కలెక్టరేట్ ఎదుట ఆశ వర్కర్ల ధర్నా
మంచిర్యాలఅగ్రికల్చర్: పెండింగ్‌లో ఉన్న లెప్రసీ, ఎండీఏ డబ్బులు చెల్లించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశ వ ర్కర్ల సీఐటీయూ అనుబంధ యూనియన్ ఆ ధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్‌కు వి నతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్ల నాయకురాలు సమ్మక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రూ.18 వేల వేతనం, రూ.50 లక్షల ఇన్సూరెన్స్, ఇతర ఖర్చులకు రూ.50 వేలు చెల్లిస్తామని, ఏఎన్సీ, పీఎన్సీ లక్ష్యాలను రద్దు చేస్తామని హామీలు ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పారితోషికం పేరి ట తమతో వెట్టిచాకిరీ చేయించుకుంటూ శ్రమదోపిడీకి గురిచేస్తున్నట్లు ఆవేదన వ్యక్తంజేశా రు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని డి మాండ్ చేశారు. ఆశ వర్కర్లు విజయలక్ష్మి, నా గుబాయ్, పద్మ తదితరులు పాల్గొన్నారు.


