ఓటరు ముసాయిదా జాబితా ప్రదర్శన
● లక్సెట్టిపేట మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఓటరు ముసాయిదా జాబితాను కమిషనర్ విజయ్‌కుమార్ పరిశీలించారు. పట్టణంలో 15 వార్డులు, 18,358 మంది ఓటర్లు ఉండగా, మహిళా ఓటర్లు 9,577మంది, పురుషులు 8,780మంది, ఇతరులు ఒక ఓటరు ఉన్నట్లు తెలిపారు. మేనేజర్ రాజశేఖర్, సిబ్బంది రాకేష్, వినోద్ పాల్గొన్నారు.
● బెల్లంపల్లి మున్సిపాలిటీలో ముసాయిదా ఓటరు జాబితాను గురువారం ప్రచురించారు. 34 వార్డుల వారీగా ఓటరు జాబితాను కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కమిషర్ తన్నీరు రమేష్, సిబ్బంది వెల్లడించారు. మున్సిపల్, తహసీల్దార్, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో నోటీసు బోర్డులపై జాబితాను అతికించామని తెలిపారు. లోపాలు, తప్పులు, అభ్యంతరాలను ప్రజలు మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
● చెన్నూర్ మున్సిపాలిటీలోని 18 వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసినట్లు కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు. జాబితాను కార్యాలయం ఆవరణలో అతికించామని పేర్కొన్నారు.
మంచిర్యాలటౌన్/లక్సెట్టిపేట/బెల్లంపల్లి/చెన్నూర్: మున్సిపల్ సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా గురువారం మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు మున్సిపాల్టీల్లో ఓటరు ముసాయిదా జాబితా గురువారం ప్రదర్శించారు. మంచిర్యాల కార్పొరేషన్ ఆవరణలో 60 డివిజన్లకు సంబంధించిన జాబితాను అతికించారు. కమిషనర్ సంపత్‌కుమార్ మాట్లాడుతూ కార్పొరేషన్‌లో 225 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటరు జాబితాను ప్రదర్శించామని, ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా స్వీకరిస్తామని తెలిపారు. నగరంలో 1,82,059 మంది ఓటర్లు ఉండగా, 254 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ బి.రాజమనోహర్, మేనేజర్ ఎస్.కరుణాకర్, రెవెన్యూ ఆఫీసర్ కె.శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.