253 మంది మాత్రమే రెండో భాష స్థానంలో సైన్స్ సబ్జెక్టులను ఎంపిక చేసుకొన్నారు. ఇందులో 117 మంది ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, మరో 136 మంది బైపీసీ విద్యార్థులు మ్యాథమెటిక్స్ను ఎంచుకున్నారు. ⇒ ఆరో సబ్జెక్టు ఎంపికలోనూ విద్యార్థులు ఆసక్తి కనబరచడం లేదు. ఎంపీసీ చదువుతున్న 1,059 మంది విద్యార్థులు ఆరో సబ్జెక్టుగా బయాలజీని ఎంచుకోగా, బైపీసీ చదువుతూ మ్యాథమెటిక్స్ తీసుకున్న వారు 1533 మంది ఉన్నారు. Ü ఎంపీసీ గ్రూప్ చదువుతూ ఆరో సబ్జెక్టుగా చరిత్రను ముగ్గురు, సివిక్స్ను ఇద్దరు, కామర్స్ మరో ఇద్దరు ఎంపిక చేసుకున్నారు.⇒ బైపీసీలో చేరిన కొందరు విద్యార్థులు ఆర్ట్స్ గ్రూపులనూ ఎంచుకున్నారు. 29 మంది విద్యార్థులు జియోగ్రఫీని, ఇద్దరు సివిక్స్, మరో ఇద్దరు చరిత్రను ఎంపిక చేసుకున్నారు. ⇒ సీఈసీ గ్రూపులో కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే మ్యాథమెటిక్స్ ఎంపిక చేసుకొన్నారు. -
బాబు మరో కట్టు కథ!
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో న్యాయస్థానాల్లో చీవాట్లు, అక్షింతలతో అభాసుపాలైన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మరో కట్టు కథ సృష్టించేందుకు కుట్ర పన్నుతోంది. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై నిజాలు నిగ్గుతేల్చాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై బురద జల్లేందుకు దుష్ప్రచారానికి దిగుతోంది. ఇందులో భాగంగా.. గతంలో సుబ్బారెడ్డి దగ్గర ఎప్పుడో పీఏగా పనిచేసిన చిన్నప్పన్న అనే చిరుద్యోగిని సిట్ అరెస్టుచేసింది. ఇతన్ని పావుగా వాడుకుని బాబు రూపొందించిన కట్టుకథ ఆధారంగా సుబ్బారెడ్డిపై సిట్ తప్పుడు ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓవైపు చిన్నప్పన్న ఆంధ్ర భవన్లో చిరుద్యోగి అంటూ.. మరోవైపు అదే సమయంలో వైవీ సుబ్బారెడ్డి పీఏ అంటూ పరస్పర విరుద్ధ వాదనలు వినిపించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.చిన్నప్పన్న టీడీపీ ఎంపీ వేమిరెడ్డికి కూడా పీఏగా..2018కి ముందు సుబ్బారెడ్డి దగ్గర పనిచేసి మానేశాడు. అనంతరం ఢిల్లీలోని ఆంధ్రభవన్లో ఉద్యోగిగా చేరిన చిన్నప్పన్న ఏకంగా టీటీడీలోని ప్రొక్యూర్మెంట్ జీఎం స్థాయి అధికారులను సైతం ప్రభావితం చేశాడని సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం విస్మయం కలిగిస్తోంది. చిన్నప్పన్న బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఆయన వ్యక్తిగతంగా కొనుగోలు చేసుకున్న ఆస్తులు వంటి ఇతర అంశాలకు ముడిపెట్టి సుబ్బారెడ్డిని ఎలాగైనా కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తుండడాన్ని చూస్తే ఇది పక్కా కుట్ర కథేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి.. ఇదే చిన్నప్పన్న ప్రస్తుత టీడీపీ ఎంపీ అయిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దగ్గర కూడా గతంలో పీఏగా పనిచేశాడు. ‘సుప్రీం’ చెప్పినా మారని బాబు తీరు..తన రాజకీయ లబ్ధి కోసం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వుతో కల్తీ అయిన నెయ్యిని వినియోగించారంటూ చేసిన ఆరోపణలపై సాక్షాత్తు సుప్రీంకోర్టు సైతం మండిపడింది. విచారణ సందర్భంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచేలా బాబు వ్యాఖ్యలున్నాయని ఆక్షేపించింది. దేవుడ్ని రాజకీయాల్లోకి లాగొద్దని కూడా హితవు పలికింది. సర్వోన్నత న్యాయస్థానమే బాబు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టినప్పటికీ ఆయన తీరులో ఏమాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. వాస్తవానికి.. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడలేదని అప్పటి టీటీడీ ఈఓ శ్యామలరావు సైతం మీడియా సమావేశంలోనే కుండబద్ధలు కొట్టారు. డెయిరీల నుంచి వచ్చిన నెయ్యికి పరీక్షలు నిర్వహించి, నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేదని తేలిన రెండు ట్యాంకర్ల నెయ్యిని తిరిగి వెనక్కు పంపేశామని అప్పట్లో ఆయన తేల్చిచెప్పారు. ఇంత సుస్పష్టంగా లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడనే లేదని తేలినప్పటికీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా బాబు పక్కా ప్రణాళికతో తాజా కుట్రకు తెరలేపారు.టీడీపీ ఆఫీసులో ఎన్డీడీబీ రిపోర్ట్ విడుదల..ఇక గతేడాది సెప్టెంబరు 18న తిరుమల లడ్డూపై ఆరోపణలు చేస్తే, ఆ మర్నాడే అంటే సెప్టెంబరు 19న టీడీపీ ఆఫీసులో ఎన్డీడీబీ రిపోర్ట్‌ను రిలీజ్ చేశారు. నిజానికి.. అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. అయినా దాన్ని టీడీపీ ఆఫీస్‌లో విడుదల చేశారు. అనంతరం.. సెప్టెంబరు 20న టీటీడీ ఈఓ మీడియా ముందుకొచ్చి ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిలో నాణ్యతలేదని తేలినందువల్ల, ఆ నెయ్యిని వెనక్కి పంపామని, వాడలేదని చెప్పారు. ఆ తర్వాత సెప్టెంబరు 22న మళ్లీ ఈఓ మాట్లాడుతూ.. తాను స్వయంగా సంతకంచేసి, ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చానని చెబుతూ.. అందులోని అంశాలు చదివి వినిపించారు. తమకు ఎన్డీడీబీ రిపోర్టు చాలా గోప్యమని అందులో ప్రస్తావించారు. ఈఓ ఎంతో గోప్యమని చెప్పిన ఎన్డీడీబీ రిపోర్ట్ టీడీపీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చినప్పుడే బాబు రాజకీయ కుట్రలకు రోడ్‌మ్యాప్ వేశారని అందరూ ఊహించారు. ఇప్పుడు తాజాగా చిన్నప్పన్నను టీటీడీ మాజీ చైర్మన్ పిఏ అంటూ పదేపదే సుబ్బారెడ్డిపై దుష్ప్రచారానికి చంద్రబాబు సర్కారు, ఎల్లో మీడియా తెరలేపాయి. -
కృష్ణమ్మకు పోటెత్తిన వరద
గాందీనగర్ (విజయవాడసెంట్రల్)/తాడేపల్లి రూరల్/విజయపురిసౌత్/అచ్చంపేట: భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్‌కు వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల్లోని మున్నేరు, కీసర, వైరా, కట్టలేరు ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో గురువారం రాత్రి 7 గంటల సమయానికి ప్రకాశం బ్యారేజ్ వద్దకు 5.67 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో రెండోప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణా డెల్టాలో పంటలు దెబ్బతినడంతో డెల్టా కాలువలకు నీటి విడుదల నిలిపివేసి, వచ్చిన వరదను వచ్చినట్లు సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజ్ వద్ద నీటిమట్టం 14.6 అడుగులు ఉంది. లీక్ అవుతున్న కొండవీటి వాగు గేట్లు.. అమరావతి కరకట్ట వెంబడి కృష్ణానదిని, కొండవీటి వాగును విడదీస్తూ ఏర్పాటు చేసిన గేట్ల నుంచి భారీగా నీరు లీక్ అయ్యి కొండవీటి వాగులోకి వస్తోంది. ఒక పక్క వాగుకు వచ్చే వరదను ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానదిలోకి విద్యుత్ మోటార్ల ద్వారా తరలిస్తుంటే.. మరో పక్క కృష్ణానదిలోకి వచ్చిన వరద ఇదే గేట్ల ద్వారా లీక్ అయ్యి మళ్లీ కొండవీటి వాగులోకి చేరుతోంది. మొత్తం 18 గేట్లు ఉండగా 15 గేట్ల నుంచి నీరు వాగులోకి చేరుతోంది. ఒకవేళ వాగులోనూ వరద ఉధృతి పెరిగి, ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరిగితే ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం, యర్రబాలెం ప్రాంతాలకు ముప్పు తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగర్ నుంచి 4క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల.. మోంథా తుపాను ప్రభావంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో గురువారం నాలుగు క్రస్ట్‌గేట్లు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు 1,49,139 క్యూసెక్కులు వస్తోంది. ఇక్కడ నుంచి 66,139 క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 312.0450 టీఎంసీల నీరు నిల్వ ఉంది.పులిచింతల నుంచి 4.8 లక్షల క్యూసెక్కులు విడుదల.. పులిచింతల ప్రాజెక్టు నుంచి గురువారం ఉదయం ఎలాంటి సమాచారం లేకుండా సుమారు ఐదు లక్షల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ఒక్కసారిగా వరద ప్రవాహం రావడంతో దిగువన ఉన్న గిరిజన తండాల రైతుల భూములు కోతకు గురై, పంటలు కొట్టుకుపోయాయి. జడపల్లి తండా, కంచుబోడు తండాలకు చెందిన మిర్చి రైతులు ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే పంట నష్టపరిహారం ఇవ్వాలని, కోతకు గురైన భూములను క్రమబద్దీకరించి తమ భూములను తమకు చూపాలంటూ నినాదాలు చేశారు. -
రూ.81.63 కోట్ల పనికి రూ.307.41 కోట్లు!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 5, 5ఏ ప్యాకేజీల్లో 2019 అక్టోబర్ 3 నాటికి మిగిలిన రూ.81.63 కోట్ల విలువైన పని అంచనా వ్యయాన్ని కూటమి ప్రభుత్వం రూ.293.66 కోట్లకు పెంచేసింది. వాటిని 4.68 శాతం అధిక ధరలకు అంటే రూ.307.41 కోట్లకు కోట్ చేసిన ‘ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్’ కు గతేడాది అక్టోబర్ 17న కట్టబెట్టింది. అంటే.. మిగిలిన పని అంచనా వ్యయం కంటే రూ.225.78 కోట్లు (277% అధికం) అంచనాలను పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్.. ఈనాడు రామోజీరావు కుమారుడి వియ్యంకుడు రాయల రఘుకు చెందినది కావడం గమనార్హం. పెంచిన అంచనా వ్యయాన్ని నీకింత నాకింత అంటూ పచ్చ ముఠా పంచుకు తింటోందని సాగు నీటి రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా 2019 ఏప్రిల్ 1న రాజమహేంద్రవరం బహిరంగ సభ వేదికగా కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ‘ఏటీఎం’గా మార్చుకున్నారంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను గుర్తు చేస్తున్నారు.నేడు రామోజీ కుమారుడి వియ్యంకుడికి నజరానా పుట్టా సుధాకర్ యాదవ్ సంస్థ 2019 అక్టోబరు 3 నాటికి రూ.117.05 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. మరో రూ.64.816 కోట్ల విలువైన పనులు మిగిలాయి. పుట్టా సంస్థకు నామినేషన్ పద్ధతిలో అప్పగించిన పనులను రద్దు చేసి, వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని నిపుణుల కమిటీ చేసిన సూచన మేరకు ఆ సంస్థ నుంచి ఆ పనులను తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. 2019 అక్టోబరు 3 నాటికి 5ఏ ప్యాకేజీ కింద రూ.64.816 కోట్లు, ఐదో ప్యాకేజీ కింద రూ.16.82 కోట్లు వెరసి ఆ రెండు ప్యాకేజీల్లో రూ.81.636 కోట్ల విలువైన పని మిగిలినట్లు స్పష్టమవుతోంది. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.293.66 కోట్లకు పెంచి.. ఏడాదిలోగా పూర్తి చేయాలనే నిబంధనతో గతేడాది అక్టోబర్ 17న ప్రభుత్వం టెండర్లు పిలిచింది. 2019 నాటికి.. నేటికీ డీజిల్, స్టీలు, పెట్రోల్, సిమెంటు వంటి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. అయినా సరే అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఇక టెండర్లలో 4.68 శాతం అధిక ధరకు రూ.307.41 కోట్లకు కోట్ చేసిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్‌కు ప్రభుత్వం అప్పగించింది. అంటే మిగిలిన పని అంచనా వ్యయం కంటే రూ.225.78 కోట్ల మేర అంచనాను పెంచి ఆ సంస్థకు అప్పగించినట్లు స్పష్టమవుతోంది. తద్వారా రామోజీ కుమారుడి వియ్యంకుడికి చంద్రబాబు ప్రభుత్వం భారీ నజరానా ఇచ్చిందని సాగు నీటి రంగ నిపుణులు అంటున్నారు.. ఇక పనులు దక్కించుకుని దాదాపు ఏడాది గడిచినా ఇప్పటిదాకా ఆ సంస్థ 50 శాతం పనులు మాత్రమే పూర్తి చేయడం గమనార్హం. నాడు పుట్టాకు నామినేషన్‌పై రూ.142.88 కోట్ల పనులు పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ఐదో ప్యాకేజీ (93.7 కి.మీ నుంచి 111 కి.మీ వరకు) పనులను 2005 మార్చి 23న రూ.181.60 కోట్లతో పూర్తి చేసేలా సాబీర్ డ్యాం అండ్ వాటర్ వర్క్స్ సంస్థ దక్కించుకుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను 2016 సెపె్టంబరు 8న రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది. ఆ తర్వాత రెండున్నర నెలలు తిరగక ముందే అంటే 2016 నవంబర్ 30న ఐదో ప్యాకేజీలో 5.74 కి.మీల కాలువ తవ్వకం.. 11.001 కి.మీ పొడవున లైనింగ్.. 33 కాంక్రీట్ కట్టడాల నిర్మాణాలను ఏపీడీఎస్‌ఎస్ (ఆంధ్రప్రదేశ్ డీటెయిల్డ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్) 60 సీ నిబంధన కింద తొలగించి.. వాటిని 5ఏ ప్యాకేజీ కింద విభజించి, అంచనా వ్యయాన్ని రూ.142.88 కోట్లుగా లెక్కగట్టి నాటి ఆర్థిక మంత్రి యనమల వియ్యకుండు, ప్రస్తుత మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు చెందిన పీఎస్కే–హెచ్‌ఈఎస్(జేవీ) సంస్థకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టేశారు. ఆ పనుల్లో 100.3 కి.మీ నుంచి 102.5 కి.మీ వరకు, 110.5 కి.మీ నుంచి 111.487 కి.మీ వరకు కఠిన శిల (హార్డ్ రాక్)తో కూడిన భూమిని బ్లాస్టింగ్ చేసి తవ్వాలని.. అందుకు 3,77,938 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాల్సి వస్తుందని.. క్యూబిక్ మీటర్‌కు రూ.29.21 చొప్పున రూ.1.11 కోట్లు అదనంగా చెల్లించాలని 2018 మే 22న చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంక్రీట్ నిర్మాణాల్లో మార్పుల వల్ల అదనంగా రూ.38.986 కోట్లు చెల్లించాలని 2018 జూలై 10న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు పీఎస్కే–హెచ్‌ఈఎస్ సంస్థతో పోలవరం అధికారులు సప్లిమెంటరీ అగ్రిమెంట్లు చేసుకున్నారు. దీంతో.. ఆ సంస్థకు రూ.181.866 కోట్ల విలువైన పని అప్పగించినట్లైంది. అప్పటికి ఐదో ప్యాకేజీలో కాంట్రాక్టర్ సాబీర్ డ్యాం అండ్ వాటర్ వర్క్స్ సంస్థకు రూ.16.82 కోట్ల పని మిగిలింది. -
రైతుకు భరోసా ఏదీ?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుకు భరోసా లేకుండా చేశారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోంథా తుపాను బీభత్సం సృష్టించిందని... 15 లక్షల ఎకరాల్లో పంటలపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా పక్కాగా అమలయ్యేదని, రైతుల తరఫున బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించేదని, విపత్తుల కారణంగా పంట నష్టపోతే రైతులకు బీమా పరిహారం దక్కేదని గుర్తుచేశారు. కానీ, కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసిందని, ఇప్పుడు బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న రైతులకు మాత్రమే పంటల బీమా సదుపాయం ఉందని, మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలి? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. బాబు సృష్టించిన మరో విపత్తు ఇది అంటూ మండిపడ్డారు. మోంథా తుపాను నేపథ్యంలో గురువారం వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను కారణంగా సంభవించిన నష్టం, తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఆరా తీశారు. తుపాను సమయంలో పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలవడాన్ని ప్రశంసించారు. పంట నష్టం అంచనాల్లో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చూడాలని, ప్రభుత్వం ఏ తప్పిదానికి ప్రయత్నించినా గట్టిగా ప్రశ్నించాలని, ఆ తప్పిదాన్ని సవరించుకునేలా చొరవ చూపాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే... తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీ అందరికీ అభినందనలు మోంథా తుపాను వచ్చినప్పటి నుంచి, ప్రజలతో మమేకమవుతూ మీమీ ప్రాంతాల్లో అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. పార్టీ పిలుపు మేరకు మీరంతా చాలా చక్కగా, చురుగ్గా పనిచేస్తున్నారు. రైతులు, ప్రజలకు తోడుగా ఈ తుపానులో నిలిచారు. అందుకు మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. రైతులకు తోడుగా నిలవాలి మోంథా తుపాను బీభత్సం ఎక్కువే ఉంది. తీవ్రత తగ్గినా, రైతులపై చాలా ప్రభావం చూపింది. పంటలకు చాలా నష్టం జరిగింది. పొట్ట దశకొచ్చిన పంటలు భారీ వర్షాలకు నేలకొరిగాయి. దీంతో దిగుబడి దారుణంగా పడిపోయే పరిస్థితి ఏర్పడింది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు, అక్కడినుంచి రాయలసీమలోని కర్నూలు, కడప, అన్నమయ్య, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో కూడా మోంథా ప్రభావం ఉంది. 25 జిల్లాలు, 396 మండలాలు, 3,320 గ్రామాల పరిధిలో ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు తోడుగా నిలవాల్సి ఉంది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలపై మోంథా ప్రభావం చూపింది. ఇందులో 11 లక్షల ఎకరాల్లో వరి పంట ఉంది. 1.15 లక్షల ఎకరాల పత్తి, 1.15 లక్షల ఎకరాల వేరుశనగ, 2 లక్షల ఎకరాల మొక్కజొన్న, మరో 2 లక్షల ఎకరాల ఉద్యాన పంటల మీద మోంథా తుపాను ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో పంట నష్టం అంచనాల్లో రైతులకు తోడుగా నిలవాలి. పార్టీ నాయకులంతా రైతులకు అండగా ఉంటూ పనిచేయాలి. జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు ఇది ‘మ్యాన్ మేడ్ కెలామిటీ’ చంద్రబాబు హయాంలో నష్టపోయిన రైతుల పరిస్థితి చూడాల్సి ఉంది. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఈ–క్రాప్ వ్యవస్థ పక్కాగా ఉండేది. రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) సమర్థంగా పనిచేసేవి. వాటిలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఉండి సేవలందించేవారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు కలిసి పనిచేయడం వల్ల ప్రతి రైతుకు భరోసా దక్కేది. నాడు దాదాపు 85 లక్షల మంది రైతులకు దాదాపు 70 లక్షల ఎకరాల్లో ఉచిత పంటల బీమా అమలు చేశాం. కానీ, ఈ రోజు కేవలం 19 లక్షల ఎకరాలకు మాత్రమే, 19 లక్షల మంది రైతులకు మాత్రమే పంటల బీమా ఉంది. ఎవరైతే బ్యాంకులో రుణం తీసుకున్నారో వారికే పంటల బీమా సదుపాయం ఉంది. బ్యాంకర్లు రుణాలిచ్చినప్పుడు, ఇన్సూ్యరెన్స్ కట్టించారు కాబట్టి, కేవలం 19 లక్షల రైతులకు మాత్రమే బీమా ఉంది. మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలి? నాటి 85 లక్షల మంది రైతులు, 70 లక్షల ఎకరాలకు ఉచిత బీమా ఎక్కడ...? ఇప్పుడు కేవలం 19 లక్షల మంది రైతులకు, 19 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా ఎక్కడ...? దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఏడాది ఖరీఫ్, రబీతో పాటు, ఈ ఏడాది కూడా ఏ సీజన్లోనూ ఏ పంటకూ ప్రభుత్వం బీమా ప్రీమియం కట్టలేదు. కాబట్టి ఇది కచ్చితంగా మ్యాన్ మేడ్ కెలామిటీ (మానవ తప్పిదం కారణంగా సంభవించిన విపత్తు). కాబట్టి మనం పార్టీపరంగా రైతులకు అండగా నిలవాలి. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ జీరో ఈ ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ కూడా లేదు. గత ఏడాది జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ 16 నెలల్లో 16 సార్లు తీవ్ర విపత్తులు, తుపాన్లు ఉత్పన్నమయ్యాయి. వీటికి అదనంగా మోంథా తుపాను తోడైంది. దీంతో రైతుల నడ్డి విరిగింది. తుపాను వల్ల 8 మంది చనిపోతే చంద్రబాబు క్రెడిట్ తీసుకోవడం ఏంటి? ఏ ఒక్క మనిషి కూడా చనిపోకుండా ఉంటే క్రెడిట్ తీసుకున్నా అర్థం ఉంటుంది. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అన్ని ప్రకృతి విపత్తుల్లో 16 మంది మాత్రమే చనిపోయారు. ఇక కూటమి పాలనలో ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందింది? ఎంతమంది రైతులకు ప్రభుత్వం తోడుగా నిలిచింది అని చూస్తే ఈ ప్రభుత్వం తరఫున అందిన సాయం గుండుసున్నా. చివరకు ఈ–క్రాప్ కూడా చేయకుండా రైతులను నిర్లక్ష్యం చేశారు. అయినా వారి లెక్కల ప్రకారం దాదాపు 5.5 లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపేణా దాదాపు రూ.600 కోట్లు సబ్సిడీ ఇవ్వాలి. అదికూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మిర్చి క్వింటాల్ రూ.11,781కు కొంటామన్నారు. కానీ, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. పొగాకు కొనుగోలు చేస్తామన్నారు. కానీ, ఎక్కడా ఆ పని చేయలేదు. మామిడి కిలో రూ.12కు కొంటామన్నారు. ఒక్క రైతుకూ మేలు చేయలేదు. ఉల్లి క్వింటాల్‌కు రూ.1,200కు కొంటామన్నారు. కానీ, అక్కడా చేతులెత్తేశారు. ఆ తర్వాత హెక్టారుకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పి, అది కూడా ఇవ్వకుండా మోసం చేశారు. రైతుల కష్టాలకు చంద్రబాబు బాధ్యుడు రాష్ట్రంలో ఈ–క్రాప్ లేదు. దాన్ని నీరుగార్చారు. ఆర్బీకేలను నిరీ్వర్యం చేశారు. ఉచిత పంటల బీమా ఎత్తేశారు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. దీంతో రైతులు చాలా నష్టపోయారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. అందుకే ఇదంతా మ్యాన్ మేడ్ కెలామిటీ. అదే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 54.55 లక్షల రైతులకు తోడుగా నిలుస్తూ రూ.7,802 కోట్లతో ఉచిత పంటల బీమా పరిహారం ఇప్పించాం. ప్రతి ఎకరాకు ఈ–క్రాప్ చేసి, నాడు ప్రభుత్వమే బీమా ప్రీమియం కట్టింది. రైతులపై ఎలాంటి భారం వేయలేదు. కానీ, ఈ ప్రభుత్వంలో అన్నీ మానవ తప్పిదాలే. అవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు తుపాను రూపంలోనూ చాలా నష్టం వస్తోంది. అన్నదాత సుఖీభవ కింద రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చి, చంద్రబాబు మోసం చేశాడు. అందుకే ఈ రోజు రైతులకు జరుగుతున్న నష్టం, వారి కష్టాలకు చంద్రబాబు బాధ్యుడు. ఆయన తప్పిదాల వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నష్టం అంచనా పక్కాగా జరిగేలా చూడాలి ఇప్పుడు రైతులకు మనం తోడుగా నిలవాలి. పంట నష్టం అంచనాలో అండగా ఉండాలి. నష్టం అంచనా పక్కాగా జరిగేలా చూడాలి. ఏ ఒక్క రైతుకూ నష్టం కలగకుండా, వారి తరపున నిలవాలి. మాట్లాడాలి. ప్రజలు కానీ, రైతులు కానీ, పారీ్టకి సంబంధించినవారు కానీ.. ఎవరు కూడా ఎక్కడా మిస్ కాకుండా, ప్రభుత్వం కావాలని తప్పు చేయాలని చూస్తే, వాటిని గట్టిగా ప్రశ్నించాలి. రైతులకు మంచి జరిగేలా చూడాలి. నష్టం అంచనాలో ఎక్కడా, ఏ లోపం లేకుండా పూర్తి చొరవ చూపాలి. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, వైవీ సుబ్బారెడ్డి, కారుమూరి వెంకటనాగేశ్వరరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు, పార్టీ జిల్లాల అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, మజ్జి శ్రీనివాసరావు (చిన్నశీను), శతృచర్ల పరీక్షిత్‌రాజు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, కేకే రాజు, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ముదునూరి ప్రసాదరాజు, దూలం నాగేశ్వరరావు, పేర్ని నాని, దేవినేని అవినాష్, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మేరుగు నాగార్జున, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేవీ ఉషశ్రీ చరణ్, పోచిమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, ఆకెపాటి అమర్నాథ్రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్‌బాబు, అబ్బయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్‌రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇంచార్జి చుండూరి రవి, పార్టీ నాయకులు ఆలూరు సాంబశివారెడ్డి, కడప మాజీ మేయర్ సురేష్, చల్లా మధుసూదన్ రెడ్డి తదితరులు కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం కొనసాగుతోంది. అందులో భాగంగా కోటి సంతకాల సేకరణ చేస్తున్నాం. ఈ కార్యక్రమం కింద నియోజకవర్గాల్లో నవంబరు 11న ర్యాలీలు నిర్వహించాలి. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 28నే అనుకున్నా, మోంథా తుపాను కారణంగా వాయిదా వేయడం జరిగింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పేద విద్యార్థులకు వైద్య విద్య చేరువ అవుతుంది. మరోవైపు ఆ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయి. తద్వారా ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతాయి. -
బాబు గప్పాలకు ఆకాశమే హద్దు!
సాక్షి, అమరావతి: చెప్పేవారు చంద్రబాబు అయితే వినేవాడు వెర్రి వెంగళప్ప.. సీఎం చంద్రబాబు గురువారం నిర్వహించిన మీడియా సమావేశం అచ్చం ఇలాగే సాగింది. వినేవాళ్లు ఏమనుకుంటారో అన్న స్పృహ కూడా లేకుండా ఆద్యంతం ఆయన గప్పాల ప్రవాహం సాగింది. ఈయనకు ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్ కూడా బుర్రకథలో మాదిరిగా తానాతందానా అన్నట్లుగా వంతపాడారు. ఆ వివరాలు..1. ఏ రిజర్వాయర్‌లోకి ఎంత నీరు వస్తుందో, ఎంత నీటిని విడుదల చేయాలో టెక్నాలజీతో ఇప్పుడు తెలుసుకున్నట్లు ముఖ్యమంత్రి గొప్పగా చెప్పారు. నిజానికి.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) దేశంలోని ముఖ్యమైన జలాశయాల ప్రత్యక్ష నిల్వ సామర్థ్యాన్ని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు బులెటిన్లు విడుదల చేస్తుంది. ఏ పరివాహక ప్రాంతంలో ఎంత వర్షం కురుస్తుందో.. తద్వారా ఏ ప్రాజెక్టుకు ఎంత నీరు వస్తుందనే విషయాన్ని రాష్ట్రాలకు చెప్పే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. కానీ, చంద్రబాబు మాత్రం ఇప్పుడే టెక్నాలజీ ద్వారా ఈ విషయాన్ని ఔపోశన పట్టినట్లు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అలాగే, ఎప్పటి నుంచో ప్రతీ రిజర్వాయర్‌కు నీటి పర్యవేక్షణ విధానం ఉంది. వరదలు, వర్షాల ఆధారంగా ఏ ప్రాజెక్టుకు ఎన్ని క్యూసెక్కులు వస్తున్నాయో చూసుకుని దాని కింద ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం సంవత్సరాల తరబడి కొనసాగుతోంది. కొత్తగా ఇప్పుడు టెక్నాలజీతో ఈ అంశాన్ని కనుగొన్నట్లు సీఎం చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా, అతిశయోక్తిగా ఉంది. 2. భూగర్భ జలాలను కూడా రియల్ టైమ్‌లో పర్యవేక్షించినట్లు చంద్రబాబు చెప్పారు. ఈ విషయంలో కూడా దశాబ్దాల తరబడి పర్యవేక్షణ విధానం కొనసాగుతోంది. సెన్సార్లు రియల్ టైమ్ మానిటరింగ్ ఎప్పటి నుంచో ఉంది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో ఇందుకు సంబంధించిన వివరాలు ఏ రోజుకా రోజు దొరుకుతాయి. కొత్తగా ఈ ప్రభుత్వంలో తెచ్చిందేమీ కాదు.3. అన్ని టెక్నాలజీలను అనుసంధానం చేయడంతో పాటు డ్రోన్స్, సీసీ కెమెరాల ద్వారా ఎక్కడ వరద నీరు ఉందో గుర్తించి ఆ నీటిని డ్రై చేశామని సీఎం చెప్పారు. ఇలాంటి రియల్ టైమ్ వ్యవస్థ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా లేదన్నారు. అయితే, డ్రోన్లు, సీసీ కెమెరాలు కూడా కొత్తగా వచ్చినవి కావు. ఎప్పటి నుంచో ఉన్నాయి. అన్ని ప్రభుత్వాలు వీటిని అవసరమైనప్పుడల్లా అవసరమైన మేరకు ఉపయోగిసూ్తనే ఉన్నాయి. 4. రాష్ట్రంలోని అన్ని కుటుంబాల్లో ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు జియో ట్యాగింగ్ చేశామన్నారు. నిజానికి.. ఈ విధానం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడో అమలుచేశారు. ఇళ్లకు గత ప్రభుత్వంలోనే జియో ట్యాగింగ్ చేశారు. చంద్రబాబు చెప్పినట్లు కొత్తగా వచ్చిన విధానమేమీ కాదు ఇది. 5. తుపానులు, వరదలకు సంబంధించి ఉత్తమ మాన్యువల్ రూపొందించినట్లు కూడా చంద్రబాబు గొప్పగా చెప్పారు. కరువు నియంత్రణకు బ్రిటీష్ కాలం నుంచే ఈ మాన్యువల్స్ ఉన్నాయన్నది ముఖ్యమంత్రికి తెలీదనుకోవాలా!?6. తుపాను కదలికలను గంట గంటకు టెక్నాలజీ ద్వారా పర్యవేక్షిస్తూ పౌరులకు 28 రకాల సూచనలతో మెసేజ్‌లు పంపుతూ అప్రమత్తం చేశామని ఐటీ శాఖ కార్యదర్శి కె. భాస్కర్ చెప్పారు. 5000 సచివాలయాల పరిధిలో జాగ్రత్తలు తీసుకుని ముందస్తు హెచ్చరికలను పౌరులకు జారీచేశామన్నారు. వాస్తవానికి.. ఫోన్లలో మెసేజ్‌లు పంపే విధానం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనూ కొనసాగింది. అప్పట్లో సచివాలయాల వారీగా ఇంటింటినీ మ్యాపింగ్ చేసి పౌరులకు అవసరమైన సమాచారాన్ని మెసేజ్‌ల రూపంలో పంపించేవారు. కానీ, ఇప్పుడే ఈ విధానం అమలుచేస్తున్నట్లు ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటోంది. 7. అవసరమైన వారికి మెడిసిన్స్ పంపించామన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకునే సంప్రదాయం దశాబ్దాల కిందట నుంచి ఉంది. దీని ద్వారా ప్రజలు తమ ఇబ్బందులు ప్రభుత్వానికి చెప్పుకుని సాయం పొందడం ఇప్పుడు కొత్తేమీ కాదు.8. కాకినాడ దగ్గర తీరం దాటుతుందనుకుంటే 15 కిలోమీటర్ల తరువాత నర్సాపురం దగ్గర తీరం దాటిందని భాస్కర్ చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం బొక్కబోర్లా పడింది. కాకినాడలో కాకుండా అంతర్వేది వద్ద తుపాను తీరాన్ని దాటింది. అలాగే, వర్షం ఎక్కడ, ఎప్పుడు ఎంత పడుతుందో ముందస్తుగా చెప్పే విధానం ఎప్పటి నుంచో ఉంది. ఈ విషయంలోనూ ప్రభుత్వం అట్టర్‌ఫ్లాప్ అయింది. ఓ విధంగా మోంథా దాగుడుమూతలు ఆడిందని చెప్పి నవ్వులపాలయ్యారు.9. టెక్నాలజీతో వాహనాలను ట్రాకింగ్ చేశామని.. ఇదే తొలిసారన్నారు. ఇది కూడా ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే.. ఆర్టీసీ బస్సుల రాకపోకలను తెలుసుకునేందుకు ఆ సంస్థ తన అధికారిక యాప్‌లోనే ప్రయాణికులకు బస్సుల ట్రాకింగ్ ఆప్షన్ కల్పించింది. అలాగే, నేరాలకు సంబంధించి పోలీసులూ వాహనాలు ట్రాక్ చేస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. 10. మొబైల్, ఇంటెర్నెట్ కమ్యునికేషన్ వ్యవస్థను పక్కాగా చేశామన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటినుంచో అమల్లో ఉంటే సీఎం చంద్రబాబు, ఐటీ కార్యదర్శి భాస్కర్ ఇప్పుడు తామే కనిపెట్టి అమలుచేసినట్లు చెప్పుకోవడం నవ్వు పుట్టిస్తోంది. -
సంక్షోభాలు, తుపాన్లు వస్తే అమెరికా మనలా ఎదుర్కోలేదు
సాక్షి, అమరావతి: ఉపగ్రహ చిత్రాలతో మోంథా తుపాన్ పరిస్థితిని అంచనా వేశామని, భారీవర్షాలు, గాలుల తీవ్రతపై ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. అన్ని టెక్నాలజీలను అనుసంధానించి రియల్‌టైమ్ గవర్నెన్స్‌లో మోంథా కదలికలను పసిగట్టామని, తద్వారా వర్షాలు పడే గ్రామాలను ముందే గుర్తించామని తెలిపారు. కానీ, వర్షాలు అక్కడ కాకుండా వేరేచోట కురిశాయన్నారు. ఓ విధంగా మోంథా దాగుడుమూతలు ఆడిందన్నారు. తుపాన్‌ను టెక్నాలజీ సాయంతో ఎలా ఎదుర్కొన్నామనే అంశాన్ని గురువారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు వివరించారు. ‘‘మెరికాలో సంక్షోభం వస్తే మేనేజ్ చేయలేరు. తుపాన్లు వచ్చినా ఎదుర్కోలేరు. మనం 16 నెలల్లో టెక్నాలజీ వ్యవస్థను తయారు చేశాం. దానిని వినియోగించి అద్భుతంగా ఎదుర్కోగలిగాం. ఏ రిజర్వాయర్‌లో, ఏ చెరువులో ఎంత నీరుందో గుర్తించాం. ఎక్కడెక్కడ పెద్దఎత్తున ప్రవాహాలు వస్తాయో ఊహించి అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేశాం. మరణాలు, ఆస్తి నష్టం బాగా తగ్గించాం. వరద నీటితో పాటు పడిపోయిన చెట్లను వెంటనే తొలగించాం. గతంలో తుపాన్ ప్రభావం తగ్గిన వారం రోజుల వరకు కోలుకునే పరిస్థితి ఉండేది కాదు’’ అని వివరించారు. ‘‘మోంథా బీభత్సం సృష్టించింది. కాకినాడ దగ్గర ఊహిస్తే వేరేచోట తీరం దాటింది. ఇక్కడినుంచి తెలంగాణ వెళ్లింది. వరంగల్‌లో ఒకేసారి 43 సెంటీమీటర్లు వర్షం పడింది. రాష్ట్రంలో మోంథా కారణంగా రూ.5,265.51 కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించాం. పూర్తిస్థాయిలో అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపిస్తాం’’ అని తెలిపారు. పంటలకు రూ.829 కోట్లు, ఉద్యాన రంగంలో రూ.39 కోట్లు, సెరీకల్చర్‌కు రూ.65 కోట్లు, ఆక్వా రంగంలో రూ.1,270 కోట్లు, ఆర్‌అండ్‌బీకి రూ.2,079 కోట్లు, మున్సిపల్ శాఖలో రూ.109 కోట్లు, జల వనరుల విభాగంలో రూ.207 కోట్లు, పంచాయతీరాజ్ రూ.8 కోట్లు, విద్యుత్ శాఖ రూ.16 కోట్లు, పశుసంవర్ధక శాఖలో రూ.71 లక్షల నష్టం వాటిల్లిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 120 పశువులు చనిపోయాయని తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఎదురుచూసే వారి కోసం రూపొందించిన ‘నైపుణ్యం’ పోర్టల్ ఉద్యోగాల గేట్ వేగా ఉండాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రతి నెల, ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని ఆదేశించారు.వరి తినేవారు ఉండరు..టెక్నాలజీ వినియోగం ద్వారా ఆరోగ్య రంగంలో రూ.4, 5 వేల కోట్లు, సాగు నీటి ఎత్తిపోతల విద్యుత్ చార్జీల్లో రూ.8 వేల కోట్ల బడ్జెట్ తగ్గిస్తామని చంద్రబాబు తెలిపారు. ‘‘ఉపగ్రహం ద్వారా పంట ఉత్పత్తి అంచనా వేస్తాం. దానిప్రకారం మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంది. రైతులు ఖరీఫ్, రబీలోనూ వరి పంటనే వేస్తున్నారు. వరి తినేవారు ఉండరు. డిమాండ్ ఉన్న పంటలు వేస్తేనే లాభసాటి. ఈ ఖరీఫ్‌లో 37 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాం’’ అని పేర్కొన్నారు. -
భారత్ మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు
తాడేపల్లి: ఐసిసి మహిళల ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌కి చేరిన భారత మహిళా జట్టుకు మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడాన్ని ఆయన అభినందించారు. ఈ సెమీస్ లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన మహిళా జట్టు ఫైనల్ లో కూడా అలాగే రాణించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. మహిళా జట్టు చారిత్రాత్మక విజయాన్ని కైవసం చేసుకుందని కితాబునిస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఫైనల్‌కు వెళ్లిన టీమ్‌కు ఆయన ఆల్‌ది బెస్ట్ చెప్పారు.What a historic win! A fantastic record-breaking chase by the Indian women's team to beat Australia in the World Cup semi-final! On to the final! All the best, team India!#WomensWorldCup2025 pic.twitter.com/7Qyqc6gIaJ— YS Jagan Mohan Reddy (@ysjagan) October 31, 2025 -
మీడియాపై సీఎం చంద్రబాబు అసహనం
సాక్షి,విజయవాడ: మోంథా తుపాను నివేదికపై మీడియా ప్రశ్నలకు సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘మీకు సంచలన వార్తలే కావాలి, వాస్తవం అవసరం లేదు’అంటూ ఆయన మీడియాపై ఘాటుగా స్పందించారు.గురువారం ఏపీలో బీభత్సం సృష్టించిన మోంథా తుపాను ప్రభావంపై మీడియా ప్రతినిధులు చంద్రబాబును ప్రశ్నించారు. ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టం) ద్వారా తుపాను ప్రభావానికి సంబంధించిన సమాచారం తక్షణమే తెలుసుకున్నామని తెలిపారు. అయితే, ‘ఆ డేటాను కేంద్రానికి పంపించారా?’ అని మీడియా ప్రశ్నించడంతో చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారు. ‘అన్నీ రియల్ టైమ్‌లో ఎలా సాధ్యమవుతాయి?’ అంటూ మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు. ‘మీకు సెన్సేషన్ వార్తలు కావాలి, రియాలిటీ అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు. కేంద్రానికి ఇంకా నివేదిక పంపించలేదని, త్వరలో పంపించాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు. -
అమీన్ పీర్ దర్గా ఉత్సవాలు.. వైఎస్ జగన్‌కు ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు అహ్వానం అందింది. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ అరిఫుల్లా హుస్సేనీ కలిసి ఆహ్వానం అందజేశారు.నవంబర్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ ఈ ఉర్సు మహోత్సవాలు జరుగుతున్నాయని.. ఈ ఉత్సవాలకు హజరుకావాలని వైఎస్ జగన్‌ను కోరారు. వైఎస్ జగన్‌ను కలిసిన కడప మాజీ మేయర్ సురేష్ బాబు, అమీన్ పీర్ దర్గా చీఫ్ ముజావర్ అమీరుద్దిన్, మేనేజర్ మొహమ్మద్ అలీ ఖాన్, బాఖీ ఉల్లాఖాన్ తదితరులు. -
‘కూటమి సర్కార్ రైతుల నడ్డి విరిచింది’
సాక్షి, తాడేపల్లి: తుపాను కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మోంథా తుపాను నేపథ్యంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావంపై పార్టీ నేతలతో చర్చించారు.‘‘పైరు పొట్ట దశలో ఉన్నప్పుడు తుపాను దెబ్బపడింది. దీనివల్ల దిగుబడులు బాగా దెబ్బతింటాయి. నేలకొరిగిన పంట తిరిగి నిలబడ్డం కష్టమయ్యే పరిస్థితి. దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపింది. ఉన్న సమాచారం ప్రకారం 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 11 లక్షల ఎకరాల్లో వరి పంటకు నష్టం దాటిల్లింది. 1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 లక్షల ఎకరాల్లో వేరు శనగ, 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.9 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి. పార్టీ పరంగా రైతులకు తోడుగా నిలబడాలి’’ అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ‘‘మన ప్రభుత్వంలో ఆర్బీకేల వ్యవస్థ అప్రమత్తంగా ఉండేది. ప్రతి పంటకూ ఇ-క్రాప్ చేసే వాళ్లం. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు సమన్వయంతో గట్టిగా పనిచేసేది. ఉచిత పంటలబీమాతో రైతులకు భరోసా ఉండేది. 80 లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండేది. 70 లక్షల ఎకరాల పంట బీమా పరిధిలో ఉండేది. ఇవాళ ప్రీమియం కట్టిన రైతులు 19 లక్షలమందికి మాత్రమే బీమా అందుబాటులో ఉంది. మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం అండగా ఉండాలి...ఈ 16 నెలల్లో అల్పపీడనలు, వాయుగుండాలు, తుపాన్లు కారణంగా 16 వచ్చాయి. ఎంతమందికి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందింది, నష్టపోయిన రైతులను ఎంతమందిని ఆదుకున్నారు చూస్తే.. గుండుసున్నాయే కనిపిస్తుంది. ఏ రైతునూ ఆదుకున్న పరిస్థితి లేదు. ఇ-క్రాప్ అందించిన పరిస్థితి కూడా లేదు. వాళ్లు వేసిన అరకొర లెక్కల ప్రకారమే 5.5 లక్షలమంది రైతులకు రూ.600 కోట్లు పెండింగ్‌లో పెట్టారు. మిర్చికి క్వింటాలుకు రూ.11,781కి కొనుగోలు చేస్తామన్నారు ఒక్క రూపాయికూడా రైతుకు ఇవ్వలేదు. పొగాకును కొనుగోలు చేస్తామ న్నారు దిక్కూ మొక్కూ లేదు. మామిడిని కిలో రూ.12లకు కొనుగోలు చేస్తామన్నారు. ఒక్క రైతుకూ మంచి చేయలేదు. తర్వాత హెక్టారుకు రూ.5౦వేలు ఇస్తామన్నారు. అదికూడా ఇచ్చిన పాపాన పోలేదు...ఇ-క్రాప్ నీరుగార్చారు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేదు. ఏ పంటకూ గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ మానవ తప్పిదాలు. మన హయాంలో మనమే ప్రభుత్వం తరఫున ప్రీమియం కట్టి 54.55 లక్షల మంది రైతులకు రూ.7800 కోట్లు ఇన్సూరెన్స్ ఇప్పించగలిగాం. కాని ఇవాళ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వం రైతుల నడ్డి విరిచింది’’ అంటూ వైఎఎస్ జగన్ మండిపడ్డారు. -
సార్.. సార్.. చేసేస్తున్నాం సర్!
