డైరెక్టర్‌కు టీబీజీకేఎస్ వినతి
శ్రీరాంపూర్: సింగరేణి డైరెక్టర్(పా) గౌతం పొట్రుకు టీబీజీకేఎస్ నేతలు వినతిప్రతం అందజేశారు. శనివారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి డైరెక్టర్‌ను కలిసి మెడికల్ బోర్డు తీరును ప్రశ్నించారు. నవంబర్‌లో జరిగిన మెడికల్ బోర్డులో అర్హులైన కార్మికులను మెడికల్ అన్‌ఫిట్ చేయకుండా ఫిట్ ఇవ్వడాన్ని ఆయన దృిష్టికి తీసుకెళ్లారు. బోర్డు తీరుపై నిరసన తెలిపారు. జబ్బు పడి, క్యాన్సర్‌తో బాధపడుతూ, గుండెకు స్టంట్ వేసుకుని కూడా మెడికల్ అన్‌ఫిట్ కాని 13 మంది కార్మికులను వెంట తీసుకునివెళ్లి డైరెక్టర్‌కు వారి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. జబ్బుతో ఉన్న వారిని కూడా ఫిట్ చేసి అన్యాయం చేశారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు. వీరందరినీ తిరిగి మెడికల్ బోర్డుకు పిలిచి అన్‌ఫిట్ చేయాలని కోరారు. వారి వెంట యూనియన్ నేతలున్నారు.


