ఘనంగా ‘నూతన’ వేడుకలు
పవర్ ప్లాంట్‌లో కేక్ కట్ చేస్తున్న ఈడీ చిరంజీవి, జీఎంలు మదన్‌మోహన్, నర్సింహారావు
మంచిర్యాలటౌన్/మంచిర్యాలఅగ్రికల్చర్/జైపూర్: జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. టీఎన్జీవోస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావును వేర్వేరుగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, ప్రధాన కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీశ్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కేజియా రాణి, రాంకుమార్, తిరుపతి, అంజయ్య, సంయుక్త కార్యదర్శి సునిత పాల్గొన్నారు.
జిల్లా అధికారులతో కలెక్టర్ కుమార్ దీపక్


