స్కానింగ్‌ వివరాలు నమోదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

స్కానింగ్‌ వివరాలు నమోదు చేయాలి

Dec 28 2025 8:36 AM | Updated on Dec 28 2025 8:36 AM

స్కానింగ్‌ వివరాలు నమోదు చేయాలి

స్కానింగ్‌ వివరాలు నమోదు చేయాలి

● జిల్లా వైద్యాధికారి అనిత

మంచిర్యాలటౌన్‌: జిల్లాలోని అన్ని స్కానింగ్‌ కేంద్రాల్లో సాంకేతిక వైద్యనిపుణులు, సిబ్బంది, స్కా నింగ్‌ చేసిన వివరాలను నిర్ణీత నమూనాలో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా అడ్వైజరీ కమిటీ చైర్‌పర్సన్‌, డీఎంహెచ్‌వో అనిత సూచించారు. జి ల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో శనివారం లింగ నిర్ధారణ పరీక్షలు, పీసీపీ యాంటీ యాక్టివ్‌ తది తర అంశాలపై జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మా ట్లాడుతూ.. జిల్లాలో పీసీపీ ఎన్డీటీ యాక్ట్‌ ప్రకారం 53 స్కానింగ్‌ కేంద్రాలు పనిచేస్తున్నాయని, ఇందులో నాలుగు ప్రభుత్వపరంగా, 49 ప్రైవేట్‌ స్కానింగ్‌ కేంద్రాలు, సీ్త్ర వైద్య నిపుణులు, రేడియాలజిస్టులు, సూపర్‌ స్పెషలిస్టుల ద్వారా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ స్కానింగ్‌ కేంద్రంలో స్కానింగ్‌ పరికరం, వైద్యుల వివరాలు నమోదై ఉండాలని, ప్రతీ కేంద్రంలో లింగ నిర్ధారణపై తీసుకుంటున్న చ ర్యల వివరాలపై ఫ్లెక్సీ, పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. ‘లింగ నిర్ధారణ చేయబ డదు, చెప్పబడదు’, ‘అడిగిన వారిపై, చెప్పిన వారి పై యాక్ట్‌ ప్రకారం చర్యలు చేపట్టబడును’ అనే వివరాలు ప్రదర్శించాలని తెలిపారు. స్కానింగ్‌ కేంద్రాల్లో గర్భిణులకు కుర్చీలు, తాగునీటి సౌకర్యం కల్పించాలని, వైద్యుల వివరాలు, ఫీజు వివరాలు గోడపై అతికించాలని సూచించారు. గర్భిణుల స్కా నింగ్‌ పూర్తి వివరాలను ఫార్మ్‌ ఆఫ్‌లో నమోదు చే యాలని, స్కానింగ్‌ చేసుకుంటున్న గర్భిణి సంత కం తీసుకోవాలని, జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో గర్భిణులకు స్కానింగ్‌ చేసిన వివరాలు డీ ఎంహెచ్‌వో కార్యాలయానికి అందించాలని సూచించారు. పోస్టర్లు, కరపత్రాలు, మీడియా ద్వారా వి స్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ అరుణశ్రీ, జిల్లా పౌరసంబంధాల అధికారి కృష్ణమూర్తి, హీల్‌ వలంటరీ ఆర్గనైజేషన్‌ ఎన్జీవో డాక్టర్‌ చుంచు రాజ్‌కిరణ్‌, గైనకాలజిస్ట్‌ నలుమాసు శ్రీదేవి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్లు, ఫిజీషియన్లు, డీపీవో ప్రశాంతి, సీహెచ్‌వో వెంకటేశ్వర్లు, దిశ సమన్వయకర్త రమేశ్‌, సుమన్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ హారిక, డీపీహెచ్‌ఎన్‌ పద్మ, వసుమతి మార్తా, డెమో బుక్క వెంకటేశ్వర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement