జాతరకు రెండు అంబులెన్స్‌లు కేటాయింపు
ఇంద్రవెల్లి: నాగోబా జాతరకు రెండు అంబులెన్స్‌లు కేటాయించనున్నట్లు 108 ప్రోగ్రాం మేనేజర్ సమ్రాట్, డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 108 ఫైలెట్లు, ఈఎంటీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు వైద్యసేవలు అందించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో 108 ఫైలెట్‌లు విజయ్, బాపురావ్, నాందేవ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


