చంద్రవెల్లిలో పులి సంచారం
బెల్లంపల్లిరూరల్: మండలంలోని చంద్రవెల్లి, చర్లపల్లి గ్రామాల అటవీ ప్రాంతంలో సోమవారం పెద్దపులి సంచారం కలకలం రేపింది. గ్రామీణులు పులి సంచారంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. బెల్లంపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి పూర్ణచందర్ సిబ్బందితో అటవీ ప్రాంతంలో పర్యటించి చంద్రవెల్లి–చర్లపల్లి గ్రామాల శివారు అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలు గుర్తించారు. చంద్రవెల్లి, చర్లపల్లి, బుధాకలాన్, గురిజాల, చాకేపల్లి గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెల్లవారు జామున, రాత్రి పూట అటవీ ప్రాంతం వైపు రాకపోకలు సాగించవద్దని ఎఫ్‌ఆర్వో సూచించారు. రైతులు పొలాలకు వెళ్లే క్రమంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.


