భార్య మృతి.. భర్తపై కేసు
ఉట్నూర్‌రూరల్: భార్య మృతికి కారకుడైన భర్తపై కేసు న మోదు చేసినట్లు ఉ ట్నూర్ ఎస్సై ప్రవీణ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్ర కారం.. మండలంలో ని లింగోజీతండా ఎక్స్‌రోడ్డు గ్రామంలో నాగేందర్–గిరి వర్షతాయి (42) దంపతులు నివాసముంటున్నారు. వర్షతాయి టైలరింగ్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. భర్త నాగేందర్ కొన్నేళ్లుగా మద్యానికి బానిసై ఇంట్లో భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ నెల 21న రాత్రి రోజులాగే మద్యం తాగి భార్యతో గొడవపడ్డాడు. దీంతో గొడవ భరించలేక జీవితంపై విరక్తి చెందిన వర్షతాయి ఇంట్లో ఉన్న ఎలుకల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన చుట్టుపక్కల వారు వర్షతాయిని ఉట్నూర్ ప్ర భుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆదిలాబాద్ రి మ్స్‌కు రెఫర్ చేశారు. అక్కడి నుంచి మహారాష్ట్ర యవత్‌మాల్‌కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతురాలికి కొడుకు, ఇద్దరు కూతుళ్లున్నారు. మృతురాలి తమ్ముడి ఫిర్యాదు మేరకు ఆమె భర్త నాగేందర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


