నారుమడి.. జాగ్రత్తలు తీసుకుంటే సరి
● శీతాకాలంలో ప్రత్యేక చొరవ అవసరం
● చలితో జింక్ లోపం ఏర్పడే అవకాశం
● యాజమాన్య పద్ధతులు తప్పనిసరి
● చలి అధికమైనప్పుడు జింక్ లోపం వచ్చే అవకాశముంటుంది. నివారణకు నారుమడిలో రెండు గ్రాముల జింక్ సల్పేట్‌ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
● మొలక కట్టిన విత్తనాన్ని నారుమడిలో మొదటి వారం రోజుల పాటు తక్కువగా ఉంచాలి
● రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు కంటే తక్కువగా ఉన్నప్పుడు నారు ఎదగదు. కొన్నిసార్లు చనిపోతుంది. ఇందుకోసం రసాయన ఎరువులు వినియోగించాలి.
● చలి సమస్యను అధిగమించడానికి నారు మడులపై టార్పాలిన్‌ను రాత్రి పూట ఉంచి ఉదయం పూట తీసివేయాలి.
● రాత్రివేళ నారు మడి నుంచి పూర్తిగా నీరు తీసివేసి ఉదయం పూట తాజా నీటిని నింపాలి. దీంతో నారు ఎదుగుదలలో లోపం లేకుండా ఉంటుంది.
● కాండం తొలిచే పురుగు (మొగ్గ పురుగు) నుంచి పంటను కాపాడుకోవడానికి నారు తలలు తుంచి నాటు వేయాలి. దీంతో కాండం తొలిచే పురుగు నారుకొనలపై గుడ్లు పొదుగుతుంది. దీని కారణంగా గుడ్లతో పాటు మొగ్గ పురుగును నివారించవచ్చు.
● నారు తీసే వారం రోజుల ముందు ఎకరా నారుమడికి 1కిలో కార్భోప్యూరో త్రీజ్ లేదా కార్టఫ్ హైడ్రోక్లోరైడ్ పోర్‌జీ గుళికలను వేసుకున్నట్లయితే నాటు వేసిన నెల వరకు ఎలాంటి కీటకాలు ఆశించకుండా పంటను రక్షించుకోవచ్చు.
● ఎకరాకు 30నుంచి 35కిలోల విత్తనం అవసరముంటుంది.
● కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్భాండిజమ్‌తో విత్తనశుద్ధి చేయాలి. దీంతో విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్లను అరికట్టవచ్చు.
● నిద్రావస్థలోని విత్తనాలను మేలుకొల్పడానికి కిలో విత్తనానికి 10మిల్లీ లీటర్ల నీటిలో కలిపి 24 గంటలు నాన బెట్టాలి.
● పశువుల పేడ గాని లేదా సేంద్రియ ఎరువును ఎకరా నారుమడికి 100 నుంచి 200కిలోలు వేయాలి.
● విత్తనాలు చల్లే ముందు ఎకరాకు రెండు కిలోల నత్రజని, కిలో పొటాషియం చల్లాలి. విత్తనాలు విత్తిన 15రోజులకు కిలో భాస్వరాన్ని వేసుకోవాలి.
● ప్రస్తుతమున్న వాతావారణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నారుమడుల్లో సాయంత్రం వేసిన నీటిని ఉదయం తొలగించాలి. చలి తీవ్రత నుంచి నారు మడిని కాపాడుకోవడానికి వ్యవసాయాధికారుల సలహాలు తీసుకుంటే మంచిది.
లోకేశ్వరం: జిల్లాలో రైతులు వరి నార్లు పోస్తున్నారు. ఈ సమయంలో నారుమడుల విషయంలో శీతాకాలంలో తగిన జాగ్రతలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్ చెబుతున్నారు. ఉదయం ఉష్ణోగ్రత తీవ్రంగా పడిపోనున్నందున నారు మడిలో నీరు మారుస్తూ యాజమాన్య పద్ధతులు పాటించాలని తెలిపారు. నారు ఆరోగ్యంగా పెరిగితే దిగుబడి అధికంగా వస్తుందని పేర్కొన్నారు. శీతాకాలంలో వరి నారు మడుల విషయంలో తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తలు జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్ సూచించారు.
నారు మడి తయారీ ఇలా..
రెండుగుంటల నారుమడికి రెండు క్వింటాళ్ల కోడి ఎరువు లేదా గొర్రె ఎరువు తేదా వర్మీ కంపోస్టు వేసి కలియదున్నాలి. ఈ సేంద్రియ ఎరువులను నారుమడుల్లో వాడితే చలి తీవ్రతలోనూ నారుకు పోషకాలు అంది ఎదుగుదలకు తోడ్పడుతుంది. లేదంటే రెండు గుంటల నారుమడికి రెండు కిలోల నత్రజని, రెండు కిలోల భాస్వరం, కిలో పొటాష్ వేయాలి.
చలితో జింక్ లోపం
తీసుకోవాల్సిన జాగ్రతలు
1/1
నారుమడి.. జాగ్రత్తలు తీసుకుంటే సరి