సాక్షి, అమరావతి: ‘సార్.. సార్.. ఆ పనిలోనే ఉన్నాం సర్.. చేసేస్తున్నాం సర్..’ ఇవి ఇంధనశాఖ మంత్రి చెప్పిన మాటలు. అలాగని సీఎంకో, పీఎంకో కాదు.. తోటి మంత్రితో అన్న మాటలు. ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు విద్యాశాఖ మంత్రి లోకేశ్ బుధవారం ఫోన్ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సమస్యలు, ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. బుధవారం సాయంత్రానికి వందశాతం విద్యుత్ పునరుద్ధరిస్తామని మంత్రి గొట్టిపాటి ఆయనకు తెలిపారు. కొన్నిచోట్ల ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలో భాగంగా విద్యుత్ నిలిపివేసినట్లు చెప్పారు. విద్యుత్‌శాఖ సిబ్బంది, అధికారులు, సీఎండీలు కూడా క్షేత్రస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమైనట్లు వివరించారు. గొట్టిపాటి చెప్పిందంతా విన్న లోకేశ్.. విద్యుత్ పునరుద్ధరణ చర్యలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని సూచించారు.అయితే ఇప్పటికే ఇంధనశాఖ మంత్రిగా పేరుకే గొట్టిపాటి గానీ, అసలు నడిపించేదంతా లోకేశ్ అనే ప్రచారం ఉంది. ఉద్యోగుల బదిలీలు, ఉన్నతాధికారుల నియామకాల్లో లోకేశ్ చెప్పిందే జరుగుతోందని, తనమాట కనీసం చెల్లుబాటు కావడం లేదనే అసంతృప్తి మంత్రిలోను ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీటన్నిటికీ బలం చేకూరుస్తూ లోకేశ్ తనకు ఫోన్‌చేసి విద్యుత్‌శాఖపై ఆరాతీశారంటూ గొట్టిపాటి పత్రికా ప్రకటన విడుదల చేయడం ఆయన నిస్సహాయతకు నిదర్శనంగా భావిస్తున్నారు.మరోవైపు లోకేశ్ ఫోన్‌చేసిన అనంతరం గొట్టిపాటి డిస్కంల సీఎండీలతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పోల్ టు పోల్ పెట్రోలింగ్ చేస్తూ సమస్య లేనిచోట విద్యుత్ పునరుద్ధరించాలని అధికారులను మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. అయితే ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వర్షం పడుతున్నందున పునరుద్ధరణకు సమయం పడుతుందని అధికారులు స్పష్టం చేశారు. లోకేశ్‌కు గొట్టిపాటి చెప్పినట్లు బుధవారం సాయంత్రానికి వందశాతం విద్యుత్ సరఫరా పునరుద్ధరణ అసాధ్యమని తేల్చిచెప్పారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రైవేట్ దోపిడీకి పచ్చజెండా
ఇటీవల రాత్రి వేళ కడుపు నొప్పితో ఓ యువతి (19) వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. పాథాలజీ డాక్టర్ ఆమె సమస్యను సరిగా తెలుసుకోకుండానే సీటీ స్కాన్‌కు రిఫర్ చేశారు.ఏకంగా మూడు స్కాన్లు చేశారు. వాస్తవానికి గైనిక్, జనరల్ మెడిసిన్ వైద్యుల సూచన మేరకు అవసరమైతేనే స్కాన్ చేయాలి. కానీ, ఎలాంటి క్లినికల్ నోట్స్ లేకుండా చిన్న రిఫరెన్స్‌తో ఒకేసారి మూడు స్కాన్లు చేశారు. యువతి శరీరాన్ని రేడియేషన్‌కు గురిచేశారు.కొద్ది రోజుల కిందట దాడి ఘటనలో గాయపడిన ఓ వ్యక్తి తిరుపతి జిల్లా గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. మెడికో లీగల్ కేసు (ఎంఎల్సీ) కావడంతో వైద్యుల సూచన మేరకు తలకు సీటీ స్కాన్ చేశారు. ఇదే వ్యక్తికి చెందిన ఆధార్ నంబరుతో మరుసటి రోజు సదరం క్యాంప్‌లో సీటీ బ్రెయిన్ స్కాన్ నిర్వహించారు. అంటే.. 12 గంటల వ్యవధిలో ఒకే వ్యక్తికి రెండుసార్లు స్కాన్.. దీనికి కారణం... ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ నిర్వాహకుల డబ్బుల కక్కుర్తి.వెంకటేశ్ అనే వ్యక్తి కడుపునొప్పితో విశాఖ జీజీహెచ్‌కు వెళ్లగా ఉదరభాగం స్కానింగ్‌కు వైద్యుడు రిఫర్ చేశారు. ఆస్పత్రిలోని పీపీపీ స్కానింగ్ సెంటర్లో... లోయర్, అప్పర్, సైడ్ అంటూ ఏకంగా నాలుగు స్కాన్లు చేసేశారు.సాక్షి, అమరావతి : ఈ ఉదాహరణలను గమనిస్తే ప్రభుత్వఆస్పత్రులకు వెళ్లే పేదలు, మధ్య తరగతి ప్రజల నుంచి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) సేవల రూపంలో ప్రైవేట్ వ్యక్తులు డబ్బును ఎలా దోచేస్తున్నారో, వారి ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తున్నారో అర్థమవుతోంది. ఈ దందాకు అడ్డుకట్ట వేసి, ప్రభుత్వ రంగంలోనే వైద్య సేవలను బలోపేతం చేయడం పక్కనపెట్టి... మరో పదేళ్లు పీపీపీ దోపిడీకి లైసెన్స్ ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ)కు చెందిన ఎనిమిది ఆస్పత్రుల్లో పీపీపీ స్కానింగ్ సేవలను తమవారికి కట్టబెట్టడానికి పరుగులు పెడుతోంది. ఇక్కడ మరో విషయం ఏమంటే... పదేళ్ల తర్వాత మరో ఐదేళ్లు కాంట్రాక్ట్‌ను పొడిగించేలా టెండర్ నిబంధనలను రూపొందించింది. కమీషన్ల కోసం అడ్డగోలు దోపిడీకి... ప్రభుత్వ ఆస్తులు, నిధులను అందినంత దోచేయడానికి ప్రభుత్వ పెద్దలు పీపీపీని ప్రధాన ఆయుధంగా మలుచుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా ఏకంగా 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెడుతున్న తీరును రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉండగా పీపీపీ ప్రాజెక్ట్‌ల పేరిట పెద్దఎత్తున ప్రభుత్వ నిధులకు గండికొట్టారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీటీ స్కాన్, ఎంఆర్ఐ కాంట్రాక్ట్‌లను పదేళ్ల కాల వ్యవధితో ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టారు. కాగా, ఏపీవీవీపీలో పలు ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ కాలపరిమితి ముగుస్తుండడంతో పాటు, కొత్తగా కొన్ని చోట్ల స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో కమీషన్ల కోసం పీపీపీ విధానానికి మళ్లీ జై కొట్టారు. ఇప్పటికే ప్రైవేట్ సంస్థలు బిల్లులను ఎక్కువగా చూపుతూ భారీఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలున్నాయి.ఒకే తరహా స్కాన్‌కు రెండు, మూడు రకాలుగా బిల్లులు పెట్టడం, నకిలీ రిఫరల్ స్లిప్స్‌తో స్కాన్లు చేసినట్లు చూపడం, అవసరం లేకున్నా రోగులకు ఒకటి కంటే ఎక్కువ స్కాన్లు చేస్తూ అటు డబ్బు దండుకుంటూ, ఇటు ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నారు. ఒక సీటీ స్కాన్ 400 ఎక్స్‌రేలతో సమానం. అనవసర సీటీ స్కాన్లతో కేన్సర్ ముప్పుతో పాటు, శరీరంలోని ఇతర భాగాలపైనా ప్రభావం పడుతుందని అంతర్జాతీయ వైద్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి. కానీ, ఇవేవీ పట్టించుకోకుండా ప్రైవేట్ వ్యక్తులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వీరు నిర్వహించే స్కాన్లు, ఎంఆర్ఐలు, బిల్లింగ్‌పై అధికారుల పర్యవేక్షణ లేమి, సరైన ఆడిట్ లేకపోవడంతో మరింతగా రెచ్చిపోతున్నారు. తమవారికి తగినట్లుగా... నిబంధనలతో ప్రస్తుతం రూ.వంద కోట్లకు పైగా విలువైన సీటీ స్కాన్ల కాంట్రాక్ట్‌ను అస్మదీయుడికి కట్టబెట్టేందుకు వారికి తగినట్లు (టైలర్ మేడ్)గా నిబంధనలతో ప్రభుత్వ పెద్దలు టెండర్ డాక్యుమెంట్ రూపొందించారు. పెద్ద ప్రాజెక్టులన్నీ అయినవారికే దక్కేలా చేసేందుకు టెండర్లలో క్వాలిటీ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ (క్యూసీబీఎస్)ను ప్రధాన ఆయుధంగా మలుచుకున్నారు. 108, 104 టెండర్లలో క్యూసీబీఎస్ ఆధారంగానే కనీస అనుభవం లేని సంస్థకు రూ.వేల కోట్ల కాంట్రాక్ట్ వెళ్లేలా చేశారు.అలాగే, ఇప్పుడు కూడా ఓ సంస్థతో కుమ్మక్కైన ప్రభుత్వ పెద్దలు దానికే కాంట్రాక్ట్ దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించారని వైద్య శాఖ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టెక్నికల్ ఎవాల్యుయేషన్కు 80, ఫైనాన్షియల్ బిడ్‌కు 20 మార్కుల ప్రమాణంతో టెండర్ నిబంధనలున్నాయి. 80 మార్కుల్లో 25 టెక్నికల్ ప్రజెంటేషన్ ద్వారా అస్మదీయ సంస్థకు వేసుకునే వెసులుబాటు పెట్టుకున్నారు. మరో ఏడు అంశాల్లోనూ కావాల్సిన వారి సంస్థ అనుకూలతల ఆధారంగానే మార్కులు నిర్దేశించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దోపిడీకి వైఎస్ జగన్ సర్కార్ అడ్డుకట్టవైద్య రంగంలో ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేసి, ప్రభుత్వ రంగంలోనే అన్ని సేవలను బలోపేతం చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ వైద్య, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఎంఎస్ఐడీసీ)లో ప్రభుత్వం ఆధ్వర్యంలో డయగ్నోస్టిక్స్ విభాగం ఏర్పాటు చేయాలని కసరత్తు ప్రారంభించింది. దీంట్లో భాగంగా ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్ నుంచి ఆస్పత్రులకు సీటీ, ఎంఆర్ఐ, క్యాథల్యాబ్స్ వంటి సౌకర్యాలు కల్పించి, ఎంఎస్ఐడీసీ నుంచి వాటిని నిర్వహించేలా చూసింది. రూ.67 కోట్లతో సిటీస్కాన్, ఎంఆర్ఐ పరికరాలను ప్రభుత్వమే సమకూర్చింది. శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరులో సిటీ, ఎంఆర్ఐ, కడప జీజీహెచ్‌లో సిటీస్కాన్ సేవలను జగన్ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో నియమించిన సిబ్బంది వాటిని నిర్వహిస్తున్నారు. ఇక మిగిలిన ఆస్పత్రుల్లో కాంట్రాక్టర్ల గడువు ముగిసినప్పుడు మళ్లీ కొత్తగా ప్రైవేట్ వ్యక్తులకు అవకాశం ఇవ్వకుండా.. ప్రభుత్వమే యంత్రాలు సమకూర్చి నిర్వహించేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రణాళికలు రచించారు. తద్వారా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు, ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి అడ్డుకట్ట వేసి, రోగులకు నాణ్యమైన సేవలను అందించేందుకు చర్యలు చేపట్టింది. కానీ, ఇప్పుడు ప్రజారోగ్య పరిరక్షణ తమ బాధ్యత కాదన్నట్టుగా కూటమి ప్రభుత్వం పీపీపీ దోపిడీ ప్రాజెక్ట్‌లకే ప్రాధాన్యం ఇస్తోంది. -
ప్రభుత్వ ధనం.. ప్రైవేటు లాభం!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల ప్రజలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చెల్లించినట్లు భారీ ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని, ఇలాంటి కేసుల్లో ప్రజా ప్రయోజనాలనే కోర్టులు పరమావధిగా పరిగణించాలని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ బుధవారం హైకోర్టును అభ్యర్థించారు. రాష్ట్రంలో 10 వైద్య కళాశాలలను పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేసేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 590ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ గుంటూరు జిల్లా, తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ కుర్రా వసుంధర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ముందు తాజాగా ఈ పిల్ విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున శ్రీరామ్ తన వాదనలను వినిపిస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలను లీజుకివ్వడం వల్ల ప్రైవేటు వ్యక్తులు రూ. కోట్లు ఆర్జిస్తారన్నారు. కాలేజీలను కేంద్రం, నాబార్డ్ ఇచ్చే నిధులతోనే నిర్మిస్తారని తెలిపారు. లబ్ధి మాత్రం ప్రైవేటు వ్యక్తులే పొందుతారన్నారు. ప్రభుత్వ వైద్య సేవలకు పేదలు దూరమవుతారని పేర్కొన్నారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు కోర్టు అంగీకరిస్తూ తదుపరి విచారణను నవంబర్ 19కి వాయిదా వేసింది. -
811 టీఎంసీల కృష్ణా జలాలను యథాతథంగా కొనసాగించాలి
సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) కేటాయించిన 811 టీఎంసీలను యథాతథంగా కొనసాగించాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) ఎదుట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. అంతర్రాష్ట్ర నదీజల వివాదాల చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూఏ)–1956 సెక్షన్–6(2) ప్రకారం.. ఒక ట్రిబ్యునల్ పరిష్కరించిన జలవివాదాన్ని పునఃసమీక్షించడానికి వీల్లేదని గుర్తుచేసింది. కేంద్రానికి 2013 నవంబర్ 29న కేడబ్ల్యూడీటీ–2 ఇచి్చన తుది నివేదికలో కూడా ఇదే అంశాన్ని పేర్కొందని వివరించింది. బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలను గంపగుత్తగా కేటాయించలేదని, ప్రాజెక్టుల వారీగా కేటాయించిందని తెలిపింది. వాటిని పరిగణనలోకి తీసుకునే 2015 జూలై 18–19న కేంద్ర జల్‌శక్తిశాఖ ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు పంపిణీ చేస్తూ తాత్కాలిక సర్దుబాటు చేసిందని గుర్తు చేసింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కృష్ణానది జలాలను పంపిణీ చేయడంపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ అధ్యక్షతన జస్టిస్ తాళపత్ర, జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి సభ్యులుగా ఏర్పాటైన ట్రిబ్యునల్ బుధవారం ఢిల్లీలో విచారణ చేపట్టింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తుది వాదనలు వినిపించగా.. బుధవారం ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా తుది వాదనలు వినిపించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలు కేటాయిస్తూ తెలంగాణ సర్కార్ జారీచేసిన జీవో 246ను రద్దుచేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన ఐఏ (ఇంటర్ లొకేటరీ) అప్లికేషన్‌పై విచారణ చేసినప్పుడు.. ఆ అంశం తమ పరిధిలోకి రాదని చెప్పి.. ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల పునఃపంపిణీపై ఎలా విచారణ చేపడతారని ట్రిబ్యునల్‌ను ప్రశ్నించారు. దీనిపై ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేష్ కుమార్ స్పందిస్తూ అప్పట్లో విభజన చట్టంలో సెక్షన్–89లో నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వాదనలు విన్నామని, ఆ తర్వాత కేంద్రం అదనపు విధివిధానాలను జారీచేసిందని తెలిపారు. ఇప్పుడు తమ పరిధి పెరిగిందని, బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలను పునఃపంపిణీ చేయడంపై వాదనలు వింటామని చెప్పారు. తర్వాత జయదీప్ గుప్తా వాదనలు కొనసాగిస్తూ.. విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం కృష్ణా జలాలను బేసిన్ పరిధిలోని నాలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయాలా? రెండు రాష్ట్రాలకే పరిమితం చేయాలా? అనే అంశంపై ట్రిబ్యునల్ విచారించి.. 2016 అక్టోబర్ 19న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకే పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీచేసిందని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఐఎస్‌ఆర్‌డబ్ల్యూఏ–1956లో సెక్షన్–3 ప్రకారం విచారణ చేస్తున్నారని, ఇది 2016 అక్టోబర్ 19న జారీచేసిన ఉత్తర్వులకు విరుద్ధమని చెప్పారు. సెక్షన్–3 ప్రకారం కృష్ణా జలాలను పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్సెల్పిలో పేర్కొన్న అంశాలకు విరుద్ధంగా.. అదనపు విధివిధానాలను నిర్దేశిస్తూ 2023 అక్టోబర్ 6న కేంద్రం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ తప్పులతడకగా అభివర్ణించారు. విభజన చట్టంలో సెక్షన్–89లో నిర్దేశించిన మార్గదర్శకాలకే పరిమితమై రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్, రెండు రాష్ట్రాల అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు విచారణకు హాజరయ్యారు.విచారణ నవంబర్ 25–27కు వాయిదా షెడ్యూలు ప్రకారం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ బుధవారం నుంచి శుక్రవారం వరకు కొనసాగాలి. కానీ ట్రిబ్యునల్ సభ్యులు జస్టిస్ రామ్మోహన్‌రెడ్డికి వ్యక్తిగత పనులు ఉండటంతో బుధవారం విచారణను వచ్చే నెల 25, 26, 27 తేదీలకు ట్రిబ్యునల్ వాయిదా వేసింది. వచ్చే నెలలో జరిగే విచారణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా తుది వాదనలను కొనసాగించనున్నారు. -
మోంథా బీభత్సం
సాక్షి నెట్వర్క్: మోంథా తుపాను పంట పొలాలను ముంచెత్తడమే కాకుండా ఇతరత్రా అపార నష్టం కలిగించింది. పలు జిల్లాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. వేలాది వృక్షాలు విరిగిపడ్డాయి. తీర ప్రాంతాలు కోతకు గురయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా చిగురుటాకులా వణికి పోయింది. సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. ఈదురుగాలులు, వర్షాలకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. 119 సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సెల్ టవర్లు పనిచేయక ఫోన్లు మూగబోయాయి. నాగాయలంక మండలం ఎదురుమొండి మండలం దీవిలో జింకల పాలెం రోడ్డు పూర్తిగా కృష్ణా నదిలో కలిసిపోయింది. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఇద్దరు చంటి పిల్లలతో తలదాచుకున్న మహిళ బుధవారం వేకువజామున వాష్ రూంకు వెళ్లగా పాముకాటుకు గురైంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వన్‌టౌన్ పరిధిలోని విద్యాధరపురంలో రేకుల షెడ్‌పై కొండ చరియలు జారి పడటంతో ఇల్లు, అందులోని సామాన్లు ధ్వంసమయ్యాయి. ఆసమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తిరువూరు నియోజకవర్గంలో కట్టెలేరు, పడమటి వాగు, వెదుళ్లవాగు, గుర్రపువాగు, తిప్పలవాగు, అనురాధవాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నల్లవాగు పొంగడంతో నందిగామ–చందర్ల పాడు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పల్నాడు జిల్లాలో గుండ్లకమ్మ వాగు ఉగ్రరూపం దాల్చింది. ఫలితంగా వినుకొండ రూరల్ మండలంలోని అంధుగల కొత్తపాలెం, మదమంచిపాడు శ్రీప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం సమీపంలో వంతెన పైనుంచి ప్రమాదకర స్థాయిలో వరద ప్రవహిస్తోంది. దీంతో గుంటూరు–ప్రకాశం జిల్లాల మధ్య రాకపోకలు స్తంభించాయి. నక్కవాగు పొంగింది. నూజెండ్ల మండలం కొండల్రాయునిపాలెంలో 11 గొర్రెలు నీట కొట్టుకుపోయాయి. వెల్దుర్తి మండలం కుంకుడు చెట్టు తండాకు చెందిన చెంచు గిరిజనుడు గురవయ్యకు చెందిన 10 మేకలు వాగులో గల్లంతయ్యాయి. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు రహదారుల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. నీట మునిగిన వెలుగొండ సొరంగాలుప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని కొత్తూరు వద్ద పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణాల్లోకి వరద నీరు ప్రవేశించింది. రెండు సొరంగాలు పూర్తి స్థాయిలో నీట మునిగాయి. శ్రీశైలం రహదారిలోని గోర్లెస్ కాలువ, కర్నూలు రహదారిలోని దొంగలవాగు, మార్కాపురం రహదారిలోని తీగలేరు వాగులు పొంగి ప్రవహించాయి. శ్రీశైలం ఘాట్‌లోని తుమ్మలబైలు వద్ద కొండచరియలు విరిగి పడ్డాయి. ఫలితంగా బుధవారం సాయంత్రం వరకు శ్రీశైల పుణ్యక్షేత్రానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భక్తులు, యాత్రికులు రాత్రంతా చీకట్లోనే జాగారం చేశారు. పలు వాహనాలను దారి మళ్లించారు. తీగలేరు వాగు ఉధృతంగా ప్రవహించటంతో చిన్నదోర్నాల వద్ద మార్కాపురం–దోర్నాల మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యర్రగొండపాలెం–మాచర్ల హైవే రోడ్డు కోతకు గురికావండతో మంగళవారం అర్ధరాత్రి అటవీ ప్రాంతంలో 6 ఆర్టీసీ బస్సులు, 2 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అట్లేరు వాగు పొంగడంతో కొండపి–అనకర్లపూడి మధ్య, కోయవాగు పొంగడంతో చిన్నకండ్లగుంట–తాటాకులపాలెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు గిద్దలూరు నియోజకవర్గంలో 27 ఇళ్లు, ఒక చర్చి నేలమట్టమయ్యాయి. ఒంగోలు శివారు ప్రాంత కాలనీలన్నీ ముంపులో చిక్కుకున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పలు రహదారుల్లో రాకపోకలు స్తంభించాయి. కొత్తవలస–కిరండోల్ రైల్వేలైన్‌లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. డుంబ్రిగుడ మండలంలోని వంతరాడలో ప్రాథమిక పాఠశాల కుప్పకూలింది. సెలవు కావడంతో చిన్నారులకు పెద్ద ప్రమాదమే తప్పింది. నంద్యాలలో చామకాల్వ, మద్దిలేరువాగు, కుందూ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నంద్యాల సమీపంలో కుందూ ఉధృతంగా ప్రవహిస్తోంది. పట్టణంలోని పలు కాలనీల్లో ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. తాడికొండ: మోంథా తుపాను ప్రభావంతో రాజధాని ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో గుంటూరు నుంచి రాజధానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తాడికొండ మండలం లాం వద్ద వంతెనపై కొండవీటి వాగుకు వరద పోటెత్తడంతో వాహనాలు నిలిచిపోయాయి. పెదపరిమి–తుళ్లూరు మధ్య కోటేళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బుధవారం సాయంత్రం వరకు రాకపోకలు మొదలవ్వలేదు. పాములపాడు–మండెపూడి గ్రామాల మధ్య కొండవీటి వాగు, తాడికొండ–కంతేరు మధ్య ఎర్రవాగు పొంగడంతో లెవల్ చప్టాపై నీరు చేరి వాహనాలు నిలిచిపోయాయి. పెదపరిమి–నెక్కల్లు గ్రామాల మధ్య వరద నీరు రోడ్డెక్కడంతో రాకపోకలు స్తంభించాయి. నీరుకొండ వద్ద కొండవీటి వాగు వరద నీరు భారీగా నిలిచి పోవడంతో ఎస్ఆర్ఎం వర్సిటీ చుట్టూ నీరు చేరింది. పంట పొలాలు పూర్తిగా నీట మునిగి సముద్రాన్ని తలపిస్తోంది. కాగా, అమరావతికి గుంటూరు నుంచి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైంది. పెదపరిమి–తుళ్లూరు మధ్య రోడ్డు ధ్వంసం కావడంతో బుధవారం ఒక్క రోజే 5 ఇసుక లారీలు రోడ్డుపై కూరుకుపోయాయి. -
రూ.12,771 కోట్ల విద్యుత్ చార్జీలపై బహిరంగ విచారణ
సాక్షి, అమరావతి: ‘మాకు ఓట్లేయండి... అధికారం ఇవ్వండి, పాలన చేతికొస్తే విద్యుత్ చార్జీలు పెంచం, అవసరమైతే తగ్గిస్తాం...’ అంటూ ఎన్నికల ముందు ప్రజలను నమ్మించారు కూటమి పార్టీల నేతలు. తీరా ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యుల నడ్డి విరిచేలా చార్జీల భారం మోపుతున్నారు. ఓవైపు ‘సూపర్ సిక్స్’ అంటూ హామీలిచ్చి ఒక్కటీ సక్రమంగా అమలు చేయకుండా మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, మరోవైపు విద్యుత్ చార్జీల పేరుతో బాదుతోంది. తాజాగా రూ.12,771 కోట్ల వడ్డనకు తయారైంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 4వ నియంత్రణ కాలానికి వాస్తవ ఆదాయ, ఖర్చుల వ్యత్యాసాన్ని రూ.12,771.96 కోట్లుగా లెక్కించాయి. ఇందులో ఏపీఈపీడీసీఎల్ రూ.7,790.16 కోట్లు,సీపీడీసీఎల్ రూ.1,935.29 కోట్లు, ఎస్పీడీసీఎల్ రూ.3,046.51 కోట్లు చొప్పున లోటులో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి సమర్పించిన పిటిషన్లలో వెల్లడించాయి. ఈ మొత్తాన్ని విద్యుత్ బిల్లుల్లో కలిపి విధించి, వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతినివ్వాలని కమిషన్‌ను కోరాయి. డిస్కంల పిటిషన్లను విచారణకు స్వీకరించిన కమిషన్... ప్రజలు తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు నవంబర్ 18వ తేదీ ఉదయం 11 గంటలకు కర్నూలులోని కోర్టు హాలులో బహిరంగ విచారణ చేపట్టనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఆది నుంచే...కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే రూ.15,485.36 కోట్ల భారం వేసి విద్యుత్ చార్జీల బాదుడుకు శ్రీకారం చుట్టింది. అందులో గత ఏడాది చివరి నుంచే రూ.6,072.86 కోట్లను వసూలు చేస్తుండగా, ఈ ఏడాది జనవరి బిల్లుల నుంచి మరో రూ.9,412.50 కోట్ల భారాన్ని జోడించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదికి... అంటే 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,787.18 కోట్లు ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసింది. ఇందులో ఇటీవల రూ.1,863.64 కోట్లకు అనుమతి లభించింది. వసూలు చేసిన దానిలో రూ.923.55 కోట్లను ప్రజలకు తిరిగి ఇచ్చేయమని ఏపీఈఆర్సీ చెప్పింది. ఈ లెక్కన ప్రజలపై ఇప్పటివరకు రూ.17,349 కోట్ల మేరకు చార్జీల భారం వేసినట్లైంది. ఇది చాలదన్నట్లు మరో పిడుగు పడనుంది. డిస్కంలు అడుగుతున్న రూ.12,771.96 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించకపోతే ఆ ప్రజల పైనే వేయాల్సి ఉంటుంది. -
చంద్రబాబు ప్రచార ‘విపత్తు’
సాక్షి, అమరావతి: ‘‘కుదర్లేదు కాని... కుదిరితే ఆ మోంథా తుపానును పట్టుకుని తిప్పికొట్టేవారు..!’’ ‘‘ఎన్నో తుపాన్లను సమర్థంగా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది. ఆయన సలహా కోసం ఇతర రాష్ట్రాల సీఎంలే సంప్రదించేవారు..’’ ఇదీ సీఎం చంద్రబాబు గురించి ఎల్లో మీడియాలో సాగుతున్న భజన. విపత్తులను కూడా రాజకీయ మైలేజీకి వాడుకోవడంలో దిట్ట అయిన చంద్రబాబు ఇప్పుడు తుపానును అవకాశంగా తీసుకున్నారు. విదేశాల నుంచి చేరుకున్న బాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ క్షేత్రస్థాయికి వెళ్లకుండా ఆర్టీజీఎస్ కేంద్రం నుంచే హడావుడి చేశారు. ప్రకృతి వైపరీత్యాన్ని తండ్రీకొడుకులే అడ్డుకున్నారన్న స్థాయిలో ప్రచారం హోరెత్తించారు. దీన్నంతటినీ గమనిస్తున్న ప్రజలు విపత్తు సమయంలో కూడా ఈ ప్రచార యావ ఏంటి బాబూ? అని మండిపడుతున్నారు. » మోంథా తుపాను ప్రళయం సృష్టిస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి సమయంలో మంత్రులు సొంత జిల్లాల్లో ఉండి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయ చర్యలను పర్యవేక్షించాలి. స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. ఇలాగైతే తమకు క్రెడిట్ దక్కదనుకున్నారో ఏమో? చంద్రబాబు, లోకేశ్. విదేశాల నుంచి వచ్చాక మోంథాను మొత్తం వారే పర్యవేక్షించినట్టు హైప్ సృష్టించి మిగిలినవారిని డమ్మీలను చేశారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్లనే తుపాను ప్రభావిత జిల్లాల్లో చాలా మంది మంత్రులు ఫోన్లలో ఆదేశాలు, అడపాదడపా పర్యటనలకే పరిమితం అయ్యారని గుసగుసలాడుతున్నారు. ఈ విషయాన్ని టీడీపీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు సైతం అంగీకరిస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తోపాటు మరో ముగ్గురు మంత్రులు అమరావతి నుంచే హడావుడి చేశారు. కానీ, తండ్రీకొడుకులే అంతా పర్యవేక్షిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఈ మేరకు ఎల్లో మీడియా సైతం విపరీతంగా ప్రచారం చేసింది. దీన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్దఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. » మోంథా తుపానుతో పెను ముప్పు అని ప్రజలు ఆందోళన చెందినా కొద్దిపాటి ప్రభావంతో తీరం దాటింది. ప్రభుత్వ పెద్దలు ప్రచారం ఊదరగొట్టినా పలుచోట్ల పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి సకాలంలో ఆహారం కూడా అందించలేకపోయారు. అయినా, ఎంతో చేసేసినట్టు అదే పనిగా ప్రచారం ఊదరగొట్టడంపై బాధితులు మండిపడుతున్నారు. భారీ వర్షాలు లేనప్పుడు నీరు వస్తుందా? వ్యవస్థలను మేనేజ్ చేయడంలో, వాస్తవాలకు మసిపూయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబుతో పాటు పచ్చ పత్రికలు మోంథా వేళ కూడా అదే పంథాలో నడిచాయి. అయితే, గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా దానికీ పెద్ద కలరింగ్ ఇచ్చారు. వర్షాలకు బుడమేరు ప్రాంతం మునిగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇక్కడ ఇలాంటి పరిస్థితి లేదంటూ ఓ పత్రికలో పెద్ద ఫొటోతో వార్త ప్రచురించారు. ఇది చూసిన పాఠకులు అసలు భారీ వర్షాలు లేకుండా ఎలా నీరు చేరుతుంది? ఈ రాతలు ఎవరి మెప్పు కోసం? అని చర్చించుకోవడం కనిపించింది. ‘ఆయన రెండు చేతుల్తో పట్టుకొని ఈ తుపాన్‌ను వెనక్కు పంపేవాడే.. ఆ రోజులుకూడా వస్తాయి.. ‘!! మహాటీవీ బిల్డప్..!! నిజమే కదా.! ఆయన వేసవికాలంలో టెంపరేచర్ తగ్గిస్తాడు. ఎద్దులతో విద్యుత్ ఉత్పత్తి చేస్తాడు. సముద్రాన్ని వెనక్కు పంపుతాడు అసలాయన తలుచుకుంటే కానిదేముంది బాబు.!! – ఓ నెటిజన్ -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు ప్రమాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సమంతో ప్రమాణం చేశారు. కోర్టు మొదటి హాలులో బుధవారం జరిగిన కార్యక్రమంలో జస్టిస్ సుభేందుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అంతకుముందు జస్టిస్ సుభేందు బదిలీకి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్ సుభేందు కుటుంబసభ్యులు.. అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్.ద్వారకనాథరెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పసల పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, హైకోర్టు రిజిస్ట్రార్లు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. పలువురు న్యాయవాదులు, శ్రేయోభిలాషులు జస్టిస్ సుభేందును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన.. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావుతో కలిసి కేసులను విచారించారు. దుర్గమ్మ సేవలో.. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభేందు సమంతో దర్శించుకున్నారు. నూతన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరణకు ముందు జస్టిస్ సుభేందు సమంతో దంపతులు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించగా, అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవ్రస్తాలను అందజేశారు. –ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ) -
నేడు తుపానుపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: మోంథా తుపాను నేపథ్యంలో వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో గురువారం ఉ.11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తుపాను తర్వాత జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, పంట నష్టం వంటి వివరాలను పార్టీ కేడర్‌ను ఆయన అడిగి తెలుసుకోనున్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలన్న వైఎస్ జగన్ పిలుపు మేరకు పార్టీ నాయకులు, శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేశారు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకూ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ కార్యకర్తలు తుపాను బాధితులకు బాసటగా నిలిచారు. ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించడంలో, వారికి ఆహారం అందించడంలో సేవలందించారు. తుపానువల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన బాధితులకు భరోసా ఇవ్వడంతో పాటు వివరాలను సేకరించారు. వాటిని వీడియో కాన్ఫరెన్స్‌లో వైఎస్ జగన్‌కు వివరించనున్నారు. -
పంటలపై 'మోంథా' తాండవం!
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ‘మోంథా’ తుపాను రైతుల ఆశలను చిదిమేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎటు చూసినా లక్షలాది ఎకరాల్లో పంటలు నేలకొరిగాయి. వరి, మొక్క జొన్న, పత్తి, అరటి ఇలా ఏ పంట చూసినా ముంపు నీటిలో నానుతున్నాయి. కోతకొచ్చే దశలో తుపాను బారిన పడడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలపై తీవ్ర ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. తుపాను ప్రభావం వల్ల 30 శాతం మేర దిగుబడులు తగ్గిపోనున్నాయని ప్రాథమిక అంచనా. తుపాను ప్రశాంతంగానే తీరం దాటినప్పటికీ, కుండపోత వర్షాలతో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలను అతలాకుతలం చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాంధ్ర మొదలు బాపట్ల వరకు.. ఒంగోలు నుంచి తిరుపతి వరకు వ్యవసాయ, ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. తీర ప్రాంత జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. పలు జిల్లాల్లో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. కోతకొచ్చిన పంట ఇలా నీటి పాలవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. భారీగా తగ్గనున్న దిగుబడులతో వందల కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తి నష్టం రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో నీటమునిగిన మొక్కజొన్న రాశులు ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి.. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి అడుగడుగునా కూటమి ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యానికి తోడు అతివృష్టి–అనావృష్టి వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులకు ఎదురొడ్డి రైతులు పంటలు సాగు చేశారు. ప్రభుత్వం అదునుకు విత్తనాలతోపాటు యూరియా అందించలేకపోయింది. ఆగస్టు 7వ తేదీ వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, ఆ తర్వాత కురిసిన అధిక వర్షాలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఓ వైపు పెట్టుబడులు తడిసి మోపెడైనా.. మరోవైపు ప్రభుత్వం పట్టించు కోకపోయినా మొక్కవోని పట్టుదలతో ఖరీఫ్ సాగు చేశారు. ఈ ఏడాది సాగు లక్ష్యం 86.32 లక్షల ఎకరాలు కాగా, అతికష్టమ్మీద 72.90 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. లక్ష్యానికి మించి ఇప్పటి వరకు వరి, మొక్కజొన్న పంటలు మాత్రమే సాగయ్యాయి. 38.97 లక్షల ఎకరాల్లో వరి, 11 లక్షల ఎకరాల్లో పత్తి, 5 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 4.67 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగయ్యాయి. వరి, మొక్కజొన్నకు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు, పత్తికి రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టారు. అయితే మోంథా తుపాను వల్ల దాదాపు 8 లక్షల ఎకరాలకు పైగా వరి, 1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.9 లక్షల ఎకరాల్లో ఉద్యాన.. ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. వరి పంటపై 30 శాతం ప్రభావం సాగైన వరి విస్తీర్ణంలో 30 శాతం పంటను తుపాను దెబ్బ తీసిందని తెలుస్తోంది. తుపాను ప్రభావిత జిల్లాల్లో దాదాపు 6–10 లక్షల ఎకరాలకు పైగా పంట ముంపునకు గురైనట్టుగా అంచనా. ఇతర పంటలన్నీ కలిపి మరో నాలుగైదు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నట్టు సమాచారం. లేటుగా నాట్లు వేసిన చోట పంట నిలదొక్కుకున్నప్పటికీ ముందుగా సాగైన చోట మాత్రం పంట చాలా వరకు దెబ్బతిన్నట్టు రైతులు చెబుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని సెంట్రల్–ఈస్ట్రన్ డెల్టా పరిధిలో పంటలు ఎక్కువగా దెబ్బతినగా, ఉత్తరాంధ్ర, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కుండపోత వర్షాల వల్ల అపార నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. నంద్యాల జిల్లా పాములపాడు మండలంలోని భవనాశి వాగు వెంట నీట మునిగిన మొక్కజొన్న తోట కృష్ణా, గోదావరి లంకల్లో అరటి, బొప్పాయి పంట దెబ్బతినగా.. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మిరప పంట దెబ్బతింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అధికారికంగా 396 మండలాల పరిధిలో 2,320 గ్రామాల్లో 1.38 లక్షల మంది రైతులకు సంబంధించి 2.82 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగాప్రాథమికంగా అంచనా వేసింది. దాంట్లో ప్రధానంగా 1.79 లక్షల ఎకరాల్లో వరి, 75 వేల ఎకరాల్లో పత్తి, 15 వేల ఎకరాల్లో మినుము, 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్టుగా చెబుతోంది. నంద్యాల యార్డులో కొనేవారు లేక విక్రయానికి సిద్ధంగా ఉంచిన మొక్క జొన్న రాసులు తడిసిపోవడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. తగ్గనున్న దిగుబడులపై అన్నదాత గుబులు అధిక వర్షాల కారణంగా లక్షలాది ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైంది. వర్షాలు పూర్తిగా తెరిపినిచ్చి, ముంపు నీరు కాస్త దిగినా ముంపునకు గురైన ప్రాంతాల్లోని పంట ఆశించిన దిగుబడి వచ్చే అవకాశాలు ఎంతమాత్రం లేవంటున్నారు. గతేడాది హెక్టారుకు 5,578 కిలోలు చొప్పున దిగుబడి రాగా, ఈ ఏడాది 5,543 కిలోలకు మించి రాదని మొదటి ముందస్తు అంచనాలను బట్టి లెక్కగట్టారు. కానీ ఈ తుపాను ప్రభావం వల్ల దిగుబడి కాస్త 4,000–4,500 కిలోలకు పడిపోతుందని తాజా అంచనా. మొదటి ముందస్తు అంచనా ప్రకారం 81.87 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయగా, తుపాను ప్రభావం వల్ల 65 లక్షల టన్నులకు మించదని తెలుస్తోంది. మరొక వైపు గతేడాది పత్తి హెక్టార్‌కు 442 కిలోలు రాగా, ఈ ఏడాది 357 కిలోలు, మొక్కజొన్న గతేడాది 4,710 కిలోలు రాగా, ఈసారి 4,259 కిలోలు, కంది గతేడాది 171 కిలోలు రాగా, ఈసారి 117 కిలోలు, వేరుశనగ గతేడాది 258 కిలోలు రాగా, ఈ ఏడాది 149 కిలోల చొప్పున దిగుబడులొస్తాయన్నది మొదటి ముందస్తు అంచనా. అయితే తుపాను ప్రభావంతో కనీసం 20–30 శాతం మేర పంటల దిగుబడులు తగ్గి పోతాయని తెలుస్తోంది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో నేలకొరిగిన వరి పైరును నిలబెడుతున్న రైతు పంట నష్ట పరిహారం పరిస్థితీ అంతే వైఎస్ జగన్ ప్రభుత్వం ఉండగా ఏ సీజన్‌కు సంబంధించిన పంట నష్టపరిహారాన్ని అదే సీజన్ ముగిసేలోగా అందజేసేవారు. ఇప్పుడా పరిస్థితి మచ్చుకైనా కన్పించడం లేదు. నిర్ణీత గడువులోగానే వ్యవసాయ, ఉద్యాన శాఖలు తుది అంచనాలు తయారు చేస్తున్నప్పటికీ పరిహారం మంజూరు విషయంలో మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కరువు సాయంతో పాటు పంట నష్ట పరిహారాన్ని కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎగ్గొడుతూనే వస్తోంది. గడిచిన 17 నెలలుగా పెండింగ్ ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు 5.50 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.595 కోట్లకు పైగానే ఉన్నాయి. వీటిలో గతేడాది వరదలతో పాటు అకాల వర్షాలకు సంబంధించి 76.75 కోట్లు ఉండగా, ఖరీఫ్ 2024, రబీ 2024–25 సీజన్లకు సంబంధించి దాదాపు రూ.100 కోట్లకు పైగా కరువు సాయం రూ.వంద కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో నిలిచిన ఖరీఫ్ 2023, రబీ 2023–24 సీజన్లకు సంబంధించి మరో రూ.311.39 కోట్లు కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం గాజుల్లంక–పోతార్లంక రోడ్డులో నేలమట్టమైన అరటి తోట కదిలిస్తే కన్నీరే.. మోంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దాదాపు రాష్ట్రంలోని సగం జిల్లాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. రైతులను కదిలిస్తే చాలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒక్క నంద్యాల జిల్లాలోనే 1.05 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు స్పష్టమవుతోంది. కర్నూలు జిల్లాలో వేలాది ఎకరాల్లో వాణిజ్య, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో వేలాది ఎకరాల్లో వేరుశనగ, వరి, టమాటా, ఉద్యాన పంటలు నీట మునిగాయి. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా దాదాపు 33వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. పల్నాడు జిల్లాలో ప్రధానంగా 43,375 ఎకరాల్లో పత్తి, 5,250 ఎకరాల్లో వరి, 3,048 ఎకరాల్లో మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. బాపట్ల జిల్లాలో వరి, పత్తి, మినుము, సోయాబీన్, మిర్చి, అరటి, బొప్పాయి పంటలు.. మొత్తంగా 12,293 ఎకరాల్లో నెలకొరిగాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరి పంటతోపాటు బొప్పాయి, అరటి, కూరగాయ పంటలకు అపార నష్టం వాటిల్లింది. 1,15,892 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. ఉద్యాన పంటలకు రూ.73.45 కోట్ల నష్టం జరిగినట్టు అంచనా. ఎన్టీఆర్ జిల్లాలోని 17 మండలాల్లో 42,483 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. విజయనగరం జిల్లాలో రూ.60 కోట్ల మేర పంట నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం జిల్లాలో 6 వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. వేలాది కొబ్బరి చెట్లు పడిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 10,309 ఎకరాల్లో పంట నీట మునగ్గా, ఈదురు గాలుల ధాటికి 16,072 ఎకరాల్లో వరి పంట నేలవాలింది. వేలాది ఎకరాల్లో ఆక్వా పంటకు నష్టం వాటిల్లింది. నల్లి క్రిక్ సముద్రపు ఆటుపోట్లతో చెరువుల గట్లు తెగి ముంపు బారిన పడ్డాయి. ఏలూరు జిల్లాలో 15 వేల ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. వర్షాలు, చలిగాలుల ప్రభావంతో చెరువుల్లో ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతుండటం ఆక్వా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో 16,092 హెక్టార్లలో వరి నేలకొరిగింది. వేలాది హెక్టార్లలో ఇతర పంటలు దెబ్బతిన్నాయి. నెల్లూరు జిల్లా పాతదేవరాయపల్లిలో నీటిలో తేలియాడుతున్న వరి పైరు ఉచిత పంటల బీమా ఉండి ఉంటే..⇒ కూటమి ప్రభుత్వంలో పంటలకు ఈ–క్రాప్ లేదు.. ఇన్సూ్యరెన్సూ లేదు.. ఇన్పుట్ సబ్సిడీ అంతంతే.. పెట్టుబడి సాయం రూ.40 వేలకు గాను తూతూ మంత్రంగా కొద్ది మందికే రూ.5 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఉల్లి, టమాటా పంటలకు కూలి కూడా దక్కక పశువులకు వదిలేస్తున్న దీన స్థితి. కూటమి ప్రభుత్వం ఆర్బీకేలను పూర్తిగా నిర్వీర్యం చేసి రైతులకు తీవ్ర అన్యాయం చేసింది. రైతులకు విత్తనాలు, ఎరువులు అందకుండా చేసింది. ⇒ ఉచిత పంటల బీమా పథకం ఉండి ఉంటే ఇలాంటి విపత్తు వేళ రైతులకు అక్కరకొచ్చేది. నూరు శాతం కవరేజీతో నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతి ఎకరాకు బీమా రక్షణ లభించేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేకుండాపోయింది. కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అటకెక్కించి స్వచ్ఛంద నమోదు పద్ధతిన పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ప్రీమియం భారం కావడంతో ఈ పథకంలో చేరేందుకు రైతులెవ్వరూ ముందుకు రాలేదు. ⇒ ఉచిత పంటల బీమా పుణ్యమా అని ఖరీఫ్–2024లో 84.80 లక్షల మంది రైతులు 69.51 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటలకు బీమా రక్షణ పొందగలిగారు. ఉచిత పంటల బీమాను ఎత్తివేయడంతో రబీ 2024–25 సీజన్లో 9.93 లక్షల ఎకరాలకే పరిమితం కాగా, 7.65 లక్షల మంది రైతులు మాత్రమే బీమా కవరేజ్ పొందలిగారు. ఖరీఫ్ 2024–25 సీజన్లో 19.60 లక్షల ఎకరాల్లో మాత్రమే బీమా కవరేజ్ లభించగా, 19.51 లక్షల మంది బీమా చేయించుకోగలిగారు.⇒ 2024 జూన్‌లో చెల్లించాల్సిన రూ.930 కోట్ల ప్రీమియం బకాయిలను కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టడంతో 2023–24 సీజన్‌కు సంబంధించి రూ.1,385 కోట్లు నేటికీ రైతులకు అందని పరిస్థితి నెలకొంది. మరొక వైపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరీఫ్ 2024 సీజన్‌కు రూ.894.62 కోట్లు, రబీ సీజన్‌కు రూ.758.74 కోట్లు, ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రూ.774.87 కోట్లు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ప్రీమియం చెల్లించాల్సి ఉండగా, ఒక్క పైసా కూడా చెల్లించిన పాపాన పోలేదు. ఫలితంగా పంటల బీమా పరిహారం అందని ద్రాక్షగా మారింది.తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి– పట్లంట్ల రోడ్డులోని ఓ తోటలో విరిగిపడిన బొప్పాయి చెట్లు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలిపంట నష్టం అంచనాలు పక్కాగా రూపొందించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో మాదిరిగా తూతూ మంత్రంగా చేపట్టడం కాకుండా, పక్కాగా చేపట్టి సాధ్యమైనంత త్వరగా రైతుల ఖాతాకు పరిహారం జమ చేయాలని, పెండింగ్ బకాయిలు కూడా చెల్లించాలని కోరుతున్నాయి. ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా విపత్తుల్లో దెబ్బతిన్న వరి పంటకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆ మాటను నిలబెట్టు కోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఉచిత పంటల బీమాను కొనసాగించి, నూరు శాతం పంటల బీమా వర్తింప చేయాలని, దెబ్బతిన్న ప్రతి ఎకరాకు ప్రభుత్వమే బాధ్యతగా తీసుకొని పంటల బీమా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. తుపాను అనంతరం పంటలను కాపాడుకునేందుకు పంటను బట్టి ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు రైతులకు ఖర్చవుతుందని అంచనా. ఇందు కోసం ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి, లేబరు ఖర్చును పూర్తిగా ఈ పథకం కింద ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.గుంటూరు జిల్లా తాడికొండలో పత్తి పొలంలోకి చేరిన వరద నీరు ప్రభుత్వం ఆదుకోకపోతే మేం బతకలేంనాలుగెకరాల్లో పత్తి, రెండెకరాల్లో కంది పంటలను సాగు చేశాను. పత్తి తీతలు ప్రారంభమయ్యే దశలో తుపాను కారణంగా కాయలు కుళ్లిపోయాయి. ఎకరాకు 3–5 క్వింటాళ్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కంది పంట పూర్తిగా నేలవాలింది. తీవ్రంగా నష్టపోయాను. నాలాంటి రైతులు ఎంతో మంది నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకోకపోతే మేం బతకలేం. – బొల్లా మాలకొండయ్య, నాదెండ్ల, పల్నాడు జిల్లాపంట పూర్తిగా నేలకొరిగింది నాకు ఉన్న రెండు ఎకరాలతో పాటు మరో ఎనిమిది ఎకరాల భూమి కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాను. రూ.3 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాను. తుపాను వల్ల పంట పూర్తిగా నేలకొరిగింది. ప్రభుత్వం న్యాయం చేసి మాలాంటి రైతులను ఆదుకోవాలి. – కాళా వెంకటరావు, ఊలపల్లి గ్రామం, బిక్కవోలు మండలం, తూర్పుగోదావరి జిల్లానారుమళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి వరి పంట సాగు చేయడానికి పోసుకున్న నారుమళ్లు తుపానుతో పూర్తిగా దెబ్బతిన్నాయి. మరో 20 రోజుల్లో నాట్లు వేయాల్సి ఉంది. అయితే పూర్తిగా దెబ్బతింది. మళ్లీ నార్లు పోసుకోవాల్సి ఉంది. మరోసారి విత్తనాలు కొనుగోలు చేయడానికి ఆర్థిక స్తోమత లేదు. ప్రభుత్వం విత్తనాలు రైతులకు ఉచితంగా అందించాలి. – కృష్ణయ్య, రైతు, వాకాడు మండలం, తిరుపతి జిల్లా పంట పూర్తిగా నానిపోయింది ఈ ఏడాది చోడి (రాగులు) పంట వేసిన సమయంలో విపరీతమైన ఎండ వల్ల పంట ఎండిపోయింది. కొద్దోగొప్ప మిగిలిన పంట చేతికందే సమయంలో తుపాను కారణంగా చేనంతా నేలకొరిగింది చోడి కంకులు పూర్తిగా నానిపోయాయి. ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం ఆదుకోవాలి. – పి.విశ్వనాథ్, గిరిరైతు, బోసుబెడ గ్రామం, అరకులోయ చివరికి కన్నీళ్లే మిగిలాయిమూడు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాం. పంట బాగా పండిందని సంబరపడ్డాం. తుపాను ఉందని తెలియడంతో కల్లాల్లో ఉంచితే మొక్కజొన్నలు తడిచి పోతాయని భయపడ్డాం. వ్యవసాయ మార్కెట్ యార్డులో నిల్వ ఉంచితే తడవకుండా గట్టెక్కుతామని కూలీలను పిలిపించుకుని మొక్కజొన్నను ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్‌కు తరలించాం. గంట గంటకు వరద నీరు వచ్చి చేరింది. కళ్ల ముందే మొక్కజొన్నలు కొట్టుకుపోతుంటే కాపాడుకోలేకపోయాం. ఏడు రోజులు తిప్పలు పడుతూ పంటను కాపాడుకుంటే కష్టమంతా వర్షం పాలైంది. – శ్రీదేవి, క్రిష్ణాపురం, ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లాఈ అప్పు ఎలా తీర్చుకోవాలయ్యా?కూలీనాలీ చేసుకుంటూ మాకున్న పొలంతో పాటు మరికొంత పొలం కౌలుకు తీసుకుని మూడు ఎకరాల్లో వరి పంట సాగు చేశాం. నారు పోసిన సమయం నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.1.30 లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెట్టాం. తీరా‡ కోతకు వచ్చి కోసుకునే సమయంలో తుపాను దెబ్బకు పైరు మొత్తం నేలకు వాలిపోయింది. వర్షం అలానే కురుస్తుండడంతో ధాన్యానికి మొలకలు వచ్చాయి. ప్రస్తుతం కోసుకునే పరిస్థితులు కనిపించడం లేదు. చేసిన అప్పు ఎలా తీర్చాలో దిక్కు తోచడం లేదు. – పి.రాజమ్మ, ఉప్పలపాడు , నెల్లూరు జిల్లా -
నారా లోకేష్ పేరుతో సైబర్ నేరం.. 54 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
విజయవాడ: ప్రభుత్వం నుంచి మెడికల్ హెల్ప్ కోసం ఎదురుచూస్తున్న బాధితులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. మంత్రి నారా లోకేష్ పేరును ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. లోకేష్ ఫోటో ఉపయోగించి సైబర్ కేటుగాళ్లు ఈ నేరాలకు పాల్పడ్డారు. అమాయకుల వద్ద నుంచి లక్షల రూపాయలు దోచేసిన ముగ్గురు నిందితులు. సోషల్ మీడియా వేదికగా సురేంద్ర టిడిపి ఎన్.అర్.ఐ కన్వీనర్ అంటూ మోసాలు చేశారు.వాట్సాప్ డీపి నారా లోకేష్ ది ఉండటంతో నిజమని నమ్మిన బాధితులు. నిందితులు రాజేష్, సాయి శ్రీనాథ్, సుమంత్‌లను సీ.ఐ.డీ పోలీసులు అరెస్ట్ చేశారు. పది లక్షల రూపాయలు వీత్ డ్రాకి అనుమతి వచ్చింది అంటూ.. ట్యాక్స్ లు పేరిట బాధితుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ ఘటనలో 9 మంది బాధితుల నుంచి 54 లక్షల రూపాయల కాజేసిన కేటుగాళ్లు. -
బాబు కుతంత్రం
సాక్షి, అమరావతి: ఛత్తీస్‌గఢ్.. దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటి. చిన్న రాష్ట్రం, 33 జిల్లాలు.. 3.10 కోట్ల జనాభా.. 99 అసెంబ్లీ నియోజకవర్గాలు.. ఏడాదికి రూ.1.41 లక్షల కోట్ల రెవెన్యూ.. ఇంతటి వెనుకబడిన రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు ఉంటే.. వాటిలో 12 ప్రభుత్వానికి చెందినవే. ఆ రాష్ట్ర ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు వీలుగా మరో నాలుగు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.1,300 కోట్లతో నాలుగు కొత్త కళాశాలల నిర్మాణానికి ఆ రాష్ట్ర వైద్య శాఖ టెండర్లను ఖరారు చేసింది. ఒకటి, రెండేళ్లలో ఆ రాష్ట్రంలో ప్రతి 19 లక్షల మందికి ఒక ప్రభుత్వ వైద్య కళాశాల అందుబాటులోకివస్తుంది. ఏపీ పరిస్థితి ఇదీజనాభా.. విస్తీర్ణం.. రెవెన్యూ వంటి అన్ని అంశాల్లో ఛత్తీస్‌గఢ్ కంటే ముందుండే ఏపీలో పరిస్థితి పరిశీలిస్తే.. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 5.50 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. ఈ జనాభాకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో ప్రారంభించిన ఐదు కళాశాలలతో కలిపి 16 ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. ఈ లెక్కన ఏపీలో 34 లక్షల జనాభాకు ఒక ప్రభుత్వ కళాశాల ఉంది. దేశంలోని అతి చిన్న, వెనుకబడిన రాష్ట్రాలు సైతం ప్రజారోగ్యం, పిల్లల భవిష్యత్‌కు బంగారుబాట వేసేలా ప్రభుత్వ రంగంలో విద్యా, వైద్య వ్యవస్థలను బలోపేతం చేస్తున్నాయి. ఈ రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 150కి పైగా కొత్త కళాశాలల ప్రారంభానికి అనుమతులిచ్చింది. వీటిలో 80 వరకు వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ కళాశాలలే ఉన్నాయి. ఏపీలో మాత్రం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యల ఫలితంగానే గత ఏడాది పాడేరు వైద్య కళాశాల అందుబాటులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక..అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలే ఉన్నప్పటికీ చంద్రబాబు కొత్త ప్రభుత్వ కళాశాలల ఏర్పాటు దిశగా అడుగులు వేయకపోగా.. గత ప్రభుత్వంలో వచ్చిన కళాశాలలను సైతం ప్రైవేటుకు అప్పగించేస్తున్నారు. ఇందుకోసం పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కేరళతో పాటు దేశంలో అత్యంత వెనుకబడిన, చిన్న రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, హరియాణ , హిమాచల్‌ప్రదేశ్, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో సైతం లేనివిధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుకు కట్టబెడుతుండటం చర్చనీయాంశంగా మారింది. పీపీపీ ముసుగులో ఏకంగా 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రైవేట్‌కు ధారాదత్తం చేస్తుండటంపై అన్నివర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఛత్తీస్‌గఢ్ వంటి చిన్న రాష్ట్రం, ఏపీతో పోలిస్తే ఆర్థికంగా ఎంతో వెనుకబడిన రాష్ట్రం సైతం ఒకేసారి రూ.1,300 కోట్లతో 4 ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మిస్తోంది. భూములు సేకరించి, టెండర్లు ప్రక్రియ పూర్తిచేసి, తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న కళాశాలలను సైతం చంద్రబాబు ప్రైవేట్‌కు కట్టబెట్టి ప్రభుత్వ వైద్యరంగాన్ని ధ్వంసం చేస్తుండటం గమనార్హం.రూ.5 వేల కోట్లు లేవంటూ..రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కల్పన, మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను పెంచేలా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.8,480 కోట్ల అంచనాలతో కళాశాలలు నెలకొల్పడానికి ప్రణాళికలు రూపొందించారు. 17 వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు అత్యాధునిక వసతులతో అందుబాటులోకి తెచ్చేలా కేంద్ర సాయం, స్పెషల్ అసిస్టెంటెన్స్ టు ది స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం, నాబార్డు రుణాల ద్వారా నిధులు సమకూర్చారు. ఒక్కోచోట 50 నుంచి 100 ఎకరాల చొప్పున 17 వైద్య కళాశాలలకు భూములు సేకరించారు. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా సంభవించిన ఆర్థిక సంక్షోభాన్ని సైతం ఎదురొడ్డి 2023–24లో 5, 2024–25లో మరో 5, 2025–26లో ఇంకో 7 కళాశాలలు ప్రారంభించేలా అడుగులు ముందుకు వేశారు. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు వందేళ్ల రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 2023–24లో ఏలూరు, రాజమండ్రి, నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం కళాశాలల్ని ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూర్చారు. 2024–25లో మరో 5 కళాశాలలు ప్రారంభించేలా సార్వత్రిక ఎన్నికల నాటికే ఏర్పాట్లు చేశారు. ఆ చర్యల ఫలితంగానే పాడేరు, పులివెందులకు 50 చొప్పున సీట్లతో అడ్మిషన్లకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చింది. గతేడాది బాబు గద్దెనెక్కిన వెంటనే వైద్య కళాశాలలపై నీలినీడలు కమ్ముకున్నాయి. పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టేస్తున్నామని వైద్య శాఖపై మొదటి సమీక్షలోనే సీఎం ప్రకటించారు. అంతేకాకుండా గతేడాదే పులివెందుల వైద్య కళాశాలకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చినా వద్దని కుట్రపూరితంగా రద్దు చేయించారు.ప్రభుత్వమే కళాశాలలు నిర్మించి, నిర్వహించడానికి నిధుల్లేవంటూ ఏకంగా 10 కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్‌కు కట్టబెట్టడానికి పూనుకున్నారు. వాస్తవానికి 10 కళాశాలలు నిర్మించడానికి రూ.5 వేల కోట్ల నిధులుంటే సరిపోతుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఒకేసారి ఖర్చు పెట్టాల్సి అవసరం లేదు. ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు పెడితే ప్రభుత్వ రంగంలో 10 కళాశాలలు అందుబాటులోకి వచ్చేవి.మోసపూరితంగా..వైఎస్ జగన్ ప్రభుత్వం రచించిన ప్రణాళిక ప్రకారం చంద్రబాబు నడుచుకుని ఉంటే ఈ విద్యా సంవత్సరానికే 17 వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభం అయి ఉండేవి. ప్రైవేట్‌కు వైద్య కళాశాలలు కట్టబెట్టడం కోసం ఆయన చేసిన కుట్రలతో రెండేళ్లలో 2,550 ఎంబీబీఎస్ సీట్లను మన విద్యార్థులు కోల్పోయి తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు కళాశాలలు పీపీపీకి ఇవ్వడంతో ప్రజలు, విద్యార్థులపై ఎటువంటి భారం ఉండబోదనే ప్రకటనలతో మోసం చేస్తోంది. వైఎస్ జగన్ విధానంలో ఒక్కో ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆలిండియా, రాష్ట్ర కన్వీనర్ కోటా కింద ప్రభుత్వ కోటా సీట్లు 86 ఉండగా.. వీటిలో 11 సీట్లకు బాబు గండి కొడుతున్నారు. తద్వారా 10 కళాశాలల్లో 110 సీట్లను విద్యార్థులు నష్టపోతున్నారు. ఆ సీట్లన్నింటినీ యాజమాన్య కోటాకు మళ్లించి, ప్రైవేట్ వ్యక్తులు ఫీజులు రూపంలో దోచుకునేలా ప్రభుత్వమే ప్రణాళిక వేసింది. అదేవిధంగా పీపీపీలో యాజమాన్య కోటా సీట్లకు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మాదిరిగానే ఫీజులను ప్రతిపాదించారు. జగన్ విధానంలో రోగులకు బోధనాస్పత్రుల్లో పూర్తిస్థాయిలో ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేవి. బాబు విధానంలో ఏ సేవకైనా పేదలు డబ్బు చెల్లించాల్సిందేనని, ఏదీ ఉచితం కాదని ఇప్పటికే స్పష్టం అయిపోయింది. -
హక్కులకు నీళ్లు!
