breaking news
Mancherial District News
-
నీట్లో విద్యార్థి ప్రతిభ
లక్సెట్టిపేట: నీట్ పరీక్ష ఫలితాల్లో మండలంలోని బలరావుపేట గ్రామానికి చెందిన కందుల కుషీంద్రవర్మ ప్రతిభ కనబర్చి రాష్టస్థాయి 59 ర్యాంకు సాధించాడు. పదో తరగతి వరకు పట్టణంలోని గుడ్ షెప్పర్డ్ పాఠశాల, చైతన్య కళాశాలలో ఇంటర్ చదివి మంచి మార్కులు సాధించాడు. ఈయన తండ్రి ప్రవీణ్‌కుమార్ ప్రైవేటు టీచర్, తల్లి సుమలత గృహిణి. కుమారుడు నీట్లో ర్యాంక్ సాధించడంపై పలువురు అభినందించారు. గుడుంబా పట్టివేతజైపూర్: బైక్‌పై గుడుంబా తరలిస్తుండగా ఒకరు పోలీసులకు పట్టుబడ్డాడు. భీమారం మండల కేంద్రంలో ఆరెపల్లి క్రాస్ రోడ్డు వద్ద గురువారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. కొత్తూర్ మండలం లంబాడితండాకు చెందిన ధరావత్ శంకర్ బైక్‌పై 30లీటర్ల గుడుంబా తరలిస్తుండగా పట్టుబడ్డాడు. పోలీసులకు చిక్కకుండా ప్రయత్నించగా జోడువాగు వద్ద శంకర్‌ను అదుపులో తీసుకుని బైక్, గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్వేత తెలిపారు. ఆయనపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బాసరలో ముగిసిన గురుపౌర్ణమి వేడుకలుబాసర: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో గురుపౌర్ణమి వేడుకలు గురువారంతో ముగిశాయి. వ్యాసమహర్షి, సరస్వతి, వ హాంకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు అర్చకులు పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ ఉన్నారు. -
ఎలక్ట్రానిక్స్ గోదాంలో చోరీ
నిర్మల్‌టౌన్: జిల్లాకేంద్రంలోని మోహన్ ఎలక్ట్రానిక్స్ గోదాంలో జరిగిన దొంగతనాన్ని నిర్మల్ పోలీసులు ఛేదించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం రూరల్ సీఐ కృష్ణ వివరాలు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా గోదాంలోని ఎలక్ట్రానిక్ వస్తువులు కనిపించకుండా పోవడాన్ని యజమాని వెంకటరమణ గుర్తించారు. దీంతో ఆడిట్ నిర్వహించారు. అనుమానాస్పదంగా పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నవత్ శ్రీకాంత్, జిందాడే సచిన్, సాబ్లే జగదీశ్వర్, కూసులే నవీన్‌ను విచారించగా వారు దొంగతనానికి పాల్పడ్డట్లు ఒప్పుకున్నారు. దొంగతనం చేసిన వస్తువులను తరలించేందుకు ఆటో డ్రైవర్ సయ్యద్ ఇమ్రాన్ సహాయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక ఫ్రిడ్జ్, గీజర్, సామ్సంగ్ టీవీ, ఆరు కూలర్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఇందులో ఎస్సై సంజీవ్ ఉన్నారు. కరీంనగర్ కోర్టుకు హాజరైన అఘోరి శ్రీనివాస్కరీంనగర్క్రైం: ఉమ్మడి రాష్ట్రంలో హల్చల్ చేసిన అఘోరి శ్రీనివాస్ గురువారం కరీంనగర్ కోర్టుకు హాజరయ్యాడు. కొత్తపల్లి పోలీసులు పీటీ వారెంటుపై చర్లపల్లి జైలు నుంచి తీసుకొచ్చి కరీంనగర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషాన్‌పల్లికు చెందిన శ్రీనివాస్‌తో జిల్లాకు చెందిన ఓ మహిళకు నవంబర్ 2024లో పరిచయం ఏర్పడింది. శ్రీనివాస్ తనపై లైంగిక దాడి జరిపాడని, జనవరి 2025లో కొండగట్టు తీసుకెళ్లి తాళికట్టాడని, రూ.3 లక్షలు తీసుకున్నాడని సదరు మహిళ కొత్తపల్లి పోలీసులకు 2025 ఏప్రిల్ 28న ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీనివాస్‌పై పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చర్లపల్లి జైల్లో ఉన్న శ్రీనివాస్‌ను పీటీ వారెంట్ ద్వారా కరీంనగర్ కోర్టులో హాజరు పర్చారు. శ్రీనివాస్‌కు కోర్టు ఈ నెల 23వరకు రిమాండ్ విధించింది. అనంతరం శ్రీనివాస్‌ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. లోన్లు ఇప్పిస్తానని మోసగించిన వ్యక్తి రిమాండ్ఆదిలాబాద్టౌన్: లోన్లు ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకుని మోసగించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. పోలీసు స్టేషన్లో గురువారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని భుక్తాపూర్ రూరల్ డెవలప్మెంట్ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీకి చెందిన రమేశ్ రూ.2 లక్షల రుణం ఇప్పిస్తానని ప్రజల వద్ద రూ.25 వేలు తీసుకుని మోసం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
ఉమ్మడి కుటుంబం..ఆత్మీయం
తాంసి: మండల కేంద్రానికి చెందిన జానకొండ శ్రీకాంత్ ఉమ్మడి కుటుంబంగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నర్సయ్య–లక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమార్తె వివాహం అనంతరం కొన్నేళ్లకు తండ్రి నర్సయ్య మృతిచెందాడు. పెద్ద కుమారుడు శ్రీకాంత్ అన్నీతానై కుటుంబ బాధ్యతలను తనపై వేసుకుని ముందుకు నడిపించాడు. కుటుంబం కోసం వ్యాపారం ప్రారంభించి, తమ్ముడు అశోక్‌ను ఉన్నతంగా చదివించాడు. అన్న కష్టానికి తగ్గట్టుగా పట్టుదలతో చదివి పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం సాత్నాల మండలంలో విధులు నిర్వహిస్తున్నాడు. సివిల్స్‌కు సన్నద్ధమై ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. ఇటీవల గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయి 250వ ర్యాంక్, గ్రూప్–3లో 417 ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం తల్లితోపాటు వివాహమైనప్పటికి సోదరులు ఇద్దరు ఉమ్మడిగా ఉంటున్నారు. నలుగురు పిల్లలు, ఇద్దరు భార్యాభర్తలు, తల్లి మొత్తం తొమ్మిది మంది ఒకే చోట ఉంటున్నారు. -
హోరాహోరీగా బాలికల ఫుట్‌బాల్ పోటీలు
● సెమీస్‌కు నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి జట్లు రామకృష్ణాపూర్: పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్రస్థాయి బాలికల జూనియర్స్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. వర్షం కారణంగా కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ ఉదయం లీగ్ కమ్ నాకౌట్ పోటీలు నిర్వహించారు. మధ్యాహ సమయంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఉత్సాహంగా సాగాయి. మహబూబ్‌నగర్–నల్గొండ జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రెండు జట్లు దీటుగా తలపడ్డాయి. నిర్ణీత సమయం ముగిసేసరికి ఏ ఒక్క జట్టు కూడా గోల్ సాధించకపోవడంతో మ్యాచ్ టై గా ముగిసింది. దీంతో పెనాల్టీ షూటౌట్లు నిర్వహించారు. ఇందులో నల్గొండ జట్టు 2–1 తేడాతో మహబూబ్‌నగర్‌పై గెలిచి సెమీస్‌కు చేరింది. మరో క్వార్టర్ ఫైనల్లో వనపర్తి–ఖమ్మం జట్లు తలపడగా 0–1 తేడాతో ఖమ్మం గెలుపొందింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో నిజామాబాద్–గద్వాల్ జట్లు తలపడగా 7–1 గోల్స్‌తో నిజామాబాద్ గెలుపొందింది. ఇక ఆతిథ్య ఆదిలాబాద్ జట్టుకు క్వార్టర్ ఫైనల్స్‌లో నిరాశే ఎదురైంది. రంగారెడ్డి–ఆదిలాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 4–0 గోల్స్‌తో రంగారెడ్డి గెలిచి సెమీస్‌కు చేరింది. శుక్రవారం ఉదయం మొదటి సెమీఫైనల్ మ్యాచ్ నల్గొండ–నిజామాబాద్‌ల మధ్య, రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఖమ్మం–రంగారెడ్డి జట్ల మధ్య జరుగనుంది. -
నకిలీ పోలీసుల ముఠా అరెస్ట్
● అదుపులో నలుగురు, పరారీలో ఒకరు ● కారు, బైక్, ఆటో బంగారు, వెండి స్వాధీనం ఇచ్చోడ: నకిలీ పోలీసుల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇచ్చోడ సీఐ కార్యాలయంలో గురువారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా నిడమనూర్ గ్రామానికి చెందిన షేక్ ఇర్ఫాన్ (పశువుల వ్యాపారి), చింతల చెరువు ప్రశాంత్(లారీ క్లీనర్), బదనపూరి అజయ్(మోటార్ మెకానిక్) బొప్పరం సుధాకర్(సెల్ పాయింట్), ఒట్కురి నరేష్ (పెట్రోల్ బంక్ ఉద్యోగి) ఐదుగురు ముఠాగా ఏర్పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ఎస్సై పేరు చెప్పి వివిధప్రాంతాల్లో బంగారు వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. గతనెల 27న రంగారెడ్డి జిల్లాకు చెందిన కొండోజు నరసింహచారికి ఫోన్ చేసి ఇచ్చోడ ఎస్సై నర్సిరెడ్డి అని పరిచయం చేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం 11 గ్రాముల బంగారం కొన్నారని కేసు కాకుండా ఉండాలంటే గూగుల్ పే ద్వారా డబ్బులు పంపాలని డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన నరసింహచారి తనకు ఫోన్ చేసిన వ్యక్తి నకిలీ ఎస్సైగా గుర్తించి ఇచ్చోడ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈనెల 4న హైదరాబాద్‌కు చెందిన రుద్రంగి కిరణ్ కుమార్‌కు ఫోన్ చేసి ఇచ్చోడ ఎస్సై నర్సిరెడ్డి మాట్లాడుతున్నట్లు చెప్పి, దొంగ బంగారం కొన్నారని బెదిరించి సదరు వ్యక్తి నుంచి రూ1.50 లక్షలు వసూళ్లు చేశారు. అనుమానం వచ్చిన కిరణ్‌కుమార్ సైతం ఇచ్చోడలో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నకిలీ ఎస్సై అంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యుల్లో నలుగురిని మండల కేంద్రంలో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఒట్కురి నరేశ్ పరారీలో ఉన్నారు. వీరిపై గతంలో నల్గొండ, హుజుర్నగర్ పోలీస్టేషన్లలో కేసులు నమోదై ఉన్నవి. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చైన్నె నగరాల్లోని ఆభరణాల షాపుల యజమానులకు ఫోన్ చేసి బెదిరించి దాదాపు రూ.18 లక్షలు వసూలు చేసి జల్సాలకు వాడుకున్నట్లు తేలింది. నిందితుల నుంచి కారు, ఆటో, బంగారు, వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్, ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఎస్సై పురుషోత్తం పాల్గొన్నారు. -
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
ఇంద్రవెల్లి: మద్యం మత్తులో యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఇ.సాయన్న తెలిపారు. ఎస్సై ఇ.సాయన్న, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలో దనోరా(బి) పంచాయతీ పరిధి ఇన్కార్గూడకు చెందిన ఎల్నారే అనిల్, ఉమ దంపతులకు ఏకై క కుమారుడు శుభం(23). డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఉంటున్నాడు. గత కొన్నిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 7న మద్యం తాగి ఇంటికొచ్చిన కుమారుడిని రోజు మద్యం ఎందుకు తాగుతున్నానవని తల్లి ఉమ మందలించింది. క్షణికావేశంతో వ్యవసాయ చేనుకు వెళ్లి గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఇంటికి వచ్చి చెప్పాడు. గ్రామస్తుల సహాయంతో ఓ ప్రైవేట్ వాహనంలో ఆదిలాబాద్‌లోని ప్రైవేట్ అస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని ఒకరు.. సోన్: అప్పుల బాధ, భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం చెందిన ఒకరు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని న్యూవెల్మల్ గ్రామానికి చెందిన పట్టం పోశెట్టి(34) గతంలో దుబాయ్ వెళ్లి అప్పుల పాలయ్యాడు. భార్య పోసవ్వ అలియాస్ అరుణకు కుమారుడు ఉన్నాడు. ఆమె ఇటీవల భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. అటు అప్పుల బాధ, ఇటు భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెందిన పోశెట్టి గురువారం ఇంట్లో చీరతో ఉరేసుకున్నాడు. మృతుడి అక్క ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.గోపి తెలిపారు. -
విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు
● డెప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్ వేమనపల్లి: విధుల్లో నిర్లక్ష్యం చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని డెప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్ అన్నారు. పీహెచ్సీలో ప్రసవ వేదన శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి కృపబాయితో కలిసి పీహెచ్సీలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రసూతి కోసం కొండగొర్ల సోనియా పీహెచ్‌సీకి వచ్చినప్పుడు ఎవరు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటివి పునరావృతమైతే క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు. లోతట్టు గ్రామాల్లోని గర్భిణులను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అత్యవసర వేళ 108 సేవలను వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు పెరిగేలా చూడాలన్నారు. ఆయన వెంట జిల్లా కమ్యూనిటీ అధికారి వెంకటేశ్వర్, బీపీహెచ్ఎన్ ఆర్ఎస్ పద్మ, ఎస్‌యూఓలు జగదీశ్, వసంత, సూపర్వైజర్ అపరంజి, రాంశెట్టి బాపు ఉన్నారు. ఎఫెక్ట్.. -
కలిసుంటే కలదు సుఖం..
● ఉమ్మడి కుటుంబాల్లో ఆత్మీయత, ప్రేమానురాగాలు ● ఆత్మస్థైర్యంతోపాటు బలం ● ఆదర్శంగా నిలుస్తున్న పలు ఫ్యామిలీలు కాలం మారుతోంది.. జీవితం బిజీగా మారిపోయింది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. చిన్న కుటుంబాలే చింతలేని కుటుంబాలు అన్న భావన నెలకొంది. దీంతో పెద్ద కుటుంబాలు విడిపోయి, ఒక్కొక్కరూ ఒక్కో చోట జీవనం సాగిస్తున్న రోజులివి. చిన్నచిన్న మనస్పర్థలు, వ్యక్తిగత ఆలోచనలు వీరిని దూరం చేస్తున్నాయి. కానీ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బంధాలను బలోపేతం చేస్తూ, ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. ప్రేమ, అనురాగం, ఆత్మీయ ఆప్యాయతలకు ఇది ఒక గొప్ప వేదికగా నిలుస్తుంది. ఇప్పటికీ ఉమ్మడి కుటుంబాలు కష్టసుఖాలను పంచుకుంటూ, ఒకరికొకరు అండగా నిలుస్తున్నాయి. ఏళ్ల తరబడి ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవనం సాగిస్తూ, ఇవి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఒకరి ఆనందంలో అందరూ భాగస్వాములవుతూ, కష్టాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ, ఈ కుటుంబాలు సామాజిక సమతుల్యతను కాపాడుతున్నాయి. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా, ఉమ్మడి కుటుంబాల విలువను గుర్తుచేసుకోవడం అవసరం. ఇవి కేవలం కుటుంబ సభ్యులను కలిపే సంస్థానం మాత్రమే కాదు..సమాజంలో ప్రేమ, సామరస్యం, సహకార భావనలను పెంపొందించే బలమైన ఆధారాలు. ఇటువంటి కుటుంబాలు మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. నాలుగు దశాబ్దాలుగా.. ఆదిలాబాద్: జిల్లాకేంద్రంలోని ఆదిత్యనగర్ కాలనీకి చెందిన నానక్ సింగ్ పరివారం ఉమ్మడి కుటుంబం. గత నాలుగు దశాబ్దాలుగా కుటుంబమంతా ఒకేచోట కలిసి ఉంటుండడం విశేషం. నానక్ సింగ్–మంజీత్ కౌర్ దంపతులకు ఆరుగురు సంతానం. అందులో నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. చిన్నపాటి ఇనుప వస్తువులు, పనిముట్లు చేసుకుని జీవనం సాగిస్తున్నా, పరివారమంత ఒకే దగ్గర ఆత్మీయంగా కలిసి ఉంటున్నారు. కుటుంబంలో ఒక అబ్బాయికి తప్పా అందరికీ వివాహాలు జరిగాయి. తమ మధ్య ఉన్న అనుబంధమే మా అందరిని 40 ఏళ్లుగా కలిపి ఉంచిందని నానక్ సింగ్ చెబుతున్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా, తామందరం బాధ్యతలు పంచుకుని ఆ ఇబ్బంది నుంచి బయటపడేందుకు శ్రమిస్తామని పేర్కొంటున్నారు.చిన్ననాటి నుంచి ప్రత్యేక శ్రద్ధ బోథ్: మండలకేంద్రానికి చెందిన రాజశేఖర్ దీప దంపతులు. వారికి పిల్లల సంఖ్య కన్నా, వారిపై పెట్టే శ్రద్ధ ముఖ్యమని నమ్మారు. మేము ఒక్కరే కావాలనుకున్నారు. ఆ ఒకరిలో అన్ని విలువలు, విజ్ఞానం, మంచి భవిష్యత్తును ఇవ్వాలని అనుకురు. సంతానంగా కూతురు రుతిక పుట్టింది. ఆమె అభ్యున్నతికి పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. చిన్ననాటి నుంచి ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. ఇటీవల విడుదలైన లాసెట్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు వచ్చింది. చిన్న కుటుంబం వల్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చామని అనుకుంటున్నాం. -
ఊరికో పోలీస్
● మళ్లీ వీపీవోల నియామకం ● స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అమలు ● పోలీసింగ్‌లో పారదర్శకత ● తాజాగా డీజీపీ జితేందర్ సమీక్ష మంచిర్యాలక్రైం: నేరం జరిగిన తర్వాత దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవడం కంటే నేరమే జరగకుండా నిరోధించడం మేలనే భావనతో ప్రతీ గ్రామంలో గ్రామ పోలీస్ అధికారి(వీపీఓ)ని నియమించాలని ఇటీవల పోలీసు శాఖ నిర్ణయించింది. గతంలో రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలో వీపీవో, జనమైత్రి పేరుతో ఈ వ్యవస్థ కొంతకాలం కొనసాగినా.. ముణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ జితేందర్ మరోసారి గ్రామ పోలీసు వ్యవస్థ బలోపేతానికి అమలు చేయాలని ఈ నెల 2న జరిగిన సమావేశంలో పోలీసు కమిషనర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వీపీఓల నియామకానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గతంలో జనమైత్రి కార్యక్రమాలు గ్రామ స్థాయిలో పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటే అక్కడి సామాజిక పరిస్థితులు, సమస్యలు, చిన్న చిన్న తగాదాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుందని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పోలీసు అధికారులను నియమించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రామగుండం పోలీసు కమిషనరేట్ ఏర్పడింది. తొలి కమిషనర్‌గా పని చేసిన విక్రమ్‌జిత్ దుగ్గల్ జనమైత్రి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీపీఓ, జనమైన పోలీసు అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లు గ్రామాలు, వాడల్లో గోడలపై రాసి ఉంచారు. పోలీసులు రోజువారీగా ప్రజలకు దగ్గరగా ఉంటూ సమస్య పరిష్కారానికి కృషి చేశారు. అప్పట్లో మంచి ఫలితాలే రాబట్టినా కొంతకాలానికి కార్యక్రమాలకు బ్రేక్ పడింది. ప్రజల వద్దకే పోలీసులు జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 18మండలాలు, 311 గ్రామ పంచాయతీలు, 382 గ్రామాలు, ఆరు మున్సిపాల్టీలు ఉన్నాయి. గతంలో జనమైత్రిలో భాగంగా రెండు మూడు గ్రామాలకు ఒకరిని నియమించడంతో సిబ్బంది కొతర వల్ల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే సాగింది. పోలీసు వ్యవస్థ బలోపేతానికి రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించడంతో గ్రామ పోలీసు అధికారుల నియామకంపై దృష్టి సారించారు. గ్రామంతోపాటు మున్సిపాల్టీల్లో వార్డులు, డివిజన్ వారీగా వీపీవోలను నియమిస్తారు. ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు కూడా వారి పర్యవేక్షణలోనే ఉండనున్నాయి. రెండ్రోజులకోసారి గ్రామాల్లోని సమస్యలు తెలుసుకుని తీవ్రతను బట్టి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారు. గ్రామస్తులతో ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని నిరంతరం వారితో సంబంధాలు కొనసాగిస్తారు. నేరాలు అరికట్టేందుకే..నేరాలు జరిగిన తర్వాత అరెస్టులు, విచారణ, కోర్టులు అంటూ తిరగడం కంటే నేరాలే జరుగకుండా ఆరంభంలోనే అరికట్టేందుకే గ్రామ పోలీసు అధికారుల వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. గతంలో సిబ్బంది కొరత వల్ల కొంత అంతరాయం కలిగింది. ఇప్పుడు సిబ్బంది సంఖ్య పెరగడం వల్ల ఇకపై పకడ్బందీగా అమలవుతుంది. ప్రతీ గ్రామంలోని విషయాలు త్వరగా తెలుసుకునే వీలుంటుంది. – ఎగ్గడి భాస్కర్, డీసీపీ మంచిర్యాలజనమైత్రి కార్యక్రమం(ఫైల్) -
ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు కృషి
● సింగరేణి సీఎంవో కిరణ్ రాజ్కుమార్శ్రీరాంపూర్: సింగరేణి ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నామని సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్‌కుమార్ తెలిపారు. గురువారం ఆయన నస్పూర్ కాలనీ, ఆర్కే 8 కాలనీల్లోని సింగరేణి డిస్పెన్సరీలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంపెనీ ఆస్పత్రిలో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, అవసరమైన మందులు సమకూర్చుతున్నామని తెలిపా రు. ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ ఫిజియోథెరపీ విభాగం ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆడియో మెట్రి తీరును జీఎం పరీక్షించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జీఎం సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, డీవైజీఎంఓ రమేశ్‌బాబు, ఏఐటీయూసీ నాయకులు వీరభద్రయ్య, బద్రి బుచ్చయ్య, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సీఎంఓకు వినతులు సింగరేణిలో వైద్య విభాగం సమస్యలపై యూనియన్ నేతలు సీఎంఓ డాక్టర్ కిరణ్‌రాజ్ కుమార్‌కు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, టీబీజీకేఎస్ నాయకులు వేర్వేరుగా వినతిపత్రం సమర్పించారు. ఆర్కే 8 డిస్పెన్సరీని 50 బెడ్ల ఆసుపత్రిగా మార్చాలని, సీటీ స్కాన్, 2డీ ఎకో అందుబాబులో ఉంచాలని పేర్కొన్నారు. సత్వరమే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీరాంపూర్‌లో వైద్య సదుపాయాలు మరింత మెరుగుపర్చాలని, నస్పూర్ డిస్పెన్సరీలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, బ్రాంచీ ఉపాధ్యక్షుడు బండి రమేశ్, నాయకులు పొగాకు రమేశ్, అన్వేశ్‌రెడ్డి, ఏఐటీయూసీ బ్రాంచీ కార్యదర్శి షేక్ బాజీసైదా, జీఎం కమిటీ చర్చల ప్రతినిధి బధ్రి బుచ్చయ్య, నాయకులు మూడ సుధాకర్, విజయలక్ష్మీ, అఫ్రోజ్‌ఖాన్ పాల్గొన్నారు. -
సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి
పాతమంచిర్యాల: బీసీ కార్పొరేషన్ ద్వారా యువతకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లు ధరించి నిరసన ప్రదర్శన చేశారు. ఆయన మాట్లాడుతూ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకుని రెండు నెలలు గడిచినా ప్రభుత్వం మంజూరు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు గజెళ్లి వెంకటయ్య, శాఖపురి భీంసేన్, భిక్షపతి, చంద్రమౌళి, రాజేశం, లక్ష్మినారాయణ పాల్గొన్నారు. -
● ఏటేటా పెరుగుతున్న జనాభా ● అమ్మాయిల జననాలే అధికం ● క్రమంగా తగ్గుతున్న మహిళల సంఖ్య ● ఉమ్మడి జిల్లాలో జనాభా తీరిదీ ● నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
ఈ ఏడాది థీమ్.. ‘‘యువతకు న్యాయమైన, ఆశాజనక ప్రపంచంలో వారు కోరుకునే కుటుంబాలను సృష్టించడానికి వారిని శక్తివంతం చేయడం’’ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం. రెప్పపాటులో పుట్టుక చావులు జరిగిపోతున్నాయి. ఏటేటా జనాభా పెరిగిపోతోంది. గతంతో పోలిస్తే జనన, మరణాల సంఖ్య పెరుగుదల రేటు తగ్గిపోతోంది. మారుతున్న పరిస్థితులు జనాభాను నియంత్రిస్తున్నాయి. అందరికీ అన్ని సౌకర్యాల కల్పన మానవ సమాజంలో క్లిష్టంగా మారింది.. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఉమ్మడి జిల్లాలో జనాభాతోపాటు పట్టణాల్లో నివసించే వారి సంఖ్య పెరుగుతోంది. గిరిజన, మైదాన ప్రాంతాల్లో మార్పులు వస్తున్నాయి. తగ్గుతున్న మహిళా జనాభా ప్రతీ వెయ్యి మంది పురుషులకు మహిళల సంఖ్య తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల పలు సర్వేల్లోనూ లింగనిష్పత్తి తగ్గుతూ వస్తోంది. పురుషులకు సమానంగా సీ్త్రలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2011అధికారిక జనాభా లెక్కల్లోనే ఇది స్పష్టమైంది. సీ్త్ర, పురుష సమానత్వం లేకపోతే సమాజంలో అసమానతలు ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు లింగనిర్ధారణ చేస్తు ఆడశిశువులను పురిటిలోనే చంపేయడం జనాభాలో అసమతుల్యతకు కారణంగా మారుతున్నాయి. అమ్మాయిలే పుడుతున్నారు.. ‘సీఆర్ఎ్స్(రిజిస్ట్రార్ జనరల్, గణాంక కమిషనర్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం) 2021 నివేదికలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 26576మంది అబ్బాయిలు పుట్టగా, అమ్మాయిలు మాత్రం 25124మంది జన్మించారు. అదే సమయంలో మహిళల కంటే మగవారి మరణాలే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ వివరాల ప్రకారం 10,455మంది పురుషులు చనిపోతే, సీ్త్రలు 7,832మంది మరణించారు. పెరుగుతున్న వలసలు.. గ్రామాలు వదిలి విద్యా, ఉద్యోగ, ఉపాధి సౌకర్యాల కోసం అధికంగా వలసలు పెరుగుతున్నాయి. దీంతో క్రమంగా పట్టణీకరణ పెరుగుతోంది. 2011లెక్కల ప్రకారం మంచిర్యాల జిల్లా 43.8శాతం, ఆదిలాబాద్ 23.7శాతం, నిర్మల్ 21.4, కుమురంభీం జిల్లాలో 16.9శాతంతో పట్టణ జనాభా ఉంది. ప్రస్తుతం 2025నాటికి సంఖ్య మరింత పెరగనుంది. అయితే పట్టణాల్లో పెరుగుతున్న వలసలకు అనుగుణంగా శుభ్రమైన తాగు, ఉండేందుకు ఇల్లు, విద్యా, వైద్యం, ఉద్యోగ, ఉపాధి వసతలు కల్పన జరగాల్సి ఉంది. లేకపోతే అల్పాదాయంతో పేదరికంలో అధిక జనాభా మగ్గాల్సి వచ్చే ప్రమాదం ఉంది. జిల్లాలో ప్రతీ చదరపు కిలోమీటరకు జనసాంద్రత చూస్తే ఆసిఫాబాద్ జిల్లా తక్కువ ఉండగా, పట్టణీకరణ చెందిన మంచిర్యాల జిల్లాలో అధికంగా ఉంది. ప్రస్తుతం 2025 నాటికి జనసాంద్రత మరింత పెరగనుంది. వసతులు, సౌకర్యాలు అధికంగా ఉన్న ప్రాంతాలకు వలసలతో ఆ ప్రాంతాల్లో జన సాంద్రత పెరుగుతోంది. -
‘ప్రాణహిత’ ఉగ్రరూపం
వేమనపల్లి/కోటపల్లి: ఎగువ ప్రాంతం మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు, ఉప నదుల నుంచి వరద కారణంగా జిల్లాలోని వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చింది. కుమురంభీం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని వదలడంతోనూ నదిలో గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. వేమనపల్లి పుష్కరఘాట్ రోడ్డు పూర్తిగా మునిగిపోగా ఎంచపాయె, చింతొర్రెతోపాటు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సుంపుటం, జాజులపేట ఆర్అండ్బీ రోడ్డు మునిగిపోయాయి. అవతలి వైపు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వేమనపల్లి పుష్కరఘాట్, వెంచపల్లి రేవుల వద్ద మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులకు రాకపోకలు సాగించే నాటు పడవలను తహసీల్దార్ సంధ్యారాణి, ఎస్సై శ్యాంపటేల్ నిలిపివేయించి హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు గ్రామాల్లో సుమారు 1200 ఎకరాల్లో పత్తి పంటలు జలసమాధి అయ్యాయి. కోటపల్లి మండలం వెంచపల్లి, సుపాక, జనగామ, ఆలుగామ, సిర్సా, అన్నారం, రాపల్లి, అర్జునగుట్ట గ్రామాల్లో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆయా గ్రామాల్లోని నది పరీవాహక ప్రాంతాల్లో పంటలు నీటమునిగి రైతులకు నష్టం వాటిల్లింది. వేల పెట్టుబడితో విత్తిన పత్తి మొక్కల దశలోనే వరద పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న గోదావరి నీటిమట్టం చెన్నూర్: చెన్నూర్‌లో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. వారం రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గురువారం నదిలో వరద పెరిగింది. మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిస్తే పరీవాహక ప్రాంతాల్లో పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. పరీవాహక ప్రాంతాలకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వందలాది ఎకరాల్లో పంట నష్టం సరిహద్దు రాకపోకల నిలిపివేత -
● ఉమ్మడి కుటుంబాలతోనే మేలు ● చిన్నకుటుంబాలపైనే యువత ఆసక్తి ● నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
మంచిర్యాలటౌన్/ఆదిలాబాద్/బెల్లంపల్లి/చెన్నూర్: ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలో జనాభా రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. యువజన భారతంగా వెలుగొందుతున్న దేశంలో మరో 25ఏళ్లలో యువజనుల సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే అంచనా ఉంది. గతంలో ఇద్దరు పిల్లలే ముద్దు అనే నినాదం ఉండగా.. ప్రస్తుతం ఒక్కొక్కరూ ముగ్గురు కంటే ఎక్కువ మందిని కనాలనే సూచన వస్తోంది. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ యువతీ, యువకులు, పెళ్లయిన జంటలు 300 మందిని పలు అంశాలపై గురువారం సర్వే నిర్వహించింది. వీరిలో అధిక శాతం ఉమ్మడి కుటుంబాలతోనే మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇద్దరు పిల్లలే చాలని.. భవిష్యత్ ప్రణా ళికలోనూ ఇద్దరే ముద్దు అని పేర్కొన్నారు. ఉద్యోగం, ఉపాధి తదితర కారణాలతో చిన్న కుటుంబాలుగా వేరుపడడానికే మొగ్గు చూపారు. 4. ఉమ్మడి కుటుంబాల వల్ల ప్రయోజనమా.. చిన్న కుటుంబాల వల్లనా..?1.దేశంలో మరో 25ఏళ్లలో యువజనుల సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒక్కొక్కరు ముగ్గురు పిల్లల కన్న ఎక్కువ మందిని కనాలన్న సూచనలపై మీరేమంటారు..3. మీది ఉమ్మడి కుటుంబమా..? చిన్న కుటుంబమా..? 2. పెళ్లి తర్వాత పిల్లలపై మీ ప్రణాళిక ఏమిటిపాటించాలిఇద్దరు చాలుఉమ్మడి కుటుంబాలుముగ్గురుఇద్దరుచెప్పలేంచిన్న కుటుంబాలుచిన్నదేఉమ్మడి53224750162811964 -
గురువులను సన్మానించడం అదృష్టం
చెన్నూర్/తాండూర్: వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తున్న గురువులు, కళాకారులను సన్మానించడం అదృష్టమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. గురుపౌర్ణమి సందర్భంగా గురువారం చెన్నూర్ బీజేపీ కార్యాలయంలో గురువులు, కళాకారులు, తాండూర్ మండలం అచ్చలాపూర్ వేద పాఠశాలలో గురువులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతోమంది వేద పండితులను తయారు చేసిన వేద పాఠశాల జిల్లాలో ఉండడం గర్వకారణమని అన్నారు. తాండూర్ మండల బీజేపీ నాయకులు జెడ్పీఎస్ఎస్ రిటైర్డు ఉపాధ్యాయుడు ఎం.రామ్మోహన్‌ను పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో రిటైర్డ్ వ్యాయమ ఉపాధ్యాయుడు కారెంగుల రామయ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ, జిల్లా కార్యదర్శి దుర్గం అశోక్, పట్టి కృష్ణ, చెన్నూర్ పట్టణ అధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్, బత్తుల సమ్మయ్య, రాపర్తి వెంకటేశ్వర్, జాడి తిరుపతి, కేవీఏం శ్రీనివాస్, మధు, -
మానవ మనుగడకు మొక్కలు మేలు
చెన్నూర్: మానవ మనుగడకు మొక్కలు మేలు చేస్తాయని జూనియర్ సివిల్ జడ్జి పర్వతపు రవి అన్నారు. గురువారం అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ అధికారులు, విద్యార్థులతో కలిసి కోర్టు ఆవరణలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులు అంతరించి పోతే పెను ప్రమాదం సంభవిస్తుందని అన్నారు. ప్రాణవాయువునిచ్చే మొక్కలను నాటడమే కాకుండా సంరక్షించాలని తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మద్ది కార్తీక్, సీనియర్ న్యాయవాదులు రమేశ్చందర్ గిల్డా, మల్లేశంగౌడ్, అటవీ అధికారులు ప్రభాకర్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ట్రిపుల్‌ఐటీలో ముగిసిన కౌన్సెలింగ్
భైంసా: ట్రిపుల్ఐటీ బాసర, మహబూబ్‌నగర్ సెంటర్లకు 2025 –26 విద్యా సంవత్సరానికి గాను తొలివిడత కౌన్సెలింగ్ బుధవారం ముగిసింది. మూడవ రోజు ట్రిపుల్ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధర్‌లు కౌన్సెలింగ్ ప్రారంభించారు. రెండు సెంటర్లలో కలిపి 1690 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. మూడు రోజులపాటు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 1472 మంది విద్యార్థులు హాజరయ్యారు. గైర్హాజరైన విద్యార్థుల స్థానాలను త్వరలోనే వెయిటింగ్ లిస్టు ఆధారంగా భర్తీ చేస్తామని క్యాంపస్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ బాసర క్యాంపస్ పూర్వ వైభవం తీసుకొచ్చేలా కృషి చేస్తామన్నారు. -
ఉపాధి హామీ పనులు పరిశీలన
భీమిని/తాండూర్: ఉపాధి హామీ పథకంలో భాగంగా భీమిని, తాండూర్ మండలాల్లో చేపట్టిన పనులను కేంద్ర బృందం సభ్యులు బుధవారం సందర్శించారు. భూగర్భ జల వనరుల శాఖ శాస్త్రవేత్త కే.రాంబాబు ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి భీమిని మండలంలోని 12 గ్రామాలు, తాండూర్ మండలం బోయపల్లి, కాసిపేట, కిష్టంపేట, పెగడపల్లి, తాండూర్, గోపాల్‌నగర్, రేచిని గ్రామాల్లో నీటికుంటలు, చెక్‌డ్యాంలు, ఫారంపాండ్, ఇంకుడుగుంతల పనులన్నీ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమాల్లో డీఆర్డీవో స్టాఫ్ నోడల్ అధికారి సదానందం, ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్, ఎంపీడీవోలు గంగామోహన్, శ్రీనివాస్, డీఆర్డీఏ అధికారులు సత్యనారాయణ, మధుకర్, శ్రీనివాస్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
● సింగరేణి గనుల్లో స్తంభించిన బొగ్గు ఉత్పత్తి ● రూ.11కోట్లు ఉత్పత్తి, రూ.8కోట్లు వేతనాలు నష్టం
శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద రాస్తారోకో చేస్తున్న కార్మిక సంఘాల నేతలుశ్రీరాంపూర్: దేశవ్యాప్తంగా బుధవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె సింగరేణిలో విజయవంతమైంది. జిల్లాలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా స్తంభించింది. కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మికులు విధులకు హాజరు కాకుండా గనుల వద్ద నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సమ్మెతో మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధి బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్లలోని బొగ్గు గనులు పూర్తిగా స్తంభించాయి. బెల్లంపల్లి ఏరియాలోని కై రిగూడ ఓసీపీ, మందమర్రిలోని కేకే ఓసీపీ, కేకే 1, 2, 5, శాంతిఖని, శ్రీరాంపూర్‌లోని ఎస్సార్పీ ఓసీపీ, ఇందారం ఓసీపీ, ఆర్కే 5, ఆర్కే న్యూటెక్, ఆర్కే 7, ఎస్పార్పీ 1, ఎస్సార్పీ 3, 3ఏ, ఐకే 1ఏ భూగర్భ గనుల్లో బొగ్గు పెల్ల కూడా బయటకు రాలేదు. ఎక్కడికక్కడ కార్మిక సంఘాల నేతలు గనులపై, కూడళ్ల వద్ద లేబర్కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహించారు. సమ్మె వల్ల బెల్లంపల్లి రీజియన్ పరిధిలో 29వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. దీంతో కంపెనీకి రూ.11కోట్లు నష్టం వాటిల్లింది. అత్యవసర సిబ్బంది మినహా కార్మికులంతా సమ్మెలో పాల్గొన్నారు. జిల్లాలోని కార్మికులు రూ.8కోట్లు వేతనాలు కోల్పోయారు. అక్కడక్కడ సీహెచ్పీల్లోని బొగ్గు నిల్వను అధికారులు రవాణా చేయించారు. రీజియన్ వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు కార్మికులు, ఓబీ వర్కర్స్ కూడా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో సివిల్, ఇతర సివిక్, ఓబీ పనులు నిలిచిపోయాయి. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సెక్యూరిటీ విభాగం, సివిల్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అన్ని జీఎం కార్యాలయాల్లో కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేసి షిఫ్ట్‌ల వారీగా కార్మికుల హాజరు శాతం, ఉత్పత్తి, సమ్మె ప్రభావంపై ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ కార్పొరేట్ అధికారులకు సమాచారం అందించారు. శ్రీరాంపూర్‌లో.. సింగరేణిలో అతిపెద్ద ఏరియా శ్రీరాంపూర్‌లోని రెండు ఓసీపీలు, 6 భూగర్భ గనులు, డిపార్టుమెంట్లలో సమ్మెతో 17వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. ఓసీపీల్లో ఓబీ పనులూ నిలిపివేశారు. ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి జరుగకుండా కార్మిక సంఘాల నేతలు అడ్డుకున్నారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, టీబీజీకేఎ్స్లతో కార్మిక సంఘాల జేఏీసీ నాయకులు గనులపై సమ్మె పరిస్థితిని సమీక్షించారు. చివరికి శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ కార్మికులు సమ్మెలో పాల్గొన్నందుకు ఉద్యమ వందనాలు తెలిపారు. కేంద్రం ప్రభుత్వం దిగి వచ్చి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరవధిక సమ్మెకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు వీ.సీతారామయ్య, డెప్యూటీ ప్రధాన కార్యదర్శి కే.వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచీ సెక్రెటరీ షేక్ బాజీసైదా, నాయకులు కిషన్‌రావు, ఎం.కొమురయ్య, అఫ్రోజ్‌ఖాన్, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు జే.శంకర్రావు, గరిగే స్వామి, కలవేని శ్యాం, ప్రధాన కార్యదర్శి ఏనుగు రవీందర్‌రెడ్డి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, బ్రాంచీ ఉపాధ్యక్షుడు బండి రమేశ్, నాయకులు పానుగంటి సత్తయ్య, పొగాకు రమేశ్, గొర్ల సంతోశ్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్, బ్రాంచీ అధ్యక్షులు గుల్ల బాలాజీ, ఉపాధ్యక్షుడు కే.చంద్రశేఖర్ పాల్గొన్నారు. సీసీసీ కార్నర్ వద్ద రాస్తారోకో..హెచ్ఎమ్మెస్, ఐఎఫ్టీయూ, ఏఐఎఫ్టీయూ, సింగరేణి ఉద్యోగుల సంఘాల ఐక్యవేదిక నాయకులు గనులపై పర్యటిస్తూ సమ్మెను విజయవంతం చేశారు. అనంతరం సీసీసీ కార్నర్ వద్ద రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టీ.శ్రీనివాస్, బ్రహ్మానందం, హెచ్ఎమ్మెస్ బ్రాంచీ ఉపాధ్యక్షుడు అనిల్‌రెడ్డి, కార్యదర్శి పీ.అశోక్, ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సమ్ము రాజయ్య, ఏఐఎఫ్‌యూ నాయకులు పోశమల్లు పాల్గొన్నారు. -
లేబర్కోడ్లు రద్దు చేయాలి
పాతమంచిర్యాల: కార్మిక చట్టాలు కొనసాగించాలని, లేబర్కోడ్లు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీలు, జాతీయ కార్మిక సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏఐటియూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపాల్, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, టీయూసీఐ జిల్లా కార్యదర్శి దేవరాజ్, న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి లాల్‌కుమార్ మాట్లాడుతూ కార్పొరేట్ అధిపతుల కోసమే నరేంద్రమోదీ ప్రభుత్వం కార్మిక చట్ట సవరణలు చేసి కార్మిక హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. కార్మిక చట్టాల సవరణను ఉపసంహరించుకోకపోతే ఢిల్లీ కేంద్రంగా జరిగిన రైతు ఉద్యమంలాగా కార్మికోద్యమం జరుగుతుందని తెలిపారు. సమ్మెలో పోస్టల్, బ్యాంకు ఉద్యోగులు, బీఎస్ఎన్ఎల్, తెలంగాణ మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్, తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీలో యూనియన్లు లేని కారణంగా బస్సులు యధావిధిగా తిరిగాయి. ప్రైవేటీకరణ విధానాలను రద్దు చేయాలంటూ జిల్లా కేంద్రంలో ఎల్ఐసీ సిబ్బంది నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఐసీ యూనియన్ మంచిర్యాల శాఖ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, రామదాసు, రీజినల్ కార్యదర్శి రాజేశం పాల్గొన్నారు. -
అట్టహాసంగా రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలు
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి బాలికల జూనియర్స్ ఫుట్‌బాల్ పోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మరో మూడు రోజులపాటు జరుగనున్న పోటీలకు రాష్ట్రంలోని 12 జిల్లాల క్రీడాకారులు హాజరయ్యారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ఫుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఫాల్గుణ ముఖ్య అతిథులుగా హాజరై పోటీలు ప్రారంభించారు. ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్ల వైపు మరలకుండా క్రీడలపై దృష్టి సారించాలన్నారు. సరైన మార్గంలో జీవనం సాగించేందుకు క్రీడలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఫుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఫాల్గుణ మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు కోచింగ్ క్యాంప్ రామకృష్ణాపూర్లోనే ఏర్పాటు చేస్తామన్నారు. మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి, పట్టణ ఎస్సై రాజశేఖర్, ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, ఈశ్వరాచారి, బెల్లం శ్రీనివాస్, గణపతి తదితరులు పాల్గొన్నారు. మొదటి రోజు లీగ్ పోటీలు.. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తున్న పోటీల కోసం స్టేడియంలో రెండు గ్రౌండ్లు సిద్ధం చేశారు. మొదటిరోజు గ్రౌండ్ నంబర్ 1లో నిజామాబాద్ –సిద్దిపేట జట్లు తలపడగా నిజామాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ జట్లు పోటీ పడగా మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, సిద్దిపేట్ మధ్య జరిగిన లీగ్‌లో ఆదిలాబాద్ గెలుపొందాయి. రెండో గ్రౌండ్లో మెదక్ –గద్వాల్ జట్లు తలపడగా గద్వాల్, కరీంనగర్ –నల్గొండ జట్ల మధ్య జరిగిన లీగ్‌లో నల్గొండ జట్లు గెలుపొందాయి. -
దొరికిన పర్సు పోలీసులకు అప్పగింత
కుభీర్: దొరికిన పర్సును పోలీసులకు అప్పగించి దొంతుల పుష్ప అనే మహిళ నిజాయితీ చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భైంసా వెళ్లేందుకు దొంతుల పుష్ప అనే మహిళ మండల కేంద్రంలోని బస్టాండ్‌కు వచ్చారు. అక్కడ ఆమెకు ఒక పర్సు దొరికింది. అందులో రూ.24,416ల నగదు, వెండి కాళ్లగజ్జలు (ఒక జత), ఇద్దరు మహిళలు, ఒక పిల్లడి ఫొటోలు ఉన్నాయి. ఒక ఫొటోపై యువతి పేరు కవిత అని రాసి ఉంది. కాగా దొంతుల పుష్ప దొరికిన పర్సును తన భర్త దత్రాత్రితో పోలీస్‌స్టేషన్‌కు పంపించి తన నిజాయితీ చాటుకున్నారు. భర్త పర్సును ఎస్సై కృష్ణారెడ్డికి అప్పగించారు. డబ్బు పోగొట్టుకున్న వారు సరైన ఆధారాలు చూపి డబ్బు తీసుకుపోవచ్చని ఎస్సై తెలిపారు. -
డ్రైవర్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన
రెబ్బెన: ఇటీవల ట్రాక్టర్ బోల్తాపడి పులికుంట గ్రామానికి చెందిన దుర్గం మారుతి మృతి చెందగా మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు బుధవారం పులికుంట వద్ద జాతీయ రహదారిపై మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు. ట్రాక్టర్ యజమాని మృతుడి కుటుంబానికి రూ. 5లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ట్రాక్టర్ యజమాని వచ్చి న్యాయం చేస్తానని హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. సుమారు 45 నిమిషాల పాటు రాస్తారోకో చేపట్టడంతో రోడ్డుకు ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు విషయాన్ని ఏఎస్పీ చిత్తరంజన్ దృష్టికి తీసుకెళ్లగా హుటాహుటిన ఆయన సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గురువారం ట్రాక్టర్ యజమానిని పిలిపించి మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దాంతో రాస్తారోకో విరమించారు. -
‘ప్రైవేట్’ మూతబడి!
