రెగ్యులర్ వార్డెన్లను నియమించాలి
మంచిర్యాలఅర్బన్: జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో రెగ్యులర్ వార్డెన్లు, హెచ్‌ఎంలను నియమించాలని కోరుతూ యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటేషన్‌ల విధానం రద్దు చేసి రెగ్యులర్ వార్డెన్లను నియమించాలని, విద్యార్థుల భద్రత కోసం పర్యవేక్షణ వ్యవస్థ అమలు చేయాలని, భోజన నాణ్యతను మెరుగు పరచి, మోనూ కఠినంగా అమలు చేయాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది నియామకాలు చేపట్టాలని, సీసీ కెమెరాలు, రాత్రి వాచ్‌మెన్‌లను నియమించాలని కోరారు.


