బ్యాడ్మింటన్ నేషనల్ జట్టు మేనేజర్‌గా సుధాకర్
మంచిర్యాలటౌన్: ఈ నెల 24నుంచి 28వరకు విజయవాడలో నిర్వహించనున్న సీనియర్ నేషనల్స్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తె లంగాణ రాష్ట్ర జట్టు మేనేజ ర్‌గా జిల్లా బ్యాడ్మింటన్ అ సోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్‌ను అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జనరల్ సె క్రటరీ పుల్లెల గోపీచంద్ నియమించారు. రాష్ట్ర జట్టు క్రీడాకారులు సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో పాల్గొననున్నట్లు సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా సుధాకర్‌ను జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గాజుల ముఖేశ్‌గౌడ్, ఉపాధ్యక్షుడు భాస్కర్ల వాసు, బండ మీనారెడ్డి, ట్రెజరర్ సత్యపాల్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీ రమేశ్‌రెడ్డి అభినందించారు.


