విద్య బలోపేతానికి కృషి చేయాలి
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల విద్య బలోపేతానికి కృషి చేయాలని డీఈవో యాద య్య అన్నారు. గురువారం డీఈవో కార్యాలయంలో టీఎస్‌యూటీఎఫ్–2026 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. అంతకుముందు చలితీవ్రత నేపథ్యంలో పాఠశాలల సమయసారిణి మార్చాలని టీఎస్‌యుటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కుమార్‌దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చక్రపాణి, రాజావేణు, ఉపాధ్యక్షుడు కిరణ్‌కుమార్, కోశాధికారి కిరణ్, కమిటీ సభ్యులు బారిక్‌రావు, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.


