ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు ఆత్మహత్య
నేరడిగొండ: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ కౌలు రై తు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కు ప్టి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తోటసంటి రాజేశ్వర్(42) అనే కౌలు రైతు కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. మూడేళ్ల క్రితం దుబాయ్ వెళ్లి వచ్చాడు. ఆరెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది అధిక వర్షాలతో పంట దిగుబడి త గ్గింది. కుటుంబ అవసరాలతో పాటు సాగుకు దాదాపు రూ.5లక్షల వరకు అప్పు చేశాడు. ఎలా తీర్చాలో అని తరచూ మదనపడేవాడు. మనస్తాపానికి గురైన ఆయన శనివారం రాత్రి తన ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని గమనించిన భార్య లోనికి వెళ్లి చూడగా భర్త వేలాడుతూ కనిపించాడు. వెంటనే 108 కు సమాచారం అందించగా, అక్కడి చేరుకున్న సిబ్బంది పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం ని మిత్తం బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


