పండుగకు రైలు కూత పెట్టేనా..!
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లపై లేని స్పష్టత హైదరాబాద్ –మంచిర్యాల మార్గాల్లో రైళ్ల కరువు ఏటా ప్రయాణికులకు నిరాశే
ఆదిలాబాద్‌లోని రిమ్స్ వైద్యకళాశాల భవనం గోడలు బీటలు వారి ప్రమాదకరంగా మారాయి. ఇందులో పనిచేసే సిబ్బంది, వైద్యవిద్యార్థులు ఎప్పుడు కూలుతాయోనని భయాందోళనకు గురవుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
ప్రమాదానికి బాటలు
బీటలు..
మంచిర్యాలఅర్బన్: సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. ినెలరోజుల ముందే ఆంధ్ర ప్రాంతానికి దక్షిణ మధ్య రైల్వేజోన్ అధికారులు పదుల సంఖ్యలో ప్ర త్యేక రైళ్లు ప్రకటించారు. తెలంగాణలోని సిర్పూర్ కాగజ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్, ఆది లాబాద్ వంటి ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సంక్రాంతి పండుగకు చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపాలనే డిమాండ్ పెరుగుతోంది. ఉద్యోగ, వ్యాపార, చదువుల నిమిత్తం వెళ్లిన వారు హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు రాకపోకలు సాగిస్తుంటారు. పండుగ వేళ రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏటా ఆదిలాబాద్ రీజియన్‌లో ఆర్టీసీ సంస్థ 230కి పైగా ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. అనుకున్న మేర రైళ్ల రాకపోకలు లేకపోవడంతో బస్సుల్లోనే కిక్కిరిసిన ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంది.
రద్దీకి అనుగుణంగా రైళ్లేవి..?
కాగజ్‌నగర్ టూ సిక్రింబాద్ వైపు మార్గంలో 4.30 గంటల (భాగ్యనగర్) తర్వాత 12.45 (ఇంటర్ సిటీ) వరకు రైలు సౌకర్యం లేకుండా పోయింది. 8.45 గంటల సమయంలో వందేభారత్ ఉన్నా అత్యవసర వేళల్లో ఉపయోగం లేకుండా పోయింది. ముందస్తు టికెట్ రిజర్వేషన్ ఉంటేనే ప్రయాణం చేసే వీలుంటుంది. చార్జీలు ఎక్కువ కావడంతో ప్రయాణికులు లహరీ బస్సులో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. బల్లార్షా నుంచి కాజీపేట ఎక్స్‌ప్రెస్ (17036) ఉదయం 8.50 గంటలకు కాజీపేట్‌కు చేరుకుంటుంది. తిరిగి ఇదే రైలు (17035) రాత్రి 10.50 గంటలకు బల్లార్షాకు వెళ్తోంది. కాజీపేట్ జంక్షన్‌లో దాదాపు 14 గంటలు ఖాళీగా ఉంటుంది. ఢిల్లీ నుంచి నాంపల్లి, హైదరాబాద్ తెలంగాణ సూపర్ ఫాస్ట్ రైలు సీటు దొరకని దుస్థితి ఉంది. ప్రస్తుతం బల్లార్షా నుంచి కాజీపేట వరకు నడుస్తున్న 17036 ఎక్స్‌ప్రెస్ రైలును హైదరాబాద్ లేదా చర్లపల్లి వరకు పొడిగిస్తే హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులకు అదనంగా రైలు సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం 17036 బల్లార్షా నుంచి కాజీపేట్ ఎక్స్‌ప్రెస్ రైలు 17234 సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ వెనకాల కేవలం గంట వ్యవధిలోనే నడుస్తుంది. 17036 రైలును బల్లార్షాలో ఉదయం 3.50కు బదులుగా 5.00గంటలకు ప్రారంభిస్తే బాగుంటుందనే అభిప్రాయాలున్నాయి. బల్లార్షా నుంచి కాజీపేట్ ఎక్స్‌ప్రెస్ రైలును చర్లపల్లి టెర్మినల్ వరకు పొడిగించాల్సిన అవసరం ఉంది.