సాక్షి, అమరావతి: అత్యంత పేలవమైన వాదనలు, బాధ్యతా రాహిత్యం, వ్యూహాత్మక తప్పిదాలతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమవుతోందని సాగునీటి వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2)లో విచారణ జరుగుతున్న సమయంలో పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు పీఎఫ్ఆర్ (ప్రీ ఫీజుబులిటీ రిపోర్టు) కేంద్ర జల సంఘానికి సమర్పించడం ద్వారా టీడీపీ కూటమి సర్కారు వ్యూహాత్మక తప్పిదం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణా, ఉప నదుల నుంచి 372.54 టీఎంసీలు తరలించేలా 16 ప్రాజెక్టులు చేపట్టడానికి డీపీఆర్‌ల తయారీకి అనుమతిస్తూ సెప్టెంబరు 16న తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో 34ను సవాల్ చేస్తూ ఇంటర్ లొకేటరీ (ఐఏ) అప్లికేషన్ దాఖలు చేయకపోవడం చంద్రబాబు సర్కార్ చిత్తశుద్ధి లోపానికి నిదర్శనమని సాగునీటి, న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. విభజన చట్టం మార్గదర్శకాలు, కేంద్రం 2023 అక్టోబర్ 6న జారీ చేసిన అదనపు విధి విధానాల ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పంపిణీ చేయడంపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్.. తెలంగాణ సర్కార్ తుది వాదనలు పూర్తయ్యాయి. బుధవారం నుంచి శుక్రవారం వరకూ చేపట్టే విచారణలో ట్రిబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుది వాదనలను వినిపించనుంది. నిర్లక్ష్యంతో నీరుగారుతున్న హక్కులు..!కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) కేటాయించిన 811 టీఎంసీల నికర జలాలు.. 65 శాతం, సరాసరి లభ్యత ఆధారంగా కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన 194 టీఎంసీల మిగులు జలాలు వెరసి 1,005 టీఎంసీలను తెలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయడంపై ప్రస్తుతం ట్రిబ్యునల్ విచారిస్తోంది. పరివాహక ప్రాంతం ప్రాతిపదికగా తమకు 904 టీఎంసీలు కేటాయించాలని ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ సర్కార్ తుది వాదనలు వినిపించింది. ఈ క్రమంలో కృష్ణా ప్రధాన పాయపై జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి.. ఉప నదుల నుంచి 372.54 టీఎంసీలు తరలించేలా కొత్తగా 16 ప్రాజెక్టులు చేపట్టడానికి డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారీకి అనుమతి ఇస్తూ సెప్టెంబరు 16న ఉత్తర్వులు జారీ చేసింది. కేటాయింపులు చేయకుండానే 372.54 టీఎంసీలు తరలించేలా.. 16 ప్రాజెక్టులు చేపట్టడానికి తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవోను నిలుపుదల చేయాలని.. ఆ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కోరుతూ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో ఏపీ ప్రభుత్వం ఐఏ (ఇంటర్ లొకేటరీ) అప్లికేషన్ దాఖలు చేయకపోవడాన్ని సాగునీటిరంగ నిపుణులు తప్పుబడుతున్నారు. ఇది కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని విమర్శిస్తున్నారు. పోలవరం కుడి కాలువ నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. సాగర్‌కు ఎగువన 45 టీఎంసీల కృష్ణా జలాలు అదనంగా వినియోగించుకుంటామని, చిన్న నీటిపారుదల విభాగంలో 45 టీఎంసీల మిగులు ఉందని.. వెరసి ఆ 90 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు కేటాయిస్తూ తెలంగాణ సర్కార్ జీవో జారీ చేయడంపై గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో ఐఏ దాఖలు చేసి దాన్ని అడ్డుకుందని సాగునీటిరంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. పోలవరం–బనకచర్లతో తెలంగాణ చేతికి అస్త్రం..!గోదావరి వరద జలాలు 243 టీఎంసీలను మళ్లించేలా చేపట్టనున్న పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ సీడబ్ల్యూసీకి మే 22న టీడీపీ కూటమి సర్కారు పీఎఫ్ఆర్ సమర్పించడం ద్వారా తెలంగాణ సర్కార్ చేతికి అస్త్రం అందించిందని సాగునీటిరంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. పోలవరం కుడి కాలువ నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో కర్ణాటక 21, మహారాష్ట్ర 14 టీఎంసీలు, నాగార్జునసాగర్ ఎగువన ఉమ్మడి ఏపీ 45 టీఎంసీలు అదనంగా వాడుకునేందుకు గోదావరి ట్రిబ్యునల్ అనుమతిచ్చింది. ఇప్పుడు దాన్నే గుర్తు చేస్తూ.. పోలవరం–బనకచర్లకు అనుమతి ఇచ్చిన రోజు నుంచే కృష్ణా జలాల్లో అదనంగా 64.75 టీఎంసీలు వాడుకునేలా ప్రాజెక్టులు చేపడతామని సెప్టెంబర్‌లో కర్ణాటక, అదే దామాషా పద్ధతిలో 42.53 టీఎంసీలు వినియోగించుకుంటామని మహారాష్ట్రలు సీడబ్ల్యూసీకి లేఖలు రాశాయి. తెలంగాణ సర్కార్ పోలవరం–బనకచర్లను పూర్తిగా వ్యతిరేకిస్తూనే.. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో దాన్ని అస్త్రంగా మల్చుకుంది. ప్రస్తుతం కృష్ణా జలాల్లో 323 టీఎంసీలను ఇతర బేసిన్లకు ఏపీ సర్కార్ మళ్లిస్తోందని.. కేవలం 189 టీఎంసీలే బేసిన్‌లోని ప్రాజెక్టులకు వినియోగించుకుంటోందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తమ రాష్ట్రంలో బేసిన్ ప్రాజెక్టులకు ఒక్క పంటకైనా నీటిని కేటాయించాలని వాదించింది. కృష్ణా బేసిన్ బయట ఉన్న ప్రాజెక్టులకు నీటిని అందించడానికి పోలవరం–బనకచర్ల లాంటి ప్రత్యామ్నాయాలు ఏపీకి ఉన్నాయని.. అలాంటి ప్రత్యామ్నాయాలు తమకు లేవని తెలంగాణ సర్కార్ ట్రిబ్యునల్ ఎదుట వాదించింది. సమర్థ వాదనలు వినిపించకపోవడం వల్లే..!అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం సెక్షన్–6(1) ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీం కోర్టు డిక్రీతో సమానం. దాన్ని పునఃసమీక్షించడం చట్ట విరుద్ధం. ఇదే అంశాన్ని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేంద్రానికి 2013 నవంబర్ 29న ఇచ్చిన తుది నివేదికలో స్పష్టం చేసింది. ఇక విభజన చట్టం 11వ షెడ్యూలు సెక్షన్–85(7)ఈ–4 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు యథాతథంగా కొనసాగుతాయి. దీన్ని పరిగణలోకి తీసుకునే ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయిస్తూ 2015 జూలైలో కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. దీన్ని బట్టి చూస్తే.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను పునఃపంపిణీ చేస్తే విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లే. విభజన చట్టం ప్రకారం చూస్తే.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు అదనంగా అంటే 65 శాతం లభ్యత, సగటు ప్రవాహాలు ఆధారంగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 194 టీఎంసీల పంపిణీపైనే ప్రస్తుతం విచారణ చేయాలి. అందులోనూ తెలుగుగంగకు 25 టీఎంసీలు, ఆర్డీఎస్ కుడి కాలువకు 4 టీఎంసీలను తుది నివేదికలో కేటాయించినట్లు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వెల్లడించింది. వీటిని మినహాయిస్తే.. మిగతా 165 టీఎంసీలను విభజన చట్టం 11వ షెడ్యూలులో పేర్కొన్న హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగుగంగ, నెట్టెంపాడు, కల్వకుర్తిలకు కేటాయింపులో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ.. తద్భిన్నంగా సెక్షన్–3 కింద బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను పునఃపంపిణీపై విచారణ చేయాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించింది. చంద్రబాబు ప్రభుత్వం సమర్థంగా వాదనలు వినిపించకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని నీటిపారుదల రంగ నిపుణులు మండిపడుతున్నారు. తెలంగాణ సర్కార్ 372.54 టీఎంసీల కృష్ణా జలాలు తరలించేందుకు డీపీఆర్ తయారీకి అనుమతి ఇచ్చిన ప్రాజెక్టులు ఇవే..1. రేలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం 4 నుంచి 10 టీఎంసీలకు పెంపు2. గట్టు బాల్యెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం 1.32 నుంచి 10 టీఎంసీలకు పెంపు3. నెట్టెంపాడు ఎత్తిపోతల రెండో దశలో మరో 4 టీఎంసీలు తరలింపు4. 0.5 టీఎంసీల సామర్థ్యంతో బుజ్జితండా–భీమ తండా ఎత్తిపోతల 5. కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం మరో 20.12 టీఎంసీలు పెంపు6. జూరాల వరద కాలువ ద్వారా 100 టీఎంసీలు తరలించి 11.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం7. కోయిల్‌కొండ–గండీడు ఎత్తిపోతల ద్వారా 123 టీఎంసీలు తరలింపు8. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల సామర్థ్యం అదనంగా 3.30 టీఎంసీలు పెంపు9. జయపురం వద్ద 2 టీఎంసీల సామర్థ్యంతో ఆకేరు బ్యారేజ్10. విస్పంపల్లె వద్ద 1.2 టీఎంసీల సామర్థ్యంతో మరో ఆకేరు బ్యారేజ్11. 1.3 టీఎంసీల సామర్థ్యంతో మున్నేరు బ్యారేజ్12. గార్ల వద్ద మున్నేరుపై 1.2 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజ్13. డోర్నకల్ మండలం ముల్కపల్లి వద్ద 35 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్14. ఎద్దులచెర్వు వద్ద ఆకేరుపై 1.3 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజ్15. శ్రీశైలం ఎడమగట్టు కాలువ విస్తరణలో భాగంగా 3.99 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా సోమశిల వద్ద 35 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్16. శ్రీశైలం నుంచి నీటిని తరలించి రీజినల్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో తాగునీటి కోసం దేవులమ్మనాగారం (పది టీఎంసీలు), దండు మైలారం (పది టీఎంసీలు), ఆరుట్ల(పది టీఎంసీలు) సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణం. -
అద్విక ట్రేడింగ్ మోసం రూ.144 కోట్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): అధిక వడ్డీ ఆశ చూపి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించి రూ.144 కోట్ల మేర మోసానికి పాల్పడిన అద్విక ట్రేడింగ్ కంపెనీకి చెందిన నలుగురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు మంగళవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడ నగరానికి చెందిన తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్య, అతని భార్య సుజాత 2022లో అద్విక ట్రేడింగ్ కంపెనీ స్థాపించారు. తొలుత రూ.15 లక్షల పెట్టుబడితో దుబాయిలో ఉన్న కబానా అకౌంట్ ద్వారా ట్రేడింగ్ ప్రారంభించారు. మొదట్లో పెద్దగా లాభాలు రాలేదు. డబ్బులు సంపాదించాలన్న ఆశతో ఆదిత్య, సుజాతతోపాటు బాదంశెట్టి బాలకృష్ణమూర్తి, నాగలక్ష్మీకుమారి కలిసి అధిక లాభాలు, వడ్డీలు ఆశ చూపించి కొందరు ఏజెంట్ల ద్వారా డిపాజిట్ల సేకరణ ప్రారంభించారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు 2023లో భారీగా అద్విక ట్రేడింగ్ కంపెనీ వార్షికోత్సవం నిర్వహించారు. దాదాపు 1,450 మంది నుంచి రూ.400 కోట్లు వరకు డిపాజిట్ల రూపంలో వసూలు చేశారు. కొందరు డిపాజిటర్లకు వడ్డీతో సహా తిరిగి చెల్లించారు. ఎక్కువ భాగం డిపాజిట్లను మల్టీ బ్యాంక్ గ్రూప్‌నకు బదిలీ చేశారు. కొంత మొత్తాన్ని విదేశీ ప్లాట్‌ఫామ్‌లకు బదిలీ చేశారు. తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్య, అతని భార్య సుజాత పేరుతో చరాస్తులు, బంగారం కోనుగోలు చేశారు. కొత్తగా సేకరించిన డిపాజిటర్ల డబ్బులు పాతవారికి చెల్లించేవారు. కొంతకాలానికి డిపాజిటర్లకు డబ్బులు చెల్లించలేని స్థితికి చేరుకుని పారిపోయారు. వెలుగులోకి ఇలా... అద్విక ట్రేడింగ్ కంపెనీలో డిపాజిట్ చేస్తే మోసం చేశారంటూ వీరమల్లు గణేష్ చంద్ర ఈ ఏడాది జూన్ 26న మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుటుంబ సభ్యులు రూ.53 లక్షలు డిపాజిట్ చేస్తే, రూ.13 లక్షలు తిరిగి చెల్లించారని, మిగిలినవి ఇవ్వకుండా మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పది పోలీసు బృందాలు విచారణ చేపట్టాయి. అద్విక ట్రేడింగ్ కంపెనీ 1,450 మంది నుంచి రూ.400 కోట్ల వరకు డిపాజిట్లు సేకరించినట్లు తేలింది. అందులో కొందరికి తిరిగి చెల్లించగా, 1,355 మందికి రూ.135 కోట్లు చెల్లించాలని పోలీసులు నిర్ధారించారు. 25 మంది ఏజెంట్లకు రూ.9 కోట్లు చెల్లించకుండా మోసం చేసినట్లు తేలింది. నిందితుల వద్ద చరాస్తులు, బంగారం రూ.100 కోట్లు వరకు ఉన్నట్లు గుర్తించారు. తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్య, సుజాత, గాదంశెట్టి బాలకృష్ణమూర్తి, నాగలక్ష్మీకుమారిని విజయవాడ రామవరప్పాడు బల్లెంవారి వీధిలో ఉన్న లక్ష్మి ఎంక్లేవ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.23 లక్షల నగదు, 580 గ్రాముల బంగారం, 8.30 కిలోల వెండి, కారు, కంప్యూటర్లు స్వా«దీనం చేసుకున్నారు. -
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, అమరావతి: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమతంగా ఉండాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. తుపాను ముప్పు తగ్గే వరకు ప్రతి ఒక్కరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు.తుపాను సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తోడుగా నిలవాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. -
జనకోటి త్రిక‘రణ’శుద్ధి
సాక్షి,అమరావతి: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం ఊపందుకుంది. కోటి సంతకాల సేకరణ శరవేగంగా సాగుతోంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జోరువాన కురుస్తున్నా.. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులు సంతకాల సేకరణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రణన్నినాదాన్ని పూరించారు. అనేక చోట్ల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సర్కారు తీరుపై గళమెత్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించకుంటే పోరాటం ఉద్ధృతమవుతుందని గర్జించారు.గత ప్రభుత్వంలో వైఎస్ జగన్జిల్లాకు ఒకటి చొప్పున 17 మెడికల్ కళాశాలలను తీసుకువస్తే కూటమి ప్రభుత్వం ఈ 17 నెలల పాలనలో వాటిని నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. మెడికల్ సీట్లు వద్దన్న ఏకైక ప్రభుత్వం ఇదేనని దుయ్యబట్టారు. రూ.లక్షల కోట్లు విలువ చేసే మెడికల్ కాలేజీలను కూటమి పెద్దలు అతి తక్కువ ధరకు తమ అస్మదీయులకు సింగిల్ టెండర్లోనే కట్టబెట్టడం అన్యాయమని గర్హించారు. వైద్య విద్యను వ్యాపారంచేయొద్దని, ఇది కేవలం సంతకం కాదు.. కోటి గుండెల నిరసన అంటూ హెచ్చరించారు. » అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం భట్టువానిపల్లి గ్రామంలో మంగళవారం కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య హాజరయ్యారు. భట్టువానిపల్లి గ్రామస్తులు సంతకాల సేకరణలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. » బాపట్ల జిల్లా చుండూరు మండలంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు, నాయకులు సంతకాలు సేకరించారు. » ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కోయరాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరిగింది. » పార్వతీపురం 14వ వార్డులోని బైపాస్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు. » ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరిగింది. ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. » కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోట నరసింహం ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. » కాకినాడ రూరల్ నియోజకవర్గం సర్పవరంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం, సంతకాల సేకరణ చేపట్టారు. » కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా పాల్గొన్నారు. » ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం మర్రిపూడి మండలం వెంకటకృష్ణాపురం గ్రామంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ , వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకులు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. -
నా చావుకు కారణం టీడీపీ నేతలే
గుంటూరు: ‘‘నా చావుకు కారణం టీడీపీ నేతలు కల్లూరి శ్రీనివాసరావు, కర్లపూడి. శ్రీనివాసరావు, రమేష్, పద్మ, పద్మ చెల్లి సీత, ఆమె పెద్దకొడుకు శివకృష్ణ, పొట్ట జాను అనే వ్యక్తి కోడలు జానీ బేగం. వాళ్ల టార్చర్ తట్టుకోలేకపోతున్నా. కర్లపూడి శ్రీనివాసరావు తురకపాలెం గ్రామంలో రెండు లక్షలు అప్పుగా ఇప్పించగా అందులో రూ.1.30 లక్షలు తిరిగి చెల్లించేశా. అయినా రోజూ వేధిస్తున్నారు. ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారు. తెలిసో తెలీకో వాళ్ల దగ్గర అప్పుచేశా. నేను తింటానికి కాదు. అమ్మా శివమణి (కూతురు).. నాన్నని ఏమీ అనొద్దు, నవీన్ (అల్లుడు) నువ్వు జాగ్రత్త నాన్న.. కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో.. అంటూ ఈపూరి శేషమ్మ అనే వివాహిత పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుని బలవన్మరణానికి యత్నించింది. ఈ హృదయ విదారక ఘటన గుంటూరు జిల్లా వెంగళాయపాలెం మిర్చియార్డులో గత మంగళవారం జరిగింది. ఆమెను హుటాహుటిన కుటుంబ సభ్యులు గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ వారం రోజుల నుంచి మృత్యువుతో పోరాడి మంగళవారం మరణించింది. ఆమె పురుగుల మందు తాగుతూ తీసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూపరులను కంటతడి పెట్టిస్తోంది. ఇచ్చేది రూపాయి వసూలు చేసేది రూ.వేలల్లో వెంగళాయపాలెంలో టీడీపీ నేతల కాల్‌మనీ దాష్టీకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. తీసుకున్న అప్పుకు వడ్డీలకు వడ్డీలు, చక్రకవడ్డీలు లెక్కగట్టి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఠంచనుగా అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఇంటికొచ్చి వేధిస్తున్నారు. అందరిముందూ పరువు తీస్తున్నారు. ఈ ఆగడాలు భరించలేకే గ్రామానికి చెందిన ఈపూరి శేషమ్మ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. శేషమ్మ, ముసలయ్య (మద్దిలేటి)ల దంపతులకు కుమార్తె ఉంది. ఆమెకు పెళ్లయింది. వీరు వ్యవసాయ పనులు చేసుకుంటూ మిర్చియార్డు కాలనీలో ఉంటున్నారు. శేషమ్మ పలువురు వద్ద అప్పులు తీసుకుంది. తీసుకున్న అప్పులకు ప్రతి నెలా వడ్డీలు చెల్లిస్తోంది. మిగిలిన డబ్బు కోసం అప్పు ఇచ్చినవారు ఇంటికి వచ్చి వేధిస్తున్నారు. ఈ క్రమంలో శేషమ్మ తన కుమార్తెకు తద్ది తీర్చుకునే కార్యక్రమాన్ని నిర్వహించుకుంది. అదే రోజు గ్రామంలోని పలువురు ఇంటికి వచ్చి తమ వద్ద తీసుకున్న అసలు, వడ్డీ తిరిగి ఇవ్వాలని లేకుంటే కుటుంబాన్ని రోడ్డున పడేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. అసభ్య పదజాలంతో అవమానించారు. లైంగికంగా కూడా వేధించినట్టు సమాచారం. దీంతో ఆమె తట్టుకోలేక సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆత్మహత్య చేసుకుంది.కల్లూరి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అనుచరుడు శేషమ్మ సెల్ఫీ వీడియోలో చెప్పిన కల్లూరి శ్రీనివాసరావు టీడీపీ గుంటూరు రూరల్ మండల అధ్యక్షుడు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అనుచరుడు. దీంతో ఆయన ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ధాన్యం రైతు గుండెల్లో ‘మోంథా’ గుబులు
సాక్షి, అమరావతి: ధాన్యం రైతు గుండెల్లో ‘మోంథా’ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు కోతదశకు చేరుకున్న పంటచేలు నేలకొరిగాయి. తుపాను ప్రభావిత జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరికంకులు దెబ్బతింటున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద తీరాన్ని తాకిన ఈ తుపాను ప్రభావం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర, కోస్తాం«ధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. తుపాను తర్వాత దాదాపు మూడురోజులు కురిసే వర్షాల ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో పంటలపై ఉంటుందని చెబుతున్నారు. ప్రధానంగా వరితోపాటు మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, పెసర పంటలకు అపారనష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది 72.87 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగవగా, అందులో 38.96 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. సాగైన వరి విస్తీర్ణంలో దాదాపు 31.14 లక్షల ఎకరాలు తుపాను ప్రభావిత జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. ఇందులో సుమారు 15 లక్షల ఎకరాల్లో పంట తీవ్ర ప్రభావానికి గురవుతుందని వ్యవసాయశాఖ ముందస్తు అంచనా వేసింది. ఇతర పంటలన్నీ కలుపుకొంటే 20 లక్షల ఎకరాల్లో పంటలపై తుపాను ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. దిగుబడులపై ప్రభావం తుపాను ప్రభావంతో భారీ వర్షాలకు ఈదురుగాలులు తోడవడంతో వరిపైరు తీవ్రంగా దెబ్బతింటుంది. ముంపునీరు దిగిపోయిన తర్వాత సత్వర యాజమాన్య పద్ధతులు పాటించినప్పటికీ తుపాను ప్రభావం దిగుబడులపై ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఎకరాకు కనీసం 5 నుంచి 8 బస్తాలు దిగుబడి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ధాన్యం రంగుమారడం, తేమశాతం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అయితే మొలకలొచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. బిహార్ ఎన్నికల విధుల్లో వ్యవసాయశాఖ డైరెక్టర్ వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ బిహార్‌లో ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లారు. గతంలో ఉన్నతాధికారులు ఎన్నికలతోపాటు ఇతర సేవల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లినప్పుడు వారి బాధ్యతలను ఇతర అనుబంధ శాఖల అధికారులకు అప్పగించేవారు. ఇప్పుడు వ్యవసాయశాఖ డైరెక్టర్ బాధ్యతల్ని ఎవరికీ అప్పగించలేదు. దీంతో లాగిన్స్ అన్నీ ఆయన వద్దే ఉన్నాయి. విపత్తు వేళ ఆ శాఖలో విభాగాధిపతులు ప్రతి చిన్న విషయాన్ని బిహార్‌లో ఉన్న డైరెక్టర్‌కి ఫోన్ ద్వారా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
తుపాను సహాయక చర్యల్లో సచివాలయాలే కీలకం
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థే మోంథా తుపాను సహాయక కార్యక్రమాల్లో ఇప్పుడు కీలకంగా మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమ, మంగళవారాల్లో తుపాను ప్రభావిత మారుమూల ప్రాంతాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు 24 గంటలూ పనిచేశాయి. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులే ప్రభుత్వం అందించే తుపాను తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అక్కడి ప్రజలకు చేరవేశారు. చాలాచోట్ల సచివాలయాల ఉద్యోగులు తమ పరిధిలో వీధి వీధికీ వెళ్లి తుపాను సమాచారాన్ని నేరుగా అక్కడి ప్రజలకు తెలియజేశారు. తుపాను పరిస్థితులపై ప్రభుత్వం అధికారికంగా వెల్లడించే సందేశాల్ని గ్రామంలో యాక్టివ్‌గా ఉండే యువతకు వాట్సాప్ ద్వారా చేరవేశారు. ఐదారేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో తీవ్ర విపత్తులు తలెత్తిన సమయంలో క్షేత్రస్థాయిలో చాలా గ్రామ పంచాయతీల్లో రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శి కూడా ఉండని పరిస్థితి. అప్పట్లో ప్రభుత్వం చిన్నపాటి వరద సహాయక చర్యలు చేపట్టేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగులను తరలించాల్సి వచ్చేది. ప్రస్తుతం ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో 6 నుంచి 10 మంది చొప్పున పనిచేస్తున్నారు. వారే మూడు షిప్టుల్లో రోజంతా సచివాలయంలోనే అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయి తుపాను పరిస్థితుల సమాచారాన్ని ప్రత్యేక యాప్‌ల ద్వారా ప్రభుత్వానికి చేరవేశారు. క్షేత్రస్థాయిలో తుపాను ప్రభావానికి గురైన గ్రామ వివరాలతో పాటు అక్కడ ఈదురు గాలులు, వర్షాల కారణంగా స్థానికంగా దెబ్బతిన్న ఇళ్లు, రోడ్లు వంటి వివరాలపై ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా ప్రభుత్వానికి తక్షణ నివేదికలు అందజేశారు. కరెంటు స్తంభాలు కూలినా, ఒరిగినా ఆ సమాచారాన్ని వెంటనే ప్రభుత్వానికి చేరవేశారు. సముద్ర తీర గ్రామాల్లో గత ఐదేళ్ల కాలంలో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయాల కార్యాలయాలపైనే తాత్కాలికంగా ప్రత్యేక మైక్‌లను ఏర్పాటు చేసి తుపాను తాజా సమాచారం ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం చేశారు. సర్కారు స్పందన అంతంత మాత్రమే క్షేత్రస్థాయిలో తుపాను ఇబ్బందులకు సంబంధించిన సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ప్రభుత్వం వేగంగా సేకరించగలిగినప్పటికీ.. సహాయక చర్యల విషయంలో సర్కారు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆన్లైన్ విధానంలో సైక్లోన్ మోంథా ప్రొఫార్మా–2 రూపంలో ప్రభుత్వానికి సమాచారాన్ని తెలియజేసింది. దాని ప్రకారం..మంగళవారం రాత్రి 8 గంటలకు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 419 చెట్లు కూలగా..రెండుచోట్ల మాత్రమే వాటిని తొలగించారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేయని గ్రామాల సంఖ్య 160కి పైగా ఉన్నట్టు సచివాలయాల సిబ్బంది రాష్ట్ర కార్యాలయానికి సమాచారమిచ్చారు. 37 ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నట్లు కూడా ఆ నివేదికల్లో వెల్లడించారు. -
సచివాలయాలు బేస్ క్యాంప్‌లుగా పని చేయాలి
సాక్షి, అమరావతి: మోంథా ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల విషయంలో క్షేత్ర స్థాయి సిబ్బంది గ్రామ, వార్డు సచివాలయాలు బేస్ క్యాంప్‌గా పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుపాను ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీఎస్ కేంద్రంగా మంగళవారం ఉదయం, సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద 3 వేల జనరేటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధిక వర్షపాతం మంగళవారం సాయంత్రం వరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. వర్షం వల్ల ఇప్పటి వరకు అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ప్రకాశం, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో 43వేల హెక్టార్లలో పంటలు నీట మునిగాయని అధికారులు తెలిపారు. పంట నష్టం వివరాలను రైతులు కూడా పంపేలా వ్యవసాయ శాఖ రూపొందించిన యాప్‌లో మార్పు, చేర్పులు చేయాలని సీఎం సూచించారు. వెంటనే పంటనష్టం అంచనాలు రూపొందించి కేంద్రానికి పంపాలని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు బృందాన్ని పంపాలని ఆదేశించారు. కాగా, తుఫాను ప్రభావం ఉన్న గ్రామ,వార్డు సచివాలయాల సిబ్బందితో ఆర్టీజీఎస్ నుంచి సీఎం చంద్రబాబు మంగళవారం టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తుపాను ప్రభావంపై ఆరా తీసి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. జీఎస్ కేంద్రంగా మంగళవారం ఉదయం, సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద 3 వేల జనరేటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
శాంతించిన మోంథా!
సాక్షి, విశాఖపట్నం: మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసింది.. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో జన జీవనాన్ని స్తంభింపజేసింది.. తుపాను సముద్రంలో ఉంటేనే ఇంత అలజడి సృష్టించిందే.. ఇక తీరం దాటే సమయంలో ఉప్పెనలా విరుచుకు పడుతుందంటూ వాతావరణ నివేదికలు హెచ్చరించాయి... తీరం సమీపిస్తున్న కొద్దీ అందర్లోనూ ఉత్కంఠ.. ఆందోళన.. రాకాసి మోంథా ఎలా ముంచేస్తుందో.. ఎక్కడ విరుచుకుపడుతుందోనని తీర ప్రాంత జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు.. పాములు పట్టేవాడు పాముకాటుకే బలయ్యారనే నానుడిలా... గాలులన్నింటినీ తనలో కలిపేసుకుంటూ బలంగా దూసుకొచ్చిన మోంథా.. చివరికి ఆ గాలుల కోత వల్లే బలహీన పడింది. తీరం దాటుతున్నా ప్రశాంత వాతావరణం.. కొద్దిపాటి బలమైన గాలులు.. మోస్తరు నుంచి భారీ వర్షాలతో సముద్రాన్ని వదిలి నేలమీదకి వచ్చింది. ముంచేస్తుందనుకున్న మోంథా.. మౌనంగా వెళ్లిపోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికార యంత్రాంగం ప్రభుత్వ హడావుడి నుంచి తేరుకున్నారు. అయితే వాయు, రైలు రవాణా స్తంభించిపోయింది. మొత్తంగా భయాందోళనలు సృష్టించిన తీవ్ర తుపాను మోంథా.. రాష్ట్రంపై మోస్తరు ప్రభావంతో వీడ్కోలు చెప్పేసింది. మోంథా ఎందుకు శాంతించిందంటే.. వాస్తవానికి మోంథా తుపాను వేగం, గమనం చూస్తే 2023లో బాపట్లలో తీరం తాకిన మిచాంగ్ తుపానును తలపించింది. సముద్రంలో తీవ్ర తుపానుగా బలపడటంతో గాలులన్నింటినీ తనలో చేర్చుకొని మరింత బలంగా మారింది. దీంతో మోంథా తుపాను.. రాష్ట్రంలోని అనేక తీర ప్రాంతాల్ని తుడిచి పెట్టుకుపోతుందని అంతా ఆందోళనకు గురయ్యారు. అయితే.. తీరానికి 70 నుంచి 100 కి.మీ. దూరంలో ఉన్న సమయంలో విండ్ షీర్ (గాలుల కోత) మొదలైంది. తుపాన్లో కీలకమైన సైక్లోన్ ఐ పై విండ్ షీర్ పంజా విసిరింది. దీంతో తుపాను గాలులు చీల్చుకుపోతూ కకావికలమైపోయాయి. దీంతో మోంథా తీరం దాటకముందే బలహీనపడిపోయింది. విండ్ షీర్ ప్రభావంతో తుపాను∙ప్రధాన కేంద్రం నుంచి చెల్లాచెదురైన గాలులు, మేఘాల ప్రభావం తీరం దాటే ప్రాంతంలో కాకుండా చుట్టుపక్కల జిల్లాలపై చూపించింది. దీంతో.. మోంథా తన శక్తిని కోల్పోయి.. తీరం దాటేందుకు సిద్ధమై.. కడలిని వదిలి భూమిని తాకింది. తీరం దాటే సమయంలో గరిష్టంగా 110 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నివేదికలు అంచనా వేసినా.. వాస్తవ స్థితిలో మాత్రం 70 నుంచి 80 కి.మీ. వేగంతో మోస్తరు వర్షాలకే పరిమితమవ్వడంతో తీర ప్రాంతమంతా ఊపిరి పీల్చుకుంది. కొన్ని ప్రాంతాల్లోనే ప్రభావం మోంథా తీవ్ర తుపాను తీరం తాకనంత వరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను వణికించింది. కానీ తీరానికి చేరుకోగానే పూర్తి నిశ్శబ్ధ వాతావరణాన్ని తలపించింది. ఉదయం 10 గంటల నుంచి మొదలైన గాలులు సాయంత్రం ఏడు గంటల వరకు జిల్లా వాసులను భయాందోళనలకు గురి చేశాయి. తీరానికి సమీపిస్తే తుపాను విరుచుకుపడుతుందనే ఆందోళన అందరి కంటి మీద కునుకులేకుండా చేసింది. భారీగా వీచిన ఈదురు గాలులకు పెద్ద సంఖ్యలో కొబ్బరి చెట్లు నేల కూలాయి. భారీ వృక్షాలు సైతం కూకటి వేళ్లతో సహా పడిపోయాయి. విద్యుత్ తీగలు తెగి పడడంతోపాటు పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఉదయం 10 గంటల నుంచి జిల్లాలో పలు మండలాలకు విద్యుత్ లేకుండా పోయింది. సముద్ర అలలు మూడు మీటర్ల ఎత్తున ఎగిసిపడగా, 300 మీటర్లు ముందుకు చొచ్చుకు వచ్చాయి. తీరం భారీగా కోతకు గురైంది. తీరానికి చేరువయ్యే సమయంలో ప్రశాంతమే రాత్రి 8 గంటల తర్వాత మోంథా తుపాను ప్రభావం పూర్తిగా కనిపించలేదు. అసలు నిజంగా తుపాను∙ఇక్కడ తీరం దాటుతోందా.. లేదా దిశ మార్చుకుందా? అనే సందేహమే అందరిలోనూ మొదలైంది. అలజడి సృష్టించిన ఈదురు గాలులు నిలిచిపోయాయి. భారీ వర్షం సైతం తగ్గుముఖం పట్టింది. సముద్రంలో అలజడి కొనసాగుతున్నా భారీ వర్షం.. ఈదురు గాలులు లేకపోవడం జనాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. తుపాను అర్ధరాత్రి ఒంటి గంటకు నరసాపురం సమీపంలో తీరం దాటింది. ఈ సమయంలో 110 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ వర్షం కురుస్తుందని కోనసీమ వాసులు ఆందోళన చెందారు. కళ్ల ముందు 1996 పెను తుపాను విషాదం కదలాడింది. కాని అందుకు విరుద్ధంగా గాలులు నిలిచి పోవడంతో పాటు భారీ వర్షం తగ్గి కేవలం చినుకులు పడుతుండడంతో మోంథా తుపాను గమనం ఎవరికీ అంతుచిక్కలేదు. దీంతో తీర ప్రాంతవాసులు బతుకుజీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో... తొలుత కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసినా.. విండ్ షీర్ కారణంగా స్వల్పంగా దిశ మార్చుకొని అంతర్వేది పల్లిపాలెం వైపు వెళ్తుందన్న వాతావరణ శాఖ ప్రకటనతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం గంటకు 18 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన తుపాను వేగం మంగళవారం నాటికి 12 కిలోమీటర్లకు తగ్గిపోయింది. ఫలితంగా దీని దిశ మారిపోయి, జిల్లాకు ముప్పు తప్పింది. అయితే పెనుగాలులు, జోరు వానలతో ఈ తుపాను జిల్లాను అతలాకుతలం చేసింది. జిల్లావ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచీ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కాకినాడ తీరంలో బలమైన ఈదురు గాలులకు వర్షాలు కూడా తోడవ్వడంతో ప్రజలు భయకంపితులయ్యారు. పిఠాపురంలో 22.6 మిల్లీమీటర్లు, కాజులూరు మండలంలో అత్యల్పంగా 2.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అక్కడక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లోని కర్నూలు రోడ్డు, ఊరచెరువు రోడ్డులో నిలిచిపోయిన వర్షపునీరు ఉప్పాడ తీరానికి తప్పని ముప్పు తీరానికి మాత్రం ముప్పు తప్పలేదు. ఉప్పాడ, కోనపాపపేట గ్రామాల్లోని పలు ఇళ్లు సముద్ర కోతకు గురయ్యాయి. విద్యుత్ స్తంభాలు, వృక్షాలు సముద్రంలో కలసిపోయాయి. బీచ్ రోడ్డు ధ్వంసమైంది. సముద్రంపై వేటను నిషేధించడంతో మత్స్యకారులు ఇళ్ల వద్దనే ఉండిపోయారు. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న రాకాసి అలలు కాకినాడ – ఉప్పాడ బీచ్ రోడ్డును ముంచెత్తాయి. ముందు జాగ్రత్తగా బీచ్ రోడ్డుపై రాకపోకలను పోలీసులు నియంత్రించారు. సాధారణ ప్రయాణికులతో పాటు స్థానికులను సైతం ఆ రోడ్డు పైకి వెళ్లకుండా కట్టడి చేశారు. కోతకు గురి కాకుండా రక్షణగా వేసిన బండరాళ్లు సముద్ర అలల తాకిడికి రోడ్డు పైకి వచ్చిపడుతూ ప్రమాదకరంగా మారాయి. ముందుస్తు చర్యల్లో బాగంగా ఉప్పాడ, కోనపాపపేట, మూలపేట, ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలైన మాయాపట్నం, సూరాడపేట, జగ్గరాజుపేట, అమీనాబాద్, కొత్తపట్నం, గంగూలిపేట, పాత మార్కెట్ ప్రాంతాల్లోని సుమారు 8,200 మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. కాకినాడ నగరంతో పాటు రూరల్, తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి, పిఠాపురం, గొల్లప్రోలు, తాళ్లరేవు తదితర మండలాల్లో మత్స్యకారులతో పాటు ఇతర నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. విశాఖపట్నంలో జలమయమైన వెలంపేటలోని రహదారి స్తంభించిన పోర్టు తుపాను ప్రభావంతో కాకినాడ డీప్ వాటర్, యాంకరేజ్ పోర్టుల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. బియ్యం, పంచదార, పామాయిల్, యూరియా తదితర ఎరువులు ఎగుమతి, దిగుమతులను నిలిపివేశారు. కాకినాడ పోర్టులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక ప్రకటించారు. గడచిన రెండు దశాబ్దాల్లో కాకినాడ పోర్టులో ఈ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారి. జిల్లా వ్యాప్తంగా 12 మండలాల పరిధిలో దాని ప్రభావం ఉందని చెబుతున్నా వాస్తవానికి కాకినాడ తీరంలోని తొండంగి, యు.కొత్తపల్లి.. కాకినాడ రూరల్ కాకినాడ సిటీ తాళ్ళరేవు మండలాలపైనే ప్రభావం కనిపించింది. ముందు జాగ్రత్త చర్యగా కాకినాడ, పిఠాపురం, తాళ్లరేవు ప్రాంతాల్లో హెలిప్యాడ్లు కూడా సిద్ధం చేశారు కానీ ఇంత వరకు వాటి అవసరం రాలేదు పంటలకు నష్టం విస్తారంగా కురుస్తున్న వర్షాలు, పెను గాలులకు అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. కరప, కాకినాడ రూరల్, పెద్దాపురం, సామర్లకోట, యు.కొత్తపల్లి, పిఠాపురం, గొల్లప్రోలు, కాజులూరు తదితర మండలాల్లో వరి పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడ, చేబ్రోలు, వన్నెపూడి తదితర ప్రాంతాల్లో మిరప, అరటి వంటి వాణిజ్య పంటలు దెబ్బ తిన్నాయి. ఏలేరు, పిఠాపురం బ్రాంచి కెనాల్ (పీబీసీ), సుద్దగెడ్డ పొంగి ప్రవహిస్తున్నాయి. ఏలేరు జలాశయానికి ఎగువ నుండి వరద నీరు పోటెత్తడంతో దిగువ ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏలేరు, పంపా, తాండవ రిజర్వాయర్లు పొంగి ప్రవహిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో.. మోంథా తుపాను పెద్దగా ప్రభావం చూపకపోవడం పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు ఊరటనిచ్చింది. నరసాపురం, భీమవరం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో అక్కడక్కడ జల్లులు మాత్రమే పడగా గాలుల తీవ్రత లేకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. తీవ్ర తుపానుగా బలపడిన తర్వాత ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల సమయానికి జిల్లాలో 154 మి.మీ వర్షం కురవగా, సగటు వర్షపాతం 7.7 మి.మీ మాత్రమే నమోదైంది. ఆచంటలో 24 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 20 మండలాలకు గాను 15 మండలాల్లో 10 మి.మీ లోపు వర్షం మాత్రమే కురిసింది. జిల్లా వ్యాప్తంగా 3,581 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. తుపాన్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ఆర్అండ్బీ పరిధిలో 29, ట్రాన్స్పోర్ట్ పరిధిలో 40, మొత్తంగా 69 జేసీబీలు, 79 పవర్ సాలను, 96 డీజిల్ జనరేటర్లను అందుబాటులో ఉంచారు. నరసాపురంలో 34 మంది సభ్యులతో ఒక ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌ను, ఏపీఎస్పీ ప్లటూన్ ఒకటి భీమవరంలో మరొకటి నరసాపురంలో సిద్దంగా ఉంచారు. 60 మంది గ్రేహౌండ్ సిబ్బందిని ఉండిలో మోహరించారు. 150 వరకు వైర్లెస్ సెట్లను ఒక శాటిలైట్ ఫోన్‌ను, ఒక డ్రోన్‌ను అందుబాటులో ఉంచారు. జిల్లాలోని 37 పునరావాస కేంద్రాలకు 4,150 మందిని తరలించారు. ఏలూరు జిల్లాలో.. ఏలూరు జిల్లాలో ఉదయం 9.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు 310 మి.మీ. వర్షపాతం నమోదైంది. ద్వారకా తిరుమలలో 29.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మెజార్టీ మండలాల్లో 10 మి.మీ. లోపు వర్షపాతం మాత్రమే నమోదైంది. తుపాను తీరం దాటాకా జిల్లాలోని ఏలూరు, కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు తదితర నియోజకవర్గాల్లో చెదురు మదురు జల్లులు మినహా భారీ వర్షాలు లేకపోవడం ఊరటనిచ్చింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లావ్యాప్తంగా 2,239 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. వరి పంట కోత దశకు చేరుకోగా, గాలుల తీవ్రత లేకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి 45 పునరావాస కేంద్రాలకు 1,203 మందిని తరలించారు. 2,000 విద్యుత్ స్తంభాలను సిద్ధం చేశారు. 59 జేసీబీలు, 37 పవర్‌సా, 10 బ్లేడ్ ట్రాక్టర్లు, 100 పోలీస్ వైర్లెస్ సెట్లను సిద్ధం చేశారు. 105 మంది స్విమ్మర్స్‌ను గుర్తించారు. 295 మంది గర్భిణులను ఆస్పత్రులకు తరలించారు. కేకే లైన్లో జారిపడిన కొండచరియలు అల్లూరి జిల్లాలో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొత్తవలస–కిరండూల్ రైల్వే లైన్లో చిమిడిపల్లి సమీపంలోని టన్నెల్ వద్ద కొండచరియలు ట్రాక్‌పై జారి పడ్డాయి. వరదనీరు ట్రాక్‌పై పొంగి ప్రవహించింది. ట్రాక్‌పై బండరాళ్లు, మట్టి తొలగించే పనుల్లో రైల్వే వర్గాలు నిమగ్నమయ్యాయి. ఈ మార్గంలో సోమవారం రాత్రి నుంచి అన్ని రైళ్ల రాకపోకలను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అరకులోయ–అనంతగిరి ఘాట్‌లో సుంకరమెట్ట, బీసుపురం సమీప ప్రాంతాల్లో రోడ్డుపై వరదనీరు పొంగి ప్రవహించింది. ఘాట్ మార్గాల్లో రాత్రి పూట ప్రయాణాలను నిలిపివేశారు. బలిమెల జలాశయ నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది.అల్లూరి సీతారామరాజు జిల్లా కొత్తవలస–కిరండూల్ మార్గంలో చిమిడిపల్లి సమీపంలోని టన్నెల్ వద్ద రైల్వే ట్రాక్‌పై కూలిన కొండచరియలు నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో బుధవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ సహా విశాఖపట్నం, గంగవరం, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో పదో నంబర్ భారీ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు వైఎస్సార్సీపీ శ్రేణులు తోడుగా నిలవాలి మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు సాక్షి, అమరావతి: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమతంగా ఉండాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. తుపాను ముప్పు తగ్గే వరకు ప్రతి ఒక్కరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. తుపాను సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తోడుగా నిలవాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లాలో కుంభవృష్టితుపాను ప్రభావం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాపై తీవ్రంగా పడింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లా అంతటా కుండపోత వర్షం కురిసింది. కావలిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటీవల కాలంలో ఈ స్థాయి వర్షపాతం నమోదవ్వడం ఇదే ప్రథమం. దగదర్తి, ఉలవపాడు, కందుకూరు, జలదంకి, కొడవలూరు, కలిగిరి, లింగసముద్రం, అల్లూరు ప్రాంతాల్లో 15 నుంచి 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు తర్వాత ప్రకాశం జిల్లా సింగరాయకొండ, సంతనూతలపాడు, చీమకుర్తి, ఒంగోలు పట్టణంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. తుపాను తీరం దాటే అవకాశం ఉందనుకున్న కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ అంచిన వేసినా, అనూహ్యంగా తుపాను తీరం దాటే సమయంలో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురవడం గమనార్హం బాపట్ల, ఒంగోలు జిల్లాల్లో భారీ వర్షం బాపట్ల జిల్లా నగరం, చిన గంజాం మండలాల్లో భారీ వర్షం పడింది. తీర ప్రాంతంలో పలుచోట్ల చెట్లు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. బాపట్ల పట్టణంలో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తెనాలి రేపల్లె మార్గంలో చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. గుంటూరు నగరంలో రాత్రి 10 గంటల తర్వాత వీచిన గాలులకు పలుచోట్ల చెట్లు పడిపోయాయి. కార్పొరేషన్ సిబ్బంది వాటిని తొలగించే పనుల్లో నిమగ్నం అయ్యారు. ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో కుండపోత వర్షం కురిసింది. ఒంగోలు నగరంతో పాటు కొండపి, టంగుటూరు, సింగరాయకొండ, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, పొన్నలూరు, చీమకుర్తి మండలాల్లో పది సెంటీమీటర్లు కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. రాత్రి 10 గంటలకు అందిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఒంగోలు నగరంలో 15.50 సెంటీమీటర్ల వర్షం కురిసింది. టంగుటూరులో 15.74, కొత్తపట్నంలో 14.36, నాగులుప్పలపాడులో 14.58, పొన్నలూరులో 14.68, చీమకుర్తిలో 13, పామూరులో 11.6 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అర్ధరాత్రి కూడా భారీ వర్షం కురుస్తూనే ఉంది. తుపాన్లు.. ప్రభావాలు ⇒ 2014 అక్టోబర్‌లో అత్యంత భారీ తీవ్ర తుపాను ‘హుద్ హుద్’ విశాఖలో తీరం దాటింది. ఈ సూపర్ సైక్లోన్ తీరం దాటే సమయంలో 185 నుంచి 260 కి.మీ. వేగంతో రికార్డు స్థాయిలో గాలులు వీచాయి. ⇒ 2018లో తిత్లీ అత్యంత తీవ్ర తుపానుగా బలడుతూ శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో తీరం దాటింది. ఈ సమయంలో గంటకు 140 నుంచి 150 కిలో మీటర్ల వరకు గాలులు బీభత్సం సృష్టించాయి. ⇒ 2021లో జవాద్ తుపానుగా మారి తీరం దాటకుండానే సముద్రంలోనే బలహీన పడిపోయింది. ఈ కారణంగా గంటకు 45 కి.మీ.. గరిష్టంగా 65 కి.మీ. వేగంతో గాలులు వీచాయి.⇒ 2022 మే నెలలో ఏర్పడిన అసని తీవ్ర తుపాను కూడా తీరం వైపు వచ్చినట్లే వచ్చి దిశ మార్చుకొని తిరిగి సముద్రంలోకి వెళ్లిపోయి బలహీనపడింది. గాలుల తీవ్రత 75 నుంచి 85 కి.మీ.గా నమోదైంది. ⇒ 2023లో ఏర్పడిన మిచాంగ్ తీవ్ర తుపాన్ బాపట్ల వద్ద తీరం దాటింది. మిచాంగ్ తీరం దాటే సమయంలో 90 నుంచి 100 కి.మీ. వేగంతో గాలులు వీచి విధ్వంసం సృష్టించింది. ⇒ తాజాగా మోంథా తీవ్ర తుపాను కూడా తీరం దాటే సమయంలో 90 నుంచి గరిష్టంగా 110 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేశారు. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ఈ గాలుల వేగం 75 నుంచి 80 కి.మీ.కు పరిమితమైపోయింది. -
Cyclone Montha: తల్లడిల్లిన తీరం
సాక్షి, అమరావతి, సాక్షి, విశాఖపట్నం, నెట్వర్క్: ఏపీని వణికించిన పెను తుపాను మోంథా మంగళవారం రాత్రి కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో పెను గాలులు వీయగా కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. కాకినాడ, అమలాపురం, రాజోలు ప్రాంతాల్లో గాలుల తీవ్రత భారీగా పెరిగింది. సముద్రం పోటెత్తి విరుచుకుపడుతోంది. అలల తీవ్రతకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ పలు చోట్ల తీరం కోతకు గురైంది. పెను గాలుల ధాటికి విశాఖలో ఎనిమిది ప్రాంతాల్లో గోడలు కూలిపోయాయి. తుపాను పూర్తిగా తీరం దాటిన తర్వాత ఐదు జిల్లాలపై భారీగా ప్రభావం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉగ్రరూపంతో దూసుకొచ్చిన మోంథా ఆగుతూ.. దిశ మార్చుకుంటూ తీరం వైపు ప్రయాణించింది. మధ్యాహ్నం సమయంలో సముద్రంలో గాలుల తీవ్రత కాస్త తగ్గినా.. సాయంత్రం మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ రావడంతో తుపాను ప్రభావం తగ్గుముఖం పట్టిందని భావించారు. అంతలోనే మళ్లీ భారీ వర్షాలతో విరుచుకుపడింది. మోంథా ప్రభావం తెలంగాణలోనూ ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. చెట్టు కూలి మహిళ మృతి.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడటంతో జనజీవనం స్తంభించింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాలోనూ పలుచోట్ల జోరు వానలు పడడంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. ఎడతెగని వర్షం, ఈదురు గాలులకు విశాఖ నగరంతోపాటు పరిసర ప్రాంతాలన్నీ స్తంభించాయి. పలు అండర్‌పాస్‌ల గుండా నీళ్లు ప్రవహించడం, జాతీయ రహదారిపైకి నీరు చేరుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈదురు గాలులకు పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగి రోడ్లపై పడడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. విశాఖలోని గాజువాక నుంచి యారాడ వెళ్లే మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆనందపురం మండలంలోని గంభీరం రిజర్వాయర్ ఉధృతి పెరిగింది. అరకులోయ, విశాఖపట్నం ఘాట్ రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు ఆగిపోయాయి. అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలకు శారద, వరాహ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మాకనపాలెంలో చెట్టు కూలి వీరవేణి అనే మహిళ మృతి చెందింది. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం గొట్లపాళానికి చెందిన కృష్ణమనేని జయమ్మ (65) గేదెలను మేపేందుకు వెళ్లి పొట్టేళ్ల కాలువలో గల్లంతయింది. ఈత గాళ్లను రంగంలోకి దించి గాలిస్తున్నారు. రాత్రి వరకు ఆమె జాడ తెలియరాలేదు. గుండ్లకమ్మ నది పోటెత్తడంతో ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ముష్ట గంగవద్ద చప్టా కోతకు గురైంది. దీంతో పదుల సంఖ్యలో గ్రామాల మధ్య రాకపోకలు తెగిపోయాయి. తుపాను ప్రభావంతో తిరుమలలో ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తున్న భక్తులు వర్షం, పొగమంచుతో ఇబ్బందిపడ్డారు. ఆకస్మిక వరదలు వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జాతీయ రహదారులు, పలు ప్రధాన రహదారులపై మంగళవారం రాత్రి నుంచి రాకపోకలను నిలిపివేశారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లోని కర్నూలు రోడ్డు, ఊరచెరువు రోడు జలమయం విరుచుకుపడి.. తీరం దాటి.. మోంథా తుపాను మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కోనసీమ జిల్లాలోని అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని తాకింది. ఆ తర్వాత నాలుగైదు గంటలపాటు పెను గాలులు వీయగా భారీ వర్షాలు కురిశాయి. మచిలీపట్నం తీరానికి అత్యంత చేరువగా వచ్చిన తుపాను 17 కిలోమీటర్ల వేగంతో కాకినాడ వైపు కదులుతూ అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని దాటింది. రాత్రి సమయానికి మచిలీపట్నానికి 110 కిలోమీటర్లు, కాకినాడకు 100, విశాఖపట్నానికి 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. కదులుతున్న దిశ, వేగం ప్రకారం బుధవారం తెల్లవారు జామున తీరం దాటే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. కొద్ది గంటల్లో క్రమేపీ తుపానుగా ఆ తర్వాత వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో మచిలీపట్నం పరిసరాల్లో గంటకు 77 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో బుధవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ సహా విశాఖపట్నం, గంగవరం, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో పదో నంబర్ భారీ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. పల్నాడు జిల్లాలో భారీ వర్షాలతో పత్తి, వరికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. బాపట్ల జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వేమూరు నియోజకవర్గంలో వందల ఎకరాల్లో వరి నేలకొరిగింది. రేపల్లె, బాపట్ల నియోజకవర్గాల్లోనూ వరి దెబ్బతిందని రైతులు వాపోతున్నారు. బాపట్ల, చీరాల, రేపల్లెతోపాటు జిల్లావ్యాప్తంగా పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేకేలైన్‌లో జారిపడిన కొండచరియలు అల్లూరి జిల్లాలో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొత్తవలస–కిరండూల్ రైల్వే లైన్లో చిమిడిపల్లి సమీపంలోని టన్నెల్ వద్ద కొండచరియలు ట్రాక్‌పై జారి పడ్డాయి. వరదనీరు ట్రాక్‌పై పొంగి ప్రవహించింది. ట్రాక్‌పై బండరాళ్లు, మట్టి తొలగించే పనుల్లో రైల్వే వర్గాలు నిమగ్నమయ్యాయి. ఈ మార్గంలో సోమవారం రాత్రి నుంచి అన్ని రైళ్ల రాకపోకలను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అరకులోయ–అనంతగిరి ఘాట్‌లో సుంకరమెట్ట, బీసుపురం సమీప ప్రాంతాల్లో రోడ్డుపై వరదనీరు పొంగి ప్రవహించింది. ఘాట్ మార్గాల్లో రాత్రి పూట ప్రయాణాలను నిలిపివేశారు. బలిమెల జలాశయ నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. -
మోంథా బీభత్సం..30మంది విద్యార్థులకు కరెంట్ షాక్?
సాక్షి,విజయనగరం: ఏపీలో మోంథా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మోంథా తీవ్రతతో భారీ వర్షాలు, వరదలు, కుండపోత వర్షం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గంటకు 90 నుంచి 100 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తుండటంతో విద్యుత్ స్తంభాలు నేలమట్టమవుతున్నాయి. చెట్లు కూలిపోతున్నాయి. సెల్ టవర్స్ దెబ్బతింటున్నాయి.ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని కస్తూర్బా హాస్టల్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ సంభవించింది. ఈదురు గాలుల కారణంగా విద్యుత్ స్తంభం పాఠశాల గోడపై పడింది. విద్యార్థులు గోడను పట్టుకోవడంతో విద్యుత్ ప్రసారం కావడంతో 30 మంది విద్యార్థులకు కరెంట్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన అధికారులు విద్యార్థులను అత్యవసర చికిత్స కోసం నెల్లిమర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. -
ఐక్యరాజ్య సమితి సమావేశానికి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి
ఢిల్లీ: 80వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి వైఎస్సార్సీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి హాజరుకానున్నారు. యూఎన్ సమావేశాల కోసం ఆయన న్యూయార్క్ చేరుకున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో మిథున్‌రెడ్డి పాల్గొనున్నారు. ఐక్యరాజ్యసమితి హెడ్ క్వార్టర్స్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి మిథున్‌రెడ్డి నివాళులర్పించారు. మిథున్‌రెడ్డితో పాటు ఎంపీల బృందం సమావేశాల్లో పాల్గొననుంది.ఐక్య రాజ్యసమితి సమావేశాల్లో మిథున్‌రెడ్డి.. భారత వాణి బలంగా వినిపించనున్నారు. ఐక్య రాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు భారత ఎంపీలు రెండు బృందాలుగా హాజరవుతున్నారు. ఒక్కో బృందంలో 15 మంది ఎంపీలు ఉన్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు ఐక్యరాజ్యసమితి సమావేశాలలో ఎంపీల బృందం పాల్గొననుంది. -
ప్రైవేట్ మెడికల్ కాలేజీలూ సమ్మెలోకి!
