వైఎస్సార్‌సీపీ నేతలు
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
సాక్షి, అమరావతి: పొరుగువారిని ప్రేమించడం, సహాయం చేయడం, కరుణ, దయ, క్షమ గుణాలను కలిగి ఉండాలన్న ఏసుక్రీస్తు బోధనలు అందరూ అనుసరించాలని వక్తలు చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పార్థనలు చేసిన అనంతరం మాజీ మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, లేళ్ళ అప్పిరెడ్డితోపాటు కొమ్మూరి కనకారావు తదితరులు కేక్ కట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదల పట్ల అపారమైన ప్రేమ కలిగి ఉన్నారని చెప్పారు. అందువల్లే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో ఆరి్థక వనరులు సహకరించపోయినా, కరోనా వంటి పెనువిపత్తు వచి్చనా ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించారని చెప్పారు. నందిగం సురేష్ మాట్లాడుతూ చంద్రబాబు 18 నెలల అధ్వాన పాలన చూసిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఇవాళ వైఎస్ జగన్ అధికారంలో ఉంటే బాగుండేదని చర్చించుకుంటోందని తెలిపారు.
అంబటి రాంబాబు మాట్లాడుతూ ఏసుక్రీస్తు జననానికి విశేష ప్రాముఖ్యత ఉందన్నారు. మానవసేవ చేయడమే దేవునికి సేవ చేయడంగా భావించి క్రైస్తవ మిషనరీలు మన దేశంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయని వివరించారు. మొండితోక అరుణ్‌కుమార్, అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అన్ని మతాలను గౌరవిస్తూ కలిసిమెలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పార్టీ నేతలు ఎ.నారాయణమూర్తి, నత్తా యోనారాజు, పానుగంటి చైతన్య, ఎ.రవిచంద్ర, బూదాల శ్రీను, ముదిగొండ ప్రకాశ్, దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎం.మనోహర్‌రెడ్డి, మల్లవరపు సంధ్యారాణి, కాలే పుల్లారావు, బేతంపూడి రాజేంద్ర, నూతక్కి జోషి, పాస్టర్లు షారోన్, ఎబినేజర్, అబ్రహాం, జె.యెషయ్య పాల్గొన్నారు.