ప్యాసింజర్ రైలు ఎక్స్‌ప్రెస్‌గా..
57135 రైలు నాగపూర్ నుంచి కాజీపేట్ వరకు ప్యాసింజర్ రైలుగా నడిచేది. కరోనాకు ఆరు నెలల ముందు 2019లో రైలును కాజీపేట్ నుంచి బల్లార్షా వరకు కుదించారు. బల్లార్షా నుంచి నాగపూర్ మధ్య పూర్తిగా రద్దు చేశారు. కరోనా అనంతరం తిరిగి ఈ రైలును 17036 బల్లార్షా నుంచి కాజీపేట్ ఎక్స్‌ప్రెస్‌గా పునరుద్ధరించారు. కొన్ని స్టేషన్‌లలో స్టాప్‌లను ఎత్తివేశారు. రైలు ఉదయం 8.50 గంటలకు కాజీపేట్‌కు చేరుకుంటే తిరిగి రాత్రి 10.50 గంటలకు కాజీపేట్ జంక్షన్‌లోనే 14గంటలు ఖాళీగా ఉంది. ఇలా కాకుండా రైలును చర్లపల్లి టెర్మినల్ లేదా లింగంపల్లి వరకు పొడిగిస్తే హైదరాబాద్ వెళ్లటానికి భాగ్యనగర్ తర్వాత ఇంటర్‌సిటీ ముందు ఒక రైలు అందుబాటులోకి వచ్చినట్లు ఉంటుంది. తిరుగు ప్రయాణంలో కాజీపేట్ జంక్షన్ నుంచి రాత్రి 9.15 బయలుదేరే విధంగా ఉండాలని ప్రయాణికులు కోరుతున్నారు.
విజయవాడ మార్గాల్లో రైళ్ల కరువు..
విజయవాడ వెళ్లే రూట్లలో నవజీవన్, జీటీ రప్తి సా గర్ మాత్రమే మంచిర్యాలలో స్టాప్‌లు ఉన్నాయి. ఏ పీ ఎక్స్‌ప్రెస్, కేరళ, హంసఫర్, పూరి –కాజీపేట్ బి కనేర్ సంఘమిత్ర రైళ్లు నిలుపుదల చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం నిజాముద్దీన్ (ఢిల్లీ) వరకు నడస్తున్న 12803 –04 స్వర్ణ జయంతి బైవీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వరంగల్ నుంచి బల్లార్షా మధ్య ఎటువంటి స్టాప్‌లేకుండా వెళ్తోంది. మంచిర్యాలలో ఈ రైలుకు నిలుపుదల ఇస్తే ఉపయోగంగా ఉంటుంది.
మంచిర్యాలఅర్బన్: దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్‌లను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంచిర్యాల రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఏగ్రేడ్ స్టేషన్ మంచిర్యాలలో రూ.26.49 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. మంచిర్యాల రైల్వేస్టేషన్ మీదుగా 62 వరకు రైళ్లు నడుస్తుండగా 3,900 మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. దాదాపు రూ. 5లక్షల పైన ఆదాయం సమకూరుతున్నట్లు తెలుస్తోంది. కాగా రైల్వేస్టేషన్‌లో పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే ప్లాట్‌ఫాంలపై షెడ్లు, విశ్రాంతి గదులు పూర్తయ్యాయి. స్టేషన్ ముఖద్వారం డిజైన్ ఫ్లాట్‌ఫ్లాంలు, ఎస్కలేటర్, కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్, పోలీసుల గదులు, టికెట్ కేంద్రాల పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఇటీవల అమృత్ భారత్‌స్టేషన్ పథకంలో చేపట్టిన పనులను సిక్రిందాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్ పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
పండుగకు రైలు కూత పెట్టేనా..!
పండుగకు రైలు కూత పెట్టేనా..!
పండుగకు రైలు కూత పెట్టేనా..!
పండుగకు రైలు కూత పెట్టేనా..!