సాక్షి, అమరావతి: ప్రైవేట్ ఆస్పత్రుల మాదిరిగానే రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ డెంటల్ కళాశాలల యజమానులు కూడా చంద్రబాబు ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా వేధిస్తుండడంతో విసిగిపోయిన యాజమాన్యాలు బుధవారం నుంచి పథకం సేవలు నిలిపివేసి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లేనిపక్షంలో సమ్మెలోకి వెళ్తామని ఈనెల 10నే ఏపీ ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. రెండు వారాలకు పైబడి సమయం ఇచ్చినా ప్రభుత్వం మాత్రం బిల్లులు విడుదల చేయలేదు. దీంతో ముందస్తు కార్యాచరణ ప్రకారం సేవలు నిలిపేయాలని నిర్ణయించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. నెట్వర్క్ ఆస్పత్రులకు చంద్రబాబు ప్రభుత్వం రూ.మూడువేల కోట్లకు పైగా బకాయిపడింది. ఈ క్రమంలో.. గతనెల 15 నుంచి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశ) ఆందోళన బాటపట్టింది. తొలుత ఉచిత ఓపీ, డయగ్నోస్టిక్స్, ఇన్వెస్టిగేషన్ సేవలను నిలిపేయడంతో ప్రారంభమైన సమ్మె ఈనెల 10 నుంచి పూర్తిస్థాయిలో పథకం సేవలన్నింటినీ నిలిపేసింది. తాజాగా.. ప్రైవేట్ వైద్య కళాశాలలు సైతం ఇదే బాటపట్టాయి.రోడ్డెక్కినా డోంట్ కేర్..రాష్ట్రంలోని 1.42 కోట్లకు పైగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆధారమైన ఆరోగ్యశ్రీ పథకం సేవలు సుమారు మూడు వారాలుగా నిలిచిపోయాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొత్తగా కేసులు చేర్చుకోకపోగా, పాత కేసులకు ఫాలోఅప్ సేవలను నిలిపేశారు. డబ్బు చెల్లిస్తేనే వైద్యం చేస్తాం.. లేదంటే ప్రభుత్వాస్పత్రులకు వెళ్లాలంటూ రోగులను పంపించేస్తున్నారు. దీంతో అనారోగ్యం బారినపడిన పేదల పరిస్థితి దుర్భరంగా మారిపోయింది. చికిత్సలు చేయించుకోవడానికి బయట అప్పు పుట్టక.. ప్రభుత్వాస్పత్రుల్లో పట్టించుకునే వారు లేక బాధితులు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా.. క్యాన్సర్, గుండె, కిడ్నీ జబ్బు బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది. పూడుకుపోయిన రక్తనాళాలకు సర్జరీ చేయించుకోవడానికి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే ఉచితంగా చేయబోమని తేల్చిచెబుతున్నారు. ఈ క్రమంలో.. రూ.మూడు లక్షల నుంచి రూ.5 లక్షలకు పైగా వెచ్చించి బైపాస్ సర్జరీలు చేయించుకునే స్థోమతలేని పేదలు, మందులతో కాలం వెళ్లదీస్తున్నారు. మరోవైపు.. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆస్పత్రుల యాజమాన్యాలు తమను ఆదుకోవాలని రోడ్డెక్కి ఆందోళనలు చేశాయి. రాష్ట్రంతో పాటు, దేశ చరిత్రలో ఎన్నడూలేనట్లుగా బిల్లులు ఇవ్వండి మహాప్రబో అంటూ ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు, వైద్యులు విజయవాడలో మహాధర్నాకు దిగారు. ఓ వైపు వైద్యసేవలు అందక ప్రజలు, మనుగడ సాగించలేక ఆస్పత్రులు కొట్టుమిట్టాడుతున్నా సీఎం చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు హోరెత్తుతున్నాయి. -
మద్యం మత్తులో.. మతిస్థిమితంలేని బాలికపై అత్యాచారయత్నం
లక్కిరెడ్డిపల్లి: మద్యం సేవించి మతిస్థిమితం లేని బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామం, ఈడిగపల్లెలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలివీ.. రెండ్రోజుల క్రితం ఈడిగపల్లెలో జరిగిన ఓ పెద్దకర్మ కార్యక్రమానికి హాజరైన నాగేంద్ర (18) మతిస్థిమితం లేని బాలిక (15)పై కన్నేశాడు.ఆదివారం తన మిత్రుడు శివ (22)తో కలిసి అదే గ్రామంలోని బెల్టు దుకాణంలో మద్యం కొనుగోలు చేసి సేవించారు. మధ్యాహ్న సమయంలో బాలిక ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఆమె ఇంట్లోకి చొరబడి బాలికపై అత్యాచారానికి యత్నించారు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల మహిళలు పరుగున వచ్చారు. వారిని చూసి నిందితులు సమీపంలోని గంగమ్మ ఆలయం దగ్గర దాక్కున్నారు. బాధితురాలి బంధువులు వీరిని పట్టుకుని దేహశుద్ధి చేయబోతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని లక్కిరెడ్డిపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం రాజీ పేరుతో వారిని పోలీసులు వదిలేశారు. సాక్షి విలేకరిపై దాడికి యత్నం..ఇదిలా ఉంటే.. సోమవారం బాలిక సోదరుడు, అతని మిత్రులు కలిసి తమ సోదరికి జరిగిన అన్యాయాన్ని ‘సాక్షి’ దృష్టికి తీసుకురాగా వివరాలు సేకరించేందుకు సాక్షి విలేకరి అక్కడకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న లక్కిరెడ్డిపల్లి పోలీసులు ఈడిగపల్లెకు చేరుకుని బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలంటూ ఆటోలో బాధితురాలిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ‘మా పంచాయితీలో నువ్వెవరు వీడియోలు, ఫొటోలు తీయడానికి? నీకేమి సంబంధం, నీ అంతు తేలుస్తాం, నీ కథ చూస్తా’మంటూ రాజీకి ప్రయత్నిస్తున్న మధ్యవర్తులు కొందరు స్టేషన్లో పోలీసుల సమక్షంలోనే సాక్షి విలేకరిపై దాడికి యత్నించారు.అక్కడే ఉన్న మరో టీడీపీ నేత సాక్షి విలేకరి సెల్‌ఫోన్ లాక్కుని.. ఫొటోలు, వీడియోలు తొలగించాలని ఒత్తిడి చేశారు. మరోవైపు.. పోలీసుల రాజీయత్నం బెడిసికొట్టడంతో ఈ విషయం జిల్లా పోలీసు అధికారులకు తెలిసింది. దీంతో లక్కిరెడ్డిపల్లి పోలీసులు నిందితులిద్దరిపై పోక్సో కేసుతో పాటు అటెంప్ట్ టు రేప్ కేసు నమోదుచేశారు. బాలికను వైద్య పరీక్షలు నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ రవీంద్రబాబు చెప్పారు.బాలికపై లైంగిక దాడికి యత్నంనిందితుడు టీడీపీ సానుభూతిపరుడని కేసు నీరుగార్చేందుకు యత్నంనందిగామ టౌన్: మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఘటన ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్లలో జరిగింది. విజయవాడకు చెందిన చిన్ను, ముప్పాళ్ల గ్రామానికి చెందిన వినయ్ స్నేహితులు. చిన్ను మరో ముగ్గురితో కలిసి సోమవారం మధ్యాహ్నం ముప్పాళ్లలోని వినయ్ వద్దకు వచ్చాడు. అదే సమయంలో వినయ్ ఇంట్లోని జామకాయలు కోసుకునేందుకు ఓ బాలిక (16) వచ్చింది.చిన్ను వరండాలో బాలికతో మాట్లాడుతుండగా అదే సమయంలో మరో యువకుడు, మరో బాలికతో వినయ్ ఇంట్లో ఉన్నాడు. మరోవైపు.. చిన్ను జామ కాయల కోసం వచ్చిన బాలికను బలవంతం చేయబోయాడు. ఇంతలో బాలిక కుటుంబ సభ్యులు అక్కడకు రావడంతో వినయ్ ఆమెను మరో గదిలోకి తీసుకెళ్లి బయట నుంచి గడియ పెట్టాడు. అనుమానం వచ్చి వారు తలుపులు తెరవగా బాలిక భయంతో స్పృహ తప్పి పడిపోయింది. శరీరంపై పంటి గాట్లుండడంతో నందిగామ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన..రాత్రి 10 గంటల సమయంలో బాలిక కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. చందర్లపాడు ఎస్ఐ ధర్మరాజు లోపలి నుంచి బయటకు రాగానే రాజకీయ ఒత్తిళ్లు ఏమన్నా ఉన్నాయా ఎందుకింత తాత్సారం చేస్తున్నారని ఆయన్ను నిలదీశారు. మహిళా పోలీసులు రావాల్సి ఉందని అందువల్లే ఆలస్యమవుతోందని ఎస్ఐ అసహనం వ్యక్తం చేశారు. అయితే, వినయ్ టీడీపీ సానుభూతిపరుడనే కారణంతోనే విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బాలిక బంధువులు మండిపడ్డారు.బాలికతో అసభ్య ప్రవర్తన.. వృద్ధుడిపై కేసుఉంగుటూరు(గన్నవరం): మనవరాలు వయసున్న ఓ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వృద్ధుడిపై ఆత్కూరు పోలీసులు సోమవారం పోక్సో కేసు నమోదు చేశారు. ఉంగుటూరు మండలం నారయ్య అప్పారావుపేటకు చెందిన నిమ్మకూరి రత్నం(76) ఇంటి ముందు ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలికను పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో భయంతో పరుగులు తీసిన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్కూరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లపై సానుకూల నిర్ణయం తీసుకోండి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. కర్ణాటక రాష్ట్రం ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 1 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం అలాంటి నిర్ణయమే తీసుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపింది. కర్ణాటక విధానాన్ని అధ్యయనం చేసి, రిజర్వేషన్ కల్పనపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని చెప్పింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథశర్మ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ట్రాన్స్‌జెండర్ న్యాయపోరాటం 2018 నవంబర్‌లో జారీచేసిన ఎస్ఐ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్ కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ ట్రాన్స్‌జెండర్ గంగాభవాని 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దరఖాస్తులో స్త్రీ, పురుష ఐచ్చికాలు మాత్రమే ఉండటంతో తాను స్త్రీగా ఐచ్చికం ఇచ్చినట్లు తెలిపారు. రాతపరీక్షలో 35 శాతం మార్కులు సాధించినా తదుపరి ప్రక్రియకు తనను అనర్హురాలిగా ప్రకటించారని తెలిపారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఆ పిటిషన్‌ను కొట్టేశారు. దీనిపై గంగాభవాని 2022లో ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై గత ఏడాది విచారణ జరిపిన ధర్మాసనం గంగాభవానీకి ఉద్యోగం కల్పించే విషయంలో నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌ని ఆదేశించింది.తాజాగా ఈ అప్పీల్‌పై జస్టిస్ దేవానంద్ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివప్రతాప్ వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాల మేరకు పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రాన్ని డీజీపీ తిరస్కరించారని చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లలో రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదని తెలిపారు. ఇప్పటికే వందశాతం రిజర్వేషన్ల కోటా పూర్తయిందని చెప్పారు. ట్రాన్సజెండర్ల విషయంలో ప్రభుత్వం 2017లో ఓ విధానం తీసుకొచి్చందని, అయితే రిజర్వేషన్లను మాత్రం ఇప్పటివరకు అమలు చేయలేదని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. రిజర్వేషన్లు లేకుండా పాలసీలు రూపొందిస్తే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించింది.పిటిషనర్ న్యాయవాది సాల్మన్‌రాజు వాదనలు వినిపిస్తూ.. నోటిఫికేషన్లో ట్రాన్స్‌జెండర్ ఆప్షన్ లేకపోవడంతో ఫీమేల్ ఆప్షన్ ఎంచుకున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ రిజర్వేషన్ అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. కర్ణాటక రాష్ట్రం ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు 1 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఆ రాష్ట్రం రిజర్వేషన్ అమలు చేస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించింది. ఏఏజీ సాంబశివప్రతాప్ స్పందిస్తూ.. దీనిమీద అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. -
పోలీసు శాఖలో భారీగా ఖాళీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసు శాఖలో భారీగా ఖాళీలు ఉన్నాయి. అధికారులు, సిబ్బంది కొరత పోలీసు శాఖను వేధిస్తోంది. 11,639 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని హోం శాఖ ప్రభుత్వానికి ఇటీవల నివేదిక సమర్పించింది. ఎస్సై నుంచి కానిస్టేబుల్ వరకు 13 కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని ఆ నివేదికలో పేర్కొంది. కాగా దీనిపై ప్రభుత్వం ఇంకా స్పందించ లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పోలీసు నియామక మండలి పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టింది. 411 ఎస్సై పోస్టులకు 2022లో నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్షలు నిర్వహించి భర్తీ చేసింది.6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్ష నిర్వహించింది. కాగా న్యాయపరమైన వివాదాలతో పోస్టుల భర్తీకి ఆటంకాలు ఏర్పడ్డాయి. ఎన్నికల అనంతరం టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ నోటిఫికేషన్, రాత పరీక్ష ఆధారంగానే ఆ కానిస్టేబుల్ పోస్టులకు ప్రభుత్వం నియామక ఉత్తర్వులు ఇచ్చింది. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా పోలీసు శాఖలో ఖాళీల భర్తీపై ఇంకా దృష్టి సారించ లేదు. -
కౌలు రైతులకు గడ్డుకాలం
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వ పాలనలో అన్నివిధాలుగా మోసపోయామని కౌలు రైతులు వాపోయారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కౌలు రైతుల పరిస్థితి ఎలా ఉందనే అంశంపై ఏపీ కౌలు రైతుల సంఘం, పీపుల్స్ పల్స్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20 నుంచి నెల రోజులపాటు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో సర్వే జరిపారు. సర్వే ఫలితాలను రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, కౌలు రైతు సంఘం అధ్యక్షుడు ఎ.కాటమయ్య, ప్రధాన కార్యదర్శి పి.జములయ్య సోమవారం మీడియాకు విడుదల చేశారు. 40 ప్రశ్నల ద్వారా కౌలు రైతుల నుంచి రాబట్టిన సమాధానాలను క్రోఢీకరించి తుది సర్వే నివేదిక రూపొందించినట్టు వెల్లడించారు. కౌలు రైతుల దయనీయ పరిస్థితికి ఈ సర్వే అద్దం పడుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు పైసా భారం పడకుండా అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకం దూరం కావడంతో తీవ్రంగా నష్టపోతున్నామని కౌలు రైతులు తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వ నిర్వాకం వల్ల సంక్షేమ ఫలాలు ఏ ఒక్క కౌలు రైతుకు అందడం లేదనే విషయాన్ని కుండబద్దలు గొట్టారు. సర్వేలో ఏం తేలిందంటే.. స్వచ్ఛంద నమోదు పద్ధతిన కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పంటల బీమా పథకం పుణ్యమా అని గడచిన 17 నెలల్లో ప్రీమియం భారమై పంటల బీమా రక్షణ కోల్పోయామని 99.1 శాతం మంది కౌలు రైతులు సర్వేలో స్పష్టం చేశారు. మద్దతు ధర దక్కడం లేదని 96.2 శాతం మంది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ–పంటలో నమోదు చేయకపోవడం వల్ల ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 14.3 శాతానికి మించి పంట ఉత్పత్తులను కౌలు రైతులు అమ్ముకోలేకపోతున్నారని సర్వేలో తేలింది. మాట ఒప్పందంతోనే కౌలు ప్రొఫెసర్ రాధాకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 32 లక్షలకు పైగా కౌలు రైతులు ఉంటారని అంచనా. వారిలో 70 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారే ఉన్నట్టు సర్వేలో నిర్ధారించారు. 92.3 శాతం మంది కౌలు రైతులు మాట ఒప్పందం ద్వారానే భూముల్ని కౌలుకు తీసుకుంటున్నారు. 3.9 శాతం మంది రాతపూర్వక ఒప్పందం చేసుకోగా.. రెవెన్యూ రికార్డుల ద్వారా 2.6 శాతం మంది కౌలు ఒప్పందాలు చేసుకున్నారు. నగదు రూపంలో ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.35 వేల వరకు లేదా ఎకరాకు 10 నుంచి 30 బస్తాల వరకు చెల్లిస్తున్నారు. 96.6 శాతం మందికి అందని ఫలాలు 87.7 శాతం మంది కౌలు రైతులు గుర్తింపు కార్డులకు నోచుకోలేకపోతున్నారని సర్వేలో తేలింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని 96.6 శాతం మంది కౌలు రైతులు తేలి్చచెప్పారు. పంట పెట్టుబడి కోసం బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందలేకపోతున్నామని 92.7 శాతం మంది స్పష్టం చేశారు. పెట్టుబడి కోసం ఏటా పంటను బట్టి 65 శాతం మంది రూ.60 వేల వరకు, 34.3 శాతం మంది రూ.60 వేలకు పైగా అప్పులు చేస్తున్నారు. వీటికోసం 38 శాతం మంది వడ్డీ వ్యాపారులను, 28.8 శాతం మంది వ్యాపారులు/దళారులను, 12.7 శాతం మంది భూ యజమానులపై ఆధారపడాల్సి వస్తోందని పేర్కొన్నారు. తీసుకునే రుణంపై 79 శాతం మంది నూటికి రూ.2 చొప్పున వడ్డీ చెల్లిస్తుండగా.. మిగిలిన వారు రూ.2 నుంచి రూ.5 వరకు చెల్లించాల్సి వస్తోందని వాపోయారు. అదనుకు విత్తనాలు, ఎరువులు దొరకడం లేదని, పురుగు మందులు, కూలిరేట్లు, యంత్రాల అద్దెల భారం వల్ల ఆరి్థక ఇబ్బందులకు గురవుతున్నామని 67.2 శాతం మంది వాపోయారు.91.4 శాతం మందికి ఈ–పంట దూరం వాస్తవ సాగుదారుల పంట వివరాలను మాత్రమే నమోదు చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతుంటే.. తాము పండించిన పంటల వివరాలను ఈ–పంట యాప్‌లో నమోదు చేయడం లేదని 91.4 శాతం మంది కౌలు రైతులు ఈ సర్వేలో తేల్చి చెప్పారు. ఫలితంగా పండించిన పంట ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోలేక దళారులు, ప్రైవేటు వ్యాపారులకు అయినకాడికి తెగనమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. ప్రైవేటు మార్కెట్లో 79.5 శాతం మంది, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 14.3 శాతం, దళారులకు 6.2 శాతం మంది అమ్ముకుంటున్నట్టుగా వెల్లడించారు. సగటున రూ.5 లక్షల అప్పు ఒక పంట సాగుచేస్తే ఏటా రూ.25 వేలపైన ఆదాయం వస్తోందని 28.1 శాతం, లాభం లేదు, నష్టం లేదని 19.4 శాతం మంది వెల్లడించగా.. నష్టం వస్తోందని 15.4 శాతం మంది కౌలు రైతులు తెలిపారు. దాంట్లో కూలీలకే దాదాపు 69.8 శాతం ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం మీకు ఎంత అప్పు ఉందని ప్రశ్నిస్తే రూ.5 లక్షలపైన ఉందని 20.4 శాతం మంది చెప్పగా.. మిగిలిన వారు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల మధ్య ఉన్నట్టుగా చెప్పారు. తాము ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయాలని 27.4 శాతం మంది, సకాలంలో గుర్తింపు కార్డు ఇవ్వాలని 22.7 శాతం మంది, పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని 12.9 శాతం మంది, పెట్టుబడికి రుణాలు మంజూరు చేయాలని 10.9 శాతం మంది, రుణమాఫీ చేయాలని 10.5 శాతం మంది కోరారు.పంటల బీమాకు దూరమైన కౌలు రైతులు 99.1% సంక్షేమ పథకాలు అందని వారు 96.6% మద్దతు ధర దక్కని కౌలుదారులు 96.2% పంట రుణాలు దక్కని వారు 92.7% సకాలంలో విత్తనాలు, ఎరువులు దొరకడం లేదన్న వారు 67.2% సీసీఆర్సీ కార్డులు అందని వారి శాతం 87.7% కొనుగోలు కేంద్రాల్లో పంటల్ని విక్రయించే వారు 14.3% -
చంద్రబాబూ, లోకేశ్ ప్రమాణానికి మీరు సిద్ధమా?
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): నకిలీ మద్యంతో తనకు ఎలాంటి సంబంధం లేదని దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని.. ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ సిద్ధమా అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ సవాల్ విసిరారు. పది రోజుల కిందటే సత్య ప్రమాణానికి రావాలని చంద్రబాబు, లోకేశ్‌ను కోరినా రాలేదని ఎద్దేవా చేశారు. భగవద్గీతపై ప్రమాణం చేయాలని కోరినా స్పందించలేదన్నారు. ఇప్పటికైనా వారు సత్యప్రమాణానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. నకిలీ మద్యంతో తనకు ఎలాంటి సంబంధం లేదని నార్కోఎనాలసిస్, లైడిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నానన్నారు.‘బెజవాడ దుర్గమ్మ, కృష్ణమ్మ సాక్షిగా చెబుతున్నా. నిబద్ధత, నిజాయితీ, నిండు మనస్సుతో చెబుతున్నా. నకిలీ మద్యం కేసులో నా ప్రమేయం లేదు. నేను ఏ తప్పూ చేయలేదు. నాపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం’ అని జోగి రమేష్ స్పష్టం చేశారు. కనకదుర్గమ్మ కొలువుదీరిన ఇంద్రకీలాద్రికి జోగి రమేష్ సోమవారం కుటుంబ సమేతంగా వచ్చారు. తొలుత దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఘాట్‌రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం వద్దకు వచ్చారు. అక్కడ జోగి రమేష్ తన చేతిలో కర్పూరం వెలిగించుకుని నకిలీ మద్యం కేసులో తన ప్రమేయం లేదని సత్యప్రమాణం చేశారు. ‘నకిలీ మద్యం కేసులో ఆరోపణలు నా హృదయాన్ని గాయపరిచాయి. నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. నా వ్యక్తిత్వాన్ని కించపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నా. నాపై సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ కక్షగట్టారు. ఎక్కడో జరిగిన అంశాన్ని నాకు అంటగడుతున్నారు’ అని జోగి రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి సంబంధం ఉందో ఆ మంత్రికే తెలుసు ‘ఎవడో ఇబ్రహీంపట్నంలో పుట్టినవాడు చెప్పింది విని నకిలీ మద్యం కేసులో నన్ను దోషి అంటున్నారు. కానీ రిమాండ్ రిపోర్టులో నా పేరు లేదు. నకిలీ మద్యం వ్యవహారంతో ఎవరికి సంబంధం ఉందో జనార్దనరావుకు ఎయిర్‌పోర్టులో రెడ్ కార్పెట్ వేసిన మంత్రికి తెలుసు. నేను తప్పు చేశానని సిట్ అధికారులు నిరూపిస్తే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా. నన్ను రాజకీయంగా దెబ్బకొట్టండి. కానీ నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయవద్దు. ఎంత బెదిరించినా రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో చంద్రబాబుపై పోరాటాన్ని ఆపేది లేదు’ అని జోగి రమేష్ స్పష్టం చేశారు -
కిలోమీటర్‌కు రూ.174.43 కోట్లు
సాక్షి, అమరావతి: అంచనా వ్యయం, కాంట్రాక్టు విలువలను అమాంతం పెంచేసి... రాజధానిలో భవనాలు, రోడ్ల నిర్మాణ పనుల్లో సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ), ఏడీసీఎల్ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్–ఏడీసీఎల్) సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. దీన్నిచూసి భవనాలు, రోడ్లను బంగారంతో ఏమైనా నిరి్మస్తున్నారా? అంటూ ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీడ్ యాక్సిస్ (ఈ3) రోడ్డును ఎన్‌హెచ్–16 (కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారి)తో అనుసంధానించే మూడో దశ పనులకు ఏడీసీఎల్ కిలోమీటరుకు రూ.174.43 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించడంపై నివ్వెరపోతున్నారు. జాతీయ రహదారులు, అందులోభాగంగా నిరి్మంచే భారీ ఫ్లైఓవర్ల కాంట్రాక్టు విలువను ప్రస్తావిస్తూ సీడ్ యాక్సిస్ రోడ్డును తారు, కాంక్రీట్‌తో కాకుండా బంగారపు పూతతో వేస్తున్నారా? అంటూ చలోక్తులు విసురుతున్నారు. ⇒ సీడ్ యాక్సిస్ రోడ్డును ఎన్‌హెచ్–16తో అనుసంధానం చేసే పనుల్లో భాగంగా మూడో దశలో కొండవీటి వాగు నుంచి రైల్వే ట్రాక్‌పైన మణిపాల్ ఆస్పత్రి మీదుగా వారధి వరకు 3.5 కి.మీ. పొడవు (18.270 కి.మీ. నుంచి 21.770 కి.మీ. వరకు), 60 మీటర్ల వెడల్పుతో ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌ను నిరి్మంచడానికి రూ.511.84 కోట్ల కాంట్రాక్టు విలువతో సోమవారం ఏడీసీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. లంప్సమ్ విధానంలో రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని నిర్దేశించింది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.98.66 కోట్లను తిరిగి చెల్లిస్తామని (రీయింబర్స్) పేర్కొంది. అంటే, కాంట్రాక్టు విలువ రూ.610.5 కోట్లకు చేరుతుంది. ⇒ ఈ రహదారిలో 2.464 కి.మీ. పొడవునా ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) ఎలివేటెడ్ కారిడార్‌ను నిరి్మంచాలి. 99.6 మీటర్ల పొడవునా ఆర్వోబీ, రెండు అండర్‌పాస్‌లు, ఒక ఇంటర్చేంజ్ (ట్రంపెట్), ఒక మైనర్ బ్రిడ్జి కమ్ పప్, మూడు ర్యాంప్‌లు (విజయవాడ–అమరావతి 232 మీటర్లు, గుంటూరు–అమరావతి 280 మీటర్లు, విజయవాడ–అమరావతి 115 మీటర్లు పొడవు) నిర్మించాలి. ఈ లెక్కన కి.మీ. రోడ్డు, ఆర్వోబీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ.174.43 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టినా.. దేశంలో జాతీయ రహదారులను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తోంది. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్–65)లో అంతర్భాగంగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేలా అత్యద్భుత డిజైన్‌తో కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌ను 2.6 కి.మీ. మేర ఆరు వరుసలు, రూ.282.4 కోట్లతో 2020లో పూర్తిచేసింది. కి.మీ.కు రూ.108.61 కోట్లు వ్యయం అయిందన్నమాట. కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారిలో అంతర్భాగంగా విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు బెంజ్ సర్కిల్ వద్ద 2020 నాటికి 2.35 కి.మీ. మేర మొదటి ఫ్లైఓవర్‌ను రూ.80 కోట్లతో నిరి్మంచింది. అంటే, కి.మీ.కు 34.04 కోట్లు వ్యయం. ఇక 2.47 కి.మీ. పొడవునా రెండో ఫ్లైఓవర్‌ను 2021లో రూ.88 కోట్లతో నిరి్మంచింది. ఇందులో కి.మీ.కు రూ.35.62 కోట్లు వ్యయమైంది. కాగా, అప్పటితో పోలిస్తే ఇప్పుడు స్టీల్, సిమెంట్, పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పులేదని ఇంజినీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. నీకింత.. నాకింత పంచుకోవడానికేజాతీయ రహదారులు.. విజయవాడలో కనకదుర్గమ్మ, బెంజ్ సర్కిల్ ప్లై ఓవర్ల నిర్మాణ వ్యయాలతో సీడ్ యాక్సిస్ రోడ్డును ఎన్‌హెచ్–16తో అనుసంధానం చేసే రహదారి పనుల కాంట్రాక్టు విలువను పోల్చిచూస్తూ ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు విలువను భారీగా పెంచేయడం వెనుక.. పెంచేసిన అంచనా వ్యయాన్ని కాంట్రాక్టరుతో కలిసి నీకింత నాకింత అంటూ ముఖ్య నేత పంచుకు తినడానికే అని ఆరోపిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు), కేఎఫ్‌డబ్ల్యూ (జర్మనీ), హడ్కో వంటి ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను దోచుకు తింటూ రాష్ట్ర ప్రజలపై తీవ్ర ఆరి్థక భారం మోపుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ ప్రమాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ ప్రమాణం చేశారు. కోర్టు మొదటి హాలులో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ రాయ్‌తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అంతకుముందు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి జస్టిస్ రాయ్ బదిలీకి సంబంధించి రాష్ట్రపతి ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్ రాయ్ కుటుంబ సభ్యులు, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివప్రతాప్.. రాష్ట్ర బార్ కౌన్సిల్æ చైర్మన్ ఎన్.ద్వారకనాథరెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనుంజయ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పసల పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం పాల్గొన్నారు. ప్రమాణం అనంతరం జస్టిస్ రాయ్ మరో న్యాయమూర్తి జస్టిస్ తుహిన్ కుమార్‌తో కలిసి ధర్మాసనంలో కేసులను విచారించారు. కాగా.. కలకత్తా హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు బదిలీ అయిన న్యాయమూర్తి జస్టిస్ సుభేందు సమంత ఈ నెల 29న ప్రమాణం చేయనున్నారు. -
ఆలయాల రక్షణకు ‘టెండర్’
సాక్షి, అమరావతి: ఏ కాంట్రాక్టు అయినా కావాల్సినవాళ్లకు ఇవ్వాలనో, తమను కనిపెట్టుకునేవాళ్లకు ఇవ్వాలనో చూసే కూటమి ప్రభుత్వ పెద్దలు దేవదాయశాఖపైనా కన్నేశారు. ఇందుకోసం నిబంధనలను కూడా మార్చేస్తున్నారు. అనుకూలంగా లేదంటే టెండర్లను రద్దుచేసి మళ్లీ పిలుస్తున్నారు. రాష్ట్రంలో అధిక ఆదాయం వచ్చే ఏడు ప్రధాన ఆలయాల్లో సెక్యూరిటీ ఉద్యోగుల నియామకానికి ఉమ్మడిగా పిలిచిన టెండర్లే దీనికి ఉదాహరణ.సింహాచలం, అన్నవరం, ద్వారక తిరుమల, విజయవాడ దుర్గగుడి, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం ఆలయాల్లో మొత్తం 1,072 మంది సెక్యూరిటీ గార్డులు, 30 మంది సెక్యూరిటీ సూపర్వైజర్లు, 12 మంది సెక్యూరిటీ ఆఫీసర్లు, ఆరుగురు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లను ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించేందుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువుతో మళ్లీ టెండర్లు పిలిచారు. ఈ సెక్యూరిటీ ఉద్యోగులకు నెలకు దాదాపు రూ.2.5 కోట్లను వేతనాల రూపంలో ఆయా ఆలయాలు చెల్లిస్తాయి.వీరిని సమకూర్చే కాంట్రాక్టరుకు ప్రతి నెలా దీన్లో కమీషన్ లభిస్తుంది. ఈ కమీషన్‌ను తక్కువగా కోట్ చేసినవారికి ఈ కాంట్రాక్టు ఇస్తారు. ఈ ఉద్యోగాల నియామకానికి జూన్‌లో టెండర్లు పిలిచారు. నలుగురు టెండర్లు దాఖలు చేశారు. ఈ ఆలయాల్లో ఒకదానికి ఇప్పటివరకు సెక్యూరిటీ సిబ్బందిని సరఫరా చేస్తున్న కాంట్రాక్టరు దాఖలు చేసిన బిడ్ అనర్హమైనదని అధికారులు తిరస్కరించారు. మిగిలిన ముగ్గురిలో నెలకు రూ.23 లక్షల కమీషన్ ఇవ్వాలని దాఖలు చేసిన టెండరును ఎల్–1గా నిర్ధారించారు. తిరస్కరణకు గురైన బిడ్‌ను దాఖలు చేసిన కాంట్రాక్టరు హైకోర్టును ఆశ్రయించారు.హైకోర్టు ఆదేశాల మేరకు అతడి బిడ్‌ను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఆ బిడ్ ఓపెన్ చేస్తే ఆ కాంట్రాక్టరు ఎల్–1 అవుతారన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు తనకే ఇవ్వాలని తొలుత ఎల్–1గా వచ్చిన బిడ్ దాఖలు చేసిన వ్యక్తి మంత్రి ద్వారా, కోర్టుకు వెళ్లిన వ్యక్తి సీఎంవోలోని ఒక అధికారి ద్వారా పైరవీలు మొదలుపెట్టారు. రెండువైపులా ఒత్తిడితో దేవదాయశాఖ అధికారులు ఆ టెండర్లను సెపె్టంబర్లో రద్దుచేసి, మళ్లీ టెండర్లు పిలిచారు. గతంలో విడివిడిగా.. ఇప్పుడు ఉమ్మడిగా.. ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారికి కోట్ల రూపాయల పనులు అప్పగించేందుకు దేవదాయశాఖలో ఇష్టానుసారం టెండరు నిబంధనలు మార్చేస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆలయం అవసరాన్ని బట్టి పారిశుద్ధ్య పనులకు, రక్షణ విధులకు ఎక్కడికక్కడే టెండర్లు పిలిచేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పనులకు ఏడు ఆలయాలకు ఉమ్మడిగా టెండర్లు పిలిచారు. ఈ ఏడు ఆలయాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు పిలిచిన టెండర్లను కూడా ఒకసారి రద్దుచేశారు.ప్రభుత్వ పెద్దలకు కావాల్సినవారికి ఆ పనులు అప్పగించేందుకు మొదట పిలిచిన టెండర్లను రద్దుచేసి, నిబంధనలు మార్చి ఈ ఏడాది జూన్‌లో రెండోసారి టెండర్లు పిలిచారు. దాదాపు రూ.వందకోట్ల విలువ ఉండే ఆ టెండరు చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు బంధువుగా పేర్కొన్న వ్యక్తికి సంబంధించిన సంస్థకే దక్కడం గమనార్హం. -
‘బీద’ ఘరానా దందా!
సాక్షి, అమరావతి: బ్రెయిన్‌డెడ్ అయి అచేతనంగా ఆస్పత్రిలో ఉన్న వ్యక్తి లేచి వచ్చి రూ.వందల కోట్ల ఆస్తులను రిజిస్ట్రేషన్ చేశాడు. అది కూడా రెండు రోజుల్లోనే చేసేశాడు. ఆపై మళ్లీ ఆస్పత్రిలో చేరాడు. ఆ వెంటనే చనిపోయాడు. ఇదంతా ఎలా సాధ్యమైంది అంటారా? భారీ ఆస్తులను కాజేసేందుకు ప్రభుత్వంలోని కీలక నేత అండతో టీడీపీ ఎమ్మెల్సీ చక్రం తిప్పడంతోనే...! వివరాల్లోకి వెళ్తే... మాలేపాటి సుబ్బానాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు. ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.కావలి నియోజకవర్గంలో కీలక నాయకుడు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఆశించి చివరి నిమిషంలో భంగపడ్డారు. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు సుబ్బానాయుడు అత్యంత సన్నిహితుడు. వీరి మధ్య చాలా బలమైన ఆరి్థక బంధాలున్నాయి. ప్రభుత్వంలోని కీలక నేతను అడ్డుపెట్టుకుని అడ్డగోలు సెటిల్మెంట్ల ద్వారా సంపాదించారనే విమర్శలున్నాయి.అనేక ఆస్తులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సుబ్బానాయుడు ఈ నెల 11వ తేదీన సీఎం చంద్రబాబు నిర్వహించిన వ్యవసాయ శాఖ సమీక్షకు హాజరై ఉన్నట్టుండి కుప్పకూలారు. తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేర్చగా బ్రెయిన్ స్ట్రోక్‌గా వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన ఆస్తులపై ఎమ్మెల్సీ బీద రవిచంద్ర కన్నేశారు. వాటిని తన పరం చేసుకునేందుకు పెద్ద గూడుపుఠాణీ నడిపారని సమాచారం. 40 ఆస్తులు.. 200 కోట్ల ఆస్తులు.. 2 రోజులు సుబ్బానాయుడు 11వ తేదీ నుంచి ఆస్పత్రిలో అచేతనంగా ఉన్నారు. కానీ, ఆయన పేరిట ఉన్న సుమారు 40 ఆస్తులు ఈ నెల 15, 17వ తేదీల్లో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సోదరుడు, భార్య, కోడలు, సన్నిహితుల పేర్లపైకి మారిపోయాయి. ఇవన్నీ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు, దగదర్తి విమానాశ్రయం, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పరిసరాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు. అల్లూరు మండలం ఇసుకపాలెం పరిధిలోకి వచ్చే వీటి విలువ మార్కెట్ రేటు ప్రకారం రూ.200 కోట్లకు పైనే అని అంచనా. అందుకని సుబ్బానాయుడి కుటుంబ సభ్యులను బెదిరించి ఆయన ఆస్తులను ఉన్నపళంగా బీద రవిచంద్ర తనవాళ్ల పేరిట మార్పించుకున్నారని సమాచారం. విషయం ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసి అత్యంత రహస్యంగా ఉంచారు. కీలక నేతను తీసుకొచి్చ.. మంత్రాంగం సుబ్బానాయుడు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే ఆస్పత్రికి చేరుకున్న బీద రవిచంద్ర ఆస్పత్రి యాజమాన్యాన్ని మేనేజ్ చేరని ఆరోపణలున్నాయి. ఆస్తులు రాయించుకునే ఉద్దేశంలోనే 20వ తేదీ వరకు సుబ్బానాయుడిని వెంటిలేటర్‌పై ఉంచారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మధ్యలో ఒక రోజు ప్రభుత్వంలోని కీలక నేతను తీసుకొచ్చి ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడించారని అంటున్నారు. సుబ్బానాయుడి పదవిని కుటుంబ సభ్యుల్లోనే ఒకరికి ఇస్తామని చెప్పించారని సమాచారం. ఎనీ వేర్ రిజిస్ట్రేషన్‌తో..సుబ్బానాయుడి ఆస్తులను రాయించేసుకునేందుకు బీద రవిచంద్ర పెద్ద పన్నాగమే వేశారు. ఇçసుకపాలెం అల్లూరు సబ్ రిజిస్ట్రార్ పరిధిలోకి వస్తుంది. కానీ, అక్కడి అధికారి కాకుండా తను చెప్పినట్లు వినే కావలి సబ్ రిజిస్ట్రార్‌ను పిలిపించి మేనేజ్ చేసినట్లు సమాచారం. ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ అవకాశాన్ని దీనికోసం ఉపయోగించుకున్నారు. సుబ్బానాయుడి కుమారుడిని బెదిరించి ఆయన ఫోన్‌కు వచ్చే ఓటీపీలను తీసుకున్నారు.15, 17 తేదీల్లో చకచకా రిజిస్ట్రేషన్లు అల్లూరు మండలం ఇసుకపాలెం పరిధిలో సుబ్బానాయుడి పేరు మీద ఉన్న 40 ఆస్తులను 15, 17 తేదీల్లో రవిచంద్ర తన సోదరుడు బీద గిరిధర్, తన భార్య జ్యోతి, కోడలు రిషిత, సన్నిహితులైన కూరపాటి రఘునాథరాజు, నిడిమొసలి మల్లికార్జున్‌రెడ్డి, నిడిమొసలి సుజన, తుంగా ఉష, నర్రా శ్రీధర్, రేబాల వెంకటశరణ్ పేర్లపైకి మార్పించేశారు. వాస్తవానికి ఈ ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయాలంటే వాటి యజమాని అయిన సుబ్బానాయుడు కచ్చితంగా ఉండాలి.సంతకాలు పెట్టడంతో పాటు ఆధార్ అథెంటికేషన్, వేలి ముద్రలు కూడా వేయాలి. తన మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీని చెప్పాలి. కానీ, ఈ నెల 11వ తేదీన స్ట్రోక్ వచ్చినప్పటి నుంచి ఆయన స్పృహలోనే లేరు. అయినప్పటికీ, ప్రభుత్వంలోని కీలక నేత ప్రమేయం ఉండడంతో రవిచంద్రకు అడ్డులేకపోయింది. పని పూర్తయిపోయింది. రూ.వందల కోట్ల విలువైన ఆస్తులు చేతులు మారాయి. రిజిస్ట్రేషన్లు చేయించుకున్నాక వెంటిలేటర్ తొలగించి సుబ్బానాయుడు మృతి చెందినట్లు ప్రకటించారు.సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ చెల్లుబాటు సాధారణంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి మాత్రమే తన పేర ఉన్న ఆస్తిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయాలి. స్పృహలో లేకుండా, తన ప్రమేయం లేకుండా ఉన్నప్పుడు బలవంతంగా ఎవరి ప్రోద్బలంతోనైనా రిజిస్ట్రేషన్ చేస్తే అది చెల్లదు. అంతేకాదు అది పెద్ద నేరమని రిజిస్ట్రేషన్ల చట్టం చెబుతోంది. తప్పని తెలిసినా.. సుబ్బానాయుడి ఆస్తులను అధికార బలంతో బీద రవిచంద్ర తనవారి పేర్లపైకి మార్పించేసుకున్నారు. రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లు ఇవే.. ⇒ కావలి సబ్ రిజిస్ట్రార్ పరిధిలో 15వ తేదీన డాక్యుమెంట్ నంబర్లు 4456, 4463, 4458, 4455, 4459, 4480, 4477, 4478, 4479, 4454, 4481, 4457 ద్వారా సుబ్బానాయుడి ఆస్తులను బీద రవిచంద్ర తనవారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ⇒ 17న 4521, 4552 డాక్యుమెంట్ నంబర్లతో రెండు రిజిస్ట్రేషన్లు చేయించారు. ఇవేకాక ఇతర ప్రాంతాల్లో ఉన్న చాలా ఆస్తులను సుబ్బానాయుడి నుంచి తమ వారి పేర్ల మీద మార్పించినట్లు తెలుస్తోంది. -
విమాన ప్రయాణాలపై ‘మోంథా’ ఎఫెక్ట్
గోపాలపట్నం/విమానాశ్రయం(గన్నవరం): మోంథా తుపాను కారణంగా మంగళవారం బెంగళూరు, విశాఖ నుంచి రాకపోకలు సాగించే అన్ని విమానాలు రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు ఇన్చార్జ్ డైరెక్టర్ పురుషోత్తం తెలిపారు. సోమవారం ఢిల్లీ నుంచి విశాఖ రావాల్సిన ఇండిగో విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో భువనేశ్వర్‌కు మళ్లించారు. వాతావరణం అనుకూలించిన కొద్ది గంటల తర్వాత ఈ విమానం విశాఖ చేరుకుంది. సోమవారం విజయవాడ–విశాఖ–హైదరాబాద్, బెంగళూరు–విశాఖ–బెంగళూరు ఎయిరిండియా విమానాలు రద్దయినట్లు పురుషోత్తం చెప్పారు.అలాగే, గన్నవరం విమానాశ్రం నుంచి రాకపోకలు సాగించే అన్ని ఎయిరిండియా విమాన సర్విస్లను కూడా మంగళవారం రద్దు చేశారు. రెండు న్యూఢిల్లీ సర్వీస్‌లతోపాటు ముంబయి సర్విస్ రద్దయినట్లు ఎయిరిండియా ప్రతినిధులు తెలిపారు. ఇండిగో విమాన సంస్థ కూడా మంగళవారం ఉదయం సర్వీస్‌లు మినహా అన్ని విమానాలను రద్దు చేసింది. ఉదయం 10.35 గంటలలోపు హైదరాబాద్, చెన్నైతోపాటు న్యూఢిల్లీ సర్విస్లు మాత్రమే నడుస్తాయని ఇండిగో ప్రతినిధులు తెలిపారు. ఆ తర్వాత అన్ని విమాన సర్వీస్‌లను రద్దు చేసినట్లు పేర్కొంది. -
రైల్వే వ్యవస్థ అప్రమత్తం
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): మోంథా తుపాను నేపథ్యంలో రైల్వేశాఖ ముందస్తు భద్రత చర్యలు చేపట్టిందని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సోమవారం విజయవాడకు చేరుకుని డీఆర్ఎం మోహిత్ సోనాకియా, కోఆర్డినేషన్ అండ్ సెక్యూరిటీ డీజీఎం శ్రీనివాస మల్లాది, ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్ కె.పద్మజ, పలు బ్రాంచ్‌ల అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాత్మకంగా ప్రణాళికలను మార్చుకుని అధికారులు, సిబ్బంది చురుగ్గా వ్యవహరించాలని జీఎం సూచించారు.డీఆర్ఎం మాట్లాడుతూ విజయవాడ డివిజన్లో ప్రయాణికులు, సిబ్బంది, రైల్వే ఆస్తుల భద్రత కోసం ఆపరేటింగ్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్, మెకానికల్, కమర్షియల్, మెడికల్ విభాగాలను హై అలర్ట్‌లో ఉంచామని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలు, రైలు పట్టాలు, వంతెనల పరిస్థితులు, కాలువలు, నదుల్లో నీటి ప్రవాహాన్ని 24 గంటలు పర్యవేక్షించేందుకు పెట్రోలింగ్ బృందాలు, కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యుత్ సమస్యలు తలెత్తితే ప్రత్యామ్నాయంగా డీజిల్ ఇంజిన్లు, మొబైల్ రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచామని వివరించారు. హెల్ప్‌డెస్క్ ల ఏర్పాటు ప్రయాణికులు రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు విజయవాడతోపాటు రాజమండ్రి, కాకినాడ, భీమవరం, తెనాలి తదితర ముఖ్య స్టేషన్లలో 24 గంటలు సేవలు అందించేలా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశామని డీఆర్ఎం తెలిపారు. రద్దయిన రైళ్లకు చెందిన, ప్రయాణాలను రద్దు చేసుకున్న ప్రయాణికుల కోసం రిఫండ్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ అథారిటీ(ఏపీఎస్డీఎంఏ)ని సమన్వయం చేసుకుంటూ రైల్వేశాఖ నిరంతరం కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసుకుంటోందని వివరించారు. 97 రైళ్ల రద్దు తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మంగళవారం, బుధవారం ప్రయాణించాల్సిన 54 రైళ్లను రద్దు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో 43 రైళ్లను రద్దు చేశారు. మొత్తం 97 రైళ్లను రద్దు చేసినట్లు ఆయా డివిజన్ల అధికారులు ప్రకటించారు. విజయవాడ డివిజన్ పరిధిలోని విజయవాడ, భీమవరం, నిడదవోలు, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నరసాపూర్, ఒంగోలు, రాజమహేంద్రవరం నుంచి బయలుదేరే రైళ్లను రద్దు చేసినట్లు డివిజనల్ అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు ఎంఎస్ఎస్ ద్వారా సమాచారం పంపామని, టికెట్ల డబ్బును వారి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. పలు ఆర్టీసీ సర్వీసులు రద్దుసాక్షి, అమరావతి: తుపాను హెచ్చరికల వల్ల పలు బస్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. తుపాను నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు సోమవారం ఆర్టీసీ ఈడీలు, ఆర్ఎంలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్టీసీ చేపట్టాల్సిన ముందస్తు చర్యలను నిర్దేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బస్సుల రాత్రి హాల్ట్‌ను రద్దు చేసింది. సోమవారం రాత్రి 9గంటల నుంచి తుపాను ప్రభావం తగ్గేంతవరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రయాణికులకు సమాచారం అందించేందుకు కమ్యూనికేషన్ సెల్‌లను ఏర్పాటు చేసింది. అత్యవసర సేవల కోసం ప్రతి డిపోలో కనీసం 10 మంది డ్రైవర్లు, 10 మంది కండక్టర్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. -
అడుగుకో బెల్టు షాపు.. అడిగితే దబాయింపు
అధికారానికి ధనదాహం తోడై వ్యవస్థల్ని గుప్పిటపట్టి విచ్చలవిడిగా చెలరేగిపోతుంటే ...అడుగడుగునా బెల్ట్ షాపులు కనిపిస్తాయి. మంచినీళ్లకైనా కొదవుంటుందేమో కానీ మద్యం మాత్రం ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతూనే ఉంటుంది. గుడి పక్కన, బడి ఎదుట బెల్టు షాపులు నడుస్తూనే ఉంటాయి. నిబంధనలకు విరుద్ధంగా రహదారి పక్కనే వైన్ షాప్ నడుస్తున్నా అధికారులకు మాత్రం కనిపించదు. ప్రజల ప్రాణాలు పోతున్నా అధికారపార్టీ నేతల దందా మీద మాత్రం అధికారులు ఈగ వాలనివ్వరు. కూటమి పాలనలో రాష్ట్రంలో ఇదీ పరిస్థితి... -
రాష్ట్రంలో 2 నకిలీ వర్సిటీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రెండు నకిలీ విశ్వవిద్యాలయాలున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. గుంటూరు కాకుమానువారితోటలోని క్రైస్ట్ న్యూ టెస్టెమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, విశాఖపట్నం ఎన్జీవోస్ కాలనీలోని ఆంధ్రప్రదేశ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా.. నకిలీ విశ్వవిద్యాలయాలని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా బోధన సాగిస్తున్న 22 నకిలీ వర్సిటీలు, సంస్థల జాబితాను యూసీజీ తాజాగా విడుదల చేసింది. ఈ సంస్థలు అందించే డిగ్రీలు వృత్తిపరమైన ఉపయోగాలకు చెల్లవని స్పష్టం చేసింది. గుర్తింపు లేని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న స్వయం ప్రకటిత వర్సిటీలు, విద్యాసంస్థల తీరుపై కఠినంగా వ్యవహరించనున్నట్టు ప్రకటించింది. ఢిల్లీ కోట్లా ముబారక్‌పూర్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ సంస్థ అనుమతులు లేకుండానే డిగ్రీ కోర్సులు నిర్వహిస్తోందని, ఆ డిగ్రీలకు విలువ లేదని స్పష్టం చేసింది. జాతీయ విద్యాసంస్థల పేర్లతో..యూజీసీ విడుదల చేసిన జాబితా ప్రకారం నకిలీ విద్యాసంస్థలు అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీలో తొమ్మిది ఉన్నాయి. తరువాత ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లో ఐదు నకిలీ విద్యాసంస్థలు బయటపడ్డాయి. ఢిల్లీలో ప్రఖ్యాత జాతీయస్థాయి వర్సిటీలను పోలిన విధంగా నకిలీ సంస్థలకు ‘నేషనల్, మేనేజ్మెంట్, టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్’ వంటి పదాలను పేర్లలో చేర్చి కనికట్టు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో విద్యాపీఠాలు, ఓపెన్ వర్సిటీలు, పరిషద్‌లు మాదిరిగా నకిలీ విద్యాసంస్థలు చలామణి అవుతున్నాయి. వీటిల్లో తక్కువ ఖర్చుతో విద్య పూర్తవుతుందని నమ్మబలికి నకిలీ డిగ్రీలిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. నకిలీ విద్యాసంస్థలు కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో రెండేసి, మహారాష్ట్ర, పుదుచ్చేరిలో ఒక్కొక్కటి ఉన్నాయి. చర్యలు తీసుకునే అధికారం రాష్ట్రాలదేవాస్తవానికి దేశంలో విద్యాసంస్థల గుర్తింపుల విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతోంది. అసలు విద్యార్థులకు ఏది నకిలీ, ఏది ఒరిజినల్ డిగ్రీ అందించే సంస్థ అని గుర్తించేందుకు అవకాశాలు ఉండట్లేదు. యూజీసీ ఏటా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు, నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాలను ఉచితంగా అందుబాటులో ఉంచుతోంది. నకిలీ విద్యాసంస్థల యాజమాన్యాలు వివిధ రకాలుగా తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని మభ్యపెట్టి మోసం చేస్తున్నాయి. ఈ సంస్థల జాబితా ప్రకటించే యూజీసీకి.. వాటిని మూసివేసే అధికారం మాత్రం లేదు. ఈ సంస్థలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే చర్యలు తీసుకోగలవు. దాదాపు ఏ రాష్ట్రంలోను నకిలీ విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటున్న దాఖలాల్లేవు. ఒకవేళ చర్యలు చేపట్టినా.. సంస్థ పేరు మార్పుతో మళ్లీ పుట్టుకొస్తున్నాయి. -
24/7 రోడ్డు పక్కనే మద్యం.. ఊరూరా సాక్ష్యం..
రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ కళ్లకు గంతలు కట్టుకుంది. ఊరూరా, వీధి వీధినా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కనిపిస్తున్నా, అబ్బే.. బెల్ట్ షాపులా.. లేనే లేవు అంటూ బుకాయిస్తోంది. తద్వారా ప్రభుత్వ పెద్దల మద్యం అక్రమ వ్యాపారానికి వంత పాడుతూ వారి దోపిడీని కప్పిపుచ్చేందుకు పడరాని పాట్లు పడుతోంది. ఎక్సైజ్ శాఖ తీరు చూస్తుంటే పచ్చ కామెర్లు సోకిన వారికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందన్న చందంగా తయారైంది. సుప్రీంకోర్టు నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నామని కూడా అడ్డగోలుగా బుకాయిస్తుండటం విస్మయపరుస్తోంది. కర్నూల్లో బస్సు ప్రమాదానికి కారణం మద్యం మహమ్మారే అని స్పష్టమయ్యాక రాష్ట్రంలో రోడ్ల పక్కనున్న మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులపై ఆదివారం ‘సాక్షి’ ఆరా తీస్తే వేలాది షాపులు కనిపించాయి.. అందులో మచ్చుకు కొన్ని ఇవి.. ఇంతగా మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నందుకే రాష్ట్రంలో 16 నెలలుగా నేరాలతో పాటు ప్రమాదాలూ పెరిగాయని ప్రజలు మండిపడుతున్నారు. -
ఉద్యోగుల ఆరోగ్యంపై అంతులేని నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: ‘‘ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు.. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఐఆర్ ప్రకటన.. అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు’’.. ఇలా 2024 ఎన్నికల సమయంలో ఉద్యోగులు, పెన్షనర్లకు మేనిఫెస్టోలో హామీలిచ్చిన చంద్రబాబు ఎన్నికల్లో గెలిచాక వారిని నిలువునా వంచించారు. ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడంతో పాటు వారి ఆరోగ్య భద్రతను పూర్తిగా గాలికొదిలేసింది. ఆరోగ్య భద్రత కోసం ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) పథకానికి నెలనెలా తమ వాటా మొత్తాన్ని చెల్లిస్తున్నా.. ఆపద సమయంలో పథకం ఆదుకోవడంలేదని వారు గగ్గోలు పెడుతున్నారు.చెల్లింపులు ‘సున్నా’రాష్ట్రంలో ఈహెచ్ఎస్ పథకంపై 22 లక్షల మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారు. వీరికి నగదు రహిత వైద్యసేవలు అందించిన నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ తోపాటు, ఈహెచ్ఎస్ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం అటకెక్కించింది. అలాగే, గతేడాది గద్దెనెక్కిన నాటి నుంచి ఈహెచ్ఎస్ కింద నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లులపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు రూ.95 కోట్ల మేర బిల్లులను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆమోదించగా వీటిలో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. 2024–25లో రూ.336 కోట్ల మేర బిల్లులు ఆస్పత్రులకు చెల్లించాల్సి ఉండగా రూ.140 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గత, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆమోదించిన బిల్లులతో పాటు, ట్రస్ట్ స్థాయిలో పరిశీలనలో ఉన్న క్లెయిమ్‌లతో కలిపి రూ.350 కోట్ల మేర బకాయి పడినట్లు సమాచారం. ఇలా ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రులన్నీ కొద్దినెలలుగా ఈహెచ్ఎస్ సేవలకు పూర్తిగా మంగళం పాడేశాయి. డబ్బుకట్టి వైద్యం చేయించుకుని రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలని తేల్చి చెబుతున్నాయి. దీంతో.. క్యాన్సర్, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ, లివర్, ఇతర పెద్ద అనారోగ్య సమస్యలతో పాటు ప్రమాదాల్లో గాయాలపాలైన వారు ఉచిత వైద్యసేవలు అందక తీవ్ర అగచాట్లు పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. పైగా.. అప్పుచేసి వైద్యం చేయించుకుంటే రీయింబర్స్ విషయంలోనూ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. రూ.లక్షల్లో వైద్య ఖర్చులుంటే, మంజూరు చేసేది మాత్రం రూ.వేలల్లోనే ఉంటోంది. -
మద్యం కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
ములకలచెరువు: నకిలీ మద్యం కేసులో ఇద్దరు నిందితులను అన్నమయ్య జిల్లా ములకలచెరువు ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం పెద్దపాళ్యం క్రాస్ వద్ద తనిఖీల సందర్భంగా రెండు కార్లలో వేగంగా వెళుతున్న ఏ 15 బాలాజీ, ఏ 20 సుదర్శన్‌ను ఎక్సైజ్ పోలీసులు అడ్డగించి పట్టుకున్నారు. తండ్రి, కుమారులైన వీరినుంచి 8స్మార్ట్ ఫోన్లు, 4 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుని ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా రిమాండ్ విధించారు. ఈ కేసులో నిందితుడైన జనార్దన్‌రావు అతని స్నేహితులు ములకలచెరువులో మద్యం దుకాణాలు నడుపుతున్నారని, అక్కడ అక్రమ మద్యం తయారు చేయాలని 2025 ఏప్రిల్‌లో కోరినట్లు విచారణలో బాలాజీ వెల్లడించాడు. -
తుపాను ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మోంథా తుపాను నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈనెల 28న (మంగళవారం) అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ తలపెట్టిన ర్యాలీని నవంబరు 4వ తేదీకి వాయిదా వేశామని ఆయన తెలిపారు. అలాగే, తుపాను నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు, సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
కాకినాడ తీరానికి ఉప్పెన ముప్పు!
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: మోంథా తీవ్ర తుపాను ప్రభావంతో కాకినాడ తీరానికి ఉప్పెన అవకాశం పొంచి ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రస్తుతం గంటకు 8 కి.మీ. వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. విశాఖపట్నానికి ఆగ్నేయ దిశలో 790 కి.మీ., కాకినాడకు ఆగ్నేయంగా 780 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ 28న మంగళవారం ఉదయానికి మరింత బలపడి మోంథా తుపానుగా (Cyclone Montha) మారనుంది. మోంథాగా మారిన అనంతరం వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం మధ్యాహ్నం నాటికి తీవ్ర తుపానుగా మారనుంది. ఆ తరువాత ఉత్తర–వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. మోంథా.. తీవ్ర తుపానుగా మారిన సమయంలో గంటకు 90 నుంచి 100 కి.మీ., గరిష్టంగా 110 నుంచి 120 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తీరం దాటిన తర్వాత క్రమేపీ బలహీనపడుతూ వాయుగుండంగా మారుతుందని ఈ సమయంలో పెనుగాలులు, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 28న 14 జిల్లాలకు రెడ్ అలెర్ట్ 28వ తేదీన తీవ్ర తుపాను తీరం దాటే సమయం కావడంతో రాష్ట్రంపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. కోస్తా, రాయలసీమలోని ఎక్కువ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిలా్లలకు రెడ్ అలెర్ట్ ఇచ్చింది. పార్వతీపురం మన్యం, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్ కడప, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. 29న 9 జిల్లాలకు రెడ్ అలెర్ట్ 29వ తేదీన కూడా తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంటూ.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలెర్ట్.. అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. 30వ తేదీన కూడా తుపాను ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. రాకాసి అలలు విరుచుకుపడతాయ్ కోస్తాంధ్ర తీరమంతటా బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలెవరూ సముద్రం వైపు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. విశాఖలో ముఖ్యమైన బీచ్‌ల వద్దకు సందర్శకులు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 28న మోంథా తీరం దాటే వరకూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. అలలు ఉప్పెనలా ఎగిసి పడతాయని హెచ్చరించారు. ముఖ్యంగా తీరం దాటే సమయంలో ఆంధ్రప్రదేశ్, యానాం తీరంలో అలలు విరుచుకుపడతాయని.. సముద్రం ఒడ్డున ఉన్న మత్స్యకార గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని సముద్ర తీరంలో అలలు 2 నుంచి 3.5 మీటర్లు, విశాఖపట్నం నుంచి పశ్చిమగోదావరి తీరం వెంబడి 2.1 నుంచి 4 మీటర్ల ఎత్తున రాకాసి అలలు విరుచుకుపడనున్నాయి. తీరం దాటే ప్రాంతంలో అలలు ఉప్పెనలా ఎగిసిపడి తీరం కోతకు గురి చేస్తాయని.. సమీపంలో ఉన్న మత్స్యకార గ్రామాల్లోకి నీరు చొచ్చుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 29 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ మోంథా విరుచుకుపడనున్న నేపథ్యంలో పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గంగవరం, కాకినాడ పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరికతో పాటు సిగ్నల్ నంబర్–5ని జారీ చేశారు. కళింగపట్నం, వాడరేవు, భీమునిపట్నం పోర్టుల్లో అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తుపాను సమాచారం, సహాయక చర్యలు అవసరమైన వారి కోసం రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. అవసరమైతే ప్రజలు 112, 1070, 1800–425–0101 నంబర్లకు కాల్ చేయాలని అధికారులు సూచించారు. నేడు 7 జిల్లాలకు రెడ్ అలెర్ట్కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, నంద్యాల జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది.జిల్లాల్లో ప్రత్యేక అధికారుల నియామకం తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 19 జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా ఐఏఎస్‌లని నియమించింది. శ్రీకాకుళం జిల్లాకు చక్రధర్‌బాబు, విజయనగరం జిల్లాకు రవి సుభాష్, పార్వతీపురం మన్యం జిల్లాకు నారాయణ భరత్‌గుప్తా, విశాఖపట్నం జిల్లాకు అజయ్‌జైన్, అనకాపల్లి, ఏఎస్సార్ జిల్లాలకు వాడ్రేవు వినయ్‌చంద్, తూర్పుగోదావరికి కె.కన్నబాబు, కాకినాడకు కృష్ణతేజ, కోనసీమకు విజయరామరాజు, పశ్చిమగోదావరికి ప్రసన్న వెంకటేష్, ఏలూరుకు కాంతిలాల్ దండే, కృష్ణా జిల్లాకు ఆమ్రపాలి, ఎన్టీఆర్ జిల్లాకు శశిభూషణ్‌కుమార్, గుంటూరుకు ఆర్పీ సిసోడియా, బాపట్లకు వేణుగోపాల్‌రెడ్డి, ప్రకాశం జిల్లాకు కోన శశిధర్, నెల్లూరుకు యువరాజ్, తిరుపతికి అరుణ్‌బాబు, చిత్తూరు జిల్లాకు గిరీషాను నియమించారు.శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు ఉన్న జిల్లాలకు జోనల్ ఇన్చార్జిగా అజయ్జైన్ని నియమించగా.. పశ్చిమగోదావరి నుంచి చిత్తూరు వరకూ జోనల్ ఇన్చార్జిగా ఆర్పీ సిసోడియాని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటి వరకు క్రమబద్ధీకరణను పట్టించుకోకపోవడం దుర్మార్గమని కాంట్రాక్ట్ లెక్చరర్లు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రెగ్యులరైజేషన్ కోసం చట్టం చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు.2024, 2025 మే నెల వేతనాలు వెంటనే విడుదల చేయాలన్నారు. సమావేశం అనంతరం బందరు రోడ్డులోని డాక్టర్ అంబేడ్కర్ స్మృతివనం వరకు ర్యాలీగా వెళ్లి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. జీవో 114ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, మాజీ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, డాక్టర్ గేయానంద్, ఉన్నత విద్యా పరిరక్షణ సమితి చైర్మన్ రాజగోపాల్, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్లు పాల్గొన్నారు. -
గోదావరి-కావేరి అనుసంధానంపై ముందడుగు!
సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానానికి ముందడుగు పడింది. ఇచ్చంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీనికి తెలంగాణ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 148 టీఎంసీలను తాత్కాలికంగా తరలించేలా అనుసంధానం చేపడతామని చెబుతున్నారని, హిమాలయ నదుల నుంచి గోదావరికి నీటిని తెచ్చాక వాటిని శాశ్వత ప్రాతిపదికన కావేరికి మళ్లిస్తామని అంటున్నారని, అసలు హిమాలయ నదుల నుంచి గోదావరికి నీటిని ఎప్పుడు తెస్తారో చెప్పాలని కేంద్రాన్ని ఏపీ సర్కార్ కోరింది.జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) పాలకమండలి 75వ సమావేశం ఈ నెల 1న కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు అధ్యక్షతన జరిగింది. అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ కార్యదర్శులు పాల్గొన్న ఈ సమావేశంలో గోదావరి–కావేరి అనుసంధానంపై చర్చించారు. ఆ వివరాలను పాలకమండలి విడుదల చేసింది.రాష్ట్రాల సమ్మతి ప్రకారమే.. ఇంద్రావతి సబ్ బేసిన్లో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 148 టీఎంసీల గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్(కృష్ణా), సోమశిల(పెన్నా), అరణియార్ రిజర్వాయర్ల మీదుగా కావేరికి గోదావరి జలాలను తరలించేలా 2022లో ఎన్‌డబ్ల్యూడీఏ డీపీఆర్‌ను రూపొందించింది. అంతర్భాగంగా కర్ణాటకలో బెడ్తి–వరద అనుసంధానం చేపడతామని పేర్కొంది. కావేరికి తరలించే 148 టీఎంసీల గోదావరి జలాలు, బెడ్తి–వరద అనుసంధానంలో తరలించే 18.5 టీఎంసీలు కలిపి మొత్తం 166.5 టీఎంసీల్లో... తెలంగాణకు 43.65, ఆంధ్రప్రదేశ్‌కు 43.86, తమిళనాడుకు 40.93, కర్ణాటకకు 34.40, పుదుచ్చేరికి 2.19 టీఎంసీలు కేటాయిస్తామని తెలిపింది. దీనివల్ల 6,78,797 హెక్టార్లకు సాగునీరు, తాగునీటిని అందించవచ్చని పేర్కొంది.ఈ డీపీఆర్‌పై బేసిన్‌లోని రాష్ట్రాలతో కేంద్రం పలుమార్లు సంప్రదింపులు జరిపింది. తాజా సమావేశంలో ఇంద్రావతి సబ్ బేసిన్లో ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను తాము వాడుకుంటామని.. అదనంగా ఉన్న నీటిని కావేరికి మళ్లిస్తే తమకు అభ్యంతరం లేదని ఛత్తీస్‌గఢ్ పేర్కొంది. ఈ అనుసంధానానికి తెలంగాణ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అనుసంధానం ద్వారా మళ్లించే జలాల్లో 50 శాతం తమకు కేటాయించాలని కోరింది. గోదావరిలో నికర జలాల్లో మిగులు లేదని.. తాత్కాలికంగా ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని నీటినే కావేరికి తరలిస్తామని కేంద్రం చెబుతోంది.హిమాలయ నదుల నుంచి గోదావరికి నీటిని తెచ్చాక.. ఆ నీటిని శాశ్వత ప్రాతిపదికన కావేరికి మళ్లిస్తామని అంటోంది. ఈ నేపథ్యంలో హిమాలయ నదుల నీటిని గోదావరికి ఎప్పుడు తెస్తారో చెప్పాలని ఏపీ కోరింది. లేదంటే తమ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని తెలిపింది. కృష్ణా జలాల్లో తమకు అదనపు వాటా పెంచాలని కర్ణాటక, మహారాష్ట్ర డిమాండ్ చేశాయి. తక్షణమే అనుసంధానం చేపట్టాలని తమిళనాడు, పుదుచ్చేరి కోరగా.. కావేరి జలాల్లో అదనపు వాటా కావాలని కేరళ డిమాండ్ చేసింది. బేసిన్‌లోని రాష్ట్రాల సమ్మతి, ట్రిబ్యునల్ అవార్డుల ప్రకారమే ఈ అనుసంధానం చేపడతామని కేంద్రం స్పష్టం చేసింది. -
‘బదిలీ’ మంత్రం... ‘వర్క్ అడ్జెస్ట్మెంట్’ తంత్రం
సాక్షి, అమరావతి: ‘వడ్డించేవాడు మనోడైతే..’ అన్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్యలో ఉద్యోగుల బదిలీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు, కావాల్సిన వారికి ‘వర్క్ అడ్జెస్ట్మెంట్’ పేరుతో జరిగిపోతున్నాయి. ఈ ఏడాది మే నుంచి ఇప్పటి దాకా నాలుగుసార్లు బదిలీలు చేపట్టగా, ఇప్పుడు ఐదోసారి బదిలీలకు రంగం సిద్ధమైంది. జూన్‌లో జరిగిన సాధారణ బదిలీలు మినహా, మిగిలిన అన్ని బదిలీలకు సర్ప్లస్, వర్క్ అడ్జెస్ట్మెంట్, డిప్యుటేషన్ పేరుతో కావాల్సిన వారిని నచ్చిన చోటుకు పంపేస్తున్నారు.అక్టోబర్ 8న వర్క్ అడ్జెస్ట్మెంట్ పేరుతో బదిలీలు చేసిన ప్రభుత్వం.. తాజాగా మరోసారి ఉద్యోగుల సర్దుబాటుకు సిద్ధమైందంటే పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సర్దుబాటుకు ఏకంగా కౌన్సెలింగ్‌కు సిద్ధపడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఎవరెవరికి పోస్టులు కావాలో వివరాలు సేకరించడం చర్చనీయాంశమైంది. ఈ నెల 25వ తేదీతో మొదటి సెమిస్టర్ కూడా పూర్తయిపోయింది. అయినప్పటికీ మరోసారి వర్క్ అడ్జెస్ట్మెంట్ చేయడం ఏంటని లెక్చరర్లు, ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నట్టని నిలదీస్తున్నారు. అడ్డగోలు బదిలీలు జూన్‌లో వీడియో కాల్స్ ద్వారా ఉత్తుత్తి బదిలీలు చేపట్టి రికార్డు సృష్టించిన సాంకేతిక విద్యాశాఖ... సెప్టెంబర్ లో ‘వర్క్ అడ్జెస్ట్మెంట్’ పేరుతో అడ్డగోలు డిప్యుటేషన్లు చేపట్టింది. ఇందులో ఫోకల్ (పట్టణాలు)లో పనిచేస్తూ మేలో నాన్ ఫోకల్ (గ్రామీణ నేపథ్యం)కు బదిలీ అయినవారిని, గతంలో ఆర్థిక తప్పులు చేసి పనిషిమెంట్ తీసుకున్నవారిని తిరిగి రాష్ట్ర కార్యాలయానికి తీసుకొచ్చారు. అలాగే, జూన్‌లో సాధారణ బదిలీలు చేపట్టినా అన్ని ఖాళీలు చూపకుండా కేవలం డబ్బులిచ్చిన వారికి, నేతల సిరఫారసు ఉన్నవారికే ప్రాధాన్యం ఇచ్చారు.కీలకమైన స్థానాలను దాచిపెట్టి కేవలం వీడియో కాన్ఫరెన్స్‌తో బదిలీలు చేపట్టి దానికి ఆన్లైన్ బదిలీలుగా నామకరణం చేశారు. ఎస్బీటీఈటీ (స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్)లో దీర్ఘకాలంగా పనిచేస్తున్నవారికి కూడా సాధారణ బదిలీల్లో స్థానచలనం కల్పించినట్టు జీవోలతో కలరింగ్ ఇచ్చిన అధికారులు... తర్వాత ఆ ఉత్తర్వులు పట్టించుకోవద్దని కాలేజీలు, కార్యాలయాలకు సమాచారం అందించారు. అయితే, వీరికోసం గత నెలలో మరోసారి వర్క్ అడ్జెస్ట్మెంట్ చేస్తూ ఉన్న స్థానాల్లో కొనసాగేలా బదిలీ ఉత్తర్వులిచ్చారు. ఎస్బీటీఈటీలోనూ అవినీతి మకిలి సాంకేతిక విద్యలో సిబ్బంది కొరత ఉంది. దీంతో అవసరం మేరకు డిప్యుటేషన్‌పై సిబ్బందిని నియమిస్తారు. దీనికి ఓ విధానం కానీ, మార్గదర్శకాలు కానీ పాటించడం లేదు. పైరవీలు చేసేవారికే అవకాశం ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇలా వచ్చిన వారు కార్యాలయాన్ని వదలకుండా కొత్తవారు రాకుండా అడ్డుకుంటున్నట్టు విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే గత నెలలో పలువురు అధికారులు డిప్యుటేషన్లు తెచ్చుకోగా, వారికి అనుకూలంగా ఉండే వారికోసం తాజాగా వర్క్ అడ్జెస్ట్మెంట్ బదిలీలకు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది. ⇒ 2014–17 మధ్య ఎస్బీటీఈటీలో పనిచేసిన ఓ అధికారిపై ఆర్థిక ఆరోపణలు రావడంతో పాలిటెక్నిక్ కాలేజీకి బదిలీ చేశారు. అయితే తనకున్న పలుకుబడితో రాష్ట్ర కార్యాలయానికి వచ్చేందుకు ఆయన ప్రయత్నించినా, గత ప్రభుత్వంలో కుదరలేదు. కూటమి ప్రభుత్వం రాగానే కాకినాడ ఆర్జేడీ కార్యాలయానికి బదిలీ చేయించుకున్నారు. మేలో జరిగిన బదిలీల్లో ఆయన్ను కలిదిండి పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బదిలీ చేసినా చేరకుండా డిప్యుటేషన్ కోసం ప్రయత్నించి చివరికి జాయింట్ సెక్రటరీగా రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ⇒ ఇప్పటి దాకా బోర్డులో సిస్టం అనలిస్ట్‌గా హెడ్ ఆఫ్ సెక్షన్ స్థాయి అధికారికి మాత్రమే అవకాశమిచ్చారు. తాజాగా ఆంధ్రా పాలిటెక్నిక్‌లో పనిచేసే ఓ లెక్చరర్‌ను తెచ్చి ఈ పోస్టులో నియమించారు. విజయవాడలో అత్యధిక సర్విసు చేసిన ఈయన తన పరిచయాలను వాడుకుని మళ్లీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ⇒ ఏళ్ల తరబడి తిరుపతి ఆర్జేడీ కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న ఓ అధికారికి జూన్‌లో బేతంచర్ల పాలిటెక్నిక్ కాలేజీకి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా బదిలీ అయింది. అయితే, ఆయన ఆ పోస్టులో చేరకుండా పైరవీలతో బోర్డులో డిప్యూటీ కార్యదర్శిగా వచ్చారు. ⇒ బోర్డులో పనిచేసిన ఒకరిని పార్వతీపురం మన్యం జిల్లాలోని చినమేరంగి కాలేజీకి హెడ్‌గా ఇటీవల బదిలీ చేశారు. ఆయన కూడా తిరిగి వర్క్ అడ్జెస్ట్మెంట్ పేరుతో డెప్యూటీ కార్యదర్శిగా స్థానం సంపాదించారు. జూన్‌లో జరిగిన బదిలీలు బేఖాతరు సాంకేతిక విద్యలో బదిలీలకు ప్రభుత్వం జూన్ 16న ఉత్తర్వులిచ్చింది. జీవో నం.91 ద్వారా ప్రిన్సిపాల్స్/డిప్యూటీ డైరెక్టర్ల స్థాయి అధికారులను బదిలీ చేసింది. జీవో నంబర్ 92 ద్వారా సెక్షన్ హెడ్ కేడర్ అధికారులను బదిలీ చేసింది. ఇందులోనూ ప్రభుత్వంలోని పెద్దల అండదండతో బదిలీ అయినా ఆ పోస్టులోకి వెళ్లకుండా కొంతమంది డైరెక్టరేట్‌లోనే చక్రం తిప్పుతున్నారు. ఈ విషయాన్ని గత నెలలో ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో ఉన్నత స్థాయిలో విచారణ చేపట్టారు. వాస్తవాలు వెలుగులోకి రావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు నటించారు. యధాస్థానాల్లో కొనసాగుతూ బోర్డులో చక్రం తిప్పుతున్నారు. బోర్డులో పాతుకుపోయారు ⇒ 2017 నుంచి బోర్డులో ఏడీగా కొనసాగుతున్న అధికారిని జూన్‌లో జంగారెడ్డిగూడెం బదిలీ చేయగా ఆయన బోర్డును మాత్రం వదల్లేదు. ⇒ 2018 నుంచి బోర్డులో పనిచేస్తున్న మరో అధికారిని గుంతకల్లు బదిలీ చేశారు. ఆయన కూడా అంతే. మరో అధికారిని ఇటీవల రాయదుర్గం బదిలీ చేసినా, ఆయన తీరూ ఇలానే ఉంది. ఇక డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న మరో అధికారిని హిందూపూర్ బదిలీ చేసినా, బోర్డును పట్టుకునే వేలాడుతున్నారు. ⇒ 2016 నుంచి బోర్డులో కొనసాగుతున్న ఓ అధికారిపై అవినీతి ఆరోపణలు రావడంతో గత కమిషనర్ చర్యలు తీసుకున్నారు. అనంతరం ప్రభుత్వం మారగానే తాను కీలక మంత్రికి బంధువునంటూ మళ్లీ బోర్డులోకి వచ్చేశారు. ఈయన్ను ఎటపాక బదిలీ చేసినా జీవోను సైతం రద్దు చేయించుకుని డైరెక్టర్ పేషీలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ అన్నీ చక్కబెడుతున్నట్టు ఆరోపణలున్నాయి. -
మరో సోషల్ మీడియా యాక్టివిస్టు అక్రమ అరెస్టు..
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. జగ్గయ్యపేట మండలం మల్కాపురం గ్రామానికి చెందిన అంబోజి వినయ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నందుకు వినయ్‌పై కూటమి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పోలీసులు అంబోజి వినయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.వినయ్‌పై డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు.డిప్యూటీ స్పీకర్ ఫిర్యాదుతో హైదరాబాద్‌లో ఉన్న వినయ్‌ను ఆదివారం తెల్లవారుజామున ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.వినయ్ అక్రమ అరెస్టును ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ , జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఖండించారు. వినయ్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
ఏపీకి‘మోంథా’ముప్పు.. పార్టీ క్యాడర్‌ను అప్రమత్తం చేసిన వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రానికి మోంథా తుపాను ముప్పు ముంచుకొస్తుంది. మోంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ క్యాడర్‌ను అప్రమత్తం చేశారు.మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 28న తలపెట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసన ర్యాలీలు వాయిదా వేశారు. నవంబర్ 4 న ర్యాలీలను నిర్వహించాలని పేర్కొన్నారు. -
‘హైదరాబాద్‌లో టీడీపీ ఎంపీ చిన్ని పాపాలన్నీ రోడ్డెక్కేశాయ్’
సాక్షి,అమరావతి: హైదరాబాద్‌లో టీడీపీ ఎంపీ చిన్ని పాపాలన్నీ రోడ్డెక్కేశాయని మాజీ మంత్రి పేర్నినాని ఎద్దేవా చేశారు. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్,ఎంపీ కేశినేని చిన్ని వివాదంపై పేర్నినాని స్పందించారు.ఈ సందర్భంగా కేశినేని చిన్నికి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ను టీవీలో తప్ప నేనెప్పుడూ చూడలేదు.కేసినేని చిన్ని మునిగిపోతున్న నావ మాదిరి కనిపిస్తున్నాడు. జగ్గయ్యపేట,నందిగామలో ఇసుకను కూడా లాగేసుకున్నారు. దేవాదాయ భూముల్లో ఎగ్జిబిషన్ పెట్టి పీకల్లోతు మునిగిపోయాడు. హైదరాబాద్‌లో చిన్ని పాపాలన్నీ రోడ్డెక్కేశాయి’అని వ్యాఖ్యానించారు. -
డిజైన్ లోపంతోనే మరణ మృదంగం
సాక్షి, అమరావతి : స్లీపర్ బస్సుల డిజైన్ లోపమే ప్రయాణికుల పాలిట మరణమృదంగం మోగిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలకు, ప్రధానంగా రాత్రి వేళల్లో ప్రయాణానికి స్లీపర్ బస్సుల డిజైన్ ఎంతమాత్రం అనుకూలం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బస్ ఆపరేటర్లు లాభాపేక్షతో ఏఐఎస్ ప్రమాణాలను బేఖాతరు చేస్తుండటం సామాన్య ప్రయాణికుల పాలిట యమపాశంగా మారుతోంది. కర్నూలు జిల్లాలో 19మంది సజీవ దహనమైన కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం మరోసారి స్లీపర్ బస్సుల్లో భద్రతా లోపాలను వెలుగులోకి తెచ్చింది. కాగా చైనా, జర్మనీతోపాటు పలు యూరోపియన్ దేశాలు స్లీపర్ బస్సులను నిషేధించిన విషయాన్ని నిపుణులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ట్యాంకు, బ్యాటరీ పక్క పక్కనే.. ఫ్యూయల్ ట్యాంకు, బ్యాటరీ కాంపోనెంట్ పక్కపక్కనే ఉండటం స్లీపర్ బస్సుల డిజైన్‌లో ప్రధానలోపం. దాంతో ఏదైనా ప్రమాదం సంభవిస్తే తక్షణం మంటలు చెలరేగి బస్సు కేవలం కొన్ని నిముషాల్లోనే దగ్ధమైపోతోంది. 2023లో తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా పాలెంలో బస్సుప్రమాదం తీవ్రత పెరగడానికి అదే కారణమని దర్యాప్తులో వెల్లడైంది. కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున సంభవించిన ప్రమాద తీవ్రతకు కూడా అదే కారణమై ఉంటుందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. సీజీ లోపం.. బోల్తా కొడుతున్న బస్సులు స్లీపర్ బస్సుల్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ(సీజీ) సక్రమంగా లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బరువైన ఇంజిన్, చాసిస్ అట్టడుగున ఉండటంతో సీజీ తక్కువగా ఉంటోంది. అప్పర్ బెర్త్‌లపైకి ప్రయాణికులు చేరుకోగానే సీజీ పెరిగి బస్సు స్థిరత్వం తగ్గుతుంది. ఇక నిర్దేశిత ప్రమాణాల కంటే స్లీపర్ బస్సులు ఎత్తు ఎక్కువగా ఉంటున్నాయి. దాంతో కూడా సీజీ తగ్గుతోంది. బస్సు ఇరుకైన మలుపుల్లో తిరుగుతున్నప్పుడు, రోడ్డుపై ఏదైనా హఠాత్తుగా అడ్డం వస్తే బ్రేక్ వేయగానే బస్సు వెంటనే అదుపు తప్పి బోల్తా పడుతోంది. తప్పించుకునేందుకు ఐదు నిమిషాలే సమయం.. స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే తప్పించుకునేందుకు గరిష్టంగా ఐదారు నిమిషాలే సమయం ఉంటుంది. ఆ అయిదు నిమిషాల్లో బస్సులో ఉండే 35 నుంచి 50 మంది ప్రయాణికులు తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. బస్సుకు అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే తలుపులు లాక్ అయిపోతాయి. ప్రయాణికులు అందరూ వెనుక వైపు నుంచే బయటకు రావాల్సి ఉంటుంది. అయిదు నిముషాల్లో ప్రయాణికులు అందరూ బయటపడటం కష్టసాధ్యం. ఇరుకైన మార్గం స్లీపర్ బస్సుల్లో ప్రయాణికులు అటూ ఇటూ వెళ్లేందుకు రెండు వైపులా ఉండే బెర్త్‌ల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. ఓ వైపు రెండు బెర్త్‌లు మరో వైపు ఒక బెర్త్‌తో సీట్లు ఉంటాయి. సాధాణంగా ఒక స్లీపర్ బస్సులో 33 నుంచి 36 బెర్త్‌లు ఉంటాయి. మల్టీ యాక్సెల్ బస్సుల్లో 36 నుంచి 40 బెర్త్‌ల వరకు ఏర్పాటు చేస్తారు. ఆ బెర్త్‌ల మధ్య ఒక వ్యక్తి మాత్రమే అదీ నెమ్మదిగా నడిచేందుకు అవకాశం ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లోనే ఒకేసారి ఇద్దరు మనుషులు నడిచేందుకు అవకాశం ఉండదు. అటువంటిది ఏదైనా ప్రమాదం సంభవిస్తే ప్రయాణికుల కంగారు, ఆందోళనతో ఒకేసారి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించి ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాటకు దారితీస్తుంది. దాంతో మృతుల సంఖ్య పెరుగుతుంది. డ్రైవర్లకు మగత... స్లీపర్ బస్సులు ఉదయం వేళల్లో ప్రయాణానికి డిజైన్ చేసినవి. రాత్రి వేళల్లో ప్రయాణానికి ఉద్దేశించినవి కావు. రాత్రి వేళల్లో స్లీపర్ బస్సులు ప్రయాణిస్తున్నప్పుడు స్లీపర్బస్సుల్లో వాతావరణం చాలా నిశ్శబ్ధంగా ఉంటుంది. దీనికి తోడు చుట్టూ చీకటి, బస్సు అత్యంత వేగంతో దూసుకుపోతుండటంతో డ్రైవర్లను మగత కమ్మేస్తుంది. ముఖ్యంగా రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు తమకు కొంత మగత కమ్ముతుందని 2018లో కేంద్ర రవాణాశాఖ నిర్వహించిన సర్వేలో కొందరు డ్రైవర్లు చెప్పడం గమనార్హం. చైనా, జర్మనీలలో నిషేధం డిజైన్ లోపం కారణంగా స్లీపర్ బస్సులను పలు దేశాలు ఇప్పటికే నిషేధించాయి. చైనా 13 ఏళ్ల క్రితమే స్లీపర్ బస్సును నిషేధించడం గమనార్హం. 2009 నుంచి 2012 మధ్య చైనాలో స్లీపర్ బస్సుల ప్రమాదాల్లో ఏకంగా 252 మంది మరణించారు. అన్ని ప్రమాదాలూ తెల్లవారు జామున 2 గంటల నుంచి ఉదయం 5గంటల మధ్యే సంభవించాయి. స్లీపర్ బస్సులపై అధ్యయనంలో నిపుణులు వాటి డిజైన్ లోనే లోపం ఉందని గుర్తించారు. ఆ వెంటనే చైనా ప్రభుత్వం స్లీపర్ బస్సుల రిజి్రస్టేషన్‌ను నిలిపివేసింది. జర్మనీ 2006లోనే స్లీపర్ బస్సులను నిషేధించింది. జర్మనీతోపాటు పలు యూరోపియన్ దేశాలు స్లీపర్ బస్సులను నిషేధించాయి. ఇష్టానుసారం మార్పులు» బస్ ఆపరేటర్ల లాభాపేక్ష కూడా ప్రమాదాలలను మరింత పెంచుతోంది. స్లీపర్ బస్సుల భద్రతా ప్రమాణాల కోసం ‘ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్–119 (ఏఐఎస్ 119) ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. కానీ బస్ ఆపరేటర్లు ఆ ప్రమాణాలకు విరుద్ధంగా బస్సుల బాడీ బిల్డింగ్ చేస్తున్నారు. » ప్రమాదం సంభవిస్తే ప్రయాణికులు వెంటనే తప్పించుకునేందుకు స్లీపర్ బస్సుల్లో కనీసం 4 అత్యవసర ద్వారాలు (ఎమర్జెన్సీ విండో) ఉండాలి. అందులో రెండు పైకప్పు నుంచి బయటకు వచ్చేందుకు వీలుగా ఉండాలి. కానీ బస్ ఆపరేటర్లు స్లీపర్ బస్సుల్లో ఒకట్రెండు ఎమర్జెన్సీ విండోలే ఏర్పాటు చేస్తున్నారు. పైకప్పు నుంచి బయటకు వచ్చేందుకు ఒక్క ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఏర్పాటు చేయడం లేదు. » బస్సులో కింది బెర్త్ కనీసం 350 ఎంఎం ఎత్తులో ఉండాలి. కానీ 150 ఎంఎం నుంచి 200 ఎంఎం ఎత్తులోనే కింది బెర్త్‌ను ఏర్పాటు చేస్తున్నారు. » బస్సులో మండే స్వభావం అతి తక్కువగా ఉండే మెటీరియల్ మాత్రమే వాడాలి. ఈ నిబంధనను బస్సు ఆపరేటర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బెర్త్ కవర్లు నుంచి కర్టెన్లు, ఇతర వస్తువులన్నీ త్వరగా మండే స్వభావం ఉన్న మెటీరియల్‌తోనే తయారు చేస్తున్నారు. దాంతో అగ్ని ప్రమాదం సంభవిస్తే అగ్ని కీలలు వేగంగా బస్సంతా వ్యాపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైన బస్సులో ఇనుప ఉచలు మినహా పూర్తిగా దగ్ధం కావడమే అందుకు ఉదాహరణ. » ప్రమాదం సంభవిస్తే కిటికీ అద్దాలు పగులగొట్టేందుకు ప్రతి సీటు వద్దా ప్రమాణిక సుత్తి ఉండాలి. కానీ బస్ ఆపరేటర్లు వాటిని ఏర్పాటు చేయడం లేదు. ఇటీవల జరిగిన కొన్ని స్లీపర్ బస్సుల ప్రమాదాలు..» 2022 అక్టోబరులో మహారాష్ట్రలో వరత్నాయి నుంచి ముంబాయి వెళుతున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. » 2023, జులై 1న మహారాష్ట్రలో ఓ స్లీపర్ బస్సు హైవే డివైడర్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో 25 మంది మృత్యువాత పడ్డారు.» 2023లో రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న బస్సు గురుగ్రాం వద్ద ప్రమాదానికి గురై 25 మంది మృతి చెందారు. » 2023లో తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన స్లీపర్ బస్సు ప్రమాదంలో 45 మంది దుర్మరణం చెందారు. -
ముంచుకొస్తున్న సూపర్ సైక్లోన్
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/డోన్/తిరుపతి తుడా: ‘మోంథా’ సూపర్ సైక్లోన్ రాష్ట్రం వైపు వస్తోంది. శనివారం రాత్రి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతూ పోర్ట్‌బ్లెయిర్‌కి 510 కి.మీ., విశాఖకు 920, చెన్నైకి 890, కాకినాడకు 920, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి 1,000 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని.. సోమవారం ఉదయానికి తుపానుగా బలపడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అనంతరం వాయువ్య దిశగా, ఆ తర్వాత ఉత్తర–వాయువ్య దిశగా ప్రయాణించి 28న ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. తుపానుగా మారిన తర్వాత దీనికి ‘మోంథా’ అని పేరు పెట్టనున్నారు. తీవ్ర తుపానుగా మారాక 28న సాయంత్రం నుంచి రాత్రిలోపు కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇది తీరం దాటే సమయంలో గంటకు 90–100 కి.మీ., గరిష్టంగా 110 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో సాధారణం కంటే 1–1.5 మీటర్ల ఎత్తుకు అలలు ఎగసిపడతాయని వెల్లడించారు. ఈ నెల 29 వరకు వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను అప్రమత్తం చేశారు. విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, గంగవరం పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 27 నుంచి అతి భారీ వర్షాలు అల్పపీడనం నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 27నుంచి 30వ తేదీ వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 3 రోజులపాటు కోస్తాలోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. 27న అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉండడంతో ప్రకాశం, బాపట్ల, వైఎస్సార్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్ ఇచ్చింది. నంద్యాల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉదంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. 28న వైఎస్సార్, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్.. నంద్యాల, శ్రీపొట్టి శ్రీరాములు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది. 29న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఏలూరు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలెర్ట్.. పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. కంభంలో 6.8 సెం.మీ. వర్షం ప్రకాశం జిల్లా కంభంలో శనివారం 6.8 సెంటీమీటర్ల అత్యధిక వర్షం కురిసింది. చిత్తూరు జిల్లా పలమనేరులో 5.9, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 5.6, అసనపురంలో 5.2, ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం నాగులవరం, నెల్లూరు జిల్లా విడవలూరులో 5.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లా డోన్ మండలంలో 44.2 మి.మీ. వర్షం కురవడంతో వంకలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఎర్రగుంట్ల వద్ద ఆర్టీసీ బస్సు వంకలో ఆగిపోవడంతో స్థానికులు, ప్రయాణికులు బయటకు నెట్టుకొచ్చారు. ఉమ్మడి తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీగా వర్షం కురిసింది. తిరుపతిలో 2 గంటల పాటు భారీ వర్షం పడటంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. -
అన్నదాతకు ‘మోంథా’ గుబులు
సాక్షి, అమరావతి: అన్నదాతకు మోంథా తుపాను కంటే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగే అపార నష్టం భయం పట్టుకుంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో చేతికొచ్చి న పంట ఎక్కడ తుపాను బారిన పడుతుందోననే ఆందోళన కలవరపెడుతోంది. ముంచుకొస్తున్న మోంథా నుంచి పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే కోతలు ప్రారంభమైన జిల్లాల్లో కనీస మద్దతు ధర లేక, పంటను అమ్ముకునే దారిలేక తీవ్రంగా నష్టపోతున్న రైతులు.. సకాలంలో కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంటే ఈ తిప్పలు ఉండేవి కావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే శాపంగా.. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా వెంటాడింది. అన్నదాతలు తీవ్ర వర్షాభావ, ప్రతికూల వాతావరణ పరిస్థితులకు ఎదురొడ్డి సాగు చేశారు. విత్తనాలు మొదలుకొని ఎరువుల వరకూ ఏదీ సక్రమంగా అందించలేక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసినా.. నానా అవస్థలు పడి పంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. తీరా పంట చేతికొచ్చే దశలో మోంథా రూపంలో విరుచుకుపడుతున్న తుపాను వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో గడిచిన నాలుగైదు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు దాదాపు 1.50 లక్షల ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడినట్టు వ్యవసాయ శాఖ చెబుతోంది. దాదాపు లక్ష ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైంది. అత్యధికంగా కర్నూలు, ప్రకాశం, విజయనగరం, కాకినాడ, పల్నాడు జిల్లాల్లో అపార నష్టం వాటిల్లింది. కానీ క్షేత్ర స్థాయిలో రెండున్నర లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నట్టుగా రైతులు చెబుతున్నారు. ముంచుకొస్తున్న మోంథా తుపాను ప్రభావం వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పత్తి, మొక్కజొన్న రైతు దిగాలు పత్తి రైతు పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఖరీఫ్‌లో వరి తర్వాత కాస్త ఆశాజనకంగా సాగైన పంట పత్తి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11 లక్షల ఎకరాల్లో సాగైతే ఒక్క కర్నూలు జిల్లాల్లోనే 5.55 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇప్పటికే అధిక వర్షాల కారణంగా ఆగస్టు రెండో వారంలో పూత, పింద రాలిపోగా, సెప్టెంబర్ నాలుగో వారంలో వర్షాలకు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారు. కనీస మద్దతు ధర రూ.8,110 కాగా మార్కెట్లో రూ.4వేల నుంచి రూ.6వేల మధ్య కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా ఏటా అక్టోబర్ 1న సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కానీ ఈ ఏడాది నాలుగో వారం వచ్చి నా కూటమి ప్రభుత్వానికి కొనుగోలు కేంద్రాల ఊసేలేదు. దీంతో కొతకొచ్చి న పంటను తేమ శాతంతో కొర్రీలు వేయడంతో అయినకాడికి తెగనమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తాజాగా కురుస్తున్న వర్షాలకు పూతకొచ్చి న పత్తి కాయలు కుళ్లిపోతున్నాయి. అధికారికంగానే 50వేల ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. మోంథా తుపాను కూడా జతకలిస్తే పత్తి రైతుల ఆశలు పూర్తిగా గల్లంతైనట్టే. ఇక పత్తి తర్వాత చెప్పుకోతగ్గ స్థాయిలో మొక్కజొన్న 4 లక్షల ఎకరాల్లో సాగైంది. అధిక వర్షాల వల్ల 40 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి కాస్త 15–20 క్వింటాళ్లకు పరిమితమైంది. మరో వైపు కనీస మద్దతు ధర రూ.2,400 కాగా, ప్రస్తుతం దళారీలు రూ.1,600 నుంచి రూ.1,700 మధ్య కొంటున్నారు. ఫలితంగా ఎకరాకు రూ.17,500 వరకు రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే 12వేల ఎకరాలకు పైగా పంట దెబ్బతింది. ఇదే అదనుతో పంట రంగు మారినట్టుగా, తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో ధర తగ్గించేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మొత్తుకుంటున్నా కూటమి ప్రభుత్వం పట్టనట్టుగా ఉంది. పత్తి, మొక్కజొన్నతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం రైతుపై తుపాను పోటు కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలో ఎక్కువగా సాగయ్యే వరి పంట ప్రస్తుతం కోత దశలో ఉంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో వరి పొట్ట దశలో ఉంది. ఈ సమయంలో మోంథా తుపాను తీరం దాటితే కుంభవృష్టి తప్పదని వాతావరణ శాఖ చెబుతోంది. అదే జరిగితే కృష్ణా, గోదావరి డెల్టాలో వరిపంట దాదాపు తుడుచుకుపెట్టుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు. గతేడాది మద్దతు ధర లేక 75 కేజీల బస్తాకు రూ.300–రూ.500 వరకు నష్టపోయిన కర్షకులు ఈసారి అంతకంటే దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటామన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈపాటికే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. లక్ష్యాలు నిర్దేశించుకున్నారే తప్ప ఒక్క కేంద్రం కూడా ప్రారంభించిన దాఖలాలు లేవు. కనీసం ఆ దిశగా కసరత్తు కూడా చేసే ఆనవాళ్లు కనిపించట్లేదని రైతులు వాపోతున్నారు. -
ప్రభుత్వాస్పత్రులపై పచ్చ గద్దలు
ఎక్కడ పైసా కనపడితే అక్కడే దోచేయాలన్న ధోరణిలో ఉన్నారు అధికార టీడీపీ నేతలు. ఇసుక, మద్యం, సివిల్ కాంట్రాక్టులు.. ఇలాంటి పెద్దవే కాదు.. చివరికి ప్రభుత్వాస్పత్రుల పైనా ఈ పచ్చ గద్దలు వాలిపోయాయి. ఆస్పత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ సహా అన్ని వ్యవస్థలనూ గుప్పిట పట్టి దోచేయడానికి సిద్ధమైపోయారు. చివరికి వారిలో వారే కుమ్ములాటలకు కూడా దిగుతున్నారు. తమ వారికే ఈ పనులు అప్పగించాలంటూ సీఎంకు లేఖలు రాయడం వరకు ఈ వ్యవహారం చేరింది.సాక్షి, అమరావతి : సీఎం గారూ.. కర్నూలు జీజీహెచ్ సెక్యూరిటీ కాంట్రాక్టు ఈగల్ ఎంటర్‌ప్రైజర్స్ దక్కించుకుంది. ఆస్పత్రిలో సెక్యూరిటీ వ్యవహారాల పర్యవేక్షణ (సబ్ కాంట్రాక్ట్)కు టీడీపీకి చెందిన మధుబాబు నాయుడును ఎంపిక చేశాను. కానీ, పక్క నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు వేరే వారిని ప్రతిపాదిస్తున్నారు. ఇది తీవ్ర గందరగోళానికి తావిస్తోంది. నేను సిఫార్సు చేసిన వ్యక్తి పార్టీ కోసం ఎంతగానో కృషి చేశాడు. అతనికి సబ్ కాంట్రాక్ట్ ఇసేŠత్ స్థానిక పార్టీ క్యాడర్‌కు గౌరవం ఇచ్చినట్లు అవుతుంది. – పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్ సీఎం సర్.. సతీష్ గౌడ్, వెంకటేశ్వర గౌడ్ కొన్నేళ్లుగా పారీ్టకి సేవ చేస్తున్నారు. వీరు కర్నూలు జీజీహెచ్ సెక్యూరిటీ సబ్ కాంట్రాక్టు కోసం ప్రధాన కాంట్రాక్టర్‌తో మాట్లాడుకున్నారు. ప్రధాన కాంట్రాక్టర్ కోరిన మొత్తంలో సగం చెల్లించి అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే, అగ్రిమెంట్‌ను ఉల్లంఘించి ప్రధాన కాంట్రాక్టర్ వేరొకరికి సబ్ కాంట్రాక్టు ఇవ్వాలని చూస్తున్నారు. వేరే వాళ్లు ఎంటర్ అవ్వకుండా చూడండి – కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తిక్కారెడ్డి, కెడీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి ... సీఎంకు రాసిన ఈ లేఖలు ప్రభుత్వాస్పత్రిలో సెక్యూరిటీ సబ్ కాంట్రాక్టు కోసం నేతల మధ్య పోరాటానికి అద్దం పడతాయి. నిబంధనలకు విరుద్ధంగా కనపడిన కాడికి దోచేయడంలో ప్రభుత్వ పెద్దల అడుగుజాడల్లోనే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు నడుస్తున్నారు. మందుల సరఫరా, అత్యవసర వైద్య సేవలు, సెక్యూరిటీ శానిటేషన్ కాంట్రాక్ట్‌ల్లో దోపిడీతో పాటు ఏకంగా వైద్య కళాశాలలనే ప్రైవేటుకు కట్టబెట్టేస్తున్న ప్రభుత్వ పెద్దలు ఆరోగ్య శాఖను ఆదాయ వనరుగా మార్చేశారు. వారి అడుగు జాడల్లోనే టీడీపీ ప్రజాప్రతినిధులు కూడా తమ అనుచరులకు కాంట్రాక్టులు ఇప్పించడం ద్వారా ప్రభుత్వాస్పత్రుల్లో దోపిడీకి పోటీపడుతున్నారు.‘మా ఆస్పత్రికి అదనపు పడకలు మంజూరు చేయండి. ఖాళీ పోస్టులను భర్తీ చేయండి. అత్యాధునిక పరికరాలు ఇవ్వండి.’ అంటూ ప్రభుత్వాన్ని కోరాల్సింది పోయి.. మేం చెప్పిన వారికి సబ్ కాంట్రాక్ట్‌లు ఇచ్చేలా చూడండి అంటూ పోటాపోటీగా లేఖలు సంధిస్తున్నారు. సత్యసాయి నుంచి శ్రీకాకుళం జిల్లా వరకూ అన్ని చోట్ల ఇదే పరిస్థితి. 7 శాతం కమీషన్ ముట్టజెప్పేలా..కొద్ది నెలల కిందట ఏపీవీవీపీ, డీఎంఈ ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్ నిర్వహణకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో ఏడు శాతం కమీషన్ ముట్టజెప్పేలా తన సన్నిహితుడి ద్వారా ప్రధాన కాంట్రాక్టర్లతో అమాత్యుడు డీల్ కుదుర్చుకున్నట్టు వైద్య శాఖలో చర్చ జరుగుతోంది. టెండర్ ప్రక్రియలో సైతం జోక్యం చేసుకుని తనతో డీల్ కుదుర్చుకున్న సంస్థలకు అడ్డదారుల్లో కాంట్రాక్టులు కట్టబెట్టేశారు. ఈ కాంట్రాక్టర్ల నుంచి కూటమి ప్రజాప్రతినిధులు తమ అనుచరుల పేరిట సబ్ కాంట్రాక్టులు తీసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం సెక్యూరిటీ, శానిటేషన్ సబ్ కాంట్రాక్టుకు ఇవ్వడానికి వీల్లేదు. ఈ నిబంధనలను తుంగలో తొక్కి మరీ సబ్ కాంట్రాక్టుల తంతు నడుస్తోంది. కర్నూలు జీజీహెచ్‌లో సెక్యూరిటీ సబ్ కాంట్రాక్ట్ వ్యవహారంలో ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన వ్యక్తులు గొడవలు పడి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. ఈ నేపథ్యంలో తాము సిఫార్సు చేసిన వారికే సబ్ కాంట్రాక్టులు ఇప్పించాలంటూ మంత్రి భరత్, ఇతర ప్రజాప్రతినిధులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సీఎంకు లేఖలు రాశారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే తన పరిధిలోని పెద్దాస్పత్రిలో ప్రతి కాంట్రాక్టును తాను సూచించిన వారికి సబ్ కాంట్రాక్టు ఇచ్చేయాలంటూ ఏకంగా రూలింగ్ ఇచ్చేశారు.ఇప్పటికే సెక్యూరిటీ సబ్ కాంట్రాక్ట్‌ను ఆమె చేజిక్కించుకున్నారు. శానిటేషన్ కాంట్రాక్టును ఆమె చెప్పిన వారికి ఇచ్చేందుకు ప్రధాన కాంట్రాక్టర్ అంగీకరించకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. అనంతపురం జీజీహెచ్ శానిటేషన్ సబ్ కాంట్రాక్టు కోసం స్థానిక ప్రజాప్రతినిధి, పక్క నియోజకవర్గంలోని మహిళా ఎమ్మెల్యే కుమారుడు పోటీపడుతున్నారు. ప్రాణాపాయ స్థితిలోఉండే రోగులకు అందించే ఆక్సిజన్ సరఫరాలోనూ కాసుల కోసం టీడీపీ ప్రజాప్రతినిధులు పోటీపడుతున్నారు. ఆక్సిజన్ సరఫరా కాంట్రాక్టర్‌ను బెదిరించి వారు చెప్పిన వారికి ఎక్కడికక్కడ సబ్ కాంట్రాక్టులు ఇప్పించేసుకున్నారు. -
పరకామణి కేసు రాజీ చేసుకోదగ్గదే..
సాక్షి, అమరావతి: టీటీడీ పరకామణిలో జరిగిన రూ.72 వేల విలువైన 900 డాలర్ల చోరీ వ్యవహారంపై నమోదైన కేసు చట్ట ప్రకారం రాజీ చేసుకోదగ్గ కేసు కాబట్టే నిబంధనలకు అనుగుణంగా లోక్ అదాలత్‌లో రాజీ అయిందని అప్పటి పరకామణి అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి (ఏవీఎస్ఓ) వై. సతీష్‌కుమార్ హైకోర్టుకు నివేదించారు. రాజీ వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. దొంగతనం కేసులో తానే ఫిర్యాదుదారుడిని కాబట్టే నిబంధనల ప్రకారం రాజీ జరిగిందన్నారు. సీఆర్పీసీ, ఐపీసీలో రాజీపై ఎలాంటి నిషేధంలేదని ఆయన వివరించారు. రాజీ అన్నది అసాధారణ విషయం ఏమీకాదని తెలిపారు.రాజీ విషయంలో పిటిషనర్ చేసిన ఆరోపణలన్నీ కూడా ఊహాజనితమైనవేనన్నారు. రవికుమార్ అనే ఉద్యోగి దొంగతనం చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని తానే ఫిర్యాదు చేశానని సతీష్‌కుమార్ తెలిపారు. రూ.72వేల విలువ చేసే డాలర్లు దొంగతనం జరిగితే దీనివెనుక భారీ కుట్ర ఉందన్న పిటిషనర్ ఆరోపణ అర్ధంలేనిదన్నారు. టీటీడీ నిబంధనల ప్రకారం ఫిర్యాదు చేయడానికి, రాజీ చేసుకోవడానికి శాఖాధిపతులకు అధికారం ఉందని తెలిపారు. ఇందుకు టీటీడీ పాలక మండలి అనుమతి అవసరంలేదని తెలిపారు.టీటీడీ చట్టం రాష్ట్రం చేసిన చట్టమని.. సీఆర్పీసీ, ఐపీసీలు కేంద్ర చట్టాలని.. ఈ కేంద్ర చట్టాలే రాజీకి ఆస్కారం కల్పిస్తున్నప్పుడు దానిని తప్పుపట్టాలి్సన పనేలేదన్నారు. రాజీ అన్నది చట్ట విరుద్ధమైన చర్య కాదన్నారు. ఊహాజనిత, నిరాధార ఆరోపణలతో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని సతీష్‌కుమార్ హైకోర్టును కోరారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. పరకామణిలో చోరి వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించాలని కోరుతూ శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు అప్పటి ఏవీఎస్ఓ సతీష్‌కుమార్ కౌంటర్ దాఖలు చేశారు.మా వాదనలు కూడా వినండి..ఈ వ్యాజ్యంలో తమను ప్రతివాదిగా చేర్చుకుని, తమ వాదనలు కూడా వినాలంటూ ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
అవును పనిచేశారు.. అయినా వేతనం ఇవ్వం!
సాక్షి, అమరావతి: ఎక్కడైనా ఉద్యోగులు పనిచేయకపోతే జీతం ఇవ్వరు.. కానీ కూటమి ప్రభుత్వంలో మాత్రం పనిచేసినా వేతనం ఇవ్వరని తేలింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేసిన కాలానికి వేతనం ఇవ్వకుండా కూటమి సర్కారు వేధిస్తోంది. రెండు విద్యాసంవత్సరాలకు సంబంధించి మే నెలలో వారితో పనిచేయించుకున్నా జీతం అడగొద్దంటోంది. ఇప్పటికే తక్కువ వేతనాలతో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్నామని, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ లెక్చరర్లతో సమానంగా పనిచేస్తున్నా ఈ వివక్ష ఏంటని అడిగితే.. ‘నోవర్క్–నోపే’ ఉత్తర్వులున్నాయంటోంది.అయినప్పటికీ 2024 మే నెలకు ఈ సాకు చెప్పిన ప్రభుత్వం.. 2025 మే నెలలోను కాంట్రాక్టు లెక్చరర్లతో పనిచేయించుకుంది. వేతనం అడిగితే మొండిచేయి చూపుతోంది. గత ప్రభుత్వంలో కాంట్రాక్టు లెక్చరర్లు 10 రోజుల విరామంతో 12 నెలల వేతనం అందుకునేవారు. గతేడాది మే నెలలో పనిచేసిన కాలానికి (ఒకరోజు విరామంతో) వేతనం ఇవ్వాలని ఇంటర్ విద్యామండలి నుంచి ఆర్థికశాఖకు ఫైల్ పెట్టారు.దీనిపై ఆ శాఖ ఉన్నతాధికారులు చేసిన పనిపై పూర్తి నివేదిక (వర్క్ అవుట్‌పుట్) ఇవ్వాలని ఆర్థికశాఖ ఆదేశించింది. దీంతో తిరిగి ఇంటర్ బోర్డు అధికారులు నివేదిక సమర్పించారు. 2025 మే నెలలో కూడా కాంట్రాక్టు లెక్చరర్లతో పనిచేయించుకున్న కూటమి ప్రభుత్వం వేతనం ఇవ్వకుండా వేధిస్తోంది. మొత్తం నివేదిక విద్యాశాఖ మంత్రి వద్ద ఉన్నా నిర్ణయం తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.12 నెలలకు వేతనం ఇస్తామని చెప్పి మోసం కాంట్రాక్టు లెక్చరర్లకు 10 రోజుల విరామంతో 12 నెలల కాలానికి వేతనం ఇస్తామని 2019లో నాటి టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి మండలిలో ఆమోదం తెలిపినట్టు అదే ఏడాది మార్చి 5వ తేదీన క్యాబినెట్ తరఫున ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మీడియా ముఖంగా ప్రకటించారు. కానీ మంత్రిమండలిలో ఆమోదించిన అంశంపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదు. వైఎస్ జగన్ సీఎం కాగానే కాంట్రాక్టు లెక్చరర్లకు న్యాయం చేయాలని 2019 నుంచి 2023 వరకు అన్ని సంవత్సరాలు వరుసగా 10 రోజుల విరామంతో 12 నెలల జీతాలు చెల్లించారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టు లెక్చరర్లను వేధిస్తోంది.రెండు నెలలకు ఇవ్వాల్సిన వేతనం రూ.37 కోట్లేప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ లెక్చరర్ల కంటే కాంట్రాక్టు లెక్చరర్లే అధికం. మొత్తం 3,572 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరంతా సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ, పేపర్ల మూల్యాంకనం తదితర విధుల్లో కీలకంగా ఉంటారు. వీరికి ఏటా మే నెలకు రూ.18.50 కోట్లు వేతనంగా ఇవ్వాలి. రెండేళ్లలోను మే నెలకు మొత్తం రూ.37 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా.. దానిపై ప్రభుత్వం కొర్రీలు వేస్తోంది. ఆర్థికశాఖ అడిగిన అన్ని నివేదికలు ఇంటర్ బోర్డు ఇచ్చినా వేధించడం గమనార్హం. వీరికి వేతనం చెల్లిస్తే.. సాంకేతిక, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు కూడా ఇవ్వాల్సి ఉంటుందని, దీంతో ప్రభుత్వంపై ఏటా రూ.150 కోట్ల భారం పడుతుందన్న భావనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి మే నెలలో పనిచేసేది ఒక్క కాంట్రాక్టు లెక్చరర్లు మాత్రమే. -
కర్ణాటక ‘ఎత్తు’పొడుపు.. నోరుమెదపని ఆంధ్ర!
