30, 31 తేదీల్లో క్రికెట్ ఎంపిక పోటీలు
ఆదిలాబాద్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోగల డిగ్రీ కళాశాలల విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈనెల 30, 31 తేదీల్లో క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు పోటీల ఆర్గనైజింగ్ సెక్రటరీ డీ సందీప్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఆదిలాబాద్ జోన్ జట్టుకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ జట్టు జనవరి 3నుంచి 5వరకు ఖమ్మం వేదికగా నిర్వహించనున్న యూనివర్సిటీ స్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తుందని వివరించారు. పూర్తి వివరాలకు 9959701878 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
బాసర ఆలయానికి భారీ ఆదాయం
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం దుకాణాసముదాయాల నిర్వహణ హక్కులకు బహిరంగ, సీల్డ్ టెండర్ వేలం ద్వారా భారీగా ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో అంజనీదేవి ఓ ప్రకటనలో తెలిపారు. ఏడాది కాల పరిమితితో కూడిన దుకాణాసముదాయాల ద్వారా ఆలయానికి రూ.2,02,84,803 ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు.
1నుంచి కొత్త రైల్వే టైంటేబుల్
కాగజ్‌నగర్ టౌన్: జనవరి 1నుంచి కొత్త టైం టేబుల్‌ను ప్రవేశపెట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు రైళ్ల సమయాలు తె లుసుకుని ప్రయాణం చేయాలని పేర్కొన్నారు. రైళ్ల సమయాల్లో సందేహాలుంటే సమీప స్టేషన్ మేనేజర్ లేదా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోని ఎన్‌టీఈఎస్‌ను సంప్రదించాలని సూచించారు.