● పలు ఇంటర్ కాలేజీల పరిస్థితి ● చేతులెత్తేస్తున్న యాజమాన్యాలు ● నిర్వహణ భారమై మూసివేత ● విద్యార్థులకు తప్పని తిప్పలుసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రైవేట్ జూనియర్ కళాశాలలను నడపలేక పలు యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. దీంతో ఆ కాలేజీల్లో చదివే విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలుగుతోంది. కొంతకాలంగా ప్రైవేట్ ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో విద్యా వ్యాపారంలో పోటీ పెరిగి ప్రవేశాలు తగ్గుతున్నాయి. మరోవైపు విద్యార్థుల నుంచి యాజమాన్యాలకు చెల్లించే ఫీజులూ తగ్గిపోయాయి. స్కాలర్‌షిప్‌ల ఆధారంగానే కాలేజీలు నడపాల్సి వస్తోంది. సర్కారు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం ఆగిపోవడంతో విద్యార్థులు, యాజమాన్యాలకు తిప్పలు తప్పడం లేదు. జిల్లా కేంద్రంతో పాటు మందమర్రి, లక్సెట్టిపేట, చెన్నూరు, బెల్లంపల్లి పట్టణాల్లో గతంలో ఉన్న కాలేజీలు ప్రస్తుతం అందుబాటులో లేవు. తగ్గుతున్న అడ్మిషన్లు కోవిడ్ కన్నా ముందు వరకు ప్రైవేట్ కాలేజీలు బాగానే ఉన్నా ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. జిల్లాలో మొత్తం 10 ప్రభుత్వ, 15 ప్రైవేట్ కాలేజీలున్నాయి. జిల్లా కేంద్రంలో ఈ ఏడాది నుంచే ఓ కాలేజీ మూత పడింది. అంతకుముందు ఏడాది మరో కాలేజీది ఇదే పరిస్థితి. చాలా కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గి నిర్వహణ భారంగా మారుతోంది. ప్రభుత్వ గురుకులాల్లో ఇంటర్ వరకు విద్యాసౌకర్యం కలగడంతో బడ్జెట్ కాలేజీలపై ప్రభావం పడుతోంది. ఇక పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్, ఐటీఐతో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సులు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లోని కార్పొరేట్ కాలేజీల్లోకి వెళ్తున్నారు. ఇక్కడ ప్రైవేట్, ప్రభుత్వ స్కూళ్లలో పదోతరగతి వరకు చదివినప్పటికీ స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాలకు తల్లిదండ్రులు పంపిస్తున్నారు. దీంతో ప్రైవేట్ కాలేజీల్లో చాలావరకు అడ్మిషన్ల సంఖ్య తగ్గుతోంది. మరోవైపు ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి. -
సమస్య పరిష్కరించాలని రైతు ఆత్మహత్యాయత్నం
లక్ష్మణచాంద: తన భూ సమస్య పరిష్కరించడం లేదని ఓ రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మణచాందకు చెందిన రైతు పసుపుల గంగాధర్‌కు 10 గుంటల భూమి ఉంది. దానికి పట్టాపాస్ బుక్ ఉండడంతో పాటు ఏటా వివిధ ప్రభుత్వ పథకాలు కూడా పొందుతున్నాడు. అయితే ఆ భూమిని అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి తనదిగా చెబుతూ సాగు చేసుకుంటున్నాడు. తన భూమిని తనకు చూపాలంటూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఏళ్లుగా తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదు. మనస్తాపం చెందిన గంగాధర్ బుధవారం మధ్యాహ్న సమయంలో తహసీల్ధార్ కార్యాలయం వద్దకు వచ్చి వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా గమనించిన రైతులు, అధికారులు అడ్డుకొని మందు డబ్బా లాక్కున్నారు. అనంతరం తహసీల్దార్ సరిత రైతుతో మాట్లాడారు. దీనిపై సాక్షి తహసీల్దార్ సరితను వివరణ కోరగా రైతు ఫిర్యాదుతో గతంలోనే సర్వేయర్ వెళ్లి పంచనామా నిర్వహించారన్నారు. దానికి రైతు సంతృప్తి చెందలేదని పేర్కొన్నారు. పూర్తి వివరాలతో డీఐకి, ఏడీ నిర్మల్‌కు చర్యలు తీసుకోవాలని కోరుతూ రైతు ఫిర్యాదు పంపుతున్నట్లు తెలిపారు. -
ఎస్టీపీపీని అగ్రగామిగా నిలపాలి
● సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ జైపూర్: విద్యుత్ ఉత్పత్తి, నిర్వహణలో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ)ను దేశస్థాయిలో అగ్రగామిగా నిలపాలని సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు అన్నారు. మండల కేంద్రంలోని ఎస్టీపీపీని బుధవారం ఆయన సందర్శించారు. బాయిలర్లలో సీఅండ్ఐ కంట్రోల్స్ ద్వారా రెండు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ, టర్బైన్ పనితీరును అధికారులు వివరించారు. ఎస్టీపీపీ నమూనా ద్వారా ఆయా విభాగాల్లో యంత్రాల పనితీరు, విద్యుత్ ఉత్పత్తి అంశాలు తెలియజేశారు. నూతనంగా చేపట్టిన ఎఫ్‌జీడీ పనులు, అన్యువల్ ఓవర్‌హాలింగ్ పనులను వివరించారు. 800మెగావాట్ల కొత్త ప్లాంటు నిర్మించే ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం సోలార్ ప్లాంటును పరిశీలించి పనితీరు తెలుసుకున్నారు. సాయంత్రం అడ్మిన్ భవన కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీపీపీ అధికారులు, ఉద్యోగుల ఉత్తమ పనితీరు ఫలితంగా వరుసగా 53అవార్డులు అందుకోవడం అభినందనీయమని అన్నారు. గౌతమ్‌ను అధికారులు, ఉద్యోగుల సంఘాల నాయకులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం నరసింహారావు, వోఅండ్‌ఎం చీఫ్ జెన్సింగ్, సీఎంవోఏఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ సముద్రాల శ్రీనివాస్, ఏజీఎంలు మురళీధర్, మదన్మోహన్, శ్రీనివాస్, డీజీఎం అజజుల్లాఖాన్, ఫారెస్ట్ మేనేజర్ చంద్రమణి, డీజీఎం పర్సనల్ కిరణ్‌బాబు పాల్గొన్నారు. -
పీహెచ్సీలో ప్రసవ వేదన
వేమనపల్లి: పురిటినొప్పులతో వేమనపల్లి పీహెచ్‌సీకి వెళ్తే గర్భిణీకి వైద్యం కరువైంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని సిరొంచ తాలూకా నర్సయ్యపల్లికి చెందిన కొండగొర్ల సోనియా కాన్పు కోసం మూడు నెలల క్రితం వేమనపల్లిలోని తల్లిగారింటికి వచ్చింది. పీహెచ్సీ వైద్యంపై నమ్మకం లేక మంచిర్యాల, చెన్నూర్ ప్రైవేట్ వైద్యుల వద్ద వైద్యపరీక్షలు చేయించుకుంటోంది. ఈ నెల 17వ తేదీన ప్రసవానికి సమయం ఇచ్చారు. కాగా బుధవారం ఉదయం పురిటినొప్పులు రావడంతో వేమనపల్లి పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో ఏ ఒక్క సిబ్బంది అందుబాటులో లేరు. గత్యంతరం లేక పీహెచ్‌సీలోని బెడ్‌పై పడుకోబెట్టగా తీవ్రమైన నొప్పులతో విలవిలలాడింది. పీహెచ్‌సీలోనే గంటసేపు వేచి చూశారు. కొంతసేపటికి గ్రామంలోనే ఉన్న కాంటిజెంట్ వర్కర్ నిర్మల వచ్చారు. వైద్యాధికారి రాజేశ్‌కు సోనియా అన్నయ్య రజినీకాంత్ ఫోన్ చేసినా స్పందించలేదు. ఇంకా ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని 108 అంబులెన్స్‌లో చెన్నూర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సోనియా వైద్యుల పర్యవేక్షణలో క్షేమంగా ఉన్నట్లు భర్త స్వామి, తల్లి గౌరక్కలు తెలిపారు. -
సమస్య గుర్తింపు ఇక ఈజీ
● విద్యుత్ లైన్లపై లైన్ఫాల్ట్ కండక్టర్లు ఏర్పాటు ● సమస్య గుర్తించి వేగంగా పరిష్కరించేందుకు కొత్త విధానం ● అటవీ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు ● త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి.. కడెం: అటవీ ప్రాంతాల్లో తరచూ విద్యుత్ సమస్యలు తలెత్తుతుంటాయి. వానాకాలంలో ఈదురుగాలులు సంభవించినప్పుడు విద్యుత్‌లైన్‌పై చెట్ల కొమ్మలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. విద్యుత్ సమస్య ఏర్పడినపుడు సమస్యను గుర్తించి, విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు విద్యుత్‌శాఖ సిబ్బంది గంటల తరబడి శ్రమిస్తుంటారు. అంతవరకు విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతారు. ఇక నుంచి గంటల తరబడి విద్యుత్ సరఫరాలో అంతరాయానికి చెక్ పడనుంది. విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు విద్యుత్‌శాఖ అటవీ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా లైన్ఫాల్ట్ కండక్టర్లను ఏర్పాటు చేసింది. త్వరలోనే ఈ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 12 చోట్ల ఏర్పాటు.. విద్యుత్ అంతరాయాన్ని వెంటనే పరిష్కరించేలా ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాలకు విద్యుత్ సరఫరా అందించే విద్యుత్‌లైన్లపై అటవీ ప్రాంతాల్లో లైన్ఫాల్ట్ కండక్టర్లు ఏర్పాటు చేశారు. కడెం, పెంబి మండలాల్లోని 33 కేవీ లైన్‌పై ఆరుచోట్ల, కడెం మండలంలోని అల్లంపల్లి, ఉడుంపూర్, ఖానాపూర్ మండలంలోని రాజురా 11 కేవీ విద్యుత్‌లైన్లపై సైతం వీటిని ఏర్పాటు చేశారు. లైన్ఫాల్ట్ కండక్టర్ల ద్వారా విద్యుత్ సిబ్బంది వెంటనే అప్రమత్తమైవిద్యుత్ సమస్య తలెత్తిన ప్రాంతానికి వెళ్లి విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు అవకాశం ఉంటుంది. పని తీరు ఇలా.. విద్యుత్ సరఫరా నిలిచిపోగానే వైర్లకు ఉన్న మూడు కండక్టర్లు ఎరుపు రంగులో మెరుస్తుంటాయి. లైన్ఫాల్ట్ కండక్టర్ల వద్ద విద్యుత్ స్తంభానికి ఏర్పాటు చేసిన సోలార్ సిస్టం ద్వారా లైన్మెన్, ఏఈఈ, డీఈఈ, ఎస్ఈ వరకు అంతరాయం సమాచారం అందజేస్తుంది. ఇందుకు సోలార్ సిస్టంలో సిమ్ వేసి ఉంచుతారు. అందులో సేవ్ చేసిన నంబర్లకు సమాచారం వెళ్తుంది. దీంతో పాటు విద్యుత్ లైన్‌కు ఎంత దూరంలో సమస్య ఉందని సమాచారం తెలిపే సిస్టం కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలో పూర్తిస్థాయి సేవలు అటవీ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు పలుచోట్ల విద్యుత్లైన్లకు లైన్ఫాల్ట్ కండక్టర్లు ఏర్పాటు చేశాం. త్వరలోనే వీటి పూర్తిస్థాయి సేవలు అందుబుటులోకి వస్తాయి. – ఎం.రాంసింగ్, ఏఈఈ -
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
దండేపల్లి: కడుపునొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దండేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై తహసీనోద్దిన్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. దండేపల్లి మండలం నెల్కి వెంకటపూర్ గ్రామానికి చెందిన కోవ మహేందర్ (19) కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. మద్యానికి బానిసైన మహేందర్‌ను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చూపించగా మద్యం మానేసి, మందులు వాడితే కడుపునొప్పి తగ్గుతుందని వైద్యులు చెప్పారు. కానీ మహేందర్ మద్యం మానేయలేదు. ఈనెల 5న కడుపునొప్పి తీవ్రంగా ఉందని, చనిపోవాలని ఉందంటూ అన్న లక్ష్మణ్‌కు చెప్పాడు. తాగుడు మానివేసి మందులు వాడితే కడుపునొప్పి తగ్గుతుందని లక్ష్మణ్ సముదాయించాడు. అదేరోజు మధ్యాహ్నం మందుల కోసం ఇంట్లో నుంచి వెళ్లిన మహేందర్, దండెపల్లి వాగులో పురుగుల మందు తాగి స్నేహితుడు మోకాషి శేఖర్‌కు ఫోన్ చేసి చెప్పాడు. శేఖర్ వెంటనే లక్ష్మణ్‌కు ఫోన్ చేయగా లక్ష్మణ్ అక్కడకు చేరుకుని బైక్‌పై మహేందర్‌ను లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ర్యాగింగ్ చట్టరీత్యా నేరం
లక్సెట్టిపేట: ర్యాగింగ్‌కు పాల్పడడం చట్టరీత్యా నేరమని జూనియర్ సివిల్ జడ్జి కాసమల సాయికిరణ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సు, యాంటీ ర్యాగింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలని, తొటి విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడితే కేసుల నమోదుతో మంచి భవిష్యత్ కోల్పోతారని అన్నారు. అనంతరం ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టరీత్యా విధించే శిక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్తన్న, కార్యదర్శి ప్రదీప్, న్యాయవాదులు కారుకూరి సురేందర్, పద్మ, కళాశాల ప్రిన్సిపాల్ మహాత్మా సంతోష్ విద్యార్థులు పాల్గొన్నారు. -
జలదిగ్బంధంలో కామాయి గ్రామం
సాత్నాల: భోరజ్ మండలంలోని కామాయి గ్రామానికి చిరుజల్లులు పడితేనే రాకపోకలు నిలిచిపోతున్నాయి. గ్రామంలో దాదాపు 600 మంది నివసిస్తున్నారు. పెన్ గంగ నది పరీవాహక ప్రాంతంలో ఉండే ఈ గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే రహదారిపై లోలెవల్ వంతెన ఉండటంతో చిన్నవర్షానికే బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహిస్తుంది. కుడి వైపున పెన్‌గంగా, ఎడమవైపు లో లెవల్ వంతెనపై వరదనీరు పొంగిపొర్లడంతో బుధవారం సాయంత్రం వరకు గ్రామస్తులు జలదిగ్బంధంలో కూరుకుపోయారు. సాయంత్రం 7 గంటల తర్వాత బ్రిడ్జిపైన వరద నీటి ప్రవాహం తగ్గడంతో రాకపోకలు పునరుద్ధరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఇసుక లారీ పట్టివేత
బోథ్: మండల కేంద్రంలో ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. సీఐ వెంకటేశ్వర రావు, ఎస్సై ప్రవీణ్ కుమార్‌లు తెలిపిన వివరాలు.. బుధవారం నిర్మల్ జిల్లా సోఫీనగర్ నుంచి ఇసుక లారీ అనుమతి లేకుండా, రాయల్టీ చెల్లించకుండా మండల కేంద్రానికి చేరుకుంది. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన మాజీద్ అనే వ్యక్తి మండల కేంద్రానికి చెందిన ఇజాజ్ అనే వ్యక్తికి 40 టన్నుల ఇసుక తరలిస్తున్నట్లు లారీ డ్రైవర్ తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేసినా, విక్రయించినా కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. -
రోడ్డెక్కిన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు
కోటపల్లి: మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ఎంను తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు బుధవారం ఒక్కసారిగా రోడ్డెక్కారు. పాఠశాల వద్ద రోడ్డుపై మూడు గంటలపాటు బైఠాయించారు. మహిళా హెచ్ఎంను నియమించాలని, ఐటీడీఏ పీవో రావాలని నినదించారు. ఆదివాసీ సంఘాల నాయకులు జేక శేఖర్, బండి రమేశ్ విద్యార్థినులకు మద్దతునిస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థినులు మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కోటపల్లి ఎస్సై రాజేందర్ విద్యార్థినులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. విషయం తెలుసుకున్న డీటీడీవో జనార్ధన్, ఏటీడీవో పురుషోత్తం పాఠశాలను సందర్శించి విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. హెచ్ఎం వైఖరిపై విచారణ జరిపారు. హెచ్ఎం అసభ్య ప్రవర్తనపై విద్యార్థినులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని అధికారులు తెలిపారు. హెచ్ఎంను తొలగించాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్, గోపాల్, అభిరామ్,సంజయ్, సమ్మయ్య నాయక్ డీటీడీవోకు వినతిపత్రం అందజేశారు. -
పార్టీ పటిష్టతకు కృషి చేయాలి
ఆదిలాబాద్‌టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ పటిష్టతకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి, భూగర్భగనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో ఉమ్మడి జిల్లా నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఇందులో పార్టీ బలోపేతం, సమీకరణాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. స్థానిక సమస్యలు, కార్యకర్తల అభిప్రాయాలు, రాబోయే ఎన్నికల కార్యాచరణపై సమీక్షించారు. పార్టీని బలంగా తీర్చిదిద్దేందుకు నియోజకవర్గ స్థాయిలో నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, నాయకులు ఆత్రం సుగుణ తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు
చెన్నూర్: రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తే అధిక లాభాలు గడించవచ్చని కమిషనర్ ఆఫ్ హార్టికల్చర్ ఉమ్మడి ఆదిలాబాద్ సూపర్వైజింగ్ అధికారి అజ్మీరా ప్రేమ్‌సింగ్ అన్నారు. బుధవారం ఉద్యానవన, పట్టు పరిశ్రమ ఏడీ కే.అనితతో కలిసి చెన్నూర్ వ్యవసాయ మార్కెట్ ఆయిల్‌పామ్ గెలల కొనుగోలు కేంద్రంతోపాటు చెన్నూర్ మండలం ఎల్లక్కపేట దసలి పట్టు ట్రైనింగ్ సెంటర్, భీమారం ఆయిల్ పామ్ నర్సరీలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్ దిగుబడి వచ్చే వరకు అంతర పంటలుగా కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయాలన్నారు. జిల్లాలో దసలి పట్టు కాయ దిగుబడి బాగుందన్నారు. ఈ కార్యక్రమంలో సెరికల్చర్ ఏడీ పార్వతీ రాథోడ్, మాట్రిక్ కంపెనీ అధికారి ఉదయ్‌కుమార్, శాస్త్రవేత్త కే.పి.కిరణ్‌కుమార్, టెక్నికల్ అధికారి తిరుపతి, టి.అరుణ్, కె.సహజ, కళ్యాణి, అర్చన పాల్గొన్నారు. -
చెన్నూర్‌లో ఇసుక బజార్
చెన్నూర్: చెన్నూర్ పట్టణంలో త్వరలో గోదావరి ఇసుక బజార్ ఏర్పాటు చేయనున్నట్లు మైనింగ్ ఏడీ జగన్మోహన్రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన టీజీఎండీసీ పీవో శ్రీకాంత్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. బతుకమ్మ వాగు ఇసుక నాణ్యత లేకపోవడంతో గోదావరి ఇసుకకు డిమాండ్ ఉందన్నారు. వంద పడకల ఆసుపత్రి భవనం వెనుక ప్రభుత్వ స్థలంలో సాండ్ బజార్ ఏర్పాటు చేస్తామన్నారు. పీవో శ్రీకాంత్ మాట్లాడుతూ కొల్లూరు, ఎర్రాయిపేట గోదావరి నదుల నుంచి ఇసుక తీసుకొచ్చి స్టాక్ యార్డులో నిల్వ ఉంచుతామని తెలిపారు. ఆన్లైన్లో బుక్ చేసుకొన్న వారికి ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేస్తామని చెప్పారు. నాణ్యమైన ఇసుక టన్నుకు రూ.500 వరకు ఉండే అవకాశం ఉందన్నారు. గృహ నిర్మాణాలు నిలిచి పోకుండా వీలైనంత త్వరలోనే ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కార్యాచరణ పూర్తి చేసినట్లు తెలిపారు. -
ప్రాజెక్టులో యువకుడి మృతదేహం లభ్యం
తాంసి: మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టులో చేపలు పట్టడానికి వచ్చి గల్లంతైన యువకుడి మృత దేహం బుధవారం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బొక్కలగూడ కాలనీకి చెందిన అడ్డెల రఘు(24) తన స్నేహితుడితో కలిసి సరదాగా ప్రాజెక్టు వద్దకు మంగళవారం చేపలు పట్టడానికి వచ్చారు. చేపలు పట్టే క్రమంలో ప్రాజెక్టు గేట్ల సమీపంలో రఘు ఒక్కసారిగా అదుపుతప్పి నీటిలో పడిపోయి గల్లంతయ్యాడు. తన స్నేహితుడు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం నీటిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడి సోదరుడు అజయ్ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రణయ్ కుమార్ తెలిపారు. బాధితుడికి నష్టపరిహారం అందజేతకాసిపేట: మండలంలోని వెంకటపూర్ గ్రామానికి చెందిన రైతు బుద్దె రాజలింగుకు చెందిన లేగదూడ పెద్దపులి దాడిలో మృతి చెందగా బాధితుడికి అటవీశాఖ ఆధ్వర్యంలో 24గంటల్లో నష్టపరిహారం అందజేశారు. ముత్యంపల్లి సెక్షన్ పరిధి మల్కేపల్లి బీట్‌లో మంగళవారం పెద్దపులి దాడిలో లేగదూడ మృతి చెందగా బుధవారం బాధిత రైతుకు బెల్లంపల్లి రేంజ్ కార్యాలయంలో రేంజ్ అధికారి పూర్ణచందర్ రూ. 20వేల నష్టపరిహారం అందజేశారు. డెప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్‌నాయక్, ఎఫ్‌బీవో శ్రీధర్ పాల్గొన్నారు. కోడి పందేల స్థావరంపై దాడిజైపూర్: మండలంలోని దుబ్బపల్లి గ్రామ శివారులో బుధవారం కొంతమంది వ్యక్తులు కోడి పందేలు ఆడుతున్నట్లు వచ్చిన సమాచారంతో ఎస్సై శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు స్థావరంపై దాడి చేశారు. ఎస్సై మాట్లాడుతూ కోడి పందెం ఆడుతున్న సీసీసీ, నస్పూర్‌కు చెందిన గడ్డం సతీశ్, లక్షెట్టిపేట కుమ్మగూడెంకు చెందిన లశెట్టి సురేశ్, శ్రీరాంపూర్ తీగలపహాడ్కు చెందిన కట్కూరి రాజేశ్‌లను పట్టుకోగా ఇందారం గ్రామానికి చెందిన కూరగాయల శ్రీకాంత్, యతిరాజు వంశీ, మహేశ్, వైద్య గణేశ్‌లు, టేకుమట్ల గ్రామానికి చెందిన గోనె శరత్, గోదావరిఖనికి చెందిన పాకి సందీప్, నస్పూర్‌కు చెందిర రంగు సాయి, అరుణక్కనగర్‌కు చెందిన ఉదయ్‌లు పోలీసులను చూసి పారిపోయినట్లుగా తెలిపారు. పట్టుబడిన నిందితుల వద్ద ఒక్క కోడి, 31కోడి కత్తులు, రూ.3840లు, మూడు సెల్ ఫోన్లు, ఏడు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. చెన్నూర్ ఎంఈవోపై విచారణచెన్నూర్: మండల విద్యాధికారి కొమ్మెర రాధాకృష్ణమూర్తిపై డీటీఎఫ్ ఫిర్యాదు మేరకు విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎల్.లలిత బుధవారం విచారణ చేపట్టారు. ఎంఈవో విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని, ఉపాధ్యాయుల సర్వీసు బుక్ రికార్డు పూర్తి చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విచారణ నివేదిక డీఈవోకు నివేదించనున్నట్లు లలిత తెలిపారు. -
బాధితుడి నిర్వాకంతో అధికారుల హైరానా
కై లాస్‌నగర్: కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన ఓ వ్యక్తి కలెక్టరేట్లో మూర్చ పేరిట కిందపడిపోయి అధికారులు హైరానా పడేలా చేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇచ్చోడ మండలం గెర్జాం గ్రామానికి చెందిన శివాజీ అనే వ్యక్తి తన భూ సమస్యను కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు వచ్చాడు. తహసీల్దార్ చాంబర్లోకి వెళ్లి మూర్చపోయినట్లు కిందపడ్డారు. దీంతో తహసీల్దార్ శ్రీనివాస్‌తో పాటు కార్యాలయ ఉద్యోగులు ఆందోళన చెందారు. ఆర్డీవో వినోద్‌కుమార్ సైతం అక్కడి చేరుకున్నారు. బాధితుడు పడిపోయి ఉండడంతో వివరాలు ఆరా తీశారు. ఆ సమయంలోనే చేరుకున్న కలెక్టర్ రాజర్షిషా బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. దీంతో కార్యాలయ సిబ్బంది 108 అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించారు. కాగా తన భూమిని కొందరు కబ్జా చేయగా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని మూర్చపోయినట్లు నాటకాలు ఆడినట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఆరోగ్య సమస్యపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. -
భూములు కబ్జా కానివ్వను
● ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావులక్సెట్టిపేట: విద్యాసంస్థలు, ఆసుపత్రుల భూములు కబ్జాకు గురవుతున్నాయని, ఇంచు జాగా వదిలిపెట్టకుండా కాపాడుతానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 13న ఆసుపత్రి భవనం ప్రారంభానికి మంత్రి దామోదర రాజనర్సింహా హాజరవుతారని తెలిపారు. పట్టణంలోని కళాశాల మైదానం కబ్జాకు గురైందని, వాటిని వెలికి తీస్తానని, అంబేద్కర్ చౌక్ నుంచి బస్టాండు వరకు రోడ్డు విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. అనంతరం పట్టణంలో నిర్మాణం చేపట్టే పలు అభివృద్ధి పనులపై వివరించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ.ఆరీఫ్, మండల అధ్యక్షుడు పింగిలి రమేష్, నాయకులు చింత అశోక్, నాగభూషణం, శ్రీనివాస్, పూర్ణచందర్, దేవేందర్ వైధ్యులు శ్రీనివాస్, సురేష్, పవిత్ర పాల్గొన్నారు. -
భూగర్భ జలాలు కాపాడుకోవాలి
లక్సెట్టిపేట: భూగర్భ జలాలను కాపాడేందుకు కృషి చేయాలని జలశక్తి అభియాన్ సైంటిస్ట్ రాంబాబు సూచించారు. మంగళవారం మండలంలోని తిమ్మాపూర్, జెండా వెంకటాపూర్, లక్ష్మీపూర్ గ్రామాలను సందర్శించి ప్రజలతో మాట్లాడారు. ఇంకుడుగుంతలతో భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. ఇంటింటా ఇంకుడుగుంత నిర్మించుకోవాలని సూ చించారు. మండలంలోని గ్రామపంచాయతీలను రెండు భాగాలుగా విభజించి ప్రతీ ఇంటికి ఇంకుడుగుంత నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన క ల్పించాలని ఆదేశించారు. అనంతరం ఇంకుడుగుంతల నిర్మాణ పనులు పరిశీలించారు. ఎంపీడీవో స రోజ, ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్, సీడీసీఎల్ ఆర్పీ సదానందం, ఏపీవో వేణుగోపాల్, డీఆర్డీఏ సి బ్బంది సత్యనారాయణ, రాజ్‌కుమార్, మధు, ఈసీ శైలజ, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
‘పేదల గుండెల్లో నిలిచిన నేత వైఎస్సార్’
మంచిర్యాలటౌన్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల గుండెల్లో నిలిచిన మహానేత అని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రా వు కొనియాడారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివా సంలో మంగళవారం డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరా ల సురేఖతో కలిసి వైఎస్సార్ జయంతి నిర్వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ని వాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజల కు అండగా నిలిచారని తెలిపారు. తనకు వైఎస్సార్ అత్యంత సన్నిహితులని పేర్కొన్నారు. ఆయన లేని లోటు తీరనిదని పేర్కొన్నారు. తాజా మాజీ ప్రతి నిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సమస్యలు తెలుసుకునేందుకే ‘మార్నింగ్ వాక్’
జన్నారం: సమస్యలు తెలుసుకునేందుకే ‘పొద్దుపొడుపు–బొజ్జన్న అడుగు’ (మార్నింగ్ వాక్) కార్యక్ర మం నిర్వహిస్తున్నట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం మండలంలోని పొనకల్ గాంధీనగర్‌కు వెళ్లారు. గ్రామస్తులు రోడ్లు, డ్రైనేజీల సమస్యలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ.. ఇళ్లు రాని అర్హులకు మరో విడతలో మంజూ రు చేస్తామని చెప్పారు. ఇక నుంచి ప్రతీ నెల ఒక మండలాన్ని ఎంచుకుని దినమంతా ఒక గ్రామాన్ని పర్యటించి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని చెప్పారు. ఏడాదిలో సమస్యలు లేని గ్రామాలుగా చూడడమే తన లక్ష్యమని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాసమస్యలు గుర్తించి తెలిపితే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ముజా ఫర్ అలీఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారా యణ, నాయకులు మోహన్‌రెడ్డి, ఇసాక్, ఇంద య్య, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
మంచిర్యాలలో ‘లీకేజీ’ల మయం
● తరచూ పైపులైన్లకు లీకేజీలు ● నత్తనడకన మరమ్మతు పనులు ● కలుషితమవుతున్న తాగునీరు ● ‘అమృత్’ పనుల్లో తీవ్ర జాప్యం ● బల్దియాల్లో నిత్యం నీటి గోసముల్కల్లలో పైపులైన్‌కు మరమ్మతు చేస్తున్న కార్పొరేషన్ సిబ్బందిజనాభా 2,48,283వాటర్ విభాగం సిబ్బంది : 83 మందినల్లా కనెక్షన్లు 42,564మంచిర్యాల కార్పొరేషన్ వివరాలుఅమృత్ 2.0 పథకంలో మంజూరైన నిధులు రూ.48.50 కోట్లు (మంచిర్యాల), రూ.73 కోట్లు (నస్పూరు) -
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
● కలెక్టర్ కుమార్దీపక్జైపూర్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ కుమార్‌దీపక్ సూ చించారు. మండలంలోని పెగడపల్లి, టేకుమట్ల గ్రా మాల్లో నిర్వహించిన వనమహోత్సవం–2025లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణతో కలిసి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వనమహోత్సవం–2025లో భా గంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను ఆయా శా ఖల అధికారులు పూర్తిస్థాయిలో సాధించేలా సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. జిల్లా గ్రా మీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పెగడపల్లిలో వె య్యి మొక్కలు, టేకుమట్లలో 600మొక్కలు నాటిన ట్లు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని కే జీబీవీని సందర్శించారు. తరగతి గదులు, వంటశా ల, పరిసరాలు పరిశీలించారు. తరగతి గదిలో వి ద్యార్థినులతో మాట్లాడి వారి సామర్థ్యాలు తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు. నూతనంగా చేపట్టిన కేజీబీవీ భవన నిర్మాణ పనులు పరిశీలించి త్వరగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. -
పనులు త్వరగా పూర్తిచేయాలి
లక్సెట్టిపేట: ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి భవన ని ర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మె ల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు సూచించారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన 30 పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఈ నెల 13న ఆస్పత్రి భవనాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహతో ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం అధికారులకు పలు సూ చనలు చేశారు. ఆయన వెంట జీసీసీ చైర్మన్ కో ట్నాక తిరుపతి, నాయకులు శ్రీనివాస్, ఎండీ ఆరీఫ్, పింగిళి రమేశ్, చింత అశోక్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక రీచ్ ఏర్పాటు చేయాలి
చెన్నూర్: స్థానికులకు గోదావరి ఇసుక అందుబాటులో ఉండేలా రీచ్ ఏర్పాటు చేయాలని బీ జేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌ డ్ డిమాండ్ చేశారు. గోదావరి ఇసుకకు అనుమతి ఇవ్వాలని ట్రాక్టర్ యజమానులు మంగళవారం చేపట్టిన సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి నిర్మాణదారులు దళారులను ఆశ్రయించి ట్రాక్ట ర్ ఇసుకకు రూ.4వేలు చెల్లించాల్సిన పరిస్థితి నె లకొందని తెలిపారు. కలెక్టర్ స్పందించి ఆన్లై న్ పద్ధతిలో చెన్నూర్ ప్రజలకు గోదావరి ఇసుక తరలించేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ట్రాక్టర్ యజమానులు పాల్గొన్నారు. -
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రజలు నిత్యం తాగునీటికి తండ్లాడుతున్నారు. కార్పొరేషన్ పరిధిలో తరచూ పైపులైన్లకు లీకేజీలేర్పడుతున్నాయి. ఓ చోట మరమ్మతు చేసేలోపే మరోచోట సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మరమ్మతుల్లో జాప్యం కారణంగా తాగునీరు కలుషితమవుతోంది. జ