సాక్షి, అమరావతి: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుపై కర్ణాటక సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తోంది. గత నెల 16న ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు కర్ణాటక కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎత్తు పెంపు వల్ల ముంపునకు గురయ్యే 75,563 ఎకరాల భూసేకరణ.. 20 గ్రామాలతోపాటు బాగల్‌కోట మున్సిపాల్టీలో 11 వార్డుల ప్రజలకు పునరావాసం కల్పనకు 6,467 ఎకరాలు.. 5.94 లక్షల హెక్టార్లకు నీళ్లందించడానికి వీలుగా కాలువల తవ్వకానికి 51,837 ఎకరాలు వెరసి 1,33,867 ఎకరాల సేకరణకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి ప్రత్యేక అథారిటీని ఏర్పాటుచేస్తూ ఈనెల 9న కర్ణాటక జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరం మగాణి భూమికి రూ.40 లక్షలు, మెట్ట భూమికి రూ.30 లక్షలు పరిహారంగా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఏటా రూ.18 వేల కోట్ల చొప్పున వ్యయం చేసి నాలుగేళ్లలోగా భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా ఆల్మట్టి డ్యాం గరిష్ఠ నీటి మట్టాన్ని 519.6 మీటర్లు(129.72 టీఎంసీలు) నుంచి 524.256 మీటర్లు(279.72 టీఎంసీల)కు పెంచే ప్రక్రిను పూర్తి చేస్తామని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉన్న 1996–2003 మధ్య ఆల్మట్టి డ్యాం ఎత్తును 509.016 మీటర్ల నుంచి 519.6 మీటర్లకు కర్ణాటక సర్కార్ పెంచేసింది. 2003–04 ముందు వరకూ శ్రీశైలం ప్రాజెక్టుకు జూన్ నాలుగో వారంలోనే ఎగువ నుంచి కృష్ణా వరద వచ్చేది. కానీ.. ఆల్మట్టి ఎత్తును 519.6 మీటర్లకు పెంచడంతో శ్రీశైలానికి వరద జూలై నాలుగో వారం లేదా ఆగస్టు మొదటి వారంలో వస్తోంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు.. ఉదాహరణకు 2015–16లో కృష్ణా నుంచి శ్రీశైలానికి కేవలం 24.97 టీఎంసీలే వచ్చాయి. ఆల్మట్టి డ్యాం ఎత్తును 524.256 మీటర్లకు పెంచితే.. నీటి నిల్వ మరో వంద టీఎంసీలు పెరుగుతుంది. అదనంగా 5.94 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీళ్లందించే వ్యవస్థ కర్ణాటకకు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ఆల్మట్టిలోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా కర్ణాటక సర్కార్ ఆయకట్టుకు తరలిస్తుంది. అప్పుడు శ్రీశైలానికి ఎగువ నుంచి కృష్ణా వరద వచ్చే అవకాశమే ఉండదని సాగునీటిరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌పై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టు ఎడారిగా మారుతుందని స్పష్టం చేస్తున్నారు. అయినా సరే చంద్రబాబు సర్కార్ 1996–2003 తరహాలోనే ఇప్పుడు మొద్దునిద్ర పోతోందని సాగునీటిరంగ నిపుణులు మండిపడుతున్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు వల్ల బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల తమ రాష్ట్రంలో సంగ్లి, కొల్హాపూర్ జిల్లాలు ముంపునకు గురవుతాయని.. దీనిపై సుప్రీం కోర్టులో ఎస్సెల్పీ(స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే స్పష్టం చేసినా సీఎం చంద్రబాబు నోరుమెదపకపోవడంపై నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సృష్టికి ప్రతిసృష్టి
సాక్షి, అమరావతి: వివాహం జరుగుతున్నప్పుడు వ«ధూవరుల తల్లిదండ్రుల్లో ఎవరైనా లేకపోతే.. శుభకార్యానికి వచ్చిన వారంతా ‘ఇలాంటి సమయంలో మీ నాన్న, అమ్మ ఉంటే ఎంత సంతోషించేవారో.. వారులేని లోటు కనిపిస్తోంది’ అంటుంటారు. ఇప్పుడు ఆ లోటును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తీరుస్తోంది. ఎప్పుడో భౌతికంగా దూరమైన వారిని సజీవ చిత్రాలుగా మలిచి కళ్లముందు సాక్షాత్కరింపజేస్తోంది. దీనిని సాంకేతిక యుగంలో ఓ అద్భుతంగా అభివర్ణించవచ్చు. చనిపోయిన వ్యక్తులను బతికున్నవారిలా చూపించే ఏఐ సాంకేతికతను ‘డిజిటల్ పునరుత్థానం’ ‘గ్రీఫ్ టెక్’ అని పిలుస్తున్నారు. ఈ సాంకేతికత చనిపోయినవారి ఫొటోలు, వీడియోలు, ఆడియో రికార్డింగ్ లు, మెసేజ్‌లు వంటి వాటిని ఉపయోగించుకుని వారి రూపాన్ని, స్వరాన్ని, ప్రవర్తనను పునఃసృష్టిస్తోంది. ఇప్పుడు ప్రతి వేడుకలోనూ ఈ విజ్ఞానం భావోద్వేగాలను పంచుతోంది.ఎలా పనిచేస్తుంది?ముందుగా ఏఐ టూల్‌కు చనిపోయిన వ్యక్తికి సంబంధించిన డేటాను ఇస్తారు. ఇందులో టెక్టŠస్ మెసేజ్‌లు, ఈ–మెయిల్లు, ఫొటోలు, వీడియోలు, ఆడియో రికార్డింగ్ లు ఉంటాయి. ఈ డేటాను ఏఐ విశ్లేషించి.. చనిపోయిన వ్యక్తి ముఖం, కదలికలు, హావభావాలు, గొంతుతో ఒక డిజిటల్ అవతార్‌ను సృష్టిస్తుంది. ఈ అవతార్‌తో మనం చాట్‌బాట్ రూపంలో మాట్లాడవచ్చు. కొన్ని ఆధునిక వ్యవస్థలు వీడియో కాల్స్ ద్వారా కూడా సంభాషించే సౌలభ్యాన్ని కల్పిస్తాయి.ఎన్నో యాప్లుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతతో ఇలాంటి వీడియోలను సృష్టించేందుకు అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. స్టోరీఫైల్ వంటి కంపెనీలు చనిపోయినవారు అంత్యక్రియల సమయంలో మాట్లాడేలా ఏఐని వినియోగిస్తున్నాయి. చనిపోయే ముందు రికార్డ్ చేసిన వీడియోలు, వాటికి ఏఐ ప్రశ్నలు, సమాధానాలు జతచేసి బంధువులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేలా చేస్తుంది. మైహెరిటేజ్ అనే సంస్థ ‘డీప్ నాస్టాల్జియా’ అనే ఫీచర్‌తో పాత ఫొటోలను కదిలే వీడియోలుగా (యానిమేటెడ్) మారుస్తోంది. ఈ ఫీచర్ చనిపోయినవారి ఫొటోలను యానిమేట్ కూడా చేస్తుంది. డీప్‌బ్రెయిన్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ‘రీ మెమరీ 2’ అనే సేవ ద్వారా చనిపోయినవారి వాస్తవిక ఏఐ అవతార్లను తయారు చేస్తోంది.భావోద్వేగంతో ఆందోళన చనిపోయినవారిని ఏఐతో పునఃసృష్టించడం వల్ల అనేక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. చనిపోయిన వ్యక్తి సమ్మతి లేకుండా వారి డేటాను ఉపయోగించడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏఐ అవతార్‌తో మాట్లాడినప్పుడు.. కుటుంబ సభ్యులు అది నిజమైన వ్యక్తి కాదని తెలుసుకోలేకపోవడం వల్ల భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ సాంకేతికత దుఃఖాన్ని తగ్గించడానికి బదులుగా, కొంతమందిని చనిపోయినవారితో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. బాధను మరింతగా పెంచుతుంది. ఇది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. అలాగే ఈ సాంకేతికతను దుర్వినియోగం చేసి ప్రజలను మోసం చేసే ప్రమాదం కూడా పొంచి ఉంది. -
గో'లు'మా'లు'!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంపదను అప్పనంగా దోచిపెడుతోంది. ఇప్పటికే విశాఖ, విజయవాడలో అత్యంత ఖరీదైన భూములను లులు గ్రూప్‌నకు అడ్డగోలుగా పంచిపెట్టిన చంద్రబాబు సర్కారు తాజాగా మల్లవల్లి మెగా ఫుడ్‌పార్కును కూడా రాసిచ్చేసింది! 7.48 ఎకరాల్లో విస్తరించిన మెగా ఫుడ్ పార్క్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణ బాధ్యతను లులు గ్రూపు సంస్థ ఫెయిర్ ఎక్స్పోర్ట్ ఇండియాకు కారుచౌకగా అప్పగిస్తోంది. గంటకు ఆరు టన్నుల మామిడి, జామ, టమోటా లాంటి సీజనల్ ఉత్పత్తులను గుజ్జుగా మార్చి ప్యాకింగ్ సామర్థ్యంతో పాటు 4,009 టన్నుల వేర్‌హౌస్, 3,000 టన్నుల కోల్డ్‌స్టోరేజ్ సామర్థ్యం ఇక్కడి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌కు ఉంది. అలాంటి యూనిట్‌ను నెలకు రూ.4.16 లక్షలు చొప్పున ఏడాదికి రూ.50 లక్షల అద్దెకు లులు పరం చేసేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఇదే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణను జియాన్ బేవరేజెస్‌కి నెలకు రూ.16 లక్షలు చొప్పున ఏడాదికి రూ.1.92 కోట్లు అద్దె చెల్లించేలా ఐదేళ్ల కాలానికి 2023లో అప్పగించింది. అంతేకాదు.. ఏటా 10 శాతం చొప్పున అద్దె పెంచుతామని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. రెండేళ్ల తర్వాత కూటమి సర్కారు అదే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌ను అతి తక్కువ రేటుకు అప్పగిస్తుండంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అద్దె కూడా ఏటా కాకుండా ఐదేళ్లకు ఒకసారి మాత్రమే అది కూడా కేవలం 5 శాతమే పెంచుతామనడం వెనుక ఆరి్థక లావాదేవీలున్నట్లు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐసీసీ)లో చర్చ జరుగుతోంది. ఎక్కడైనా సరే అద్దెలు పెరగడం సాధారమణని, కూటమి సర్కారు మాత్రం ఏకంగా నాలుగు రెట్లు తగ్గించేసి ఖజానాకు భారీగా గండి కొట్టిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాబు సర్కారు నజరానాలపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. విశాఖలో దారుణం.. విశాఖలో వాల్తేరు హార్బర్‌పార్కు వద్ద బీచ్ ఎదురుగా ఉన్న అత్యంత ఖరీదైన 13.74 ఎకరాల భూమిని చంద్రబాబు సర్కారు లులు గ్రూప్‌నకు 99 ఏళ్లకు అత్యంత తక్కువ ధరకే లీజుకు ఇచ్చింది. ఏటా కేవలం రూ.7.08 కోట్ల అద్దెపై అప్పగించేందుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అద్దె కూడా పదేళ్లకు ఒకసారి అది కూడా పది శాతం చొప్పున మాత్రమే పెంచడానికి పచ్చ జెండా ఊపింది. విశాఖలో లులు నిర్మించే షాపింగ్ మాల్ 2028 డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. రూ.679.50 కోట్ల విలువైన భూమిని లులుకు అడ్డగోలుగా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాన్ని రద్దు చేసి భూమిని విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ)కు అప్పగించింది. కూటమి సర్కారు అధికారం చేపట్టిన వెంటనే వీఎంఆర్డీఏ నుంచి భూమిని ఏపీఐఐసీకి అప్పగించి.. ఇప్పుడు లులుకు కట్టబెట్టింది. ఆర్టీసీ భూములు హస్తగతం.. విజయవాడ నడి»ొడ్డున పాత బస్టాండుగా వ్యవహరించే గవర్నర్‌పేట డిపోకు చెందిన 4.15 ఎకరాల భూమిని చంద్రబాబు సర్కారు లులు చేతిలో పెట్టింది. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో రూ.600 కోట్లపైనే ఉంటుంది. జీ+3 విధానంలో లులు ఇక్కడ షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనుంది. 99 ఏళ్లు లీజుపై ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఇలా విశాఖ, విజయవాడ, మల్లవల్లిలో కలిపి ఇప్పటి వరకు 25.37 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం లులు చేతిలో పెట్టేసింది. -
YSRCPలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు.. పార్టీ జాతీయ అధికార ప్రతినిధులుగా మాజీ ఎంపీ మార్గాని భరత్ (రాజమండ్రి), యల్లాప్రగడ కార్తీక్ (మండపేట)లను నియమించారు.కాగా, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా నియమించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌కు ఒక ప్రెసిడెంట్‌ను నియమించారు. జోన్–1కి.. విశాఖ జిల్లాకు చెందిన చెన్నా జానకిరామ్ నియమితులయ్యారు. జోన్–2కి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన విప్పర్తి వేణుగోపాల్ నియమితులయ్యారు. జోన్ –3కి ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నట్ట యోనారాజు నియమితులయ్యారు.జోన్-4కి తిరుపతి జిల్లాకు చెందిన నల్లని బాబు నియమితులయ్యారు. జోన్ –5కి వైఎస్సార్ జిల్లాకు చెందిన పులి సునీల్‌కుమార్ నియమితులయ్యారు. అలాగే కాకినాడ జిల్లాకు చెందిన ఎ.లక్ష్మీశివకుమారిని వైఎస్సార్సీపీ రాష్ట్ర అంగన్వాడీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా(జోన్ –2కు)గా, తిరుపతి జిల్లాకు చెందిన ఎస్.రామచంద్రారెడ్డిని రాష్ట్ర ఐటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–4)గా, తిరుపతి జిల్లాకు చెందిన దువ్వూరు మునిశేఖర్‌రెడ్డిని రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–4)గా నియమించారు.పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లుగా విశాఖ జిల్లాకు చెందిన ద్రోణంరాజు శ్రీవత్సవ(జోన్ –1), కాకినాడ జిల్లాకు చెందిన తోట రాంజీ(జోన్–2), ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎ.రవిచంద్ర(జోన్–3), చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి(జోన్–4), అనంతపురం జిల్లాకు చెందిన వై.ప్రణయ్‌రెడ్డి(జోన్–5) నియమితులయ్యారు. ఎనీ్టఆర్ జిల్లాకు చెందిన వి.ఈశ్వర్‌ప్రసాద్‌ను రాష్ట్ర వాణిజ్య విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–3)గా నియమించారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. -
దగా చేయడమేనా చంద్రబాబు విజనరీ?: జూపూడి
సాక్షి, తాడేపల్లి: సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని, రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు బాటలోనే మంత్రులు పయనిస్తున్నారని, ప్రజల గురించి ఆలోచించడం మానేసి తమ జేబులు నింపుకునే కార్యక్రమంలో వారు బిజీగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒకవైపు శాంతిభద్రతలు నిర్వీర్యమయ్యాయి.. మరో వైపు ప్రజారోగ్యం పడకేసింది, ఇంకోవైపు ప్రకృతి వైఫరీత్యాలతో రైతులు కుదేలవుతున్నారని, అయినా కూడా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా అనిపించడం లేదని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..రాష్ట్రంలో ప్రభుత్వం అనేది కుప్పకూలిపోయింది. మోస్ట్ సీనియర్ అంటూ డబ్బాలు కొట్టుకునే చంద్రబాబు అత్యంత దారుణమైన, దుర్మార్గ పాలన సాగిస్తున్నాడు. సమకాలీన రాజకీయాల్లో ఇంతటి దరిద్రమైన పరిపాలనను ప్రజలెవ్వరూ చూసి ఉండరు. ఈ ప్రభుత్వంలో జనానికి జ్వరాలు వస్తే నేనేం చేయాలని ఒక మంత్రి అంటారు, లా అండర్ ఆర్డర్ లేదంటే.. మరొక మంత్రి నేనేమైనా లాఠీ పట్టుకోవాలా? తుపాకీ పట్టుకోవాలా? అని మండిపడతారు. అన్ని సమస్యలూ మా శాఖలోనే వచ్చేశాయి, మేమే చేయలేకపోతున్నామని మరొక మంత్రి అంటాడు.డబ్బుల్లేవు... మేం మెడికల్ కాలేజీలు ఎలా కట్టాలి? అని మరొక మంత్రి మాట్లాడతాడు. మంత్రులే ఇలా మాట్లాడితే ఇక ప్రజల సమస్యలను కింది స్థాయిలో పట్టించుకునే వారు ఎవరూ? ఎవరికైనా బాధ్యత అనేది ఉందా? మంత్రులు ఇలా మాట్లాడుతున్నారంటే.. ఇవి వారి మాటలుగా మనం చూడాల్సిన అవసరంలేదు. ఆయా సందర్భాల్లో ముఖ్యమంత్రి ఇంటర్నెల్‌గా ఏం మాట్లాడుతున్నాడో… ఆ మాటలే వీరి నోటినుంచి కూడా వస్తున్నాయి. ఇలా వ్యవస్థలను చంద్రబాబు పూర్తిగా గాలికి వదిలేశారు.వ్యవస్థలను సర్వ నాశనం చేశారుఒక వైపు పీహెచ్సీ డాక్టర్ల ఆందోళనతో గ్రామస్థాయిలో వైద్య సేవలు కుటుంపడ్డాయి. మరోవైపు ఆరోగ్య శ్రీ బకాయిలతో, నెట్వర్క్ ఆసుపత్రులు వైద్యసేవలు నిలిపివేయడంతో పేదరోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. లక్షల మంది ప్రాణాలతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ఇంకోవైపు ఆస్పత్రుల్లో దూదికి కూడా దిక్కు లేకుండా పోయింది. మరోవైపు విలేజ్ క్లినిక్స్‌ను నిర్వీర్యం చేశారు. ప్రజలకు అత్యంత అవసరమైన ఒక్క ఆరోగ్య రంగంలోనే ప్రస్తుతం ఇన్నిరకాల సమస్యలు ఉన్నాయి. వీటిని సత్వరం పరిష్కరించాల్సిన మంత్రి ఎదురుదాడి చేస్తున్నాడు. హేళనగా మాట్లాడుతున్నాడు. రాజకీయం చేస్తున్నాడు. కాని ప్రజలకు వైద్య సేవలను అందించడంలో మాత్రం శ్రద్ధచూడంలేదు. మరి ఇలాంటి వాళ్లు మంత్రులుగా ఉండడానికి అర్హులా? మంత్రికి పట్టదు, ముఖ్యమంత్రికి పట్టదు. మరి ఎవరికి పడతాయి ఈ సమస్యలు? దీన్ని పరిపాలన అంటామా? దీన్ని ప్రభుత్వం అంటామా? లేక వల్లకాడు అంటామా? పౌరుల ప్రాణాలు రక్షించలేని ఈ ప్రభుత్వాన్ని ఏమంటారు? అలాంటి పనికిమాలిన ప్రభుత్వంగా మార్చిన ముఖ్యమంత్రిని, ఆయన మంత్రులను ఏమంటారు?రాష్ట్రంలో అరాచకాలకు రెడ్‌బుక్ రాజ్యాంగంతో దన్నురెడ్ బుక్ రాజ్యాంగం పేరు చెప్పి… పొలిటికల్ గవర్నెన్స్ పేరు చెప్పి, వీధికో రౌడీని, అరాచకవాదిని తయారు చేశారు. మొన్న తునిలో ఘటన చూసినా.. మరో చోట చూసినా.. దీనికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్సే. ఇందులో ఎవరో ఒకర్ని పట్టుకుని, లేపేసి, ఖబడ్దార్ అంటూ ప్రచారంచేసుకుని, చేతులు దులుపుకుంటున్నారు. మరి మిగతా వారి సంగతి ఏంటి? లా అండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వహించలేని ఈ ప్రభుత్వాన్ని ఏమంటారు? ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా నడుస్తున్న పేకాట శిబిరాలు, సివిల్ పంచాయతీలపై డిప్యూటీ సీఎం నేరుగా డీజీపీకి కంప్లైంట్ చేశాడు. అంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో దీనికి నిదర్శనం.పైగా ఈ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తమ ప్రాంతంలో పేకాట సర్వసాధారణమే అంటూ సమర్థించుకోవడాన్ని ఏమనుకోవాలి? ఈ రాష్ట్రంలో పేకాట క్లబ్బులు, లిక్కర్ షాపుల అభివృద్ధి తప్ప మరేమీ జరగలేదు. నేరుగా మీ ప్రభుత్వంలో ఉన్న ఒక డిప్యూటీ సీఎం పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి, వాటిని అడ్డుకోలేకపోతున్నారని ఏకంగా డీజీపీకి ఫిర్యాదు చేస్తే.. సీఎంగా చంద్రబాబు తల ఎక్కడపెట్టుకోవాలి? ఇదేనా గవర్నెన్స్ అంటే? మీ అక్రమాలపై మీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారుమరోవైపు తిరువూరులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఏకంగా ఎంపీ కేశినేని చిన్ని అక్రమంగా మైనింగ్ చేస్తున్నాడని, ఇసుక ఎత్తుకు పోతున్నారని, డబ్బులు పంచి కౌన్సిలర్లను కొనుగోలు చేశారని ఏకంగా పెద్ద అవినీతి బాగోతం బయటపెట్టారు. తన అసెంబ్లీ సీటు కోసం కోట్ల రూపాయలు ఇచ్చానంటూ సాక్ష్యాలు చూపించాడు. ఇంత బాగోతం బయటపెట్టినా… ప్రభుత్వం ఏమీ జరగనట్టు ఉంది. మరి అంతటి అవినీతి ప్రభుత్వ కొనసాగాల్సిన అవసరం ఉందా? వీళ్లు పరిపాలించడానికి అర్హులేనా?విదేశాల్లో జల్సాలు... ప్రజా సమస్యలు గాలికి..రాష్ట్ర ముఖ్యమంత్రి విమాన మెక్కి దుబాయ్ పోతారు. మరొక షాడో సీఎం నారా లోకష్ విమానమెక్కి సూటు, బూటు వేసుకుని ఆస్ట్రేలియాలో తిరుగుతాడు. ఇంకొకరు డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఎక్కడున్నాడో తెలియదు. ఆయన సినిమాలు ఆయనవి. సీఎం, డిఫ్యాక్టో సీఎంలు వారంలో రెండు రోజులు కనిపించరు. ఇక డిప్యూటీ సీఎం అయితే వారంలో రెండు రోజులుకూడా విజయవాడలో ఉండేది కష్టమే. ఒకవేళ ఉన్నా.. ఉదయం వచ్చి.. మళ్లీ సాయంత్రానికల్లా జంప్. ఇదేనా ప్రభుత్వాన్ని నడిపేతీరు. ఇదేనా పరిపాలన. అసలు ప్రజలంటే మీకు గౌరవం ఉదా? ప్రజాసమస్యల పట్ల ఏ మాత్రం అయినా బాధ్యత ఉందా?భారీ వర్షాలపై వ్యవసాయశాఖను అప్రమత్తం చేసే పరిస్థితే లేదుభారీ వర్షాల వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్ సీజన్ చివరది దశకు వచ్చిన వరి దెబ్బతింది. పత్తిరైతులు నిండా మునిగారు. ఉల్లిరైతులు ఏడుస్తున్నారు. ఇలా ప్రతి చోటా ఇవే ఇబ్బందులు. రబీ సీజన్‌కు విత్తన సరఫరాపై ఇప్పటివరకూ ఉలుకూ పలుకూ లేదు. మరోవైపు ప్రతివారం అల్పపీడనమో, వాయుగుండమో వస్తోంది, ఇంకోవైపు తుపాను రాబోతోంది. ఇలాంటి అత్యంత ముఖ్యమైన అంశాల్లో ప్రభుత్వం ఏంచేస్తోంది? అసలు వ్యవసాయశాఖ మంత్రి పనిచేస్తున్నారా?లంచాల కోసం మధ్యవర్తిత్వం చేయలేదని, తన కింది అధికారులను బదిలీచేయడం మినహా చేసింది ఏముంది? జనాభాలో 60 శాతం మంది ఆధారపడి ఉన్న ఈ రంగం మీద ప్రభుత్వానికి సీరియస్‌నెస్ లేదంటే, అసలు వ్యవసాయం తన బాధ్యత కాదన్నట్టుగా చంద్రబాబు, ఆయన మంత్రులు బిహేవ్ చేస్తుంటే.. ఇక కిందనున్న అధికారులు ఏం పనిచేస్తారు? ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని గట్టెక్కించడానికి మీరేం చేస్తారు?రైతులను నిలువునా దగా చేయడమేనా చంద్రబాబు విజనరీ?చంద్రబాబు తానేదో పెద్ద విజనరీనంటూ, రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తానని చెప్పుకుంటూ గతంలో మేం అమలు చేసిన అన్ని విధానాలన్నింటినీ ఆపేశారు. ఉచిత పంటల బీమా రద్దుచేశారు. ఆర్బీకేలు నిర్వీర్యం చేశారు. సున్నా వడ్డీ పంటరుణాలు నిలిపేశారు. ఆయన కొత్తగా ఏమీ చేయడం లేదు సరికదా… సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా రైతుల గొంతు కోశారు. వందలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.ఇవన్నీ ప్రభుత్వంచేసిన హత్యలే. ఏరోజైనా ఏ రైతు కుటుంబాన్నానైనా పరామర్శించారా? ఒక్క రూపాయి పరిహారం ఇచ్చారా? అసలు మీది ప్రభుత్వమేనా? ఫీజురియింబర్స్‌మెంట్ లేదు, వసతి దీవెన లేదు. ఫీజులు కట్టుకోలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో పిల్లలు అంటు రోగాలతో చనిపోతున్నారు. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లే పిల్లల సంఖ్య 5 లక్షల తగ్గింది. ఇన్న సమస్యలు పెట్టుకుని, ప్రజలకు అండగా ఉండాల్సిందిపోయి, వారిని ఆదుకోవాల్సింది పోయి.. ఇంత దారుణంగా పరిపాలన చేస్తారా?రాష్ట్రంలో ఎనీటైం మద్యంకర్నూలు బస్సు దగ్ధం ఘటనకు కారణమైన బైక్ ను నడిపిన యువకుడు ప్రమాదానికి ముందు ఆ ప్రాంతంలోని బెల్ట్ షాప్‌లో అర్థరాత్రి మద్యం సేవించి, బైక్ నడపడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అర్థరాత్రి వరకు బెల్ట్‌షాప్‌ల్లో మద్యం విక్రయాలు జరుపుతుండటం వల్ల నేడు ఒక భయంకరమైన ప్రమాదానికి కారణమైందనే ప్రశ్నలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తెలుగుదేశం నాయకులే నకిలీ మద్యాన్ని తయారు చేసి, గ్రామ గ్రామానికి బెల్ట్‌షాప్‌లకు సప్లై చేస్తున్నారు. నకిలీ మద్యం గుప్పిట్లో అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఏపీలో ఏ సమయంలో అయినా మద్యం లభించే పరిస్థితిని కల్పించారు. -
క్రెడిట్ చోర్ ఎవరంటే అందరూ చెప్పేది చంద్రబాబు పేరే: తాటిపర్తి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో క్రెడిట్ చోర్ పదం విస్తృతంగా ఉందని.. క్రెడిట్ చోర్ ఎవరంటే అందరూ చెప్పేది చంద్రబాబు పేరేనంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇతరుల క్రెడిట్‌ని తన ఖాతాలో వేసుకోవటం చంద్రబాబుకు అలవాటేనన్నారు. ప్రజల సొమ్ముతో చంద్రబాబు, లోకేష్ విదేశాల్లో విలాసాలు చేస్తున్నారు. 2014-19లో కూడా విదేశాల్లో పర్యటనలు చేశారు. కానీ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదు’’ అని చంద్రశేఖర్ మండిపడ్డారు.‘‘ఎయిర్ బస్, ఆలీబాబా లాంటి సంస్థలు సహా 150 సంస్థలు పెట్టుబడి పెట్టబోతున్నట్టు ఎల్లో మీడియా వార్తలు రాశాయి. మరి ఆ పెట్టుబడులు ఏవీ?. ఒక్క సంస్థ కూడా ఎందుకు రాలేదు?. చంద్రబాబు తన జల్సాల కోసమే విదేశాల్లో విహరిస్తున్నారు. ఏపీలో దోచుకున్నదంతా చంద్రబాబు విదేశాల్లో దాచుకోవటానికే వెళ్తున్నారు. తన ప్రచార పిచ్చికి ఎల్లో మీడియాని వాడుకుంటున్నారు. వైఎస్ జగన్ తీసుకు వచ్చిన డేటా సెంటర్ చంద్రబాబు నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటున్నారు...2020లోనే జగన్ అదానీ డేటా సెంటర్ కు శంకుస్థాపన కూడా చేశారు. ఐటీ పార్కు నిర్మాణం ద్వారా 25 వేల ఉద్యోగాలు ఇచ్చేలా ఒప్పందం కూడా చేశారు. సింగపూర్ నుండి సబ్‌సీ లైన్‌కు అప్పుడే శంకుస్థాపన చేశారు. అంతా అయిన తర్వాత చంద్రబాబు వచ్చి ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు. రూ.87 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్న అదానీ పేరును చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు?. అదానీ పేరు చెబితే జగన్ హయాంలో జరిగిన ఒప్పందాలు, పెట్టబడుల విషయాలు వెలుగులోకి వస్తాయని భయం’’ అంటూ చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసినట్లే.. బాబు సర్కార్‌పై విడదల రజిని ట్వీట్
సాక్షి, తాడేపల్లి: 108, 104ల నిర్వహణ కాంట్రాక్టును టీడీపీ నేతకు కట్టబెట్టటంపై కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడదల రజని మండిపడ్డారు. ఎలాంటి అనుభవం లేని సంస్థకు ప్రజల ప్రాణాలు కాపాడే అంబులెన్స్‌ల బాధ్యత అప్పగిస్తారా? అంటూ ఎక్స్ వేదికగా విడుదల రజిని నిలదీశారు. 108, 104లను కూడా టీడీపీ నేతలు ఆదాయ వనరుగా మార్చుకోవటం దారుణమన్నారు. తమ సంపదను పెంచుకోవటానికి ఆంధ్రుల లైఫ్ లైన్ లాంటి 108, 104లను వాడుకుంటున్నారంటూ విడుదల రజిని దుయ్యబట్టారు.‘‘వైఎస్సార్సీపీ హయాంలో ఆ అంబులెన్సుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాం. కానీ టీడీపీ ప్రభుత్వం వాటిని తమ సంపాదన కోసం వాడుకుంటోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో అనేక కొత్త అంబులెన్సులను తెచ్చాం. సాంకేతికంగా కూడా వాటిని మరింత అభివృద్ధి చేసి 24x7 అందుబాటులో ఉంచాం. ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నో మేళ్లు చేశాం. ఆ అంబులెన్సుల ద్వారా పల్లెలు, పట్టణాల్లోని ప్రజలకు అత్యసవర పరిస్థితుల సమయంలో ప్రాణాలు కాపాడటానికి వీలయింది. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ అంబులెన్సుల కాంట్రాక్టును భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు..ఆ సంస్థ డైరెక్టర్ టీడీపీ నేత డాక్టర్ పవన్ కుమార్ దోనేపూడి. ఆయన గతంలో టీడీపీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడుగా కూడా పని చేశారు. ఆయన సంస్థ టర్నోవర్ కేవలం రూ.5.52 కోట్లు మాత్రమే. అలాంటి ఆర్థిక సామర్థ్యం లేని సంస్థకు 108, 104 నిర్వహణ కాంట్రాక్టును ఎలా కట్టబెడతారు?. ఎంతో అనుభవం ఉన్న GVK, EMRI లాంటి సంస్థలను కాదని టీడీపీ నేత సంస్థకు ఎందుకు కాంట్రాక్టు ఇచ్చారు?. అనుభవం లేని సంస్థకు బాధ్యత అప్పగించటం అంటే ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసినట్లే. ప్రజల ప్రాణాలను గాలిలో పెట్టేలా టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టు కట్టబెట్టటం సరికాదు. ఈ కాంట్రాక్టు ఇవ్వటం ద్వారా తెలుగుదేశం పార్టీ నెలకు రూ. 31 కోట్ల మామూళ్లు తీసుకుంటోంది’’ అంటూ విడుదల రజని ట్వీట్ చేశారు.Andhra's Lifeline is being utilized by the TDP to enrich themselves!The 108 ambulance & 104 medical services were made available to save lives. It is quite unfortunate to learn that, the TDP Government is misusing the facility for generating financial gains for their party.… pic.twitter.com/BLGtQ9Kr48— Rajini Vidadala (@VidadalaRajini) October 25, 2025 -
ప్రైవేటుపై మోజు..క్యాన్సర్ ఆస్పత్రికి బూజు
కూటమి ప్రభుత్వం.. కార్పొరేట్‌కు సలాం.. బడా కంపెనీల అడుగులకు మడుగులు.. ప్రైవేట్‌తో ఒప్పందం..సర్కారు వైద్యానికి మంగళం.. ఫలితం పేద రోగుల ప్రాణాలు అర్పణం. ఇదీ నేటి సర్కారు స్థితి. తిరుపతిలోని ఉచిత క్యాన్సర్ ఆస్పత్రి నిర్వీర్యమే ఇందుకు నిదర్శనం. ‘క్యాన్సర్ చికిత్స కోసం రాష్ట్రానికి చెందిన వారు వేరే ప్రాంతానికి వెళ్లకూడదు. పేదలు, అట్టడుగు వర్గాల వారి కోసం ప్రపంచస్థాయి వైద్య సౌకర్యాలతో ఆస్పత్రి కా వాన్న ఆశయంతో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తన హాయాంలో నిర్మా ణం చేపట్టిన క్యాన్సర్ ఆస్పత్రి స్థాయి తగ్గించడంతోపాటు నిధులు విడుదల చే యకుండా దుబాయ్ కంపెనీతో టీటీపీ ప్ర భుత్వం ఒప్పందం చేసుకోవడంతో క్యాన్సర్ రోగులు ఆందోళన చెందుతున్నారు. సాక్షి టాస్క్‌ఫోర్స్: ప్రైవేటు మోజులో కూటమి సర్కారు.. ఉచిత క్యాన్సర్ ఆస్పత్రిని నిర్యీర్యం చేస్తోంది. ఉచితంగా క్యాన్సర్ వైద్యసేవలు అందించే తిరుపతి శ్రీబాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీని ప్రాణం తీసి.. దుబాయ్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రైవేటు క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మించేందుకు కూటమి కుట్రలు చేస్తోంది. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు దుబాయ్‌లో బుర్జిల్ హెల్త్‌కేర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. ఆ విషయం కూటమి గెజిట్ పత్రిక ద్వారా వెళ్లడించింది. వివరాల్లో కెళితే.. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుపతి శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఆస్పత్రి క్యాన్సర్ రోగుల పాలిట వరంలా మారింది. ‘క్యాన్సర్ చికిత్స కోసం రాష్ట్రానికి చెందిన వారు వేరే ప్రాంతానికి వెళ్లకూడదు. పేదలు, అట్టడుగు వర్గాల వారి కోసం ప్రపంచస్థాయి వైద్య సౌకర్యాలతో ఆస్పత్రి కావాలి’’.. వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రస్థాయి అధికారుల సమావేశంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు ఇవి. ఆయన ఆదేశాల మేరకు శ్రీవేంకటేశ్వర స్వామివారి పాదాల చెంత తిరుపతిలో స్విమ్స్ యూనివర్సిటీకి అనుబంధంగా 400 పడకలతో శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఆస్పత్రికి శ్రీకారం చుట్టారు. నాటి సీఎం ఆదేశాల మేరకు 2022లో స్విమ్స్ గవర్నింగ్ బాడీ తీర్మానం చేసి టీటీడీకి పంపింది. 2023 ఫిబ్రవరిలో టీటీడీ అంగీకారం తెలిపింది. అదే ఏడాది ఏప్రిల్‌లో టీటీడీ సుమారు రూ.130 కోట్లు బడ్జెట్ కేటాయించింది. మరో రూ.100 కోట్ల స్విమ్స్ నిధులతో కలిపి అదే ఏడాది సెప్టెంబర్ 20న పనులు ప్రారంభించింది. 2024 అక్టోబర్‌లో క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించేందుకు నిర్మాణ పనులు వేగంగా చేపట్టారు. కొన్ని అనివార్య కారణాలతో నిర్మాణం పూర్తి కాలేదు.కూటమి రాకతో క్యాన్సర్ ఆస్పత్రికి గ్రహణం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో క్యాన్సర్ ఆస్పత్రికి గ్రహణం పట్టింది. అనుకున్నట్టు క్యాన్సర్ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తే ఎక్కడ వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేరు వస్తుందోనని శ్రీ బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఆస్పత్రిని నిర్యీర్యం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆస్పత్రి గుర్తింపు చెరిపేసేలా నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఫలితంగా క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులు మందగించాయి. చెల్లించాల్సిన బిల్లులు బ్రేక్ పడింది. ఏడాది అవుతున్నా బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. 400 పడకలను వేర్వేరు విభాగాలకు కేటాయించారు. ప్రస్తుతం కేవలం వంద పడకలకే క్యాన్సర్ ఆస్పత్రి పరిమితమైందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పెండింగ్ బిల్లుల మంజూరుకు టీటీడీ ఆమోదం తెలిపినా.. ప్రస్తుతం క్యాన్సర్ ఆస్పత్రి జనరల్ ఆస్పత్రిలా దర్శనమిస్తోంది. ఏటా 70 నుంచి 80 వేల మంది క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఆంకాలజీ సెంటర్ నేడు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాడైన పరికరాలు, అందుబాటులోని భాగాలు, సాంకేతికలోపంతో క్యాన్సర్ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.చెట్ల కింద.. పుట్ల చాటున క్యాన్సర్ రోగులునిరుపేదలకు సైతం కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా వైద్యసేవలందించాలనే లక్ష్యంతో నాడు వైఎస్ జగన్ ప్రారంభించిన క్యాన్సర్ ఆస్పత్రి పరిస్థితి దయనీయంగా మారింది. ఆస్పత్రికి వచ్చే క్యా న్సర్ రోగులకు బెడ్లు దొరక్కపోవడంతో చెట్ల కింద ప్రాణాలు అరచేతిలో పెట్టు కుని బిక్కు బిక్కుమంటున్నారు. తిరుపతిలోని క్యాన్సర్ ఆస్పత్రిలో ప్రస్తుత పరిస్థితులను చూసిన రోగులు కొందరు ఇంటి వద్ద బాధపడుతుండగా, మరి కొంద రు ఇతర రాష్ట్రాల్లో ప్రైవేటు ఆస్పత్రుల బాటపడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం క్యాన్సర్ ఆస్పత్రి నిర్వహణపై వైద్యులు కొందరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. క్యాన్సర్ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తే ఏడాదికి 70 వేల నుంచి 80 వేల మంది ప్రాణాలను కాపాడవచ్చని ప్రాధేయపడినట్లు తెలిసింది. ఆస్పత్రి అభివృద్ధి చెందితే మరో 200 మందికిపైగా వైద్యులుగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని కోరినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. పిడుగులాంటి నిర్ణయం తీసుకున్నట్లు పత్రికల్లో ద్వారా తెలుసుకున్న క్యాన్సర్ రోగులు షాక్ గురయ్యారు. ఉచితంగా వైద్య సేవలు అందించే ఆస్పత్రిని నిర్యీర్యం చేసి, ప్రైవేటు ఆస్పత్రిని తీసుకురావాలని నిర్ణయం తీసుకోవడంపై రోగులు, బంధువులు మండిపడుతున్నారు. -
గురువులకు కఠిన పరీక్ష!
సాక్షి, అమరావతి: సర్వీస్‌లో ఉన్నవారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణపై ఉపాధ్యాయుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తమకు టెట్ ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలల్లో టీచర్లుగా పనిచేస్తున్నవారికీ టెట్ తప్పనిసరి అని, పదోన్నతులకు ఈ పరీక్ష విధిగా ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పునిచ్చింది. సర్వీస్‌లో ఉన్నవారు సైతం రెండేళ్ల కాలంలో టెట్ పాస్ కావాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 2011 నుంచి టెట్ అమల్లోకి వచ్చింది. అయితే, దీనికి ముందే సర్వీసులో చేరిన ఉపాధ్యాయులకు, అన్ని మేనేజ్మెంట్ స్కూళ్లలోని వారికి కూడా తమ తీర్పు వర్తిస్తుందని సుప్రీం పేర్కొంది. ఉద్యోగ విరమణకు ఐదేళ్ల కంటే తక్కువ సర్వీసు ఉన్నవారికి మినహాయింపు ఇచ్చింది. దీంతో ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ‘సుప్రీం’ తీరుపై తమ వైఖరి ప్రకటించాయి. రివ్యూ పిటిషన్లు సైతం దాఖలు చేశాయి. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నందున, కేంద్రం దీనిపై చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఏపీలో మాత్రం ఇదేమీ లేకుండా నేరుగా టెట్–2025 (అక్టోబర్) నిర్వహణకు షెడ్యూల్ ఇవ్వడం, ఇన్ సర్వీస్ టీచర్లు సైతం రాయాలని ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర గందరగోళానికి దారి తీస్తోంది. రాష్ట్రంలోని అన్ని మేనేజ్మెంట్ పాఠశాలల్లో సుమారు 2.87 లక్షల మంది, ప్రభుత్వ పాఠశాలల్లో 1.87 లక్షలమంది ఉపాధ్యాయులున్నారు. 2008 వరకు జరిగిన డీఎస్సీలకు టెట్ లేదు. దీనికిముందు విధుల్లో చేరిన లక్షమంది పైగా ఉపాధ్యాయులు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వచ్చే రెండేళ్లలో టెట్ పూర్తి చేయాలి. అయితే, ఐదేళ్లలో ఉద్యోగ విరమణ చేసే ప్రభుత్వ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చినా వీరికి పదోన్నతులకు అర్హత ఉండదు. ఇలా 1986, 1989 డీఎస్సీల ద్వారా ఉద్యోగాల్లో చేరి ఐదేళ్లలో రిటైర్ కానున్నవారు 32 వేల మంది వరకు ఉండగా, మిగిలిన 1.30 లక్షల మంది తప్పనిసరిగా టెట్ రాయాల్సిందే. సుప్రీం తీర్పుపై రివ్యూకు వెళ్లాలని గత రెండు నెలల్లో అనేకసార్లు ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తులు చేశాయి. కానీ, అవేమీ పట్టించుకోకుండా టెట్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష రాయాలని చెప్పడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రివ్యూ పిటిషన్ వేయాలి: ఏపీటీఎఫ్ అమరావతి టెట్ గురించి సుప్రీంకోర్టు తీర్పుపై ఇన్ సర్వీస్ టీచర్ల తరఫున ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. 2011కు ముందు నియామకమైన ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి ఉపశమనం కలిగించేలా ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేయాలన్నారు. ఏ చర్యలు లేకుండా ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్ వర్తింపజేస్తూ మార్గదర్శకాలను విడుదల చేయడాన్ని ఖండించారు. ఎయిడెడ్ టీచర్లకు టెట్ అవసరమా?: టీచర్స్ గిల్డ్ రాష్ట్రంలో ఎయిడెడ్ స్కూళ్లలో పనిచేస్తున్న 3 వేల మంది ఉపాధ్యాయులకు టెట్ నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయం ప్రకటించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ డిమాండ్ చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇచ్చే అన్ని సదుపాయాలు ఎయిడెడ్ వారికీ కల్పించినప్పుడు మాత్రమే ఈ పరీక్ష రాస్తామని గిల్డ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి.చిట్టిబాబు ఎల్కే చిన్నప్ప, ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలా లేదు: వైఎస్సార్‌టీఏ ‘సుప్రీం’ తీర్పు తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలోనూ టెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఎందుకంత తొందర అని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ వి.రెడ్డి శేఖర్ రెడ్డి ఆక్షేపించారు. సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ నిర్వహణపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా నోటిఫికేషన్ విడుదల చేయడం ఏంటని ప్రశ్నించారు. తమను మానసికంగా ఇబ్బంది పెట్టడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని ఆరోపించారు. సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. సర్వీసులో ఉన్నవారికి టెట్ ఏంటి? సర్వీస్‌లో ఉన్న సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేయడంలో అర్థం లేదని ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం విమర్శించింది. ఉపాధ్యాయులు ఉద్యోగంలోకి రావడానికి అవసరమైన విద్యార్హతలు, వృత్తి విద్యార్హతలతో పాటు పోటీ పరీక్షల్లో విజయం సాధించారని, వారందరి బోధనా సామర్థ్యాన్ని ప్రభుత్వం అప్పుడే పరీక్షించి, అంగీకరించిందని పేర్కొంది. ఆర్టీఈ–2009 చట్టం కంటే ముందున్నవారికి చట్టాన్ని వర్తింపజేయడంలో అర్థం లేదని సంఘం పేర్కొంది. కేంద్రం ఆలోచన తెలియకుండా పరీక్షా?: పీఎస్టీయూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ నిర్వహణకు సిద్ధమవడం సరికాదని, దీనిపై కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఏంటో సమీక్షించకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వు ఇచ్చిన వెంటనే అమలు చేయడం ఏంటని ఏపీ ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు లెక్కల జమాల్ రెడ్డి ప్రశ్నించారు. చాలా రాష్ట్రాలు తీర్పుపై రివ్యూ పిటిషన్లు వేస్తుంటే కూటమి ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం శోచనీయమన్నారు. ఇప్పుడు ఇచి్చన టెట్ నోటిఫికేషన్లో ఇన్ సర్వీస్ వారిని మినహాయించాలని డిమాండ్ చేశారు. ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయించాలి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నిర్వహించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు, ఉపాధ్యాయ సంఘాలు రివ్యూ పిటిషన్లు వేసినా, ఏపీ ప్రభుత్వం, విద్యాశాఖ మాత్రం స్పందించలేదని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. వెంటనే సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. సీఎం జోక్యం చేసుకుని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి పార్లమెంటులో చట్టం చేసి మినహాయింపు తేవాలన్నారు.. ఇవేమీ చేయకుండా టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా పరీక్ష రాయాలని చెప్పడం సరికాదని విమర్శించారు. -
ఇవ్వాల్సింది రూ.1,200 కోట్లు.. ఇస్తున్నది రూ.56 కోట్లు!
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను మరోమారు దగా చేసింది. పెద్ద కంపెనీలపై అపారమైన ప్రేమను కనబరుస్తూ బడుగు, బలహీనవర్గాల యూనిట్లకు శఠగోపం పెట్టింది. పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదలలో అయినవారికి కంచాల్లో పెట్టి.. బడుగు బలహీనవర్గాల వారికి చేతులు విదిల్చిన చందంగా నిధులు కేటాయించింది. రూ.1,500 కోట్ల పారిశ్రామిక రాయితీలు విడుదల చేస్తున్నామంటూ ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేవలం రూ.1,030.95 కోట్లకు మాత్రమే ఉత్తర్వులు జారీచేశారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు చెల్లించాల్సిన సుమారు రూ.1,200 కోట్ల పారిశ్రామిక రాయితీలకు కేవలం రూ.56 కోట్లు మాత్రమే విడుదల చేశారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు రగిలిపోతున్నారు. వాస్తవంగా పరిశ్రమలకు రూ.11 వేలకోట్లకు పైగా ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉండగా అందులో 10 శాతం మాత్రమే.. అది కూడా విశాఖ పెట్టుబడుల సదస్సు ముందు తూతూమంత్రంగా ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే పాత బకాయిలతోపాటు ఏ ఏడాది బకాయిలు ఆఏడాదే చెల్లిస్తామని, ఇందుకోసం ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేస్తున్నామంటూ చెప్పి ఇప్పుడు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలశాఖ మంత్రి టి.జి.భరత్, ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయవాడలో సంయుక్తంగా సమావేశం పెట్టి మే 15 కల్లా రూ.5 వేలకోట్ల రాయితీలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడేమో సీఎం రూ.1,500 కోట్లు అని చెప్పి.. అందులో మళ్లీ రూ.430 కోట్లు కోత పెడితే ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా నమ్మాలంటూ చిన్న, బడుగు పారిశ్రామికవేత్తలు నిలదీస్తున్నారు.నూరుశాతం చెల్లించకపోతే రేపటి నుంచి నిరసన పారిశ్రామిక పాలసీల కోసం మార్గదర్శకాలు అంటూ కొత్త నిబంధనలను తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక రాయితీల్లో కోత విధించడంపై వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విడుదల చేస్తున్న మొత్తం పారిశ్రామిక రాయితీ రూ.1,030.95 కోట్లలో లార్జ్ అండ్ మెగా పరిశ్రమలకు రూ.694.44 కోట్లు, ఎంఎస్ఎంఈలకు కేవలం రూ.275.47 కోట్లు, ఎస్సీ, ఎస్టీలకు రూ.56 కోట్లు కేటాయించారంటే చిన్న పరిశ్రమలు, ఎస్సీ, ఎస్టీల పరిశ్రమలపై ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తోందని మండిపడుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉన్న బకాయిల్లో ఇప్పుడు కేవలం 20 శాతం మాత్రమే చెల్లించడాన్ని వీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు పరిశ్రమలశాఖ డైరెక్టర్ శుభమ్ బన్సాల్‌ను కలిసి రాయితీలను పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. శనివారంలోగా నూరుశాతం రాయితీలను విడుదల చేయకపోతే సోమవారం నుంచి నిరసన కార్యక్రమాలను చేపడతామని ఎస్టీ పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
లక్ష్మీనాయుడు హత్య కేసు నీరుగార్చే కుట్రలు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కాపు సామాజిక వర్గానికి చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య కేసును నీరు గార్చే యత్నాలు జరుగుతున్నాయని కాపు, బలిజ సంఘాల జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. విచారణ లోపభూయిష్టంగా సాగుతోందని, సాక్ష్యాలు సక్రమంగా సేకరించడం లేదని ఆరోపించింది. లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్రకటించిన ఆర్థిక సాయాన్ని పెంచడంతోపాటు జు్యడీషియల్ లేదా సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. శుక్రవారం విజయవాడలోని ఐలాపురం కన్వెన్షన్ హాలులో నిర్వహించిన కాపు, బలిజ సంఘాల ఆత్మీయ సమావేశంలో రాష్ట్రంలో కాపులపై జరుగుతున్న దాడులు, కార్యాచరణపై జేఏసీ నేతలు చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నాయకుడు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన హరిచంద్రప్రసాద్ వల్ల తనకు ప్రాణ హాని ఉందని లక్ష్మీనాయుడు గుడ్లూరు పోలీసులకు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో హరిచంద్ర ప్రసాద్ తన కారుతో తొక్కించి అతి దారుణంగా హత్య చేశాడన్నారు. అక్టోబర్ 2న ఘటన జరిగితే పది రోజుల వరకు ప్రభుత్వం స్పందించలేదన్నారు. కాపు, బలిజ సంఘాల నేతలు అక్కడికి వెళ్లి నిలదీస్తే నామమాత్రంగా కేసు నమోదు చేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే రూ.50 లక్షలు తీసుకుని ఓ మంత్రి ద్వారా కేసును నీరు గార్చే యత్నం చేస్తున్నారని జేఏసీ నేత ఆమంచి స్వాములు ఆరోపించారు. హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నాలు చేశారన్నారు. కాపు, బలిజ సంఘాల ఆందోళన వల్లే లక్ష్మీనాయుడు హత్య వెలుగులోకి వచ్చిందన్నారు. ఎవరి తాత సొమ్ము అని ఆర్థిక సాయం చేస్తున్నారంటూ రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య జరిగితే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, బ్రాహ్మణి ఆయన ఇంటికి వెళ్లి రూ.కోటి ఆర్థిక సహాయం చేసిన విషయం గుర్తు లేదా? అని ప్రశ్నించారు. కుల రాజకీయాలు చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని జేఏసీ నేత దాసరి రాము పేర్కొన్నారు. హత్య జరిగిన పది రోజులకు కూడా ప్రభుత్వం పట్టించుకోనందు వల్లే తాము వెళ్లాల్సి వచ్చిందన్నారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలనే తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. మానవీయ కోణంలోనే పరిహారం పెంచాలని కోరుతున్నట్లు చెప్పారు. వీరయ్య చౌదరి కుటుంబానికి రూ.కోటి ఇస్తే ఆ రోజు మీ నోరు పడిపోయిందా? అని నిలదీశారు. లక్ష్మీనాయుడు కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాపు సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
లక్ష ఇంటర్న్షిప్స్!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణ, అనుభవాన్ని అందించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రత్యేక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్–2026ను ప్రకటించింది. దాదాపు లక్ష మంది విద్యార్థులకు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ఉచిత ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని కల్పిస్తోంది. ఇంజినీరింగ్‌తోపాటు మేనేజ్మెంట్, ఆర్ట్స్, వాణిజ్యం, డిప్లొమా విద్యార్థులకు బోధన కాలంలోనే ఆచరణాత్మక వృత్తినైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఏఐసీటీఈ ప్రవేశపెట్టింది. తద్వారా అభ్యాసం, పరిశ్రమలకు మధ్య అంతరాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ముఖ్యంగా విద్యార్థులను రెడీ టూ వర్క్‌కు సిద్ధం చేస్తోంది.ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో..లక్ష మందికి పైగా ఉచితంగా అందించే ఇంటర్న్‌షిప్‌లను ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలోఏఐసీటీఈ అందిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ–ఎథికల్ హ్యాకింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, స్పేస్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్–డేవ్ ఆప్స్, ప్రభుత్వంలోని నీతి ఆయోగ్, భారత ప్రభుత్వ విధానాలు, ఎంఎస్ఎంఈ కార్యక్రమాలు, మహిళా సాధికారత, స్మార్ట్ విలేజ్, ఏఐసీటీఈ గ్రామీణ ఆవిష్కరణ మిషన్ల కార్యక్రమాలు వంటి ప్రభుత్వ, నూతన సాంకేతిక అంశాల్లో వృత్తిపరమైన నైపుణ్య శిక్షణ కల్పిస్తుంది. తద్వారా విద్యార్థికి భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు బాటలు వేస్తోంది. ఈ ఇంటర్న్‌షిప్‌లో డిప్లొమా, యూజీ, పీజీలలో ఏ విభాగానికి చెందిన విద్యార్థులైనా ఉచితంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ (జీn్ట్ఛటnటజిజీp.్చజీఛ్ట్ఛిజీnఛీజ్చీ.ౌటజ) చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఐబీఎం, సిస్కో, మైక్రోసాఫ్ట్, నాస్కాం, ఇస్రో, డీఆర్డీవో, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్య సంస్థలో భారీ ఇంటర్న్‌షిప్ ప్రాజెక్టును నిర్వహిస్తోంది.ఇంటర్న్‌షిప్ కాలవ్యవధి 4 నుంచి 12 వారాలు కాగా, కొన్ని సంస్థలు రూ.5వేల నుంచి రూ.15వేల వరకు స్టయిఫండ్ ఇస్తాయి. ఇంటర్న్‌షిప్ ముగిసిన తర్వాత ఏఐసీటీఈ పోర్టల్ ద్వారా డిజిటల్ సర్టిఫికెట్ అందిస్తారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ఎంపికల్లో తొలి ప్రాధాన్యం దక్కుతుంది. -
‘మోంథా’ దూసుకొస్తోంది
సాక్షి, అమరావతి/సాక్షి విశాఖపట్నం: బంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది శనివారానికి వాయుగుండంగా మారుతుందని, 26వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. 27వ తేదీ ఉదయానికి నైరుతి, పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో తుపాన్‌గా మారే అవకాశం ఉందంది. ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) సూచనల ప్రకారం ఈ తుపాన్‌కు మోంథాగా నామకరణం చేయనున్నారు. అల్పపీడనం ప్రభావంతో 26 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇది తుపాన్‌గా మారిన అనంతరం 27, 28 తేదీల్లో తీరప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 26 నుంచి మోస్తరు వర్షాలు కోస్తాంధ్ర అంతటా మొదలవుతాయని తెలిపారు. ఇదిలా ఉంటే నవంబర్ మొదటి వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో నవంబర్ 15వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుసూ్తనే ఉంటాయని చెబుతున్నారు. పాకాలలో 15.2 సెంటీమీటర్ల వర్షపాతం ప్రస్తుతం అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అత్యధికంగా 6.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో 5.9, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం బుట్టాయగూడెం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.24 గంటల వ్యవధిలో..గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకూ 24 గంటల వ్యవధిలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాలలో 15.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో 14.4, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరిలో 13, ప్రకాశం జిల్లా సింగరాయకొండలో 12.3, అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 12.2, నెల్లూరు జిల్లా రాపూరు మండలం కండలేరులో 11.6, ప్రకాశం జిల్లా టంగుటూరులో 11.3, వైఎస్సార్ జిల్లా బద్వేలులో 10.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు, కోనసీమ, పశ్చిమగోదావరి, అనంతపురం, వైఎస్సార్, కాకినాడ, చిత్తూరు, తిరుపతి, కృష్ణా, కర్నూలు, అన్నమయ్య, నంద్యాల, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.మోంథా అంటే.. మోంథా అంటే థాయ్ భాషలో సువాసన వెదజల్లే పుష్పం అని అర్థం. ఈ పేరును థాయ్‌లాండ్ సూచించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుపాన్ 28 లేదా 29వ తేదీల్లో కాకినాడ, ఒంగోలు మధ్యలో తీరం దాటే సూచనలున్నాయని.. 26వ తేదీకి స్పష్టత వస్తుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈ తుపాన్ ప్రభావం శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకూ మొత్తం తీర ప్రాంతమంతా ఉంటుందని, ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. -
‘పొట్ట’ కొడుతున్న వానలు
సాక్షి, అమరావతి: వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలు అన్నదాతల పొట్ట కొడుతున్నాయి. పొట్ట దశలో ఉన్న వరికి సంకటంగా మారాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో లక్షలాది ఎకరాలు నీటమునిగాయి. పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, అపరాల పంటలకు అపార నష్టం వాటిల్లింది. ప.గో., గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వరితోపాటు వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లింది. చిత్తూరు జిల్లాలో వరి చేలు పడిపోయాయి. నంద్యాలలో మొక్కజొన్న రైతును దెబ్బతీసింది. భారీ వర్షాల ధాటికి ఇప్పటి వరకు దాదాపు లక్షన్నర ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వాస్తవానికి రెండున్నర లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నట్టు రైతులు చెబుతున్నారు. రైతుల కష్టాలుకుండపోత వర్షాలకు పొట్ట దశకు చేరుకున్న వరి పంట నేలకొరగడంతో రైతులు పడరాని పాట్లు పడుతన్నారు. పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తేమ శాతం అధికంగా ఉండడంతో పాటు గింజలు రంగుమారే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే నూర్పిడి పనులు మొదలు పెట్టిన ప్రాంతాల్లో ధాన్యం రాశులు తడిసిపోతుండడంతో వాటిని కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. అన్ని పంటలకూ నష్టం రబీ సీజన్లో మినుము, జొన్న, వేరుశనగ, మొక్కజొన్నతోపాటు ఆరుతడి పంటలు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో భారీ వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. చాలా చోట్ల మళ్లీ విత్తుకోవల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో వరి, కూరగాయలు, చెరకు, ఆరుతడి పంటలకు అధిక నష్టం వాటిల్లగా, రాయలసీమ జిల్లాల్లో అపరాలు, మొక్కజొన్న పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పత్తి రైతును తేమ ముప్పు వణికిస్తోంది. పత్తి తీసి అమ్మకాలకు సిద్ధపడుతున్న తరుణంలో భారీ వాన రైతుల ఆశలను చిదిమేసింది. వరిపైనే అధిక ప్రభావం వరిపై అధిక వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. గింజల్లో మొలకలు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బీపీటీ 5204, పీఎల్ 1100 వంటి రకాలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఆకు మచ్చ, పాముపొడ, కాటుక తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షాల వల్ల వరి దిగుబడులు 15–25 శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అపరాలకు 10–20 శాతం, కూరగాయలకు 20–30 శాతం,మిరపకు 15–30 శాతం, మొక్కజొన్నలో 10–18 శాతం, చెరకులో 8–15 శాతం మేర దిగుబడులపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. వరిలో...యాజమాన్య పద్ధతులిలా..వరి పొలాల్లో ఉన్న నీటిని వెంటనే బయటకు పంపాలి. చిన్న కమతాలలో పంటను నిలబెట్టవచ్చు. పెద్ద కమతాలలో డ్రెయినేజీ మురుగు నీరు పోయే సదుపాయం చేయాలి.గింజ రంగు మారడాన్ని నివారించడానికి, పాము పొడ ,కాటుక తెగులు వ్యాప్తిని అరికట్టడానికి ఎకరానికి 200 ఎంఎల్ ప్రాపికోనజోల్ పిచికారి చేయాలి » ధాన్యం గట్టిపడే నుంచి కోత దశలో ఉన్న పంట పొలాల్లోని నీటిని లోపలి కాలువల ద్వారా తొలగించాలి. కంకుల గింజలపై మొలకలు కనిపిస్తే (వాలిన లేదా నిలిచిన పంటలో) 5% ఉప్పు ద్రావణం (50 గ్రాముల గళ్ళ ఉప్పు / లీటరు నీరు) పిచికారీ చేయాలి.» ఆలస్యంగా నాటిన పంట (పిలకలు తొడిగే దశ) వర్షపు నీరు పొలాల్లో సాధారణ రకాలలో 7 రోజుల్లో తగ్గితే ఎకరాకు యూరియా 20 కేజీలు + పొటాష్ 20 కేజీలు/ బూస్టర్ డోసుగా వేయాలి.» నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో నర్సరీ దశలో ఉన్న పంట పొలాలకు నీరు తగ్గిపోయిన తర్వాత ప్రతి 5 సెంట్ల నారుమడికి యూరియా 1 కిలో + పొటాష్ 1 కిలో కలిపి బూస్టర్ డోసుగా వేయాలి. నారుమడులు కుళ్లిపోకుండా ఉండేందుకు కార్బెండాజిం 1 గ్రాము లేదా కార్బెండాజిం + మాంకోజెబ్ 2 గ్రాములు/లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయాలి.పత్తి, వేరుశనగలో యాజమాన్య పద్ధతులిలా..ఈ వర్షాలకు ఆకుమచ్చ తెగులు నివారణకు హెక్సా కొనజోల్ 2 మి.లీ లేదా కార్బన్ డిజిమ్ 1 గ్రామ్ లీటరు నీటికి కలిపి15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయ్యాలి » పత్తిలో పూత, గూడ రాలే అవకాశం ఉంది కాబట్టి నివారణకు బోరాక్స్‌ను లీటర్ నీటికి 1.5 గ్రాములు కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.» 2 శాతం యూరియ లేదా నీటిలో కరిగే ఎరువులైన 19–19–19 లేదా 17–17–17 లేదా పొటాషియం నైట్రేట్‌ను పిచికారి చేయాలి.» కాయ దశలో కాయ కుళ్ళు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాములు మరియు 2 గ్రాముల ప్లాంటో మైసిన్ 10లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.సజ్జ పంట: కోత దశలో గింజ మొలక రాకుండా కంకులపై గళ్ళ ఉప్పు 50 గ్రాములను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మెట్ట ప్రాంతాల్లో అయితే... అన్ని పంటలకు ఒకే రీతిలో పొలం నుంచి నీళ్లను పూర్తిగా దిగిపోయిన తర్వాత బూస్టర్ డోస్ గా 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్‌ను మొక్కల మొదట్లో వేయాలి. ఆకుమచ్చ, పొడ తదితర శిలీంద్ర తెగుళ్లకు హెక్సాకొనజోల్ 2 గ్రాములు లీటరు నీటికి లేదా కార్బన్ డిజిమ్ 1 గ్రాము లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. -
