చైనా మాంజా విక్రయిస్తే కఠినచర్యలు
తాండూర్: చైనా మాంజా విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని అటవీశాఖ డెప్యూటీ రేంజ్ అధికా రి తిరుపతి హెచ్చరించారు. ఆదివారం మండ ల కేంద్రంలోని గాలిపటాల దుకాణా లను అ టవీశాఖ అధికారులు తనిఖీ చేశారు. చైనా మాంజా వినియోగంతో మనుషులు, పక్షులకు ప్రాణాపాయం పొంచి ఉందని హెచ్చరించా రు. సెక్షన్ అధికారి సువర్ణ, బీట్ అధికారి భా స్కర్ ఉన్నారు. అలాగే, చైనా మాంజా విక్రయించడం చట్టరీత్య నేరమని తాండూర్ ఎస్సై కిరణ్‌కుమార్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఎవరైనా విక్రయించినట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.


