అ‘పూర్వ’ం.. అద్వితీయం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల బీసీ హాస్టల్ పూర్వ విద్యార్థులు ఆదివారం జిల్లా కేంద్రంలో ఆత్మీయ స మ్మేళనం నిర్వహించుకున్నారు. 45ఏళ్ల క్రితం హాస్టల్‌లో కలిసి చదువుకున్న వారంతా వివిధ జిల్లాల్లో స్థిరపడ్డప్పటికీ అంతా కలిసి ఒక్కచోట కలుసుకున్నారు. హాస్టల్‌లో కలిసి చదువుకున్న జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. పలువురు స్నేహితులు ఇప్పటికే మృతి చెందగా వారికి సంతాపం తెలిపారు. నాటి హాస్టల్ వార్డెన్ హెంలానాయక్‌ను సన్మానించారు. ఇకనుంచి ఏటా సమ్మేళనం నిర్వహించుకుంటామని తెలిపారు. ప్రోగ్రాం కన్వీనర్ జుర్రు రమేశ్, జుర్రు నగేశ్‌ను సన్మానించారు. అలాగే 1999–2000లో శ్రీసరస్వతీ శిశు మందిర్ (మిలీనియం)లో పదో తరగతి చదువుకున్న పూర్వవిద్యార్థులు జిల్లా కేంద్రంలోని ఫంక్షన్‌హాల్‌లో అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 25 ఏళ్ల తర్వాత కలుసుకున్నవారంతా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. నాటి అధ్యాపకులు నేలమడుగు శంకరయ్య, కట్ట వెంకటరెడ్డి, నేలమడుగు శ్రీధర్, రావుల రామన్న, మిట్ట పల్లి దేవేందర్‌రెడ్డి, కృష్ణగోపాల్‌ను సన్మానించారు. పూర్వ విద్యార్థులు సురేశ్, నడిమెట్ల రవికిరణ్, పెద్దపల్లి రవికాంత్, వడ్నాల రాజు, గాజుల గోపాలకృష్ణ, బద్దెనపల్లి శ్రీనివాస్, గజ్జల శివశంకరాచారి, నగునూరి మహేశ్, వెలుమల సతీశ్ పాల్గొన్నారు.