మృత్యుశకటం
బస్సు డ్రైవర్ చేసిన తప్పు 19 మంది సజీవ దహనానికి కారణమైంది! నిద్రలో ఉన్న వారిని శాశ్వత నిద్రలోకి పంపింది. కొన్ని కుటుంబాలను చిదిమేసి శాశ్వత చీకట్లు నింపింది. ఘటనా స్థలిని చూసిన వారి కంట నీరు తెప్పించింది. కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్ని కలచి వేసింది. నిమిషాల వ్యవధిలో కొన్ని కుటుంబాలు, కొన్ని కుటుంబాల పెద్ద దిక్కులు, భవిష్యత్ ఆశలు అగ్నికీలలకు ఆహుతయ్యాయి. ప్రయాణికుల ఆర్తనాదాలు,చావు కేకలతో ఎన్హెచ్ృ44 భీతిల్లింది. మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా బొగ్గు, మసిగా మారాయి. ఈ భీతావహ ఘటన స్లీపర్ బస్సు ప్రయాణాలపై మరోమారు పెద్ద చర్చనే లేవనెత్తింది.సాక్షి ప్రతినిధి కర్నూలు/ కర్నూలు (హాస్పిటల్): హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి బెంగళూరుకు బయలు దేరిన వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ (స్కానియా) బస్సు (డీడీ 01ఎన్9490) శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏకంగా 19 మంది సజీవ దహనమయ్యారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఘటన వివరాలు ఇలా ఉన్నాయి... మొత్తం 44 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లతో హైదరాబాద్‌లో బయలుదేరిన బస్సు శుక్రవారం తెల్లవారుజామున 2.14 గంటలకు కర్నూలు సమీపంలోని పుల్లూరు టోల్ ప్లాజా దాటింది. 2.30 గంటలకు టాయిలెట్ కోసం కర్నూలులో ఆపారు. కొంత మంది మాత్రమే బస్సు దిగారు. మిగిలిన వారంతా గాఢనిద్రలో ఉన్నారు. ఆ తర్వాత బయలుదేరిన బస్సు చిన్నటేకూరు దాటగానే 2.45 గంటలకు ఓ బైక్‌ను ఢీకొంది. బైక్‌పై ప్రయాణిస్తున్న శివశంకర్ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. అయితే ప్రమాదం తర్వాత కూడా ఆపకుండా డ్రైవర్ బస్సును ముందుకు నడిపాడు. ఇదే పెను ప్రమాదానికి కారణమైంది. ఆ సమయంలో బస్సు 100 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత ముందుకు వెళ్లిపోతే ప్రమాదం తమపైకి రాదని భావించిన డ్రైవర్ బస్సును వేగంగా నడిపారు. శివశంకర్ రోడ్డు పక్కన పడిపోయాడు. బైక్ మాత్రం బస్సు కింద ఇరుక్కుపోయింది. దీంతో బస్సు బైక్‌ను 300 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఆ రాపిడికి మంటలు రేగాయి. ఈ క్రమంలో బైక్ పెట్రోల్ ట్యాంకు పగిలిపోయి మంటలు చెలరేగాయి. బస్సు ఎడమ వైపు డోర్ల భాగంలో మంటలు కనిపించాయి. అప్పుడు డ్రైవర్ బస్సును ఆపాడు. డ్రైవర్ లక్ష్మయ్యతో పాటు మరో డ్రైవర్ వాటర్ బాటిళ్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈలోపు ముందు భాగంతోపాటు బస్సు మధ్య భాగంలో కూడా మంటలు వ్యాపించాయి. బైక్‌ను ఢీకొట్టడంతో బస్సు డోర్‌లోని సెన్సార్ వైర్లు తెగిపోయాయి. దీంతో డోర్ పూర్తిగా లాక్ అయి తెరుచుకోలేదు. దీంతో డ్రైవర్లు భయపడి ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సులోంచి దూకేశారు. మంటల ధాటికి దట్టమైన పొగ బస్సు మొత్తం కమ్ముకుంది. ఒకరి ముఖం మరొకరికి కన్పించని పరిస్థితి. పొగ, మంటల ధాటికి ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఊపిరాడక ఆర్తనాదాలు పెట్టారు. క్షణాల్లో మంటలు డోర్ కర్టన్లు, బెడ్షీట్లు, బెడ్లకు అంటుకుని అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. కొందరు మాత్రం బస్సు అద్దాలు పగులగొట్టి కిందకు దూకి గాయాలతో బయటపడ్డారు. తక్కిన వారు ప్రమాదం నుంచి తప్పించుకోలేక అగ్నికి ఆహుతయ్యారు. బస్సు మొత్తం నిమిషాల వ్యవధిలో పూర్తిగా దగ్ధమైంది. జాతీయ రహదారిపై వెళుతున్న వాహనదారులు ప్రమాద ఘటనను వీడియో, ఫొటోలు తీసి పోలీసు అధికారులకు పంపారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్‌తో మంటలను అదుపు చేశారు. డ్రైవర్లు సహా 27 మంది ప్రయాణికులు సురక్షితం హైదరాబాద్‌లో బస్సు ఎక్కడానికి 40 మంది టికెట్ బుక్ చేసుకున్నారు. వీరిలో ఒకరు వ్యక్తిగత కారణాలతో ప్రయాణం రద్దు చేసుకోవడంతో బస్సు ఎక్కలేదు. మిగతా 39 మందితోపాటు నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ లెక్కన 43 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆపై హైదరాబాద్ శివారు ప్రాంతం ఆరంఘర్‌లో టికెట్ ముందుగా బుక్ చేసుకోని ఒకరు బస్సు ఎక్కారు. ఇద్దరు డ్రైవర్లతో కలిపి బస్సులో 46 మంది ఉన్నారు. వీరిలో ఒకరు మాత్రమే కర్ణాటకలోని బాగేపల్లిలో బస్సు దిగాల్సి ఉంది. మిగతా వారంతా బెంగళూరుకు వెళ్లాల్సిన వారే. వీరిలో ప్రమాదం తర్వాత 27 మంది ప్రాణాలతో బయట పడ్డారు. ప్రమాద సమయంలో అద్దాలు ధ్వంసం చేసి దూకడంతో పాదాలు, కాళ్లకు గాయాలయ్యాయి. కొంత మందికి తలపై కూడా చిన్నచిన్న గాయాలయ్యాయి. వీరిలో 23 మంది పెద్దవాళ్లు, ఇద్దరు పిల్లలు కాగా.. మరో ఇద్దరు డ్రైవర్లు. తక్కిన 19 మంది చనిపోయారు. మృతుల్లో 17 మంది పెద్దలు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. క్షతగాత్రులను పోలీసులు 108లో కర్నూలు జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఇంకొందరు కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదు కర్నూలు సమీపంలోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై ఉలిందకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రయాణికుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బస్సు యాజమాన్యంపై 125 (ఎ), 106 (1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఉలిందకొండ పీఎస్ ఎస్ఐ ధనుంజయ తెలిపారు. బస్సు డ్రైవర్లు శివనారాయణ, మిరియాల లక్ష్మయ్యను అదుపులోకి తీసుకుని ప్రమాద ఘటనకు దారితీసిన కారణాలపై విచారిస్తున్నారు. పనికి వెళ్లొస్తానని అటే వెళ్లిపోయాడు..అమ్మా డోన్ వద్ద పని ఉందంట. మాట్లాడుకుని మళ్లీ వస్తానని రాత్రి పోయినోడు మళ్లీ రాకుండానే పోయినాడు...అంటూ ఆ తల్లి గంటల తరబడి మార్చురీ వద్ద విలపిస్తున్న దృశ్యం కంటతడి పెట్టిస్తోంది. కర్నూలు జిల్లా కర్నూలు మండలం బి.తాండ్రపాడుకు గ్రామానికి చెందిన నాగన్న కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. ఆయన భార్య యశోదమ్మ ఇద్దరు కుమారులను పెంచి పెద్ద చేసింది. ఇందులో పెద్దవాడైన శ్రీహరి గౌండా పనిచేస్తుండగా చిన్నవాడైన శివశంకర్ గ్రానైట్ పనులకు వెళ్లేవాడు. శివశంకర్ ఎప్పటిలాగే గురువారం రాత్రి కూడా డోన్ వద్ద పని ఉందని మాట్లాడుకుని వస్తానని వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ తల్లికి ఫోన్ చేయలేదు. ఉదయం లేచే సరికి బైక్‌పై వెళుతూ బస్సు కింద పడి శివశంకర్ మృతిచెందాడని పోలీసులు చెప్పడంతో ఆ తల్లి గుండెలవిసేలా విలపించింది. అద్దాలు పగలగొట్టినా బయటకు రాలేని పరిస్థితి స్లీపర్ కోచ్ బస్సులో లోయర్, అప్పర్ బెర్త్‌లు ఉన్నాయి. అప్పర్ బెర్త్‌లో ఉన్నవారు అద్దాలు పగలగొట్టి సులభంగా బయటకు దూకారు. గాయాలతో బయటపడ్డారు. అప్పర్ బెర్త్ అద్దాలు ధ్వంసం చేస్తే బయటకు దూకేయొచ్చు. కానీ లోయర్ బెర్త్‌లో అద్దాలు ధ్వంసం చేసినా, ఐరన్ యాంగ్లర్లు అడ్డుగా ఉన్నాయి. దీంతో మనిషి దూరలేని పరిస్థితి! అప్పర్ బెర్త్ లాగే, లోయర్ బెర్త్‌లు కూడా ఉండి ఉంటే అద్దాలు ధ్వంసం చేసి ఇంకొందరు కిందకు దూకి ప్రాణాలతో బయట పడే అవకాశం ఉండేది. గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు తెల్లవారుజామున 3.30 గంటలకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఇతర పోలీసులు బస్సును పరిశీలించారు. ఇనుప కడ్డీలు మినహా బస్సులో ఏమీ మిగల్లేదు. నల్లటి మసి దిబ్బలు మాత్రమే కన్పించాయి. తెల్లవారిన తర్వాత కలెక్టర్ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్లా, డీఐజీ కోయ ప్రవీణ్‌తో పాటు వైద్యాధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారు. వీరి సమక్షంలో బూడిదను తొలగించి.. నల్లగా బొగ్గులా మారిన మాంసపు ముద్దలను అతి కష్టం మీద వెలికి తీశారు. మొత్తం 19 మృతదేహాలను ప్రత్యేక టెంట్లో ఉంచారు. వాటి నుంచి ఫోరెన్సిక్ అధికారులు డీఎన్ఏ పరీక్షల కోసం శాంపిల్స్ తీసుకున్నారు. మృతదేహాలకు వైద్యులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత మృతదేహాలను కర్నూలు జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. 14 మంది మృతుల కుటుంబ సభ్యుల డీఎన్ఏ శాంపుల్స్ కూడా వైద్యులు సేకరించారు.బస్సు ఆపి ఉంటే ప్రమాదం తప్పేది బస్సు బైక్‌ను ఢీకొట్టిన వెంటనే నిలిపేసి ఉంటే అసలు ప్రమాదమే జరిగేది కాదు. బైక్‌పై ప్రయాణించే శివశంకర్ మాత్రమే చనిపోయేవాడు. అయితే, ప్రమాదం తమపైకి రాకుండా ఉండేందుకు డ్రైవర్ లక్ష్మయ్య బస్సును అదే వేగంతోనే నడిపాడు. దీంతో బైక్ బస్సు కింద ఇరుక్కుపోవడం, 300 మీటర్ల మేర రోడ్డుకు రాపిడికి గురై పెట్రోలు ట్యాంకు పగలడం, మంటలు చెలరేగి బస్సుకు వ్యాపించడంతో పెను ప్రమాదం సంభవించింది. కాగా, బస్సు ప్రమాద ఘటన అధికారులతో పాటు అందరినీ తీవ్రంగా కలచి వేసింది. నేషనల్ హైవేపై అటు, ఇటు వెళ్లే వాహనదారులు బస్సును, అందులో బూడిదైన మృతదేహాలను చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఫోరెన్సిక్ అధికారులు, పోలీసులు మృతదేహాలను వెలికి తీసి మాంసం ముద్దలను పక్కనే టెంట్‌లోకి తీసుకెళుతున్న దృశ్యాలను చూసి ఘటనాస్థలిలోని వ్యక్తులు చలించిపోయారు. పలువురు కన్నీరు పెట్టుకున్నారు. ఓ మహిళ మృతదేహంపై మంగళసూత్రం దండ కనిపించింది. బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డ వారి వివరాలు 1. అశ్విన్‌రెడ్డి, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 2. ఎం.సత్యనారాయణ, ఖమ్మం– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 3. జి.సుబ్రహ్మణ్యం, కాకినాడ– కర్నూలు అశ్విని హాస్పిటల్లో చికిత్స 4. గుణసాయి, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 5. ఆండోజు నవీన్‌కుమార్, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 6. నేలకుర్తి రమేష్, నెల్లూరు– గాయాలు లేకపోవడంతో బంధువుల ఇంట్లో బస 7. శ్రీలక్ష్మి, నెల్లూరు– గాయాలు లేకపోవడంతో బంధువుల ఇంట్లో బస 8. వేణు గుండ, ప్రకాశం జిల్లా– బెంగళూరు వెళ్లిపోయారు 9. శ్రీహర్ష, నెల్లూరు– కర్నూలు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ 10. శివ, బళ్లారి–బెంగళూరు వెళ్లిపోయారు 11. గ్లోరియా ఎల్సాశామ్ కేరళ– బెంగళూరు వెళ్లిపోయారు 12. ఎంజి. రామరెడ్డి, తూర్పుగోదావరి– హైదరాబాద్ వెళ్లిపోయారు 13. జయసూర్య, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 14. ఉమాపతి, హైదరాబాద్–బెంగళూరు వెళ్లిపోయారు 15. పంకజ్, బీదర్– పోలీస్ స్టేషన్లో ఉన్నారు 16. చరిత్, హైదరాబాద్– బెంగళూరు వెళ్లారు 17. హారిక, బెంగళూరు– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 18. కీర్తి, హైదరాబాద్– హైదరాబాద్ వెళ్లారు 19. వేణుగోపాల్‌రెడ్డి, శ్రీసత్యసాయి జిల్లా– హిందుపురం వెళ్లారు 20. ఆకాష్, బీదర్– కర్నూలులో ఉన్నారు 21. మహమ్మద్ ఖైజర్, బెంగళూరు– బెంగళూరు వెళ్లారు 22. జయంత్ కుశ్వల, హైదరాబాద్– కర్నూలులో ఉన్నారు 23. కె.అశోక్, రంగారెడ్డి జిల్లా– కర్నూలు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ 24. జశ్విత, నెల్లూరు– కర్నూలులో బంధువుల ఇంట్లో బస 25. అఖీర, నెల్లూరు– కర్నూలులో బంధువుల ఇంట్లో బస 26. మిర్యాల లక్ష్మయ్య (డ్రైవర్)– పల్నాడు జిల్లా27. శివనారాయణ (డ్రైవర్)– ప్రకాశం జిల్లాకంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంతోపాటు సహాయం కోసం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కర్నూల్ కలెక్టరేట్ 08518277305 కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి 9121101059, 9494609814, 9052951010 ఘటనాస్థలం 9121101061 పోలీసు కంట్రోల్ రూమ్ 9121101075మృతుల వివరాలుపేరు రాష్ట్రం 1. జి.ధాత్రి (27) పూనూరు, బాపట్ల, ఏపీ 2. జి.రమేష్ (31)3. అనూష (28) 4.శశాంక్ (7) 5.మన్విత (4) 6. కె. శ్రీనివాసరెడ్డి (39) రావులపాలెం ,ఆంధ్రప్రదేశ్ 7. చందన (23) తెలంగాణ8.సంధ్యారాణి (43) తెలంగాణ 9. అనూష (22) తెలంగాణ 10. గిరిరావు (48) తెలంగాణ 11.ఆర్గా బండోపాధ్యాయ(32) తెలంగాణ12. మేఘనాథ్ (25) తెలంగాణ13. ఫిలోమన్ బేబీ(64) కర్ణాటక14. కిషోర్‌కుమార్(41) కర్ణాటక15. ప్రశాంత్(32) తమిళనాడు16.యువన్ శంకర్‌రాజ్(22) తమిళనాడు 17. కె.దీపక్‌కుమార్ (24) ఒడిశా 18.అమృత్‌కుమార్ (18) బిహార్ 19.గుర్తు తెలియని వ్యక్తి (50) (ఆరంఘర్ వద్ద బస్ ఎక్కాడు) 20 శివశంకర్ (23, బైక్‌పై వెళ్తున్న వ్యక్తి) బి.తాండ్రపాడు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్రాష్ట్రాల వారీగా మృతుల సంఖ్యఆంధ్రప్రదేశ్ 7 తెలంగాణ 6 కర్ణాటక 2 తమిళనాడు 2 బిహార్ 1 ఒడిశా 1 గుర్తుతెలియని వ్యక్తి 1 -
వైఎస్సార్సీపీలో పలు విభాగాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు. రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌కు ఒక ప్రెసిడెంట్‌ను నియమించారు. జోన్–1కి.. విశాఖ జిల్లాకు చెందిన చెన్నా జానకిరామ్ నియమితులయ్యారు. జోన్–2కి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన విప్పర్తి వేణుగోపాల్ నియమితులయ్యారు. జోన్ –3కి ఎనీ్టఆర్ జిల్లాకు చెందిన నట్ట యోనారాజు నియమితులయ్యారు. జోన్ –4కి తిరుపతి జిల్లాకు చెందిన నల్లని బాబు నియమితులయ్యారు.జోన్ –5కి వైఎస్సార్ జిల్లాకు చెందిన పులి సునీల్‌కుమార్ నియమితులయ్యారు. అలాగే కాకినాడ జిల్లాకు చెందిన ఎ.లక్ష్మీశివకుమారిని వైఎస్సార్సీపీ రాష్ట్ర అంగన్వాడీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా(జోన్ –2కు)గా, తిరుపతి జిల్లాకు చెందిన ఎస్.రామచంద్రారెడ్డిని రాష్ట్ర ఐటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–4)గా, తిరుపతి జిల్లాకు చెందిన దువ్వూరు మునిశేఖర్‌రెడ్డిని రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–4)గా నియమించారు.పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లుగా విశాఖ జిల్లాకు చెందిన ద్రోణంరాజు శ్రీవత్సవ(జోన్ –1), కాకినాడ జిల్లాకు చెందిన తోట రాంజీ(జోన్–2), ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎ.రవిచంద్ర(జోన్–3), చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి(జోన్–4), అనంతపురం జిల్లాకు చెందిన వై.ప్రణయ్‌రెడ్డి(జోన్–5) నియమితులయ్యారు. ఎనీ్టఆర్ జిల్లాకు చెందిన వి.ఈశ్వర్‌ప్రసాద్‌ను రాష్ట్ర వాణిజ్య విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–3)గా నియమించారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. -
నకిలీ మద్యం కేసులో ఐవిఆర్ఎస్ కాల్స్‌పై YSRCP ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం కేసులో ఐవిఆర్ఎస్ (interactive Voice Response System) కాల్స్‌పై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆ పార్టీ నేతలు నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు ప్రస్తావిస్తూ ఐవిఆర్ఎస్ కాల్స్ చేయటంపై ఫిర్యాదు చేశారు.డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినవారిలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారు.మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ‘‘నాపై ఐవిఆర్ఎస్ కాల్స్ చేయిస్తున్న వారిపై విచారణ జరపాలి. ఆ కాల్స్ వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారు కఠిన చర్యలు తీసుకోవాలి. నాకు నకిలీ మద్యంతో సంబంధాన్ని అంటగట్టాలని ప్రయత్నిస్తున్నారు. నార్కో అనాలసిస్ టెస్టుకు కూడా నేను సిద్ధమే. ఫేక్ కాల్స్‌తో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. దమ్ముంటే నన్ను ఎదురుగా ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతేగాని ఐవిఆర్ఎస్ కాల్స్ పేతుతో ఫేక్ కాల్స్ చేయటం ఎందుకు?’’ అంటూ ఆయన మండిపడ్డారు.‘‘ఎక్కడి నుండి చేస్తున్నారో కూడా తెలియకుండా ఫేక్ కాల్స్ చేస్తున్నారు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం తమ చేతిలో ఉందని ఏదైనా చేయొచ్చని అనుకుంటున్నారేమో?. దమ్ము, ధైర్యం ఉంటే ఈ కాల్స్ ఎవరు చేశారో, ఎవరు చేయిస్తున్నారో చెప్పాలి. దీనిపై విచారణ జరపాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాం. చట్టాన్ని, టెలికం వ్యవస్థను వాడుకోవటంపై ఫిర్యాదు చేశాం. చంద్రబాబు, లోకేష్ దీని వెనుక ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలి. నా మీద చంద్రబాబు ప్రభుత్వం బురద వేసింది.నా వ్యక్తి గత ప్రతిష్ట దెబ్బతినేలా నకిలీ మద్యం కేసును అంట గడుతున్నారు. దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా. లైడిటెక్టర్ పరీక్షకు సిద్దమని కూడా చెప్పా. నార్కో అనాలసిస్ టెస్టుకైనా నేను సిద్ధం. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటానికే టీడీపీ నేతకు నామీద, నా పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారు. దేశంలోని ఏ సంస్థతో విచారణ జరిపినా నేను సిద్ధమే’’ అని జోగి రమేష్ స్పష్టం చేశారు.IVRS కాల్స్ ఒక ఆటోమేటెడ్ టెలిఫోన్ సిస్టమ్, ఇది కాల్ చేసిన వ్యక్తికి ముందుగా రికార్డ్ చేసిన సందేశాలను వినిపిస్తూ, వారి ఎంపికల ఆధారంగా సమాచారాన్ని అందిస్తూ సంబంధిత విభాగానికి కాల్‌ను ఫార్వర్డ్ చేస్తుంది. ఇప్పుడు దీనిపైనే జోగి రమేష్ ఫిర్యాదు చేశారు. తనకు నకిలీ మద్యం కేసు అంటగట్టాలని చూస్తున్నారని, అందులో భాగంగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఐవిఆర్ఎస్ కాల్స్ కుట్రకు తెరలేపిందని జోగి రమేష్ ఫిర్యాదు చేశారు. -
డిప్యూటీ స్పీకర్ వర్సెస్ జనసేన!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: భీమవరం డీఎస్పీ జయసూర్య కేంద్రంగా కూటమి పార్టీలో చిచ్చురేగింది. జయసూర్య తీవ్ర అవినీతి పాల్పడ్డారని, పేకాటను ప్రొత్సహిస్తూ ప్రైవేటు సెటిల్మెంట్లు భారీగా చేస్తున్నాడని జనసేన నేతల ఫిర్యాదుల ఆధారంగా ఉప ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్‌గా డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు.. జయసూర్య మంచి ఆఫీసర్ అంటూ కితాబివ్వడం హాట్ టాపిక్‌గా మారింది. పశ్చిమలో పేకాట సహజమని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. మరోవైపు ప్రభుత్వ ఆదేశాలతో డీఎస్పీ జయసూర్యపై విచారణ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ నయీం అస్మీ ప్రకటించారు. ఎవరైనా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, లేదంటే స్వయంగా కలిసి ఫిర్యాదు చేసినా తీసుకుంటామని చెప్పారు. అన్ని అంశాలను విచారించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. ఆధిపత్య పోరేనా!భీమవరం డీఎస్పీ వ్యవహారం రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరుగా మారింది. గతంలో భీమవరం సబ్ డివిజన్లో భీమవరం రూరల్, భీమవరం టూటౌన్ సీఐగా జయ సూర్య సుదీర్ఘ కాలం పని చేశారు. ఈ క్రమంలో పేకాట క్లబ్‌లు, కోడి పందాల నిర్వాహకులు, క్రికెట్ బుకీలు, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ ముఠాలు.. ఇలా అన్నింటిపైన పూర్తి అవగాహనతో పాటు వ్యక్తిగతంగా పరిచయాలున్నాయి. ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ద్వారా డీఎస్పీగా భీమవరం సబ్ డివిజన్‌కు వచ్చిన జయసూర్య తొలుత భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇద్దరితోనూ రెండు పార్టీల కేడర్‌తోనూ సత్సంబంధాలు కొనసాగించారు. తనకున్న వ్యక్తిగత పరిచయాల ద్వారా క్లబ్‌లు మొదలుకొని కోడి పందాల వరకు అన్నింటిలో ప్రత్యక్ష జోక్యం చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో భీమవరం జూదానికి హబ్‌గా మారిందని విస్తృత ప్రచారం జరగడం, పత్రికల్లో వరుస కథనాలు రావడంతో భీమవరంలో పేకాటను కొద్దిగా కట్టడి చేసినట్లు హడావుడి చేసి వ్యవహారం సద్దుమణిగేలా చేశారు. ఇదే సమయంలో భీమవరంలో తగ్గించి ఉండి నియోజకవర్గంలో కోడి పందాలు, పేకాట, క్రికెట్ బెట్టింగులు ఇలా అన్నింటికి డీఎస్పీనే గేట్లు ఎత్తారనే ఆరోపణలున్నాయి. ఈ పరిణామాల క్రమంలో కొద్ది నెలల క్రితం డీఎస్పీపై కూటమిలో ఓ వర్గం ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి, బదిలీ చేయించింది. అయితే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఒత్తిడి తేవడంతో బదిలీ నిలిచిపోయిందని ప్రచారం సాగుతోంది. దీంతో డీఎస్పీ పూర్తిగా రఘురామకృష్ణరాజుకు అనుకూలంగా మారి, ఉండిలో అసాంఘిక కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో సహకరించడంతో పాటు ఏకపక్షంగా వ్యవహరించారనే రోపణలొచ్చాయి.డీఎస్పీపై ప్రభుత్వానికి ఫిర్యాదులు ఇలా..» భీమవరం రూరల్ పరిధిలో ఓ రొయ్యల వ్యాపారికి సంబంధించి రూ.8 కోట్ల డబ్బు పంచాయితీ చేశారని ఆరోపణలున్నాయి. » గతంలో సీఐగా ఉన్నప్పుడు తన వ్యక్తిగత స్నేహితుడిగా ఉన్న పేకాటరాయుడి కోసం భీమవరం–నరసాపురం మార్గంలో పేకాట శిబిరం ఏర్పాటు చేయించి వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. » భీమవరంలో కీలక క్రికెట్ బుకీ నుంచి రూ.లక్షల్లో తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. జనసేన రాష్ట్ర ప్రొటోకాల్ చైర్మన్ మల్లినేని బాబి భీమవరంలో రియల్ ఎస్టేట్, బిల్డర్‌గా ఉన్నాడు. బాబికి సంబంధించి ఓ సెటిల్మెంట్లో భారీగా వసూలు చేశాడని, ఓ విద్యా సంస్థ, ఒక ప్రైవేటు సంస్థ సెటిల్మెంట్లోనూ భారీగా వసూలు చేశారని తేలింది. » రికవరీలు బాగా చేస్తారని పేరుంది. ఆ ముసుగులో చేయాల్సింది చేసి, ట్రాక్ రికార్డు కోసం నామమాత్రంగా కేసులు నమోదు చేస్తుంటారు. ఈ వ్యవహారాలన్నీ భీమవరంలోని ఒక సీఐ చూసుకుంటారు. ఆ సీఐ.. డీఎస్పీకి షాడోగా వ్యవహరిస్తూ.. ఆర్థిక వ్యవహారాల్లో కీలకంగా ఉంటారనేది జనసేన నేతల ఫిర్యాదు. -
వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం మాఫియా
రాష్ట్రంలో రోజూ లక్షల బాటిళ్లలో నకిలీ మద్యం మార్కెట్లోకి చేరుతోంది. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒక బాటిల్ నకిలీ మద్యం ఉంది. లిక్కర్ మాఫియా షాపుల్లో, వాళ్ల బెల్ట్ దుకాణాల్లో, ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లలో నకిలీ మద్యాన్ని అమ్మేస్తున్నారు. ఇంత వ్యవస్థీకృత పద్ధతిలో తయారు చేయడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్ అంతా వాళ్ల ఆధీనంలోనే నడుస్తోంది. ఇంత ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే సొంతం. ఆయన కొడుకు లోకేశ్ కూడా ఏమాత్రం తక్కువ తిన్నోడు కాదు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నకిలీ మద్యం తయారు చేస్తూనే ఉన్నారు. డబ్బుల దగ్గర తగాదాలు వచ్చి బయట పడడంతో ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఆయనకు డైవర్షన్ పాలిటిక్స్ అలవాటే. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి ఆయన ఫ్లాష్ బ్యాక్ చూస్తే.. చేసేది ఆయనే, నెపాన్ని వేరేవాళ్ల మీదకు నెట్టేదీ ఆయనే.. దానికి వత్తాసు పలికేది ఇదే ఎల్లో మీడియా.. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా.. ఇదే మోడస్ ఆపరెండా వీళ్లది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నకిలీ మద్యం మాఫియాను వ్యవస్థీకృతం చేసి, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయలు నష్టం కలిగిస్తూ.. మీ జేబులు నింపుకోవడానికి దిగజారిపోయారంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా చిన్నపాటి నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు కన్పిస్తున్నాయని ఎత్తి చూపారు. నకిలీ మద్యం తయారు చేసేది, సరఫరా చేసేది.. షాపులు, అక్రమ (ఇల్లీగల్) పర్మిట్ రూమ్‌లు, బెల్ట్ షాపుల్లో విక్రయించేది చంద్రబాబు మనుషులేనని.. ఇలాంటి మాఫియాను ప్రపంచ చరిత్రలో ఎక్కడా చూసి ఉండరన్నారు. వాటాల పంపిణీలో తేడా రావడంతోనే నకిలీ మద్యం ఉదంతం బయటకొచ్చిందన్నారు. ఈ తరహా వ్యవస్థీకృత నేరం చేయడం చంద్రబాబుకే సాధ్యమని.. ఆయన కొడుకు లోకేశ్ కూడా ఏమాత్రం తక్కువ కాదంటూ దెప్పి పొడిచారు. నేరం చేసిన చంద్రబాబు.. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి నింద మరొకరిపై వేస్తున్నారంటూ మండిపడ్డారు. నకిలీ మద్యం కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయిస్తే తమ మూలాలన్నీ బయట పడతాయనే భయంతోనే.. తన మాఫియాలో భాగస్వామి అయిన విజయవాడ సీపీ రాజశేఖర్ నేతృత్వంలోని సిట్ విచారణకు ఆదేశించారంటూ తూర్పారబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సాక్ష్యాధారాలను చూపుతూ నకిలీ మద్యం మాఫియా అరాచకాలను ఏకిపారేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఎక్కడ చూసినా నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీలే » రాష్ట్రంలో వ్యవస్థీకృత పద్ధతిలో నకిలీ (ఇల్లిసిట్, స్పూరియస్) మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఇలాంటి మాఫియాను ప్రపంచ చరిత్రలో ఎక్కడా చూసి ఉండం. ఎక్కడ చూసినా చిన్నపాటి నకిలీ మద్యం ఫ్యాక్టరీలే కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం తయారు చేసి.. వాళ్ల మాఫియా లిక్కర్ షాపుల ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు. » ఈ ప్రభుత్వంలో మద్యం దుకాణాలు నడుపుతున్న వారందరూ టీడీపీ వాళ్లే. ఈ ప్రైవేటు మాఫియా నకిలీ మద్యాన్ని తయారు చేస్తుంది. వాళ్ల షాపుల ద్వారానే అమ్మకాలు సాగిస్తుంది. గ్రామాల్లో ఏకంగా వేలం వేసి బెల్ట్ షాపులు పెట్టి, వాటికి పోలీస్ రక్షణ ఇచ్చి మరీ మద్యం అమ్మకాలకు ఈ మాఫియా శ్రీకారం చుట్టింది. బెల్ట్ షాపులే కాకుండా ఏకంగా అనధికారిక పర్మిట్ రూమ్‌ల ద్వారా కూడా నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. » ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగిస్తూ.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతోంది ప్రభుత్వం. అధికార పార్టీ నాయకులు సొంత జేబులు నింపుకునేందుకు దిగజారిపోయారు. డబ్బుల కోసం నకిలీ మద్యం తయారు చేసి, విచ్చలవిడిగా విక్రయాలు చేస్తూ దొరికిపోయారు. నిత్యం మార్కెట్లోకి లక్షల బాటిళ్లలో నకిలీ మద్యం » వాటాల్లో తేడా రావడంతో నకిలీ మద్యం ఉదంతం బయటకొచ్చింది. ఒక్క ములకలచెరువులోనే 20,208 బాటిళ్లలో నింపిన నకిలీ సరుకు దొరికింది. మరో 8,166 బాటిళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని కూడా పట్టుకున్నారు. 30 క్యాన్లలో సిద్ధం చేసిన 1,050 లీటర్ల స్పిరిట్ లభ్యమైంది. ఇవన్నీ కూడా వాడుకుంటే మరికొన్ని వేల బాటిళ్ల నకిలీ మద్యం మార్కెట్లోకి వచ్చేది. » అంతేకాదు.. ఏ పోలీస్ కమిషనర్ అయితే చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతున్నాడో, ఏ పోలీస్ కమిషనర్ అయితే సిట్ పేరుతో గతంలో ఏమీ జరగకపోయినా తప్పుడు సాక్ష్యాలతో మా పార్టీ వారిని వేధిస్తున్నాడో.. అదే విజయవాడ సీపీ పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయట పడింది. ఇబ్రహీంపట్నంలో దాదాపు 27,224 బాటిళ్లు దొరికాయి. » అనకాపల్లి జిల్లా పరవాడలో, అమలాపురంలో, పాలకొల్లులో, ఏలూరులో, రేపల్లెలో, నెల్లూరులో ఇదే మాదిరిగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్లు నకిలీ మద్యం తయారు చేసి, వాళ్ల డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా ప్రైవేట్ మాఫియా మద్యం షాపుల్లోకి, బెల్ట్ షాపులకు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. సిట్ పేరుతో తప్పుడు విచారణ చంద్రబాబే నేరాలు చేస్తారు. అది బయట పడేసరికి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు దొంగల ముఠా ఎల్లో మీడియా సిద్ధం అవుతుంది. అంతా ఆర్కె్రస్టెటెడ్ (తానా తందానా)గా ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించడం కోసం.. అబద్ధాన్ని వందసార్లు చెబుతారు. టాపిక్ డైవర్షన్‌లో భాగంగా ఎదుటి వారిపై బురదజల్లుతారు. వాళ్లే కొత్త కొత్త ఆరోపణలు చేస్తారు. ఆ ఆరోపణలను నిజం చేయాలనే తాపత్రయంతో ఒక సిట్ కూడా వేస్తారు. తప్పుడు విచారణ చేస్తారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిపై కూడా ముద్ర వేసేస్తారు. తప్పుడు ప్రచారం చేస్తూ వారిని కూడా జైళ్లకు పంపిస్తారు. మాఫియాలోని వారంతా చంద్రబాబు మనుషులే » నకిలీ మద్యం వ్యవహారం వెనుక ఉన్నది చంద్రబాబు మనుషులే. తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్, టీడీపీ అభ్యరి్థగా పోటీ చేసిన వ్యక్తి జయచంద్రారెడ్డి. చంద్రబాబు ఆయనకు బీ ఫామ్ ఇస్తున్న ఫొటోలో పక్కనే ఉన్న మరో వ్యక్తి జనార్దనరావు. లోకేశ్, చంద్రబాబుతో ఉన్న మరో వ్యక్తి సురేంద్రనాయుడు (ఫొటోలు చూపారు). ఇదంతా ఒక మాఫియా. » ఇదే జనార్దన్‌రావు విదేశాల్లో ఉండగానే 2 రోజుల్లో వచ్చి లొంగిపోతాడంటూ వీళ్లే సుతిమెత్తగా ఎల్లో మీడియాలో లీకులిచ్చారు. వాళ్లదంతా హాట్ లైన్ కదా! అంటే, ముందుగానే జనార్దన్‌రావుతో వీళ్లు మాట్లాడుకోవడం, ఆ వెంటనే ఆ జనార్దన్‌రావు రెండున్నర సంవత్సరాల కిందట నుంచే ఈ వ్యవహారం జరుగుతోందని చెప్పడం పూర్తిగా ఒక స్కెచ్. » తంబళ్లపల్లెలో టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి మీద ఒక బ్రాండింగ్. ఆయన పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడట! వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టారట! ఈ బ్రాండింగ్‌కు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తానా తందానా అంటాయి. దీనిపై టీడీపీ నుంచి ట్వీట్ వస్తుంది. ఆ తర్వాత ఈ వ్యవహారానికి ఏకంగా ఆఫ్రికాలో మూలాలు ఉన్నాయంటూ బిల్డప్ ఇస్తారు. » అక్కడితో ఆగిపోకుండా చంద్రబాబు బరితెగించి, అధికార దుర్వినియోగానికీ పాల్పడ్డారు. ఐవీఆర్ఎస్ కాల్ సెంటర్‌ను ఉపయోగించుకుని తన మాఫియాలోని వ్యక్తి జనార్దన్‌రావు ద్వారా వీడియో చేయించి, ఆ వీడియోలో జోగి రమేష్ పేరు చెప్పించి.. ఆ వాయిస్‌కు మరికొన్ని వక్రీకరణలు జోడించి ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియా ఏకంగా జనార్దన్‌రావు ఫోన్లో చాట్స్ పేరుతో జోగి రమేష్ ను ఇరికించే ప్రయత్నం చేస్తోంది. నకిలీ మద్యం తయారు చేసి, సరఫరా చేస్తూ.. అమ్మకాలు సాగిస్తున్న వీళ్లే ఎదుటి వారిపై బురదజల్లుతూ కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ చేస్తున్నారు. ఇవిగో ఆధారాలు.. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు » అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు ఫ్యాక్టరీలో లభ్యమైన నకిలీ మద్యం బాటిళ్లు (చూపారు) ఇవి. ఇక్కడ ఫ్యాక్టరీలో మెషీన్లకు పూజ చేసి మరీ నకిలీ మద్యం పకడ్బందీగా తయారు చేస్తున్నారు. బాటిళ్లు, స్టాంప్స్, లేబుళ్లు, ప్యాకింగ్, రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ మద్యం మెటీరియల్ ఇది (చూపారు). » కేరళ మాల్ట్, ఓల్డ్ అడ్మిరల్, మంజీరా బ్లూ, క్లాసిక్ బ్లూ, ఇంకో బాటిల్‌కు లేబుల్ అంటించలేదు. ఏఎన్ఆర్ రెస్టారెంట్ అండ్ బార్.. ఇది వాళ్ల డిస్ట్రిబ్యూషన్ సెంటర్. షాపులకు ఒకరు నాగేశ్వరరావు పేరు, ఇంకొకరు ఎన్టీఆర్ పేరు పెట్టుకుంటారు. » అనకాపల్లి జిల్లా పరవాడలో చిన్న సైజ్ నకిలీ మద్యం ఫ్యాక్టరీ. అవే స్టిక్కర్లు, లేబుళ్లు, బాటిళ్లతో తయారు చేస్తున్నారు. ఇక్కడ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సన్నిహితుడు రుత్తల రాము నకిలీ మద్యంలో కీలక సూత్రధారి. అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె, నెల్లూరు ఇలా అన్ని చోట్ల ఒకే రకమైన సీన్ కనిపిస్తోంది. ప్రతి చోటా నకిలీ మద్యం బాటిళ్లు, మెషీన్లు, కార్టన్లు, లేబుళ్లతో సహా దొరికాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నాలుగైదు మద్యం బాటిళ్లలో ఒకటి నకిలీ. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు బాబూ..» నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు బయటపడ్డ తర్వాత మీరెన్ని షాపుల్లో తనిఖీలు చేశారు? ఎన్ని నకిలీ లిక్కర్ బాటిళ్లు పట్టుకున్నారు. ఏయే షాపుల్లో గుర్తించారు? ఒక్కదానిలో కూడా తనఖీలు లేవు. ఎందుకంటే అన్నీ వాళ్ల షాపులే. పట్టుకుంటే అన్ని చోట్ల నకిలీ మద్యం దొరుకుతుందనే తనిఖీలు ఉండవు. » జనార్దన్‌రావు విదేశాల నుంచి దర్జాగా వచ్చాడు. అసలు జనార్దన్‌రావు అనే మనిషి వీడియోలో ఎలా మాట్లాడాడు? ఆ వీడియోను ఎలా బయటకు పంపగలిగారు? తన ఫోన్ పోయింది అని చెప్పిన జనార్దన్‌రావు ఇవన్నీ ఎలా చేశాడు? ఆ ఫోన్ నుంచి తప్పుడు, ఫ్యాబ్రికేటెడ్ స్క్రీన్ షాట్స్ తీయడం ఎలా సాధ్యం? అవన్నీ ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, టీడీపీ సోషల్ మీడియాలో రావడం ఎలా సాధ్యం? » నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ అక్టోబర్ 3న బయట పడితే ఇవాల్టికి 20 రోజులైంది. ఇప్పటి వరకు మీ పార్టీ బీఫామ్‌పై పోటీ చేసిన జయచంద్రారెడ్డిని ఇంత వరకు ఎందుకు అరెస్టు చేయలేదు? అతని పాస్‌పోర్టు ఎందుకు సీజ్ చేయలేదు? అతను పెద్దిరెడ్డికి సన్నిహితుడు అయితే మీరు ఎందుకు టికెట్ ఇచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకనాథరెడ్డిపై పోటీ పెట్టారు? జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో డిస్టిలరీలు ఉన్నాయని ఎలక్షన్ అఫిడవిట్లో రాశాడు. ఆ రోజు చంద్రబాబుకు ఆఫ్రికా మూలాలు కనిపించ లేదా? టిష్యూ పేపర్‌కు తక్కువ.. బాత్రూమ్ పేపర్‌కు ఎక్కువైన ఈనాడుకు కనిపించలేదా? » పాలకొల్లులో కల్తీ మద్యం ఎవరిది? అక్కడ వాళ్లకేం ఆఫ్రికా లింకులు లేవు కదా? పోనీ ఏలూరులో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? అమలాపురంలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? అనకాపల్లి పరవాడలో నకిలీ మద్యం తయారు చేస్తూ పట్టుబడ్డ రుత్తల రాము స్పీకర్‌కు సన్నిహితుడు. రాముకు ఆఫ్రికాతో సంబంధాలున్నాయా? అక్కడి నుంచి స్పిరిట్ వస్తోందా? వీళ్లు కొంటున్నారా? » ఏలూరు జిల్లాకు చెందిన ఒక టీడీపీ నాయకుడిపై డజన్ల కొద్దీ కేసులున్నాయి. అతను మహిళలని కూడా చూడకుండా అధికారుల్ని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని కూడా పోతాడు. అంత గొప్ప నాయకుడు దగ్గరుండి లిక్కర్ మాఫియా నడుపుతున్నాడు. మరో పేకాట కింగ్ రేపల్లె నుంచి డార్లింగ్ మంత్రి అని కూడా అప్పుడప్పుడు రాధాకృష్ణ ముద్దుగా అంటుంటాడు. నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది మీ (చంద్రబాబు) మనుషులు కాదా? వాటిని షాపులకు సరఫరా చేసి విక్రయాలు చేస్తోందీ మీ వాళ్లు కాదా? ఇది దొంగ చేతికి తాళం ఇవ్వడం కాదా? మద్యం విక్రయాల సమయంలో క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు ఉన్నవన్నీ టీడీపీ నాయకులవే కదా.. పర్మిట్ రూమ్‌లలో లూజ్ లిక్కర్ విక్రయించేది వాళ్లే. నకిలీ లిక్కర్ దందా మొత్తం వాళ్ల కార్యకర్తలదే. ఇదంతా సిండికేట్ మాఫియా కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇప్పుడు చంద్రబాబు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే బాధ్యతలు వాళ్లకే ఇస్తున్నాడు. అంటే దొంగ చేతికే తాళాలు ఇవ్వడం అన్నమాట. పభ్రుత్వం అమ్మే మద్యంలో 40 శాతం బెల్ట్ షాపుల ద్వారా, మరో 40 శాతం ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లలో అమ్ముతున్నారు. అక్కడే కూర్చోబెట్టి గ్లాసుల్లో పోసి తాగిస్తున్నారు. ఎమ్మార్పీ రేటు గాలికెగిరిపోయింది. ఏం పోస్తున్నారో, ఏం తాగుతున్నారో అర్థం కాదు. మూడో రౌండ్ నాలుగో రౌండ్ కి వచ్చేసరికి ఐదో రౌండ్లో ఏం పడుతుందో తెలియదు. ప్రాణాలకు హాని కలిగించే లిక్కర్ని నకిలీ లేబుల్స్ వేసి అమ్మేస్తున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలోనేక్యూ ఆర్ కోడ్ వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచేవి. లాభాపేక్ష అప్పటి మా ప్రభుత్వానికి లేదు. అందుకే బెల్ట్ షాపులు రద్దు చేశాం. మద్యం షాపుల సంఖ్య తగ్గించాం. మద్యం షాపుల వేళలు కూడా కుదించాం. పర్మిట్ రూమ్‌లు ఎత్తేశాం. పారదర్శక వ్యవస్థ కోసం క్యూ ఆర్ కోడ్ స్కాన్ సిస్టం తీసుకొచ్చాం. ప్రతి బాటిల్‌ను స్కాన్ చేసి అమ్మేవాళ్లం. ఎంప్యానల్డ్ డిస్టిలరీల నుంచి మాత్రమే లిక్కర్ వచ్చేది. ఆ ఎంప్యానెల్డ్ డిస్టిలరీలు కూడా గతంలో చంద్రబాబు అనుమతులిచ్చినవే. రూ.వందల కోట్లు ఖర్చు చేసి డిస్టిలరీలు పెడితే వాటిలో నాణ్యమైన మద్యం తయారు చేస్తారు. ఆ క్వాలిటీ మద్యానికి క్యూఆర్ కోడ్ పెట్టి ట్రేస్ చేసి ప్రభుత్వ షాపుల్లో ప్రభుత్వమే అమ్మితే, మద్యం ప్రియుల ఆరోగ్యానికి కొద్దొగొప్పో గ్యారెంటీ ఉండేది. కానీ ఈ రోజు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ విచ్చలవిడిగా నకిలీ మద్యం అమ్మేస్తున్నారు. ఒకవైపున ఎమ్మార్పీ ధరల కన్నా ఎక్కువగా బెల్ట్ షాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లలో అమ్మడం కళ్లముందే కనిపిస్తోంది. మరోవైపు నకిలీ, కల్తీ మద్యాన్ని తాగిస్తున్నారు. వీళ్లకు కావాల్సిన వాటికి మాత్రమే గవర్నమెంట్‌కి డబ్బులు కట్టి సప్లై చేస్తున్నారు. జోగి రమేష్ ను ఇరికించే కుట్ర నకిలీ మద్యం కుంభకోణం నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు మా నాయకుడు జోగి రమేష్‌పై ఆరోపణలు చేశారు. పన్నెండేళ్ల కిందట ఎప్పుడో దిగిన ఫొటోను చూపిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అసలు జనార్దన్‌రావుతో సత్సంబంధాలు లేవని, తన ఫోన్ చెక్ చేసుకోమని జోగి రమేష్ చాలెంజ్ చేస్తున్నాడు. పరిచయం లేని వ్యక్తితో చాటింగ్ చేసినట్టుగా.. ఫోన్ పోయిందని చెబుతున్న జనార్దన్‌రావు ఫోన్ నుంచి చాటింగ్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ చాట్స్‌ను కూడా ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. జోగి రమేష్ సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తే జనార్దన్‌రావు ఫోన్ పోయిందని ఆయనే కంప్లైంట్ ఇచ్చాడు. ఫోన్ లేదు కదా అని చెబుతున్నారు. కానీ ఈ లోపల డైవర్షన్ పాలిటిక్స్‌లో డ్యామేజ్ చేసేది చేస్తున్నారు కదా. ఇది వ్యక్తిత్వ హననం కాదా? నువ్వు చేసింది ఒక వెధవ పని. ఆ వెధవ పనిలో టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఇంకో మనిషి మీద అభాండాలు వేయడం, లేని ఆధారాలు పుట్టించడం అన్యాయం కాదా? మొన్న అక్రమ లిక్కర్ కేసులో ఒకర్ని ఇరికించేందుకు వీళ్ల డబ్బులు రూ.11 కోట్లు తీసుకునిపోయి అక్కడ పెట్టి స్కాం జరిగిందని ప్రచారం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆ నోట్ల మీద ఉన్న నెంబర్ల ఆధారంగా ఎవరి ఖాతా నుంచి డ్రా చేశారు, ఎప్పుడు డ్రా చేశారు అనేది తెప్పించమని కోర్టులో కేసు ఫైల్ చేసి, ఆర్బీఐకి లేఖ రాశారు. ఆ తర్వాత ఇక మాటల్లేవ్. ఎక్కడైనా రూ.11 కోట్ల డబ్బులు దొరికితే పక్కన పెడతారు. వీళ్లు మిగతా డబ్బుతో కలిపేశామని చెప్పారు. అలా ఎలా కలిపేస్తారు? అంటే, వీరే డబ్బులు తీసుకొచ్చి ఇంజినీరింగ్ కాలేజీ డొనేషన్ల డబ్బు అని బయట పడుతుందనే భయంతోనే దాన్ని కలిపేశారు. చంద్రబాబుకి సిగ్గూలజ్జా లేదు. సిగ్గన్నా ఉంటే కొంచెం సిగ్గుపడతాడని అనుకోవచ్చు. లజ్జన్నా ఉంటే కనీసం అషేమ్డ్గా ఫీలవుతాడనుకో వచ్చు. కానీ అషేమ్డ్గా ఫీలయ్యేది లేదు. సిగ్గు అంతకన్నా లేదు. -
ఉద్యోగులను నడి రోడ్డుపై నిలబెట్టి వికృతానందం
ఎన్నికల హామీల అమలుపై ఉద్యోగులంతా రోడ్డెక్కిన తర్వాత చంద్రబాబు అనేక డ్రామాలు చేస్తూ ఒక్క డీఏ ప్రకటించాడు.. ఆ ప్రకటనే తప్ప.. ఇంత వరకు డీఏ ఇచ్చింది లేదు. ఫస్ట్ దసరా అన్నాడు.. తరువాత నవంబర్ అన్నాడు.. తరువాత దీపావళి అన్నాడు.. దానికి పెద్ద బిల్డప్ ఇచ్చారు. వాళ్లకు రావాల్సింది నాలుగు డీఏలు ఉంటే ఒక్క డీఏకి ఉద్యోగులంతా సంబరాలు అంటూ ప్రచారం నడిపారు. జిమ్మిక్కులు చేశారు. చివరకు ఇచ్చిన ఒక్క డీఏ అరియర్స్‌ను ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఇస్తామని జీవోలో చెప్పారు. 3.5 లక్షల మంది పెన్షనర్లకు డీఆర్ అరియర్స్ రెండేళ్ల తర్వాత ఇస్తామని ప్రకటించారు. చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు. ఉద్యోగులు కళ్లెర్ర చేస్తే ఆ జీవోలను సవరించారు. ప్రతి నెలా 1వ తేదీన ఉద్యోగులకు ఠంఛన్‌గా జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇస్తామన్నాడు. ఎన్నికల తర్వాత అలా ఒక్క నెల మాత్రమే ఇచ్చాడు. ఇవాళ ఏ తేదీల్లో జీతాలు వేస్తారో తెలియడం లేదు. మా ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్ పరిస్థితులు ఉన్నా.. ఏ రోజూ కూడా ఉద్యోగుల జీతాల విషయంలో ఇబ్బందులు పడే పరిస్థితి తేలేదు. మా పరిస్థితుల్లో చంద్రబాబు ఉండి ఉంటే.. రాష్ట్రం కోవిడ్‌తో అతలాకుతలం అయిపోయింది.. మీరు రెండు నెలలు జీతాలు వదిలేసుకోండి.. రాష్ట్రం కోసం కాంట్రిబ్యూట్ చేయండ(విరాళంగా ఇవ్వండి)ని పిలుపునిచ్చేవాడు కచ్చితంగా. మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఐఆర్ ఇచ్చాం. ఉద్యోగుల జీతాలు పెంచాం. 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేస్తే.. జూన్ 8న 27 శాతం ఐఆర్ ఇచ్చాం. జూలై 1 నుంచి అమలుచేశాం. అది ఉద్యోగస్తులపట్ల మాకున్న కమిట్మెంట్. మా ప్రభుత్వ హయాంలో 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. కాంట్రాక్టు ఉద్యోగస్తులను కూడా రెగ్యులరైజ్ చేయడం మొదలు పెట్టాం. 10,117 మందిని గుర్తించాం. వీళ్లలో 3,400 మందిని రెగ్యులరైజ్ చేశాం. మిగిలిన వారిని కూడా రెగ్యులరైజ్ చేసేందుకు సిద్ధం చేసినప్పటికీ ఎన్నికల కోడ్ వల్ల చేయలేకపోయాం. వాళ్లను ఇప్పుడు చంద్రబాబు రెగ్యులరైజ్ చేయడంలేదు. కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్ ఇచ్చి జీతాలు పెంచడమే కాదు.. వారికి ప్రతినెలా 1వ తేదీన జీతాలు ఇచ్చేలా మేము సర్క్యులర్ జారీ చేశాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తి పలికి, దళారీ వ్యవస్థను తీసేసి వాళ్ల బతుకులు మార్చాలనే ఉద్దేశంతో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ (ఆప్కాస్)ను ఏర్పాటుచేసి లక్ష మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతినెలా 1వ తేదీన జీతాలు వచ్చేటట్టుగా మేలు చేశాం. ఈ రోజు ఆప్కాస్‌ను చంద్రబాబు నీరుగారుస్తున్నారు. చివరికి ఆలయాల్లో శానిటేషన్ కాంట్రాక్టు పనులను చంద్రబాబు బంధువు భాస్కరనాయుడుకు అప్పగించారు. మా హయాంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు పెంచాం. మేము రాక ముందు ఏడాదికి వారి వేతనాలు రూ.1,100 కోట్లు ఉండగా.. మేము అధికారంలోకి వచ్చాక ఏడాదికి రూ.3,300 కోట్లు చెల్లించాం. ఇప్పుడు చంద్రబాబు సచివాలయాల ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, ఆప్కాస్ వల్ల జీతాలు ఇవ్వడం కష్టంగా ఉందని కొత్త కొత్త స్టోరీలు చెబుతున్నారు. అంటే 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులతో పాటు లక్ష మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, లక్షా 35 వేల మంది సచివాలయ ఉద్యోగులపై ఆయన కన్ను పడింది. వీళ్లను క్లీన్ చేస్తే మిగిలిన వారిని కూడా నెమ్మదిగా తప్పించేయొచ్చన్నది చంద్రబాబు ఆలోచన. సాక్షి, అమరావతి : ఎన్నికల్లో తీపి తీపి మాటలతో ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వారిని మోసం చేసి నడిరోడ్డున నిలబెట్టి వికృతానందం పొందుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలు, సమస్యల పరిష్కారంలో కుప్పిగంతులు, పిల్లి మొగ్గలు వేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు ప్రచారంలో పీక్.. వాస్తవాలు చాలా వీక్’ అనడానికి ఉద్యోగులకు ఇచ్చిన డీఏనే ఉదాహరణ అంటూ ఎత్తిచూపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోందని.. జనవరి 2024, జూలై 2024, డిసెంబర్ 2024, జూన్ 2025.. ఇలా నాలుగు డీఏలు పెండింగ్‌లో పెట్టారని గుర్తుచేశారు. ఒక్క డీఏ కూడా ఇవ్వకపోవడంతో ఉద్యోగులు రోడ్డెక్కిన తర్వాత అనేక డ్రామాలు చేస్తూ ఒక్క డీఏ ప్రకటించాడు తప్ప.. ఇంత వరకూ ఇచ్చింది లేదన్నారు. ఉద్యోగులను చంద్రబాబు తరహాలో మోసం చేసిన సీఎం చరిత్రలో ఎవరూ లేరంటూ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సంక్షేమం విషయంలో చంద్రబాబు వ్యవహార శైలిని సాక్ష్యాధారాలతో సహా ఎత్తిచూపుతూ కడిగి పారేశారు. తాము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చి.. జూలై, 2019 నుంచి పెంచిన వేతనాలు ఇవ్వడం ద్వారా వారి పట్ల తమకున్న ప్రేమను చాటుకున్నామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేస్తూ ఆప్కాస్‌ను తెచ్చామని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతోపాటు వారి వేతనాలను పెంచామని.. దీనివల్ల వారి వేతనాలు ఏడాదికి రూ.1100 కోట్ల నుంచి రూ.3,300 కోట్లకు పెరిగాయని వివరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని గుర్తు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా లంచాలకు తావు లేకుండా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందించి చూపించామని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. డీఏ అరియర్స్ రిటైర్ అయ్యాక ఇస్తారా? మా ప్రభుత్వ హయాంలో కోవిడ్ లాంటి కష్టకాలంలో ఉన్నా కూడా ఉద్యోగుల విషయంలో వెనకడుగు వేయలేదు. మామూలుగా ఐదేళ్లలో 10 డీఏలు ఇవ్వాలి. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 11 డీఏలు ఇచ్చాం. చంద్రబాబు అంతకు ముందు 2014–19 మధ్య కేవలం 8 డీఏలు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నాలుగు పెండింగ్ ఉంటే ఒకటి ఇస్తానన్నాడు.. ఆ ఒకటి కూడా డీఏ అరియర్స్ రిటైర్ అయ్యాక అన్నాడు. పెన్షనర్లకు డీఆర్ రెండేళ్ల తరువాత 2027–28లో ఇస్తానని ప్రకటించాడు. చంద్రబాబు ఇచ్చిన జీవోపై ప్రతి ఉద్యోగి తిట్టడం మొదలు పెట్టడంతో ఆ జీవో సవరించారేగానీ ఇంతవరకు పైసా ఇచ్చింది లేదు. పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ 4 పెండింగ్‌లో పెట్టారు. ఒక్కో సరెండర్ లీవ్‌కు రూ.210 కోట్లు అవుతుందనుకుంటే.. అందులో రూ.100 కోట్లు ఇప్పుడిస్తాడట (అదీ ఇవ్వలేదు).. మిగిలిన రూ.100 కోట్లు జనవరిలో ఇస్తానని చెప్పాడు. ఇస్తానన్న దాంట్లో రూపాయి ఇవ్వలేదు.. మరి దీన్ని చూసి ఉద్యోగులంతా పండగ చేసుకోవాలంట. ఎలా సంబరాలు చేసుకోవాలి? టీడీపీ మేనిఫెస్టోలో ఉద్యోగుల గౌరవాన్ని పునఃప్రతిష్ట చేస్తానని హామీ ఇచ్చాడు. తీరా ఇవాళ చూస్తే పచ్చ బిళ్లలు వేసుకొని గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వెళ్లి.. టీడీపీ వాళ్లు ఉద్యోగులపై దాడులు చేస్తున్నారు. ఏమైనా అంటే పొలిటికల్ గవర్నెన్స్ అని నిర్మొహమాటంగా చెబుతున్నారు. కుట్రపూరితంగానే పీఆర్సీ వేయడం లేదుఇవాళ ఉద్యోగులకు జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు.. త్రిశంకుస్వర్గంలో ఉన్నారు. మరో వైపు మేము తెచ్చిన జీపీఎస్‌ను కొనియాడుతూ కేంద్ర ప్రభుత్వం దగ్గర్నుంచి అనేక రాష్ట్రాలు దాన్ని స్వీకరించి, అమలు చేస్తూ ముందుకుపోతున్నాయి. ఎన్నికలప్పుడు ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నాడు. ఎన్నికలు అయిపోయాయి.. ఐఆర్ మాట దేవుడెరుగు.. పీఆర్సీ మరీ దారుణం. మేము నియమించిన పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను బలవంతంగా వెళ్లగొట్టాడు. కొత్త పీఆర్సీ చైర్మన్‌ను నియమించలేదు. కొత్త పీఆర్సీ వేస్తే ఎక్కడ ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందో అన్నది చంద్రబాబు దుగ్ధ. ఐఆర్ ఇవ్వకపోవడం ఒక మోసం అయితే.. న్యాయంగా, ధర్మంగా ఉద్యోగులకు జీతాలు పెరగకుండా అడ్డుకోవడం అన్నింటికంటే దుర్మార్గం. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలు, జీపీఎఫ్‌లు, ఏపీ జీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్లు, సరెండర్ లీవ్స్ అన్ని కలిపి దాదాపు రూ.31 వేల కోట్ల బకాయిల గురించి చంద్రబాబు మాట్లాడడు. ప్రతి నెలా 1వ తేదీన ఉద్యోగులకు ఠంఛన్‌గా జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇస్తామన్నాడు. ఎన్నికలైన తర్వాత ఒక నెల మాత్రమే అలా ఇచ్చాడు. మరో వైపు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికెగిరిపోయాయి. మా పథకాలన్నీ రద్దయిపోయాయి. ఇచ్చే పథకాలే అరకొర. వాటిలో కూడా అవుట్ సోర్సింగ్ వాళ్లకు ఇచ్చేందుకు చంద్రబాబుకు మనసు రావడం లేదు. అధికారంలోకి రాగానే వలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేలు కాదు..రూ.10 వేలకు పెంచేస్తామన్నాడు. ఎన్నికల్లో వాడుకున్నాడు. ఎన్నో కుట్రలు చేశాడు. ఎన్నికల తర్వాత ఏకంగా ఆ ఉద్యోగాలన్నీ పీకేసి, 2.66 లక్షల మందిని రోడ్డున పడేశాడు.మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ » చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మా హయాంలో 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చాం. వాటిలో ఏడు పూర్తి చేశాం. మిగిలిన 10 కళాశాలలు పూర్తి చేయాల్సి ఉంది. వీటి కోసం కేటాయించిన రూ.8 వేల కోట్లకు గాను రూ.3వేల కోట్లు ఖర్చు చేశాం. ఏడాదికి రూ.1,000 కోట్లు చొప్పున ఖర్చు చేస్తే మిగిలిన మెడికల్ కళాశాలలన్నీ పూర్తయ్యేవి. కానీ వాటిని పూర్తి చేయడం ఇష్టం లేక.. సగంలో కట్టిన ఈ కళాశాలలను స్కామ్‌లు చేస్తూ అమ్మడానికి సిద్ధమయ్యారు. » మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నవంబర్ 22వ తేదీ వరకు కొనసాగుతోంది. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అక్టోబర్ 28వ తేదీన ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన ఈ కోటి సంతకాలను నవంబర్ 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు, నవంబర్ 24న జిల్లాల నుంచి విజయవాడకు పంపిస్తారు. ఆ తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు ఏ విధంగా రిఫరెండం ఇచ్చారో కోటి సంతకాల ద్వారా తెలియజేస్తాం.విద్య, వైద్యం, గవర్నెన్స్.. అన్నీ తిరోగమనమే » ఉద్యోగులకు చంద్రబాబు చేసింది ఏమీ లేదు. కనీసం ప్రజలకైనా ఏమైనా చేస్తున్నాడా అంటే అదీ లేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్, లా అండ్ ఆర్డర్ మొత్తం అన్నీ తిరోగమనమే. స్కూల్స్‌లో నాడు–నేడు పనులు ఆగిపోయాయి. గోరుముద్ద నాణ్యత పోయింది. 3వ తరగతి నుంచి చెప్పే టోఫెల్ క్లాసులు ఎత్తేశారు. ఇంగ్లిష్ మీడియం చదువులు గాలికెగిరిపోయాయి. 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్‌లు ఆగిపోయాయి. అమ్మఒడి అరకొరగా మిగిలిపోయింది. విద్యాదీవెన, వసతి దీవెన ఆగిపోయింది. ఏడు క్వార్టర్ల ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు పెండింగ్. ఒక్కొక్క క్వార్టర్‌కు రూ.650 కోట్ల నుంచి రూ.700 కోట్లు చొప్పున రూ.4,500 కోట్లు నుంచి రూ.4,900 కోట్లు విడుదల చేయాలి. కానీ ఈయన ఇచ్చింది రూ.700 కోట్లే. వసతి దీవెన రూ.2,200 కోట్లు ఇవ్వాలి. రూపాయి కూడా ఇచ్చింది లేదు. » వైద్య రంగంలో చూస్తే రూ.25 లక్షల వరకు పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తూ వారికి ఆరోగ్య భద్రత కలి్పంచే ఆరోగ్యశ్రీని నీరుగార్చారు. ఈ పథకానికి నెలకు రూ.300 కోట్లు ఖర్చవుతుంది. 17 నెలలకు దాదాపు రూ.5,100 కోట్లు ఇవ్వాలి. కానీ రూ.వెయ్యి కోట్లు కూడా ఇవ్వలేదు. రూ.4 వేల కోట్ల బకాయిలు పెట్టారు. దీంతో వైద్యం అందించలేక నెట్వర్క్ ఆస్పత్రులు చేతులెత్తేసాయి. ఈ రోజు వాళ్లు విజయవాడలో ధర్నా చేసే పరిస్థితి ఏర్పడింది. పేద వాడికి ఆరోగ్య భరోసా ఇవ్వాల్సిన ఈ ఆస్పత్రులు..పేదవాడిని వదిలేసి చంద్రబాబు పుణ్యమా అని ఆందోళనకు దిగాయి. » ఆరోగ్య ఆసరా గాలికెగిరిపోయింది. 104, 108.. కుయ్..కుయ్..కుయ్ అంటూ రావాల్సిన ఈ అంబులెన్స్‌ల నిర్వహణను రూ.5 కోట్ల టర్నోవర్ కూడా లేని చంద్రబాబు మనిషికి ఇచ్చారు. ఇలా అయితే 104, 108 సర్వీసులు ఇంకేమి నడుస్తాయి? విలేజ్ క్లినిక్‌లు, పీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రులు గాలికెగిరిపోయాయి. జీరో వేకెన్సీ రిక్రూట్మెంట్ పాలసీ అటకెక్కింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్వోజీఎంపీ ప్రమాణాల మేరకు మందులు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఆ మందులు దేవుడెరుగు కనీసం దూదికి కూడా దిక్కు లేదు. -
రైతులను నిలువునా ముంచేస్తారా?
