ముగిసిన సీజన్–3 ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల జిల్లా ఫొటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19నుంచి ప్రారంభమైన సీజన్–3 ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు శుక్రవారం ముగిశాయి. నస్పూర్‌లోని ప్రాణహిత స్టేడియంలో నిర్వహించి న పోటీల్లో జిల్లాలోని 10మండలాల ఫొటో, వీడి యో గ్రాఫర్ల అసోసియేషన్లు పాల్గొన్నాయి. పోటా పోటీగా సాగిన పోటీల్లో నస్పూర్ మండల అసోసియేషన్, ఎల్‌ఈడీ అసోసియేషన్ జట్లు ఫైనల్‌కు చే రాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన నస్పూర్ జట్టు 12ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఎల్‌ఈడీ టీం 10.1 ఓవర్లలో 83 పరుగులు చేసి 6 వికెట్లతో విజ యం సాధించింది. కాంగ్రెస్ మంచిర్యాల పట్టణా ధ్యక్షుడు తూముల నరేశ్, మున్సిపల్ మాజీ చైర్మన్ వేణు, ఫొటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి, సలహాదారు కేదార్‌రెడ్డి, సౌత్ ఇండియా ప్రతినిధి రాజేశ్వర్‌రెడ్డి చేతుల మీదుగా విజేత ఎల్‌ఈడీ జట్టుకు ట్రోఫీ, రూ.15వేల నగ దు ప్రోత్సాహం, రన్నరప్ నస్పూర్ జట్టుకు రూ.10 వేల నగదును చెక్కు రూపంలో అందజేశారు. మ్యా న్ ఆఫ్ ద సిరీస్‌గా శ్రీకాంత్ నిలిచాడు. కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులు అప్పాసు రాము, శ్వాస తిరుపతి, కోశాధికారి ముక్కెర శ్రీనివాస్, నస్పూర్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాగర్, రమణాచారి, కోశాధికారి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


