సొంతింటి కల నెరవేరేనా?
దండేపల్లి: ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో పేదోడి సొంతింటి కల నెరవేరే పరిస్థితి కనిపించడంలేదు. ప్రభుత్వం అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. లబ్ధిదారులు ఇంటి నిర్మాణ ప నులకు శ్రీకారం చుట్టారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాని కి ముందున్న ధరలు, ప్రస్తుతమున్న ఇసుక, ఇటు క, కంకర ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు. ధరల నియంత్రణకు ఎలాంటి చర్యలు లేక ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ధరల పెరుగుదలతో పాటు కొంత సామగ్రి అందుబాటులో లేని కారణంగా ఇళ్ల నిర్మాణాలు న త్తనడకన సాగుతున్నాయి. జిల్లాకు 10,919 ఇందిర మ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 7,655 నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. బేస్మెంట్ లెవెల్‌లో 5,612, గోడలు పూర్తయినవి 2,510, స్లాబ్ పూర్తయినవి 1,160, మొత్తం పూర్తయినవి 15 ఉన్నాయి. నిర్మాణ పనులు మొదలైనవి వేలాదిగా ఉండటంతో వాటికి అవసరమయ్యే ఇసుక, ఇటుక, కంకర కొ న్నిచోట్ల అందుబాటులో లేక ఇతర ప్రాంతాల నుంచి తీసుకువస్తుండగా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. ఇళ్లు ఎలా నిర్మించుకునేదాని వాపోతున్నారు.
పెరిగిన సామగ్రి ధరలు ఇలా..
గతంలో 40ఎంఎం కంకర 100 ఫీట్లకు రూ.1,500 ఉండగా రూ.2,500కు చేరింది. గతంలో 20ఎంఎం కంకర రూ.2,200 ఉండగా, రూ.3,500కు, గతంలో 12ఎంఎం కంకర రూ.1,200 ఉండగా, రూ.2,500, డస్ట్‌కు గతంలో రూ.800 ఉండగా, రూ.2వేలు తీసుకుంటున్నారు. పైగా వీటన్నింటికీ రవాణా చార్జీలు అదనం. కంకర రేట్లు చూస్తే కళ్లు తిరిగిపోతున్నాయంటున్నారు లబ్ధిదారులు. గతంలో ట్రాక్టర్ దొడ్డు ఇసుకకు రూ.1,500 నుంచి రూ.1,800 ఉండగా, ప్రస్తుతం రూ.3వేలు తీసుకుంటున్నారు. మధ్యరకం ఇసుకకు రూ.3,500 నుంచి రూ.4వేలు, ప్లాస్టరింగ్ కోసం వినియోగించే ఇసుక ట్రాక్టర్‌కు రూ.6 వేల వరకు తీసుకుంటున్నారు. గతంలో వెయ్యి ఇటుకలకు రూ.8వేలకు పైగా తీసుకోగా, ప్రస్తుతం రూ.11వేలకు పైగా తీసుకుంటున్నారు. గతంలో ఒక్కో సిమెంట్ ఇటుక ధర ధర రూ.18 తీసుకోగా, ప్రస్తుతం రూ.22 వరకు తీసుకుంటున్నారు. దీంతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి ఖర్చులు పెరిగి పోవడంతో ఆర్థికభారంతో ఇబ్బందులు పడుతున్నారు.
కంకర పక్క జిల్లాల నుంచి..
జిల్లాలో కంకర క్రషర్లు లేవు. కంకర అవసరమున్నవాళ్లు జగిత్యాల, కరీంనగర్, జిల్లాల నుంచి తీసుకువస్తున్నారు. దీంతో కంకర ధరలు కూడా అమాంతం పెంచడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గోదావరిలో నీళ్లు నిల్వ ఉండటంతో ఇసుక సరిపడా దొరకడం లేదు. దొరికనా ధరలు అధికంగా ఉంటున్నాయి. దీంతో లబ్ధిదారులు నిర్మాణాలు నెమ్మదినెమ్మదిగా చేపడుతున్నారు.


