‘డబుల్’ ఇళ్లు ఇచ్చేదెప్పుడో!
మంచిర్యాలటౌన్: డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ల బ్ధిదారులు ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్ర భుత్వంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో డ బుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారు. లబ్ధిదారులకు అ ప్పగించేందుకు 2023 మార్చి 17న అప్పటి కలెక్టర్ బదావత్ సంతోష్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా ని ర్వహించారు. డ్రాలో ఇళ్లు పొందిన లబ్ధిదారుల కు ఇప్పటివరకు వాటిని అప్పగించకుండా అధి కారులు తాత్సారం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో 650 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టగా, అందులో 360 నిర్మాణాలు పూర్తయ్యాయి. డ బుల్‌బెడ్రూం ఇళ్ల కోసం స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చిన 30 కుటుంబాలకు గతంలోనే 30 ఇళ్లు మంజూరు చేశారు. మిగతా 330 ఇళ్లు సిద్ధంగా ఉండగా, అందుకు సంబంధించిన అర్హులను ల క్కీ డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. ఇది జరిగి దా దాపు మూడేళ్లవుతున్నా లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించక పోవడంతో, ఎప్పుడు ఇస్తారోనని ఏళ్ల తరబడి వారు ఎదురుచూస్తూనే ఉన్నారు.
పాడవుతున్నా పంపిణీ చేయరా?
డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో జాప్యం జరుగుతుండగా అవి పాడవుతున్నాయి. పలు ఇళ్ల కిటికీ ల తలుపులు విరిగిపోయాయి. ఇళ్లల్లో పగుళ్లు తే లుతున్నాయి. ఫ్లోరింగ్ దెబ్బతింది. కిటికీల ఊచలు దొంగలు ఎత్తుకెళ్లారు. మూడేళ్లుగా ఇళ్లను ప ట్టించుకోకపోవడంతో మందుబాబులు వాటిని అడ్డాలుగా మార్చుకున్నారు. గేదెలు కూడా నివా సాలుగా మార్చుకుంటున్నాయి. అసాంఘిక కా ర్యకలాపాలకు అడ్డాగా మారడంతో ప్రస్తుతం 30 ఇళ్లలో నివసిస్తున్న లబ్ధిదారులకు ఇబ్బందిగా మారుతోంది. 330 మంది లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేయాలంటే ముందు వాటికి మరమ్మతులు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అస్తవ్యస్తంగా ఉన్న ఇళ్లకు మరమ్మతులు చేసి ఇస్తారో.. లేదో తెలియని పరిస్థితి. ప్రస్తుతం ఆ ఇళ్ల వద్ద అంతర్గత డ్రెయినేజీ, తాగునీటి పైపులైను, విద్యుత్ సరఫరా పనులు అసంపూర్తిగా మిగిలే ఉన్నాయి.
‘డబుల్’ ఇళ్లు ఇచ్చేదెప్పుడో!


