‘ఫుల్‌’ జోష్‌ | - | Sakshi
Sakshi News home page

‘ఫుల్‌’ జోష్‌

Jan 2 2026 11:31 AM | Updated on Jan 2 2026 11:31 AM

‘ఫుల్‌’ జోష్‌

‘ఫుల్‌’ జోష్‌

నూతన సంవత్సరం వేడుకల ఖర్చు రూ.40కోట్లు..!

మూడు రోజుల్లో రూ.20.01 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు

దసరాను మరిపించిన మద్యం, మాంసం విక్రయాలు

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌)/మంచిర్యాలక్రైం: జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. 2025కు వీడ్కోలు.. 2026కు స్వాగతం పలుకుతూ సంబరాలు సాగాయి. అందుకు భారీగానే ఖర్చు చేశారు. డిసెంబర్‌ 29, 30, 31వ తేదీల్లో రూ.21.01 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. మంచిర్యాల నగరంతోపాటు కోల్‌బెల్ట్‌ పరిధిలోని మందమర్రి, సీసీసీ, శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి, తాండూర్‌ తదితర ప్రాంతాల్లో కొత్త సంవత్సర వేడుకల్లో రూ.40 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దసరా పండుగ స్థాయిలో వేడుకలు జరుపుకోవడంతో వ్యాపారాలు జోరుగా సాగాయి. గుడిపేట లిక్కర్‌ గోదాం పరిధిలో 135 మద్యం దుకాణాలు, 28 బార్లు ఉన్నాయి. నిత్యం వీటికి ఇక్కడి నుంచే మద్యం నిల్వలు సరఫరా అవుతాయి. డిసెంబర్‌ 29, 30, 31వ తేదీల్లో మొత్తంగా 18,635 లిక్కర్‌ కేసులు, 15,153 బీర్‌ కేసుల విక్రయాలు జరిగాయి. వీటి విలువ రూ.21.01 కోట్లు ఉంటుంది. నూతన సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని బార్లు రాత్రి ఒంటి గంట వరకు, మద్యం దుకాణాలు రాత్రి 12గంటల వరకు తెరిచి ఉంచడానికి అనుమతి ఇవ్వడంతో పెద్దయెత్తున మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఈ మూడు రోజుల్లో రూ.11.26కోట్ల అమ్మకాలు జరుగగా.. ఈ ఏడాది దాదాపుగా రూ.10 కోట్ల అమ్మకాలు పెరిగాయి. గత దసరాకు మూడు రోజుల్లో రూ.26.38 కోట్ల విక్రయాలు జరిగితే నూతన వేడుకలకు మూడు రోజుల్లో రూ.21.01 కోట్ల వ్యాపారం జరగడం చూస్తే దసరాకు పోటీగా సాగినట్లు తెలుస్తోంది.

మాంసం అమ్మకాలు

చికెన్‌, మటన్‌, చేపల అమ్మకాలూ ఈ ఏడాది పెద్దయెత్తున జరిగాయి. మంచిర్యాలలో 200కు పైగా చికెన్‌, 100కు పైగా మటన్‌ దుకాణాలు ఉండగా జిల్లాలో అనధికారికంగా వేలాది సంఖ్యలో ఉన్న మటన్‌, చికెన్‌ సెంటర్లలో భారీగా వ్యాపారం జరిగింది. కిలో చికెన్‌ రూ.200, స్కిన్‌లెస్‌ రూ.220, మటన్‌ కిలో రూ.700 నుంచి రూ.1,000 పలుకగా.. ఒక్కో మేక, గొర్రెపోతులకు రూ.7 వేల నుంచి రూ.16 వేల వరకు ధరలు పలికాయి. మొత్తంగా దాదాపు రూ.10కోట్ల వరకు వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది.

ఒక్క రోజే రూ.9.70 కోట్ల మద్యం

తాగేశారు..!

జిల్లాలోని మద్యం దుకాణాలకు 30న రూ.8.12కోట్లు, 31న రూ.6.52కోట్ల విలువైన మద్యం సరఫరా జరిగింది. ఈ రెండ్రోజులు కలిపి 31న ఒక్క రోజే రూ.9.70 కోట్ల విలువైన మద్యం మందుబాబులు తాగేశారు. 2025 డిసెంబర్‌ 31న రూ.7.70కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఈసారి అంతకంటే రూ.2కోట్ల విలువైన మద్యం అమ్మకాలు పెరిగాయి. అయినా నిర్దేశించిన మేరకు అమ్మకాలు జరగలేదని ఎకై ్సజ్‌ శాఖ అధికారులు పేర్కొనడం గమనార్హం.

డిసెంబర్‌లో మద్యం విక్రయాలు

తేదీ లిక్కర్‌ కేసులు బీర్‌ కేసులు రూ.కోట్లలో

29 6,064 4,169 6.37

30 6,607 5,764 8.12

31 5,964 5,220 6.52

మొత్తం 18,635 15,153 21.01

కేక్‌లు.. మిఠాయిలు..

మిఠాయిలు, బేకరీ దుకాణాలు కిటకిటలాడాయి. హోటళ్లు, చైనీస్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, వస్త్ర దుకాణా లు, ఎలక్ట్రానిక్‌, హోం అప్లయెన్స్‌స్‌, మోటార్‌సైకిల్‌ దుకాణాల్లో ఇలా పలు వ్యాపార సంస్థల్లో జోరుగా వ్యాపారాలు సాగాయి. జిల్లాలోని బేకరీల్లో కూల్‌, నార్మల్‌ కేక్‌లు, కూల్‌డ్రింక్స్‌, మొబైల్‌ విక్రయాలు, వస్త్ర వ్యాపారం, ముగ్గుల రంగు, బాణాసంచాకు మొత్తంగా మరో రూ.10కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement