ఘనంగా సీపీఐ ఆవిర్భావ వేడుకలు
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవా న్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ సీపీఐ జెండా ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు క లవేన శంకర్ మాట్లాడుతూ.. సీపీఐ ఆవిర్భవించిన నుంచి నేటి వరకు ఎన్నో పోరాటాలు చేసిందని గు ర్తు చేశారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమం నుంచి తెలంగాణ సాయుధ పోరాటం దాకా అనేక ఉద్యమాలు నిర్మించిందని తెలిపారు. పార్టీ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుని 2026 జనవరి 18న ఖమ్మంలో శతజయంతి ఉత్సవాలు భారీ ఎ త్తున నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కమ్యూని స్టులు, కార్మికులు, రైతులు, మేధావులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, ఇప్పకాయల లింగయ్య, ఖలీందర్ అలీఖాన్, మిట్టపల్లి పౌలు, మిర్యాల రాజేశ్వర్‌రావు, పూజారి రామన్న, వనం సత్యనారాయణ, చాడా మహేందర్‌రెడ్డి, బియ్యాల రాజేశం, రవి, రాజేశం తదితరులు పాల్గొన్నారు.


