రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు ప్రారంభం
మందమర్రిరూరల్: మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో మైదానంలో రాష్ట్రస్థాయి బాలికల అండర్–19 సాఫ్ట్‌బాల్ పోటీలు, రాష్ట్ర స్థాయి టీం మెంబర్స్ సెలక్షన్స్ శనివారం ప్రారంభమయ్యాయి. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి, డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రఘునాథరెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి బాబురావు, డీఐఈవో అంజయ్యతో హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల క్రీడలపై ఎక్కువ శ్రద్ధ పెట్టిందని తెలిపారు. క్రీడల్లో సత్తాచాటిన విద్యార్థులకు భవిష్యత్‌లో ఉన్నత చదువులతో పాటు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. పోటీలకు సుమారు 160 మంది క్రీడాకారులు, 20మంది కోచ్‌లు హాజరయ్యారు. నిజామాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్, ఆదిలాబాద్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. అబ్జర్వర్ గంగాధర్, మోడల్ స్కూల్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ పెద్దన్న, రజిని, మంచిర్యాల జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి యాకూబ్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


