రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
సారంగపూర్: మండలంలోని జామ్ గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన కాలేవార్ పోతన్న, నాగన్నకు గాయాలయ్యాయి. పోతన్న పంటపొలంలో పనులు ముగించుకుని నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా ద్విచక్ర వాహనంపై నిర్మల్ వైపు వెళ్తున్న నాగన్న ఢీకొట్టాడు. ఘటనలో నాగన్నకు స్వల్పంగా పోతన్నకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కారు ఢీకొని కంప్యూటర్ ఆపరేటర్‌కు..
సారంగపూర్: ఉపాధిహామీ పథకంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న నరేష్‌ను చించోలి(బి) గ్రామ సమీపంలోని ఎక్స్‌రోడ్డు వద్ద గుర్తు తెలియని కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. సారంగాపూర్‌లో విధులు ముగించుకుని నిర్మల్ వెళ్తుండగా ఈఘటన చోటు చేసుకుంది. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్‌కు తరలించారు.


