అభివృద్ధికి కృషి చేస్తాం
జైపూర్: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రభావిత గ్రామమైన పెగడపల్లిని అభివృద్ధి చేసేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తామని ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి తెలిపారు. ఆదివారం స్థాని క సర్పంచ్ రామగిరి రాముతో పాటు గ్రామపెద్దల నేతృత్వంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై మాట్లాడారు. ఎస్టీపీపీలో స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు శివాలయం వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, ఆర్వో ప్లాంట్ మరమ్మతులు, చెరువు కట్టపై ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద బస్టాప్, శ్మశానవాటిక వద్ద నీటి వసతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై ఆయన సానుకూలంగా స్పందించి గ్రామాభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. డీజీఎం సివిల్ అజాజుల్లాఖాన్, స్థానిక నాయకులున్నారు.


