ఎస్టీపీపీ ఏరియా లైజన్ ఆఫీసర్‌గా దేవేందర్‌సింగ్
జైపూర్: ఎస్టీపీపీ ఏరియా ఎస్టీ లైజన్ ఆఫీసర్‌గా డీ దేవేందర్‌సింగ్ (ఈఈ)ని నియమిస్తూ కార్పొరేట్ జీఎం (పర్సనల్) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఏరియా ఈడీ సీహెచ్ చిరంజీవి నియామక పత్రాన్ని దేవేందర్‌సింగ్‌కు అందజేశారు. దేవేందర్‌సింగ్ మాట్లాడుతూ.. సింగరేణిలో ఎస్టీ ఉద్యోగులకు న్యా యం చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పంతులు, బ్రాంచ్ అధ్యక్షుడు తిరుమల్, ఎస్వోటూ జీఎం వెంకటయ్య, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఠాకూర్ మోహన్‌సింగ్ తదితరులున్నారు.


