ప్రత్యేక రైలు నడపాలి
రైల్వే అఽధికారులు కా జీపేట నుంచి సిర్పూర్ కా గజ్‌నగర్ రూట్లలో పండు గ సమయంలో ప్రత్యేక రై ళ్లు ప్రవేశపెట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. హైదరాబాద్ నుంచి కాగజ్‌నగర్ మార్గంలో నడిచే ఇంటర్‌సిటీ, కాగజ్‌నగర్ సూపర్‌ఫాస్ట్, భాగ్యనగర్ రైళ్లలో అత్యధిక రద్దీ ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి దూరప్రాంతాలకు నడిచే తెలంగా ణ, దానాపూర్, దక్షిణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీల్లో కాలుపెట్టని పరిస్థితి ఉంది. సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వైపు ప్రతిరోజు ఎక్స్‌ప్రెస్ రైలు నడిపిస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది.
– ఫణి, ఉత్తర తెలంగాణ
రైల్వే ఫోరం అధ్యక్షుడు


