breaking news
Semi Christamas
-
సెమీ క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా వైఎస్ జగన్ కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ మేనత్త వైఎస్ విమలమ్మ, వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ బి.జాన్ వెస్లీ, పాస్టర్ టి.ఎస్.ఆర్ ప్రసాద్ రెడ్డి (కవితం), పాస్టర్ జీవన్ కుమార్ (ఏపీపీఎఫ్, ఏలూరు), బిషప్ రెబ్బ ఇమ్మాన్యుయేల్ (రేపల్లె), రెవరెండ్ వి.కే.జేమ్స్ కుంపట్ల (ఏడిఎఫ్, విశాఖపట్నం), రెవరెండ్ ఎన్.ఐ.సోలోమన్ రాజు (వరల్డ్ విజన్, అవనిగడ్డ), రెవరెండ్ డి.రాజశేఖర్ (ఎన్బిఎమ్, నెల్లూరు), రెవరెండ్ ఎం.సుధాకర్ పాల్ (సీఎంసీ, వైజాగ్), రెవరెండ్ విజయ్ కిషోర్ (కడప), రెవరెండ్ మనోజ్ బాబు (తణుకు), బిషప్ శ్రావణ్ కుమార్ (కోనసీమ జిల్లా), పాస్టర్ శ్రావణ్ (తూర్పు గోదావరి), పాస్టర్ గెరా హనోక్ (ఏఐసీసీ ప్రెసిడెంట్), బ్రదర్ కమలాకర్ (ఏఐసీసీ, విజయవాడ), పాస్టర్ కే.ఎలిషా (గణపవరం), పాస్టర్ జాషువా మూర్తి (విజయవాడ), పాస్టర్ మోజెస్ (విజయవాడ), జేసు రత్నాకర్ (మెజిస్ట్రేట్, గుంటూరు), బ్రదర్ వై.ప్రసాద్ బాబు (విశాఖపట్నం) పాల్గొన్నారు. -
ఎల్లుండి సీఎం జగన్ విజయవాడ పర్యటన
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎల్లుండి (బుధవారం) విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకల్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సీఎం జగన్ హాజరుకానున్నారు. -
చిన్నారుల సెమీ క్రిస్మస్
పెదకాకాని: మండల పరిధిలోని నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వీవా స్కూల్లో శనివారం ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుక నిర్వహించారు. చిన్నారులు ఏసు జీవిత కథను తెలిపే ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రకరకాల వేషధారణతో చిన్నారులు ఆకట్టుకున్నారు. తెనాలి అంబేడ్కర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జంగం సుధీర్, కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, ప్రిన్సిపాల్ డాక్టర్ వై.మల్లిఖార్జునరెడ్డి, వీవా స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ సీటీ జోషి అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.