‘స్వాతంత్య్రోద్యమంలో కాంగ్రెస్ కృషి అమోఘం’
చెన్నూర్: స్వాతంత్య్ర సంగ్రామంలో కాంగ్రెస్ కృషి అమోఘమని డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాఽథ్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక గాంధీ చౌక్‌లో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యమని తెలిపారు. ఉపాధిహామీ లాంటి మహత్తర పథకాలను తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందని పేర్కొన్నారు. నాయకులు కుర్మ రాజమల్లగౌడ్, చెన్న నారాయణ, హిమవంతరెడ్డి, సాధనబోయిన కృష్ణ, బషీరొద్దిన్, పాతర్ల నాగరాజు, తుమ్మ రమేశ్, ఇబ్రహీం, అన్వర్, హజు పాల్గొన్నారు.
దేశాభివృద్ధికి పునాది వేసింది కాంగ్రెస్సే..
రామకృష్ణాపూర్: స్వాతంత్య్రం వచ్చాకజవహర్‌లాల్ నేతృత్వంలో దేశాభివృద్ధికి బలమైన పునాదులు వేసింది కాంగ్రెస్సేనని డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ‘బీ’ జోన్‌లో రాజీవ్‌గాందీ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజ ల కోసం పోరాడే ఏకై క పార్టీ కాంగ్రెస్ అని తెలిపా రు. రాబోయే స్థానిక సంస్థలతో పాటు 2029 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావటానికి ప్రతీ కార్యకర్త చిత్తశుద్ధితో కృషి చే యాలని కోరారు. పార్టీ పట్టణాధ్యక్షుడు పల్లెరాజు, వొడ్నాల శ్రీనివాస్, గోపతి రాజయ్య, జంగం కళ, ఢీకొండ శ్యాంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