ఆలస్యంగా అమృత్ పనులు● బెల్లంపల్లికి వచ్చేనా గోదారి జలాలు బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సరఫరా సరిగా లేదు. ఒక్కోసారి సరిగా శుద్ధి చేయకుండానే నీటి సరఫరా చేస్తున్నారు. కార్మికేతర కుటుంబాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతోంది. సింగరేణి యాజమాన్యం కార్మిక కుటుంబాలకు నీటిని అందిస్తోంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అడ ప్రాజెక్ట్ నుంచి సరఫరా అవుతున్న నీటిని ప్ర జలు తాగలేకపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల వద్ద కొని తాగుతున్నారు. కన్నాలబస్తీ ఓవర్ హెడ్ ట్యాంక్ వాల్వ్ లీకై ంది. ఇందులోకి మురుగునీరు వెళ్లి తాగునీరు కలుషితమవుతోంది. అడ ప్రాజెక్ట్ ఇంటెక్ వెల్ నుంచి బెల్లంపల్లికి వచ్చే మిషన్ భగీరథ పైపులైన్ తరచూ లీకవుతోంది. నెలకోసారి ఎక్కడో చోట పైపులు ఒత్తిడికి గురై లీ కేజీలేర్పడుతున్నాయి. లీకేజీలకు మరమ్మతు చేయాలంటే వారం పడుతోంది. దీంతో బస్తీవాసులు చేతిపంపులను ఆశ్రయిస్తున్నారు. అంతర్గత పైపుల లీకేజీని మిషన్ భగీరథ, మున్సిపల్ సిబ్బంది వేర్వేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఒక్కో విభాగం నుంచి 10 మంది సి బ్బంది పని చేస్తున్నా సమస్య వచ్చిన వెంట నే పరిష్కారం లభించడం లేదనే ఆరోపణ లున్నాయి. కంపెనీ క్వార్టర్లలో నివాసముంటున్న కార్మికులు, నల్లా కనెక్షన్ తీసుకున్న కా ర్మికేతరులకు సింగరేణి యాజమాన్యం నీటి సరఫరా చేస్తోంది. పూర్తిస్థాయిలో కార్మికులు నివాసముంటున్న బస్తీల్లో రోజువారీగా నీటి ని సరఫరా చేస్తుండగా, మిగతా బస్తీల్లో మూ డు, నాలుగు రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. నీటి సరఫరాకు ప్రత్యేకంగా బిల్డింగ్ డిపార్ట్మెంట్ ఉన్నా ఆటంకాలేర్పడుతున్నా యి. గోదావరి జలాలు అందించేందుకు ఎ ల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి బెల్లంపల్లి వరకు అ మృత్ 2.0 పథకం ద్వారా 25 కిలో మీటర్ల వ రకు అంతర్గత పైపులైన్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుతం 11కిలో మీటర్ల వరకే పనులు పూర్తయ్యాయి. బంగారు మైసమ్మ గుడి పక్కన 11లక్షల గ్యాలన్ల నీటి సామర్థ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంక్ పనులూ మందకొడిగా సాగుతున్నాయి. అ మృత్ పథకం అమలు, పైపులైన్ నిర్మాణ ప నులను ప్రజారోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నీటిని కొని తాగుతున్నం మిషన్ భగీరథ నీరు ఐదారురోజులకోసారి వస్తోంది. అడ ప్రాజెక్ట్ నీళ్లు శుద్ధి చేసి పంపిస్తున్నా తాగలేక పోతున్నం. తప్పనిసరి పరిస్థితుల్లో ప్యూరిఫైడ్ వాటర్ కొని తాగుతున్నం. నేటికీ పైపులైన్ పనులు పూర్తి కాలేదు. మాకు గోదావరి జలాలు ఎప్పడిస్తారో అధికారులకే తెలియాలి. – ఆర్ అయిలయ్య, టేకులబస్తీ మందమర్రిలో ‘డబుల్’ కష్టాలు మందమర్రిరూరల్: మందమర్రి మున్సిపాలిటీ పరి ధిలోని పాలచెట్టు ఏరియా సమీపానగల డబుల్బెడ్రూం నివాసాల ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ 243 కుటుంబాలుండగా ఇప్పటివరకు పైపులైన్ లేక తాగునీరు సరఫరా కావడంలేదు. వెంటనే పైపులైన్ ఏర్పాటు చేసి తాగునీరు సరఫరా చేయాలని ఆ కాలనీవాసులు కోరుతున్నా రు. మున్సిపాలిటీలో 24 వార్డులుండగా నీటి సరఫ రా కోసం 18 మంది సిబ్బందిని కేటాయించారు. మందమర్రికి సరఫరా అయ్యే తాగునీరు ఎల్లంపల్లి వద్దనే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి శుభ్రమై వస్తాయని మున్సిపల్ ఏఏఈ సందీప్ తెలిపారు. అయినప్పటికీ మందమర్రిలోని వాటర్ ట్యాంకుల్లో బ్లీచింగ్ పౌడర్ వేసి శుభ్రమైన నీరు సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. లీకేజీ సమస్య వచ్చిన వెంటనే మరమ్మతు చేయిస్తున్నామని తెలిపారు.అమృత్ 2.0 కింద నస్పూరు బీఆర్ఎస్ భవనం వద్ద చేపట్టిన వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులుమంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సరఫరాలో తరచూ ఇబ్బందులేర్పడుతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పైపులైన్ లీకేజీ కారణంగా వర్షపునీరు చేరి తాగునీరు కలుషితమవుతోంది. ఒకచోట లీకేజీలకు మరమ్మతు పూర్తి చేయగానే మరోచోట సమస్య ఉత్పన్నమవుతోంది. మంచిర్యాల మున్సిపాలిటీకి 15 ఏళ్ల నుంచే ముల్కల్ల గోదావరి వద్ద ఫిల్టర్ బెడ్ నిర్మించి అక్కడి నుంచి నీటి సరఫరా చేస్తున్నారు. రూ.29.30 కోట్లతో ఫిల్టర్ బెడ్ నిర్మించగా మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీటిని ముల్కల్ల ఫిల్టర్‌బెడ్‌కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి మంచిర్యాలకు సరఫరా చేస్తున్నారు. 15 ఏళ్ల క్రితం వేసిన పైపులైన్‌కు తరచూ లీకేజీలేర్పడుతున్నాయి. గతేడాది అమృత్ 2.0 పథకం కింద మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.48.50 కోట్లు, నస్పూరు మున్సి పాలిటీకి రూ.73 కోట్లు కేటాయించారు. మంచిర్యాలలో కొత్తగా 6,100 నల్లా కనెక్షన్లు, 21 కిలోమీటర్ల పైపులైన్ మార్పు, ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. నస్పూరులో 5వేల నల్లా కనెక్షన్లు, 18 కిలోమీటర్ల పైపులైన్, ఏడు వాటర్ ట్యాంకులు, ఒక ఫిల్టర్ బెడ్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఏడాది క్రితం పనులు ప్రారంభించారు. మంచిర్యాల, నస్పూరులో పనులు 30 శాతమే అయ్యాయి. వచ్చే ఏడాది జూన్‌లోపు పూర్తిచేయాల్సి ఉండగా జాప్యం జరుగుతోంది. గతంలో వేసిన పైపులకు తరచూ లీకేజీలేర్పడుతుండడంతో తాగునీరు కలుషితమవుతోంది. దీనికితోడు మంచిర్యాల కార్పొరేషన్ తాగునీటి సరఫరా విభాగంలో 83 మంది మాత్రమే పని చేస్తుండగా పూర్తిస్థాయిలో సమస్యలు వెంటవెంట పరిష్కారం కావడంలేదు. అమృత్ 2.0 పథకం పనులు పూర్తయితేనే కార్పొరేషన్ పరిధిలోని తాగునీటి పైపులైన్ లీకేజీలకు ఫుల్స్టాప్ పడే అవకాశముంది. చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో అధికా రుల నిర్లక్ష్యం కారణంగానే తాగునీటి సమస్య ఉన్న ట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ పరి ధిలో 18 వార్డులుండగా, 25,579 మంది జనాభా ఉంది. 7,629 నల్లా కనెక్షన్లకు నేటికీ 5,676 మాత్ర మే ఇచ్చారు. మరో 1,953 ఇవ్వాల్సి ఉంది. వార్డుల్లో 190 చేతిపంపులున్నాయి. మిషన్ భగీరథ నుంచి ప్రతీరోజు 3.5 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ ఫర్ డే) సరఫరా చేస్తుండగా చేతిపంపుల నుంచి సుమారు 50వేల లీటర్ల నీరు అందుతోంది. అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన ట్యాంక్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్, బోర్ల నుంచి వేసిన పైపులైన్ పూర్తిగా డ్రైనేజీల్లోనే ఉంది. దీంతో పైపులైన్లకు లీకేజీలేర్పడితే తా గునీరు కలుషితమవుతోంది. గత ఫిబ్రవరిలో నల్లా ల ద్వారా వచ్చిన కలుషిత నీరు తాగి బట్టిగూడెం, పద్మశాలివాడ, మంగలిబజార్, జెండవాడకు చెందిన సుమారు 100 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. అయినా నేటికీ పైపులైన్లు డ్రైనేజీల నుంచి తొలగించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇది వానాకాలం కావడంతో తా గునీరు కలుషితమయ్యే ప్రమాదమున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. సమస్యలు పరిష్కరిస్తాంమురుగు కాలువల్లో పైపులైన్లు ఉన్న విషయం నా దృష్టికి వచ్చింది. మున్సిపాలిటీలో పైపులైన్ల లీకేజీ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే డ్రైనేజీల్లోని పైపులైన్లను తొలగించే ఏర్పాట్లు చేస్తాం. నీరు కలుషితం కాకుండా చర్యలు చేపడతాం. తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. – విద్యాసాగర్, మిషన్ భగీరథ డీఈ, చెన్నూర్నల్లా కనెక్షన్లే లేవుకొత్తగూడెం బైపాస్ రోడ్డులో నల్లా కనెక్షన్లే లేవు. రోజూ ఇతర నల్లాల వద్ద నుంచి నీటిని తెచ్చుకుంటున్నం. వానాకాలంలోనూ తాగునీటికి గోస పడుతున్నం. అధికారులు స్పందించి మిషన్ భగీరథ పైపులైన్ వేయాలె. మా కాలనీలో నల్లా కనెక్షన్లు ఇయ్యాలె. – వరప్రసాద్, కొత్తగూడెం కాలనీ భగీరథ నీరు తాగుతలేంమిషన్ భగీరథ నీరు వాసనొస్తోంది. బతుకమ్మ వాగు నుంచి వచ్చే నీరే బాగుంటోంది. కాలనీలకు బతుకమ్మ వాగునీటి సరఫరా పునరుద్ధరించాలి. మైసమ్మ గుడి పక్కనున్న నల్లా వద్ద నుంచి బతుకమ్మ వాగు నీటిని తెచ్చుకుని తాగుతున్నం. – రాగుల సమ్మయ్య, మహంకాళివాడ సార్ల నిర్లక్ష్యం.. చెన్నూర్‌కు శాపం -
లక్ష్యాల సాధనకు కృషి చేయాలి
శ్రీరాంపూర్: కంపెనీ నిర్దేశించిన వార్షిక ఉత్పత్తి ల క్ష్యాల సాధనకు కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్ (పా) గౌతం పొట్రు సూచించారు. డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటిసారి ఆయన మంగళవారం శ్రీరాంపూర్‌లో పర్యటించారు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్, ఆర్కే న్యూటెక్ గనులను సందర్శించి బొగ్గు ఉత్పత్తిని పరిశీలించారు. అనంతరం జీఎం కార్యాలయంలో బొగ్గు ఉత్పత్తిపై రీజియన్ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ.. వానాకాలంలో ఓపెన్ కాస్ట్ గనుల్లో వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ఉత్పత్తి లక్ష్యాలు సాధిస్తేనే సింగరేణి అభివృద్ధి సాధిస్తుందని తెలి పారు. రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని సూ చించారు. ఏరియా జీఎం శ్రీనివాస్, బెల్లంపల్లి జీఎం విజయభాస్కర్‌రెడ్డి, మందమర్రి జీఎం దే వేందర్, శ్రీరాంపూర్ ఏరియా ఎస్వోటూ జీఎం స త్యనారాయణ, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా, అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, ఏజెంట్ రాజేందర్, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వ ర్లు, మేనేజర్ శ్రీనివాస్, రక్షణాధికారి శ్రీధర్, న్యూ టెక్ మేనేజర్ శ్రీనివాస్, రక్షణాధికారి కొట్ట్టె రమేశ్, పిట్ సెక్రటరీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
వాగు దాటితేనే వైద్యం
● అర్ధరాత్రి అస్వస్థతకు గురైన చిన్నారి ● ప్రాణాలకు తెగించి వరదదాటి ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు ● వంతెన నిర్మించాలని గ్రామస్తుల వేడుకోలు ఇంద్రవెల్లి: గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే వాగులు, ఒర్రెలపై వంతెనలు లేకపోవడంతో ఆదివాసీలకు రాకపోకలు కష్టంగా మారుతున్నాయి. అనారోగ్య సమస్యలు తలెత్తిన అత్యవసర సమయాల్లో ప్రాణాలు పణంగా పెట్టి వరద దాటితేనే వైద్యం అందుతోంది. ఇంద్రవెల్లి మండలం మండలంలోని మామిడిగూడ(బి), మామిడిగూడ(జి) గ్రామాల మధ్య ఉన్న వాగుపై వంతెన లేదు. మామిడిగూడ(బి) గ్రామానికి చెందిన ఉయిక స్వప్న, గోవింగ్రావ్ దంపతుల కుమార్తె సోమవారం రాత్రి కడుపు నొప్పితో బాధపడింది. కుటుంబ సభ్యులు రాత్రిపూట చిమ్మచీకటిలోనే ఓ చిన్నలైటు, గ్రామస్తుల సాయంతో వాగు దాటారు. ఆటో సాయంతో మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి చిన్నారికి చికిత్స అందించారు. తమ గ్రామానికి పక్కా రోడ్డు, వాగుపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు ప్రారంభంకాలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో నాలుగు నెలలపాటు ప్రాణాలకు తెగించి వరద నీటితో సాహసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. ఇప్పటికైనా వంతెన, రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య
భీమారం: ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్వేత, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని కాజిపల్లికి చెందిన జాగేటి రాంచెందర్ (51) కూలీ పనులు చేస్తూనే గతేడాది కొంతమేర భూమి కౌలుకు తీసుకుని అప్పుచేసి పత్తి సాగు చేశాడు. దిగుబడి రాక అప్పులు పెరగడంతో మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం రాత్రి గడ్డిమందు తాగి భార్య భారతితో చెప్పాడు. వెంటనే మంచిర్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందాడు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. దొంగలను గుర్తిస్తే సమాచారం ఇవ్వండిచెన్నూర్: మండలంలోని సుబ్బారాంపల్లిలో వృద్ధురాలి మెడలోని గొలుసు దొంగిలించిన వారిని గుర్తి స్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ దేవేందర్‌రావు తెలిపారు. మంగళవారం సీసీ ఫుటేజీ చిత్రాలను విడుదల చేశారు. గుర్తిస్తే 8712656553 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రియుని ఇంటి ఎదుట బైఠాయింపుచెన్నూర్: చెన్నూర్‌కు చెందిన బట్టల వ్యాపారి కుడికాల మధు పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపిస్తూ పట్టణంలోని కుమ్మరిబొగుడ కాలనీకి చెందిన బొడమిది సౌమ్య మంగళవారం ప్రియుని ఇంటి ఎదుట బైఠాయించింది. పదేళ్ల క్రితం తనను ప్రేమించి తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది. మూడేళ్ల క్రితం మళ్లీ తన వెంటపడి పెళ్లి చేసుకున్నాడని, అబార్షన్కూడా చేయించాడని పేర్కొంది. ఇంటికి తీసుకెళ్తానని చెప్పి కాలయాపన చేస్తున్నాడని వాపోయింది. అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ఫిర్యాదు చేస్తే విచారించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సౌమ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దేవేందర్‌రావు తెలిపారు. పోచంపల్లిలో మరో యువతి.. తాండూర్: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు న్యాయపోరాటానికి దిగిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. తాండూర్ మండలం పోచంపల్లికి చెందిన బోరేం శ్వేత, సమీప బంధువైన గొర్లపల్లి కళ్యాణ్ తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని కోరగా సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణి ప్రదర్శించాడు. పెళ్లి చేసుకోవాల్సిందేనని గట్టిగా పట్టుబట్టడంతో చేసుకోనని చెప్పేశాడు. దీంతో సదరు యువతి మంగళవారం ప్రియుడి ఇంటి ఎదుట న్యాయ పోరాటానికి దిగింది. మాదారం ఎస్సై సౌజన్య యువకుడిని పిలిపించి మాట్లాడతానని నచ్చజెప్పడంతో తాత్కాలికంగా తన న్యాయ పోరాటాన్ని విరమించింది. కాగా ఈ ఘటన మండలంలో చర్చనీయాంశమైంది. -
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
జైపూర్: మహిళలలు ఆర్థికంగా ఎదగాలని సె ర్ప్ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అంజయ్య సూ చించారు. మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మంగళవారం ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ తేడాది ప్రగతి నివేదికలు, ఈ ఏడాది చేపట్టను న్న ప్రణాళికలను మండల సమాఖ్యలో ఏపీఎం రాజ్‌కుమార్ వివరించారు. వారు మాట్లాడు తూ.. సీ్త్రనిధి రుణాలు, ఆర్థిక అక్షరాస్యత, మ హిళల జీవిత బీమా, పౌల్ట్రీ యూనిట్, డెయిరీ పార్లర్, స్కూల్ యూనిఫాంలు, వడ్డీ లేని రు ణాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ పనులు చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఆర్టీసీ బస్సులు, మినీ గోదాంలు, పెట్రోల్ బంక్, మహిళా క్యాంటీన్, మహిళా శక్తిబజార్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న మహిళలను సన్మానించారు. -
సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలి
ఇంద్రవెల్లి: ఈ నెల 9న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు గోడం గణేశ్ కోరారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను కుదించి తీసుకువచ్చిన నాలుగు కోడ్లు, కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయన్నారు. సమావేశంలో తొడసం నాగోరావ్, కుమ్ర చంద్రకళ, రఘురాం, అమృత్‌రావ్, మానిక్రావ్, గేడం భరత్, జుగ్నాక్ భరత్, తదితరులు పాల్గొన్నారు. కోడలును వేధించిన మామకు ఏడేళ్ల జైలుఆసిఫాబాద్: లైంగికంగా కోడలును వేధించిన మామకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.30వేలు జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఎంవీ.రమేశ్ మంగళవారం తీర్పునిచ్చారు. ఈ మేరకు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ వివరాలు వెల్లడించారు. సిర్పూర్(టి) మండలం చీలపెల్లి గ్రామానికి చెందిన మోర్లె లక్ష్మణ్‌కు 2015లో హత్య కేసులో కోర్టు 14ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆరేళ్ల జైలు జీవితం అనంతరం బెయిల్‌పై వచ్చాడు. లక్ష్మణ్ భార్య గతంలో చనిపోగా రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్య కూడా చనిపోయింది. ఈ క్రమంలో కోడలిని అసభ్య పదజాలంతో దూషిస్తూ లైంగిక వాంఛ తీర్చాలని అసభ్యకరంగా ప్రవర్తించాడు. గత ఏడాది అక్టోబర్ 7న బాధితురాలి ఫిర్యాదు మేరకు సిర్పూర్(టి)లో కేసు నమోదైంది. ఎస్సై కమలాకర్ కేసు దర్యాప్తు చేశారు. పీపీ జగన్మోహన్రావు, సీడీవో అండ్ లైజనింగ్ ఆఫీసర్ రాంసింగ్ కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం, కౌటాల సీఐ రమేశ్, ఎస్సై కమలాకర్, సీడీవో బాలాజీని ఎస్పీ అభినందించారు. పులి దాడిలో లేగదూడ హతంకాసిపేట: మండలంలోని వెంకటాపూర్ శివారు అటవీప్రాంతంలో పెద్దపులి దాడిలో లేగ దూడ మృతి చెందింది. బెల్లంపల్లి అటవి రేంజ్ అధికారి పూర్ణచందర్ తెలిపిన వివరాల ప్రకారం. మంగళవారం మండలంలోని వెంకటపూర్‌కు చెందిన రైతు బుద్దె రాజలింగు తన లేగ దూడ పులి దాడిలో మృతి చెందిందని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. సమీపంలో కుంట వద్ద పెద్దపులి అడుగులు ఉన్నట్లు గుర్తించారు. పెద్దపులి సంచరిస్తున్నందువల్ల వెంకటాపూర్, లక్ష్మీపూర్, మల్కేపల్లి, సోనాపూర్ గ్రామాల ప్రజలు పంట పొలాల్లోకి వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని సూచించారు. పశువుల కాపారులు అడవిలోకి వెళ్లవద్దన్నారు. బాధిత రైతుకు నష్టపరిహారం అందించేందుకు ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. చేపలు పట్టేందుకు వెళ్లి యువకుడి గల్లంతుతాంసి: మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టులో చేపలు పట్టడానికి వెళ్లి యువకుడు గల్లంతైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆదిలాబాద్‌కు చెందిన అడేల్ల రఘు తన మిత్రుడు శ్రావణ్‌తో కలిసి చేపలు పట్టడానికి ప్రాజెక్టు వద్దకు వచ్చాడు. ప్రాజెక్టు దిగువ భాగంలో చేపలు పడుతుండగా లోతు ఎక్కువగా ఉండడంతో ఈతరాక నీటిలో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జాలర్లతో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై ప్రణయ్ కుమార్ తెలిపారు. -
ఖజానా చెరువును ఈదేశాడు..
● నిర్మల్ వైద్యుడి ఘనత ● భారతదేశ చిత్రపటం ఆకృతిలో స్విమ్మింగ్ ● ఐరన్‌మ్యాన్ చాలెంజ్–2025కు సన్నద్ధం నిర్మల్‌ఖిల్లా: నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన న్యూరో ఫిజీషియన్ డాక్టర్ బి.లక్ష్మీనర్సింహారెడ్డి చారిత్రక ప్రాశస్త్యం ఉన్న గొలుసుకట్టు చెరువుల్లోని ఖజానా చెరువులో సుమారు 40 నిమిషాల్లో కిలోమీటర్ దూరం మేర ఈత ద్వారా ఆరోగ్య ప్రాధాన్యత, ప్రత్యేకతను చాటారు. రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి వాటిల్లో ఆయన ప్రత్యేక నైపుణ్యం సాధించారు. ప్రతీరోజు ఈత అభిరుచిగా మారింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో అలనాటి నిమ్మనాయుడు కాలం నుంచి గొలుసు కట్టు చెరువుల్లో చారిత్రక ఖజానా చెరువుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వెంకటాద్రిపేట్ సమీపంలోని ఈ చెరువులో మంగళవారం ఈత కార్యక్రమాన్ని చేపట్టిన ఆయన సరిగ్గా 41 నిమిషాల్లో 919 మీటర్ల మేర దూరాన్ని అవలీలగా ఈదారు. జియోట్యాగింగ్ ద్వారా ఆయన స్విమ్మింగ్ చేసిన మార్గం అచ్చు భారతదేశ చిత్రపటం ఆకృతిని పోలి ఉండడం గమనార్హం. గోవాలో వచ్చే నవంబర్ 9న అరేబియా సముద్రంలో నిర్వహించే ఐరన్ మ్యాన్ స్విమ్మింగ్ చాలెంజ్–2025లో విజయమే లక్ష్యంగా సాధన చేస్తున్నారు. గత సంవత్సరం అక్టోబర్‌లో నెదర్లాండ్స్ దేశంలోని ఆమ్‌స్టర్‌డమ్‌లో నిర్వహించిన మారథాన్ రన్‌లోనూ 34.8 కిలోమీటర్ల దూరం పరుగెత్తి పురస్కారం అందుకున్నారు. సైక్లింగ్‌లోనూ అభిరుచి కలిగిన ఆయన నిర్మల్ నుంచి మహారాష్ట్ర సరిహద్దు పాలజ్ గణేశ్ ఆలయానికి దాదాపు 75కిలోమీటర్ల దూరం, నిర్మల్ నుంచి ఆదిలాబాద్ జిల్లా జైనథ్ సూర్య దేవాలయం వరకు దాదాపు 200 కిలోమీటర్ల పైగా లక్ష్యాన్ని చేరుకున్నారు. ఒక వైద్యుడిగా రోగులకు సేవలందించే ప్రయత్నంలో ఆరోగ్యంపై పలు విధాలుగా చైతన్యవంతం చేస్తాం. ఇందులో భాగంగానే ఫిట్నెస్ అవగాహన కోసం స్వీయంగా ఆచరిస్తూ ఇతరులకు చెప్తే బాగుంటుందని ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాను...’ అని లక్ష్మీనర్సింహరెడ్డి తెలిపారు. -
సబ్సిడీ ఎరువులు తరలిస్తున్న ఐదుగురిపై కేసు
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు అందిస్తున్న ఎరువులను అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తెలిపారు. రైతులు ఇచ్చిన సమాచారం మేరకు దాడి చేసి రెండు వాహనాలను జైనథ్ పోలీసులు మంగళవారం పట్టుకున్నట్లు పేర్కొన్నారు. బేల మండలం మార్క్‌ఫెడ్ అనుబంధ సంస్థ హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ (హాకా) ప్రొప్రైటర్ సునీల్, ఉద్యోగి అజయ్ మహారాష్ట్రకు చెందిన ఫర్టిలైజర్ దుకాణ యజమాని నిఖిల్‌తో ఒప్పందం కుదుర్చుకుని రూ.3 లక్షలు విలువ చేసే 150 బ్యాగుల యూరియాను రెండు వాహనాల్లో తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. వాహన డ్రైవర్లు వంకాడే దిలీప్, చిలకలవార్ చంద్రశేఖర్‌తో పాటు సునీల్, అజయ్, నిఖిల్‌పై కేసు నమోదు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో జైనథ్ సీఐ డి.సాయినాథ్, బేల ఎస్సై నాగ్నాథ్ పాల్గొన్నారు. -
గవర్నర్‌ను కలిసిన మాజీ ఎంపీ ‘సోయం’
కైలాస్‌నగర్/ఆసిఫాబాద్ : కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 49 రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎంపీ సోయం బాపూరావు మంగళవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 49 ఆదివాసీ హక్కులను కాలరాసేలా ఉందని, వెంటనే రద్దుచేసి ఆ ప్రాంతంలో నివసించే గిరిజన, గిరిజనేతరులకు స్వేచ్ఛ కల్పించాలని కో రారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్లను ఏకపక్ష ంగా టైగర్ కన్జర్వేషన్‌లో కలపడంతో అడవులు, అటవీ భూములను నమ్ముకుని బతికే గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లుతుందన్నారు. రాష్ట్ర ప్ర భుత్వం పోడు భూముల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు ముందుకు వస్తున్న క్రమంలో జీవో జారీ చేయడం సరికాదన్నారు. ఈ జీవో కారణంగా 339 ప్రభావిత గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. ఆదివాసీ గిరిజనులకు న్యాయం చేస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో అఖిల భారతీయ గోండ్వానా మహాసభ ఉపాధ్యక్షుడు సిడాం అర్జు, జిల్లా మేడి కుర్సంగే మోతిరాం, రాజ్‌గోండ్ రాష్ట్ర కార్యదర్శి పెందూర్ సుధాకర్, రాజ్‌గోండ్ సేవా సమితి జిల్లా కార్యదర్శి నర్సింగ్‌రావు పాల్గొన్నారు. -
నేడే సార్వత్రిక సమ్మె
● సింగరేణిలో ఏకమైన కార్మిక సంఘాలు ● విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపు ● లేబర్ కోడ్‌లతోపాటు సింగరేణి పరిధిలో డిమాండ్లు శ్రీరాంపూర్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె జరగనుంది. ఈ సమ్మెను సింగరేణిలో విజయవంతం చేసేందుకు కార్మికసంఘాలన్నీ ఏకమయ్యాయి. కొద్ది రోజులుగా సమ్మె విజయవంతం కోసం కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి గనులపై విస్తృత ప్రచారం నిర్వహించాయి. బీఎంఎస్ మినహా అన్ని సంఘాలు సమ్మెకు ‘సై’ అనడంతో సింగరేణిలో సమ్మె అనివార్యమైంది. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిథ్య సంఘం ఐఎన్టీయూసీతో పాటు సీఐటీయూ, టీబీజీకేఎస్ కలిసి సింగరేణి కార్మిక సంఘాల జేఏసీగా ఏర్పడ్డాయి. హెచ్ఎంఎస్, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, ఐఎఫ్టీయూ, ఏఐఎఫ్టీయూ, టీఎ న్టీయూసీ సంఘాలు సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక పేరుతో మరో జేఏసీగా ఏర్పడి సమ్మెలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయి. ఇదిలా ఉంటే మే 20వ తేదీనే ఈ సమ్మెకు పిలుపునిచ్చిన సంఘాలు ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావర ణం నేపథ్యంలో జూలై 9వ తేదీకి వాయిదా వేశారు. సింగరేణిలో డిమాండ్లు దేశ వ్యాప్తంగా బ్యాంకులు, బొగ్గు సంస్థలతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతో పాటు అసంఘటిత రంగాల్లో కూడా ఈ సమ్మెకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నాలుగు లేబర్కోడ్లను వ్యతిరేకిస్తూ ఈ సమ్మె డిమాండ్ ఉంది. కానీ సింగరేణిలో ఈ లేబర్‌కోడ్‌లతో పాటు ఇతర డిమాండ్లను కూడా చేర్చి జేఏసీ నేతలు కొద్దిరోజుల క్రితం యాజమాన్యానికి సమ్మె నోటీసు అందించారు. ● కార్మికులకు పెర్క్స్‌పై ఆదాయపు పన్ను కంపెనీ చెల్లించాలి. ● కార్మికులకు సొంతింటి పథకం అమలు చేసి ఇంటి స్థలంతో పాటు రూ.25 లక్షల వడ్డీలేని రుణం ఇవ్వాలి. ● తెలంగాణ ప్రాంతంలోని బొగ్గు బ్లాకులను వేలంతో సంబంధం లేకుండా సింగరేణికి కేటాయించాలి ● కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలి. సమ్మెకు బీఎంఎస్ దూరం ఈ సమ్మెకు జాతీయ సంఘమైన బీఎంఎస్ దూరంగా ఉంది. మే 20న సమ్మెకు పిలుపునిచ్చినప్పుడు దేశంలో యుద్ధవాతావరణం నెలకొంది. ఇలాంటి సమయంలో సమ్మె చేయడం సరికాదని, అందుకే సమ్మెకు దూరంగా ఉంటున్నామని తెలిపింది. సమ్మె వాయిదా పడటంతో నేడు ఈ సమ్మె రాజకీయ ప్రేరేపిత సమ్మె అని, తాము సమ్మెకు దూరంగా ఉంటున్నామని, కార్మికులు పాల్గొనవద్దని ఆ సంఘం నాయకులు ప్రకటన చేశారు. వద్దంటున్న యజమాన్యం.. ఈ సమ్మెకు కార్మికులు దూరంగా ఉండాలని సింగరేణి యాజమాన్యం కోరింది. ఈ మేరకు అన్ని ఏరియాల జీఎంలు, కార్మికులు రోజువారిలాగానే నేడు విధులకు హాజరుకావాలని కోరింది. సమ్మె డిమాండ్లు తమ పరిధిలో లేవని, జాతీయ స్థాయి సమస్యలపై సింగరేణిలో సమ్మె చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, కార్మికులు సమ్మెలో పాల్గొనవద్దని ప్రకటించింది. -
వ్యాపారి ఇంటి ఎదుట రైతుల ధర్నా
లక్సెట్టిపేట: రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారి డబ్బులు చెల్లించకుండా ఐపీ పెట్టడంతో బాధితులు మంగళవారం బీట్ బజార్‌లోని వ్యాపారి ఇంటిఎదుట ధర్నా నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సదరు వ్యాపారి రైస్‌మి ల్లు నిర్వహిస్తూ దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల్లో ని రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా కొందరి వద్ద డబ్బులు అప్పుగా తీ సుకున్నాడు. సుమారు రూ.7 కోట్లు అప్పులు కావడంతో రంగారెడ్డి జిల్లా కోర్టు నుంచి ఐపీ తీసుకుని బాధితులకు పంపించాడు. కోర్టు నోటీసు తీసుకున్న బాధితులు వ్యా పారి ఇంటి ఎదుట ధర్నాకు వచ్చి ఇట్టి ఇల్లు రైతులకు చెందినదని బోర్డు రాసి పెట్టారు. సుమారు 195 మంది బాధితులు నిరసన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని బాధితులను పంపించారు. -
పూసాయివాసికి డాక్టరేట్
సాత్నాల: భోరజ్ మండలంలోని పూసాయికి చెందిన సిల్వర్ దేవన్న మంగళవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగంలో సోషల్ ఎకానమీ అండ్ హెల్త్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రైమెటివ్ ట్రైబ్స్ ఎస్టడీ ఇన్ తెలంగాణ స్టేట్ అనే అంశంపై పరిశోధన చేసినందుకుగానూ ఆయన డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం దేవన్న ఉట్నూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర అధ్యాపకుడిగా సేవలందిస్తున్నారు. నిజాయతీ చాటుకున్న విజయ్నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్‌కు చెందిన విజయ్‌కుమార్ తనకు దొరికిన రూ.2.48 లక్షల నగదును పోలీసులకు అప్పగించి నిజాయతీ చాటుకున్నాడు. మంగళవారం బస్టాండ్ నుంచి ఇంటికి వెళ్తుండగా స్థానిక కోర్టువద్ద ఓ బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అనుకోకుండా నగదును కింద పడేసుకున్నాడు. గమనించిన విజయ్ పోలీసులను సంప్రదించి నగదు అప్పగించాడు. ఈ సందర్భంగా ఎస్పీ జానకీ షర్మిల విజయ్ను అభినందించారు. రెండోరోజు కొనసాగిన కౌన్సెలింగ్ భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీలో మంగళవారం రెండోరోజు కౌన్సెలింగ్ కొనసాగింది. క్రమసంఖ్య 565 నుంచి 1128 వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. రెండు రోజుల్లో 1,128 మందికిగానూ 989 మంది విద్యార్థులు హాజరయ్యారు. 139 మంది విద్యార్థులు రెండు రోజుల్లో కౌన్సెలింగ్‌కు హాజరు కాలేకపోయారు. గైర్హాజరైన విద్యార్థుల స్థానాలను త్వరలో వెకెంట్ లిస్టు ఆధారంగా భర్తీ చేస్తామని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం కూడా కొనసాగనుంది. మద్యం విక్రేతపై కేసుఆదిలాబాద్టౌన్: పట్టణంలోని శ్రీరామ్ కాలనీలో గల ఓ హోటల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న లంకాడే సత్యనారాయణపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. వైన్స్‌షాపు నుంచి మద్యం తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానికుల సమాచారం మేరకు తనిఖీ చేయగా పది మద్యం బాటిళ్లు లభించినట్లు వివరించారు. ముగ్గురి రిమాండ్సాత్నాల: భోరజ్ మండలంలోని పెండల్వాడలో భవునే రవి ఇంట్లో దేశీదారు విక్రయిస్తున్నారని సమాచారంతో మే 12న తనిఖీకి వెళ్లిన ఎకై ్సజ్ ఎస్సై వైద్య వెంకటేశ్వర్, ఆరుగురు సిబ్బందిపై బావునే నమిత, బావునే మనీషా, బావునే సుమన్ భాయ్ దాడికి పాల్పడ్డారు. ఎకై ్సజ్ ఎస్సై వైద్య వెంకటేశ్వర్ ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్సై గౌతమ్ పవర్ తెలిపారు. -
