252 జీవోను సవరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జర్నలిస్టుల హక్కులను కాలరాసే జీవో 252ను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ వివిధ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శనివారం ఆందోళన చేపట్టి అనంతరం కలెక్టర్ కుమార్‌దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా జర్నలిస్ట్ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 23వేల అక్రిడిటేషన్ కార్డులివ్వగా, కొత్త జీవోతో 10వేలకు పైగా కా ర్డులకు కోత పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లకు ఒక కార్డు ఉండేదని.. ఇప్పుడు దానిని రద్దు చేసి, స్టేట్, జిల్లా, మండలస్థాయిలో మాత్రమే కార్డులివ్వాలని నిర్ణయించడం దారుణమని పేర్కొన్నారు. గతంలో డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులివ్వగా, ప్రస్తుత జీవోలో మీడియా కార్డులు జారీ చేస్తామనడం అన్యాయమని తెలిపారు. వెంటనే 252 జీవో ను సవరించి గతంలోలాగే అర్హులందరికీ అక్రిడిటేషన్ కార్డులివ్వాలని డిమాండ్ చేశారు. కా ర్యక్రమంలో వివిధ జర్నలిస్ట్ సంఘాల నాయకులు రమేశ్, శ్రీనివాస్, సిద్ధార్థ, కుమార్, అంబిలపు శ్రీనివాస్, రాజుపటేల్, అరుణ్‌కుమార్, ఎం.వెంకటస్వామి, ఓదెలు, పార్వతి సురేశ్, అరుణ్‌కుమార్, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.


