ప్రహరీని కూలగొట్టి
మూసివేతకు గురైన వర్క్‌షాప్, పవర్‌హౌస్, స్టోర్, పాత జీఎం కార్యాలయం చుట్టూరా ప్రహరీ నిర్మించారు. ఎప్పుడైతే ఆయా విభాగాలు వేరే ప్రాంతాలకు తరలించారో అప్పటి నుంచి స్క్రాప్ దొంగతనాలు జరగడం రెట్టింపయ్యాయి. కొందరి కనుసన్నల్లో ప్రహరీని పగులగొట్టి పలు చోట్ల దారి తీసి ఆ మార్గం నుంచి ఇనుప, కర్రసామగ్రి ఎత్తుకెళ్లారు. నేటికీ అదేతీరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రూ.లక్షలు విలువైన సామగ్రిని ప్రహరీ దాటించి కంపెనీ ఆస్తులు కొల్లగొడుతున్న, పాత భవనాలు పడిపోవడానికి సిద్ధమవుతున్నా అధికారులు ఉలుకు పలుకు లేకుండా ఉండడంపై విమర్శలు వస్తున్నాయి. కంపెనీ ఆస్తులను కాపాడడానికి పాటుపడాలని పలువురు కోరుతున్నారు.