జీవితంపై విరక్తితో ఒకరు ఆత్మహత్య
మందమర్రిరూరల్: జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల మేరకు రామన్‌కాలనీకి చెందిన లారీ డ్రైవర్ కటకం శ్రీనివాస్ (45)15 సంవత్సరాల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి పనిచేయలేని స్థితికి చేరుకున్నాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుని భార్య రమ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని వృద్ధుడు..దండేపల్లి: మద్యానికి బానిసై ఉరేసుకుని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన మనుపాట రాజయ్య (74)కొంతకాలంగా కడుపులో నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం సాయంత్రం మద్యం సేవించి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. పక్కింట్లో ఉంటున్న ఎద్దు సురేశ్ సోమవారం ఉదయం బాధిత కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి రాజయ్య మామిడితోటలో చెట్టుకు ఉరేసుకున్నాడని సమాచారం ఇచ్చాడు. మృతుని కుమారుడు మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యానికి బానిసై..కుభీర్: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోచోటు చేసుకుంది. ఎస్సై క్రిష్ణారెడ్డి తెలిపిన వివరాల మేరకు మండలంలోని పార్డి(బి)గ్రామానికి చెందిన తోట రమేశ్ (34) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. సోమవారం ఉదయం మద్యం మత్తులో ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని భార్య సంగీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. బాలుడిని పనిలో పెట్టుకున్న వ్యక్తిపై కేసుఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ ప్రాంతంలో గల మెట్రో ఇంజనీరింగ్ వర్క్‌షాప్‌లో బాలుడి(14)ని పనిలో పెట్టుకున్న యజమాని నజీమ్ మోయినొద్దీన్పై సోమవారం కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ బృందం తనిఖీ చేయగా బాలుడితో పనులు చేయిస్తూ కనిపించారని ఆయన పేర్కొన్నారు. దీంతో ముస్కాన్ బృందం ఇన్చార్జి శంకర్ గుప్తా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతివాంకిడి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఖిరిడి గ్రామానికి చెందిన నానవేణి గణేశ్ (30) వాంకిడిలో బైక్ మెకానిక్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా నాలుగు వరుసల జాతీయ రహదారి–363పై టోల్‌ప్లాజా సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ముందుగా ఆసిఫాబాద్ ఆస్పత్రిలో ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల, అక్కడి నుంచి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందాడు. మృతుని భార్య రవళి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. బాలుర వసతిగృహం తనిఖీమంచిర్యాలఅర్బన్: పట్టణంలోని ఎస్సీ బాలుర కళాశాల వసతిగృహాన్ని సోమవారం జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి దుర్గాప్రసాద్ తనిఖీ చేశారు. ఉదయం అల్పాహారం (టిఫిన్) ఉప్మా పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అమలుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వసతిగృహ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. సరుకుల నాణ్యతను, రికార్డులను తనిఖీ చేశారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నాణ్యమైన భోజనం వేడివేడిగా రుచికరంగా విద్యార్థులకు అందించాలని వసతిగృహ సంక్షేమాధికారి, సిబ్బందికి సూచించారు. ఆయన వెంట అసిస్టెంట్ సోషల్ ఆఫీసర్ రవీందర్, వసతిగృహ సంక్షేమాధికారి కుమారస్వామి ఉన్నారు. -
‘మత్తడివాగు’ రెండు గేట్లు ఎత్తివేత
ఇటీవల కురుస్తున్న వర్షాలకు మత్తడివాగు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు రావడంతో నిండుకుండలా మారింది. ఇన్‌ఫ్లో ద్వారా 697 క్యూసెక్కుల వరదనీరు రాగా అధికారులు ముందు జాగ్రత్తగా ఆదివారం రాత్రి రెండు గేట్లను ఎత్తి 604 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 277.5 మీటర్లు కాగా ప్రస్తుతం 276.30 మీటర్ల వద్ద నీరు నిల్వ ఉన్నట్లు ఏఈ హరీష్ కుమార్ తెలిపారు. – తాంసి గేట్లను ఎత్తడంతో దిగువకు వెళ్తున్న నీరు -
9 నుంచి రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలు
రామకృష్ణాపూర్: పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఈ నెల 9 నుంచి 12 వరకు బాలికల జూనియర్స్ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్‌రెడ్డి తెలిపారు. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొననున్నారని, వారికి వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ రాజుతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, వొడ్నాల శ్రీనివాస్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
‘బీజేపీ, బీఆర్ఎస్ల అసత్య ప్రచారాలు తిప్పికొట్టాలి’
జన్నారం: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఆర్ఆర్ఎస్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన జన్నారం, దస్తురాబాద్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ చేసిన పాపం వల్లే నేడు రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. అందరికీ రేషన్ కార్డులు అందించి ఉంటే నేడు రూ.2లక్షల వరకు రుణమాఫీ అయ్యేదన్నారు. బీజేపీ ప్రభుత్వం యూరియా కొరత సృష్టించి రైతులకు తీవ్రం అన్యాయం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, పీఏసీఎస్ చైర్మన్లు రవి, రమేశ్‌రావు, జన్నారం, దస్తురాబాద్ మండలాల ముఖ్య నాయకులు ముజాఫర్ అలీఖాన్, పంకజ, సుభాష్‌రెడ్డి, శంకరయ్య, ఇసాక్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్
● నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్‌ను విక్రయించిన సర్కారు ఉద్యోగులు ● వన్‌టౌన్‌లో కేసు నమోదు ● వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి అదిలాబాద్టౌన్: గతంలో నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్ విక్రయించిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఘట న సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపిన వివరా ల ప్రకారం.. నిర్మల్‌కు చెందిన ఠాకూర్ రూపారాణి భర్త ఠాకూర్ రవీందర్ సింగ్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ విభాగంలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేసేవారు. ఈ క్రమంలో అతనికి కొండూరి గంగాధర్ అనే నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగి పరిచయమయ్యాడు. గంగాధర్ జిల్లా కేంద్రంలోని సర్వే నంబర్ 346, ప్లాట్ నంబర్ 179, అటెండర్స్ కాలనీలోని ఎంప్లాయిమెంట్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న దేవల్ల గోవర్ధన్ పేరు మీద ఒక ప్లాటు అమ్మకానికి ఉందని రవీందర్ సింగ్‌కు తెలిపాడు. నిజానికి ఈ ప్లాటు 1996లో ప్రభుత్వం తహసీల్దార్ ద్వారా అమీరుద్దీన్ అనే వ్యక్తికి కేటాయించినట్లుగా రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. అయితే 2006 లో రూపారాణి, ఆమె భర్త ఆ ప్లాటుకు కె.గంగాధర్, డి.గోవర్ధన్ సమక్షంలో రూ.65 వేలు చెల్లించారు. 2006 నవంబర్ 10న కె.గంగాధర్ మధ్యవర్తిత్వం వహించి దేవల్ల గోవర్ధన్‌తో అమ్మకపు ఒప్పందం చేయించాడు. తరువాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ 4433/06 ప్రకారం రూపారాణి పేరు మీద ప్లాటు రిజిస్టర్ అయింది. రుపారాణి భర్త ఠాకూర్ రవీందర్‌సింగ్ బదిలీ కావడంతో వారు నిర్మల్‌కు మారారు. ఆదిలాబాద్‌కు వచ్చినప్పుడల్లా తమ ప్లాటును చూసుకునేవారు. అయితే ఇటీవల ఆ ప్లాటు వాస్తవానికి అమీర్‌ఖాన్ కుమారుడు అహ్మద్‌ఖాన్‌కు చెందినదని గుర్తించారు. నకిలీ పట్టా పత్రాలను అసలు పత్రాలుగా చూపించి తమను మోసం చేశారని బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ పోలీసులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం దర్యాప్తు పూర్తయి న తర్వాత వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఇదివరకే ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కొండూరి గంగాధర్‌పై కేసు నమోదైందని, రిమాండ్‌కు తరలించామని తెలిపారు. ఈ కేసులో ప్రస్తు తం కె.గంగాధర్, డి.గోవర్ధన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. -
మత్స్యకారుల సొసైటీల్లో నగదు జమ చేయాలి
పాతమంచిర్యాల: తెలంగాణ మత్స్యకారుల సొసైటీలలో చేప, రొయ్య పిల్లల కొనుగోలు కోసం ప్రభుత్వం నగదు జమ చేయాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని చార్వాక భవన్లో మత్స్యకారుల జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చేప, రొయ్య పిల్లల పంపిణీపై నిర్ధిష్టమైన ప్రకటన చేయకపోవడంలో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారన్నారు. చేప, రొయ్య పిల్లల కొనుగోలు కోసం ఎలాంటి టెండర్లు లేకుండా నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్సీడీసీ, ఎన్ఎఫ్డీబీ నిధులను ఎత్తివేయడాన్ని నిరసిస్తూ మత్స్యకారులు జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బోడెంకి చందు, నాయకులు బోడెంకి మహేష్, కంపల చంద్రయ్య, పిట్టల దశరథం, మంచర్ల రాజేందర్, జిల్లాల శ్రీనివాస్, జనుగరి నారాయణ, డోకే సమ్మయ్య, నాగుల మహేష్, బోగుట వెంకటేష్, రైతు సంఘం అధ్యక్షుడు సంకె రవి, తదితరులు పాల్గొన్నారు. -
ట్రాప్ కెమెరాల ఏర్పాటు
బోథ్: సొనాల మండలంలోని ఘన్పూర్ అడవుల్లో ఇటీవల ఓ ఆవును చంపిన గుర్తు తెలి యని జంతువును పులిగా భావిస్తున్నారు. అట వీ శాఖ అఽధికారులు సంబంధిత ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా పులి పాదముద్రలు లభ్యం కాలేదు. అయితే ఇటీవల రఘునాథ్‌పూర్ అడవుల్లో పులి ట్రాప్ కెమెరాకు చిక్కడంతో అధి కారులు అప్రమత్తమై సోమవారం ఘన్పూర్ అడవుల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగా ఆవును పులి చంపిందని ఎలాంటి ఆధారాలు లేవని ఎఫ్ఆర్వో ప్రణయ్ పేర్కొన్నారు. రిటైర్డ్ సీఐ హఠాన్మరణంఆదిలాబాద్టౌన్: మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రంగినేని మనిషా తండ్రి, రిటైర్డ్ సీఐ లచ్చన్న సోమవారం ఉదయం హఠన్మరణం చెందారు. 1980లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరిన ఆయన 1999లో ఆదిలాబాద్‌రూరల్ పో లీసు స్టేషన్లో ఎస్సైగా, 2011లో వాంకిడి సీఐ గా బాధ్యతలు చేపట్టారు. 2014లో ఉద్యోగ విరమణ పొందారు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మృతదేహానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేధింపులకు పాల్పడిన యువకులకు కౌన్సెలింగ్ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద పాఠశాల విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్న ఇద్దరు యువకులకు షీటీం సభ్యులు స్వప్న, రజని, దినేశ్ సోమవారం పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైతే షీటీం నంబర్ 8712670564, లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం షీటీం ఆధ్వర్యంలో అవగా హన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవ్‌టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు, మహిళల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాల కార్మికులు, గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్, సైబర్ క్రైమ్స్, మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో షీ టీం సభ్యులు, ప్రిన్సిపాల్ రామ్‌దాస్ పాల్గొన్నారు. పోస్టల్ సేవలకు కొత్త సాఫ్ట్వేర్పాతమంచిర్యాల: వినియోగదారులకు వేగవంతమైన సేవలు అందించేందుకు పోస్టల్ శాఖలో కొత్త సాఫ్ట్వేర్ ఐటి 2.0 అప్లికేషన్ ప్రవేశపెడుతున్నట్లు అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ ఆర్ రామారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8 మంగళవారం నుంచి కొత్త సాఫ్ట్వేర్ సేవలు అందుబాటులోకి రానున్నాయని, దీంతో జిల్లా కేంద్రంలోని సార్టింగ్ (డిస్ట్రిబ్యూషన్) కార్యాలయంలో లావాదేవీలు జరగవన్నారు. పార్సిల్లు, ఉత్తరాలు సార్టింగ్ కార్యాలయం నుంచి బట్వాడా కావన్నారు. -
విషపు మొక్కలు తిని 70 గొర్రెలు మృత్యువాత
పెంచికల్పేట్: మండలంలోని లోడుపల్లి శివారులో విషపు మొక్కలు తిని 70 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. కౌటాల మండలంలోని శీర్షా గ్రామానికి చెందిన లీలయ్య, శంకర్, భీరయ్య గొర్రెలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మూడు రోజుల క్రితం పెంచికల్పేట్ మండలంలో గొర్రెలను మేపటానికి వలస వచ్చారు. సోమవారం పంచపూల మొక్కలను తిన్న 70 గొర్రెలు మృతి చెందాయి. యజమానులు ఇచ్చిన సమాచారంతో పశువైద్యాఽధికారి రాకేష్ తీవ్ర అస్వస్థతకు గురైన గొర్రెలకు చికిత్స అందించారు. గొర్రెలు చనిపోవడంతో ఉపాధి పోయిందని ప్రభుత్వం ఆదుకోవాలని యజమానులు కోరుతున్నారు. -
ఆర్జీయూకేటీలో కౌన్సెలింగ్ షురూ
బాసర: 2025–26 విద్యాసంవత్సరానికి గానూ బాసర ఆర్జీయూకేటీ, మహబూబ్‌నగర్ కేంద్రాల్లో ప్రవేశానికి సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధర్‌తో కలిసి సంగారెడ్డి జిల్లా కామోల్ గ్రామానికి చెందిన మొదటి ర్యాంక్ సాధించిన గడ్డం వర్షికకు తొలి అడ్మిషన్ పత్రాన్ని అందజేశారు. ఈ ఏడాది మొత్తం 1,690 మందికి ప్రవేశాలు కల్పించనుండగా ప్రతీరోజు 564 మంది విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలుస్తున్నామని అధికారులు తెలిపారు. సోమవారం 500 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌కు కన్వీనర్‌గా డా.చంద్రశేఖర్, కో కన్వీనర్లుగా డా.దేవరాజు, బండి హరికృష్ణ, సభ్యులుగా డా. విట్టల్, డా.భవ్‌సింగ్ వ్యవహరిస్తున్నారు. విశ్వవిద్యాలయ పీఆర్ఓగా డా.విజయ్ కుమార్ పాల్గొన్నారు. గైర్హాజరైన విద్యార్థుల స్థానాలను త్వరలోనే వెయిటింగ్ లిస్టు ఆధారంగా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
మలేరియా కేసులపై ఆరా
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చిన మహారాష్ట్రలోని సిరొంచ, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరికి మలేరియా సోకినట్లుగా వైద్యులు నిర్దారించారు. మంచిర్యాల ఉపవైద్యాధికారి డాక్టర్ అనిత సోమవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని జ్వరాల వార్డులో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులతో మాట్లాడి వివరాలను సేకరించారు. జిల్లాలో మలేరియా కేసులు నమోదు కాలేదని, ఇతర జిల్లాల నుంచి మంచిర్యాలకు వచ్చి చికిత్స పొందుతున్నారని ఆమె పేర్కొన్నారు. పకడ్బందీగా పరీక్షలుమంచిర్యాలఅర్బన్: డీసీఈబీ ఆధ్వర్యంలో పరీక్షలు, కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయాలని డీఈవో యాదయ్య సూచించారు. సోమవారం డీసీఈబీ కార్యాలయంలో 2025–26 విద్యాసంవత్సరంలో ఉమ్మడి పరీక్షల నిర్వహణ బోర్డు మొదటి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి అభిప్రాయాలు తీసుకుని వాటికి అనుగుణంగా వర్క్‌షాప్‌లు నిర్వహించడం, ఎలాంటి తప్పులు లేకుండా పరీక్ష ప్రశ్నపత్రాలు రూపొందించడం, నాణ్యమైన ప్రశ్న పత్రాలు ముద్రితం, సమ్మెటివ్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో డీసీఈబీ సెక్రెటరీ మహేశ్వర్‌రెడ్డి, అసిస్టెంట్ సెక్రెటరీ వేణుమాధవ్, జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, డీఎస్వో మధుబాబు, ఎంఈవో, కాంప్లెక్ ప్రధానోపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు. బెల్లం, పటిక పట్టివేతఖానాపూర్: ఖానాపూర్ నుంచి బీర్నందికి ఆటోలో అక్రమంగా పటిక, బెల్లం తరలిస్తున్న కే.రాజ్‌కుమార్‌ను సోమవారం అరెస్టు చేశామని ఎకై ్సజ్ ఎస్సైలు అభిషేకర్, వసంత్‌రావు తెలిపారు. నిందితుని వద్ద నుంచి ఆటోతో పాటు 110 కిలోల బెల్లం, 20 కిలోల పటికను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో సిబ్బంది వెంకటేశ్, హరీశ్, నరేందర్ పాల్గొన్నారు. -
రుయ్యాడిలో ముగిసిన మొహర్రం వేడుకలు
● అధికసంఖ్యలో తరలివచ్చిన భక్తులు ● కిటకిటలాడిన హస్సేన్ హుస్సేన్ దేవస్థానం తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడిలో హస్సేన్ హుస్సేన్ దేవస్థానంలో ఏర్పాటు చేసిన పీరీలకు రాష్ట్రంలోనే ప్రత్యేకత ఉంది. ఇక్కడి పీరీలు మహిమగలవని భక్తుల నమ్మకం. సోమవారం చివరిరోజు మొహర్రం వేడుకలకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భారీగా తరలివచ్చారు. దీంతో దేవస్థానం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సందర్శించి పీరీలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా మొహర్రం వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రామస్తులను అడిగి పీరీల విశిష్టతను తెలుసుకున్నారు. సాయంత్రం దేవస్థానం ఎదుట ఉన్న గుండం చుట్టూ డప్పువాయిద్యాలతో తిరుగుతూ అసైదులా హారతి అంటూ ఆటలు ఆడారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అధికారులు జిల్లా కేంద్రం నుంచి రుయ్యాడి గ్రామానికి ప్రత్యేక బస్సులు నడిపారు. కార్యక్రమంలో విజయ డెయిరీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి, మాజీ జెడ్పీటీసీ గోక గణేశ్‌రెడ్డి, నాయకులు జీవన్‌రెడ్డి, గంగాధర్, సుదర్శన్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, సీసీవో శ్రీనివాస్, గంగన్న, దత్తాత్రి, తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలి
● కలెక్టర్ కుమార్ దీపక్మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాసరావు, హరికృష్ణ, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్సింగ్లతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, పరిహారం, ఇందరిమ్మ ఇళ్లు తదితర సమస్యలపై ప్రజలు అర్జీలు అందజేశారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దని ఆదేశించారు. -
అరక కూలీకి డిమాండ్
● యంత్ర సాగు ఎంతైనా తప్పడం లేదు ● కనుమరుగవుతున్న కాడెడ్లుమంచిర్యాలఅగ్రికల్చర్: మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల సాగులో యంత్రాల వినియోగం పెరిగింది. అయినప్పటికీ రైతులకు ఒక దశలో కాడెడ్లతో అవసరం ఏర్పడుతోంది. కాడెడ్లు కనుమరుగు అవుతుండడంతో ఎడ్లు ఉన్న రైతులకు అరక డిమాండ్ పెరిగింది. పత్తి విత్తనాలు వేయాలంటే సాళ్లు పట్టడానికి, కలుపు నివారణకు దౌర కొట్టడానికి, నారుమడి దున్నడానికి అరక కట్టాల్సిందే. జిల్లాలో పత్తి విత్తుకోవడం 85శాతం పూర్తయింది. మొదట విత్తిన పత్తిలో కలుపు నివారణకు దౌరలు కొడుతుండగా.. మరికొందరు సాళ్లు వేసుకుని విత్తనాలు వేస్తున్నారు. మరోవైపు నారుమడులు సిద్ధం చేసుకుని మొలక అలుకుతున్నారు. ఆయా పనుల్లో అరక కూలి రోజుకు రూ.2వేల నుంచి రూ.2,200 తీసుకుంటున్నారు. పత్తి చేన్లలో దౌర కొట్టాలంటే ట్రాక్టర్ల ద్వారా వీలు కాదు. మొక్కలు విరిగిపోవడం, టైర్ల కింద పడడం జరుగుతుంది. వర్షాకాలంలో చేన్లు బురదగా మారుతాయి. ఈ సమయంలో కాడెడ్ల ద్వారా దౌర కొట్టడం సులభమని రైతులు ఎక్కువగా వాటినే వినియోగిస్తున్నారు. -
● గత నెల 2న మంజూరు కావాల్సిన చెక్కులు ● నెలదాటినా కొలిక్కిరాని ఎంపిక ప్రక్రియ ● దరఖాస్తుదారులకు తప్పని ఎదురుచూపు
మంచిర్యాలటౌన్: నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలులో జాప్యం జరుగుతోంది. అర్హుల ఎంపిక ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో దరఖాస్తుదారులు ఎదురుచూడాల్సి వస్తోంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నాలుగు కేటగిరీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు రుణాలు అందించేందుకు దరఖాస్తులు స్వీకరించింది. కేటగిరీ–1 రూ.50వేలలోపు, కేటగిరీ–2 రూ.50 వేల నుంచి రూ.లక్ష, కేటగిరీ–3 రూ.లక్ష నుంచి రూ.2లక్షలు, కేటగిరీ–4 రూ.లక్షల నుంచి రూ.4లక్షలు రుణం అందించేందుకు విభజించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న అర్హులకు చెక్కులు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా అందించలేకపోయింది. అర్హులు ఎవరనేదే ఇప్పటి వరకు తేల్చలేదు. మొదటగా రూ.50వేలు, రూ.లక్ష రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు అందించాలని నిర్ణయించింది. దరఖాస్తుదారుల్లో కేటగిరీ–3, 4లకు చెందిన వారే ఎక్కువగా ఉండడంతో ఆయా కేటగిరీల్లోని వారు కొందరు మొదటి రెండు కేటగిరీలకు మార్పులు చేసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా కేటగిరీ–1, 2లకు సైతం రుణాలు ఇవ్వకపోవడంతో ఎదురుచూపులు తప్పడం లేదు. కనీసం అర్హులు ఎంతమంది అనేది తేల్చకపోవడంతో ఎవరికి రుణం వస్తుందో రాదోననే ఆందోళన కనిపిస్తోంది. యూనిట్లు తక్కువ.. దరఖాస్తులు ఎక్కువ రాజీవ్ యువ వికాసం కోసం మార్చి 17నుంచి ఏప్రిల్ 14వరకు దరఖాస్తులు స్వీకరించగా.. జిల్లా వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్‌కు 30,741 దరఖాస్తులు రాగా, 4,605 యూనిట్లు మాత్రమే కేటాయించారు. ఎస్సీ కార్పొరేషన్‌కు 17,596 మంది దరఖాస్తు చేసుకోగా 5,341 యూనిట్లు, ఎస్టీ కార్పొరేషన్‌కు 4,199 దరఖాస్తులకు గాను 1,644 యూనిట్లు, మైనారిటీ కార్పొరేషన్‌కు 3,331 దరఖాస్తులకు 450 యూని ట్లు, క్రిస్టియన్ మైనారిటీస్ 141 దరఖాస్తులకు యూనిట్లు 89 ఉన్నాయి. యూనిట్లు తక్కువగా ఉండి దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పరిశీ లన పూర్తి కాలేదు. బ్యాంకర్ల నుంచి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు జాబితా చేరాల్సి ఉండగా.. మండల స్థాయి కమిటీలు తుది జాబితా సిద్ధం చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మండల స్థాయిలో ఎంపిక చేసిన జాబితాను జిల్లా స్థాయికి అక్కడ బడ్జెట్ అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అర్హులకు చెక్కులు అందించాల్సి ఉన్నా ఇప్పటికీ అర్హులను ప్రకటించడంలో జాప్యం జరుగుతోంది. 3, 4 కేటగిరీల్లోని వారు మొదటి రెండు కేటగిరీలకు మార్చుకోవడం వల్ల రూ.50 వేలలోపు, రూ.లక్షలోపు యూనిట్లలో దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆన్లైన్లో కేటగిరీలను మార్చేందుకు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఎడిట్ ఆప్షన్‌ను ఇవ్వడంతో అధికారులపై రాజకీయ ఒత్తిడి పెరిగింది. కేటగిరీ–3, 4లో దరఖాస్తుదారులు కొందరు కేటగిరీ–1, 2లోకి మార్చుకోవడంతో మొదటగా దరఖాస్తు చేసుకున్న వారికి రుణం వస్తుందో రాదోననే భయం నెలకొంది.కార్పొరేషన్ల వారీగా దరఖాస్తులు, యూనిట్లుకార్పొరేషన్ దరఖాస్తులు యూనిట్లు బీసీ 30,741 4,605ఎస్సీ 17,596 5,341ఎస్టీ 4,199 1,644మైనారిటీ 3,331 450క్రిస్టియన్ 141 89ఆలస్యం చేయొద్దురాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా టెంట్‌హౌజ్ ఏర్పాటుకు రూ.4 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాను. రుణం వస్తే టెంట్‌హౌజ్, డెకరేషన్ ఏర్పాటు చేసుకుందామని ఎదురు చూస్తున్నా. రుణం వస్తేనే నాకు ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా అర్హులైన వారికి యువవికాసం రుణాలు అందిస్తే బాగుంటుంది. – కన్నె శ్రీనివాస్, సింగాపూర్, నస్పూర్ -
కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా అనిల్‌యాదవ్
కై లాస్‌నగర్: క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియమించిన టీపీసీసీ.. తాజాగా ఉమ్మడి జిల్లా ఇన్చార్జీలను నియమించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌కు రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్‌కుమార్ యాదవ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే రంగంలోకి దిగి గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పార్టీ కమిటీల నియామక ప్రక్రియ పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ పటిష్టతపై అధిష్టానం దృష్టి సారించడంపై శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు అనిల్ కుమార్ ఈ వారంలోనే జిల్లా పర్యటనకు రానున్నట్లుగా సమాచారం. -
పెండింగ్ కేసులు పరిష్కరించాలి
నస్పూర్: పోలీస్‌స్టేషన్‌లోని పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. సోమవారం ఆయన సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. రికార్డులు తనిఖీ చేసి పెండింగ్ కేసుల స్థితిగతులపై వివరాలు సేకరించారు. బాలికల అదృశ్యం కేసుల్లో వేగం పెంచాలని, నిందితులకు శిక్ష పడేలా సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించాలని తెలిపారు. దొంగతనాలు జరుగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, ఎస్సై ఉపేందర్‌రావు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్షణ కిట్లు
పాతమంచిర్యాల: గీత కార్మికుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న కాటమయ్య రక్షణ కిట్ల ద్వారా 80శాతం ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో గౌడ కులస్తులకు కాటమయ్య రక్షణ కిట్లు అందజేశారు. ఆయన మాట్లాడుతూ కాటమయ్య రక్షణ కిట్లు వాడడం వల్ల గీత కార్మికులకు ప్రమాదాలు తగ్గాయన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 19మందికి కిట్లు పంపిణీ చేశారు. జిల్లా అటవీ అధికారి శివ్ఆశీష్సింగ్, ఆర్డీవోలు శ్రీనివాస్ రావు, హరికృష్ణ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం, ఎక్సైజ్‌శాఖ సీఐ సమ్మయ్య పాల్గొన్నారు. అటవీ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు జిల్లాలోని అటవీ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అటవీ అధికారి శివ్ ఆశీష్సింగ్, డీసీపీ భాస్కర్ అటవీ రేంజ్ అధికారులతో అటవీ భూముల ఆక్రమణల నిరోధంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అటవీ చట్టాలు ఉల్లంఘించి ఆక్రమణలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటవీ భూముల ఆక్రమణల నిరోధానికి పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో జిల్లాలో టాస్క్ఫో ర్సు టీం ఏర్పాటు చేశామన్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ ఏసీపీలు ప్రకాష్, రవికుమార్, వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు, అటవీరేంజ్ అధికారులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు పరిశీలించిన రైల్వే జీఎం
బెల్లంపల్లి/మంచిర్యాలఅర్బన్: బెల్లంపల్లి, మంచిర్యాల రైల్వేస్టేషన్లలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జి జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ సోమవారం పరిశీలించారు. మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి ప్రత్యేక రైలులో ఉదయం 10.15గంటలకు బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి తనిఖీ చేశారు. రైల్వే ఆర్వో షెడ్డు వద్ద పనులు పరిశీలించి రోజువారీ నివేదికపై అడిగి తెలుసుకున్నారు. మూడో లైన్ రైల్వేట్రాక్ పనులు పరిశీలించి సూచనలు చేశారు. మూడో ప్లాట్‌ఫాం నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలని పేర్కొన్నారు. మంచిర్యాలలో వాహనాల పార్కింగ్, విశ్రాంతిగదులు, ఇతర పనులు పరిశీలించారు. రైళ్ల హాల్టింగ్ కోసం వినతి బెల్లంపల్లిలో పలు సూపర్‌ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని ఇన్చార్జి జీఎం సందీప్ మాథూర్‌కు సీపీఐ జిల్లా నాయకుడు చిప్ప నర్సయ్య, పట్టణ కార్యదర్శి ఆడేపు రాజమౌళి, సహాయ కార్యదర్శి తిలక్ అంబేడ్కర్, రత్నం రాజం తదితరులు వినతిపత్రం అందజేశారు. నవ జీవన్ ఎక్స్‌ప్రెస్ ఆపాలని, జీటీ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ సౌకర్యం పునరుద్ధరించాలని, కాల్టెక్స్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిఇకి రెండువైపుల మెట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వందేభారత్ రైలు ఆపాలి వందేభారత్ రైలు మంచిర్యాల రైల్వేస్టేషన్లో ఆపాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, పలు విద్యార్థి సంఘాల నాయకులు వేర్వేరుగా ఇన్చార్జి జీఎంకు వేర్వేరుగా వినతిపత్రం అందజేశారు. మంచిర్యాల, ఆసిఫాభాద్ జిల్లాల భక్తుల సౌకర్యార్థం తిరుపతికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని, ఏపీ ఎక్స్‌ప్రెస్, కేరళ ఎక్స్‌ప్రెస్, సంఘమిత్ర, స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ రైళ్లను మంచిర్యాలలో నిలుపుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాజ్‌కుమార్, నాయకులు మల్లారెడ్డి, పురుషోత్తం జాజు, సతీష్‌రావు, ఆంజనేయులు, అశోక్‌వర్థన్, జోగుల శ్రీదేవి, రాజన్న, తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జాతీయ విద్యార్థిసమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీ తదితరులు పాల్గొన్నారు. -
పాల ధరల్లో వ్యత్యాసం!
