అంబేడ్కర్ విగ్రహానికి వినతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మహిళా రిజ ర్వేషన్లలో బీసీ మహిళలకు ఉప కోట ప్రకటించక పోవడంతో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్లలోని అంబేడ్కర్ వి గ్రహానికి బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. రాష్ట్రంలో అగ్రకులాల మహిళలు రెండు శాతం, బీసీ మహిళలు 30శాతం ఉన్నా ఎనిమిది మంది బీసీ మహిళలే చట్టసభకు ఎన్నిక కావడం వివక్ష కాదా? అన్ని ప్రశ్నించారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రా బోయే సార్వత్రిక ఎన్నికల్లో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీ మహిళలకు జనాభా దామాషా పద్ధతిన 30శాతం రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మ హిళా సమాజం ముందు బీజేపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడుతామని హెచ్చరించారు. జి ల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, నాయకులు వెంకటయ్య, భీంసేన్, చంద్రమౌళి, రాజన్నచా రి, శ్రీనివాస్, వెంకట్, రాజయ్య పాల్గొన్నారు.


