జిల్లాలో 65 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
మంచిర్యాలక్రైం: జిల్లాలో 65 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 31న రాత్రి 10గంటలకు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు వేకువజామున 3గంటల వరకు కొనసాగాయి. అవాంఛనీయ సంఘటనలు, దుర్ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అర్ధరాత్రి వరకు విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహించారు. రోడ్లపై తిరుగుతున్న వారికి కౌన్సెలింగ్ చేశారు. మద్యం తాగి రోడ్లపైకి వచ్చిన వారిపై పోలీసులు కొరఢా ఝళిపించారు. వాహనాలు సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. నంబర్ ప్లేటు, పేపర్లు సరిగా లేని 16 కార్లు, 11 ఆటోలు, 140 ద్విచక్రవాహలు సీజ్ చేశారు. అనంతరం గురువారం ఉదయం స్థానిక డీసీపీ కార్యాలయంలో డీసీపీ భాస్కర్ కేక్ కట్ చేశారు. తనిఖీల్లో స్థానిక ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్‌రావు, ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ నరేష్‌కుమార్, మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, ఎస్సైలు, ఏఎస్సైలు పాల్గొన్నారు.