● వసతిగృహాలకు సరఫరాలో తేడాలు ● ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా పెంపు ● పంపిణీదారుల తీరుతో సర్కారుపై భారంసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: విద్యా వసతిగృహాల్లో సరఫరా చేస్తున్న పాల ధరల వ్యత్యాసంతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బీసీ, సోషల్ వెల్ఫేర్, కేజీబీవీ, మైనార్టీ, గిరిజన, సంక్షేమ తదితర హాస్టళ్లలో విద్యార్థులకు ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ నుంచి పంపిణీదారులు పాలు(టోన్డ్) సరఫరా చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో డీపీసీ(జిల్లా కొనుగోలు కమిటీ) ఏటా విద్యాసంవత్సరం ఆరంభంలోనే ధర నిర్ణయిస్తుంది. ఒక్కో జిల్లాలో ఒక్కో తీరుగా పాల లీటరు ధర నిర్ణయిస్తున్నారు. డెయిరీ నిర్ధేశించిన ధర, రవాణా చార్జీలు కలిపి హాస్టళ్లకు సరఫరా చేయాల్సి ఉంటుంది. దూరభారం, బిల్లులు ఆలస్యంగా చెల్లిస్తున్నారనే కారణం చూపుతూ చాలామంది పంపిణీదారులు స్థానికంగా లభ్యమయ్యే ధర కంటే అధికంగా చెల్లించాల్సి వస్తోంది. దీంతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. ఇటీవల మంచిర్యాల జిల్లాలో పది సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు ఎమ్మార్పీ రూ.60కంటే అధికంగా రూ.2పెంచి రూ.62తో ఇవ్వడంపై కలెక్టర్ కుమార్ దీపక్ దృష్టికి వెళ్లగా ఆయన తిరిగి ఎమ్మార్పీకే సరఫరా చేసేలా ఉత్తర్వులు ఇచ్చారు. మారుతున్నాయి.. పాల ధర లీటరుకు ఒకే తీరుగా ఉన్నప్పటికీ వసతిగృహాలకు సరఫరా చేసే సమయానికి ధరలు మారుతున్నాయి. పంపిణీదారుడికి డెయిరీ నుంచి ఒక్కో లీటరుపై రూ.7వరకు కమీషన్ చెల్లిస్తోంది. రవాణా చార్జీలు కలిపి ఎమ్మార్పీకి విక్రయించాలి. దూరభారం, నెలల తరబడి బిల్లుల చెల్లింపులపై జాప్యం జరుగుతోందని అంతకంటే అధికంగా చెల్లిస్తున్నారు. గత కొంతకాలంగా ఇదే జరుగుతోంది. బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు(బీఎంసీయూ) సమీపంలో ఉన్న జిల్లాల్లోనూ అధిక ధరలకే విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరంలో మెదక్, గద్వాల జిల్లాల్లో సరఫరా పాల ధర ఒక లీటరకు రూ.63గా ఉంది. పెద్దపల్లి, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాలకు రూ.62గా ఉంది. కొత్తగూడెం జిల్లాలో రూ.65వరకు ఉంది. దీంతో బీఎంసీయూ ఉన్న జిల్లాల పంపిణీదారులు సైతం స్థానిక అధికారులను మచ్చిక చేసుకుంటూ వాస్తవ ధర చెల్లించేలా ఉత్తర్వులు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల బీఎంసీయూ నుంచి విజయ డెయిరీ వాహనాల్లోనే జిల్లా కేంద్రాల దాక పాలు వెళ్తున్నప్పటికీ అధికంగా చెల్లింపు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై ప్రతీ నెలా రూ.లక్షల్లో అదనపు భారం పడుతోంది. మరోవైపు కొన్ని చోట్ల వసతిగృహాల నిర్వాహకులు తక్కువ మొత్తంలో పాలు తీసుకుంటూ ఎక్కువ బిల్లులు చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
పీరీల ఊరేగింపు
మంచిర్యాలఅర్బన్/నస్పూర్: మంచిర్యాల, నస్పూర్ పట్టణాల్లో సోమవారం మొహర్రం వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముఖరాం చౌరస్తా, మసీద్వాడ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పీరీలకు దట్టీలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో సందడిగా కనిపించాయి. హస్సేన్, హుస్సేన్‌లను కొలుస్తూ వారి త్యాగాలను స్మరించారు. ఉపవాస దీక్షలతో పీరీలను ఊరేగించారు. కుల, మతాలకతీతంగా ప్రజలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం వేళల్లో పీరీల గుండం వద్ద డప్పుల చప్పుళ్లతో పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. అసైదులా ఆటలతో పురవీధుల్లో మోహర్రం వేడుకలు అంబరాన్నంటాయి. చిన్నారులు, మహిళలు కుడుకల దండలు, చక్కెర గుళికల పేర్లతోపాటు దస్తీ(ఖర్చీఫ్)లను పీరీలకు కట్టారు. అనంతరం స్థానిక చెరువు, వాగుల్లో నిమజ్జనం చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. నస్పూర్‌లో నిర్వాహకులు మాలిక్ కృష్ణరెడ్డి, శివారెడ్డి, కిరణ్, లింగమూర్తి, లచ్చన్న, చందు పాల్గొన్నారు, -
పేదల కళ్లలో ఆనందం
● రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్చెన్నూర్: ప్రజాపాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, పేదల కళ్లలో ఆనందం చూస్తున్నామని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆదివారం ప్రొసీడింగ్ పత్రాలు కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి అందించారు. అనంతరం చెన్నూర్ నుంచి హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాలకు ఐదు కొత్త బస్సులు ప్రారంభించారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్‌లో చెన్నూర్ నియోజకవర్గంలో 4 వేల ఎకరాలు మునిగి రైతులు నష్టపోయారని తెలిపారు. గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఫేక్ వార్తలు ప్రచారం చేసేవారిపై నిఘా పెట్టాలని పోలీసులకు సూచించారు. చెన్నూర్ నియోజకవర్గంలో రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. అనంతరం సంవిధాన్ లీడర్‌షీప్ ప్రొగ్రామ్–వైట్ టీషర్టు ఇనిషియేటివ్ మెమోంటోలను అవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ భానుప్రసాద్, మంచిర్యాల డీఎం శ్రీనివాస్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీలత, ఇంజినీర్ సధాకర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
అత్త్తింటి వేధింపులకు వివాహిత బలి
దండేపల్లి: అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్ కథనం ప్రకారం.. లక్సెట్టిపేట మండలం సురారం గ్రామానికి చెందిన పొరండ్ల శంకరయ్య కుమార్తె రూప (22)ను దండేపల్లి మండలం గుడిరేవుకు చెందిన అల్లె మహేశ్‌తో మూడేళ్ల క్రితం వివాహం చేశారు. వారికి రెండేళ్ల బాబు ఉన్నాడు. మహేశ్ ఉపాధి కోసం పది నెలల క్రితం సింగపూర్‌కు వెళ్లాడు. పెళ్లయిన కొన్నినెలల నుంచే మహేశ్ రూపను వేధింపులకు గురిచేసేవాడు. ఫోన్లలో వేధించసాగాడు. ఈ విషయం రూప తల్లిదండ్రులకు చెప్పడంతో ఇద్దరికి నచ్చజెప్పారు. నాలుగురోజుల క్రితం ఏదో మెసేజ్ వచ్చిందని అత్తమామలు లక్ష్మి, పుల్లయ్య, ఆడబిడ్డ అల్స మమత, ఆమె భర్త సుమన్‌లు ఆమెను వేధింపులకు గురిచేశారు. భర్త మహేశ్ కూడా ఫోన్లో వేధించాడు. ఈ విషయాన్ని రూప తన తండ్రికి ఫోన్లో చెప్పి ఎడువడంతో నచ్చజెప్పారు. ఈక్రమంలో రూప శనివారం మధ్యాహ్నం పురుగుల మందు తాగింది. గుడిరేవుకు చెందిన కాసారపు సాయికిరణ్ ఈ విషయాన్ని రూప తండ్రికి ఫోన్లో చెప్పి లక్సెట్టిపేట ఆసుపత్రికి తరలించారు. వెంటనే శంకరయ్య కుటుంబీకులు అక్కడికి చేరుకున్నారు. రూపను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో అత్తమామాలు లక్ష్మి, పుల్లయ్య, భర్త మహేశ్, ఆడబిడ్డ అల్స మమత, ఆమె భర్త సుమన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కూతురు, అల్లుడికి గొడవలు మనస్తాపంతో ఒకరు ఆత్మహ త్య కుభీర్: కూతురు, అల్లుడికి మధ్య గొడవలతో మనస్తాపం చెందిన తండ్రి ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రానికి చెందిన నీలకంఠ గోవిందు (64)కు భార్య, కుమార్తె నర్మద, అల్లుడు అందరూ ఒకేటో ఉండేవారు. కూతురు, అల్లుడు తరచూ గొడవపడేవారు. దీంతో మనస్తాపం చెందిన నీలకంఠ గోవిందు ఆదివారం ఉదయం ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. కుమార్తె ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై క్రిష్ణారెడ్డి తెలిపారు. -
హ్యాండ్‌బాల్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి
మంచిర్యాలటౌన్: మంచిర్యాలకు చెందిన హ్యాండ్ బాల్ క్రీడాకారిణి పులిశెట్టి శృతి పటియాలలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో హ్యాండ్ బాల్ సర్టిఫికెట్ కోర్సును పూర్తి చేసిందని హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్‌రావు, కనపర్తి రమేశ్ తెలిపారు. శృతి మూడు సీనియర్ నేషనల్లో, రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని ఒక బంగారు పతకం సాధించిందని పేర్కొన్నారు. కర్రసా ములోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బంగారు పతకాలు సాధించిందని వెల్లడించా రు. ఆదివారం శృతిని అభినందించారు. అధ్యక్షుడు గోనె శ్యాంసుందర్‌రావు, ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్, కోశాధికారి అలుగువెల్లి రమేశ్‌రెడ్డి, కోచ్ సువర్కర్ అరవింద్ పాల్గొన్నారు. -
స్వగ్రామానికి చేరిన మృతదేహం
నర్సాపూర్(జి): ఉపాధి నిమిత్తం దుబాయ్‌లోని అబుదాబి వెళ్లిన మండలంలోని టెంబుర్నికి చెందిన బొగుడమీది సంతోష్ వారం రోజుల్లోపే మృతిచెందాడు. ఆదివారం స్వగ్రామానికి మృతదేహం చేరింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన బొగుడమీది సంతోష్ (36) గతనెల 22న విజిట్ వీసాపై దుబాయ్‌లోని అబుదాబి వెళ్లాడు. మరుసటి రోజు బయటికి వెళ్లి తిని వస్తానని చెప్పి గదికి తిరిగి రాలేదు. ఈ విషయాన్ని తోటి కార్మికులు గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ యూఏఈ ప్రతినిధి గడ్చంద నరేందర్‌కు సమాచారం అందించారు. ఆయన అబుదాబిలోని ఇండియన్ ఎంబసీకి సమాచారం చేరవేశారు. బాధిత వ్యక్తి విజిట్ వీసాపై వెళ్లి ఉండటంతో కంపెనీ వివరాలు సత్వరమే తెలియరాలేదు. అక్కడి గల్ఫ్ వెల్ఫేర్ ప్రతినిధులు ఆరాతీయగా గతనెల 27న మృతి చెందినట్లు ఎంబసీ అధికారులు వెల్లడించారు. స్వగ్రామంలో ఉన్నప్పుడు తెల్లకల్లు సేవించడం అలవాటు ఉన్న సంతోష్ అబుదాబి వెళ్లాక అది లభించకపోవడంతో మతిస్థిమితం కోల్పోయి మృతి చెందినట్లు తెలిపారు. ఇండియన్ ఎంబసీ ద్వారా అక్కడి సంఘ ప్రతినిధులు శంకర్ లావుడ్యా, అబుదాబి సమన్వయకర్త కల్లెడ నరేశ్ ఆ మృతదేహాన్ని స్వస్థలానికి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం స్వగ్రామానికి మృతదేహం చేరగా కుటుంబసభ్యులు, బంధువులు రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య ప్రేమల, కుమారుడు సాయి చరణ్, కూతురు నితీక్ష ఉన్నారు. గల్ఫ్ ఏజెంట్ల మోసాలను అరికట్టాలి గ్రామీణులకు ఆశ చూపి మంచి వేతనంతో అవకాశం కల్పిస్తామని గల్ఫ్ దేశాలకు విజిట్, టూరిస్ట్ వీసాలపై పంపుతూ ఏజెంట్లు చేస్తున్న మోసాలను అరికట్టాలని యూఏఈ గల్ఫ్ కార్మిక సంక్షేమ సంఘం ప్రతినిధులు గడ్చంద నరేందర్, శంకర్, వంశీ గౌడ్, రవి, నరేశ్ తదితరులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ దేశాల్లో చేసే ఉద్యోగం పట్ల ముందుగానే పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే వెళ్లాలని సూచించారు. -
క్యాప్ స్కాలర్షిప్ పోటీలకు ఎంపిక
బెల్లంపల్లి: ప్రతిష్టాత్మక క్యాప్ స్కాలర్షిప్ క్రీడా పోటీల్లో పాల్గొనడానికి బెల్లంపల్లికి చెందిన ఓ విద్యార్థి ఎంపికయ్యాడు. మహారాష్ట్ర పూణెలోని ఇర్ఫాన్ పఠాన్ క్రికెట్ అకాడమీలో ఇటీవల క్యాప్ స్కాలర్షిప్ కోసం విద్యార్థుల ఎంపిక పోటీలు జరిగాయి. బెల్లంపల్లి అశోక్‌నగర్ బస్తీకి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థి రెడ్డి.రిత్విక్ అండర్–14 విభాగంలో సత్తాచాటాడు. క్యాప్ స్కాలర్షిప్ కోసం నిర్వహించే తుది క్రికెట్ పోటీల్లో పాల్గొనడానికి అర్హత సాధించాడు. రిత్విక్ మరో మూడు క్రికెట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఆ పోటీల్లో మెరుగ్గా రాణిస్తే స్కాలర్షిప్ పొందడానికి ఎంపికవుతాడు. ఎంపికై న విద్యార్థులకు రూ.2 లక్షల వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. -
కుంసరలో దొంగల హల్చల్
భైంసారూరల్: మండలంలోని కుంసర గ్రామంలో శనివారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. నా లుగు ఇళ్లల్లో తాళాలు పగులగొట్టి చోరీకి పాల్ప డ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు.. సొలంకి అ బారావు, సులోచన, మాధవ్, సురేందర్‌రెడ్డి ఇళ్లలో దొంగలు చొరబడి బీరువాలను పగులగొట్టారు. నగదు, బంగారం దొరకకపోవడంతో సామగ్రిని చిందరవందరగా పారేశారు. సురేందర్‌రెడ్డి బైక్‌ను ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని స్థానికులు బాధితులు, పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సైలు శంకర్, సుప్రియలు ఆదివారం సంఘటన స్థలానికి చేరుకు ని పరిశీలించారు. క్లూస్‌టీంతో వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శంకర్ పేర్కొన్నారు. -
ఆదివాసీ భవన్ ధ్వంసం
కెరమెరి(ఆసిఫాబాద్): మండల కేంద్రంలోని కుమురం భీం ఆదివాసీ భవన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గేటుతోపాటు భవన్ తాళాలు పగులగొట్టి లోనికి చొరబడి స్టేజీ టైల్స్ ఇతర వాటిని తొలగించారు. విద్యుత్ వైర్లు, బోర్డును అపహరించారు. ఆదివారం సమావేశం ఏర్పాటు చేద్దామని వెళ్లిన ఆదివాసీ నాయకులకు ఇలా కనిపించింది. ప్రశాంతంగా ఉన్న కెరమెరి మండలంలో ఈ చర్యలతో అలజడి ఉత్పన్నమయ్యో అవకాశం ఉంది. ఏదైన ఉంటే ముఖాముఖి తేల్చుకోవాలే తప్ప ఇలాంటి చేష్టలకు పాల్పడవద్దని వారు పేర్కొంటున్నారు. ఆకతాయిలు చేశారా? లేదా పెద్దలు వెనకుండి పక్కా ప్లాన్‌తో ఈ తతంగం నడిపించారా అనే అనుమానాలు ఆదివాసీలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని లేకపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. -
● రైల్వే గేటు సాకుతో దశాబ్దాలుగా బస్సు నడపలేదు.. ● ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా అదే పరిస్థితి ● జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఆటోలే దిక్కు ● ‘మహాలక్ష్మి’కి నోచుకోని రామకృష్ణాపూర్ మహిళలు
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పట్టణం 40 వేలకుపైగా జనాభా కలిగి ఉంది. ప్రముఖ ప్రాంతమైనప్పటికీ, జిల్లా కేంద్రం నుంచి దశాబ్దాలుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. పట్టణానికి చెందిన విద్యార్థులు, ఉద్యోగులు, యువకులు, రోగులు, వ్యాపారులు కూలీలు నిత్యం జిల్లా కేంద్రానికి వెళ్లివస్తుంటారు. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో కొందరు సొంత వాహనాల్లో వెళ్తున్నారు. మిగతావారు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. మందమర్రి మార్కెట్ మీదుగా మంచిర్యాలకు అనుసంధానమయ్యే ఈ మార్గంలో బస్సు సౌకర్యం లేకపోవడం పట్టణవాసులకు పెద్ద సమస్యగా మారింది. రైల్వే వంతెన పూర్తయినా.. గతంలో రామకృష్ణాపూర్–మంచిర్యాల మార్గంలో రైల్వే గేటు కారణంగా ప్రయాణికులు గంటల తరబడి ఆగాల్సి వచ్చేది. ఇటీవల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. ప్రారంభం కూడా జరిగింది. దీంతో దశాబ్దాలుగా లేని ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పట్టణవాసులు భావించారు. కానీ, ఆర్టీసీ అధికారులు ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. ‘మహాలక్ష్మి’ల నిరాశ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ, రామకృష్ణాపూర్ పట్టణం నుంచి మంచిర్యాలకు వెళ్లే మహిళలు ఈ సౌకర్యానికి నోచుకోవడం లేదు. ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో, ఈ పథకం ప్రయోజనాలు వారికి చేరడం లేదు. మంచిర్యాల, మందమర్రి మార్కెట్ మీదుగా ఆర్టీసీ బస్సులు కేటాయించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలపైనా ప్రభావం రామకృష్ణాపూర్ పట్టణంతోపాటు, చుట్టుపక్కల గ్రామాలైన అమరవాది, సండ్రోనిపల్లె, సారంగపల్లి, తుర్కపల్లి, బీజోన్, ఏజోన్ వంటి ప్రాంతాల ప్రజలు కూడా ఆర్టీసీ బస్సు ప్రయాణానికి నోచుకో వడం లేదు. ఈ గ్రామాల నుంచి జిల్లా కేంద్రం మంచిర్యాలకు రోజువారీగా ప్రయాణించే వందలాది మంది ఇబ్బంది పడుతున్నారు. పట్టనానికి జిల్లా కేంద్రం పది కిలోమీటర్లలోపే ఉన్నా బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆర్టీసీ కూడా నష్టపోతోంది. -
యువతి అదృశ్యం
తానూరు:మండలకేంద్రం పరిధి లో ఆదివారం యు వతి అదృశ్య ం కాగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలి పా రు. మ హారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన సాక్రే అంకిత (18) అనే యువతి మూడు నెలలుగా హి ప్నెల్లి గ్రామంలో వరుసకు చిన్నాన్న అయ్యే శివకుమార్ ఇంట్లో ఉంటోంది. ఆదివారం శివకుమార్ కుటుంబసభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లారు. చేను వద్ద కలుపు మొక్కలు తీసి వస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన అంకిత తిరిగి రాలేదు. చుట్టుపక్కల, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో శివకుమార్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి భైంసాటౌన్: పట్టణంలోని నర్సింహానగర్కు చెందిన కల్యాణ్కర్ శంకర్ (45) అనే వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. శంకర్ ఇటీవల ఇంటిపై నుంచి మెట్లు దిగుతూ జారిపడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయాలవగా కుటుంబీకులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందినట్లు పేర్కొన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
తప్పుడు పత్రాలతో ప్లాట్ విక్రయించిన వ్యక్తిపై కేసు
ఆదిలాబాద్‌టౌన్: తప్పుడు పత్రాలు సృష్టించి ప్లాట్ విక్రయించిన పట్టణానికి చెందిన జోగు రుపేందర్పై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. ఆయన కథ నం ప్రకారం.. పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన సులిగల్ల సునీత 2013లో రూపేందర్ వద్ద నుంచి రూ.11 లక్షలకు రిక్షా కాలనీలో ఓ ప్లాట్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత సునీత ఆ ప్లా ట్ను విద్యానగర్‌కు చెందిన ఉమేశ్‌రెడ్డికి విక్రయించింది. దీంతో కొనుగోలు చేసిన వ్యక్తి ప్లా ట్ వద్దకు వెళ్లగా, ఈ ప్లాట్ తనదని, రిజిస్ట్రేషన్ తన పేరిట ఉందని పత్రాలు చూపించాడు. దీంతో మోసం చేసి వ్యక్తిపై టూటౌన్ పోలీసు స్టేషన్లో ఆదివారం సునీత ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. డబ్బులు తీసుకుని మోసగించిన వ్యక్తిపై.. ప్లాట్ విక్రయించి డబ్బులు తీసుకుని ప్లాట్‌ను చూపించకుండా మోసగించిన పట్టణంలోని అంకోలి రోడ్డు వైపు ఉండే సయ్యద్ షాహిద్ అహ్మద్‌పై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. 2008లో పంజేషా మొహల్లాకు చెందిన విఖార్ అహ్మద్ ఎస్ఏ రియల్ఎస్టేట్ వ్యాపారి వద్ద రూ.38వేలకు భీంసరి సమీపంలో ప్లాట్ కొనుగోలు చేశాడు. ప్లాట్ చూపించకుండా తిప్పుకుంటున్నాడు. ప్లాట్ వద్దకు వెళ్లి చూడగా, మరో వ్యక్తికి ఆ ప్లాట్‌ను విక్రయించినట్లు తెలిసింది. బాధితుడు మోసపోయాడని తెలుసుకుని ఆదివారం ఫిర్యాదు చేశాడు. నకిలీ పత్రాలతో మోసగించిన మహిళపై.. ఆదిలాబాద్‌రూరల్: నకిలీ పత్రాలతో మోసగించిన మహిళపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిదర్ తెలిపారు. తన కార్యాలయంలో ఆదివారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని బృందావన్ కాలనీకి చెందిన దాసరి జ్యోతి గత మూడేళ్ల గేడం దేవిదాస్ జ్యోత్న్స దంపతులకు ఖానాపూర్ గ్రామ శివారు సర్వే నంబర్ 68/100/2లో 764 నంబర్ గల (30గీ40) సైజు ప్లాటు కొనుగోలు చేయించింది. ఆ తర్వాత రూ.3.30 లక్షలు వసూళ్లు చేసి నకిలీ పత్రాలతో తమను మోసగించిన దాసరి జ్యోతితోపాటు పలువురిపై జ్యోత్న్స ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం జ్యోతిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మహమ్మద్ కలీమ్‌తో పాటు పలువురు పరారీలో ఉన్నారు. సమావేశంలో ఎస్సై విష్ణు వర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారుల మృతికి కారకులైన ఇద్దరిపై.. ఆదిలాబాద్‌రూరల్: మావల బంజారాహిల్స్ శివారు ప్రాంతంలో రోడ్డుకు అనుకుని ఉన్న నీటికుంటలో ప్రమాదవశాత్తు పడి చిన్నారుల మృతికి కారకులైన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కర్రె స్వామి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మావల మండల కేంద్రానికి చెందిన స్వామి, గీత దంపతుల కుమారులు వినూత్న (11), విదాత్ (10)లు శనివారం సైకిల్ ఆడుకుంటూ బంజారాహిల్స్ రోడ్డు గుండా వెళ్తున్నారు. మార్గమధ్యలో నిర్మల్కర్ భా స్కర్‌కు చెందిన భూమిలో ఉన్న నీటికుంటలో పడ్డారు. దీంతో వారు అక్కడికి అక్కడే మృతి చెందారు. అయితే ఆదిలాబాద్‌లోని భుక్తపూర్ కాలనీకి చెందిన యతేంద్రనాథ్ యాదవ్‌కు ప ట్టేదారు అభివృద్ధి, భూమి నిర్వహణ కోసం జ నరల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఆ భూమిని ఇచ్చారు. వారి నిర్లక్ష్యంతోనే చిన్నారులు నీటికుంటలో పడి మృతి చెందారని ఆరోపిస్తూ మా వల తహసీల్దార్ వేణుగోపాల్, మృతుల తండ్రి స్వామి ఇరువురు ఆదివారం ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బీసీ మేధావుల ఫోరం కార్యవర్గంపాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలో బీసీ మేధావుల ఫోరం ఉమ్మడి జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లా చీఫ్ కోఆర్డినేటర్‌గా శ్రీరాముల కొండయ్య, కోఆర్డినేటర్లుగా డాక్టర్ నీలకంఠేశ్వర్‌గౌడ్, రంగు రాజేశం, కనుకుట్ల మల్లయ్య, షబ్బీర్ పాషా, సమ్ము రాజ య్య, కోడూరి చంద్రయ్య, అశోక్ యాదవ్, తునికి ప్రవీణ్, అక్కల నాగరాజు, జైనుద్దీన్, లింగమూర్తి, రవి ఎన్నికయ్యారు. రాష్ట్ర చైర్మన్ చిరంజీవులు వారికి నియామకపత్రాలు జారీ చేశారు. -
మెడికల్ బోర్డుపై మంత్రికి వినతి
శ్రీరాంపూర్: సింగరేణిలో జబ్బుపడిన కార్మికుల కో సం ప్రతీనెల స మావేశమయ్యే మె డికల్ బోర్డు ఆరు నెలలుగా జరగడం లేదని యూ త్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి తోకల సురేశ్ తెలిపారు. ఈ మేరకు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి ఆదివారం వినతిపత్రం అందించారు. మెడికల్ బోర్డు నిర్వహించకపోవడంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. హయ్యర్ సెంటర్ రెఫరల్ అయిన కార్మికులైతే డ్యూటీలు లేక వేతనాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఓసీపీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు 80 శాతం స్థానికులకే ఇవ్వాలని విన్నవించారు. దీనిపై కంపెనీ అధికారులతో చర్చిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు సురేశ్ తెలిపారు. -
జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యం..
● భద్రతపై విస్తృత ప్రచారం ● మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు ● జిల్లా విద్యుత్ శాఖ అధికారి(ఎస్ఈ) ఉత్తమ్ జాడేసాక్షి: వినియోగదారులకు, రైతులకు ప్రమాదాలపై ఎలాంటి సూచనలు చేస్తున్నారు..?ఎస్ఈ: ఇంట్లో నాణ్యమైన పరికరాలు వాడడంతోపాటు, విద్యుత్ వినియోగంలో ఏదైన సమస్య ఏర్పడినప్పుడు అనుభవం ఉన్న ఎలక్ట్రీషియన్‌తో మరమ్మతులు చే యించుకోవాలి. విద్యుత్ తీగలకు సమీపంలో బట్టలు ఆరేయవద్దు. రైతులు వానా కాలం పొలాల వద్ద ఏర్పాటు చేసిన బోరుమోటర్ల వద్ద జాగ్రత్తగా ఉండాలి. సొంతంగా మరమ్మతులు చేయొద్దు. విద్యుత్ సరఫరాలో, లేదా ఇతరాత్ర సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలి.సాక్షి: కనెక్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఎందుకు పెండింగ్‌లో ఉంటున్నాయి?ఎస్ఈ: అలా ఏమీ ఉండదు. గతంలో మాదిరి అంతా ప్రత్యేక యాప్, ఆన్లైన్ సిస్టం పెండింగ్ ఉండవు, దరఖాస్తు చేసుకున్న వారికి మెసేజ్ వస్తుంది. సంబంధిత అధికారి, సిబ్బందికి వివరాలు వెళ్తాయి. ఒక వేళ అందుబాటులో లేక పోయినా డోర్‌లాక్, లేదా ఏ వివరాలైన తప్పనిసరిగా యాప్‌లో నమోదు చేయాలి. స్తంభం నుంచి కనెక్షన్ దూరం ఎక్కువగా ఉంటే అదనపు పోల్ వేయడం, తీగలు, తదితర ఎస్టిమేషన్ వేసి పంపించాల్సి ఉంటుంది.మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో జీరో విద్యుత్ ప్ర మాదాలే లక్ష్యంగా డివిజన్ల వారీగా విద్యుత్ భద్రత పై వినియోగదారులకు అవగాహన కల్పిచేందుకు విస్తృత ప్రచారం చేపడతామని జిల్లా విద్యుత్ అధి కారి(ఎస్ఈ) ఉత్తమ్ జాడే తెలిపారు. ఇటీవల జి ల్లా అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. సాక్షి: వంగిన విద్యుత్ స్తంభాలు, తెగిపడిన తీగలతో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?ఎస్ఈ: గ్రామాల్లో పొలంబాట కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వంగిన విద్యుత్ స్తంభాలు, వేలాడుతున్న తీగలు, ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ల గురించి రైతులు విద్యుత్ సిబ్బందికి తెలుపాలి. వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. సాక్షి: ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఈ: ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా 1912కు కాల్ చేయాలి. నేరుగా కార్పొరేట్ కార్యాలయంలో సమస్య ఫిర్యాదు రికార్డు అవుతుంది. ఏ ప్రాంతంలోని సమస్య అయితే ఆ సంబంధిత అధికారుల, సిబ్బందిని అలర్ట్ చేసి సమస్య పరిష్కరిస్తారు. అధికారులు, సిబ్బంది ఒకానొక సమయంలో అత్యవసర విధులు విద్యుత్ సరఫరా మరమ్మతుల్లో ఉన్నా.. స్పందించక పోయినా కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. సాక్షి: ఇటీవల విద్యుత్ సరఫరాలో అంతరాయం పెరిగింది. కారణం ఏంటి?ఎస్ఈ: సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లు తది తర కొత్త పరికరాలు బిగించడం, వర్షాకాలం కావడం, మరమ్మతులు ఉంటుండడంతో సరఫరాలో కొంత అంతరాయం జరుగుతోంది. ఏదైన ప్రాంతంలో ఒకలైన్ బ్రేక్ డౌన్ అయితే మరో లైన్ ప్రత్యామ్నాయ మార్గం ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అంతరాయం లేని మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటాం. సాక్షి: అధికారులు, సిబ్బందిపై అక్రమాల ఆరోపణలు మీ దృష్టికి వచ్చాయా?ఎస్ఈ: ఆరోపణలు కాదు.. సమస్య, ఏదైనా ఇబ్బందులకు గురిచేసిన నా దృష్టికి తీసుకు రావాలి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది, లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1912 కాల్ చేయాలి. -
యూరియా కోసం బారులు
నార్నూర్: మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద రైతులు, మహిళలు బారులు తీరారు. 20 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని తెలియడంతో ఆదివారం ఉదయం 5 గంటలకు వారు తరలివచ్చారు. మండలానికి 300 మెట్రక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటివరకు 100 మెట్రిక్ టన్నులు వచ్చిందని, సోమవారం మరో 50 మెట్రిక్ టన్నులు వస్తుందని సీఈవో అడే గణేశ్ తెలిపారు. సొసైటీ కేంద్రంలో ఉన్న 400 బ్యాగులు ముందు వరుసలో ఉన్నవారికే దొరికాయి. దీంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి సరిపడా ఎరువులు అందించాలని కోరుతున్నారు. -
నిలిచిన ఇసుక రవాణా
● నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం ● పనిలేక కూలీల తిప్పలుబెల్లంపల్లి: జిల్లాలో 12 రోజులుగా ఇసుక రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో భవన నిర్మాణ రంగంపై ప్రభావం పడింది. ఇళ్ల నిర్మాణాలతోపాటు ఇందిరమ్మ పథకానికి ఇసుక దొరకడం లేదు. ఫలితంగా, రోజువారీ కూలీలు, ట్రాక్టర్ యజమానులు, కాంట్రాక్టర్లు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 400 ట్రిప్పుల ఇసుక బుకింగ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. సరఫరా ప్రక్రియలో జాప్యం కొనసాగుతోంది. ఖర్జీ రీచ్ ఆధారం.. నెన్నెల మండలంలోని ఖర్జీ రీచ్ జిల్లా ఇసుక రవా ణాకు ప్రధాన వనరుగా ఉంది. బెల్లంపల్లి, నెన్నెల, భీమిని, కన్నెపల్లి, కాసిపేట, తాండూర్ మండలాల వినియోగదారులకు ఈ రీచ్ నుంచి ఇసుక రవాణా జరుగుతోంది. ఆన్లైన్ ద్వారా ఇసుక బుక్ చేసుకున్న వారు గత నెల 24 నుండి సరఫరా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఇసుక బుకింగ్ తాత్కాలికంగా నిలిపివేయడంతో, వినియోగదారులు, ట్రాక్టర్ యజమానులు నిరాశలో ఉన్నారు. వర్షాలు, సాంకేతిక సమస్యలు.. ఖర్జీ రీచ్‌కు వెళ్లే మార్గంలో వర్షాల కారణంగా వరద నీరు నిలిచింది. ట్రాక్టర్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఈ కారణంతో ఇసుక రవాణాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే, వరద నీరు లేని ప్రత్యామ్నాయ రీచ్‌లను గుర్తించి, ఇసుక సరఫరాను సాఫీగా కొనసాగించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ బుకింగ్‌లో అవకతవకలు.. ఇసుక బుకింగ్ కోసం ఉపయోగించే ఆన్లైన్ యాప్‌లో సాంకేతిక సమస్యలు వినియోగదారులకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. యాప్ ఎప్పుడు పనిచేస్తుందో, ఎప్పుడు నిలిచిపోతుందో అనిశ్చితి నెలకొంది. దీనికితోడు, కొందరు ట్రాక్టర్ యజమానులు ముందస్తు సమాచారంతో అధిక ట్రిప్పులను బుక్ చేసుకుని ఒక్కో ట్రిప్పునకు రూ.4 వేలు వసూలు చేస్తున్నారు. రాత్రిపూట వాగులు, వంకల నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. పరిష్కారానికి చర్యలు.. ఇసుక రవాణా స్తంభన కారణంగా భవన నిర్మాణ రంగం తీవ్రంగా నష్టపోతోంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుక సరఫరాను పునరుద్ధరించడానికి మైనింగ్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యామ్నాయ రీచ్‌లను గుర్తించడం, ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపాలను సరిదిద్దడం, అక్రమ రవాణాను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వాగులో నీరు రావడంతో..ఖర్జీ వాగులో ఇటీవల కొత్తగా చెక్ డ్యామ్ కట్టారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వరద ఈ చెక్‌డ్యాంలో నిలిచి ట్రాక్టర్లు రాకపోకలు సాగించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. సిబ్బందిని సోమవారం ఇసుక రీచ్‌కు పంపించి అక్కడి పరిస్థితులు తెలుసుకుంటాం. వరదనీరు ఉంటే.. మరో చోట ఇసుక తవ్వకాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. – జగన్మోహన్రెడ్డి, మైనింగ్ ఏడీ, మంచిర్యాల -
అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
జన్నారం: తన రేంజ్ పరిధిలో అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు సిబ్బందితో కలిసి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని ఇందన్పల్లి రేంజ్ అధికారి శ్రీధరచారి అన్నారు. ఆదివారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ కలప స్మగ్లింగ్‌పై దృష్టి సారిస్తానన్నారు. ఇసుక అక్రమ రావాణా అరికట్టడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సహకారంతో అడవులు అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ అధికారిగా బాధ్యతలు..ఇందన్పల్లి రేంజ్ ఇన్చార్జి అధికారిగా విధులు నిర్వహించిన కారం శ్రీనివాస్ ఆదివారం తిరిగి జిల్లా టాస్క్‌ఫోర్స్ రేంజ్ అధికారిగా బాధ్యతలు తీసుకున్నారు. జన్నారంలోనే హెడ్‌క్వార్టర్‌గా ఉండాలని జిల్లా అటవీ సంరక్షణ అధికారి శివ్ ఆశిష్ సింగ్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. -
● మొదటి విడతలో 85 మంది ఎంపిక ● మరింత మంది నియామకానికి చర్యలు ● విధులు ఖరారు
కీలకంగా వ్యవహరిస్తాం..తిరిగి మాతృ సంస్థలతో రావడం ఆనందంగా ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమకు అవకాశం కలిపించినందుకు కృతజ్ఞతలు. రానున్న రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో కానీ, ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కీలకంగా వ్యవహరించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తాం. – సాగె ఓంకార్, జీపీవో, మంచిర్యాలమంచిర్యాలరూరల్(హాజీపూర్): గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను రద్దు చేసింది. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించింది. దీంతో రెవెన్యూ వ్యవస్థలో మార్పులు చో టుచేసుకున్నాయి. అయితే, ఈ మార్పులు రైతులకు ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. ధరణి పోర్టల్‌పై విమర్శలు రావడంతో, 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా, గతంలోని నిబంధనలను పునరుద్ధరిస్తూ, వీఆ ర్ఏ, వీఆర్వోల స్థానంలో గ్రామ పరిపాలన అధి కారుల (జీపీవో) వ్యవస్థను తిరిగి తీసుకొచ్చింది. నియామకానికి పరీక్ష.. జిల్లాలో 16 మండలాలు, 306 గ్రామ పంచాయతీలు, 385 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. గతంలో వీఆర్ఏ, వీఆర్ఓలుగా పనిచేసి, ఇతర శాఖల్లో విలీనమైన వారికి ప్రభుత్వం తిరిగి రెవెన్యూ శాఖలో చేరే అవకాశం కల్పించింది. జీపీవోలుగా నియమించేందుకు ఇంటర్, డిగ్రీ అర్హతతో ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించగా, 155 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 132 మంది రాత పరీక్షకు హాజరై, 88 మంది అర్హత సాధించారు. ముగ్గురు ఈ పదవిని స్వీకరించడానికి ఇష్టపడకపోవడంతో, 85 మందిని జిల్లాకు కేటాయించేందుకు సీసీఎల్ఏ ప్రక్రియ కొనసాగుతోంది. కలెక్టర్ కుమార్‌దీపక్ ఒక్కో జీపీవోకు రెండు నుంచి మూడు గ్రామాల బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. మరో అవకాశం.. జీపీవో నియామకాలకు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అవకాశాన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నియామకాలు గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి, రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి దోహదపడతాయని అంచనా.జీపీవోల విధులు..జీపీఓలు గ్రామీణ రెవెన్యూ వ్యవస్థలో కీలక బా ధ్యతలను నిర్వహిస్తారు. వారి విధుల్లో రెవెన్యూ రికార్డుల నిర్వహణ, భూమిశిస్తు, సెస్, పన్నుల వసూలు, సర్వే రాళ్ల తనిఖీ, జనన, మరణ ధ్రువపత్రాలు, పహణీ, అడంగల్ పత్రాల జారీ వంటివి ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు, వరదలు, ప్రకృతి విపత్తుల సమయంలో సమాచారం అందించడం, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, ఓటరు జాబితా తయారీ, శాంతిభద్రతల సమస్యలపై పోలీసులకు సమాచారం అందించడం వంటి బాధ్యతలు కూడా నిర్వహించాలి. అదనంగా, ఇందిరమ్మ, ఉపాధి హామీ వంటి ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు సహకరించడం, వ్యాధుల వ్యాప్తి సమయంలో ఆరోగ్య కేంద్రాలకు సమాచారం అందించడం వంటివి చేయాలి. -
మీసేవలు సులభతరం
● అదనపు సేవలకు అవకాశం ● వివాహ రిజిస్ట్రేషన్, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ల జారీ ● వినియోగదారులకు మరింత సౌలభ్యంనిర్మల్ఖిల్లా: రాష్ట్ర ప్రభుత్వం మీసేవ కేంద్రాల ద్వారా సేవలను మరింత విస్తృతం చేసేందుకు శ్రీకారం చుట్టింది. అదనపు సేవలు వినియోగదారులకు సులభతరం చేసేందుకు అవకాశం కల్పించింది. ఇకపై వివాహ రిజిస్ట్రేషన్, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ జారీకి నిర్ణయించింది. ఇందులో భాగంగా సంబంధిత స్లాట్ బుకింగ్ వ్యవస్థను ప్రారంభించింది. వివాహ ధ్రువపత్రం కోసం దరఖాస్తుకు ఇరువురు దంపతుల ఆధార్‌కార్డులు వయస్సు పుట్టిన తేదీ, కుల, ఆదాయం ధ్రువపత్రాలు, పదో తరగతి సర్టిఫికెట్‌తోపాటు పెళ్లిఫొటోలు, ఆహ్వానపత్రం జతపర్చాల్సి ఉంటుంది. పెళ్లి చేసుకున్న ప్రాంతం, చిరునామా, వివాహ తేదీ భార్యాభర్తల వ్యక్తిగత వివరాలు, చిరునామా, వృత్తి, కులం, మతం తదితర అంశాలు పొందుపర్చాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుల తల్లిదండ్రుల పేర్లు, సాక్షిల వివరాలు వంటివి అందజేయాలి. న్యాయవాది వద్ద తీసుకున్న నోటరీతోపాటు వివాహం జరిగిన ప్రాంతం ఫంక్షన్‌హాల్ లేదా ఆలయం ద్వారా ధ్రువపత్రాలు సమర్పించాలి. వీటన్నింటిని మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకుని రిజిస్ట్రేషన్ ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. ఆ తర్వాత తగిన సమయం ప్రకారం స్లాట్‌బుక్ చేసుకుని ఆ తేదీ రోజున సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ముగ్గురు సాక్షులతోపాటు నవ దంపతులు హాజరుకావాల్సి ఉంటుంది. దరఖాస్తులను సబ్ రిజిస్ట్రార్ విచారణ అనంతరం వివాహ ధ్రువపత్రాన్ని జారీచేస్తారు. మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్.. ఇంటి స్థలం వైశాల్యం, అపార్ట్మెంట్, స్థిరాస్తి ఉన్న ప్రాంతం ప్రకారం ప్రస్తుత మార్కెట్ విలువ నిర్ధారించుకోవడానికి మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు పరిశీలన అనంతరం సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి ఆస్తికి సంబంధించిన ప్రస్తుత మార్కెట్ విలువ ధ్రువపత్రాన్ని జారీచేస్తారు. ఇందుకోసం దరఖాస్తుదారుడు ఆధార్కార్డు్, ఇల్లు లేదా అపార్ట్మెంట్ స్థలం డాక్యుమెంట్లు, ప న్నులు కట్టిన రసీదు గ్రామం, మండలం, జిల్లా వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. తగిన పరి శీలన అనంతరం ధ్రువీకరణపత్రాన్ని జారీచేస్తారు. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 401 మీసేవ కేంద్రాలు వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. 2011లో 10 రకాల సేవలతో ప్రారంభమైన ఈ కేంద్రాలు ప్రస్తుతం 40 శాఖలకు చెందిన 350 రకాల సేవలందిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో మరో రెండు రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి జిల్లాలో మీ సేవ కేంద్రాలు ఆదిలాబాద్ 80 నిర్మల్ 113 మంచిర్యాల 139 కుమురంభీం 69 -
