నడక, నవ్వులతో ఆరోగ్య జీవనం
నిర్మల్‌టౌన్: నిర్మల్ జిల్లా కేంద్రంలో 11 సంవత్సరాలుగా ’వాకింగ్ అండ్ లాఫింగ్ అసోసియేషన్’ (వాలా) పేరుతో గుర్తింపు పొందిన సంఘం ఆకట్టుకుంటోంది. 25 ఏళ్ల యువకుల నుంచి 79 ఏళ్ల వృద్ధుల వరకుఅందరికీ శారీరక–మానసిక ఆరోగ్యాన్ని అందిస్తూ, ఒత్తిడి నుంచి ముక్తి పొందేఅవకాశం క ల్పిస్తోంది. వేదిక ద్వారా సభ్యులు ఆత్మీయ బంధాలు పెంచుకుని, కష్టాల్లో పాలుపంచుకుంటున్నారు.
రోజువారీ నడక..
ప్రతీరోజు ఉదయం నడకతో ప్రారంభమయ్యే కా ర్యక్రమాల్లో సభ్యులు వేసే జోకులు మానసిక ఒ త్తిడిని తగ్గిస్తున్నాయి. సమయం మర్చిపోయేలా చే సే ఈ కార్యక్రమాలు మంచి–చెడులు పంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వివిధ రంగాల నుంచి చేరిన సభ్యులు ఇక్కడ సోదరులు, బంధువులుగా మారారు.
అన్ని వర్గాల ఆత్మీయత
యువకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు అందరూ ఈ సంఘంలో చురుకుగా పాల్గొంటున్నా రు. జీవిత చరమాంకంలో కూడా ఆనందమయంగా గడపడానికి ఈ వేదిక ఎంతో దోహదపడుతోంది. 300 మంది సభ్యులతో బలపడిన ఈ సంఘం ఆరోగ్యకర జీవనానికి మార్గదర్శిగా నిలుస్తోంది.
పోటీలు ప్రారంభం
డిసెంబర్ 25 నుంచి జనవరి 25 వరకు సభ్యులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు నాలం శ్రీనివాస్ తెలిపారు. సీనియర్ సిటిజన్లకు లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్ ఆటలు, యువకులకు వాలీబాల్, క్రికెట్, రన్నింగ్ పోటీలు ఏర్పాటు చేశారు. తొలి రోజు జిల్లా డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం పలు ఆటలు జరిగాయి. సీనియర్లు, యువకులు పోటీపడి ఉల్లాసంగా పాల్గొన్నారు.