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది.. ఇప్పటికీ డీఏపీ, యూరియా దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇంత దారుణ పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుత రబీ సీజన్లో రాయలసీమ ప్రాంతంలో వేరు శనగ (బుడ్డ శనగ) విత్తనం వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. అయితే, గత నెల నుంచి సబ్సిడీ విత్తనాలిస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేసిందే తప్ప ఇంతవరకు కార్యాచరణే ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రైతులు దయనీయ, దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ఘోరంగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. ‘ఉల్లి రైతును గాలికొదిలేశారు. గడిచిన 60రోజుల నుంచి కిలో రూ.3 కన్నా దాటడం లేదు. ప్రభుత్వం క్వింటాకు రూ.1,200 ఇస్తామని చెప్పింది. ఎవరికిస్తున్నారో ఎవరికీ తెలియదు.’ ఎవరికీ ఇచ్చిందీ లేదు.ప్రభుత్వంపై రైతులు నిరసన తెలిపేసరికి హెక్టారుకు రూ.50 వేలు ఇస్తామని చెప్పారు. ఇందుకోసం ఇప్పటివరకు విధివిధానాలే రూపొందించలేదు. ధాన్యానికి గతేడాది గిట్టుబాటు ధర లేక బస్తా రూ.1,100 నుంచి రూ.1,200కు తెగనమ్ముకునే పరిస్థితి. ఈ ఏడాది పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కాక రైతులు ఆందోళన చెందుతున్నారు. క్వింటా పత్తి గతంలో రూ.12 వేలు పలికితే, ఇప్పుడు రూ.5,500కు మించి పలకడం లేదు. అరటి పంట గతంలో టన్ను గరిష్టంగా రూ.28 వేలు పలికితే ఇప్పుడు రూ.3,500కు మించి పలకడం లేదు. కూలి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు టమాటా పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. దెబ్బతిన్న ఏ సీజన్లో కూడా బీమా కానీ, పంట నష్టపరిహారం కానీ ఇవ్వడంలేదు. అంతెందుకు ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టం జరిగితే ఏ అధికారి కూడా వెళ్లి ఎన్యుమరేషన్ చేయలేదు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి ఇంతకంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
నిండా ముంచిన వాన
సాక్షి నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీని ప్రభావంతో రెండు రోజులుగా రాష్ట్రమంతటా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. గురువారం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయి రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. వరి చిరుపొట్ట దశలో వర్షాలు పడటంతో పంట నష్టం తప్పేలా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 6.94 సెం.మీ. వర్షం కురిసింది. పల్నాడు జిల్లాలో గడచిన 24 గంటల్లో 330.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లాలో కురిసిన వర్షాలకు పెన్నానదికి భారీస్థాయిలో నీరు చేరుతోంది. వరి, వేరుశనగ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు ప్రకాశం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా రాచర్ల మండలంలో 8.5 సెం.మీ. కురిసింది. ఐదు మండలాల్లో పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. పెద్దదోర్నాల మండల పరిధిలోని తీగలేరు, ఇసుక చింతలవాగు, దొంగలవాగు, రాళ్లవాగులు పొంగటంతో వై.చర్లోపల్లి, గంటవానిపల్లె, మర్రిపాలెం తదితర గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు పంటల్ని దెబ్బతీస్తున్నాయి. రొంపిచెర్ల మండలంలో టమాట పంట పూర్తిగా దెబ్బతింది. తిరుపతి జిల్లాలో 33.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. వైఎస్సార్ కడప జిల్లాలో 2,711 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, కంది, మినుము, వేరుశనగ, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లా కేంద్రంతో పాటు పరిసర మండలాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. బుక్కరాయసముద్రంలో 72 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏలూరు జిల్లాలో గురువారం కుండపోత వర్షం కురిసింది. కలిదిండిలో 7.82 సెం. మి. అత్యధిక వర్షపాతం నమోదైంది. చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట మండలాల్లో వాగులు పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయానికి సగటు వర్షపాతం 13.5 మి.మీ.గా నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం 23.9 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది.వాగులో పడి వ్యక్తి మృతి జలదంకి (కలిగిరి): జీవనోపాధి నిమిత్తం వాగు దాటి కావలి వెళ్లాలనుకున్న వ్యక్తి బైక్‌తో పాటు గల్లంతై మృతి చెందాడు. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో జరిగింది. చామదాలకు చెందిన దంపూరు మల్లికార్జున (45) తన గ్రామం నుంచి బైక్‌పై కావలికి గురువారం బయల్దేరాడు. నేరెళ్ల వాగు దాటుతుండగా బైక్‌తో పాటు ఆయన చప్టా పైనుంచి వాగులో పడిపోయాడు. సమాచారం అందుకున్న జలదంకి ఎస్ఐ సయ్యద్ లతీఫున్నీసా ఘటనాస్థలానికి చేరుకుని సిబ్బంది, స్థానికులతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పించి వారి సాయంతో 6 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా, మల్లికార్జున కావలిలోని పూల దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య గోవిందమ్మ, కుమార్తె (6) ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్మారా్టనికి తరలించారు. -
మరో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని వల్ల రానున్న మరో నాలుగు, ఐదు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) ప్రఖర్ జైన్ గురువారం తెలిపారు. శుక్రవారం కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తా తీరం వెంబడి 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరో అల్ప పీడనం వల్ల రానున్న నాలుగు, ఐదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే సూచనలు ఉన్నాయన్నారు. సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. గురువారం సాయంత్రం 6 గంటల నాటికి కోనసీమ జిల్లా కాట్రేనికోనలో 120.5మిల్లీ మీటర్లు, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో 85.5మిమీ, నెల్లూరు జిల్లా రాపూర్‌లో 78.5మిమీ వర్షపాతం నమోదైందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. కాగా, ప్రస్తుత అల్పపీడనం వాయుగుండంగా బలపడి తుపానుగా మారే సూచనలు ఉన్నాయని, ఈ తుపాను దక్షిణ కోస్తా లేదా తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: రెగ్యులర్ అభ్యర్థులతో పాటు ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఏపీ టెట్ (అక్టోబర్ 2025) షెడ్యూల్‌ను గురువారం విడుదల చేసింది. అభ్యర్థులు శుక్రవారం నుంచి నవంబర్ 23 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజును http://cse.ap.gov.in ద్వారా చెల్లించాలని సూచించింది. నవంబర్ 25న ఆన్లైన్ మాక్ టెస్ట్ నిర్వహిస్తారని, డిసెంబర్ 3 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోలని సూచించింది. డిసెంబర్ 10 నుంచి రోజూ రెండు పూటలా ఉదయం 9 నుంచి 12 గంటలకు, మ«ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఏపీ టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫలితాలను జనవరి 19వ తేదీన వెల్లడిస్తామని చెప్పారు. http://tet2dsc.apcfss.in వెబ్సైట్ నుంచి పూర్తి సమాచారం డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు హెల్ప్ డెస్క్ నంబర్లు 8121947387, 8125046997, 7995649286, 7995789286, 9963069286ను సంప్రదించవచ్చన్నారు. ఆ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరిటీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరని, ఇదే అంశాన్ని ఇటీవల సుప్రీంకోర్టు సైతం నిర్దేశించిందని పేర్కొంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, అన్ని మేనేజ్మెంట్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులకు తప్పనిసరిగా టెట్ ఉండాలని నిర్దేశించింది. అయితే, ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీ నాటికి 5 ఏళ్ల లోపు మాత్రమే ఇంకా సర్వీసు మిగిలి ఉన్నవారికి టెట్ నుంచి మినహాయింపునిచ్చింది. కాగా, ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నిర్వహణను ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. -
ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.5 కోట్లు ముట్టజెప్పా..
తిరువూరు: టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఆ పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారని సోషల్ మీడియా వేదికగా గురువారం పోస్టు పెట్టారు. 2024 ఎన్నికల్లో చిన్ని తనను రూ.5 కోట్లు అడిగారని, తన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా ఈ సొమ్మును ఆయనకు ఇచ్చానని ప్రకటించారు. 2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు, మరుసటి రోజు మరో రూ.20 లక్షలు, ఫిబ్రవరి 14న రూ.20 లక్షలు తదుపరి చిన్ని పీఏ మోహన్‌కు రూ.50 లక్షలు, గొల్లపూడిలో తన మిత్రుల ద్వారా రూ.3.50 కోట్లు ఇచ్చానని వివరించారు. ‘ఈ వివరాలన్నీ రేపు మాట్లాడుకుందాం.. నిజం గెలవాలి. నిజమే గెలవాలి’ అంటూ కొలికపూడి పెట్టిన పోస్టు నియోజకవర్గంలో తీవ్ర సంచలనం రేపింది. ఎంపీ, ఎమ్మెల్యేల నడుమ విభేదాల నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గ టీడీపీ కేడర్ రెండుగా చీలిపోయింది. టీడీపీలో కోవర్టులున్నారు: టీడీపీలో కోవర్టులు ఉన్నారని..ఆ కోవర్టులు ఎవరో, ఎక్కడున్నారో అందరికీ తెలుసని ఎంపీ చిన్ని వ్యాఖ్యానించారు. ప్రత్యర్థుల జన్మదినాల స్టేటస్లు పెట్టుకుంటూ.. పార్టీకి విధేయుడినంటే కార్యకర్తలు ఒప్పుకుంటారా అంటూ ఎంపీ రెచి్చపోయారు. నాయకుల కోసం పార్టీ శ్రేణులు దెబ్బలు తినాలి గానీ నేతలు మాత్రం ఇతర పార్టీలతో అంటకాగితే ఎవరైనా ఊరుకుంటారా అంటూ ఎమ్మెల్యే వైఖరిని తప్పుపట్టారు. ‘తిరువూరు నియోజకవర్గంలో విలేకరులకే వారి్నంగ్లు ఇచ్చారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కనీస విషయాలు తెలియకుండా అన్ని వివాదాలకూ కారణమవుతున్నారు’ అంటూ కొలికపూడిపై ధ్వజమెత్తారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలి ఇప్పటికే పార్టీ దృష్టికి వెళ్లిందని ఎంపీ వ్యాఖ్యానించారు. -
ఉద్యమించిన వైద్యులు
సాక్షి, అమరావతి: ‘కరోనా మహమ్మారి కబళిస్తున్న సమయంలో మా ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడాం. లక్షల మంది బాధితులను రక్షించాం. అలాంటి మాపై ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది.. మా ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు ఈ సర్కారుకు పట్టవా?’ అంటూ మహాధర్నాలో వైద్యులు గర్జించారు. ఆరోగ్యశ్రీ కింద కూటమి ప్రభుత్వం రూ.వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టడంతో రాష్ట్రంలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతులు, చేనేత కార్మికుల తరహాలో వైద్యులు సైతం ఆత్మహత్యలకు ఒడిగట్టే దుస్థితిని ప్రజలు చూడాల్సి వస్తుందని ఆక్రోశించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.3 వేల కోట్లకుపైగా బకాయిలు పెండింగ్‌లో పెట్టిన నేపథ్యంలో బిల్లుల విడుదల, ఇతర సమస్యల పరిష్కారం కోసం గురువారం విజయవాడలోని ధర్నా చౌక్‌లో నెట్వర్క్ ఆస్పత్రుల ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశ) ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు ఏపీ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ (అప్న), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం, ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీ జూడా) సహా పలు సంఘాలు మద్దతుగా నిలిచాయి. సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) చైర్మన్‌గా విజయవాడ ఆయుష్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రమేశ్‌బాబును ఎన్నుకున్నారు. కో–చైర్మన్లుగా ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జయధీర్, అప్న రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సుబ్బారెడ్డి వ్యవహరించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వైద్యులు, వైద్య సిబ్బంది మహా ధర్నాకు హాజరయ్యారు. వైద్య వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్న చంద్రబాబు సర్కారు తీరును ఎండగట్టారు.చరిత్రలో ఇదే తొలిసారి..దేశంలో ఇప్పటి వరకూ వైద్యుల హక్కులను కాలరాసే చట్టాలు, ఉత్తర్వులు జారీ చేసిన సందర్భాల్లో మాత్రమే ప్రైవేట్ డాక్టర్లు రోడ్లెక్కి నిరసనలు, ర్యాలీలు నిర్వహించిన ఉదంతాలున్నాయి. ప్రభుత్వాలు అమలు చేసే ఆరోగ్య పథకాల బిల్లులు చెల్లించలేదని ప్రైవేట్ వైద్యులు, ఆస్పత్రుల యజమానులు రోడ్లెక్కి ధర్నాలు, ర్యాలీలకు దిగిన ఘటనలు ఇప్పటి వరకూ చోటు చేసుకోలేదని వైద్యవర్గాలే చెబుతున్నాయి. చేసిన చికిత్సలకు డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం వేధింపులకు దిగడంతోనే ఎక్కడా లేనట్లుగా రాష్ట్రంలో ప్రైవేట్ వైద్యులు రోడ్లెక్కి ఆందోళనకు దిగారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. వైద్య ఆరోగ్య రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇది మాయని మచ్చ లాంటిదనే ఆవేదన వ్యక్తమవుతోంది. రూ.మూడు వేల కోట్లకుపైగా ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్‌లో పెట్టడంతో ఆస్పత్రుల మనుగడ కష్టమవుతోందని యాజమాన్యాలు పదేపదే మొత్తుకుంటూ నోటీసులిచ్చి సమ్మెలోకి వెళ్లినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని, సర్కారే స్వయంగా వైద్యులను రోడ్లెక్కేలా చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.భయపెట్టి అడ్డుకోలేరు..కేవలం బిల్లుల కోసం కాదు.. ఆత్మగౌరవం, హక్కుల కోసం ధర్నా చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మమ్మల్ని నాలుగో తరగతి ఉద్యోగుల కంటే హీనంగా చూస్తోంది. సమస్యలపై కూర్చుని చర్చించే అవకాశం కూడా ఇవ్వడం లేదు. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మేం అడుగుతుంటే ఆడిట్ పేరిట వేధింపులకు పాల్పడుతున్నారు. బెదిరింపులు, భయపెట్టడం ద్వారా వైద్య రంగం ముందుకు నడవదు. అంకిత భావంతోనే ముందుకు వెళ్తుందని గుర్తించాలి. మేం గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. మాకు రావాల్సిన డబ్బు ఇవ్వమనే డిమాండ్ చేస్తున్నాం. సీఈవో ఆమోదించిన రూ.670 కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలి. మిగిలిన బిల్లులను ఎప్పటిలోగా చెల్లిస్తారో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలి. – డాక్టర్ విజయ్‌కుమార్, ‘ఆశ’ అధ్యక్షుడు 40 ఏళ్లలో ఎప్పుడూ లేదు...నేను 40 ఏళ్లుగా వైద్య వృత్తిలో ఉన్నా. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. వైద్యుడిని దేవుడిగా భావించే పరిస్థితి నుంచి రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సిన దుస్థితి దాపురించడం దురదృష్టకరం. 2007లో ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టాక వైద్య రంగంలో పెను మార్పులు సంతరించుకున్నాయి. 25 శాతం మంది పేద ప్రజల ఆరోగ్య భరోసా కోసం ప్రవేశపెట్టిన పథకం క్రమంగా విస్తరించింది. పథకం అమలులో ఎంతో కీలకంగా వ్యవహరించిన నెట్వర్క్ ఆస్పత్రుల మనుగడ నేడు ఎంతో కష్టతరంగా మారింది. వైద్యులు కొవ్వొత్తిలా కరిగిపోతూ వెలుగులు పంచుతున్నారు. ప్రభుత్వం వెంటనే మా సమస్యలను పరిష్కరించాలి. – డాక్టర్ వై.రమేశ్‌బాబు, వైద్య సంఘాల జేఏసీ అధ్యక్షుడు లంచాలు ఇవ్వలేక విసిగిపోతున్నాం..ఆరోగ్యశ్రీ లాంటి ఉత్తమ విధానం అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం లేదు. ఆరోగ్యశ్రీ కార్డుతో పేదలు నేరుగా కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి ఉచితంగా చికిత్స పొందే వీలుంది. కూటమి ప్రభుత్వం ఆస్పత్రులకు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం దురదృష్టకరం. ఆస్పత్రుల యాజమాన్యాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఇలాగే వదిలేస్తే రైతులు, చేనేత కార్మికుల మాదిరిగా భావి వైద్యులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు ఒడిగట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్క బిల్లులే కాదు.. ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్‌కు అనుమతుల విషయంలోనూ ప్రభుత్వం వేధిస్తోంది. 18 రకాల అనుమతులు పొందడానికి వివిధ శాఖల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ప్రతి దగ్గర లంచాలు ఇవ్వలేక విసిగిపోతున్నాం. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. – డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి, జాతీయ కార్యదర్శి, భారత ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ సంఘాల సమాఖ్యచరిత్రలో తొలిసారి ప్రైవేట్ డాక్టర్ల ఆందోళన..సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ వైద్యులు రోడ్లెక్కి ధర్నాలు చేయడం సాధారణం. చరిత్రలో మొదటి సారిగా ప్రైవేట్ డాక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. వైద్యులు తమ జీవితాలను పణంగా పెట్టి మనుగడ సాగించలేక పోతున్నారు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రైవేట్ వైద్యులు ఆందోళనలు, సమ్మెలకు దిగారు. వారి సమస్యలు విని అర్థం చేసుకుని పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి. ప్రభుత్వం తోడుండి ముందుకు నడిపిస్తే వైద్య రంగంలో అద్భుతాలు సృష్టిస్తాం. – డాక్టర్ జయధీర్, ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు -
డేటా సెంటర్ క్రెడిట్ చౌర్యం: వైఎస్ జగన్
గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.87 వేల కోట్లు అదానీ సంస్థ పెట్టుబడి పెడుతోంది. గూగుల్‌ను తీసుకొచ్చేందుకు.. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు అదానీ సంస్థ దీన్ని చేపట్టింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్. కట్టిన తర్వాత గూగుల్ దాన్ని క్లయింట్‌గా వాడుకుంటుంది. నేను ముందుగానే చెప్పినట్లు.. సబ్ సీ కేబుల్ రావాలి.. డేటా సెంటర్ కట్టాలి.. అప్పుడు గూగుల్ వస్తుంది. ఈ డేటా సెంటర్‌కు అవసరమైన హార్డ్‌వేర్, ఇతర టెక్నాలజీని గూగుల్ సమకూరుస్తోంది. ఇలాంటి డేటా సెంటర్లను మన దేశానికి చెందిన అదానీ లాంటి గొప్ప కంపెనీ కడుతోందని గొప్పగా, గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి క్రెడిట్ చోరీ చేస్తూ చంద్రబాబు సంకుచిత బుద్ధిని ప్రదర్శించారు. రూ.87 వేల కోట్లు పెట్టుబడి ఎవరు పెడతారండి? గూగుల్‌ను తెస్తున్నారని అదానీకి థ్యాంక్యూ చెప్పాల్సిన చంద్రబాబు కనీసం క్రెడిట్ ఇచ్చారా? – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుకు క్రెడిట్ చోరీ చేయడం కొత్త కాదని.. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి సొంత గొప్పలు చెప్పుకుంటూ సంకుచిత బుద్ధితో వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఏకంగా రూ.87 వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్‌ను నెలకొల్పుతున్న అదానీ పేరును గూగుల్‌తో ఒప్పందం సమయంలో సీఎం చంద్రబాబు కనీసం ప్రస్తావించకపోవడం ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే సీఎం చంద్రబాబు గూగుల్‌తో ఒప్పందం సమయంలో అదానీ పేరెత్తలేదంటూ దుయ్యబట్టారు. డేటా సెంటర్‌ను అదానీ సంస్థే నిర్మిస్తుందని.. ఆ సంస్థకు మూడు చోట్ల భూమిని అప్పగించాలంటూ ఈనెల 4న గూగుల్ ప్రతినిధి అలెగ్జాండర్ స్మిత్ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్‌కు రాసిన లేఖే నిదర్శనమంటూ.. వైఎస్ జగన్ ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. ఉత్తరాంధ్ర దశ, దిశ మార్చాలనే లక్ష్యంతో విశాఖను అంతర్జాతీయ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ 2020 నవంబర్‌లో తమ ప్రభుత్వ హయాంలోనే 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీతో ఒప్పందం చేసుకున్నామని గుర్తు చేశారు. డేటా సెంటర్‌కు డేటా రావాలంటే సింగపూర్ నుంచి 3,900 కి.మీ. పొడవున సబ్‌సీ (సముద్ర గర్భం)లో కేబుళ్లు వేయాలని.. అందుకోసం 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి లేఖ సైతం రాశామని పేర్కొంటూ ఆ లేఖ ప్రతులను విడుదల చేశారు. నోయిడాలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో డేటా సెంటర్ ఏర్పాటుకు 4.64 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్ లీజుకు తీసుకుందంటూ 2022 అక్టోబర్ 11న టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రచురించిందని ఆ క్లిప్పింగ్‌ను చూపారు. ఈ నేపథ్యంలో డేటా సెంటర్లకు సంబంధించి గూగుల్‌తో వ్యాపార అనుబంధం ఉన్న అదానీ సంస్థతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు 2023 మే 3న శంకుస్థాపన చేశామని.. అందుకోసం 190 ఎకరాల భూమిని కూడా కేటాయించామని గుర్తు చేశారు. దాని కొనసాగింపులో భాగంగానే ఇప్పుడు 300 నుంచి వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్‌ను విస్తరిస్తున్నారని స్పష్టం చేశారు. ఇందులో క్రెడిట్ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, సింగపూర్, కేంద్ర ప్రభుత్వానికి, అదానీకి దక్కుతుందని తేల్చి చెప్పారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన యాడ్ ఏజెన్సీ తరహాలో నడుస్తోందని తూర్పారబట్టారు. సీఎం చంద్రబాబు పాలనా సామర్థ్యంలో వీక్.. క్రెడిట్ చోరీలో పీక్.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే.. అదానీ ప్రాజెక్టుకు గూగుల్ విస్తరణ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా అదానీ చేసిన కృషి, కేంద్ర ప్రభుత్వంతో పాటు సింగపూర్ ప్రభుత్వం చేసిన కృషి.. వీరందరి కృషి వల్ల దాని కొనసాగింపులో భాగంగా ఈ రోజు గూగుల్ వచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆరోజు వేసిన విత్తనమే ఈ రోజు డేటా సెంటర్ కొనసాగింపు! గూగుల్ నెలకొల్పే 1,000 మెగావాట్ల కొత్త ప్రాజెక్టు ఇంతకు ముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టుకు విస్తరణ మాత్రమే. గూగుల్, అదానీ ఎంటర్ప్రైజెస్ మధ్య డేటా సెంటర్లకు సంబంధించి వ్యాపార సంబంధాలపై 2022 అక్టోబర్ 11న టైమ్స్ ఆఫ్ ఇండియా (క్లిప్ ప్రదర్శించారు) కథనం కూడా ప్రచురించింది. నోయిడాలోని అదానీ డేటా సెంటర్లో 4.64 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని గూగుల్ లీజుకు తీసుకుందన్నది దాని సారాంశం. ఈ నేపథ్యంలో ఇక్కడ (విశాఖలో) 2023 మే 3న అదానీ డేటా సెంటర్‌కు పునాది వేశాం. సింగపూర్ నుంచి సబ్ సీ కేబుల్‌కు అంకురార్పణ కూడా అప్పుడే జరిగింది. అంతకుముందే.. అదానీకి భూములు కేటాయిస్తూ 2020 నవంబర్‌లో జీవో ఇచ్చాం. ఆ వెంటనే 2021 మార్చి 9న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. సింగపూర్ నుంచి విశాఖపట్నానికి 3,900 కిలో మీటర్ల మేర సబ్ సీ కేబుల్ ఏర్పాటుకు సహాయం అందించాలని లేఖలో కోరాం. ఆ కారిడార్ క్రియేట్ చేస్తే డేటా విశాఖకు చేరుతుంది. డేటా సెంటర్ నిర్మించేది అదానీ సంస్థే.. విశాఖలో కూడా అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే ఈ డేటా సెంటర్‌ను నిర్మిస్తున్నాయి. ఈ మేరకు గూగుల్‌కు చెందిన అలెగ్జాండర్ స్మిత్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. చంద్రబాబు అండ్ కో ఇటీవల ఢిల్లీ వెళ్లి హడావుడి చేయకముందే.. సంతకాలు చేయకముందే.. 2025 అక్టోబర్ 4న అదానీ ఇన్ఫ్రాకు చెందిన మూడు కంపెనీలకు భూమి కేటాయింపులు చేయాలని గూగుల్ సంస్థ ఏపీ ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్‌ను లేఖలో కోరింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రూ.87 వేల కోట్లు అదానీ సంస్థ పెట్టుబడి పెడుతోంది. గూగుల్‌ను తీసుకొచ్చేందుకు.. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు అదానీ సంస్థ దీన్ని చేపట్టింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్. కట్టిన తర్వాత గూగుల్ దాన్ని క్లయింట్‌గా వాడుకుంటుంది. నేను ముందుగానే చెప్పినట్లు.. సబ్ సీ కేబుల్ రావాలి.. డేటా సెంటర్ కట్టాలి.. అప్పుడు గూగుల్ వస్తుంది. ఈ డేటా సెంటర్‌కు అవసరమైన హార్డ్‌వేర్, ఇతర టెక్నాలజీని గూగుల్ సమకూరుస్తోంది. ఇలాంటి డేటా సెంటర్లను మన దేశానికి చెందిన అదానీ లాంటి గొప్ప కంపెనీ కడుతోందని గొప్పగా, గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి క్రెడిట్ చోరీ చేస్తూ చంద్రబాబు సంకుచిత బుద్ధిని ప్రదర్శించారు. రూ.87 వేల కోట్లు పెట్టుబడి ఎవరు పెడతారండి? గూగుల్‌ను తెస్తున్నారని అదానీకి థ్యాంక్యూ చెప్పాల్సిన చంద్రబాబు కనీసం క్రెడిట్ ఇచ్చారా? ఎందుకు భయపడుతున్నారు? ఆ పేర్లు చెప్పడం మొదలు పెడితే.. బ్యాక్‌గ్రౌండ్‌లో వైఎస్సార్సీపీ వస్తుంది కాబట్టి. వైఎస్సార్సీపీ హయాంలో 300 మెగావాట్ల డేటా సెంటర్‌కు బీజం పడినప్పుడే.. గూగుల్, అదానీకి డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి వ్యాపార సంబంధం ఉంది. కేంద్రం, వైఎస్సార్సీపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం, అదానీ.. ఇంతమంది కృషితో గూగుల్ తెచ్చే కార్యక్రమానికి బీజం పడిందని చెప్పటానికి చంద్రబాబు సంశయించారు. క్రెడిట్ ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదు. బాబు ముఖారవిందాన్ని చూసి వచ్చేసినట్లు బిల్డప్.. డేటా సెంటర్లో అతి ముఖ్యమైన విషయం.. సింగపూర్, విశాఖ మధ్య సబ్ సీ కేబుల్ (సముద్ర గర్భంలో కేబుల్ వ్యవస్థ) 3,900 కిలోమీటర్ల మేర నిర్మాణం. అదానీ డేటా సెంటర్ ఏర్పాటులో భాగంగా ఈ కేబుల్ వ్యవస్థను తీసుకుని రావాలని అప్పట్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, కేంద్రం, సింగపూర్ ప్రభుత్వం సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. ఈ రోజు అంతా అయిపోయిన తర్వాత చంద్రబాబు వచ్చి తన సుందర ముఖారవిందాన్ని చూసి గూగుల్ వచ్చేసినట్లు బిల్డప్ ఇస్తున్నారు. మిగిలిన వాళ్లందరి కృషిని సైడ్ లైన్ చేసేశారు. రూ.87 వేల కోట్లు పెడుతున్న అదానీ.. గూగుల్– రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో కనీసం కనిపించలేదు. 190 ఎకరాలు కేటాయింపు.. వైఎస్సార్సీపీ హయాంలోనే 300 మెగావాట్ల డేటా సెంటర్ కోసం 190 ఎకరాలు విశాఖలో కేటాయించాం. మధురవాడలో 130 ఎకరాలు, కాపులుప్పాడలో 60 ఎకరాలు ఇచ్చాం. డేటా సెంటర్ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు సబ్ సీ కేబుల్‌ను సింగపూర్ నుంచి విశాఖపట్నానికి తీసుకురావడానికి అంకురార్పణ చేశాం. ఇవాళ కొత్తగా వస్తున్న 1,000 మెగావాట్ల గూగుల్ ప్రాజెక్టుకు.. నాడు 300 మెగావాట్ల ప్రాజెక్టు ఇవ్వడమే కీలకంగా మారింది. ఏఐ భవిష్యత్తులో ప్రపంచాన్ని డామినేట్ చేసే టెక్నాలజీ. ఏఐ అయినా, క్వాంటం కంప్యూటింగ్ అయినా.. భవిష్యత్తులో గొప్ప మార్పులకు డేటా సెంటర్ నోడల్ పాయింట్‌గా ఉంటుంది. డేటా సెంటర్‌తో ఉద్యోగాలు తక్కువే అయినా.. ఎకో సిస్టమ్ తయారవుతుంది. తద్వారా గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్ వస్తాయి. కాబట్టి వీటికి మా ప్రభుత్వంలోనే నాంది పలికాం. కేవలం 300 మెగావాట్ల డేటా సెంటర్ పెడితే ఉద్యోగాలు తక్కువ వస్తాయి కాబట్టి అంతటితో మేం ఆగలేదు. ఆ రోజు అదానీతో చేసుకున్న ఒప్పందంలో 25 వేల ఉద్యోగాలు కల్పించాలని కోరాం. ఐటీ పార్క్, స్కిల్ సెంటర్, రిక్రియేషన్ సెంటర్ల ద్వారా ఉద్యోగాలు తీసుకొచ్చేలా ఒప్పందంలో పెట్టాం. క్రెడిట్ చోరీల్లో బాబు పీక్..! చంద్రబాబుకు క్రెడిట్ చోరీ చేయడం కొత్తకాదు. హైదరాబాద్ విషయంలోనూ చంద్రబాబుది సేమ్ స్టోరీ. మాదాపూర్‌లో సైబర్ టవర్స్.. ఆరు ఎకరాల స్థలంలో చిన్న ప్రాజెక్టు. దానిపేరు హైటెక్ సిటీ. నిజానికి అక్కడ ఐటీ స్పేస్ కట్టడానికి అప్పటి సీఎం ఎన్.జనార్థన్‌రెడ్డి పునాది వేశారు. చంద్రబాబు దాన్ని ఎప్పుడూ చెప్పరు. ప్రభుత్వ ఆధ్వర్యంలో దాన్ని చేపట్టేందుకు నాడు జనార్దన్‌రెడ్డి శ్రీకారం చుడితే చంద్రబాబు సీఎం అయ్యాక రద్దు చేసి ప్రైవేటుకు ఇచ్చేశారు. దాంతో హైదరాబాద్ మొత్తం నేనే కట్టానని బిల్డప్ ఇస్తున్నారు. ⇒ 2004లో చంద్రబాబు ఓడిపోయారు. ఆ తర్వాత హైదరాబాద్ ఆయన చేతుల్లో లేదు. 2004, 2009లో వైఎస్సార్ గెలిచారు. తర్వాత మరో రెండు సార్లు కేసీఆర్ గెలిచారు. ఏకంగా 20 ఏళ్లపాటు చంద్రబాబుకి, హైదరాబాద్‌కు ఎలాంటి సంబంధం లేదు. అయినా 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అంతా తనదే అంటారు. ఇదీ చంద్రబాబు బిల్డప్. ⇒ అయ్యా చంద్రబాబూ.. ఆరు ఎకరాల్లో 1.40 లక్షల చదరపు అడుగుల్లో చిన్న బిల్డింగ్ కడితే.. హైటెక్ సిటీ అని పేరు పెడితే.. దానితోనే అభివృద్ధి చెందింది అనుకోవడం మూర్ఖత్వం. దాని తర్వాత నువ్వు వెళ్లిపోయావు. 2004లో రాజశేఖరరెడ్డి సీఎం అయ్యారు. ఆ తర్వాత ఓఆర్ఆర్ ఫేజ్–1ను 126 కి.మీ. ప్రాజెక్టును 2006లో ప్రారంభించి 2012లో పూర్తిచేశారు. అది హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చేసింది. పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే 11.6 కి.మీ. ఫ్లైఓవర్.. దేశంలోనే అతి పొడవైనది. దీనిని అక్టోబర్ 2005లో ప్రారంభించి 2009 అక్టోబర్ 19న పూర్తి చేశారు. ⇒ జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మార్చి 2005లో ప్రారంభిస్తే 23 మార్చి 2008లో పూర్తి చేశారు. ఇవన్నీ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించి పూర్తి చేసినవే. ⇒ చంద్రబాబు దిగిపోయే నాటికి 2003–04లో ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ, అనుబంధ ఎక్స్‌పోర్ట్స్ రూ.5,660 కోట్లు మాత్రమే. వైఎస్సార్ సీఎం అయ్యాక 2004–09లో ఐటీ, అనుబంధ రంగాల ఎగుమతులు రూ.32,509 కోట్లకు చేరాయి. ఆయన అవన్నీ పూర్తి చేసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంతోనే ఇదంతా జరిగింది. ⇒ వైఎస్సార్ రెండో సారి గెలిచి సీఎం అయిన కొద్ది నెలలకే చనిపోయినా.. ఆయన గెలిపించి ఇచ్చిన ప్రభుత్వం కొనసాగింపులో భాగంగా 2013–14లో ఐటీ ఎక్స్‌పోర్టులు రూ.57 వేల కోట్లకు చేరాయి. కానీ, చంద్రబాబు హైదరాబాద్‌ను నేనే కట్టేశా... ఐటీ అంటే నేనే అని చెప్పుకుంటున్న పరిస్థితి..! ఈ వ్యత్యాసం చూస్తే అసలు విషయం తెలుస్తుంది. నాన్న తర్వాత కేసీఆర్ రెండు టెర్మ్‌లు పాలించారు. ఆయన కూడా గొప్పగా వైఎస్సార్ ఆపిన దగ్గర నుంచి ప్రారంభించి గొప్పగా పాలించారు. తద్వారా హైదరాబాద్ ఐటీలో టాప్‌లోకి వెళ్లింది. ⇒ చంద్రబాబు హయాంలో రూ.5,660 కోట్లు దగ్గర నుంచి.. ఈరోజు తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.2 లక్షల కోట్లకు చేరాయి. 20 ఏళ్లలో ఇంత జరిగితే.. మొత్తం హైదరాబాద్ నేనే కట్టా అంటే ఎలా? చంద్రబాబుకు ఇది కొత్తకాదు. పబ్లిసిటీ స్టంట్స్ చేస్తారు. వేరేవాళ్లకు ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ వాళ్లకు ఇవ్వకపోవడం చంద్రబాబుకు ఉన్న దుర్మార్గపు నైజం.అభివృద్ధికి విజన్ ఉండాలి.. మా హయాంలో అదానీ డేటా సెంటర్ తద్వారా వచ్చిన గూగుల్, ఇన్ఫోసిస్, ఇనార్బిట్ మాల్, కైలాసగిరి సైన్స్ మ్యూజియం, రిషికొండ వద్ద టీటీడీ దేవాలయం, ఎనీ్టపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్.. ఇవన్నీ కొన్ని ప్రాజెక్టులు. విశాఖపట్నం నుంచి ఎయిర్ పోర్టుతో పాటు మూలపేట పోర్టుకు అనుసంధానిస్తూ రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఈ కారిడార్ ఏర్పాటుకు అప్పటి కేంద్ర మంత్రి గడ్కరీని ఒప్పించి మరీ స్టేట్మెంట్ ఇప్పించాం. అదీ విజన్ అంటే. ఇవన్నీ పూర్తయితే పురోగతి అనేది కనిపిస్తుంది. నంబర్స్ కనిపిస్తాయి. మా హయాంలో దేవుడి దయతో, ప్రజల ఆశీర్వాదాలతో రెండేళ్లు కోవిడ్ ఉన్నా గొప్పగా అభివృద్ధి, సేవలందించాం. గొప్ప సంస్కరణలకు శ్రీకారం.. మా హయాంలో నాడు–నేడు ద్వారా స్కూళ్లు మార్చాం. డిజిటల్ క్లాస్ రూమ్స్, టోఫెల్ క్లాస్‌లు, 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, సీబీఎస్ఈ కాదు ఐబీ సిలబస్ తీసుకువచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. విద్య, వైద్యం, వ్యవసాయంలో అనూహ్య మార్పులు తెచ్చాం. గ్రామాల్లో పౌర సేవలను గడప వద్దకు తీసుకువచ్చాం. గవర్నమెంట్ సేవల్లో పారదర్శకత ఉండదనే భావన లేకుండా చేశాం. ప్రభుత్వ సేవలు లంచాలు లేకుండా పొందగలమనే అభిప్రాయం ప్రజల్లో స్వచ్ఛందంగా నిరూపించగలిగాం. గొప్ప సంస్కరణలు తీసుకువచ్చాం. అందుకే సంతోషంగా, గర్వంగా ఉన్నాం. మూడేళ్లలో ఎవరూ చేయలేని గొప్ప కార్యక్రమాలు చేయగలిగాం. అందుకే ఇప్పటికీ చిరునవ్వుతో మా పార్టీ క్యాడర్ ఏ గడప వద్దకు అయినా వెళ్లగలుగుతున్నారు. మహిళా సాధికారత, సంస్కరణలు మాకు శ్రీరామ రక్ష. అందుకే ప్రజలను మమ్మల్ని ఇప్పటికీ ఆత్మీయంగా ఆదరిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో విశాఖను నిలబెట్టాలని..ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విశాఖ కీలక కేంద్రం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలను తలదన్నే రీతిలో ఏపీ ఉండాలంటే విశాఖను అభివృద్ధి చేయాలని తలపెట్టాం. అందుకే ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడుగులు వేశాం. అందులో భాగంగా 2,700 ఎకరాల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేశాం. భూ సేకరణకు, ఆర్‌అండ్‌ఆర్‌కు రూ.900 కోట్లు ఖర్చు చేశాం. గతంలో చంద్రబాబు ఈ ఎయిర్‌పోర్టుకు కేవలం 377 ఎకరాలు మాత్రమే భూమిని సేకరించారు. వైఎస్సార్ సీపీ హయాంలో వేగంగా చర్యలు చేపట్టి 30 శాతం పనులు పూర్తి చేశాం. మరో ఏడాదికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. అంతే కాదు.. శ్రీకాకుళంలో మూలపేట పోర్టు ద్వారా ఉత్తరాంధ్ర దశ, దిశ మార్చే ప్రయత్నం చేశాం. భూ సేకరణతో పాటు అన్ని అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించి 30 శాతం పనులు పూర్తి చేశాం. విజయనగరంలో మెడికల్ కాలేజీ కడితే 3 బ్యాచ్‌లు క్లాసులు, కోర్సులు కూడా కంప్లీట్ అయ్యాయి. పాడేరు మెడికల్ కాలేజీలో క్లాసులు స్టార్ట్ అయ్యాయి. పార్వతీపురం, నర్సీపట్నం మెడికల్ కాలేజీల పనులు జరుగుతున్నాయి. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు రూ.100 కోట్లు వెచ్చించాం. రూ.600 కోట్లు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేజ్ వాటర్ తీసుకొచ్చి డయాలసిస్ రోగులకు శాశ్వత పరిష్కారం చూపించాం. ⇒ సీతంపేట, పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు దాదాపు పూర్తి చేశాం. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ పూర్తయ్యే దశలో ఉన్నాయి. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పనులు జరుగుతున్నాయి. నక్కపల్లిలో ఇండ్రస్టియల్ హబ్, అన్నవరంలో ఒబెరాయ్ హోటల్ రిసార్ట్ తీసుకొచ్చాం. డెస్టినేషన్‌గా విశాఖపట్నం ఉండాలంటే 5 స్టార్ హోటళ్లు కాదు.. ఏకంగా ఫైవ్ స్టార్ రిసార్టులు ఉండాలని సంకల్పించాం. ⇒ రుషికొండ హై ఎండ్ టూరిజం రిసార్ట్ నిర్మించాం. అదొక మాన్యుమెంట్ బిల్డింగ్. అమరావతిలో చదరపు అడుగకు రూ.10 వేలు పెట్టి.. కట్టిందే కడుతున్నారు. డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. ఎన్నిసార్లు కడతారో అర్థం కాదు. అదే సెక్రటేరియట్ రెండుసార్లు కడతారు.. అదే అసెంబ్లీ రెండు సార్లు కడతారు. డబ్బులు వృథా చేస్తుంటే ఎవరూ ప్రశ్నించరు. ఎందుకంటే.. ఎల్లో మీడియా మొత్తం వాళ్లే. అంతా దోచుకోవడం, పంచుకోవడం తినుకోవడం! బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో సైతం ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ ఉన్న ఫ్లాట్లు నిర్మాణ ఖర్చు చదరపు అడుగుకు రూ.4500 దాటదు. కానీ అమరావతిలో రూ.10 వేలు పెట్టి కడుతున్నారు. ఎవడూ స్కామ్ అనడు. ఎందుకంటే స్కాములో వీళ్లంతా భాగస్వాములే.అదానీ డేటా సెంటర్‌కు కొనసాగింపే గూగుల్‘‘డేటా సెంటర్‌ను మేం ఎక్కడా వ్యతిరేకించడం లేదు. మద్దతు ఇస్తున్నాం. మేం విత్తనం వేశాం కాబట్టే డేటా సెంటర్ ఏర్పాటవుతోంది. అదానీ డేటా సెంటర్‌కు కొనసాగింపే గూగుల్ డేటా సెంటర్. ప్రస్తుతం మనం ఏఐ యుగం, క్వాంటం కంప్యూటింగ్ యుగాల్లోకి పోతున్నాం. వీటన్నింటికీ హబ్ అనేది డేటా సెంటర్. డేటా సెంటర్ ఉంటేనే ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. పవర్ రిక్వైర్మెంట్, వాటర్ గజిలింగ్ (ఎక్కువ విద్యుత్, ఎక్కువ నీటి వినియోగం) లాంటి కొన్ని సమస్యలు వచ్చినా సర్టైన్ కెపాసిటీ బిల్డ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. అప్పటి దాకా ప్రతి ఒక్కరూ దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. డేటా సెంటర్‌తోపాటు ఐటీ స్పేస్ కూడా కట్టాలి.. తద్వారా 25 వేల ఉద్యోగాలు ఇవ్వాలని మేం ఒప్పందంలో పెట్టగలిగాం. నిర్దేశించిన సమయంలోగా ఇవన్నీ కట్టాలి, రావాలి అని ఒప్పందంలో పొందుపరిచాం. ఇది వీళ్లు చేయగలిగితే ఇంకా మెరుగ్గా ఎకో సిస్టమ్ అనేది వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది’ అని వైఎస్ జగన్ ఒక ప్రశ్నకు సమాధానంగా వివరించారు. -
పేదల గుండె ఘోష పట్టని సర్కార్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది నిరుపేదల గుండె ఘోష చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయి చికిత్సలు అందక గుండె, కిడ్నీ, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పరిస్థితి దిన దిన గండంగా మారింది. ఆస్పత్రుల్లో ఉచిత చికిత్సలు అందక, చేతి నుంచి డబ్బు కట్టి వైద్యం చేయించుకునే స్తోమత లేక బాధితులు మందులతో కాలం వెళ్లదీస్తున్నారు. రూ.3 వేల కోట్లకు పైగా బిల్లులను ప్రభుత్వం బకాయి పెట్టడంతో నెట్వర్క్ ఆస్పత్రులు ఈ నెల 10వ తేదీ నుంచి సేవలు పూర్తి స్థాయిలో నిలిపేసిన విషయం తెలిసిందే.గుండె జబ్బు బాధితులకు బైపాస్ సర్జరీలు, స్టెంట్లు, కిడ్నీ బాధితులకు డయాలసిస్, క్యాన్సర్ రోగులకు కీమో, రేడియేషన్ థెరపీలు నిలిపేశారు. డబ్బు కడితేనే వైద్యం చేస్తాం.. లేదంటే ప్రభుత్వాస్పత్రులకు వెళ్లిపోండని తరిమేస్తున్నారు. ఈ క్రమంలో నిరుపేద, మధ్యతరగతి ప్రజల పరిస్థితి కడు దయనీయంగా మారింది. ఇక ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైన ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశ) గురువారం విజయవాడలో ధర్నా చేపట్టనుంది. ఈ ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆస్పత్రుల యజమానులు, వైద్యులు, ఇతర సిబ్బంది హాజరుకానున్నారు. ఏపీ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్, ఐఎంఏ, ఏపీ జూడా, ప్రభుత్వ వైద్యుల సంఘాలు సైతం ఆశ ధర్నాకు సంఘీభావం ప్రకటించినట్టు తెలిసింది. బేరసారాలతో మభ్యపెట్టే యత్నం! ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టినప్పటి నుంచి నెట్వర్క్ ఆస్పత్రులు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగిన దాఖలాలు ఇదివరకు లేవు. చంద్రబాబు గద్దెనెక్కిన 17 నెలల కాలంలో రెండు పర్యాయాలు నెట్వర్క్ ఆస్పత్రులు సేవలు నిలిపేసి సమ్మెబాట పట్టాయి. అంతేకాకుండా దేశంలోని ఏ రాష్ట్ర చరిత్రలో లేనట్టుగా ప్రభుత్వం నుంచి బకాయిలు రాబట్టడం కోసం ఇప్పుడు ఏకంగా ధర్నాకు దిగుతున్నారు. దీంతో జాతీయ స్థాయిలో పరువు పోతుందని గ్రహించిన ప్రభుత్వం ‘ఆశ’ ప్రతినిధులతో బేరసారాలకు దిగింది.మంగళవారం రాత్రి వైద్య శాఖ ఉన్నతాధికారులు ‘ఆశ’ ప్రతినిధులతో వర్చువల్ సమావేశం నిర్వహించి బకాయిల చెల్లింపుపై బేరసారాలు ఆడారు. ‘ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఈ నేపథ్యంలో రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్లు ఇప్పుడు ఇస్తాం. నవంబర్ నెలలో మరికొంత మొత్తం ఇస్తాం’ అంటూ బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే ప్రభుత్వం చేసిన ప్రయత్నం విఫలమైంది. ‘ఇప్పటికే రూ.3 వేల కోట్ల పైబడి బకాయి పెట్టారు. అందులో రూ.250 కోట్లు మాత్రమే ఇస్తాం అంటున్నారు. క్లెయిమ్‌లు ప్రాసెస్ చేసి, ఆస్పత్రులకు జమ చేయడం కోసం సీఎఫ్ఎంఎస్లో సిద్ధంగా ఉన్న బిల్లులన్నీ వెంటనే విడుదల చేయండి. మిగిలిన బిల్లులు ఎప్పటిలోగా క్లియర్ చేస్తారో చెప్పండి. అప్పుడే మేం వెనక్కు తగ్గుతాం’ అని ‘ఆశ’ ప్రతినిధులు తేల్చి చెప్పినట్టు తెలిసింది.మా గోడు ప్రభుత్వం వింటుందని ఆశిస్తున్నాం నెల రోజుల పైబడి మేము సమ్మె చేస్తున్నాం. పూర్తి స్థాయిలో వైద్య సేవలు నిలిపేసి రెండు వారాలు అయింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన లేకపోవడంతో ధర్నాకు సిద్ధం అయ్యాం. ధర్నా అనంతరం అయినా ప్రభుత్వానికి మా గోడు వినిపిస్తుందని ఆశిస్తున్నాం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీలైనంత వేగంగా మా సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. – డాక్టర్ విజయ్‌కుమార్, అధ్యక్షుడు, ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ -
బిల్లుల కోసం రోడ్డెక్కిన కాంట్రాక్టర్లు
సాక్షి, అమరావతి: జలజీవన్ మిషన్ కార్యక్రమం కింద గ్రామాల్లో ఇంటింటికీ తాగునీటి కుళాయిలు ఏర్పాటుచేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు బుధవారం విజయవాడ గొల్లపూడిలోని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) ఈఎన్సీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం ఒకట్రెండు కార్పొరేట్ కాంట్రాక్టు సంస్థలకే ప్రాధాన్యతనిస్తూ, వందలాది చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించకుండా పక్షపాత ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు.ఈ ఏడాది ఫిబ్రవరి ఏప్రిల్ నెలల్లో రెండు విడతల్లో రూ.322 కోట్లు బిల్లులు చెల్లించినప్పటికీ, అందులో రూ.220 కోట్లు కేవలం బడా కాంట్రాక్టు సంస్థలకు చెల్లించి.. చిన్న కాంట్రాక్టర్లకు మాత్రం కేవలం 15 శాతం చొప్పున చెల్లించారని, దాదాపు 750 మందికి కేవలం రూ.87 కోట్లు మాత్రం చెల్లించారని మండిపడ్డారు. బిల్లుల చెల్లింపులో చిన్న కాంట్రాక్టర్ల పట్ల వివక్ష చూపడం మాని ప్రభుత్వం అందరికీ సమన్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు నల్లబ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అధిక శాతం బకాయిలు చిన్న కాంట్రాక్టర్లవే.. కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో ఇంటింటికీ కుళాయిల ఏర్పాటుకు రూ.10 లక్షల నుంచి రూ.రెండు కోట్ల మధ్య విలువ ఉండే పనులు చేసిన వందలాది మంది కాంటాక్టర్లకు రూ.826 కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉంది. అలాగే, వందల కోట్ల విలువతో వాటర్ గ్రిడ్ పనులు చేసిన నాలుగైదు కార్పొరేట్ కాంట్రాక్టు సంస్థలకు మాత్రం రూ.130 కోట్లు మించి బిల్లులు పెండింగ్‌లో లేవని చిన్న కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అయినా చిన్న కాంట్రాక్టర్లను పక్కనపెట్టి.. అప్పటికప్పుడు బిల్లులు నమోదు చేసిన బడా సంస్థల బిల్లులు చెల్లించారని విమర్శిస్తున్నారు.ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల కోసం గతనెల 3న రూ.152 కోట్ల విడుదలకు బీఆర్ఓ (బడ్జెట్ రిలీజ్ ఆర్డర్) జారీచేయగా, చిన్న కాంట్రాక్టర్లందరూ కలిసి ముందు పనులు చేసిన వారికి ముందుగా బిల్లులు చెల్లించాలని కోరారు. అయితే, బీఆర్ఓ విడుదల తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వం ఆ నిధులు విడుదల చేయలేదు. తాజాగా.. వారం రోజుల క్రితం రూ.150 కోట్ల విడుదలకు ఆర్థిక శాఖ మరో బీఆర్ఓ జారీచేసింది. దీంతో.. నిధుల విడుదలకు ప్రభుత్వం జారీచేసిన రెండు బీఆర్‌ఓల మొత్తం రూ.302 కోట్లను వెంటనే విడుదలచేసి ముందు పనులు చేసిన వారికి ముందుగా బిల్లులు చెల్లించాలని చిన్న కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. వాటర్ గ్రిడ్ పేరిట భారీ ప్యాకేజీలతో ప్రభుత్వం టెండర్లు పిలుస్తుండడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని చిన్న కాంట్రాక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.


