రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు విధిగా పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్‌లో రోడ్డు భద్రత మాసోత్సవాల ప్రచార పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో వాహనదారుల పాత్ర కీలకమని తెలిపారు.
పోస్టర్లు ఆవిష్కరించిన డీసీపీ భాస్కర్
మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ గురువారం తన చాంబర్‌లో రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలని, కార్లు, ఇతర వాహన చోదకులు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వివరించారు. ఇంచార్జీ డీటీఓ రంజిత్‌కుమార్, ఎంవీఐ కిషోర్‌చంద్రారెడ్డి, ఏఎంవీఐలు ఖాసిం, సూర్యతేజ, సాయిలెనిన్ పాల్గొన్నారు.


