నాగోబా జాతర నిర్వహణపై నేడు సమావేశం
ఇంద్రవెల్లి: జనవరి 18న మెస్రం వంశీయుల మహాపూజతో ప్రా రంభంకానున్న నాగోబా జాతర నిర్వహణపై ‘జాతర సమీపిస్తున్నా...జాప్యమే’ శీర్షికన సాక్షిలో సోమవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జాతర నిర్వహణపై అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ ఉత్తర్వులు జారీ చేశారని దేవాదాయ శాఖ ఈవో ముక్త రవి తెలిపారు. మంగళవారం ఉదయం నాగోబా దర్బార్ హాల్‌లో ఆయా ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్‌తో పాటు పీవో హాజరుకానున్నట్లు తెలిపారు. ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు, మెస్రం వంశీయులు సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు.