గోదావరి ఇసుకకు అనుమతి ఇవ్వాలి
చెన్నూర్: చెన్నూర్ గోదావరి నది నుంచి ఇసుక తరలించేందుకు అనుమతి ఇవ్వాలని ట్రాక్టర్ యా జమానులు అధికారులను కోరారు. ఈమేరకు ఆదివారం ట్రాక్టర్లు నిలిపి నిరసన తెలిపారు. అ నంతరం స్థానిక సీఐ దేవేందర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. బతుకమ్మ వాగు ఇసుక నాణ్య త లేక గృహ నిర్మాణదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అధికారులు ఆన్లైన్ పద్ధతిలో గోదావరి ఇసుక తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. నిరసనలో ట్రాక్టర్ యా జమానుల సంఘం ప్రతినిధులు అంజన్న, రాజన్న, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు ముగ్గురు ఎంపీడీవోలుమంచిర్యాలరూరల్(హాజీపూర్): లోకసభ ఎన్నికల్లో భాగంగా జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఎంపీడీవోలు ఎట్టకేలకు సొంత జిల్లాలకు బదిలీ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ అయిన అబ్దుల్‌హై, కె.నాగేశ్వర్‌రెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ అయిన పి.సత్యనారాయణ తిరిగి మంచిర్యాల జిల్లాకు బదిలీ అయ్యారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
తాండూర్: మండలంలోని బోయపల్లి బోర్డు సమీపంలో జాతీయ రహదారిపై శనివా రం రాత్రి జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఒకరు మృతిచెందాడు. ఎస్సై డి.కిరణ్‌కుమా ర్ కథనం ప్రకారం..ఓదెలు గ్రామానికి చెందిన అయిలి మల్లేశ్‌గౌడ్ (36) గీత కార్మిక వృత్తిరీత్యా కాసిపేటలో భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. మల్లేశ్‌గౌడ్ శనివారం రాత్రి బోయపల్లి బోర్డు సమీపంలోని దాబాలో బిర్యానీ తీసుకున్నాడు. తిరిగి బైక్‌పై బోయపల్లి బోర్డు వైపు వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య రాధిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రమాదవశాత్తు నీటమునిగి మహిళ..మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని కాలేజ్రోడ్లో గల గోదావరి నదిలో ఆదివారం స్నానం ఆచరించేందకు వచ్చిన మహిళ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందింది. ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. సోమగూడెంకు చెందిన మద్దెల లక్ష్మి (54) తొలి ఏకాదశి సందర్భంగా గోదావరిలో స్నానం ఆచరించేందుకు వచ్చింది. ప్రమాదవశాత్తు నీటిలో మునిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి ఆధార్‌కార్డు పరిశీలించగా కోటపల్లి మండలం నాగంపేట్ అడ్రస్‌తో ఉంది. లక్ష్మి భర్త రాజలింగు సింగరేణి ఉద్యోగి అని తెలిసింది. కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. కార్మికుడికి గాయాలు.. జిల్లా కేంద్రంలో ఆస్పత్రి భవన నిర్మాణ పనుల్లో కార్మికుడికి తీవ్రగాయలైనట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. ఆయన కథనం ప్రకారం..పశ్చిమబెంగాల్‌కు చెందిన భానుదేవ్ ఆదివారం పనులు నిర్వహిస్తుండగా లిప్టు సహాయంతో రోప్ద్వారా బకెట్లో ఇటుకను 3వ అంతస్తుకు తరలిస్తుండగా ప్రమాదవశాత్తు క్రేన్ రోప్ తెగింది. ఇటుక బకెట్ కిందపడడంతో భానుదేవ్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం అస్పత్రికి పంపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని ఒకరు ఆత్మహ త్య భైంసాటౌన్: అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపం చెంది ఉరేసుకుని ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పాండ్రిగల్లికి చెందిన సయ్యద్ ముజీం(42) మేస్త్రి పనిచేస్తూ జీవనం గడుపుతున్నాడు. ఈక్రమంలో అనారోగ్యానికి గురి కావడంతో, కుటుంబానికి భారం కావద్దనే ఉద్దేశంతో ఆదివారం కుంచావలి గుట్ట సమీపంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఏరియాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కిడ్నాప్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్నిర్మల్టౌన్: పట్టణానికి చెందిన ఇద్దరిపై ఇటీవల దాడికి పాల్పడి కిడ్నాప్ చేసిన ఐదుగురు సభ్యుల ముఠాలో కీలక నిందితుడైన ఇబ్రహీం బిల్డర్ అలియాస్ అబ్దుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన తాహెర్ బియ్యం వ్యాపారం చేస్తున్నాడు. అదేవిధంగా మహారాష్ట్రలోని ధర్మబాద్‌కు చెందిన షేక్ రౌప్, భైంసాకు చెందిన రహిజ్లు కూడా బియ్యం వ్యాపారం చేస్తున్నారు. వీరికి తాహెర్‌తో పరిచయం ఉంది. ఈక్రమంలో తాహెర్‌ను రూ.4 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో తాహెర్‌ను కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. భైంసాకు చెందిన ఇటుకల వ్యాపారి ఇబ్రహీం బిల్డర్‌కు రూ.1.50 లక్షల సుఫారీ ఇచ్చారు. సల్మాన్, మహమ్మద్ సోహెల్ మరోఇద్దరితో కలిసి ఇబ్రహీంలు పట్టణంలోని బైల్ బజార్ వద్ద తాహెర్ వాహనాన్ని అడ్డుకుని అందులో ఉన్న డ్రైవర్లపై దాడి చేసి కిడ్నాప్ చేశారు. ఈ విషయమై డ్రైవర్ నుమాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానిక సోఫినగర్ ప్రాంతంలో ఇబ్రహీం ఉన్నాడని పక్కా సమాచారంతో ఈనెల 5న పట్టణ సీఐ దాడి చేశారు. స్థానిక దర్గా వద్ద అతన్ని అరెస్టు చేసి కత్తి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
బాలికల వసతిగృహం తనిఖీ
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల వసతి గృహాన్ని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి(డీడీ)దుర్గాప్రసాద్ ఆదివారం తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటగది పరిసర ప్రాంతాలను కలియతిరిగారు. నిత్యావసర సరుకులు, రిజిస్టర్ పరిశీలించారు. భోజనం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. అనంతరం ఎస్సీ బాలికల కళాశాల వసతిగృహంలో బాబు జగ్జీవన్‌రామ్ వర్ధంతి నిర్వహించారు. దుర్గాప్రసాద్ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సహాయ సాంఘిక సంక్షేమ అధికారి రవీందర్‌గౌడ్, వసతిగృహ సంక్షేమ అధికారి చందన పాల్గొన్నారు. -
అనుమానాస్పదంగా యువకుడి మృతి
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగిడి అమ్మాగార్డెన్స్ ప్రాంతానికి చెందిన తడక దినేశ్ (29) అనుమానాస్పదంగా మృతిచెందాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన స్నేహితులు వెంటనే అతన్ని మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్నేహితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ నిద్రమాత్రలు లభించాయని, ఆ మాత్రలు వేసుకుని దినేశ్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నామని పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. కాగా, అమెరికాలో ఉన్న కూతురు మౌనిక వద్దకు తల్లిదండ్రులు పద్మావతి, రవి ఇటీవల వెళ్లారు. దీంతో వారు తిరిగి వచ్చేవరకు మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో ఉంచారు. వారి ఫిర్యాదు అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం చేయిస్తామని పట్టణ ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ మృతిసోన్: పురుగుల మందు తాగిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని మాదాపూర్‌కు చెందిన సల్ల భోజవ్వ (54)కు కుమారుడు నరేశ్ ఉన్నారు. నరేశ్‌కు పెళ్లి చేసింది. పదేళ్ల క్రితం భర్త నరేశ్‌తో గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భోజవ్వ బాధపడుతుండేది. కోడలు రావడం లేదని మనస్తాపం చెందిన ఆమె శుక్రవారం సాయంత్రం ఇంట్లో గుర్తు తెలియని పురుగుల మందు తాగింది. కుమారుడు నరేశ్ గమనించి నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. కుమారుడు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.గోపి తెలిపారు. మహిళలను వేధిస్తున్న వ్యక్తిపై కేసుఆదిలాబాద్టౌన్: మహిళలను వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీకి చెందిన అనీస్ రైల్వేస్టేషన్ ఎదుట నుంచి వెళ్తున్న మహిళలు, యువతులను వేధింపులకు గురి చేస్తున్నాడని తెలిపారు. పలువురు షీ టీంకు సమాచారం అందించగా.. అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. అడవిపంది దాడిలో ఒకరికి తీవ్రగాయాలుఇచ్చోడ: అడవిపంది దాడిలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని దేవుల్‌నాయక్ తండాకు చెందిన రాథోడ్ గంభీర్సింగ్ శనివారం వ్యవసాయ పొలంలో పనిచేస్తున్నాడు. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన అడవి పంది ఒక్కసారిగా అతనిపై దాడి చేయగా తప్పించుకునే క్రమంలో జారిపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గంభీర్సింగ్ను అంబులెన్స్‌లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మద్యం తాగొద్దన్నందుకు భర్త ఆత్మహత్యమంచిర్యాలక్రైం: మద్యం తాగొద్దని భార్య మందలించడంతో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఏఎస్సై దివాకర్, కు టుంబీకులు తెలిపిన వివరా లు.. జిల్లాకేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన ఒల్లెపు వెంకటేశ్(40), సుజాత దంపతులు. వీరికి కుమారుడు గణేశ్, కూతుళ్లు బిందు, దివ్య ఉన్నారు. కూలీ పనిచేస్తూ జీవనం సాగించేవా రు. వెంకటేశ్ గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ప్రతి రోజు మద్యం తాగి ఇంటికి రావడంతో తరచూ గొ డవలు జరిగేవి. ఎదిగిన పిల్లలు ఉన్నారని, మద్యం తాగుడు మానేయాలని భార్య మందలించడంతో వెంకటేశ్ మనస్తాపం చెందాడు. శుక్రవారం ఎఫ్ సీఐ గోదాము వెనుకాల మద్యం మత్తులో పురుగు ల మందు తాగి చనిపోతున్నానని కుటుంబీకులకు ఫోన్‌చేసి చెప్పాడు. వారు అక్కడికి చేరుకుని అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపిక
వేమనపల్లి: మంచిర్యాలలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్ పోటీల్లో మండలంలోని నీల్వాయి జెడ్పీఎస్ఎస్ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం గిరిధర్‌రెడ్డి, పీఈటీ దాసరి మల్లేశ్ తెలిపారు. వశాక రజిత, అల్వియ మహివీన్, చింతల మహేశ్వరి, కొట్రంగి అనూష సత్తాచాటారు. హన్మకొండలో జవహర్లాల్ స్టేడియంలో ఆదివారం జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వారు పాల్గొంటారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. -
కొత్త ప్లాంట్ నిర్మాణ పనులపై సమీక్ష
జైపూర్: 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ విస్తరణలో భాగంగా నూతనంగా నిర్మించనున్న మూడో యూనిట్ (800మెగా వాట్ల) థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులపై సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణరావు శనివారం అడ్మిన్ భవన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిని అధికారులు వివరించారు. నిర్దేశిత గడువులోపు పనులు పూర్తిచేసేందుకు ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం సింగరేణి ఉద్యోగి, ఉత్తమ జ్యోతిష్య, జాతీయ ప్రతిభ రత్న, బంగారు నంది అవార్డు గ్రహీత డాక్టర్ దూళిపాళ్ల మల్లికార్జున్శర్మను అధికారులు ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జ్యోతిష్యంపై మక్కువతో మల్లికార్జున్‌శర్మ బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి జ్యోతిష్యశాస్త్రంలో గోల్డ్‌మెడల్ సాధించారని తెలిపారు. సాయంత్రం 5గంటలకు సంస్థ సీఎండీ బలరాం థర్మల్ పవర్ ప్లాంట్, సోలార్ ప్లాంట్ల విద్యుత్ ఉత్పత్తి, ఉత్పాదకత మీద నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎంలు శ్రీనివాసులు, నరసింహారావు, వోఅండ్‌ఎం చీఫ్ జెన్సింగ్, ఏఐటీయూసీ సెక్రటరీ సత్యనారాయణ, సీఎంవో ఏఐ సెక్రటరీ సంతోష్‌కుమార్, ఏజీఎంలు మురళీధర్, మధన్మోహన్, డీజీఎం కిరణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
భూకబ్జాకు పాల్పడిన 9 మందిపై కేసు
● ఐదుగురి అరెస్ట్, పరారీలో నలుగురు ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ జీవన్‌రెడ్డి ఆదిలాబాద్‌రూరల్: భూమి పత్రాలను ఫోర్జరీ చేసి, ప్లాట్లను కబ్జా చేసి డబ్బులు డిమాండ్ చేస్తూ యజమానులను బెదిరించిన 9 మందిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. మావల పోలీసుస్టేషన్లో శనివారం ఈమేరకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని భుక్తపూర్ కాలనీకి చెందిన జనకొండ పోసాని 2009లో ఖానాపూర్ శివారు ప్రాంతంలోని సర్వే నంబర్ 68/44/1లో 30, 38 నంబర్ గల రెండు ప్లాట్లు కొనుగోలు చేశారు. మావల పోలీసుస్టేషన్ పరిధిలోని పైక్ రావు ఆనంద్ (మాజీ కౌన్సిలర్ కుమారుడు), సద్దాం హుస్సేన్, షేక్ షాదుల్లా, బోడకుంట రాజు, అజీముద్దీన్, సంతోష్, మనోహర్, షాబానా బేగం, హీనా అంజుమ్‌లు తప్పుడు పత్రాలు సృష్టించి ఆ ప్లాట్లను కబ్జా చేశారు. మున్సిపల్ అధికారులను మోసం చేసి ఇంటి నంబర్లు పొందారు. దీంతో బాధితురాలు ఈనెల 3న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శుక్రవారం ఐదుగురు నిందితులు పైక్ రావు ఆనంద్, సద్దాం, షేక్ షాదుల్లా, బోడకుంట్ల రాజు, షేక్ అజీముద్దీన్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. మిగతా నలుగురు సంతోష్, మనోహర్, షాబానా బేగం, హీనా అంజుమ్‌లు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అరైస్టెన వారిని 15 రోజుల రిమాండ్‌కు తరలించారు. ప్లాట్ ఇంటి నంబర్లకు సహకరించిన మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుదర్శన్, రెవెన్యూ ఆఫీసర్ జాదవ్ కృష్ణపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో మావల సీఐ కర్రె స్వామి, ఎస్సై ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు. -
రేబిస్‌తో జాగ్రత్త
● పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం ● సీజన్‌కు అనుగుణంగా టీకాలు తప్పనిసరి ● నేడు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం మంచిర్యాలఅగ్రికల్చర్: కుక్కలు, పశువులు, కోళ్లు, పక్షుల నుంచి మనుషులకు సక్రమించేవి జూనోసిస్ వ్యాధులు అంటారు. పశువుల పాకల అపరిశుభ్రత, తదితర కారణాల వల్ల సుమారు 200 రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. ఈ వ్యాధులపై పశుపోషకులు, జంతు ప్రేమికులు అప్రమత్తంగా ఉండాలి. దీనిపై అవగాహన కల్పించి, ఆ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశువైద్యాధికారి శంకర్ పేర్కొంటున్నారు. పశువుల కాపర్లు, పశు వైద్యులు, కుక్కలు, పక్షులు పెంచేవారు, పశువుల డెయిరీ ఫాంలో పనిచేసే వారు అప్రమత్తంగా ఉండాలి. పెంపుడు కుక్కలను పెంచడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శుచి, శుభ్రత పాటించడం ఈ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఇదే రోజు ఎందుకు? 1885 జూలై 6న లూయిస్ ప్యాశచర్ అనే శాస్త్రవేత్త పిచ్చికుక్క కరిచిన ఓ బాలుడికి మొదటిసారిగా వ్యాధి నిరోధక టీకా ఇచ్చారు. ఆ ప్రయత్నం విజయవంతం కావడంతో జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా పాటిస్తారు. పిచ్చికుక్క కాటుతో.. పిచ్చికుక్కకాటు వల్ల పశువులు, కుక్క కరిచిన మనుషులకు రేబిస్ సోకుతుంది. ఈ వ్యాధి ప్రాణాంతకమైనది. పిల్లులు, ముంగిసలు, నక్కలు, తోడేళ్లు తదితర జంతువుల ద్వారా చిట్టెలుక నుంచి ఏనుగు వరకు అన్ని క్షీరదాలకు ఈ వ్యాధి సోకుతుంది. కు క్క కరిచిన తర్వాత 2 నుంచి 3 వారాల తర్వాత వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి 5 నుంచి 6 నెలల తర్వాత బయటపడుతాయి. కుక్కల ద్వా రా గజ్జి వంటి చర్మ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో పిచ్చికుక్కకాటుకు గురై పశువులు, మనుషులు మృత్యుబారిన పడుతుంటారు. పెంపుడు కుక్కలకు ప్రతీఏటా యాంటీ రేబిస్ వ్యా క్సిన్(ఏఆర్వీ) ఇప్పిస్తే ఈ వ్యాధిని అరికట్టవచ్చు. సీజన్‌కు అనుగుణంగా పశువులు, పెంపుడు కుక్కలకు రేబిస్ నివారణ టీకా సకాలంలో వేయించాలి. పెంపుడు కుక్కలకు మొదటిసారి 30వ రోజు, బూస్టర్ డోసు 90వ రోజు టీకాలు వేయించాలి. సకాలంలో టీకాలు వేయించాలి వ్యాధులు సోకిన జంతువులు, కోళ్ల మాంసాన్ని సరిగా ఉడకని గుడ్డు తినవద్దు. చెడిపోయిన, అపరిశుభ్రంగా ఉన్న పాలు, మాంసం, గుడ్లు ఆహారంగా తీసుకోవద్దు. వ్యాధి సోకిన పశువుల పాలు తాగవద్దు. పాడి పశువులు, జంతువుల పాకలను శుభ్రంగా ఉంచాలి. కాలానికనుగుణంగా పశువులు, జంతువులు, పక్షులు, కోళ్లకు రోగ నిరోధక టీకాలు వేయించాలి. చనిపోయిన పశువులు, జంతువులను దూరప్రాంతాల్లో లోతైన గోతిలో సున్నంచల్లి పూడ్చిపెట్టాలి. అంత్రాక్స్– బ్రూసెల్లోసిస్ పశువుల నుంచి మనుషులకు దొమ్మ(అంత్రాక్స్), బ్రూసెల్లోసిస్ తదితర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. సరిగా వైద్యం చేయిస్తే వ్యాధిని అరికట్టవచ్చు. దీని నివారణకు టీకాలు అందుబాటులో ఉన్నాయి. కలుషితమైన పాలు తాగితే క్షయ సోకుతుంది. పందులు, కొంగలు నివాస ప్రాంతాలకు చేరువలో ఉన్నప్పుడు మనుషులు వీటి ద్వారా కూడా మెదడు వాపు సోకవచ్చు. పందులు, దోమలను అరికడితే ఈ వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చు. -
ప్రజల భద్రత కోసమే కార్డన్‌సెర్చ్
మంచిర్యాలక్రైం: ప్రజల భద్రత కోసమే కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఏసీపీ ఆర్.ప్రకాశ్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో శనివారం రాత్రి కార్డన్‌సెర్చ్‌లో భాగంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నంబర్ ప్లేట్ లేకుండా ఎలాంటి పత్రాలు లేని 30 బైక్‌లు, బెల్ట్ షాపుల వద్ద నుంచి సుమారు రూ.10 వేల విలువ గల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడు తూ జిల్లాలో చట్టవ్యతిర్జే కార్యకలాపాలకు పాల్ప డితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్జీయూకేటీలో కౌన్సెలింగ్ ఏర్పాట్లపై సమీక్షబాసర: ఆర్జీయూకేటీలో అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఏర్పాట్లపై అధికారులతో ఇన్చార్జి వీసీ గోవర్ధన్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాసర, మహబూబ్‌నగర్ కేంద్రాల్లో ఈనెల 7, 8, 9 తేదీల్లో అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో అడ్మిషన్ల కన్వీనర్ చంద్రశేఖర్, కోకన్వీనర్ దేవరాజు, బండి హరికృష్ణ, అడ్వైజరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
చోరీ సామగ్రిని తిరిగి వదిలిన ఆగంతకులు
బెల్లంపల్లి: మండలంలోని గురిజాల రైతువేదిక నుంచి అపహరించుకు వెళ్లిన సామగ్రిని ఆగంతకులు తిరిగి అక్కడే వదిలివెళ్లారు. గురువారం రాత్రి రైతు వేదిక తాళం పగులగొట్టి అందులో సామగ్రిని పట్టుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వ్యవసాయ అధికారులు తాళ్లగురిజాల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సామగ్రిని ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు 24 గంటల వ్యవధిలో శుక్రవారం రాత్రి ఆ రైతువేదిక వద్ద తీసుకువచ్చి వదిలివెళ్లారు. బెల్లంపల్లి ఏడీఏ రాజా నరేందర్, బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దిన్, తాళ్లగురిజాల ఎస్సై సీహెచ్.రమేశ్, ఏవో ప్రేమ్‌కుమార్ శనివారం ఉదయం అక్కడికి చేరుకుని చోరీకి గురైన సామగ్రిని పరిశీలించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ చేస్తామని వ్యవసాయ, పోలీసు అధికారులు తెలిపారు. -
పాలిటెక్నిక్ సీట్లకు కౌన్సెలింగ్
శ్రీరాంపూర్: సీసీసీలోని సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీలో యాజమాన్యం కోటా సీట్లు భర్తీ చేశారు. శనివారం కౌన్సెలింగ్‌కు కంపెనీ ఉద్యోగుల పిల్లలు, రిటైర్డ్ ఉద్యోగుల పిల్లలు హాజరయ్యారు. మొత్తం సీట్లలో యాజమాన్యం కోటా కింద సగం సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేశారు. ప్రతీ కోర్సుల్లో 30 సీట్ల చొప్పున 150 సీట్ల ఉండగా, కౌన్సెలింగ్‌లో 84 మంది విద్యార్థులు సీట్లు పొందారు. మొదటి సీటును 1,445 ర్యాంకు సాధించిన ఈ.సుజల్ అనే విద్యార్థి కంప్యూటర్స్‌లో సీటు పొందగా, ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్‌రావు ఆయనకు అడ్మిషన్ అందించారు. మిగిలిన సీట్లలో.. సివిల్‌లో 26, కంప్యూటర్స్‌లో 01, ఎలక్ట్రీకల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో 5, మెకానికల్‌లో 24, మైనింగ్‌లో 10 సీట్లను త్వరలో స్పాట్ కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తామన్నారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎం.దేవేందర్, హెచ్ఓడీలు జి.దామోదర్, జి.రవీందర్, నరసింహాస్వామి, శ్యామల, కె.సుమన్ పాల్గొన్నారు. -
నేడు తొలి ఏకాదశి
● చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభం ● కిటకిటలాడనున్న ఆలయాలు చెన్నూర్: తొలి ఏకాదశి పండగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశులు ప్రతినెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి మొత్తం రెండు ఏకాదశులు వస్తాయి. ఆదివారం తొలి ఏకాదశి పండగ నుంచే చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభమవుతాయి. ఆషాఢ శుక్లపక్షం నుంచి కార్తీక శుక్లపక్షం వరకు చాతుర్మాస్య దీక్షలు చేయడం అనవాయితీగా వస్తుంది. తొలి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగా నిద్రకు ఉపక్రమిస్తారు. దీన్ని శయన ఏకాదశి అని పిలుస్తారు. నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి మేల్కొంటారు. ఈ నాలుగు నెలల కాలాన్ని ప్రజలు పవిత్ర నెలలుగా భావించి చాతుర్మాస్య దీక్షలు చేస్తారు. పండగ విశిష్టత.. భక్తులు సూర్యోదయానికి ముందే గోదావరినదిలో స్నానాలు అచరించి మహావిష్ణువు ఆలయాలను సందర్శించి పూజలు చేస్తారు. చాతుర్మాసం ప్రారంభం కానుండడంతో శ్రీ మహావిష్ణువు ఆలయాలు కిటకిటలాడుతాయి. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి తర్వాత రోజు మహావిష్టువును పూజించి నైవేద్యం సమర్పించి భోజనం చేస్తారు. వ్రతాలు ఆచరించాలి తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతాలు ఆచరించాలి. శ్రీమహావిష్ణువు యోగా నిద్రకు ఉపక్రమించే రోజు కావడంతో తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేసి మహావిష్టువు పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. – వేమారం మహేశ్వర్‌శర్మ, అర్చకుడు, శివాలయం -
నకిలీపత్రాలు సృష్టిస్తున్న ముఠా గుట్టురట్టు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో ప్రభుత్వ శాఖల నకిలీపత్రాలు, స్టాంపులు, అధికారుల సంతకాల స్టాంపులు సృష్టించే ముఠాను ఆదిలాబాద్ పోలీసులు గుట్టురట్టు చేశారు. డాక్యుమెంట్ రైటర్ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న తండ్రి, కుమారుడిపై కేసు నమోదు చేశారు. తండ్రిని అరెస్ట్ చేయగా కుమారుడు పరారీలో ఉన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం ఈమేరకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన లాడ్వే బద్రినాథ్ కుమారుడు రాహుల్‌కుమార్. ఇతను డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్నాడు. గత మూడేళ్లుగా తండ్రి కుమారుడు నకిలీపత్రాలు, స్టాంపులు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నట్లు ఫిర్యాదు అందింది. పక్కా సమాచారంతో శుక్రవారం రాత్రి వారి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. వివిధ జిల్లాల్లో శాఖల అధికారుల సంతకాలతో కూడిన స్టాంపులు, పత్రాలు, వాటిని తయారుచేసే రసాయనాలు, పరికరాలు, కంప్యూటర్, స్కానర్, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నకిలీ పత్రాలతో అక్రమాలు మావల మండలంలోని సర్వేనంబర్ 170లోని ప్లాట్ల పత్రాలను మండల రెవెన్యూ అధికారి కేటాయించినట్లుగా సృష్టించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి ట్రెడ్ లైసెన్స్ నకిలీపత్రాలు, పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన, ఆర్టీవో వాహన రిలీజ్ పత్రాలు, ఆధార్‌కార్డులతోపాటు వివాహ సర్టిఫికెట్లు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారు. వివిధ హాస్పిటల్స్‌కు సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లు తయారుచేసి ప్రభుత్వం ద్వారా కొంతమందికి విక్రయించి లబ్ధిని పొందేలా చూశారు. మహాలక్ష్మి మాన్పవర్ అండ్ ప్లేస్‌మెంట్స్ సర్వీసెస్ అనే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నకిలీ ఉద్యోగ నియామకపత్రాలు తయారు చేసి మోసగించారు. నకిలీ పత్రాలతో ప్రభుత్వ స్థలాలను కబ్జాచేసిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా పోలీస్ బృందాలు ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ ముఠా గుట్టు రట్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, వన్‌టౌన్ సీఐ బి.సునీల్ కుమార్‌లను అభినందించారు. సమావేశంలో డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ బి.సునీల్‌కుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తండ్రి అరెస్ట్, పరారీలో కుమారుడు కంప్యూటర్, స్కానర్, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్ -
రోడ్డు ప్రమాదం.. పశువుల యజమానిపై కేసు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): రోడ్డు ప్రమాదానికి కారణమైన పశువుల యజమానిపై హాజీపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై స్వరూప్‌రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నర్సింగాపూర్‌కు చెందిన ఏనుగు జయపాల్‌రెడ్డి శనివారం ఉదయం కారులో మంచిర్యాల నుంచి నర్సింగాపూర్‌కు వెళ్తున్నాడు. వేంపల్లిలో జాతీయ రహదారిపై ఒక్కసారిగా మూడు బర్రెలు అడ్డువచ్చాయి. దీంతో కారు బర్రెలను ఢీకొట్టి ధ్వంసం కాగా.. జయపాల్‌రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. మూడు బర్రెలు మృతిచెందాయి. పశువులను ఇంటి వద్ద, కొట్టంలో ఉంచాల్సి ఉండగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాతమంచిర్యాల జ్యోతినగర్‌కు చెందిన పశువుల యజమాని కార్ల మల్లేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లేశ్‌ను అదుపులోకి తీసుకుని నోటీసులు జారీ చేశామని ఎస్సై తెలిపారు. పశువులను యజమానులు ఇళ్లు, కొట్టాల్లో కాకుండా రహదారులపైకి వదిలి ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా వ్యవహరిస్తే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 12న చెట్ల తొలగింపునకు వేలంమంచిర్యాలటౌన్: పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి శ్రీనివాస గార్డెన్) వరకు (హైదరాబాద్–కరీంనగర్–చాందా రోడ్డు 251/9 నుంచి 255/7 కిలోమీటర్లు) విస్తరణలో భాగంగా ఇరువైపులా 63 చెట్ల తొలగింపునకు ఈనెల 12న వేలం పాట నిర్వహిస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ లక్ష్మీనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు వేలం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ వేలంలో పాల్గొనాలని కోరారు. ఆర్ఎంపీ క్లినిక్‌లపై చర్యలు తీసుకోవాలి●● సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ రామకృష్ణాపూర్: అనుమతులు లేకుండా ఇష్టానురీతిన వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎంపీ, పీఎంపీ క్లినిక్‌లపై అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, జిల్లా సమితి సభ్యుడు వనం సత్యం డిమాండ్ చేశారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడారు. జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొంతమంది ఆర్ఎంపీలు ఇష్టారీతిన వైద్యం చేస్తున్నారన్నారు. ఆర్కేపీలో ఓ ఆర్ఎంపీ నిర్లక్ష్యం కారణంగానే శ్రీనాథ్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు ఇంజక్షన్ వికటించి మృతిచెందాడని అన్నారు. ఆ వైద్యుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితుడి పక్షాన కాకుండా స్థానిక కొంతమంది నాయకులు ఆర్ఎంపీ పక్షాన నిలుస్తూ సెటిల్మెంట్లకు యత్నించడం బాధాకరమన్నారు. యువకుడి ప్రాణాన్ని రూ.2 లక్షలకు విలువ కట్టడం ఏమిటని మండిపడ్డారు. సమావేశంలో పార్టీ పట్టణ కార్యదర్శి మిట్టపెల్లి శ్రీనివాస్, ఇప్పకాయల లింగయ్య, నక్క వెంకటస్వామి, సాంబయ్య, పౌల్ తదితరులు పాల్గొన్నారు. -
త్యాగానికి ప్రతీక మొహర్రం
● వెల్లివిరుస్తున్న మత సామరస్యం ● జిల్లాలో నేడు మొహర్రం పండుగ నెన్నెల: మహ్మద్ ప్రవక్త మనుమడు హజరత్ ఇమా మ్ హుస్సేన్ త్యాగానికి ప్రతీకగా ముస్లింలు మొహర్రం పండుగ జరుపుకొంటారు. ఇమామ్ హుస్సేన్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులందరికీ పది రో జులపాటు నివాళులర్పిస్తారు. మొహర్రం ఉత్సవా ల్లో కులమతాలకు అతీతంగా పాల్గొంటారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో పీరీలను కొలుస్తారు. ప ది రోజుల పాటు పూజలందుకున్న పీరీలను మొహర్రం సందర్భంగా నేడు నిమజ్జనం చేయనున్నారు. హస్సేన్, హుస్సేన్ పేరిట గ్రామాల్లో కొలువుదీరే సవార్లను (పీరీలు) భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. పీరీల వద్ద కోరుకున్న మొక్కులు తీరుతాయని ప్రజల ప్ర గాఢ నమ్మకం. పీరీల మొక్కుతో పిల్లలు పుడితే ము స్లింలు వారికి హస్సేన్, హుస్సేన్ అని పేరు పెడతా రు. హిందువులైతే ఆశన్న, ఉశన్న, ఆడపిల్లలైతే ఆశ క్క, ఉశక్క అని నామకరణం చేస్తారని పలువురు పేర్కొంటున్నారు. ఇలాంటి పేర్లు కలిగిన వారు గ్రామాల్లో చాలా మంది ఉన్నారు. పదిరోజులపా టు నిర్వహించే ఈ ఉత్సవాల్లో తారతమ్య భేదాలు లేకుండా పాల్గొంటారు. పీరీలను నమ్మేవారు మొ హర్రం నెల వంక కనిపించిన నుంచి నిమజ్జనం జరి గే వరకు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటారు. పీరీలకు మలిద ముద్దలు, కుడుకలు, బెల్లంషరబత్ నైవేద్యంగా సమర్పిస్తారు. సబ్జా ఆకులు, పూలు, కుడుకల దండలతో అలంకరిస్తారు. పీరీల వద్ద అగ్నిగుండం (అలావా) ఏర్పాటు చేసి దాని చుట్టూ కాళ్లకు గజ్జెలు కట్టుకుని డప్పుచప్పుళ్ల మధ్య లయబద్ధంగా అసైదులా ఆడతారు. -
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నస్పూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గ్రా మీణ బ్యాంక్ మంచిర్యాల ఆర్ఎం ప్రభుదాస్ సూచించారు. పట్టణ పరిధిలోని మెప్మా కా ర్యాలయంలో సీతారాంపల్లి, సింగాపూర్ శా ఖలు, మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల కు రుణాల మంజూరు, ఖాతాల నిర్వహణపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ఈ రెండు శాఖల పరిధిలో ఇప్పటివరకు రూ.48కోట్ల రుణాలు మంజూ రు చేసినట్లు చెప్పారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా ప్రతీ ఏడాది రూ.20 చెల్లించి రూ.2లక్షల ప్రమాదబీమా, రూ.436 చెల్లించి ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా ద్వారా సాధారణ మరణానికి రూ.2 లక్షల బీమా సదుపాయం పొందవచ్చని తెలిపారు. మేనేజర్లు నరసింహస్వామి, రాము, ఫీల్డ్ అధికారులు రవి, డేవిడ్ పాల్గొన్నారు. -
మరిన్ని కొత్త బడులు
● 20 మంది విద్యార్థులుంటే చాలు.. ● మంచిర్యాలలో 15, నిర్మల్‌లో ఐదు స్కూళ్ల ప్రారంభానికి సన్నాహాలు ● అద్దెభవనాల్లో ఏర్పాటుకు చర్యలుమంచిర్యాలఅర్బన్: నిరుపేద విద్యార్థులకు సర్కా రు విద్యను చేరువ చేసేందుకు ప్రభుత్వం దృష్టి సా రిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, మంచిర్యాలలో కొత్తగా పాఠశాలలు ప్రారంభించేందుకు నిర్ణయించింది. 20 మంది, అంతకంటే ఎక్కు వ పిల్లలున్న ప్రాంతాలను గుర్తించి పాఠశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. దీనిపై శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే విద్యార్థులు లేరంటూ మూసేసిన పాఠశాలల పునఃప్రారంభానికి విద్యాశా ఖ శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఇప్పటికే మంచి ర్యాల జిల్లాలో మూడు పాఠశాలలు పునఃప్రారంభించింది. హజీపూర్ మండలం వెంపల్లి, లక్సెట్టిపే ట్ మండలం కొత్త కొమ్ముగూడ, దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లిలో పాఠశాలలు తెరుచుకున్నాయి. ‘ప్రైవేట్’కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) విద్యను సర్కారు అందుబాటులోకి తెచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లాలో 23పాఠశాలల్లో పూర్వప్రాథమిక విద్యను అం దుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం విద్యార్థులుండి బ డులు లేని చోట వెంటనే కొత్తగా ప్రైమరీ స్కూళ్ల ఏ ర్పాటే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లాలో 5, మంచిర్యాలలో 15 కొత్త బడులు త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం ఆయా జిల్లా ల విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏర్పాట్లలో అధికారులుగ్రామీణ, పట్టణ ప్రాంతాలవారీగా కొత్త ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటుపై విద్యాశాఖ అధికారులు తలమునకలయ్యారు. కిలోమీటరు లోపు ప్రైమరీ, మూడు కిలోమీటర్ల లోపు అప్పర్ ప్రైమరీ, ఐదు కి లోమీటర్లలోపు హైస్కూల్ ఉండాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. ఆయా గ్రామాలు, పట్టణాల్లో ఎంత మంది పిల్లలున్నారు? పాఠశాల తెరిచే అవకాశాలు ఎంత మేర ఉన్నాయి? అనే విషయాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. ఇందులో భాగంగా కొత్తగా సర్కారు పాఠశాలలకు అవసరమైన వసతిగృహా లు, అద్దె భవనాలు ఎక్కడెక్కడా ఉన్నాయో.. ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ భవనాలు ఏమైనా ఉన్నా యా.. అని పరిశీలిస్తున్నారు. ఫర్నిచర్ బోర్డులు, వి ద్యా సామగ్రి కోసం అవసరమైన బడ్జెట్ కలెక్టర్ ద్వారా సమకూర్చనున్నారు. కొత్త పాఠశాలలు గ్రా మీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రారంభం కానున్నాయి. వీటికి అనువైన భవనాలు దొరుకుతాయా? లేదా? తేలాల్సి ఉంది. త్వరలోనే కొత్త పాఠశాలలు ప్రారంభిస్తాం కొత్తగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చాయి. విద్యార్థులుండి ప్రభుత్వ పాఠశాలలు లేని చోట కొత్త బడులు ఏర్పాటు కానున్నాయి. పాఠశాలలకు అనుకూలమైన భవనాలు, మౌలిక వసతులు సమకూర్చడంపై దృష్టి సారించాం. వీలైనంత త్వరలోనే కొత్త బడులు ప్రారంభం కానున్నాయి. ఇదివరకు పిల్లలు తక్కువగా ఉండి.. టీచర్లు ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి కొత్త పాఠశాలలకు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై పంపిస్తాం. – యాదయ్య, మంచిర్యాల డీఈవోకొత్తవి ఇక్కడే..20 మంది కంటే ఎక్కువ విద్యార్థులున్నా ప్రభు త్వ, స్థానిక సంస్థల పాఠశాలలు అందుబాటులో లేని గ్రామీణ ఆవాసాలు, పట్టణ ప్రాంతా ల్లో వార్డుల జాబితాను విద్యాశాఖ అధికారులు రూపొందించారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 20 చోట్ల పాఠశాలలు ఏ ర్పాటు కానున్నాయి. మంచిర్యాల జిల్లాలో 15 చోట్ల ప్రారంభించనున్నారు. ఇందులో బెల్లంపల్లి మండలం సోమగూడెం, క్యాతన్‌పల్లిలోని వార్డు నంబర్–17 (‘బీ’ జోన్ పార్ట్), శ్రీనివాసనగర్, శేషుపల్లి విలేజీ, నాగార్జున కాలనీ క్వార్టర్, కాకతీయ కాలనీ, నస్పూర్‌లోని సుభాష్‌నగర్, హౌసింగ్‌బోర్డు కాలనీ, లక్సెట్టిపేట్లోని గో దావరి రోడ్ వీకర్ సెక్షన్, గొల్లగూడ మోదేల, మందమర్రి మండలంలోని బురదగూడెం, పా కిస్తాన్క్యాంపు, మంచిర్యాలలోని హైటెక్‌సిటీ కా లనీ, ఎల్ఐసీ కాలనీ, గోసేవా మండల్లో 20 మంది కంటే ఎక్కువ విద్యార్థులున్నట్లు గుర్తించి పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యా రు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగాల్పేట్ మహాలక్ష్మీవాడ–1, డబుల్బెడ్రూం (ఎల్లపల్లి), ఖానాపూర్ డబుల్ బెడ్రూం కాలనీ (కుమురంభీం ఎక్స్‌రోడ్), భైంసాలోని బాబ్లాగామ్, ఖానా పూర్లోని రంగపేట్ గ్రామంలో అధికారులు కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. -
విధులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు
● కలెక్టర్ కుమార్ దీపక్ ● కార్యాలయాల తనిఖీ మంచిర్యాలఅగ్రికల్చర్: విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. శనివారం జిల్లా సమీకృత కలెక్టరేట్లోని వివి ధ శాఖల కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చే శారు. రిజిస్టర్లు, రికార్డులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హాజరు పట్టికలు, ఆయా కార్యాలయాల పరిధిలో కొనసాగుతున్న పనుల వివరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. ఆలస్యంగా వచ్చిన, సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన అధికారులు, సిబ్బందికి షోకా జ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్‌ను ఆదేశించారు. అధికారులు ఆయా కార్యాల యాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈవీఎంల గోదాం పరిశీలన జిల్లాలోని నస్పూర్లోగల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాంను కలెక్టర్ కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. గోదాం వద్ద పటిష్ట భద్రత చేపట్టినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
అర్జీలు పెండింగ్..!
