ఆలయంలో హుండీ ధ్వంసం
భైంసారూరల్: నిర్మల్ జిల్లా భైంసా మండలం ఇలేగాం గ్రామంలో మహాదేవుని ఆలయంలో హుండీని గుర్తుతెలియని దుండగులు గురువారం రాత్రి ధ్వంసం చేశారు. ఎస్సై శంకర్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం ఉదయం ఆలయానికి వెళ్లిన భక్తులకు హుండీ తాళం పగులగొట్టి కనిపించింది. వెంటనే ఆలయ కమిటీకి సమాచారం అందించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఆలయానికి చేరుకుని చూడగా హుండీలోని నగదు, ఇతరాత్ర కానుకలు కనిపించలేదు. ఆలయ కమిటీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


