యాసంగి పంటలకు కడెం నీరు
కడెం: యాసంగి పంటలకు కడెం ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. కడెంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఆయకట్టు రైతులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కడెం, దస్తురాబాద్, జన్నారం మండలాల రైతులతో చర్చించారు. జనవరి మొదటి వారంలో యాసంగి పంటలకు సాగునీటి విడుదలపై ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్, తహసీల్దార్ ప్రభాకర్, ఇరిగేషన్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.