● వేలాదిగా వచ్చిన దరఖాస్తులు ● వందల్లోనే సమస్యలు పరిష్కారం ● కొనసాగుతున్న పరిశీలన ప్రక్రియ ● సాదాబైనామాలకు కలగని మోక్షం ● ఇదీ ‘భూ భారతి’ దరఖాస్తుల తీరు సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తు ల పరిశీలన కోసం సంబంధిత అధికారులు సతమతమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారానికి వేలల్లో వినతులు వచ్చాయి. కాగా, వందల సంఖ్యలోనే పరిష్కారానికి అవకాశం కలు గుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తె లిసిందే. జిల్లాలో తొలుత పైలట్ మండలంగా భీ మారాన్ని ఎంపిక చేయగా, తర్వాత జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సదస్సుల ద్వారా 16వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇప్పటివరకు 200పైచిలుకు మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. ఇంకా వేలాది అర్జీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. సాదాబైనామాలు..సాదాబైనామాలు, పీవోటీ, ప్రభుత్వ భూములకు సంబంధించి 5వేలకు పైగా అర్జీలు వచ్చాయి. తెల్ల కాగితాలపై జరిగిన భూ క్రయవిక్రయాలపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జిల్లాలో వేలాదిమంది ఈ సమస్య పరిష్కారం కోసం వేచి చూస్తున్నారు. మిగతావి సర్వే నంబర్ మిస్సింగ్, 2 వేలకు పైగా డిజిటల్ సైన్ పెండింగ్‌పై వచ్చాయి. మిగతా దరఖాస్తులో కోర్టు కేసులు, భూ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, భూమి రకంలో మార్పు, విరాసత్, కుటుంబ సభ్యుల పేర్లలో తప్పులు తదితర సమస్యలపై వచ్చినవి ఉన్నాయి. వీటన్నింటినీ అధికా రులు ఆన్లైన్లో నమోదు చేశారు. ప్రస్తుతం అర్జీల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు మొదట నోటీసులు ఇస్తూ దరఖాస్తుదారుల వద్ద ఉన్న రికార్డులు, ఆధారాలను పరిశీలిస్తున్నారు. హద్దు సమస్యలు అలాగే..అటవీ, రెవెన్యూ హద్దుల సమస్యలపై జిల్లా వ్యా ప్తంగా అనేక దరఖాస్తులు వచ్చాయి. ఈ సమస్యల పరిష్కారానికి అటవీ, రెవెన్యూ, సర్వే శాఖల అధి కారులు క్షేత్రస్థాయిలో సర్వే చేయాల్సి ఉంది. ఇందుకోసం ఇరు శాఖల మధ్య రికార్డుల ఆధారంగా ఆ భూములు ఏ రకానికి చెందినవో తేల్చాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యలు పరిష్కారం దిశగా వెళ్లడం లేదు. కొన్నిచోట్ల జాయింట్ సర్వేలు జరుగుతున్నప్పటికీ అటవీ, రెవెన్యూ శాఖలలో వేటివో స్పష్టంగా తేల్చలేకపోతున్నారు. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ భూములున్న చోట కూడా రికార్డుల్లో స్పష్ట త లేక అధికారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. పైలట్ మండలంలోనూ..పైలట్ మండలం భీమారంలోనూ భూ సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ మండలంలో 2,140 దరఖాస్తులు రాగా, వీటిలో వెయ్యికిపైగా అర్జీలు సాదా బైనామాలవే ఉన్నాయి. మొత్తంగా 200 అర్జీలు పరి ష్కార యోగ్యంగా ఉన్నాయి. వీటిలో 108 అర్జీలు ఆర్డీవో స్థాయిలో సమస్య పరిష్కారానికి నివేదించారు. మిగతావి పరిశీలన దశలో ఉన్నాయి. -
విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): విద్యార్థులు చట్టాలపై కూడా అవగాహన పెంచుకోవాలని లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా చీఫ్ లీగల్ ఎ యిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎండీ సంధాని తెలి పా రు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్ల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, జూనియర్ కళాశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు భారత న్యాయ సంహిత చట్టాలపై అవగాహన సద స్సు నిర్వహించారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ సూపరింటెండెంట్ భాస్కర్, డెప్యూటీ చీఫ్ శ్రీనివాస్, అసిస్టెంట్లు రాములు, సదయ్య, కళాశాల ప్రిన్సిపల్ మోహన్, వైస్ ప్రిన్సిపల్ మహేశ్వర్‌రావు, అధ్యాపకులు డాక్టర్ నగేశ్, ప్రమోద్, సంతోష్‌గౌడ్, కిరణ్, సంధ్య, ఉదయశ్రీ, శృతి, శరణ్య, సత్యనారాయణ, శ్రీనివాస్, వినయ్, సురేందర్ పాల్గొన్నారు. -
విద్యుత్ ప్రమాదాలపై అవగాహన
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలంలోని దొనబండలో శనివారం విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించి రై తులకు అవగాహన కల్పించారు. ఎస్ఈ ఉత్తమ్ జా డే మాట్లాడుతూ.. రైతులు వానాకాలంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సొంతంగా విద్యు త్ పనులు చేయవద్దని, ఎక్కడైనా వేలాడుతున్న, తెగిపడిన తీగలు కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. జీఐ వైర్‌పై బట్టలు ఆరవేయరాదని, మేతకు వెళ్లే పశువులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వైపు వెళ్లకుండా చూడాలని సూచించారు. పొలాల వద్ద మోటర్లు, స్టార్టర్లు, జీఐ పైపులున్న ప్రాంతాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విద్యుత్ సమస్యలు ఉత్పన్నమైతే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని సూచించా రు. పొలంబాటలో రైతులు అనుమానాలను నివృత్తి చేస్తూ పొలాల్లో వంగి ఉన్న విద్యుత్ స్తంభాలను సరి చేయించారు. కార్యక్రమంలో ఆపరేషన్ డీఈ మహ్మద్ కై సర్, ఏఈ మహేందర్‌రెడ్డి, లైన్మెన్లు, రైతులు, స్థానికులు పాల్గొన్నారు. -
సెల్ఫీ కొట్టు..ప్రైజ్ పట్టు
మంచిర్యాలఅర్బన్: కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏటా విద్యార్థులకు జాతీయ విద్యార్థుల పర్యావరణ పోటీ (ఎన్ఎస్పీసీ)ని నిర్వహిస్తోంది. హరిత్–ద వే ఆప్ లైఫ్ అనే థీమ్‌తో దేశవ్యాప్తంగా విద్యార్థుల కు పోటీలు నిర్వహిస్తున్నారు. ఈనెల 1న ప్రారంభమైన పోటీలు 21 వరకు కొనసాగనున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం, వ్యర్థాలు వేరు చేయడం, వాతావరణంలో పొంచి ఉన్న ప్రమాదాలను లోతుగా అర్థం చేసుకునేందు కు విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు దీని ప్రధాన ఉద్దేశం. జిల్లాలో అన్ని పాఠశాలల యాజ మాన్యాలు గత నాలుగు రోజులుగా విద్యార్థులు ప్రధానంగా మొక్కలు నాటడం, వ్యర్థాలను వేరు చేయడం, నీటి సంరక్షణ అంశాలకు సంబంధించి స్వీయచిత్రాలు (సెల్ఫీ దిగి) యాప్‌లో ఉత్సాహంగా అప్లోడ్ చేస్తున్నారు. ఈ క్విజ్ పోటీల్లో పాల్గొనే విద్యార్థులందరూ ఇ–సర్టిఫికెట్లు అందుకుంటున్నా రు. జాతీయస్థాయిలో క్విజ్ పోటీల్లో ప్రతిభ చూపి న వారికి నగదు పారితోషికంతోపాటు జాతీయ హరిత విద్యార్థి అవార్డు అర్హత పొందవచ్చు. ఒకటో తరగతి నుంచి..ఈ పోటీల్లో ఒకటి నుంచి పరిశోధన విద్యార్థుల వరకు ఐదు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఏకో మిత్రం యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్, ఇతర భాషల్లో క్విజ్ ఉంటుంది. మొక్క నాటుతున్న నీరు పొదుపు చేస్తున్న వ్యర్థాలను వేరు చేస్తున్న సెల్ఫీ లోడ్ చేయాల్సి ఉంటుంది. 1 నుంచి 5వ తరగతి వరకు, 6 నుంచి 8 వరకు, మూడో గ్రూప్‌లో 9 నుంచి 12వ తరగతి, నాలుగో గ్రూప్‌లో గ్రాడ్యుయేట్, పీజీ పరిశోధకులు, ఐదో గ్రూప్‌లో ఇతరులకు అవకాశం కల్పించారు. ఈనెల 21 వరకు పోటీలు నిర్వహిస్తారు. ఆగస్టు 30న ఫలితాలు వెల్లడించనున్నారు. పర్యావరణంపై ఏకోమిత్రం పోటీలు జూలై 21 వరకు పోటీల నిర్వహణ ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు విద్యార్థులను ప్రోత్సహించాలి ప్రతీ పాఠశాల విద్యార్థులు పర్యావరణ ఏకోమిత్రం పోటీల్లో పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ఈపోటీల్లో పాల్గొనేవారికి ఇ–సర్టిఫికెట్ల ఇవ్వడంతోపాటు విద్యాసంస్థలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కలుగుతుంది. – యాదయ్య, డీఈవో -
చోరీ చేసిన బంగారు గొలుసు విక్రయిస్తూ..
నిర్మల్‌టౌన్: చోరీ చేసిన బంగారు గొలుసు విక్రయించేందుకు వెళ్తున్న ఇద్దరు మహిళల ను అరెస్టు చేసినట్లు నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ వివరాలు వెల్లడించా రు. గతనెల 30న నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద కడెంకు చెందిన కిష్టమ్మ మెడలో రెండు తు లాల బంగారుగొలుసు చోరీకి గురైంది. పోలీ సులు బస్టాండ్ వద్ద గల సీసీ ఫుటేజీలను పరి శీలించి దొంగలు ఆదిలాబాద్‌కు చెందిన సంగింటి లక్ష్మి, నిర్మల్‌కు చెందిన పండెన కవిత గుర్తించారు. చోరీ చేసిన బంగారాన్ని విక్రయించేందుకు ఇద్దరు మహిళలు వెళ్తున్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రెండు తులాల బంగారు గొలుసు, కత్తెరను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనబర్చిన పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై సంజీవ్, జిల్లా సీసీఎస్ టీమ్‌ను ఎస్పీ జానకీ షర్మిల అభినందించారు. -
సమస్యల్లో సర్కారు ఆస్పత్రులు
బెల్లంపల్లి/తాండూర్/నెన్నెల/వేమనపల్లి/కాసిపేట: బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్పత్రులు సమస్యలకు నిలయాలుగా మారాయి. వైద్యులు, సిబ్బంది కొరత, అసౌకర్యాలతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వంద పడకలకు ఇంకా అప్‌గ్రేడ్ కాలేదు. ప్రస్తుతం 30పడకల సామర్థ్యంతో నిర్వహిస్తున్నారు. రోగుల తాకిడి అధికంగా ఉండగా.. నర్సుల కొరత నెలకొంది. వంద పడకలకు గాను 26మంది నర్సులు ఉండాల్సి ఉండగా.. 19మంది పని చేస్తున్నారు. వీరిలో తొమ్మిది మంది డిప్యూటేషన్‌పై వచ్చారు. నర్సుల పోస్టుల భర్తీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. రోజువారీగా 250 నుంచి 300 మంది రోగులు వస్తున్నారు. పది మంది వైద్యులతో నెట్టుకొస్తున్నారు. అత్యవసర చికిత్స కోసం మంచిర్యాలకు రెఫర్ చేస్తున్నారు. ఒక్కరే వైద్యులు బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యుల్లో ఒకరు మందమర్రికి డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఒక్కరే వైద్యులు ఉండడంతో గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. ఆరోగ్య కేంద్రం దారి చిరుజల్లులకే బురదగా మారడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. వైద్యాధికారి పోస్టు ఖాళీగా ఉంది. వారానికోసారి రాక తాండూర్ మండలం మాదారం టౌన్షిప్ సింగరేణి డిస్పెన్సరీలో వారానికోసారి బుధవారం మాత్రమే వస్తుంటారు. మిగతా రోజుల్లో రోగులకు వైద్య సేవలు అందడం లేదు. ఇద్దరు స్టాఫ్‌నర్సులు, వార్డు అసిస్టెంట్ వైద్యం అందిస్తుంటారు. ● తాండూర్ పీహెచ్సీలో ముగ్గురు వైద్యులకు గాను శుక్రవారం ఇద్దరే కనిపించారు. ఏఎన్ఎం పోస్టులు మూడు ఖాళీ ఉండగా.. ఖాళీగా ఉన్న సబ్సెంటర్లో ఓ ఏఎన్ఎంతో నెట్టుకొస్తున్నా రు. ఆపరేషన్ థియేటర్లోని పరికరాలు చాలా రోజుల నుంచి వాడక నిరుపయోగంగా మారా యి. అవసరమైన పరికరాలు లేక గర్భిణులకు ప్రసవం చేయడం లేదు. బెల్లంపల్లి ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. కుక్కకాటు కేసులు అధికంగా వస్తున్నాయి. ఆయుర్వేద వైద్యశాలలో రెగ్యులర్ డాక్టర్ లేరు. డిప్యూటేషన్‌పై గురు, శుక్ర, శనివా రాల్లో వైద్యురాలు వస్తుంటారు. కాళ్లనొప్పులకు సంబంధించిన మందుల కొరత ఉంది. రక్త పరీక్షలకు ఇబ్బంది నెన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. రోజుకు 80నుంచి 100మంది రోగులు వస్తుండగా సరైన సేవలు అందడం లేదు. ఇద్దరు డాక్టర్లకు గాను ఒకరే విధులు నిర్వర్తిస్తున్నారు. ల్యాబ్‌టెక్నీషియన్ లేక గర్భిణులు, జ్వరబాధితులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు రక్త పరీక్షలకు ఇబ్బందులు పడుతున్నారు. ఒక స్టాఫ్‌నర్సు పోస్టు ఖాళీగా ఉంది. ఎస్వో లేక ఉన్న వైద్యుడిపై పని భారం పెరిగింది. ఆస్పత్రిలో తాగునీరు లేక రోగులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. సమయపాలన పాటించని వైద్య సిబ్బంది వేమనపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. శుక్రవారం ఉదయం 11.30గంటల వరకు వైద్యాధికారి రాజేష్ విధులకు హాజరు కాలేదు. 24గంటల వైద్యం అమలులో ఉన్నా సమయపాలన పాటించకపోవడం గమనార్హం. 11.30గంటలకు ఎనిమిది మంది ఓపీ వచ్చారు. ఓపీ గది పక్కనే బ్లీచింగ్ పౌడర్ బస్తా చిరిగిపోయి ఉండడంతో వాసన వస్తోంది. అదనపు వైద్యాధికారి, సీహెచ్‌వో, మేల్ సూపర్వైజర్ స్టాఫ్‌నర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చామనపల్లి, నీల్వాయి, జిల్లెడ సబ్సెంటర్లలో ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్సీడీ సమావేశానికి ఏఎన్ఎంలు, సిబ్బంది హాజరు కాగా వైద్యాధికారి సమయానికి రాలేదు. ఆసుపత్రి ముందే బురద కాసిపేట పీహెచ్సీ ఎదుట బురదగా మారడంతో రోగులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 108, ఆటోరిక్షాలు వెళ్లేందుకు, నడవలేని వారిని వాహనాల్లో తీసుకెళ్లడం సమస్యగా మారింది. డ్రైవర్, ఆపరేటర్, స్టాఫ్‌నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పరికరాలు సమకూర్చితే ప్రసూతి చేస్తాం ఆసుపత్రి థియేటర్లోని పరికరాలు చాలా రోజుల నుంచి వాడకపోవడంతో పనికి రాకుండా పోతున్నాయి. నిధుల లేమితో కొత్త పరికరాలు కొనుగోలు చేయలేకపోతున్నాం. పరికరాలు సమకూర్చితే గర్భిణులకు ప్రసవాలు చేస్తాం. – డాక్టర్ ఝాన్సీ, తాండూర్ పీహెచ్సీ -
భార్యను హత్య చేసిన భర్త అరెస్టు
తాండూర్: ఈనెల 3న కన్నెపల్లి మండలం మెట్పల్లిలో భార్యను హత్య చేసిన భర్తను అరెస్టు చేసినట్లు సీఐ కుమారస్వామి తెలిపారు. తాండూర్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఈమేరకు వివరాలు వెల్లడించారు. మెట్‌పల్లికి చెందిన ముడిమడుగుల తిరుపతికి దహెగాం మండలం భావన్‌నగర్ గ్రా మానికి చెందిన తులసీతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి గ్రీష్మ (4) పాప ఉంది. పెళ్లయిన నాటి నుంచి భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల కాలంలో తిరుపతి తన భార్య తులసీపై మరింత అనుమానం పెంచుకున్నా డు. ఈనెల 2న ఈ విషయమై భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఎలాగైనా కట్టుకున్న భార్యను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 3న ఇంట్లో తులసీ నిద్రిస్తుంది. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన తిరుపతి ఆమె మెడపై గొడ్డలితో నరికి చంపాడు. భార్యను చంపానని బంధువులకు ఫోన్లలో తెలిపాడు. తులసీ తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో కన్నెపల్లి ఎస్సై గంగారాం, సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్ని చోట్ల వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా అరకొరగా వైద్యం అందుతోంది. అపరిశుభ్రత, అసౌకర్యాలతో రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ‘సాక్షి’ శుక్రవారం విజిట్ నిర్వహించింది.
ఆసుపత్రి చుట్టూ అపరిశుభ్రత మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరింది. వరండా, పలు గదుల్లో రెండేళ్లుగా స్లాబ్ పెచ్చులూడుతోంది. దీంతో రోగులు, వైద్యులు, సిబ్బంది భయపడుతున్నారు. కాలేజీ రోడ్డులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆవరణలో నూతనంగా 450పడకలతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తి కావస్తుండడంతో ప్రస్తుత భవనంలో మరమ్మతులు చేపట్టడం లేదు. ఇప్పటికే నూతన భవన నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా.. ఆలస్యమవుతోంది. వర్షాకాలం తర్వాతే అందుబాటులో రానుండగా.. మరో మూడు నెలలు ఇబ్బందుల్లోనే ఆస్పత్రి నిర్వహించాల్సి ఉంది. ఆస్పత్రిలో వెలువడే బయోవేస్టేజ్, చెత్తను కలిపి ఆస్పత్రి వెనుకాల ఉన్న ఖాళీ స్థలంలో వేస్తుండడంతో దుర్గంధం వెదజల్లుతోంది. జిల్లాతోపాటు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, మహా రాష్ట్ర నుంచి నిత్యం 500కు పైగా రోగులు(ఓపీ) వస్తుంటారు. అన్ని విభాగాల్లో వైద్యులు లేకపోవడం, అపరిశుభ్రత, ఇతరత్రా కారణాలతో రోగుల సంఖ్య తగ్గింది. అత్యవసర విభాగంలో పది మంది వైద్యులకు గాను ఏడుగురు మాత్రమే ఉన్నారు. వీరిలో ఒకరు మెటర్నిటీ లీవులో వెళ్లారు. దంత, కంటి వైద్యులు లేరు. గుండె వైద్య నిపుణుడు డిప్యూటేషన్‌పై ఖమ్మంలో పని చేయగా.. ఇటీవల డిప్యూటేషన్ రద్దు చేసినా ఇక్కడికి రాకపోవడంతో వైద్యసేవలు అందుబాటులో లేవు. మాతాశిశు ఆరోగ్య కేంద్రం ప్రసూతి విభాగంలో 14మంది గైనకాలజిస్టులకు ఆరుగురే పని చేస్తున్నారు. నవజాత శివు సంరక్షణ కేంద్రంలో అసోసియేట్ ప్రొఫెసర్లు ఇద్దరు ఉండాల్సి ఉండగా.. రెండు పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఎనిమిది గాను ముగ్గురే ఉన్నారు. వాహనాల పార్కింగ్ స్థలం లేక, ఇష్టారీతిన పార్కింగ్తో అంబులెన్స్‌లు లోపలికి రాని పరిస్థితి ఏర్పడుతోంది. వైద్యుల నియామకానికి నివేదించాంమంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మాతాశిశు ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులకు నివేదించాం. పదోన్నతులతో కొందరిని, నూతనంగా నియామకం చేపట్టి మరికొందరిని కేటాయించే అవకాశం ఉంది. ఆసుపత్రి ఆవరణలో పరిశుభ్రతకు చర్యలు తీసుకోవడంతోపాటు వర్షాకాలంలో రోగులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. పాత భవనం కావడం వల్ల కొన్ని ఇబ్బందులున్నా, నూతన భవనం పూర్తయితే పూర్తిస్థాయి సౌకర్యాలు అందుతాయి. – డాక్టర్ హరీశ్‌చంద్రరెడ్డి, మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ప్రారంభం కాని పక్కా భవనం లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి పాత రేకుల షెడ్డులోనే కొనసాగుతోంది. 30పడకల పక్కా ఆస్పత్రి భవనం పూర్తి కాగా త్వరలో ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎనిమిది మంది వైద్యులకు గాను ఐదుగురే ఉన్నారు. వీరిలో ముగ్గురు డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. స్టాఫ్‌నర్సులు 14మంది ఉండాల్సి ఉండగా.. ఆరుగురే ఉన్నారు. వీరిలో ఇద్దరు డిప్యూటేషన్‌పై మంచిర్యాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎంఎన్‌వోలు నలుగురికి గాను ఒక్కరే ఉన్నారు. ఎఫ్ఎన్వో నలుగురికి గాను ఒక్కరూ లేరు. -
‘బస్తా ఇస్తలేరు.. పట్టించుకుంటలేరు’
కౌటాల(సిర్పూర్): తొమ్మిది రోజుల నుంచి అధికా రుల చుట్టూ తిరిగినా.. ఒక్క యూరియా బస్తా కూడా ఇస్తలేరని చింతలమానెపల్లి మండల రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం కౌటాల రైతు వేదిక ఎదుట భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూరియా బస్తాల కోసం వ్యవసాయ పనులు ఆపి కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవ డం లేదన్నారు. ఎరువుల కోసం గంటల తరబడి పడిగాపులు గాయాల్సి వస్తుందని వాపోయారు. సరిపడా ఎరువులు పంపిణీ చేయకుంటే వ్యవసాయం చేయలా వద్దా అని ప్రశ్నించారు. యూరి యా బస్తాల కోసం చింతలమానెపల్లికి వెళ్తే.. కౌటాల వెళ్లాలని చెబుతున్నారని, కౌటాలకు వెళ్తే అక్కడికే వెళ్లాలంటున్నారని తెలిపారు. చింతలమానెపల్లిలోనే అక్కడి రైతులకు ఎరువులు పంపిణీ చేయాలన్నారు. కాగా, యూరియా బస్తాలు అందజేస్తామని కౌటాల ఏవో ప్రేమలత తెలపడంతో రైతులు ఆందోళన విరమించారు. కౌటాల, చింతలమానెపల్లి మండలాల రైతులు భారీగా తరలిరావడంతో పోలీసుల బందోబస్తు మధ్య యూరియా బస్తాలు పంపిణీ చేశారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
ఉమ్మడిజిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గు రు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మద్యానికి బానిసై ఒకరు, మద్యంమత్తులో మరో యువ కుడు, అనారోగ్యంతో మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల మందు తాగి ఒకరు..లోకేశ్వరం: మండలంలో ని రాజూర గ్రామానికి చెందిన తోట దేవన్న(52) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఆశోక్ కథనం ప్రకారం.. దేవన్న కొంతకాలంగా మద్యానికి బానిసై ఎలాంటి పని చేయకుండా తిరుగుతుండేవాడు. గురువారం రాత్రి అతి గా మద్యం తాగి ఇంటికి రావడంతో ఈ విషయమై భార్య హేమలత, కుమారుడు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన దేవన్న అదేరాత్రి గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్‌లో నిర్మల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సతీశ్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యం మత్తులో యువకుడు.. బజార్హత్నూర్: మద్యం మత్తులో యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్సై లింబాజీ తెలిపారు. ఆయన కథనం ప్రకా రం.. మండల కేంద్రంలోని ముత్యంపేటకు చెందిన సుకుల్ నారాయణ–లక్ష్మి దంపతుల కుమారుడు సుకుల్ తరుణ్(23) ఓ ఫర్టిలైజర్ షాపులో పనిచేస్తున్నాడు. గత కొన్నిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు. బహిర్భుమికని గురువారం మధ్యాహ్నం చెరువుకట్ట వైపు వెళ్లి తిరిగిరాలేదు. అక్కడ పురుగుల మందు తాగి కిందపడిపోయి ఉన్నాడని స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని అతన్ని పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. అనారోగ్యంతో మహిళ..లింగాపూర్: అనారోగ్యంతో బాధపడుతున్న మహి ళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై గంగన్న కథనం ప్రకారం.. మండలంలోని జాముల్దర గ్రామానికి చెందిన సలాం సరస్వతీ(33) గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆసుపత్రుల్లో చూపించిన నయం కాలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన భర్త, కుటుంబ సభ్యులు ఆమెను జైనూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఆదిలాబాద్ రిమ్స్‌కు పంపించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నకిలీ పోలీస్ అరెస్ట్
గుడిహత్నూర్: పోలీ స్ అవతారమెత్తి ప్ర జలను మోసగిస్తూ, డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ పోలీస్‌ను శుక్రవారం అరెస్టు చేసినట్లు ఇ చ్చోడ సీఐ బండారి రాజు, పీఎస్సై మధుకృష్ణ తెలిపారు. వారి కథ నం ప్రకారం.. మండల కేంద్రంలోని ఎక్స్‌రోడ్డు వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా వ్యక్తి కనిపించా డు. సదరు వ్యక్తిని విచారించగా నార్నూర్‌కు చెందిన కుడ్మెత నాగరావ్ అని గుర్తించి సెల్‌ఫోన్‌ను పరిశీలించారు. పోలీసు యూనిఫాంతో ఉన్న అతడి ఫొటోలు ఉన్నాయి. వాట్సాప్ డీపీలో యూనిఫాం వేసుకున్న ఫొటో పెట్టాడు. వీటిని చూపిస్తూ ప్రజల వద్ద డబ్బులు వసూళ్లు చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి పోలీస్ అని రాసి ఉన్న బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
బస్తీ దవాఖానాలో పరికరాలు కరువు
చెన్నూర్/చెన్నూర్‌రూరల్/కోటపల్లి/మందమర్రిరూరల్: చెన్నూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత నెలకొంది. కొన్ని ఆస్పత్రుల్లో పరికరాల కొరత కారణంగా వైద్యం అరకొరగా అందుతోంది. చెన్నూర్ బస్తీ దవాఖానా హెడ్‌నర్సు కృష్ణకుమారి ఒక్కరే ఉన్నారు. వైద్యులు చెన్నూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి వెళ్లారని తెలిపారు. బస్తీ దవాఖానాకు రోజు ఓపీ 20 నుంచి 30మంది వస్తున్నారని, కొన్ని పరికరాలు కావాల్సి ఉందని, త్వరలోనే వస్తాయని వైద్యురాలు లక్ష్మీప్రసన్న తెలిపారు. ● చెన్నూర్ మండలం అంగ్రాజ్‌పల్లి పీహెచ్సీ వైద్యుడు ఉన్నత చదువుల నిమిత్తం వెళ్లారు. దండేపల్లి వైద్యుడు డిప్యూటేషన్ విధులు నిర్వర్తిస్తున్నారు. పీహెచ్సీ పరిధిలోని ఎనిమిది సబ్సెంటర్లలో మొదటి ఏఎన్ఎంలు ఎనిమిది మంది ఉండాల్సి ఉండగా.. నలుగురే ఉన్నారు. హెచ్‌ఈవో, సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నలుగురు హెల్త్ అసిస్టెంట్లకు గాను ఒక్కరే ఉన్నారు. ● కోటపల్లిలోని ఆయుర్వేద వైద్యశాల సిబ్బంది లేక ఏడాదిగా మూసి ఉంటోంది. పీహెచ్సీలో ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్లు లేరు. రక్త పరీక్షలు ప్రైవేటుగా చేయించుకుంటున్నారు. ● మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండు మూడు నెలలుగా ఇన్స్‌లిన్ కొరత ఉంది. రోగులు ప్రైవేటు మందుల దుకాణాల్లో కొనుగోలు చేయాల్సి రావడంతో ఆర్థిక భారం తప్పడం లేదు. మందమర్రి, పొన్నారంలో ఒక్కో వైద్యుడి పోస్టు ఖాళీగా ఉన్నాయి. -
వీడని అసంతృప్తి!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంత్రి పదవి ఆశించి భంగపడిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు(పీఎస్సార్) అసంతృప్తి వీడడం లేదు. రెండో విడతలో తనకు కేబినెట్ బెర్త్ ఖాయమని భావించినా పక్కన పెట్టడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయన అనుచరవర్గానికి ఊహించని విధంగా షాక్ తగిలింది. మరోవైపు జిల్లా నుంచే చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామికి మంత్రిగా అవకాశం కల్పించి తనకు ఇవ్వకపోవడంపై గత కొద్ది రోజులుగా అసంతృప్తితోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు గత పదేళ్లుగా ఉమ్మడి జిల్లాలో బలోపేతానికి కృషి చేశానని, తనకు అవకాశం కల్పించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇంద్రవెల్లి సభ నుంచి అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రతోపాటు మంచిర్యాలలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే బహిరంగ సభ వరకు ఎన్నో పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేశారు. ఎన్నికల ముందు ఏఐసీసీ అధ్యక్షుడితో సహా పలువురు అగ్రనేతలు పీఎస్సార్‌కు సముచిత స్థానం ఉంటుందని హామీలు ఇచ్చారు. తీరా ఆయనకు అవకాశం రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఇటీవల గాంధీభవన్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నారు. తనకు అవకాశం కల్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎటువైపో..! గత ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన ‘జై బాపు జై భీమ్ జై సంవిధాన్’ బహిరంగ సభలో తన గొంతు నొక్కొద్దంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ముందే ఆవేదనతో మాట్లాడారు. నిన్న మొన్న వచ్చిన వాళ్లకు అవకాశం ఇచ్చి తనను విస్మరిస్తున్నారని అన్నారు. ఉమ్మడి జిల్లాకు పదవుల్లో అన్యాయం చేస్తే ఏం చేయడానికై నా సిద్ధమేనంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తన అసంతృప్తి ఎటువైపు దారి తీస్తుందోనని రాజకీయంగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచీ విధేయతగా ఉంటున్నారు. అయినా కేబినెట్లో చోటు దక్కకపోవడంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో మంత్రివర్గంలో చోటు కాకుండా ఇతర ఏ పదవీ ఇచ్చినా తీసుకునేందుకు ఇష్టపడడం లేదు. ఎమ్మెల్యేగానే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో అధిష్టానం ఆయనకు అవకాశం ఇస్తుందా..? లేదా..? పీఎస్సార్ వెనక్కి తగ్గి ఉంటారా..? అనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. మంత్రివర్గంలో చోటు దక్కక నిరాశలో పీఎస్సార్ అగ్రనేతలను కలుస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే తనకు అన్యాయం జరిగిందంటూ వేడుకోలు -
వసతిగృహాల్లో సదుపాయాలు కల్పించాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో డీఈవో యాదయ్యతో కలిసి జిల్లా అధికారులు, ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల ప్రిన్సిపాళ్లతో విద్యార్థులకు కల్పించాల్సిన సదుపాయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మహనీయుల మార్గంలో నడవాలి మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజల సంక్షేమం కోసం విశేష కృషి చేసిన మహనీయుల మార్గంలో నడవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఏ.పురుషోత్తం, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దుర్గాప్రసాద్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి రాజేశ్వరి, క్రీడా శాఖ అధికారి హనుమంత్‌రెడ్డి, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించాలి లక్సెట్టిపేట: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేజీబీవీ, జూనియర్ కళాశాల, ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి నూతన భవ నం నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. పాఠశాలల ప్రిన్సిపాల్, వైద్యులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్
కోటపల్లి: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల డిప్యూటీ తహసీల్దార్ నవీన్‌కుమార్ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. భీమారం గ్రామానికి చెందిన గంట నరేశ్ నుంచి డబ్బులు డిమాండ్ చేసి పట్టుబడ్డారు. వివరాలిలా ఉన్నాయి. భీమారానికి చెందిన గంట నరేశ్ మండలంలోని రాజారం శివారులో సర్వే నంబరు 71/13/2లో 20గుంటల భూమిని తన తండ్రి లక్ష్మయ్య పేరిట పట్టా చేయించేందుకు ఈ కేవైసీ కోసం డిప్యూటీ తహసీల్దార్ నవీన్‌కుమార్‌ను సంప్రదించాడు. ఆయన రూ.15వేలు డిమాండ్ చేయగా.. అంత ఇచ్చే స్థోమత లేదని, రూ.10వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి నవీన్‌కుమార్‌కు సమాచారం ఇవ్వగా.. తాత్కాలిక ఉద్యోగి అంజికి ఇవ్వాలని సూచించారు. కార్యాలయం వెనుకాల డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నగదు సీజ్ చేసి కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి పలు ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. అంజి, డిప్యూటీ తహసీల్దార్ నవీన్‌కుమార్‌ను ఏసీబీ డీఎస్పీ మధు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. కేసు నమోదు చేసి కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టుకు తరలిస్తామని పేర్కొన్నారు. 20గుంటల భూమి పట్టా చేసేందుకు డిప్యూటీ తహసీల్దార్ పది రోజులుగా వేధిస్తున్నారని, ప్రతీరోజు ఉదయం సాయంత్రం వరకు ఇక్కడే ఉండడం డ్యూటీగా మారిందని నరేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. -
సెల్ఫోన్లు చోరీ చేసి..పాస్వర్డ్లు ఓపెన్ చేసి
● ఫోన్ పే, గూగుల్ పే నుంచి నగదు తస్కరణ ● పోలీసులకు పట్టుబడ్డ మైనర్ బాలుడు సారంగపూర్: ప్రజల వద్ద నుంచి సెల్ఫోన్లు చోరీ చేసి..పాస్వర్డ్లు ఓపెన్ చేసి గూగుల్ పే, ఫోన్ పే ద్వారా మైనర్ బాలుడు డబ్బులు తస్కరించిన ఘటన మండలంలో చేసుకుంది. స్థానిక పోలీసుస్టేషన్లో నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, ఎస్సై శ్రీకాంత్ ఈమేరకు వివరాలు వెల్లడించారు. సారంగపూర్ మండలం ఆలూరుకు చెందిన దండు రవికిరణ్, నిర్మల్‌లోని బుధవార్‌పేట్‌కు చెందిన రవికుమార్‌ల కిరాణా షాపునకు వెళ్లి వారం క్రితం ఓమైనర్ బాలుడు సరుకులు కొనుగోలు చేస్తున్నట్లు నటించి వారి సెల్ఫోన్లు చోరీ చేశాడు. పాస్వర్డ్ తెరిచి ఫోన్‌పే యాప్ ద్వారా దండు రవికిరణ్ ఫోన్ నుంచి రూ.20 వేలు, రవికుమార్ ఖాతా నుంచి రూ.13 వేలను ఇతర ఖాతాలకు బదిలీ చేసి నగదుగా మార్చుకున్నాడు. ఈ విషయమై సదరు షాపు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై శ్రీకాంత్, రూరల్ సీఐ మున్నూరు కృష్ణలు సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ ప్రారంభించారు. సదరు మైనర్ బాలుడు తస్కరించిన ఫోన్లలో తన ఫొటోలు తీసుకున్నాడు. అయితే సదరు ఫొటోలు బాధితుల గూగుల్ ఫొటోల్లోకి అప్లోడ్ కావడంతో బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు. శుక్రవారం సారంగపూర్ పరిధిలో బాలుడిని అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. అతన్ని వద్ద నుంచి రూ.38వేల నగదు, ఒక వీవో 5జీ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన రూరల్ సీఐ, స్థానిక ఎస్సై, సిబ్బంది ఆకాశ్, వినోద్, ప్రణీత్‌లను ఎస్పీ జానకీ షర్మిల, ఏఎస్పీ రాజేష్ మీనా అభినందించారు. -
మల్లిఖార్జున ఖర్గేను కలిసిన ప్రేమ్‌సాగర్‌రావు
మంచిర్యాలటౌన్: ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కలిశారు. గురువారం ఆయనను హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ఈ నెల 4న గ్రామస్థాయి కాంగ్రెస్ నేతలతో ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు ఖర్గే హాజరు కానుండగా సభ నిర్వహణపై చర్చించారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో పదవిని ఆశించి భంగపడిన నాయకులతో ఖర్గే ప్రత్యేకంగా మాట్లాడగా, ప్రేమ్‌సాగర్‌రావుతోనూ చర్చించినట్లు సమాచారం. -
నీటి వనరులపై శిక్షణ
మంచిర్యాలఅగ్రికల్చర్: 7వ చిన్న తరహా, 2వ నీటి వనరుల గణనపై మండల ప్రణాళిక, గణాంక అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి(సీపీవో) వి.పూర్ణచంద్రరావు తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల ప్రణాళిక, గణాంక అధికారులకు ఏర్పాటు చేసిన నీటి వనరుల గణనపై శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీపీవో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నీటి వనరులను గ్రామాలు, వనరుల వారీగా గణన చేసేందుకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. శిక్షణ పొందిన అధికారులు తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారి, డివిజనల్ ఉప గణాంక అధికారి, కార్యాలయ ఉప గణాంక అధికారి, మండల ప్రణాళిక, గణాంక అధికారులు పాల్గొన్నారు. -
● సెప్టెంబర్ 30 డెడ్‌లైన్ ● పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబరు ప్లేట్ అమర్చుకోవాలి ● 2019కి ముందు కొన్నవాటికి తప్పనిసరి ● ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన రవాణా శాఖ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): నకిలీ నంబరు ప్లేట్లను అరికట్టడం, రహదారి భద్రతపై సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అన్ని రకాల వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబరు ప్లేట్(హెచ్ఎస్ఆర్ఎన్పీ) తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నంబరు ప్లేట్ల చివరన ఉన్న లేజర్ కోడ్‌ను ట్రాక్ చేసి వాహనదారుడి పేరు, వివరాలు, వాహనం ధ్వంసమైనా లేజర్ కోడ్ ద్వారా వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. 2019 ఏప్రిల్ ఒకటి కన్న ముందు కొనుగోలు చేసిన వాహనాలకు ఈ నంబరు ప్లేటు బిగించని పక్షంలో రోడ్లపైకి వచ్చే అవకాశం ఉండదు. తుది గడువు సెప్టెంబర్ 30లోగా అమర్చుకోవాలని రవాణా శాఖ స్పష్టం చేసింది. లేనిపక్షంలో భారీ జరిమానాలు, శిక్ష విధించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నంబరు ప్లేట్లు అమర్చుకునేందుకు వాహనాల తీరు ఆధారంగా ప్రత్యేక రుసుములు ప్రకటించారు. కాలం చెల్లిన వాహనాల కట్టడి కాలపరిమితి ముగిసిన వాహనాలు రోడ్లపై తిరగకుండా రవాణా శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 15ఏళ్ల కాలపరిమితి ముగిసిన వాహనాలను గుర్తించే ప్రక్రియ చేపట్టింది. కాలపరిమితి ముగిసిన వాహనాలు వేర్వేరు నంబరు ప్లేట్లతో రోడ్లపై తిరుగుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అనేక వాహనాలకు సకాలంలో సామర్థ్య పరీక్షలు చేయించడం లేదు. ఇకపై అలాంటి వాటికి అడ్డుకట్ట పడనుంది. జిల్లా వ్యాప్తంగా 2019 మార్చి 31లోగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలు 2,18,246 ఉండగా ఇందులో అన్ని రకాల పాత వాహనాలు అంటే కాల పరిమితి ముగిసినవి మినహా మిగతా వాటికి హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు బిగించుకోవాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. 2019 ఏప్రిల్ తర్వాత వాహనాలకు ఇప్పటికే హైసెక్యూరిటీ నంబరు ప్లేటు నిబంధన అమలవుతోంది. ఇప్పటివరకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ బిగించుకున్న వాహనాలు 3,02,010 ఉన్నాయి. ఇందులో చాలా వాహనాలు సాధారణ నంబర్ ప్లేట్‌తో తిరుగుతున్నాయి. ప్లేట్ బిగించని వాహనాలను అమ్మాలన్నా.. కొనాలన్నా ఇబ్బందులు తప్పేలా లేవు. ఆర్టీఏ అధికారుల తనిఖీల్లో పట్టుబడితే కేసులు నమోదు చేసి జరిమానా వేయడం, వాహనం సీజ్ చేయడం చేస్తారు. మార్పు ఇలా.. పాత వాహనానికి కొత్తగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేటు పొందాలంటే వాహనదారుడే నేరుగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. https://bookmyhsrp.com వెబ్సైట్లో వాహనం నంబరు, వాహన రకం, కంపెనీ, జిల్లా తదితర వివరాలు నమోదు చేయాలి. నంబర్ ప్లేట్ షోరూం వివరాలు వస్తాయి. వెంటనే ఆ షోరూంకు వెళ్లి వాహనానికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ అమర్చుకుని ఫొటో తీసి మరోసారి వెబ్సైట్లో నమోదు చేయాల్సిన బాధ్యత వాహనదారుడిపై ఉంది. ఈ విధానంతో నిరక్షరాస్యులు, స్మార్ట్ఫోన్లు లేని వాహనదారులు అయోమయానికి గురి కానున్నారు. విధిగా అమర్చుకోవాలిపాత వాహనాలకు కొత్తగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు విధిగా అమర్చుకోవాల్సిందే. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు నిర్ణయించిన ఫీజుతో నంబర్ ప్లేట్ తీసుకోవాల్సి ఉంటుంది. రోడ్లపై తిరిగే ప్రతీ వాహనం హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ అమర్చుకోవాలి. తనిఖీలో పట్టుబడితే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తాం. అవసరమైతే బీమా, రిజిస్ట్రేషన్ తదితర సేవలు నిలిపివేసేలా రవాణా శాఖ చర్యలు చేపడుతోంది. – సంతోశ్‌కుమార్, డీటీఓ, మంచిర్యాల -
12నుంచి సకల కళల సంబరాల జాతర
బెల్లంపల్లి: ఈ నెల 12, 13వ తేదీల్లో వరంగల్‌లో సకల కళల సంబరాల జాతర నిర్వహించనున్నట్లు రాష్ట్ర జానపద కళాకారుల సంఘం కార్యదర్శి హన్మాండ్ల మధు తెలిపారు. గురువారం ఆయన బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతర పోస్టర్లను మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కారుకూరి రాంచందర్, కాంగ్రెస్ నాయకులు, కళాకారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో 1,116 మంది కళాకారులతో 30 గంటలపాటు ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం నిర్వహిస్తున్న జాతరను కళాకారులు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు జాడాల శివ, ప్రధాన కార్యదర్శి పీఆర్ ప్రసాద్, జిల్లా నృత్య కళా సమాఖ్య సభ్యులు ఆర్.అర్జున్, రమేష్, గిరి లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం పట్టణ అధ్యక్షుడు జంజర్ల దినేష్‌కుమార్, కళాకారులు అర్చన, రాంచందర్, సకినాల రాజేశ్వరరావు, బాలకృష్ణ, రాములు తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీలను విడుదల చేయాలి
దండేపల్లి: జన్నారం మండలం కోలాంగూడకు చెందిన ఆదివాసీలు ఆత్రం రాజు, అతడి కుమారులు రవికుమార్, సుధాకర్‌లను వెంటనే విడుదల చేయాలని ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షుడు పెంద్రం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం దండేపల్లి మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీల గుడిసెలు, కుల దైవం భీమన్న దేవుని గుడిపై అటవీ అధికారులు దాడి చేసి ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆత్రం రాజు, అతడి ఇద్దరు కుమారులను అకారణంగా అరెస్టు చేశారని ఆరోపించారు. విడుదల చేయని పక్షంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆదివాసీ సేన జిల్లా కోశాధికారి మర్సుకొల సంతోష్, రాజ్‌గోండ్ సేవ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పెంద్రం నరేందర్, నాయకులు టేకం భీంరావ్, అడై తిరుపతి, అడై భగవంత్‌రావ్ పాల్గొన్నారు. అటవీశాఖ అధికారుల దిష్టిబొమ్మ దహనం పాతమంచిర్యాల: అటవీ శాఖ అధికారుల తీరును నిరసిస్తూ జిల్లా కేంద్రంలో గురువారం సీపీఎం ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆదివాసీలపై అక్రమంగా కేసులు బనాయించి హింసకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జన్నారం మండలం తపాలాపూర్‌లో ఆది వాసీల దైవం భీమన్నదేవుని గుడిని అటవీ అధికా రులు ధ్వంసం చేయడం అన్యాయమని అన్నారు. దీనిపై నిలదీసిన ఆత్రం రాజు, అతడి ఇద్దరు కుమారులు రవికుమార్, సుధాకర్‌లపై అక్రమ కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, జిల్లా కమిటీ సభ్యులు దుంపల రంజిత్, దూలం శ్రీనివాస్, ప్రేంకుమార్, మిడివెళ్లి రాజు, అరిగెల మహేష్, మోహన్ పాల్గొన్నారు. -
‘మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి’
మంచిర్యాలటౌన్: ప్రధాని నరేంద్ర మోదీ 11ఏళ్ల పాలనతో దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో గురువారం సాయంత్రం ఆయన పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌తో కలిసి పలు దుకాణాల్లో ప్రధాని చేసిన అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధికి ఎంతగానో సహకరించాయని తెలిపారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. డీపీఆర్‌ను సిద్ధం చేసి కలెక్టర్ ద్వారా సంబంధిత మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపిస్తే నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. -
విద్యారంగం బలోపేతానికి చర్యలు
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ● పాఠశాలలు, ఇందిరమ్మ ఇళ్ల సందర్శనజైపూర్: విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండలంలోని పౌనూర్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను గురువారం ఆయన సందర్శించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యాబోధన, మధ్యాహ్న భోజన సదుపాయాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని, బడియట పిల్లలు, మానివేసిన పిల్లలను తిరిగి చేర్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో శారీరక, మానసిక ఎదుగుదల లోపం ఉన్న పిల్లల కు ఆహారం, అవసరమైన మందులు అందించాలని పేర్కొన్నారు. అనంతరం శివ్వారం ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులు, వంటశాల పరిసరాలు పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పరిశీలించి వేగవంతం పూర్తి చేయాలని సూచించారు. డీసీఎంఎస్ ఫార్మర్ సర్వీస్ సెంటర్లో ఎరువులు, విత్తనాల నిల్వలు, రిజిష్టర్లు పరిశీలించారు. గంగిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, జైపూర్‌లోని తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను సందర్శించారు. తహసీల్దార్ కార్యాలయంలో రేషన్‌కార్డుల దరఖాస్తులను పరిశీలించి అర్హులకు కార్డులు జారీ చేయాలి, భూభారతి రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఆరోగ్య శిబిరం.. సత్ఫలితం
జిల్లాలోని వైద్య శిబిరాల్లో కేసుల వివరాలువైద్య శిబిరాలు 21 టీబీ పరీక్షలు చేసింది 2,121 టీబీ లక్షణాలు ఉన్నది 1,347 హెచ్ఐవీ పరీక్షలు 2008 పాజిటివ్‌గా నిర్ధారణ 5 హైపటైటిస్ బీ పరీక్షలు 129 మధుమేహావ్యాధి నిర్ధారణ 457 రక్తపోటు గుర్తింపు 640మంచిర్యాలటౌన్: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలు సత్ఫలితా లు ఇస్తున్నాయి. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా దేశంలో 2030నాటికి క్షయను సంపూర్ణంగా నివారించాలన్న ఆశయంతో కేంద్ర ప్రభుత్వం వంద రోజుల సమగ్ర ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తోంది. క్షయవ్యాధి నిర్ధారణ కోసం జిల్లా వ్యాప్తంగా ప్రతీ గ్రామం, పట్టణాల్లోని వార్డుల్లో ప్రతీ రోజు ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. స్థానికంగా ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్షయ, హెచ్ఐవీ, హెపటైటిస్ బీ, మధుమేహం, బీపీ వంటి పరీక్షలు చేస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే వేళ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాల్లో జ్వరం, జలుబు, దగ్గు వంటి వ్యాధులకూ పరీక్షలు చేస్తున్నారు. ఫలితంగా సీజనల్ వ్యాధుల ప్రభావం జిల్లాలో కొంతమేర తగ్గింది. సమగ్ర ఆరోగ్య శిబిరాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి.. పలు రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. క్షయవ్యాధిపై అనుమానం ఉన్నవారిని ఎక్స్‌రే కోసం 102 వాహనాల్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఇంటికి తరలిస్తున్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన ఆరోగ్య శిబిరాలతోపాటు వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో నీటిని వేడి చేసి చల్లార్చి తాగాలని, వేడి ఆహారాన్ని తీసుకోవాలని, బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని, ఈగలు, దోమలు వాలకుండా చూసుకోవాలని వివరిస్తున్నారు. దోమల వృద్ధికి కారణమయ్యే నీటి నిల్వ, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, ప్రతీ శుక్రవారం డ్రైడే పాటించడం, ఇంట్లో ఉన్న నిల్వ నీటిని ఎప్పటికప్పుడు తొలగించడం చేయాలని సూచిస్తున్నారు. డెంగీ, మలేరియా, డయేరియా వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు వివరిస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు దోహదపడుతున్నాయి. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా వైద్య శిబిరాలు టీబీ, హెచ్ఐవీ, హైపటైటిస్ బీ, బీపీ, మధుమేహం పరీక్షలు జ్వరం, ఇతర వ్యాధులకు వైద్య పరీక్షలుపరీక్షలు చేస్తున్నాంజిల్లాలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా అన్ని వార్డులు, గ్రా మాల్లో సమగ్ర ఆరో గ్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు చేయడంతోపాటు అవసరమైన వారికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పరీక్షలు చేసి మందులు ఇస్తున్నాం. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా సీజనల్ వ్యాధులను కొంతవరకు అరికట్టే అవకాశం ఉంది. – డాక్టర్ హరీశ్‌రాజ్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి -
‘ప్రాణహిత’లో పెరుగుతున్న నీటిమట్టం
వేమనపల్లి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నదిలో వరద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. వేమనపల్లి పుష్కరఘాట్ వద్ద రెండు రోజులుగా నది రెండు పాయలుగా ప్రవహిస్తోంది. మహారాష్ట్ర తీరం వైపు ఎక్కువగా, తెలంగాణ(వేమనపల్లి) తీరం వైపు తక్కువగా వరద ప్రవాహం ఉంది. దీంతో నది చూడముచ్చటగా రెండు పాయలతో నిండుకుండలా పారుతోంది. ప్రయాణికులకు రెండు పడవల ప్రయాణం తప్పడం లేదు. వేమనపల్లి వైపు నుంచి నాటుపడవలో కొద్ది దూరం ప్రయాణించి నది మధ్యలో ఇసుక తిన్నెలపై దిగుతున్నారు. అక్కడ నుంచి ఇంజన్ పడవలో నది దాటి అవతలి వైపు ఉన్న మహారాష్ట్ర తీరం వైపు వెళ్తున్నారు ప్రమాదకరమే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో అధిక చార్జీలు చెల్లిస్తూ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. -
నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలి
చెన్నూర్/భీమారం: వినియోగదారులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఉత్తమ్ జాడే అన్నారు. గురువారం ఆయన చెన్నూర్ సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. వర్షాకాలంలో విద్యుత్ సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. చెట్ల కొమ్మలు, లూజ్లైన్లను సరి చేయాలని సూచించారు. విద్యుత్ కనెక్షన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. భీమారం మండలం నర్సింగాపూర్‌లో నిర్మించనున్న 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ స్థలాన్ని పరిశీలించారు. భీమారం నుంచి నర్సింగాపూర్ వరకు అటవీప్రాంతం గుండా విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా అందుకు అటవీశాఖ అభ్యంతరం తెలిపింది. భీమారం–నెన్నెల రహదారి గుండా వెళ్లే ఈ లైను రోడ్డుకి ఎంత దూరం నుంచి ఏర్పాటు చేయాల్సి ఉంటుందనేది పరిశీలించారు. అటవీశాఖ అనుమతి పొందేందుకు కలెక్టర్‌ను కలిసి వివరించన్నుట్లు తెలిపారు. కలెక్టర్ నుంచి అనుమతి రాగానే విద్యుత్ లైను వేసే పనులు చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో డీఈ రాజన్న, ఏడీఈ బాలకృష్ణ, ఏఈలు ఏ.శ్రీనివాస్, శంకర్, ఏఏవో శ్రీనివాస్ పాల్గొన్నారు. నేడు దొడ్డి కొమురయ్య వర్ధంతి మంచిర్యాలటౌన్: ఈ నెల 4న కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం 9:30 గంటలకు దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎ.పురుషోత్తం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
బెల్లం, పటిక స్వాధీనం
కాగజ్‌నగర్‌టౌన్/చింతలమానెపల్లి: కాగజ్‌నగర్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ పరిధిలోని చింతలమానెపల్లి మండలంలో గురువారం నాటుసారాకు ఉపయోగించే బెల్లం, పటిక స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ రవికుమార్ తెలిపారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ రఘురామ్, జిల్లా అధికారి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించి 10 లీటర్ల నాటుసారా, 1800 కిలోల పటిక, క్వింటాలు బెల్లం, నాటుసారా తయారీ పదార్థాలను సరఫరా చేసే స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి రణవెల్లి గ్రామానికి చెందిన జటోత్ నారిబాయి, లంబడిహెట్టకి చెందిన అజ్మెర శ్యామ్లాల్పై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పట్టుబడిన ముడి సరుకు విలువ సుమారు రూ. లక్ష వరకు ఉంటుందన్నారు. దాడుల్లో ఎస్సైలు లోబానంద్, సురేష్, సిబ్బంది మల్లేశ్, సతీష్, తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్‌కు గాయాలు
రెబ్బెన: మండ ల కేంద్రంలోని జర్నలిస్టు కాలనీవద్ద జాతీయ రహదారిపై గురువారం డివైడర్‌ను ఢీకొట్టి ఇసుక ట్రాక్టర్ బోల్తా పడింది. రెబ్బెన వైపు నుంచి పులికుంట వైపు ఇసుకలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి జాతీయ రహదారి డివైడర్‌ను ఢీకొట్టడంతో బోల్తాపడింది. పులికుంటకు చెందిన డ్రైవర్ దుర్గం మారుతికి తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు. ఎస్సై చంద్రశేఖర్‌ను వివరణ కోరగా ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. అరగంటయినా రాని అంబులెన్స్ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి చేర్చేందుకు నే షనల్ హైవే అధికారులు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుతారు. గురువారం జరి గిన ఘటనపై స్థానికులు అంబులెన్స్‌కోసం నేషనల్ హైవే అధికారులకు ఫోన్‌చేస్తే అరగంట దాటినా అంబులెన్స్ రాలేదు. డ్రైవర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో 108కు సమాచారం అందించగా వాహనంలో మంచిర్యాలకు తరలించారు. డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించాక నేషనల్ హైవే అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకుంది. అయితే ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోవాల్సిన నేషనల్ హైవే అంబులెన్సు తీవ్ర జాప్యం చేస్తూ ఆలస్యంగా రావడంపై వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. యాప్ ఓపెన్‌తో ఖాతాలో రూ.50 వేలు మాయంజన్నారం: స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో సెల్‌కు వచ్చిన ఒక యాప్ మెసేజ్‌ను ఓపెన్ చేసిన వ్యక్తి ఖాతాలోంచి రూ.50 వేలు మాయమయ్యాయి. బాధితుడు తెలిపిన వివరాల మేరకు జన్నారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన దాసరి చంద్రమోహన్ ఉపాధి నిమిత్తం కొంతకాలంగా కరీంనగర్లో నివాసం ఉంటున్నాడు. గురువారం తన ఫోన్‌కు ఎస్బీఐ రివార్డు పేరుతో ఒక వాట్సప్ మెసేజ్ వచ్చింది. దానిని ఓపెన్ చేయడంతో తన ఖాతాలో నుంచి రూ.50 వేలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చిందని బాధితుడు వాపోయాడు. సైబర్ నేరగాళ్ల పనే అయిఉంటుందని కరీంనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. -
కళలు సంస్కృతికి ప్రతిబింబాలు
నిర్మల్‌ఖిల్లా: కళలు సాంస్కృతిక వైభవాన్ని చాటే ప్రతిబింబాలని, కళాకారులు సాంస్కృతిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ముందుకు సాగాలని చలనచిత్ర, టీవీ కళాకారుల అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆడిచర్ల రాజు, జన్ను అనిల్‌కుమార్ అన్నారు. జిల్లా నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో చలనచిత్ర టీవీ కళాకారులు ప్రత్యేక అభిరుచితో తమ ప్రతిభను చాటుతూ రాణిస్తున్నారన్నారు. వీరి సంక్షేమం కోసం సంఘం తరఫున తగిన కృషిచేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా అడిచర్ల రాజు, ప్రధాన కార్యదర్శిగా జన్ను అనిల్‌కుమార్, కోశాధికారిగా సామెర్ల రాజన్న, ఉపాధ్యక్షులుగా చెట్పల్లి కమలాకర్, నరసయ్యచారి, వెన్నెల రాజేందర్, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ కత్తి కిరణ్, ప్రచార కార్యదర్శిగా గర్దాసు నరేందర్, సహాయ కార్యదర్శిగా కృష్ణవర్మ, కార్యనిర్వాహక కార్యదర్శిగా రాం రమేశ్, ఎర్ర రవీందర్, సలహాదారులుగా టీఎన్జీవో ప్రభాకర్, పురుషోత్తం, మోహన్‌రావు ఎన్నికయ్యారు. -
చదువులు సాగేదెలా..?
● కేజీబీవీలకు ఇంటర్ పుస్తకాల సరఫరాలో జాప్యం ● విద్యార్థినులకు తప్పని ఎదురుచూపులు మంచిర్యాలఅర్బన్: గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన బాలికలకు విద్యనందిస్తున్న కేజీబీవీల్లో ఇంటర్ విద్యార్థినులకు పాఠ్యపుస్తకాల సరఫరాలో జాప్యం జరుగుతోంది. విద్యాసంవత్స రం ప్రారంభమై నెలరోజులు దాటినా పుస్తకాలకో సం విద్యార్థినులకు ఎదురుచూపులు తప్పడంలేదు. ఆరు నుంచి పదోతరగతి వరకు చదివే విద్యార్థినులకు మాత్రమే పుస్తకాలు రాగా ఇంటర్ విద్యార్థుల కు రాకపోవడంతో అవస్థలు తప్పడంలేదు. విద్యార్థులకు చదువుకునేందుకు, అధ్యాపకులు బోధించే పాఠాలు అర్థమయ్యేందుకు పాఠ్యపుస్తకా లు ఎంతో అవసరం. పాఠ్యపుస్తకాలు లేక ఏపాఠం విన్నారో..ఎలా చదవాలో..అర్థంకాని పరిస్థితి నెలకొంది. 15 కళాశాలల్లో ఇంటర్ చదువులు మంచిర్యాల జిల్లాలోని 18 కేజీబీవీల్లో 6 నుంచి ఇంటర్ వరకు 4,586 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో 15 చోట్ల ఇంటర్మీడియట్ వరకు తరగతులు కొనసాగుతున్నాయి. మంచిర్యాల, లక్సెట్టిపేట్, జైపూర్, బెల్లంపల్లి, చెన్నూర్‌లో బైపీసీ, ఎంపీసీ కోర్సులు ఉన్నాయి. జన్నారం, తాండూర్, మందమర్రి, నస్పూర్, నెన్నెలలో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులు ఉన్నాయి. ప్రతీ కోర్సులో 40 మంది చొప్పున విద్యార్థులు చదువుతున్నారు. హాజీపూర్‌లో బైపీసీ, ఎంఎల్టీ, కోటపల్లిలో బైపీసీ, కన్నెపల్లిలో బైపీసీ, దండేపల్లిలో ఎంఎల్టీ, కమర్షియల్ గార్మెంట్స్, వేమనపల్లిలో ఎంఎల్టీ కోర్సులు ఉన్నాయి. ఆయా కోర్సుల్లో చేరిన వారికి ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. కానీ ఈ విద్యాసంవత్సరం ఇప్పటి వరకు ఒక్క పుస్తకం కూడా రాలేదు. దీంతో కొన్నిచోట్ల పాత పుస్తకాలనే సర్దుబాటు చేస్తున్నారు. కొత్తగా ఇంటర్ ప్రవేశపెట్టిన కేజీబీవీల్లో పుస్తకాలు లేక బోధన ముందుకు ఎలా సాగుతుందో అధికారులకే తెలియాలి. నెలన్నర దాటిపోతుండటంతో విద్యార్థుల చదువులపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికై నా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే పాఠ్యపుస్తకాలు అందించేలా చర్యలు చేపట్టాలని పలువురు విద్యార్థినులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.రాగానే ఇస్తాం త్వరలోనే పుస్తకాలు వచ్చే అవకాశాలున్నాయి. రాగానే విద్యార్థినులకు పంపిణీ చేస్తాం. జిల్లాకు అవసరమైన ఇండెంట్ గతంలోనే పంపించాం. హైదరాబాద్ నుంచి నేరుగా ఆయా కస్తూర్బాలకు పుస్తకాలు సరఫరా అవుతాయి. విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగకుండా పాత పుస్తకాలు సర్దుబాటు చేశాం. – యశోధర, జీసీడీవో, మంచిర్యాల -
ట్రిపుల్‌ఐటీలో పారిశుద్ధ్య కార్మికుల విధుల బహిష్కరణ
● వర్సిటీని సందర్శించిన ఏసీఎల్ ● పెండింగ్ వేతనాలు ఇప్పించిన అధికారులు భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం విఽ దులు బహిష్కరించి ట్రిపుల్ఐటీ ప్రధాన గేటు ఎదుట ఆందోళన నిర్వహించారు. కార్మికుల వేతనాల్లో కోతలు, భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, కోట్ల నిధులు పక్కదారి పట్టాయని ఆరోపణలు ఉన్నాయి. గడువు ముగిసినా ప్రైవేటు సంస్థకే పనులు పొడగించారని ప్రధాన ఆరోపణ ఉంది. 2021లో ప్రైవేటు సంస్థ ఏడాది గడువుతో పారిశుద్ధ్య నిర్వహణ దక్కించుకుంది. 2022లో కాంట్రాక్టు గడువు ముగిసినా అధికారులు అదే సంస్థకు పొడగిస్తున్నారు. దీనిపై అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఏసీఎల్ చేరుకుని... కార్మిక శాఖ సహాయ కమిషనర్ ముత్యంరెడ్డి బాసర క్యాంపస్‌కు చేరుకుని విధులు బహిష్కరించి ఆందోళన కొనసాగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కలిశారు. సమస్యలు అడిగితెలుసుకున్నారు. తమకు ఏప్రిల్ నుంచి వేతనాలు చెల్లించడంలేదని, ఇతర సమస్యలు ఉన్నాయని వివరించారు. దీంతో సహాయ కమిషనర్ ట్రిపుల్ఐటీ ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్తో పాటు ఇతర అధికారులతో చర్చించి మే నెల వరకు కార్మికుల వేతనాలను ఇప్పించారు. జూన్ వేతనాలను ఈనెల చెల్లించేలా చూడాలని సంబంధిత సంస్థను ఆదేశించారు. వేతనాలు అందడంతో కార్మికులు విధుల్లో చేరారు. -
‘ది స్టూడెంట్ మ్యాగజైన్’ ఆవిష్కరణ
బాసర: బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ) విద్యార్థుల మాసపత్రిక ‘ది స్టూడెంట్ మాగజైన్’ను గురువారం ఆవిష్కరించారు. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, వోఎస్డీ డాక్టర్ ఈ.మురళీధర్, డాక్టర్ పి.చంద్రశేఖరరావు, డాక్టర్ ఎస్.విఠల్, డాక్టర్ టి.రాకేశ్‌రెడ్డి, నాగరాజు తదితరులు సంచికను విడుదల చేశారు. ఈ మ్యాగజైన్లో యూనివర్సిటీ క్యాంపస్‌లో ఏప్రిల్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలు, విద్య, సాంస్కృతిక, క్రీడారంగాల్లో విద్యార్థుల సాధనలను పొందుపర్చారు. పత్రికలో విద్యార్థుల కథనాలు, సృజనాత్మక రచనలు, విజయాలు, వినూత్న ఆవిష్కరణలు, సామాజిక సేవా కార్యక్రమాలు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతినెలా విడుదలయ్యే ఈ పత్రిక, విద్యార్థులకు మాత్రమే కాకుండా తల్లిదండ్రులు, సామాజికవర్గాలకు విద్య, పర్యావరణంపై అవగాహన కల్పించనున్నారు. విద్యార్థుల ఎడిటోరియల్ బృందం, డాక్టర్ టి.రాకేశ్‌రెడ్డి మార్గదర్శనంలో ఈ పత్రికను రూపొందించింది. -
దొంగను పట్టించిన బైక్ నంబర్
కుంటాల: మహిళ మెడలో నుంచి గొలుసు చోరీకి యత్నించిన దొంగను బైక్ నంబర్ ఆధారంగా పట్టుకున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని అందకూర్ గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు గత నెల 30న తమ కుమారుడితో కలిసి బైక్‌పై కుభీర్‌లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో కల్లూరు బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వ్యక్తి మహిళ మెడలో నుంచి గొలుసు చోరీకి యత్నించాడు. వెనుక నుంచి వస్తున్న అందకూర్ గ్రామానికి చెందిన రవి గుర్తు తెలియని వ్యక్తి వాహనాన్ని వెంబడించి నంబర్ నోట్ చేసుకున్నాడు. బైక్ నంబర్ ఆధారంగా నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ గ్రామానికి చెందిన సాయికిరణ్‌గా గుర్తించారు. గురువారం నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
రూ.63 వేల విలువైన దేశీదారు ధ్వంసం
రెబ్బెన: పోలీసుల తనిఖీలో పట్టుబడిన రూ.63వేల విలువైన దేశీదారు బాటిళ్లను గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఎకై ్సజ్, పోలీసు సిబ్బంది ధ్వంసం చేశారు. గత డిసెంబర్ 31న రాత్రి కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద రెబ్బెన పోలీసులు తనిఖీ చేస్తుండగా మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న 18 కాటన్ల దేశీదారు బాటిళ్లు లభ్యమయ్యాయి. పట్టుబడిన మద్యం స్థానిక పోలీస్ స్టేషన్లో భద్రపర్చగా గురువారం ఎకై ్సజ్, స్థానిక పోలీస్ సిబ్బంది బాటిళ్లను జేసీబీతో ధ్వంసం చేశారు. నాటుసారా పట్టివేత మండల కేంద్రంలోని ప్రగతినగర్‌కు చెందిన లావుడ్య రమేశ్ వద్ద 3 లీటర్ల నాటుసారాను పట్టుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎకై ్సజ్ ఇన్చార్జి సీఐ రమేశ్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మణ్, కానిస్టేబుళ్లు కమలాకర్, మమత, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన పోలీస్ డ్యూటీ మీట్
మంచిర్యాలక్రైం: కాళేశ్వరం జోన్‌స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ బుధవారం రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ప్రారంభమైంది. నైపుణ్యం, సామర్థ్యం, ప్రతిభ గుర్తించడానికి పోలీస్ డ్యూటీ మీట్ ఏర్పాటు చేశారు. రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాళేశ్వరంజోన్లోని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జోన్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు పోటీలు నిర్వహించారు. గురువారం కూడా పోటీలు జరుగుతాయి. కార్యక్రమంలో అదనపు డీసీపీ(అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్, గోదావరిఖని, ట్రాఫిక్, ఏఆర్ ఏసీపీలు మల్లారెడ్డి, రమేశ్, శ్రీనివాస్ ప్రతాప్, సీఐలు బాబురావు, సతీశ్, చంద్రశేఖర్‌గౌడ్, ఆర్ఐలు దామోదర్, వామనమూర్తి, మల్లేశం, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మావోయిస్టులు లొంగిపోవాలని పోస్టర్లు
వేమనపల్లి/భీమిని: సిద్ధాంతాల కోసం అడవి బాట పట్టిన మావోయిస్టులు లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజాఫ్రంట్ తెలంగాణ పేరిట వేమనపల్లి, కన్నెపల్లి మండలాల్లో బుధవారం పోస్టర్లు వెలిశాయి. వేమనపల్లి మండలం ప్రాణహిత సరిహద్దు గ్రామాలైన కళ్లంపల్లి, ముక్కిడిగూడెం, జాజులపేట, సుంపుటం గ్రామాల సమీప కల్వర్టులు, మిషన్ భగీరథ వాటర్‌ట్యాంకులు, సూచిక బోర్డులకు, కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయం, గ్రామీణ బ్యాంక్ ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అతికించారు. మావోయిస్టు అగ్ర నాయకులారా మీరు నమ్మిన కాలం చెల్లిన సిద్ధాంతాలు సామాన్యుడికి ఆశాకిరణాలు ఎక్కడయ్యాయి, మీరు నమ్మిన ఉద్యమబాట ప్రజాదరణ లేక మోడుబారిన బీడు భూమి అయ్యిందని, అడవిని వీడి ప్రజల్లోకి రావాలని పోస్టర్లలో పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. వేమనపల్లి మండలంలోని గ్రామాల్లో వెలిసిన పోస్టర్లపై ఎస్సై శ్యాంపటేల్ విచారణ చేపట్టారు. -
హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలి
పాతమంచిర్యాల: ముదిరాజ్‌లు హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ హాల్లో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 60లక్షలకు పైగా ఉన్న ముదిరాజ్‌లకు రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో అన్యాయం జరుగుతోందని తెలిపారు. ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏకు మార్పు చేసే వరకు ఉద్యమిస్తూనే ఉంటామని అన్నారు. మత్స్య సంపదపై ఆధారపడి జీవించే వారికి ప్రభుత్వ రుణాలు, వస్తు సామగ్రి అందడం లేదన్నారు. ఈ సమావేశంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బల్ల సత్తయ్య, రాష్ట్ర కార్యదర్శులు టి.శ్రీకాంత్, కంకణాల సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సాధనబోయిన కృష్ణ, పట్టణ అధ్యక్షుడు భూతపల్లి రాజేశం, యూత్ అధ్యక్షుడు గరికె సుమన్ పాల్గొన్నారు.